CFO
-
‘ఎవరికి చెల్లింపులు చేసినా నాకు తెలుస్తుంది’
తప్పుడు పద్ధతిలో కాంట్రాక్టులు పొందేందుకు ప్రభుత్వ అధికారులకు ఎలాంటి లంచాలు ఇవ్వలేదని అదానీ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జుగేషీందర్ సింగ్ అన్నారు. అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణల ప్రకారం అంత పెద్దమొత్తంలో ఎవరికైనా నగదు చెల్లిస్తే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ హోదాలో ఉన్న తనకు కచ్చితంగా తెలుస్తుందన్నారు. ఈమేరకు విలేకరుల సమావేశంలో ఆయన కొన్ని విషయాలు వెల్లడించారు.‘అదానీ గ్రూప్‌పై ఇటీవల వచ్చిన ఆరోపణల్లో వాస్తవాలు లేవు. గ్రూప్ అధికారులు కాంట్రాక్టులు పొందేందుకు ప్రభుత్వ అధికారులకు ఎలాంటి లంచాలు ఇవ్వలేదు. ఆరోపణల ప్రకారం అంత పెద్దమొత్తంలో నగదు చెల్లిస్తే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ హోదాలో ఉన్న నాకు కచ్చితంగా సమాచారం ఉంటుంది. యూఎస్‌లో చేసిన ఆరోపణలు న్యాయపరమైన అధికారాన్ని ఉపయోగించడమే తప్పా ఇది గ్రూప్‌పై దాడి కాదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు నిబంధనల ప్రకారం సరైన విధంగా స్పందిస్తారు. ఆయా ఆరోపణలను సమర్థంగా తిప్పికొడుతారు. ప్రస్తుతం 30 నెలల రుణ వాయిదాలు తిరిగి చెల్లించే సామర్థ్యం అదానీ గ్రూప్ కలిగి ఉంది. ఎంతటి క్లిష్ట పరిస్థితిలోనైనా 12 నెలల కంటే ఎక్కువగానే రుణా వాయిదాలు చెల్లించే నగదును ముందుగానే సిద్ధంగా ఉంటుంది’ అని తెలిపారు.ఇదీ చదవండి: పాన్ 2.0: అప్లై విధానం.. ఫీజు వివరాలుభారత్లో భారీ సౌర విద్యుత్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్‌లు పొందేందుకు దాదాపు రూ.2,200 కోట్లు (సుమారు 265 మిలియన్ డాలర్లు) లంచాలు ఇచ్చినట్లు అమెరికాలో ఇటీవల అభియోగాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో గ్రూప్ అధినేత గౌతమ్ అదానీతో పాటు మరో ఏడుగురిపై మోసం, లంచం, అవినీతి కేసులు నమోదయ్యాయి. -
ఎయిర్ ఇండియా సీఎఫ్ఓగా 'సంజయ్ శర్మ'
టాటా యాజమాన్యంలో ఉన్న ఎయిర్‌లైన్‌లో మూడు దశాబ్దాలకు పైగా పనిచేసిన 'వినోద్ హెజ్మాడి' త్వరలో పదవీ విరమణ చేయనున్నారు. ఈయన పదవీ విరమణ తర్వాత జూన్ 10 నుంచి 'సంజయ్ శర్మ' తన కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా ఉంటారని ఎయిర్ ఇండియా శుక్రవారం ప్రకటించింది.సంజయ్ శర్మ.. కార్పొరేట్ ఫైనాన్స్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్‌లో 30 సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నారు. ఈయన టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌లో సీఎఫ్ఓ, అంతకుముందు టాటా రియాల్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌లో సీఎఫ్ఓగా.. డ్యుయిష్ బ్యాంక్ గ్రూప్‌లో ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్స్ హెడ్, మేనేజింగ్ డైరెక్టర్ వంటి పదవులను నిర్వహించారు.సంజయ్ మా బృందంలో చేరినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. ఎయిర్ ఇండియా తన పూర్వ వైభవం కోసం పరుగులు తీస్తున్న తరుణంలో సంస్థ సీఎఫ్ఓగా సంజయ్ శర్మ నియమితులు కావడం హర్సిన్చాదగ్గ విషయం అని ఎయిర్ ఇండియా సీఈఓ, ఎండీ కాంప్‌బెల్ విల్సన్ అన్నారు. -
కంపెనీ మారుతావా.. కట్టు రూ. 25 కోట్లు!
కంపెనీ మారిన మాజీ సీఎఫ్‌వో జతిన్ దలాల్ (Jatin Dalal)కు భారతీయ ఐటీ దిగ్గజం విప్రో (Wipro) ఝలక్ ఇచ్చింది. ఒప్పందాన్ని ఉల్లంఘించి ప్రత్యర్థి కంపెనీలో చేరినందుకు గాను రూ. 25 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని కోరింది. అంతే కాకుండా వడ్డీ కూడా కట్టాలని కోర్టులో దావా వేసింది. కాగ్నిజెంట్ (Cognizant) లో చేరిన తమ మాజీ సీఎఫ్‌వో జతిన్ దలాల్‌పై ఐటీ కంపెనీ విప్రో బెంగళూరులోని సివిల్ కోర్టులో ఇటీవల దావా వేసింది. ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు గాను రూ. 25 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని కోరినట్లు తమకు లభించిన కోర్టు పత్రాలను ఉటంకిస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది. ఈ నష్టపరిహారంపై సెప్టెంబర్ 29 నుంచి చెల్లింపు తేదీ వరకు 18 శాతం చొప్పున వడ్డీ కూడా చెల్లించాలని దలాల్‌ను కోరింది. అంతేకాకుండా దలాల్ తమకు సంబంధించిన రహస్య సమాచారాన్ని బహిర్గతం చేయకుండా, తమ కస్టమర్లు లేదా ఉద్యోగులను ఏ విధంగానూ ప్రభావితం చేయకుండా జతిన్ దలాల్‌పై విప్రో శాశ్వత నిషేధం విధించింది. అయితే ఈ విషయాన్ని మధ్యవర్తిత్వానికి రిఫర్ చేయాలని కోర్టును కోరుతూ దలాల్ దరఖాస్తు చేసుకున్నారు. తదుపరి విచారణ జనవరి 3న జరగనుంది. ఈ విషయాన్ని మధ్యవర్తిత్వానికి సూచించాలా వద్దా అనే దానిపై కోర్టు ఉత్తర్వులు జారీ చేస్తుంది. మధ్యవర్తిత్వం అనేది కోర్టులతో పని లేకుండా వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ఉద్దేశించిన ప్రత్యామ్నాయ మార్గం. ఎంప్లాయిమెంట్ కాంట్రాక్ట్‌లో దీనికి అవకాశం ఉంటే ఈ పద్ధతిని ఉపయోగించుకోవచ్చు. జతిన్ దలాల్ డిసెంబర్ 1న కాగ్నిజెంట్‌లో సీఎఫ్‌వోగా చేరారు. ఈ కేసులో మొదటి విచారణ నవంబర్ 28న జరిగింది. డిసెంబరు ప్రారంభంలో దలాల్ ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ యాక్ట్ 1996లోని సెక్షన్ 8 కింద మధ్యవర్తిత్వానికి దరఖాస్తు చేశారు. ఈ సెక్షన్ ప్రకారం.. ఇరుపక్షాలను మధ్యవర్తిత్వానికి సూచించే అధికారం కోర్టులకు లభిస్తుంది. జతిన్ దలాల్‌కు విప్రోలో రెండు దశాబ్దాల అనుభవం ఉంది. 2015 నుంచి ఆయన ఇక్కడ సీఎఫ్‌వోగా పనిచేశారు. 2019 నుంచి ప్రెసిడెంట్‌గా అదనపు బాధ్యతలను సైతం నిర్వహించారు. కాగ్నిజెంట్‌లో ఆయన వీసా ఫార్మాలిటీలు పూర్తయిన తర్వాత యూఎస్ లేదా యూకే వెళ్తారని తెలుస్తోంది. -
ఈ సీఎఫ్‌వో రిజైన్ లెటర్ చూశారంటే అవాక్కవుతారు!
సీఎఫ్‌వో అంటే చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్. ఏ కంపెనీలో అయినా వీరిది ఉన్నత స్థాయి పోస్టు. సీఈవో తర్వత స్థాయిలో వీరి హోదా ఉంటుంది. ఇటీవల ఓ కంపెనీ సీఎఫ్‌వో రాజీనామా చేశారు. అయితే ఆ అధికారి రిజైన్ లెటర్‌ను చూసిన వారు అవాక్కవుతున్నారు. సాధారణంగా రాజీనామా లేఖను ఏ రూపంలోనైనా కంపెనీ యాజమాన్యానికి సమర్పించవచ్చు. అయితే మిత్షీ ఇండియా అనే కంపెనీ సీఎఫ్‌వో రింకు నికేత్ పటేల్ స్కూల్ నోట్‌బుక్ పేపర్‌పై రాజీనామా లేఖను రాసి సమర్పించారు. కంపెనీలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పదవికి రింకు నికేత్ పటేల్ చేసిన రాజీనామాను ఆమోదించినట్లు మిత్షీ ఇండియా డిసెంబర్ 21న ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. స్కూల్ నోట్‌బుక్ పేపర్‌పై రాసిన రాజీనామా లేఖను కంపెనీ తన అధికారిక ప్రకటనలో జత చేసింది. ఇదీ చదవండి: జనరేటివ్ ఏఐపై పోటాపోటీ! సీఈవోలు ఏం చెప్పారంటే.. వ్యక్తిగత కారణాల వల్ల రింకు నికేత్ పటేల్ రాజీనామా చేశారని, 2023 డిసెంబర్ 20 నుంచి ఇది అమల్లోకి వస్తుందని కంపెనీ తెలిపింది. "కంపెనీ కొత్త సీఎఫ్‌వోని నియమించే ప్రక్రియలో ఉందని, అది పూర్తయిన తర్వాత స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేస్తుంది" అని పేర్కొంది. మిత్షి ఇండియా లిమిటెడ్ 1976లో ఏర్పాటైంది. గతంలో దీన్ని డేరా పెయింట్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ అని పిలిచేవారు. 1992లో ఐపీవోకి వచ్చింది. కంపెనీ వెబ్సైట్ ప్రకారం ఇది 28 ఏళ్లుగా బీఎస్ఈలో లిస్ట్ అయి ఉంది. -
దిగ్గజ టెక్ కంపెనీ సీఎఫ్ఓ రాజీనామా.. ఎందుకంటే..
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నీలంజన్‌రాయ్ తన పదవికి రాజీనామా చేశారు. అందుకు సంబంధించి బీఎస్ఈకు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ పంపారు. నీలంజన్‌రాయ్ 2018 నుంచి తన పదవిలో కొనసాగారు. ఆయన తన వ్యక్తిగత కారణాల వల్ల ఈ పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. అయితే నిబంధనల ప్రకారం రాయ్ మార్చి 31, 2024 వరకు ఇన్ఫోసిస్ సీఎఫ్‌ఎగా కొనసాగుతారు. ‘ఇన్ఫోసిస్‌లో కాకుండా బయట వృద్ధి చెందేందుకు అవకాశాలను అన్వేషించడానికి, వ్యక్తిగత కారణాల వల్ల కంపెనీకి రాజీనామా చేశాను. నోటీసు పీరియడ్ వరకు ఈ సంస్థలో విధులు నిర్వర్తిస్తాను. నా పదవీకాలంలో సహకరించిన అందరికీ ధన్యవాదాలు. భవిష్యత్తులో ఇన్ఫోసిస్ మరింత వృద్ధి చెందాలని కోరుకుంటున్నాను’అని రాయ్ తన రాజీనామా లేఖలో రాశారు. రాయ్ అనంతరం జయేష్ సంఘ్రాజ్కా సీఎఫ్ఓ బాధ్యతలు చేపడుతారని కంపెనీ తెలిపింది. ఏప్రిల్ 1, 2024 నుంచి కొత్త సీఎఫ్ఓగా ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని చెప్పింది. జయేష్ ఇన్ఫోసిస్‌లో 18 సంవత్సరాలుగా సేవలందిస్తున్నారు. ఆయన ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ డిప్యూటీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ఆస్తులు అమ్మనున్న టాప్ ఐటీ కంపెనీ..! ఇన్ఫోసిస్ సీఈఓ, ఎండీ సలీల్ పరేఖ్ మాట్లాడుతూ..డిప్యూటీ సీఎఫ్ఓగా పనిచేస్తున్న జయేష్ సీఎఫ్ఓగా బాధ్యతలు చేపడుతారు. కంపెనీ ఫైనాన్స్ విభాగంలో చాలా ఏళ్లుగా ఆయన పనిచేస్తున్నారు. కంపెనీని మరింత అభివృద్ధి చెందించడానికి ఆయన అనుభవం ఎంతో అవసరం అవుతుందని అన్నారు. నీలాంజన్ భవిష్యత్తు ప్రయత్నాలు ఫలించాలని ఆశిస్తున్నట్లు సలీల్ చెప్పారు. -
సీఎఫ్‌వో జతిన్ దలాల్: విప్రోలో రాజీనామా.. కాగ్నిజెంట్‌లో ప్రత్యక్షం!
విప్రో (Wipro) మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) జతిన్ దలాల్ (Jatin Dalal)ను తమ సీఎఫ్‌వోగా నియమించుకుంది ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ (Cognizant). ఆయన ఇటీవలే విప్రో సంస్థలో సీఎఫ్‌వోగా రాజీనామా చేశారు. (లెనోవో ఆఫీసుల్లో ఐటీ సోదాలు.. ఉద్యోగుల ల్యాప్‌టాప్‌లూ తనిఖీ) ఇన్ఫోసిస్ మాజీ ప్రెసిడెంట్ రవి కుమార్ ఎస్ కాగ్నిజెంట్ సీఈవోగా గత జనవరిలో బాధ్యతలు చేపట్టిన నుంచి ఆ కంపెనీలో జతిన్ దలాల్ రెండవ హై ప్రొఫైల్ నియామకం. 2024 ప్రారంభంలో పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత సీఎఫ్‌వో జాన్ సీగ్మండ్ నుంచి జతిన్ దలాల్ బాధ్యతలు స్వీకరిస్తారని కాగ్నిజెంట్ ఒక ప్రకటనలో తెలిపింది. కంపెనీలు మారుతున్న టాప్ ఎగ్జిక్యూటివ్‌లు ప్రముఖ భారతీయ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సీఈఓ రాజేష్ గోపీనాథన్ గత మార్చిలో వైదొలిగారు. ఆయన స్థానంలో టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్లలో పనిచేసిన మోహిత్ జోషిని సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించింది టీసీఎస్. వచ్చే డిసెంబర్లో ఆయన విధుల్లో చేరన్నారు. (ఐటీ పరిశ్రమకు చల్లని కబురు.. మాంద్యం భయంపై సీఈవో ఊరట) ఇక జతిన్ దలాల్ విప్రోలో రెండు దశాబ్దాలకు పైగా పనిచేశారు. ట్రెజరీ కార్యకలాపాలలో మేనేజర్‌గా చేరిన ఆయన ప్రెసిడెంట్, సీఎఫ్‌వో వరకూ ఎదిగారు. ఆయన నిష్క్రమించిన మరుసటి రోజే విప్రో షేర్లు దాదాపు 3 శాతం పడిపోయాయి. 2015లో విప్రో సీఎఫ్‌వో అయిన జతిన్ దలాల్.. కంపెనీ సీఈవో థియరీ డెలాపోర్టేతో కలిసి కోవిడ్ సమయంలో కంపెనీని విజయవంతంగా నడిపించారు. డిజిటల్ సేవలకు డిమాండ్ పెరగడంతో 2020, 2021 సంవత్సరాల్లో కంపెనీ షేర్లు వరుసగా 57 శాతం, 85 శాతం పెరిగాయి. అదే కాలంలో భారత నిఫ్టీ IT ఇండెక్స్‌లో 55 శాతం, 60 శాతం వృద్ధిని సాధించింది. -
డైనమిక్ అయ్యర్
సవాలును తలకెత్తుకోవడం అంటే ‘తలకు మించిన భారం’ అనుకుంటారు కొందరు. సవాలును స్వీకరించడం అనేది తమను తాము నిరూపించుకునే అపూర్వ అవకాశం అనుకుంటారు మరికొందరు. అపర్ణ అయ్యర్ రెండో కోవకు చెందిన వ్యక్తి. ‘సీఏ పరీక్ష పాస్ కావడం అంటే మాటలు కాదు’ లాంటి ప్రతికూల మాటలు అదేపనిగా వినిపించినా ‘సీఏ’ పై ఆసక్తిని ఎప్పుడూ కోల్పోలేదు. ఆ ఆసక్తే ఆమెను సీఏ బంగారు పతక విజేతను చేసింది. సవాలును చిరునవ్వుతో స్వీకరించే ఆమె ధైర్యం ‘విప్రో’ లాంటి పెద్ద సంస్థలో సీఎఫ్‌వో (చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్)గా బాధ్యతలు స్వీకరించేలా చేసింది.... లీడర్ అంటే ఎవరు? దారి తెలిసిన వారు, ఆ దారిలో ఆటంకాలు లేకుండా ప్రయాణించే వారు, అవసరమైతే కొత్త దారి చూపించేవారు. ఇలాంటి నాయకత్వ లక్షణాలు ఎన్నో అపర్ణ అయ్యర్‌లో దండిగా ఉన్నాయి కాబట్టే ఆమె మల్టీనేషనల్ ఐటీ కార్పోరేషన్ విప్రోలో ఎన్నో ఉన్నతస్థానాల్లో పనిచేసింది. విప్రోతో ఆమెది రెండు దశాబ్దాల అనుబంధం. సీనియర్ ఇంటర్నల్ ఆడిటర్‌గా విప్రోలోకి అడుగు పెట్టిన అపర్ణ అక్కడి ఫైనాన్స్ టీమ్‌తో పని చేస్తూ ఎన్నో అనుభవాలను సొంతం చేసుకుంది. ఒక్కో మెట్టు ఎక్కుతూ సీఎఫ్‌వో స్థాయికి చేరింది. ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్మెంట్, క్యాపిటల్ అలోకేషన్, ఫండ్ రైజింగ్, బిజినెస్ స్ట్రాటజీ అండ్ గ్రోత్... మొదలైన సబ్జెక్లలో అపర్ణ నిపుణురాలు. సబ్జెక్ట్‌లో నైపుణ్యం ఉండగానే సరిపోదు. వివిధ సందర్భాలలో ఆ నైపుణ్యాన్ని సృజనాత్మకంగా అన్వయించి మంచి ఫలితాలు సాధించగలగాలి. ఈ విషయంలో ఎప్పుడూ వెనకబడిపోలేదు అపర్ణ అయ్యర్. ఇంటర్నల్ ఆడిట్, బిజినెస్ ఫైనాన్స్, ఫైనాల్సియల్ ప్లానింగ్ అండ్ ఎనాలటిక్స్, కార్పోరేట్ ట్రెజరీ....ఇలా కంపెనీకి సంబంధించి ఎన్నో విభాగాలో కీలకపాత్ర పోషించింది. ముంబై నర్సీ మోంజీ కాలేజి నుంచి కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసిన అపర్ణ 2002 సీఏ (చార్టెట్ ఎకౌంటెంట్) గోల్డ్ మెడలిస్ట్. ‘అపర్ణ అయ్యర్‌లో అద్భుతమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. తన ముందుచూపు, సాహసోపేతమైన నిర్ణయాలతో సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది’ అంటున్నాడు విప్రో సీయివో డెలాపోర్ట్. ‘కీలకమైన సమయంలో సీఎఫ్‌వోగా బాధ్యతలు స్వీకరిస్తున్నందుకు సంతోషంగా ఉంది. మరిన్ని విజయాలు సాధించే లక్ష్యంతో మా ప్రయాణం కొనసాగుతుంది’ అంటుంది అపర్ణ అయ్యర్. -
విప్రో సీఎఫ్‌వోగా అపర్ణ అయ్యర్.. గోల్డ్ మెడల్ సీఏ ఈమె..
భారత ప్రముఖ ఐటీ సేవల దిగ్గజం విప్రో (Wipro) చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO)గా అపర్ణ అయ్యర్ (Aparna Iyer) నియమితులయ్యారు. ఇప్పటి వరకూ సీఎఫ్‌వోగా ఉన్న జతిన్ దలాల్ సెప్టెంబర్ 21న తన పదవికి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో అపర్ణ అయ్యర్‌ను విప్రో నియమించింది. అపర్ణ అయ్యర్ 20 ఏళ్లుగా విప్రోలో పనిచేస్తున్నారు. 2003లో చేరినప్పటి నుంచి కంపెనీకి వివిధ సీనియర్ స్థానాల్లో సేవలందించారు. సీనియర్ ఇంటర్నల్ ఆడిటర్‌గా విప్రోలో ఆమె ప్రయాణం ప్రారంభమైంది. (ఈ కంపెనీల్లో సంతోషంగా ఉద్యోగులు.. టాప్ 20 లిస్ట్! ఐటీ కంపెనీలదే హవా..) రెండు దశాబ్దాలకు పైగా కాలంలో అయ్యర్ విప్రో సంస్థలో కీలకమైన నాయకత్వ స్థానాలను నిర్వహించి అంచెలంచెలుగా ఎదిగారు. ఇటీవల ఆమె విప్రో క్లౌడ్ సర్వీసెస్ యూనిట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, సీజీవోగా బాధ్యతలు నిర్వహించారు. ఇంటర్నల్ ఆడిట్, బిజినెస్ ఫైనాన్స్, ఫైనాన్స్ ప్లానింగ్ అండ్ అనాలిసిస్, కార్పొరేట్ ట్రెజరీ, ఇన్వెస్టర్ రిలేషన్స్ వంటి ఆర్థిక సంబంధమైన అంశాల్లో విశేషమైన నైపుణ్యం ఉన్న అపర్ణ అయ్యర్ ఆయా అంశాల్లో పలు కీలక పోస్టులను నిర్వహించారు. అపర్ణ అయ్యర్ క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్, సీఏ 2002 బ్యాచ్‌లో గోల్డ్ మెడల్ విజేతగా గుర్తింపు పొందారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI)లో చేరడానికి ముందు అయ్యర్ 2001లో ముంబైలోని నర్సీ మోంజీ నుంచి కామర్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీని పూర్తి చేశారు. (Tech Jobs: టెక్ ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్.. ఇక రానున్నవి మంచి రోజులే..!) “నిష్ణాతురాలైన అపర్ణ ఫలితాలతో నడిచే లీడర్. విప్రోతో తన 20 ఏళ్ల కెరీర్లో ఆమె మా బిజినెస్ లీడర్లకు డైనమిక్, ఫార్వర్డ్ థింకింగ్ వ్యూహాత్మక భాగస్వామిగా ఉన్నారు” అని విప్రో లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ థియరీ డెలాపోర్టే అన్నారు. విప్రో సీఎఫ్ఓగా నియమితులైన తర్వాత అపర్ణ అయ్యర్ మాట్లాడుతూ "విప్రోకి ఈ ముఖ్యమైన తరుణంలో సీఎఫ్ఓ బాధ్యతలను స్వీకరించడం చాలా ఆనందంగా ఉంది. కంపెనీని స్థిరమైన వృద్ధివైపు నడిపించడానికి, వాటాదారులకు విలువను సృష్టించడానికి సీఈవో థియరీతో, మా ఫైనాన్స్ బృందం, మొత్తం సంస్థతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అని పేర్కొన్నారు. -
విప్రో సీఎఫ్ఓ జతిన్ దలాల్ రాజీనామా - ఆ స్థానంలో అపర్ణ అయ్యర్
విప్రో (Wipro) కంపెనీలో దాదాపు 20 సంవత్సరాలుగా ఫైనాన్సియల్ చీఫ్ ఆఫీసర్‌గా (CFO) సేవలందించిన జతిన్ దలాల్ గురువారం రాజీనామా చేసినట్లు తెలిసింది. ఈ స్థానంలోకి కంపెనీలో రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్న 'అపర్ణ అయ్యర్'ను నియమిస్తున్నట్లు.. సెప్టెంబర్ 22నుంచి పదవి బాధ్యతలు స్వీకరించనున్నట్లు కంపెనీ తెలిపింది. గత కొన్ని సంవత్సరాలుగా ఫైనాన్స్ ట్రాన్స్ఫర్మేషన్ అపర్ణ ఇప్పుడు కొత్త బాధ్యతలు చేపట్టనుంది. గత రెండు దశాబ్దాలుగా నాకు కంపెనీలో అవకాశం కల్పించినందుకు విప్రోకు కృతజ్ఞతలు తెలుపుతూ.. నా వృత్తిపరమైన లక్ష్యాలను కొనసాగించడానికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించాడు. ఇదీ చదవండి: ప్రపంచం భారత్ వైపు చూసేలా.. హ్యాపీనెస్ ర్యాంకింగ్‌లో ఇండియన్ ఎంప్లాయిస్.. 2022లో ట్రెజరీ మేనేజర్‌గా చేరిన దలాల్ అప్పటి నుంచి సీనియర్ మేనేజర్, ఇన్వెస్టర్ రిలేషన్స్, CFO - యూరప్, గ్లోబల్ హెడ్ ఆఫ్ ఫైనాన్స్, IT ఫైనాన్స్ మేనేజర్ అండ్ హెడ్ వంటి అనేక పదవుల్లో కొనసాగారు. కంపెనీ ఉన్నతిలో జతిన్ దలాల్ పాత్ర ఆమోఘనీయం అని పలువురు అభినందించారు. -
టెస్లాలో కీలక పదవికి భారత సంతతికి చెందిన వైభవ్ తనేజా, ఆసక్తికర విషయాలు
Tesla new Indian-origin CFO VaibhavTaneja ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్ అధీనంలోని ఆటో మేజర్ టెస్లాకు సీఎఫ్‌వోగా భారత సంతతికి చెందిన వ్యక్తి నియమితులయ్యారు. జాచరీ కిర్‌ఖోర్న్ స్థానంలో భారతీయ సంతతికి చెందిన అకౌంటింగ్ హెడ్ వైభవ్ తనేజాను నియమించినట్లు సంస్థ ప్రకటించింది. తనేజా ఢిల్లీ యూనివర్సిటీ నుండి కామర్స్ గ్రాడ్యుయేట్. రెండు దశాబ్దాలకు పైగా అకౌంటింగ్ అనుభవం ఉంది.దీంతోపాటుటెక్నాలజీ ఫైనాన్స్, రిటైల్, టెలికమ్యూనికేషన్స్‌లో పలు బహుళజాతి కంపెనీలతో కలిసి పనిచేసిన అనుభవం వైభవ్ సొంతం. (నిన్న బియ్యం ఎగుమతులపై నిషేధం: నెక్ట్స్ ఏంటో తెలిస్తే..!) అమెరికన్ ఆటోమొబైల్ మేజర్ టెస్లాలో ప్రస్తుతం చీఫ్ అకౌంటింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న వైభవ్ తనేజాకు అదనపు బాధ్యతగా సీఎఫ్‌వో బాధ్యతలు అప్పగించారు.అయితే ఈ మార్పునకు గల కారణాలను కంపెనీ అధికారికంగా ప్రకటించారు. కానీ సజావుగా పరివర్తనను నిర్ధారించేందుకుగాను సంవత్సరం చివరి వరకు అతని స్థానంలో ఉంటారని ఈ ఏడాది చివరి వరకు జాచరీ కిర్ఖోర్న్ఈ పదవిలో కొనసాగుతారని తెలుస్తోంది. "మాస్టర్ ఆఫ్ కాయిన్" గా పాపులర్ అయిన వైభవ తనేజా గురించి ఆసక్తికర విషయాలు: ఎవరీ వైభవ్ ♦ వైభవ్ తనేజా 2017లో టెస్లాలో చేరారు, 2016లో టెస్లా కొనుగోలు చేసిన సోలార్ ఎనర్జీ కంపెనీ అనుబంధ సంస్థ సోలార్‌సిటీలో వైస్ ప్రెసిడెంట్‌గా , తరువాత కార్పొరేట్ కంట్రోలర్‌గా పనిచేశారు. 2016లో దీన్ని టెస్లా టేకోవర్ చేసింది. ఈ విలీనంలోరెండు కంపెనీల అకౌంటింగ్ బృందాల విజయవంతమైన ఏకీకరణకు కూడా నాయకత్వం వహించారు. వైభవ్ మార్చి 2019 నుండి టెస్లా సీఏవోగా పనిచేస్తున్నారు. అలాగే మే 2018 నుండి కంపెనీ కార్పొరేట్ కంట్రోలర్‌గా కూడా పనిచేస్తున్నారు. (అయ్యయ్యో..దుబాయ్ అతిపెద్ద జెయింట్ వీల్ ఆగిపోయింది) ♦ 13 సంవత్సరాలు పాటు సంస్థకు సేవలందించిన జాచరీ కిర్‌ఖోర్న్ స్థానంలో వైభవ్ తనేజాకొత్త సీఎఫ్‌వోగా ఎంపికయ్యారు. ♦ టెస్లా త్రైమాసిక ఆదాయాలు , అమెరికా, అంతర్జాతీయ నియంత్రణపై తనేజా మాజీ సీఎఫ్ఓలు దీపక్ అహుజా , జాచరీ కిర్ఖోర్న్లకు సన్నిహితుడు. ♦ తనేజా జనవరి 2021లో టెస్లా ఇండియన్ ఆర్మ్, టెస్లా ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్‌కి డైరెక్టర్‌గా కూడా నియమితులయ్యారు. కాగా భారత మార్కెట్లో ఎగుమతి రెండింటి కోసం టెస్లా ప్రస్తుత ఎంట్రీ మోడల్ కంటే దాదాపు 25శాతం తక్కువ ధరతో ఎలక్ట్రిక్ వెహికల్ (EV)ని ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీని భారతదేశంలో నిర్మించాలని టెస్లా భారీ ప్రయత్నాలే చేస్తోంది. ఈ వార్తల మధ్య ఈ నియామకం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనికి తోడు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఇటీవల టెస్లా సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లతో సమావేశమైనట్టు తెలుస్తోంది. టెస్లా సీనియర్ పబ్లిక్ పాలసీ , బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ రోహన్ పటేల్, సప్లై చైన్ వైస్ ప్రెసిడెంట్ రోషన్ థామస్‌తో భేటీ అయ్యారు. -
కంపెనీ సీఈవో కాదు, అయినా రోజుకు నాలుగు లక్షల జీతం
Tata Steel CFO Koushik Chatterjee: కొడితో కొట్టాలి..సిక్స్ కొట్టాలి... అన్నట్టు ఏదైనా టాప్ కంపెనీలో జాబ్ కొట్టాలి. లక్షల్లో ప్యాకేజీ అందుకోవాలి..ఇదేగా కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ప్రతీవారి కల. కానీ కంపెనీలో టాప్ పొజిషన్ కాకపోయినా, టాప్ శాలరీ అందుకోవడం విశేషం కదా మరి. అలా రతన్ టాటా నేతృత్వంలోని టాటా గ్రూపు ఉద్యోగి ఒకరు రోజుకు ఏకంగా లక్షల్లో సంపాదిస్తున్నారు. టాటా స్టీల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సీఎఫ్‌వో కౌశిక్ ఛటర్జీ. టాటా గ్రూప్‌లో అత్యధిక వేతనం పొందుతున్న చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్లలో కౌశిక్ ఒకరు. రూ. 1,43,175 కోట్ల మార్కెట్ క్యాప్ ఫ్లాగ్షిప్ కంపెనీకి ఆర్థిక వ్యవహారాల విభాగానికి ఇన్చార్జ్గా ఉన్నాడు.టాటా స్టీల్ వార్షిక నివేదిక ప్రకారం ఛటర్జీ ఇప్పటికీ రూ. 14,21,18,000 (రూ. 14.21 కోట్లు) తీసుకున్నారు. అంటే రోజుకు రూ.3.89 లక్షలకు పైగా ఆదాయం వస్తుంది. అయితే ఇటీవల టాటా మోటార్స్‌కు చెందిన పీబీ బజాలీ, ఛటర్జీని అధిగమించారు. గత ఏడాదితో పోల్చితే వేతనంలో ఈ ఏడాది స్వల్పంగా తగ్గినప్పటకీ 15,17,18,000 (రూ. 15.17 కోట్లు) అందుకున్నారు. అలాగే 2023లో ఛటర్జీతో పోలిస్తే టాటా స్టీల్‌లో రూ. 18.66 కోట్లతో సీఈఓ టీవీ నరేంద్రన్‌కు మాత్రమే ఎక్కువ వేతనం అందుకోవడం గమనార్హం. (మళ్లీ పరుగందుకున్న పసిడి, వెండి అయితే ఏకంగా) టాటా గ్రూప్‌లో పని చేయడానికి ముందు, కౌశిక్ బ్రిటానియా ఇండస్ట్రీస్, ఆడిట్ కంపెనీ ఎస్బీ బిల్లిమోరియా కంపెనీల్లో పనిచేశారు. కేవలం 36 సంవత్సరాల వయస్సులో, కౌశిక్ 2006లో టాటా స్టీల్‌లో VP ఫైనాన్స్ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. అతను 2012 నుండి సీఎఫ్‌వోగా ఉన్నారు. ఛటర్జీ జనవరి 1, 2023 నుండి 3 సంవత్సరాల కాలానికి IFRS ఫౌండేషన్ ఆరు కొత్త ట్రస్టీలలో ఒకరిగా నియమితులయ్యారు. అతను సలహా సభ్యునిగా కూడా ఉన్నారు. భారీ సంపాదన ఉన్నప్పటికీ చాలా నిడాడంబరమైన జీవిన శైలితో కౌశిక్ ఛటర్జీ కూల్ అండ్ కంపోజ్డ్ పర్సన్ అని సహోద్యోగులు భావిస్తారు. కౌశిక్ పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్లోని సెయింట్ పాట్రిక్స్ పాఠశాల నుండి పాఠశాల విద్యను, కోలకతాలో బీకాం డిగ్రీని సాధించారు. ఆ తరువాత చార్టర్డ్ అకౌంటెంట్ గా పనిచేశారు. -
ఎస్బీఐకు కొత్త సీఎఫ్‌వోగా కొడవంటి కామేశ్వర రావు ఎంపిక
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ కొత్త సీఎఫ్‌వోగా కొడవంటి కామేశ్వర రావును ఎంపిక చేసినట్లు తాజాగా పేర్కొంది. 1991 నుంచి బ్యాంకులో విధులు నిర్వహిస్తున్న కామేశ్వర రావు 2023 జూలై 1నుంచి సీఎఫ్‌వోగా బాధ్యతలు చేపట్టినట్లు తెలియజేసింది. సీఎఫ్‌వోగా రాజీనామా చేసిన చరణ్‌జిత్ సురీందర్ సింగ్ అత్రా స్థానే కామేశ్వర రావును నియమించినట్లు వెల్లడించింది. చార్టెర్డ్ అకౌంటెంట్ అయిన కామేశ్వర రావు బ్యాంకింగ్, ఫారెక్స్, ఫైనాన్స్, అకౌంటింగ్ విభాగాలలో విధులు నిర్వర్తించినట్లు స్టాక్ ఎక్సే్ఛంజీలకు ఎస్బీఐ తెలియజేసింది. మరోవైపు, చిన్న వ్యాపారాలు చేసుకునే కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా ఎస్బీఐ 34 ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్ హబ్‌లను ఏర్పాటు చేసింది. వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా 21 జిల్లా కేంద్రాల్లో వీటిని నెలకొల్పినట్లు ఎస్బీఐ తెలి పింది. ప్రీ–లాంచ్‌లో ఈ కేంద్రాల్లో రూ. 1,000 కోట్ల డిపాజిట్లు సేకరించినట్లు వివరించింది. -
డాక్టర్ రెడ్డీస్ లాభం 959 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (డీఆర్ఎల్) గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 959 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో నమోదైన లాభం రూ. 87.5 కోట్లతో పోలిస్తే ఇది 996 శాతం అధికం. లో బేస్ ప్రభావం ఇందుకు కారణం. ఇక సమీక్షాకాలంలో ఆదాయం 25 శాతం పెరిగి రూ. 5,437 కోట్ల నుంచి రూ. 6,297 కోట్లకు చేరింది. ఆదాయాలు, లాభాల వృద్ధిపరంగా ఇది తమకు రికార్డు సంవత్సరమని కంపెనీ సహ–చైర్మన్ జీవీ ప్రసాద్ పేర్కొన్నారు. ఉత్తర అమెరికా,యూరప్, భారత మార్కెట్లు పటిష్టంగా ఉండటం ఇందుకు దోహదపడిందని బుధవారం ఆర్థిక ఫలితాల ప్రకటన సందర్భంగా విలేకరుల సమావేశంలో పాల్గొన్న కంపెనీ సీఎఫ్‌వో పరాగ్ అగర్వాల్ తెలిపారు. కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం, అన్ని వ్యాపార విభాగాలు పుంజుకోవడం తదితర అంశాలు ఆదాయ వృద్ధికి తోడ్పడ్డాయని ఆయన వివరించారు. ప్రస్తుతం కంపెనీ వద్ద రూ. 5,000 కోట్ల మిగులు నిధులు ఉన్నట్లు చెప్పారు. తాజా ఆర్థిక సంవత్సరంలోనూ కొత్త ఉత్పత్తులు, ఉత్పాదకతను పెంచుకోవడంపై మరింతగా దృష్టి పెట్టనున్నట్లు సంస్థ సీఈవో ఎరెజ్ ఇజ్రేలీ చెప్పారు. పూర్తి ఆర్థిక సంవత్సరానికి సంస్థ బోర్డు షేరు ఒక్కింటికి రూ. 40 చొప్పున తుది డివిడెండ్‌ను ప్రతిపాదించింది. ఫలితాలకు సంబంధించి మరిన్ని వివరాలు .. ► గ్లోబల్ జనరిక్స్ విభాగం ఆదాయాలు క్యూ4లో 18 శాతం పెరిగి రూ. 5,426 కోట్లకు చేరాయి. కీలకమైన ఉత్తర అమెరికా మార్కెట్లో ఆదాయం 27 శాతం పెరిగి రూ. 2,532 కోట్లుగా నమోదైంది. ఉత్తర అమెరికా మార్కెట్లో నాలుగో త్రైమాసికంలో ఆరు కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టగా, పూర్తి ఆర్థిక సంవత్సరంలో 25 ఔషధాలను ఆవిష్కరించింది. ► భారత్‌లో అమ్మకాలు 32 శాతం పెరిగి రూ. 1,283 కోట్లకు చేరాయి. ప్రస్తుత ఉత్పత్తుల ధరల్లో పెరుగుదలతో పాటు కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం ద్వారా అదనపు ఆదాయం సమకూరింది. ► యూరప్ మార్కెట్ ఆదాయాలు 12% పెరిగి రూ. 496 కోట్లకు, వర్ధమాన మార్కెట్లలో ఆదాయం 7% క్షీణించి రూ. 1,114 కోట్లుగా నమోదైంది. ► ఫార్మా సర్వీసులు, యాక్టివ్ ఇంగ్రీడియెంట్స్ (పీఎస్‌ఏఐ) విభాగం మూడు శాతం పెరిగి రూ. 756 కోట్ల నుంచి రూ. 778 కోట్లకు చేరాయి. ► పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆదాయం రూ. 21,439 కోట్ల నుంచి 15% వృద్ధితో రూ.24,588 కోట్లకు చేరింది. లాభం రూ. 2,357 కోట్ల నుంచి 91% ఎగిసి రూ.4,507 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో పరిశోధన, అభివృద్ధి కార్య కలాపాలపై రూ.1,940 కోట్లు వెచ్చించింది. ఈసారి మొత్తం అమ్మకాల్లో 8–9% వెచ్చించనుంది. -
చిప్‌ల కొరతతో ఉత్పత్తిపై ప్రభావం
న్యూఢిల్లీ: సెమీకండక్టర్ల కొరత ఇంకా కొనసాగుతూనే ఉందని, చిప్‌ల సరఫరాపైనా అనిశ్చితి నెలకొనే ఉందని ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా సీఎఫ్‌వో అజయ్ సేఠ్ తెలిపారు. ఫలితంగా కార్ల ఉత్పత్తిపై ప్రభావం పడుతోందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న ఎలక్ట్రానిక్ విడిభాగాలతోనే గరిష్ట స్థాయిలో ఉత్పత్తిని పెంచుకునేందుకు కంపెనీ ప్రయత్నాలు చేస్తోందని అజయ్ వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంతో పోలిస్తే మూడో క్వార్టర్లో సరఫరా కొంత మెరుగుపడినప్పటికీ .. ఇంకా పరిస్థితి పూర్తిగా చక్కబడకపోవడంతో డిసెంబర్ క్వార్టర్లో మారుతీ 46,000 పైచిలుకు వాహనాలను ఉత్పత్తి చేయలేకపోయింది. మూడో త్రైమాసికం ఆఖరు నాటికి మారుతీ దగ్గర 3.63 లక్షల వాహనాలకు ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం కంపెనీకి ఉన్న రెండు ప్లాంట్లకు (మానేసర్, గురుగ్రామ్) మొత్తం 15 లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంది. మరోవైపు, కొత్తగా ప్రవేశపెడుతున్న జిమ్నీ, ఫ్రాంక్స్ వాహనాల ద్వారా స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల విభాగంలో లీడర్‌గా ఎదగాలని భావిస్తున్నట్లు అజయ్ చెప్పారు. అటు అమ్మకాలపరంగా చూస్తే పరిశ్రమను మించే స్థాయిలోనే తమ సంస్థ విక్రయాల వృద్ధి ఉండగలదని భావిస్తున్నట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (కార్పొరేట్ అఫైర్స్) రాహుల్ భారతీ తెలిపారు. మూడో క్వార్టర్లో మారుతీ సుజుకీ ఇండియా మొత్తం 4,65,911 వాహనాలను విక్రయించింది. ఆదాయం రూ. 22,188 కోట్ల నుంచి రూ. 27,849 కోట్లకు, లాభం రెండు రెట్లు పెరిగి రూ. 2,351 కోట్లకు పెరిగింది. -
భారత్‌పే సీఈఓ పదవికి సుహైల్ సమీర్ రాజీనామా
