న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ) ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 22 శాతం క్షీణించి రూ. 561 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 720 కోట్లు ఆర్జించింది. మొండి రుణాలు తగ్గినప్పటికీ అధిక వ్యయాలు ప్రభావం చూపాయి. మొత్తం ఆదాయం సైతం రూ. 11,641 కోట్ల నుంచి రూ. 11,124 కోట్లకు స్వల్పంగా బలహీనపడింది. అయితే వడ్డీ ఆదాయం 7 శాతం పుంజుకుని రూ. 9,973 కోట్లకు చేరింది. ఇతర ఆదాయం మాత్రం 50 శాతం క్షీణించి రూ. 1,152 కోట్లకు పరిమితమైంది. నిర్వహణా వ్యయాలు 12 శాతం పెరిగి రూ. 3,041 కోట్లను తాకాయి.
తగ్గిన ఎన్‌పీఏలు
ప్రస్తుత సమీక్షా కాలంలో బీవోఐ స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 13.51 శాతం నుంచి 9.30 శాతానికి వెనకడుగు వేశాయి. నికర ఎన్‌పీఏలు సైతం 3.35 శాతం నుంచి 2.21 శాతానికి దిగివచ్చాయి. ఇక కన్సాలిడేటెడ్ నికర లాభం 11 శాతం వెనకడుగుతో రూ. 658 కోట్లకు పరిమితంకాగా.. మొత్తం ఆదాయం రూ. 11,710 కోట్ల నుంచి రూ. 11,208 కోట్లకు తగ్గింది.
ఫలితాల నేపథ్యంలో బీవోఐ షేరు ఎన్‌ఎస్‌ఈలో 2 శాతం పుంజుకుని రూ. 50 వద్ద ముగిసింది.
బీవోఐ లాభం డౌన్
Published Wed, Aug 3 2022 6:21 AM | Last Updated on Wed, Aug 3 2022 6:21 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment