Tata Steel CFO Koushik Chatterjee: కొడితో కొట్టాలి..సిక్స్ కొట్టాలి... అన్నట్టు ఏదైనా టాప్ కంపెనీలో జాబ్ కొట్టాలి. లక్షల్లో ప్యాకేజీ అందుకోవాలి..ఇదేగా కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ప్రతీవారి కల. కానీ కంపెనీలో టాప్ పొజిషన్ కాకపోయినా, టాప్ శాలరీ అందుకోవడం విశేషం కదా మరి. అలా రతన్ టాటా నేతృత్వంలోని టాటా గ్రూపు ఉద్యోగి ఒకరు రోజుకు ఏకంగా లక్షల్లో సంపాదిస్తున్నారు. టాటా స్టీల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సీఎఫ్‌వో కౌశిక్ ఛటర్జీ. టాటా గ్రూప్‌లో అత్యధిక వేతనం పొందుతున్న చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌లలో కౌశిక్ ఒకరు.
రూ. 1,43,175 కోట్ల మార్కెట్ క్యాప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీకి ఆర్థిక వ్యవహారాల విభాగానికి ఇన్‌చార్జ్‌గా ఉన్నాడు.టాటా స్టీల్ వార్షిక నివేదిక ప్రకారం ఛటర్జీ ఇప్పటికీ రూ. 14,21,18,000 (రూ. 14.21 కోట్లు) తీసుకున్నారు. అంటే రోజుకు రూ.3.89 లక్షలకు పైగా ఆదాయం వస్తుంది. అయితే ఇటీవల టాటా మోటార్స్‌కు చెందిన పీబీ బజాలీ, ఛటర్జీని అధిగమించారు. గత ఏడాదితో పోల్చితే వేతనంలో ఈ ఏడాది స్వల్పంగా తగ్గినప్పటకీ 15,17,18,000 (రూ. 15.17 కోట్లు) అందుకున్నారు. అలాగే 2023లో ఛటర్జీతో పోలిస్తే టాటా స్టీల్‌లో రూ. 18.66 కోట్లతో సీఈఓ టీవీ నరేంద్రన్‌కు మాత్రమే ఎక్కువ వేతనం అందుకోవడం గమనార్హం. (మళ్లీ పరుగందుకున్న పసిడి, వెండి అయితే ఏకంగా)
టాటా గ్రూప్‌లో పని చేయడానికి ముందు, కౌశిక్ బ్రిటానియా ఇండస్ట్రీస్, ఆడిట్ కంపెనీ ఎస్‌బీ బిల్లిమోరియా కంపెనీల్లో పనిచేశారు. కేవలం 36 సంవత్సరాల వయస్సులో, కౌశిక్ 2006లో టాటా స్టీల్‌లో VP ఫైనాన్స్ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. అతను 2012 నుండి సీఎఫ్‌వోగా ఉన్నారు. ఛటర్జీ జనవరి 1, 2023 నుండి 3 సంవత్సరాల కాలానికి IFRS ఫౌండేషన్ ఆరు కొత్త ట్రస్టీలలో ఒకరిగా నియమితులయ్యారు. అతను సలహా సభ్యునిగా కూడా ఉన్నారు.
భారీ సంపాదన ఉన్నప్పటికీ చాలా నిడాడంబరమైన జీవిన శైలితో కౌశిక్ ఛటర్జీ కూల్ అండ్ కంపోజ్డ్ పర్సన్ అని సహోద్యోగులు భావిస్తారు. కౌశిక్ పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్‌లోని సెయింట్ పాట్రిక్స్ పాఠశాల నుండి పాఠశాల విద్యను, కోలకతాలో బీకాం డిగ్రీని సాధించారు. ఆ తరువాత చార్టర్డ్ అకౌంటెంట్ గా పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment