Advertisement
Top Salary
-
కంపెనీ సీఈవో కాదు, అయినా రోజుకు నాలుగు లక్షల జీతం
Tata Steel CFO Koushik Chatterjee: కొడితో కొట్టాలి..సిక్స్ కొట్టాలి... అన్నట్టు ఏదైనా టాప్ కంపెనీలో జాబ్ కొట్టాలి. లక్షల్లో ప్యాకేజీ అందుకోవాలి..ఇదేగా కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ప్రతీవారి కల. కానీ కంపెనీలో టాప్ పొజిషన్ కాకపోయినా, టాప్ శాలరీ అందుకోవడం విశేషం కదా మరి. అలా రతన్ టాటా నేతృత్వంలోని టాటా గ్రూపు ఉద్యోగి ఒకరు రోజుకు ఏకంగా లక్షల్లో సంపాదిస్తున్నారు. టాటా స్టీల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సీఎఫ్‌వో కౌశిక్ ఛటర్జీ. టాటా గ్రూప్‌లో అత్యధిక వేతనం పొందుతున్న చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్లలో కౌశిక్ ఒకరు. రూ. 1,43,175 కోట్ల మార్కెట్ క్యాప్ ఫ్లాగ్షిప్ కంపెనీకి ఆర్థిక వ్యవహారాల విభాగానికి ఇన్చార్జ్గా ఉన్నాడు.టాటా స్టీల్ వార్షిక నివేదిక ప్రకారం ఛటర్జీ ఇప్పటికీ రూ. 14,21,18,000 (రూ. 14.21 కోట్లు) తీసుకున్నారు. అంటే రోజుకు రూ.3.89 లక్షలకు పైగా ఆదాయం వస్తుంది. అయితే ఇటీవల టాటా మోటార్స్‌కు చెందిన పీబీ బజాలీ, ఛటర్జీని అధిగమించారు. గత ఏడాదితో పోల్చితే వేతనంలో ఈ ఏడాది స్వల్పంగా తగ్గినప్పటకీ 15,17,18,000 (రూ. 15.17 కోట్లు) అందుకున్నారు. అలాగే 2023లో ఛటర్జీతో పోలిస్తే టాటా స్టీల్‌లో రూ. 18.66 కోట్లతో సీఈఓ టీవీ నరేంద్రన్‌కు మాత్రమే ఎక్కువ వేతనం అందుకోవడం గమనార్హం. (మళ్లీ పరుగందుకున్న పసిడి, వెండి అయితే ఏకంగా) టాటా గ్రూప్‌లో పని చేయడానికి ముందు, కౌశిక్ బ్రిటానియా ఇండస్ట్రీస్, ఆడిట్ కంపెనీ ఎస్బీ బిల్లిమోరియా కంపెనీల్లో పనిచేశారు. కేవలం 36 సంవత్సరాల వయస్సులో, కౌశిక్ 2006లో టాటా స్టీల్‌లో VP ఫైనాన్స్ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. అతను 2012 నుండి సీఎఫ్‌వోగా ఉన్నారు. ఛటర్జీ జనవరి 1, 2023 నుండి 3 సంవత్సరాల కాలానికి IFRS ఫౌండేషన్ ఆరు కొత్త ట్రస్టీలలో ఒకరిగా నియమితులయ్యారు. అతను సలహా సభ్యునిగా కూడా ఉన్నారు. భారీ సంపాదన ఉన్నప్పటికీ చాలా నిడాడంబరమైన జీవిన శైలితో కౌశిక్ ఛటర్జీ కూల్ అండ్ కంపోజ్డ్ పర్సన్ అని సహోద్యోగులు భావిస్తారు. కౌశిక్ పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్లోని సెయింట్ పాట్రిక్స్ పాఠశాల నుండి పాఠశాల విద్యను, కోలకతాలో బీకాం డిగ్రీని సాధించారు. ఆ తరువాత చార్టర్డ్ అకౌంటెంట్ గా పనిచేశారు. -
ఉద్యోగులకు అధిక జీతాలు ఇస్తున్న టాప్ కంపెనీలు ఇవే
-
దుమ్మురేపిన కోలకతా ఐఐఎం
కోల్‌కతా : దేశంలోని అతిపెద్ద కోలకతా ఐఐఎం విద్యార్థులు అత్యధిక అంతర్జాతీయ ప్యాకేజీలతో మరోసారి దుమ్ము రేపారు. మూడు రోజుల రిక్రూట్ మెంట్ ప్రక్రియలో మొత్తం 100 శాతం ప్లేస్‌మెంట్స్‌తో బీ స్కూల్ రికార్డు సృష్టించినట్టు యాజమాన్యం ప్రకటించింది. ఫిబ్రవరి రెండవ వారంలో మొత్తం 474 టాప్ జాబ్ లను సాధించినట్టు ఐఐఎం కలకత్తా ఒక ప్రకటనలో తెలిపింది . అలాగే 2017 పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ విద్యార్థులు ఈ ఏడాదికి అత్యధిక అంతర్జాతీయ ప్యాకేజీని అందుకున్నామన్నారు. రూ. 63 లక్షలు (90,000యూరోల) భారీ వేతన ఆఫర్ తమ విద్యార్థి సాధించినట్టు చెప్పారు. అలాగే దేశీయంగా అత్యధిక ప్యాకేజీ రూ.70లక్షల(సంవత్సరానికి)ని తెలిపారు. ఫైనాన్షియల్ సెక్టార్స్‌లో అత్యధికంగా 29 శాతం ఆఫర్లు వచ్చాయి. అవెందూస్, ఎడెల్వీస్, గోల్డ్‌మ్యాన్ సాచీ, హెఎస్ బీసీ టాప్ రిక్రూటర్లుగా నిలిచాయి. కన్సల్టింగ్ సెక్టార్ లో 22 శాతంతో రెండవస్థానంలో నిలచింది. ఈ రంగం లో యాక్సెంచర్, ఏటీ కీర్నే, బైన్, బీసీజీ అండ్ మెకిన్సే ఉన్నాయి. బీజీ, సికె బిర్లా, టీఏఎస్ లాంటి టాప్ జనరల్ మేనేజ్మెంట్ సంస్థలు 15శాతం నియమించుకున్నాయి. సేల్స్ అండ్ మార్కెటింగ్ 12శాతం హెచ్ యూఎల్, ఐటిసి, ప్రోక్టర్ అండ్గ్యాంబుల్, రెక్కిట్ బెంకైజెర్ వంటి సంస్థల ఉన్నాయి. వీటితోపాటుగా, అమెజాన్, విప్రో లాంటి ఇతర కామర్స్, ఐటి సంస్థలు కూడా 14శాతం విద్యార్థులను ఎంపిక చేసుకున్నట్టు బీ స్కూల్ వెల్లడించింది.