koushik
-
హైదరాబాద్ ప్రజలపై సీఎంకు పగ
-
Hyderabad: మెరి'శారీ'లా..! నూతన బ్రాండ్ ‘జీఎస్ శారీస్ షో రూమ్’..
సాక్షి, సిటీబ్యూరో: చేనేత హస్త కళాకారులు తయారు చేసిన వస్త్ర ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన నూతన బ్రాండ్ ‘జీఎస్ శారీస్ షో రూమ్’ను నిజాంపేట్‌లో ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా ’అల్లరే అల్లరి’ చిత్రబృందం కౌశిక్, విశ్వమోహన్, శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రముఖ మోడల్స్, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లు సందడి చేశారు. ఈ సందర్భంగా స్టోర్ ఎండీ శ్రావణి గోపీనాథ్ మాట్లాడుతూ.. తెలుగు సంప్రదాయాలకు చీరకట్టు ప్రాధాన్యం తెలియజేసేలా హ్యాండ్ మేడ్ శారీలను అందిస్తున్నామని తెలిపారు. -
ప్రణవ్ సవాల్ నేపథ్యంలో.. చెల్పూర్లో టెన్షన్.. టెన్షన్!
కరీంనగర్: మంత్రి పొన్నం ప్రభాకర్‌పై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించాలంటూ, అందులో నిజం ఉంటే హుజూరాబాద్ మండలం చెల్పూర్ హనుమాన్ ఆలయంలో ప్రమాణం చేయాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితెల ప్రణవ్ విసిరిన సవాల్ మంగళవారం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది.ప్రణవ్, పాడి కౌశిక్‌రెడ్డి అక్కడికి చేరుకుంటే పరిస్థితి ఏంటనే ఉత్కంఠ రోజంతా నెలకొంది. ప్రణవ్ పిలుపుమేరకు మంగళవారం ఉదయమే చెల్పూర్‌కు కాంగ్రెస్ శ్రేణులు భారీగా చేరుకున్నారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి మోసం చేశారంటూ ఫ్లెక్సీ ఏర్పా టు చేయడంతో బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి చేరు కుని నిరసనకు దిగారు. ఆలయం వద్ద బీఆర్ఎస్– కాంగ్రెస్ శ్రేణులు పోటాపోటీగా నినాదాలు చేశారు. ఏసీపీ శ్రీనివాస్‌జి ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు.ఇరువర్గాలతో మాట్లాడగా.. శాంతించకపోవడంతో లాఠీచార్జ్ చేశారు. కాంగ్రెస్ నాయకుడు బుర్రకుమార్ గౌడ్‌కు గాయాలయ్యాయి. ఇరువర్గాలను పోలీసులు జమ్మికుంట, సమీప పోలీసు స్టేషన్లకు తరలించారు. కాగా.. వొడితల ప్రణవ్బాబును సింగాపూర్‌లో, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని వీణవంకలో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.చెల్పూర్ లో ఏసీపీ శ్రీనివాస్ జితో వాగ్వాదానికి దిగుతున్న కాంగ్రెస్ నాయకులుతడి బట్టలతో ఎమ్మెల్యే ప్రమాణంవొడితెల ప్రణవ్ చేసిన సవాల్‌ను స్వీకరించేందుకు సిద్ధమైన ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి కరీంనగర్ సీపీకి ఫోన్‌చేసి, తనకు అనుమతి ఇవ్వాలంటూ కోరగా నిరాకరించారు. ఎమ్మెల్యే ఇంటివద్ద జమ్మికుంట రూరల్ సీఐ కిశోర్, సీఐ సృజన్‌రెడ్డి సిబ్బందితో మోహరించారు. పోలీసుల అనుమతి రాకపోవడంతో ఎమ్మెల్యే తడి బట్టలతో దేవుడి మీద ప్రమాణం చేసి తను మంత్రిపై చేసిన ఆరోపణలు నిజమంటూ పేర్కొన్నారు. ప్రణవ్‌బాబు చిన్న పిల్లాడని పేర్కొన్నారు. పోలీసులపై కాంగ్రెస్ నాయకులు దాడులకు పాల్పడ్డారని, ఈ ఘటనపై కేసులు నమోదు చేయాలని డీజీపీని కలుస్తానని పేర్కొన్నారు.రాజకీయ ఉనికి కోసమే..రాజకీయ ఉనికి కోసమే ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అబద్ధపు ప్రమాణాలు చేస్తున్నారని వొడితెల ప్రణవ్‌బాబు అన్నారు. ఎన్నికల సమయంలో కుటుంబా న్ని అడ్డుపెట్టుకొని గెలిచిన వ్యక్తి మంత్రి పొన్నం ప్రభాకర్‌పై ఆరోపణలు చేయటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉద్యోగాల పేరుతో డబ్బులు తీసుకొని మోసం చేసిన వ్యక్తి కౌశిక్‌రెడ్డి అన్నారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే ఊరుకోమన్నారు.ఉద్యోగాల పేరిట కౌశిక్‌రెడ్డి మోసం చేశారుకోర్టులో ఉద్యోగాలు పెట్టిస్తానని చెప్పి డబ్బులు తీసుకొని మోసం చేసిన వ్యక్తి ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అంటూ చెల్పూర్ మాజీ సర్పంచ్ నేరేళ్ల మహేందర్‌గౌడ్ గ్రామంలోని హనుమాన్ ఆలయంలో ప్రమాణం చేశారు. నిరుద్యోగుల నుంచి డబ్బులు తీసుకొని మోసం చేసిన కౌశిక్‌రెడ్డి ఈ విషయమై సమాధానం చెప్పాలంటూ నిలదీశారు. కేవలం ఉనికి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఆరోపణలు చేస్తున్నట్లు తెలిపారు. -
