
సాక్షి, సిటీబ్యూరో: చేనేత హస్త కళాకారులు తయారు చేసిన వస్త్ర ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన నూతన బ్రాండ్ ‘జీఎస్ శారీస్ షో రూమ్’ను నిజాంపేట్‌లో ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా ’అల్లరే అల్లరి’ చిత్రబృందం కౌశిక్, విశ్వమోహన్, శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రముఖ మోడల్స్, సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్లు సందడి చేశారు. ఈ సందర్భంగా స్టోర్ ఎండీ శ్రావణి గోపీనాథ్ మాట్లాడుతూ.. తెలుగు సంప్రదాయాలకు చీరకట్టు ప్రాధాన్యం తెలియజేసేలా హ్యాండ్ మేడ్ శారీలను అందిస్తున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment