న్యూఢిల్లీ: టాటా గ్రూప్ మెటల్ రంగ దిగ్గజం టాటా స్టీల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో టర్న్‌అరౌండ్ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో రూ. 9,768 కోట్లకుపైగా నికర లాభం ఆర్జించింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 4,648 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 25,662 కోట్ల నుంచి రూ. 53,534 కోట్లకు జంప్‌చేసింది.
అయితే క్యూ1లో మొత్తం వ్యయాలు రూ. 29,116 కోట్ల నుంచి రూ. 41,397 కోట్లకు పెరిగాయి. స్టీల్ ఉత్పత్తి 5.54 మిలియన్ టన్నుల నుంచి 7.88 ఎంటీకి ఎగసింది. విక్రయాలు 5.34 ఎంటీ నుంచి 7.11 ఎంటీకి వృద్ధి చూపాయి. ఈ కాలంలో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 16,185 కోట్ల నిర్వహణ లాభం(ఇబిటా) ఆర్జించినట్లు టాటా స్టీల్ సీఎఫ్‌వో కౌశిక్ చటర్జీ వెల్లడించారు. రూ. 3,500 కోట్ల క్యాష్ ఫ్లోను సాధించడంతోపాటు.. రూ. 5,894 కోట్లమేర రుణ చెల్లింపులను చేపట్టినట్లు తెలియజేశారు.
టాటా స్టీల్ షేరు ఎన్‌ఎస్‌ఈలో 0.5 శాతం పుంజుకుని రూ. 1,434 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment