లక్కీ ఇన్వెస్టర్లు.. అదరగొట్టిన డీ-మార్ట్
లక్కీ ఇన్వెస్టర్లు.. అదరగొట్టిన డీ-మార్ట్
Published Tue, Mar 21 2017 11:57 AM | Last Updated on Tue, Sep 5 2017 6:42 AM
ముంబై : లిస్టింగ్ తొలిరోజే డీ-మార్ట్ అదరగొట్టింది. డీ-మార్ట్ సూపర్ చెయిన్ నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్ మార్ట్స్ లిమిటెడ్ షేర్లు బ్లాక్ బస్టర్ లిస్టింగ్ తో మంగళవారం మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ రిటైల్ చెయిన్ షేర్లు 106 శాతం పైకి ఎగిసి రూ.616.25 గరిష్ట స్థాయిలను తాకాయి. ఈ షేర్ల ఇష్యూ ధర కేవలం రూ.299 మాత్రమే. దీంతో డీ-మార్ట్ షేర్లను పొందిన ఇన్వెస్టర్ల సంపద ఒక్కసారిగా రెండింతలు పెరిగింది. ఈ నెల మొదట్లో ఐపీఓకి వచ్చిన డీ-మార్ట్ రూ.1870 కోట్ల నిధులను సమీకరించింది.
గతేడాది అక్టోబర్ లో పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ తర్వాత ఇదే అతిపెద్ద ఐపీఓ. మార్నింగ్ సెషన్లో 104.8 శాతం పెరిగిన డీ-మార్ట్ మరింత పెరిగి రూ.615 గరిష్ట ధరను తాకింది. 2002లో మొదటిసారి ముంబైలో తొలి స్టోర్ ఇది ఏర్పాటుచేసింది. తర్వాత విస్తరించుకుంటూ వెళ్లిన డీ-మార్ట్ 2017 జనవరి 31 నాటి 118 అవులెట్లను ఏర్పాటుచేసింది. 2016 డిసెంబర్ నాటికి తొమ్మిది నెలల కాలవ్యవధిలో కంపెనీ మొత్తం రెవెన్యూలు రూ.8803 కోట్లగా నమోదయ్యాయి. నికర లాభాలు సైతం రూ.387.47 కోట్లగా ఉన్నాయి.
Advertisement
Advertisement