కాంగ్రెస్‌కు ఓటేస్తే రైతుల పరిస్థితి ఆగమే.. : వినోద్‌కుమార్
కరీంనగర్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మోటార్లు, ట్రాన్స్‌ఫా ర్మర్లు కాలిపోతున్నాయని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పొరపాటున ఆ పార్టీకి ఓటేస్తే రైతులు ఆగమయ్యే పరిస్థితి ఉంటుందని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. బుధవారం వీణ వంక మండల కేంద్రంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈసందర్భంగా మోటార్ వైండింగ్ షాపులో రిపేరు చేస్తున్న వ్యక్తితో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కరెంట్ మోటార్లు కాలి పోయి రిపేరుకు వచ్చిన సందర్భాలు లేవన్నారు. కేసీఆర్ కొట్లాడి తెచ్చిన తెలంగాణలో పదేళ్ల పాటు ఏనాడు ఈ పరిస్థితి రాలేదని వివరించారు. కేసీ ఆర్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులపైన ఉందని, రైతులు, ప్రజలు, యువత, మేధావులు ఆలో చన చేయాలని కోరారు. అలాగే వీణవంక మండల కేంద్రంలోని ఓ హోటల్లో చాయ్ తాగుతూ నాయకులు, కార్యకర్తలతో ముచ్చటించారు. పవర్‌కట్ ప్రాంతాలు.. విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తీసివేత పనులు చేపడుతున్నందున గురువారం మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనున్నట్లు కరీంనగర్ రూరల్ ఏడీఈ కొలుపుల రాజు తెలిపారు. 11 కేవీ తీగలగుట్టపల్లి ఫీడర్ పరిధిలోని మాణికేశ్వరీనగర్, కార్తీకేయనగర్, విఘ్నేశ్వరనగర్, అయోధ్యనగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
సంచలనంగా మారిన బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయి వాగ్వాదం!
కరీంనగర్/జమ్మికుంట/కొత్తూరు: హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్‌పై పెట్టిన అవిశ్వాసం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలో బుధవారం రాజకీయ గొడవకు దారి తీసింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగడం సంచలనంగా మారింది. ఇరు పార్టీల నాయకులు వందలాదిగా 15 మంది కౌన్సిలర్లు ఉన్న ఫాంహౌస్ వద్దకు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసుల రంగప్రవేశం.. చర్చలతో లొల్లి సద్దుమణిగింది. వివరాలిలా ఉన్నాయి.. ప్రస్తుతం జమ్మికుంట మున్సిపల్ చైర్మన్‌గా కొనసాగుతున్న రాజేశ్వర్రావుపై ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన పొన్నగంటి మల్లయ్య వర్గం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా మల్లయ్య తనకు అనుకూలంగా ఉన్న వారిని మంగళవారం హైదరాబాద్‌కు తీసుకొచ్చి ఓ హోటల్లో క్యాంపు కొనసాగిస్తున్నాడు. విషయం తెలుసుకున్న ప్రస్తుత చైర్మన్, ఆయన వర్గీయులు క్యాంపు నుంచి ఒక కౌన్సిలర్‌ను బయటకు రప్పించి, తమతో తీసుకెళ్లారు. అవిశ్వాస తీర్మానానికి ఇంకా సమయం ఉండటం.. క్యాంపు ప్రాంతాన్ని బీఆర్ఎస్ నేతలు తెలుసుకోవడంతో మల్లయ్య వర్గం షాద్‌నగర్ కాంగ్రెస్ నాయకులను సంప్రదించింది. దీంతో కొత్తూరు మాజీ జెడ్పీటీసీ శ్యాంసుందర్‌రెడ్డి ఇన్ముల్‌నర్వ సమీపంలోని వైఎంతండా దగ్గర ఉన్న ఓ ఫాంహౌస్‌లో అదేరాత్రి వారికి బస ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న చైర్మన్, ఆయన అనుచరులు అర్ధరాత్రి ఫాంహౌస్ వద్దకు వచ్చి, గేటు తెరవాలని గొడవ చేయగా వారు మాజీ జెడ్పీటీసీకి సమాచారం ఇచ్చారు. దీంతో శ్యాంసుందర్‌రెడ్డి ఉదయం ఫాంహౌస్ వద్దకు బయలుదేరారు. దారిలో కార్లు కనిపించడంతో వారిని వివరాలు అడిగే క్రమంలో వాగ్వాదం మొదలైంది. విషయం తెలుసుకున్న షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ కుమారుడు, కేశంపేట ఎంపీపీ రవీందర్‌యాదవ్, కాంగ్రెస్ నాయకులు విడివిడిగా పెద్ద సంఖ్యలో ఫాంహౌస్ వద్దకు చేరుకున్నారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లను అక్రమంగా తీసుకొచ్చారని ఆరోపిస్తుండగా కాంగ్రెస్ నాయకులు పోలీసుల సమక్షంలో కౌన్సిలర్ల వద్దకు తీసుకెళ్లగా తమ ఇష్టంతోనే క్యాంపునకు వచ్చినట్లు వారు తెలిపారు. ఈ క్రమంలోనే గేటు బయట ఇరువర్గాల నాయకులు తమ వారికి అనుకూలంగా నినాదాలు చేస్తూ నెట్టుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకొని, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. చైర్మన్ హత్యకు ప్లాన్ చేశారు.. జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్‌రావు హత్యకు షాద్‌నగర్ నియోజకవరగంలోని కొత్తూరులో ప్లాన్ చేశారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. నిందితులను వెంటనే అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జమ్మికుంట కౌన్సిలర్లను పొనగంటి మల్లయ్య ఓ రిసార్టులో నిర్బంధించారని, శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారని కౌన్సిలర్లు సమాచారం ఇవ్వడం వల్లే చైర్మన్ కొత్తూరు వచ్చారని పేర్కొన్నారు. తప్పుదోవ పట్టిస్తున్నారు.. కౌన్సిలర్లు తమ ఇష్టంతోనే ఫాంహౌస్‌కు వచ్చినట్లు మాజీ జెడ్పీటీసీ శ్యాంసుందర్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు రఘు, మల్లయ్య తెలిపారు. ఇవేవీ తెలుసుకోకుండా తాము ప్రస్తుత చైర్మన్ రాజేశ్వర్‌రావును హత్య చేయడానికి సుపారీ తీసుకున్నామని ఆరోపించడం సిగ్గుచేటన్నారు. నిజంగా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లను అక్రమంగా తీసుకొస్తే పోలీసులకు ఫిర్యాదు చేసి, ఫాంహౌస్‌కు రావాలన్నారు. అర్ధరాత్రి వచ్చి ఎందుకు రెక్కీ నిర్వహించారని నిలదీశారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, ఎంపీపీ రవీందర్‌యాదవ్, మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్‌రావు వాస్తవాలు దాచి అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. చర్యలు తీసుకోవాలి.. జమ్మికుంట మున్సిపల్ చైర్మన్‌పై దాడి చేసిన కాంగ్రెస్ నేత శ్యాంసుందర్రెడ్డితోపాటు పలువురిపై పోలీ సులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్‌రావు కొత్తూ రు సీఐ నర్సింహారావుకు ఫిర్యాదు చేశారు. ఇవి చదవండి: తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ.. -
కంపెనీ సీఈవో కాదు, అయినా రోజుకు నాలుగు లక్షల జీతం
Tata Steel CFO Koushik Chatterjee: కొడితో కొట్టాలి..సిక్స్ కొట్టాలి... అన్నట్టు ఏదైనా టాప్ కంపెనీలో జాబ్ కొట్టాలి. లక్షల్లో ప్యాకేజీ అందుకోవాలి..ఇదేగా కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ప్రతీవారి కల. కానీ కంపెనీలో టాప్ పొజిషన్ కాకపోయినా, టాప్ శాలరీ అందుకోవడం విశేషం కదా మరి. అలా రతన్ టాటా నేతృత్వంలోని టాటా గ్రూపు ఉద్యోగి ఒకరు రోజుకు ఏకంగా లక్షల్లో సంపాదిస్తున్నారు. టాటా స్టీల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సీఎఫ్‌వో కౌశిక్ ఛటర్జీ. టాటా గ్రూప్‌లో అత్యధిక వేతనం పొందుతున్న చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్లలో కౌశిక్ ఒకరు. రూ. 1,43,175 కోట్ల మార్కెట్ క్యాప్ ఫ్లాగ్షిప్ కంపెనీకి ఆర్థిక వ్యవహారాల విభాగానికి ఇన్చార్జ్గా ఉన్నాడు.టాటా స్టీల్ వార్షిక నివేదిక ప్రకారం ఛటర్జీ ఇప్పటికీ రూ. 14,21,18,000 (రూ. 14.21 కోట్లు) తీసుకున్నారు. అంటే రోజుకు రూ.3.89 లక్షలకు పైగా ఆదాయం వస్తుంది. అయితే ఇటీవల టాటా మోటార్స్‌కు చెందిన పీబీ బజాలీ, ఛటర్జీని అధిగమించారు. గత ఏడాదితో పోల్చితే వేతనంలో ఈ ఏడాది స్వల్పంగా తగ్గినప్పటకీ 15,17,18,000 (రూ. 15.17 కోట్లు) అందుకున్నారు. అలాగే 2023లో ఛటర్జీతో పోలిస్తే టాటా స్టీల్‌లో రూ. 18.66 కోట్లతో సీఈఓ టీవీ నరేంద్రన్‌కు మాత్రమే ఎక్కువ వేతనం అందుకోవడం గమనార్హం. (మళ్లీ పరుగందుకున్న పసిడి, వెండి అయితే ఏకంగా) టాటా గ్రూప్‌లో పని చేయడానికి ముందు, కౌశిక్ బ్రిటానియా ఇండస్ట్రీస్, ఆడిట్ కంపెనీ ఎస్బీ బిల్లిమోరియా కంపెనీల్లో పనిచేశారు. కేవలం 36 సంవత్సరాల వయస్సులో, కౌశిక్ 2006లో టాటా స్టీల్‌లో VP ఫైనాన్స్ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. అతను 2012 నుండి సీఎఫ్‌వోగా ఉన్నారు. ఛటర్జీ జనవరి 1, 2023 నుండి 3 సంవత్సరాల కాలానికి IFRS ఫౌండేషన్ ఆరు కొత్త ట్రస్టీలలో ఒకరిగా నియమితులయ్యారు. అతను సలహా సభ్యునిగా కూడా ఉన్నారు. భారీ సంపాదన ఉన్నప్పటికీ చాలా నిడాడంబరమైన జీవిన శైలితో కౌశిక్ ఛటర్జీ కూల్ అండ్ కంపోజ్డ్ పర్సన్ అని సహోద్యోగులు భావిస్తారు. కౌశిక్ పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్లోని సెయింట్ పాట్రిక్స్ పాఠశాల నుండి పాఠశాల విద్యను, కోలకతాలో బీకాం డిగ్రీని సాధించారు. ఆ తరువాత చార్టర్డ్ అకౌంటెంట్ గా పనిచేశారు. -
ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి జాతీయ మహిళా కమిషన్ నోటీసులు
-
పోలింగ్ కేంద్రంలో కౌశిక్‌రెడ్డి ప్రచారం చేస్తున్నారని ఆరోపణ
-
లీకైన కౌశిక్‌రెడ్డి మరో ఆడియో క్లిప్
-
కాంగ్రెస్ నేత కౌశిక్‌రెడ్డికి షోకాజ్ నోటీసు
-
కేసీఆర్‌తో హుజూరాబాద్ నేతల భేటీ
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఆదివారం సాయంత్రం ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు. నియోజకవర్గం పరిధిలోని జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, పీఏసీఎస్ చైర్మన్లు, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్లు ఈ భేటీలో పాల్గొన్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో టీఆర్ఎస్ పరిస్థితి, స్థానిక రాజకీయాలు తదితర అంశాలపై సీఎం కేసీఆర్ ఆరా తీసినట్లు సమాచారం. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంతో పాటు, బీజేపీ, టీఆర్ఎస్కు మధ్య ఉన్న తేడాలను వివరించాలని సీఎం కేసీఆర్ పార్డీ నేతలకు సూచించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి ఎవరైతే బాగుంటుందని సీఎం కేసీఆర్ పార్టీ నేతలను ప్రశ్నించగా,‘ మీరు ఎవరిని అభ్యర్థిగా ప్రకటించినా మద్దతు ఇస్తాం‘ అని నాయకులు స్పష్టంచేశారు. కాగా, కాంగ్రెస్ నేత పాడి కౌశిక్ రెడ్డికి నియోజకవర్గంలో ఎలాంటి పేరు ఉందని అడగటంతో పాటు అతను పార్టీలోకి వస్తే ఎలా ఉంటుందని సీఎం ఆరా తీసినట్లు తెలిసింది. కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరినా అతనితో కలసి పనిచేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పార్టీ నాయకులు చెప్పినట్లు సమాచారం. ఎలాంటి షరతులు లేకుండా కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు ఈ భేటీలో కేసీఆర్ సూచనప్రాయంగా వెల్లడించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా కౌశిక్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరతారని స్థానికంగా కూడా ప్రచారం జరుగుతోంది. కానీ ఆదివారం ఈ ప్రచారాన్ని కౌశిక్‌రెడ్డి ఖండించారు. తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని ఆయన స్పష్టంచేశారు. -
బాలాదిత్య, కౌశిక్ ల ఫాథర్స్ డే చిట్ ఛాట్
-
Huzurabad: వదిలే ప్రసక్తే లేదు.. ఈటల భూదందాలు బయటపెడతా!
సాక్షి, ప్రతినిధి: రాష్ట్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌నకు గురైన ఈటల రాజేందర్ ప్రాతినిథ్యం వహిస్తున్న హుజురాబాద్ నియోజకవర్గంలో రాజకీయం రంగులు మారుతోంది. 2004 నుంచి ఈటలకు కంచుకోటగా నిలిచిన ఈ నియోజకవర్గంలో ఆయనను రాజకీయంగా దెబ్బకొట్టే దిశగా టీఆర్ఎస్ నాయకత్వం వేగంగా అడుగులు వేస్తోంది. రాజేందర్‌కు ప్రజల్లో, కార్యకర్తల్లో ఉన్న బలాన్ని పలుచన చేయడంతో పాటు ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని పెంచే దిశగా పావులు కదుపుతున్నాయి. హుజురాబాద్‌నియోజకవర్గం బాధ్యతలను భుజాల మీద వేసుకున్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తొలుత స్థానిక ప్రజాప్రతినిధులను ఈటలకు దూరం చేసే దిశగా ముందుకు సాగుతున్నారు. ఇటీవల జమ్మికుంట, ఇల్లందకుంట మండలాలకు చెందిన కొందరు నాయకులతో మాట్లాడిన ఆయన.. గురువారం హుజురాబాద్ మున్సిపాలిటీకి చెందిన ప్రజాప్రతినిధులు, మహిళా కౌన్సిలర్ల భర్తలను 11 మందిని కరీంనగర్‌కు పిలిపించి చర్చలు జరిపారు. మున్సిపాలిటీలోనే కాకుండా నియోజకవర్గంలో ఏ పని కావాలన్నా తానున్నానని వారికి హామీ ఇచ్చారు. నాయకులు శాశ్వతం కాదని, పార్టీ నీడలో ఉండి ప్రజలకు సేవ చేయాలని హితవు చెప్పారు. లాక్డౌన్ తర్వాత మంత్రి కేటీఆర్‌తో కలిసి హుజురాబాద్‌లో పర్యటిస్తానని, ప్రజలు టీఆర్ఎస్కు అండగా ఉన్నారని వివరించారు. మంత్రిని కలిసిన వారిలో కొలిపాక శ్రీనివాస్(వైస్ చైర్మన్ కొలిపాక నిర్మల భర్త), కేసిరెడ్డి నర్సింహారెడ్డి(కౌన్సిలర్ లావణ్య భర్త), ఆర్కె రమేశ్(కౌన్సిలర్ ఉమాదేవి భర్త), పూర్ణచందర్(కౌన్సిలర్ సృజన భర్త), ఇమ్రాన్(కౌన్సిలర్ ఉజ్మానూహరిన్ భర్త), అనిల్(కౌన్సిలర్ రాజకొమురయ్య కుమారుడు), కౌన్సిలర్లు తొగరు సదానందం, తోట రాజేంద్రప్రసాద్, తాళ్లపల్లి శ్రీనివాస్, ముక్కపల్లి కుమార్, కొండాల్‌రెడ్డి ఉన్నారు. చిల్లర వార్తలు నమ్మొద్దన్న ఈటల సోషల్ మీడియాలో, కొన్ని పత్రికల్లో తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని చిల్లర వార్తలుగా అభివర్ణిస్తూ మాజీ మంత్రి ఈటల రాజేందర్ తిప్పికొట్టారు. తన వైఖరిని ఇప్పటికే స్పష్టం చేశానని, కరోనా మహమ్మారి ప్రబలిన ఈ సమయంలో రాజకీయాలను పక్కనపెట్టి ప్రజలను ఆదుకునే పనిలో నిమగ్నమైనట్టు చెప్పారు. కరోనా తగ్గుముఖం పట్టిన వెంటనే తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ ముందుకు సాగుతానని గురువారం విడుదల చేసిన ఓ వీడియో ద్వారా తెలియజేశారు. అంతుచిక్కని కౌశిక్ రాజకీయం హుజురాబాద్ కాంగ్రెస్ నేత, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీప బంధువు పాడి కౌశిక్‌రెడ్డి రాజకీయం ఏంటో కాంగ్రెస్ పార్టీ నాయకులకు అంతుచిక్కడం లేదు. పార్టీల నాయకుల అభిప్రాయానికి భిన్నంగా మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను భూకబ్జాదారుడిగా తెరపైకి తెస్తూ తూర్పార పడుతున్న కాంగ్రెస్ నేత పాడి కౌశిక్‌రెడ్డి తన చర్యలకు కట్టుబడి ఉంటున్నట్లు గురువారం గురువారం ఓ వీడియో విడుదల చేశారు. తాను టీఆర్ఎస్లో చేరుతున్నట్లు సాగుతున్న ప్రచారాన్ని ఖండించారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు. అదే సమయంలో ఈటల భూదందాలను వెలుగులోకి తెస్తానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను వేధింపులకు గురిచేసిన ఈటల రాజేందర్ వదిలే సమస్య లేదన్నారు. చదవండి: Etela: కౌశిక్‌రెడ్డి తీరుతో ఇరకాటంలో కాంగ్రెస్ -
Etelaకు చెక్.. టీఆర్ఎస్ భావి నేతగా తెరపైకి కౌశిక్ రెడ్డి!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి తొలగించిన తరువాత చోటు చేసుకుంటున్న పరిణామాలతో హుజూరాబాద్ రాజకీయం వేడెక్కింది. ఆత్మగౌరవ నినాదంతో ఈటల రాజేందర్ టీఆర్ఎస్తో పోరుకే సిద్ధమైనట్లు సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో ఆ పార్టీ నేతలు అలర్ట్ అయ్యారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు హుజూరాబాద్ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ రాజకీయంగా పావులు కదిపే పనిలో ఉన్నారు. ‘హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ ఆరుసార్లు గెలిచింది కేవలం కేసీఆర్ బొమ్మతోనే’ అన్న సంకేతాలను పంపించడం ద్వారా ఆయన కేడర్‌ను తమవైపు తిప్పుకునేందుకు మైండ్‌గేమ్ ప్రారంభించినట్లు అర్థమవుతోంది. హుజూరాబాద్‌కు చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు ఇప్పటికే ఈటలకు మద్దతు ప్రకటించినా.. రోజులు గడిచేకొద్దీ పరిస్థితి మారుతుందనే ఆశాభావంతో అడుగులు వేస్తున్నారు. మండలాల వారీగా ఈటలకు వ్యతిరేకంగా నాయకులను కూడగట్టే పనిలో పడ్డారు. ఈటల ప్రతిష్ట దెబ్బతీయడమే లక్ష్యంగా.. మెదక్ జిల్లా మాసాయిపేట అసైన్డ్ భూముల కొనుగోలు, దేవరయాంజాల్ భూములకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో ఈటల ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. అదే సమయంలో బీసీ నాయకుడన్న పేరును చెరిపేసేందుకు ‘ఈటల రాజేందర్ రెడ్డి’ అనే ప్రచారాన్ని ప్రారంభించారు. ఈటల తనయుడు నితిన్‌రెడ్డికి సంబంధించి మేడ్చల్ జిల్లాలోని రావల్కోల్ భూ లావాదేవీల్లో ఆయన తండ్రి పేరును ఈటల రాజేందర్ రెడ్డిగా చూపించిన విషయాన్ని ఇటీవల కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి సాక్ష్యాధారాలతో వెలుగులోకి తెచ్చారు. దీనిని ప్రచారాస్త్రంగా మార్చాలని మంత్రి గంగుల కమలాకర్ పథక రచన చేస్తున్నట్లు సమాచారం. కాగా.. ఈటలకు సంబంధించి మరిన్ని వివాదాస్పద అంశాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈటల అనుకూల, వ్యతిరేక వర్గాలుగా నాయకులు హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఈటల అనుకూల, వ్యతిరేక వర్గాలుగా విడిపోతోంది. ఇటీవల గంగుల జన్మదినం సందర్భంగా హుజూరాబాద్‌లో ఆయన ఫొటోతో కొందరు భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులుగా ఉన్న హుజూరాబాద్ మండలాధ్యక్షుడు జి.కొమరారెడ్డి, పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, జమ్మికుంటకు చెందిన మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, సీనియర్ నేత తుమ్మటి సమ్మిరెడ్డి, హుజూరాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ రాధిక భర్త శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ నిర్మల, ఎంపీపీ రాణి భర్త సురేందర్ రెడ్డి, జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్మన్ దేశినికోటి స్వప్న భర్త కోటి, పీఏసీఎస్ చైర్మన్ పొనగంటి సంపత్, ఇల్లంతకుంట ఎంపీపీ సరిగొమ్ముల పావని వెంకటేశ్, కేడీసీసీ వైస్ చైర్మన్ పింగిలి రమేశ్, జమ్మికుంట జెడ్పీటీసీ శ్రీరాం శ్యాం, మాజీ వైస్ ఎంపీపీ చొక్కా రంజిత్, పలువురు జెడ్పీటీసీలు, ఎంపీపీల భర్తలు, ఇతర నాయకులు ఈటల వెంటే ఉన్నారు. 90 శాతం మంది ఎంపీటీసీలు, సర్పంచులు ఆయన వెంటే ఉన్నారు. అదే సమయంలో ఇల్లంతకుంట నుంచి జెడ్పీటీసీగా గెలిచిన కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ కనుమల్ల విజయ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బండ శ్రీనివాస్, వీణవంక నాయకులు ఈటలకు దూరంగా ఉంటున్నారు. ఎంపీపీలు, మున్సిపల్ చైర్పర్సన్లు కూడా సీన్లోకి రాకుండా వారి భర్తలు మాత్రమే ఇప్పటివరకు ఈటల వెంట కనిపించారు. జమ్మికుంట పట్టణానికి చెందిన కౌన్సిలర్ పొనగంటి మల్లయ్యతోపాటు జమ్మికుంట సర్పంచుల ఫోరం అధ్యక్షుడు వెంకటరెడ్డి, పాపక్కపల్లి సర్పంచి మహేందర్, ఇల్లంతకుంట మండలానికి చెందిన పలు గ్రామాల సర్పంచులు, నాయకులు సోమవారం కరీంనగర్లో మంత్రి గంగులను కలిసి, తాము పార్టీ వెంటే ఉంటామని చెప్పారు. కాగా పదవులు పోయే పరిస్థితి ఏర్పడితే ప్రజాప్రతినిధులుగా ఉన్న వారు టీఆర్ఎస్లోనే కొనసాగే అవకాశం ఉందని చెపుతున్నారు. నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారు, మార్కెటింగ్ కమిటీ చైర్మన్లు కూడా ఈటలకు దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. టీఆర్ఎస్ టికెట్టు కోసం యత్నాలు షురూ ఈటల రాజేందర్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఉప ఎన్నిక అనివార్యం కానుంది. అప్పటికి కరోనా ఉధృతి తగ్గితే ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది. ఈ లోపు టీఆర్ఎస్ టిక్కెట్టు కోసం యత్నాలు మొదలయ్యాయి. గతంలో ఈటల మీద ఓడిపోయిన కౌశిక్ రెడ్డిని టీఆర్ఎస్లోకి తీసుకొచ్చి టికెట్టు ఇవ్వనున్నట్లు ప్రచారం ఓవైపు జరుగుతుండగా, గతంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వకుళాభరణం కృష్ణమోహన్ రావు కూడా రేసులోకి వస్తున్నారు. మాజీ ఎంపీ వినోద్‌కుమార్ పేరు తెరపైకి వచ్చినప్పటికీ, ఆయనను వేములవాడ నుంచి ఫోకస్ చేసే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. ఎంపీ కెప్టెన్ లక్ష్మికాంతరావు కుటుంబం నుంచి ఒకరికి అవకాశం ఇస్తారని భావిస్తున్నప్పటికీ, ఇప్పటికే రెండు పదవులు వాళ్లింట్లో ఉండడం అడ్డంకిగా మారనుంది. బీజేపీలో ఉన్న మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి టీఆర్ఎస్లోకి రావాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నా స్పష్టత లేదు. ఆయన బీజేపీ నుంచే పోటీ చేసే అవకాశం ఉంది. కౌశిక్ రెడ్డి ద్వారా సరికొత్త రాజకీయం? ఈటల రాజేందర్‌పై గతంలో పోటీచేసి ఓడిపోయిన కాంగ్రెస్ నేత పాడి కౌశిక్ రెడ్డిని తెరపైకి తెచ్చేందుకు టీఆర్ఎస్ నాయకత్వం అడుగులు వేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కౌశిక్ భుజాల పైనుంచి తుపాకీ ఎక్కుపెట్టి ఈటలను టార్గెట్ చేసే సరికొత్త రాజకీయం నడుస్తున్నట్లు తెలుస్తోంది. హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక జరిగితే కౌశిక్ రెడ్డి బలమైన ప్రత్యర్థిగా ఉంటాడని ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా టీఆర్ఎస్ అధిష్టానం ఇప్పటికే సమాచారం తెప్పించుకుంది. అయితే.. ఇప్పుడే కౌశిక్‌ను పార్టీలోకి తీసుకోకుండా ఆయన ఇమేజ్ను మరింత పెంచి ఆ తరువాత గులాబీ కండువా కప్పాలని భావిస్తున్నారు. ఈటలకు వ్యతిరేకంగా కౌశిక్‌ను ఫోకస్ చేసే ఆలోచనతో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇటీవల కౌశిక్ రెడ్డి కరీంనగర్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మేడ్చల్ మండలం రావల్‌కోల్‌లో నితిన్‌రెడ్డి పేరిట 31.2 ఎకరాలు, మరో 36.39 ఎకరాల భూమిని సాదా కేశవరెడ్డి అనే బినామీ పేరిట కొనుగోలు చేశారని వెల్లడించారు. ఇదే సమావేశంలో ఈటలను ‘రెడ్డి’గా కౌశిక్ పేర్కొన్నారు. అయితే.. ఈ భూ లావాదేవీల వ్యవహారమంతా టీఆర్ఎస్ స్క్రిప్ట్ ప్రకారమేనని సమాచారం. తాజాగా మంగళవారం మరోసారి పాడి కౌశిక్‌రెడ్డి మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈటలకు సంబంధించిన మరో వివాదాన్ని ఆయన బహిర్గతం చేయబోతున్నట్లు తెలిసింది. ‘మంగళవారం కరీంనగర్లో మీడియా సమావేశం పెట్టే అవకాశం ఉంది’ అని కౌశిక్ రెడ్డి ‘సాక్షి’తో చెప్పడం గమనార్హం. చదవండి: Etela Rajender: యుద్ధానికే సిద్ధం? Etela, Putta Madhu: వేగంగా మారుతున్న సమీకరణలు..! -
కారు అదుపుతప్పి.. అనంతలోకాలకు
- ఇద్దరికి తీవ్ర గాయాలు - త్రుటిలో తప్పించుకున్న మరో ఇద్దరు గండేపల్లి (జగ్గంపేట) : ఏడీబీ రోడ్డులో జరిగిన కారు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందగా, మరో ఇద్దరు విద్యార్థులు తీవ్ర గాయపడ్డారు. ఈ సంఘటనలో మరో ఇద్దరికి ప్రమాదం త్రుటిలో తప్పింది. స్థానిక ఎసై కె.దుర్గా శ్రీనివాసరావు కథనం ప్రకారం మండలంలోని ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో శ్రీకాకుళానికి చెందిన యవ్వారి మనోజ్‌కుమార్ (21), అనకాపల్లికి చెందిన రవిరాజు ఈఈఈ ఫైనల్ ఇయర్, రాజోలుకు చెందిన కంచి కౌశిక్ మెకానికల్ థర్డ్ ఇయర్ చదువుతున్నారు. పెద్దాపురం బ్యాంక్ కాలనీలో అద్దె ఇంటిలో నివాసం ఉంటూ కళాశాలకు రోజు వెళ్లి వస్తుంటారు. సోమవారం రవిరాజుకు చెందిన కారులో స్నేహితుడైన కౌశిక్‌ను కళాశాలలో డ్రాప్ చేసేందుకు కళాశాల సమీపంలోకి వచ్చి వెనుదిరిగి పెద్దాపురం బయలుదేరారు. లలిత గొడౌన్ వద్దకు వచ్చేసరికి వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి కాలువలోంచి దూసుకెళ్లి గొడౌన్ గేట్ వద్ద చెట్టును, పక్కనే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది షెల్టర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలతో ముగ్గురు కారులో చిక్కుకుపోయారు. గొడౌన్‌కు చెందిన పలువురు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను కారులోంచి బయటకు తీసి 108 అంబులెన్స్‌కు సమాచారం అందజేశారు. అప్పటికే మనోజ్‌కుమార్ మృతి చెందినట్టు అంబులెన్స్ సిబ్బంది తెలిపింది. తీవ్ర గాయాలతో ఉన్న రవిరాజు, కౌశిక్‌లను పెద్దాపురం ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమచికిత్స అనంతరం కాకినాడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు. ప్రమాద స్థలానికి చేరుకున్న ఏఎస్సై వరహాలరాజు వివరాలు సేకరించారు. ప్రస్తుతం రవిరాజు పరిస్థితి విషమంగా ఉందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. భీతిల్లిన సిబ్బంది షెల్టర్‌లో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది.. ఈ ప్రమాదంతో భీతిల్లారు. ఒక్కసారిగా పెద్దగా శబ్దం రావడంతో అక్కడ నుంచి పరుగులు తీశారు. షెల్టర్‌ను కారు ఢీకొనడంతో తమకు ప్రమాదం తప్పిందని పడాల శ్రీనివాస్, మద్దాల విలియం తెలిపారు. కారణం.. అతివేగమా? రోడ్డుపై బురదేనా? విద్యార్థులు ప్రయాణం చేస్తున్న కారును వేగంగా నడపడంతో ఈ ప్రమాదం సంభవించిందా...లేక రోడ్డుపై బురద కారణమా అనే అనుమానాలు స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. సాధారణ రోజుల్లోనే రోడ్డు నునుపుగా ఉంటుందని, వర్షం పడడం, ఈ రహదారిలో గ్రావెల్‌ను తరలిస్తున్న లారీ డ్రైవర్లు రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో రోడ్డుపై గ్రావెల్ పడుతోందని అంటున్నారు. దీంతో ఈ రోడ్డుపై తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని చెబుతున్నారు. ఇదిలా ఉండగా, ఆదిత్య విద్యాసంస్థల వైస్ చైర్మన్ ఎన్. సతీష్‌రెడ్డి తక్షణమే స్పందించి చర్యలు చేపట్టారు. మనోజ్ కుమార్ మృతదేహాన్ని పెద్దాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కాకినాడలో చికిత్స పొందుతున్న వారి వద్దకు వెళ్లి వైద్యులతో మాట్లాడారు. -
మూడేళ్ల ప్రాయంలోనే నటించా
కడియం : మూడేళ్ల వయస్సున్నప్పుడే కెమెరా ముందు నటించినట్టు హీరో కౌశిక్‌బాబు తెలిపారు. బాల నటుడిగా టీవీ, సినిమా రంగాల్లో తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో నటించినట్టు ఆయన వెల్లడించారు. కౌశిక్ హీరోగా నటిస్తున్న ‘తొలి సంధ్యవేళలో’ సినిమా షూటింగ్ స్థానిక పల్ల వెంకన్న నర్సరీలో ఆదివారం జరిగింది. ఆ సందర్భంగా ఆయన తన నటనాప్రయాణంలో ఆసక్తికరమైన అంశాలను విలేకరులకు తెలియజేశారు. సీరియల్స్‌తో తొలి అడుగు మా నాన్నగారైన విజయబాబు (సమాచార హక్కు చట్టం కమిషనర్)కు స్నేహితుడు, డెరైక్టర్ అయిన సునీల్‌వర్మ మా ఇంటికి వచ్చినప్పుడు నన్ను చూసి ‘కళంకిత’ సీరియల్లో అవకాశం ఇచ్చారు. అలా మొదలైన నటనా ప్రస్థానంలో బాలనటుడిగా 50కి పైగా సీరియళ్లు, 20 వరకు సినిమాల్లో నటించాను. పలు విజయవంతమైన చిత్రాల్లో ప్రముఖ హీరోల చిన్ననాటి పాత్రలను పోషించాను. ‘టక్కరిదొంగ’ చిత్రంలో మహేష్‌బాబు చిన్ననాటి పాత్రకు నంది అవార్డు దక్కింది. కేరళలో ‘కుట్టి ఎన్టీఆర్’ మహానటుడు ఎన్టీ రామారావుకు తెలుగుసినీరంగంలో రాముడు, కృష్ణుడు వంటి పాత్రల ద్వారా ఎంత పేరొచ్చిందో కేరళలో నాకు అలాంటి గుర్తింపు వచ్చింది. ‘స్వామి అయ్యప్ప’ సినిమాలో అయ్యప్ప పాత్రకు ఆ రాష్ట్ర ప్రభుత్వం మోస్ట్‌పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డునిచ్చింది. మళయాళ మనోరమ వారి ఫీచర్ఫిలిమ్ రామాయణంలో రాముడిగాను, గురవాయప్పన్ సీరియల్లో కృష్ణుడిగా విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో అక్కడి వారందరూ నన్ను కుట్టి ఎన్టీఆర్ (చిన్న ఎన్టీఆర్) అని పిలుస్తారు. ఆదిశంకరాచార్యుడిగా.. యువహీరోలందరూ యాక్షన్చిత్రాలపై దృష్టిపెడుతుంటే ఆదిశంరాచార్య సినిమా తీసుకున్నారేంటని చాలా మంది తొలుత నన్ను అడిగేవారు. సాహిత్య అభిమాని, కళలను ప్రేమించే మా నాన్నగారు నా చిన్నప్పటి నుంచీ భక్తిభావం నూరిపోసారు. అందుకనే ఆ సినిమాకు అంగీకరించాను. అయితే ఆ సినిమా విజయవంతం కావడంతో పెదవి విరిచినవారే అభినందించారు. ఆ సినిమా ద్వారా నాకు మంచి గుర్తింపు లభించింది. మాస్ పాత్రలవైపు నేను బాల నటుడిగా ఉన్నప్పటి నుంచీ మాస్ ప్రేక్షకులను ఆకర్షించే డాన్స్, యాక్షన్స్ నేర్చుకున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న ‘తొలిసంధ్యవేళ’లో చిత్రం నాకు హీరోగా మంచి గుర్తింపు వస్తుంది. గతంలో ‘పవిత్ర’ సినిమాలో కూడా కీలకపాత్ర పోషించాను. ఎంబీఏ సెకండియర్‌లో ఉన్నా.. ప్రస్తుతం ఎంబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాను. షూటింగ్లవల్ల చదువుకు ఆటంకం కలగకుండా చిన్నప్పట్నుంచీ తగు జాగ్రత్తలు తీసుకున్నాను. కుటుంబ సభ్యుల సహకారంతో ఓపక్క చదువుకుంటూ మరో పక్క నటనలో కొనసాగగలిగాను. ఈ జిల్లా నచ్చింది తొలిసారిగా షూటింగ్ కోసం ఇక్కడకు వచ్చాను. ఇక్కడి ప్రకృతి అందాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. మన రాష్ట్రంతోపాటు తమిళనాడు, కేరళలోని పలు ప్రాంతాల్లో ఇంతవరకు పర్యటించాను. అయితే ఈ జిల్లా ప్రకృతి అందాలు, ప్రజల ఆదరాభిమానాలు ఎప్పటికీ ప్రత్యేకమైనవే.