ఫిన్ టెక్ దిగ్గజం భారత్‌పేలోని పరిణామాలు మరోసారి చర్చకు దారి తీశాయి. గత సంవత్సరం సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్‌ను తొలగించినప్పటి నుండి కంపెనీ కార్యకలాపాలను పట్టించుకోలేదనే కారణంగా సీఈవో సుహైల్ సమీర్‌ను తొలగించేందుకు ఆ సంస్థ యాజమాన్యం సిద్ధమైంది. సీఈవో పదవి నుంచి తప్పించి సమీర్‌కు చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ ఈ పదవిని కట్టబెట్టనుంది. జనవరి 7నుండి సీఎఫ్ఓ బాధ్యతలు చేపట్టనున్నట్లు భారత్‌పే ప్రకటించింది. ఇక ప్రస్తుత సీఎఫ్ఓ నలిన్ నేగీ తాత్కాలిక సీఈగా విధులు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా భారత్‌పే బోర్డు ఛైర్మన్ రజనీష్ కుమార్ మాట్లాడుతూ, సమీర్ తన అద్భుతమైన సహకారం అందించినందుకు,వివిధ సవాళ్లను అధిగమించడంలో కంపెనీకి సహాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్బీఐ కార్డ్‌లో సీఎఫ్ఓగా నేగి గతేడాది ఆగస్ట్‌లో భారత్‌పేలో చేరారు. గతంలో అయనకు సుమారు 10 సంవత్సరాల పాటు ఎస్బీఐ కార్డ్‌లలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. వరుస రాజీనామాలు భారత్‌పే సంస్థలో గత కొద్దికాలంగా జరుగుతున్న వరుస ఘటనలతో నెలల వ్యవధిలో అనేక మంది సీనియర్ స్థాయి ఉద్యోగులు రాజీనామాలు చేశారు. వారిలో ఇటీవల, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ విజయ్ అగర్వాల్, పోస్ట్‌పే హెడ్ నెహుల్ మల్హోత్రా, లెండింగ్- కన్స్యూమర్ ప్రొడక్ట్స్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ రజత్ జైన్ సహా ముగ్గురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు కంపెనీకి రాజీనామా చేశారు. -
నైకా సీఎఫ్‌వో అరవింద్ రాజీనామా
న్యూఢిల్లీ: నైకా బ్రాండ్ కింద కార్యకలాపాలు సాగిస్తున్న ఎఫ్ఎస్ఎన్ ఈ–కామర్స్ వెంచర్స్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో) అరవింద్ అగర్వాల్ రాజీనామా చేశారు. డిజిటల్ ఎకానమీ, స్టార్టప్ విభాగంలో అవకాశాలపై దృష్టి పెట్టేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. కొత్త సీఎఫ్‌వో నియామకం ప్రక్రియపై కసరత్తు చేస్తున్నట్లు పేర్కొంది. 2020 జూలైలో అగర్వాల్ అమెజాన్ నుండి నైకాలో చేరారు. కంపెనీ ఐపీవోను పర్యవేక్షించిన కీలక సిబ్బందిలో (కేఎంపీ) ఆయన కూడా ఒకరు. -
ఐషర్ సీఎఫ్‌వోగా విద్య శ్రీనివాసన్
న్యూఢిల్లీ: ఐషర్ మోటార్స్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా విద్య శ్రీనివాసన్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఆమె బాటా ఇండియా ఫైనాన్స్ డైరెక్టర్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించారు. చార్టర్డ్ అకౌంటెంట్ అయిన ఆమెకు ఫైనాన్స్, స్ట్రాటజీ, బిజినెస్ ప్లానింగ్, లీగల్, కమర్షియల్ కార్యకలాపాల్లో 24 సంవత్సరాలకుపైగా అనుభవం ఉంది. ప్యూమా స్పోర్ట్స్ ఇండియా, ఆదిత్య బిర్లా, గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ వంటి సంస్థల్లోనూ పనిచేశారు. చదవండి: భారత్‌లో వన్ అండ్ ఓన్లీ గుర్తింపు.. మారుతీ సుజుకీ సొంతం! -
అటు భారీ నష్టాలు,ఇటు సీఎఫ్‌వో గుడ్‌బై, కుప్పకూలిన షేర్లు
బెంగళూరు: ఆర్థిక సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్న స్పైస్‌జెట్‌కు మరోషాక్ తగిలింది. ఒకవైపు భారీ స్థాయిలో ఈ త్రైమాసికంలో నష్టాలు, మరోవైపు సంస్థ సీఎఫ్‌వో రాజీనామా చేయడంతో గురువారం నాటి మార్కెట్లో స్పైస్‌జెట్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఫలితంగా దాదాపు 15 శాతం కుప్పకూలాయి. ఇది ఇలా ఉండగా గురువారం ఉదయం ఆటోపైలట్ స్నాగ్ కారణంగా ఢిల్లీ-నాసిక్ స్పైస్‌జెట్ విమానాన్ని వెనక్కి మళ్లించిన ఘటన చోటు చేసుకుంది. ఇదీ చదవండి: చెక్ బౌన్స్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు ఇంధన ధరల భారం, దేశీయ కరెన్సీ రూపాయిక్షీణత, స్పైస్‌జెట్ లిమిటెడ్ భారీ నష్టాన్ని నమోదు చేసింది. మరోవైపు సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సంజీవ్ తనేజా రాజీనామా చేసినట్లు ప్రకటించడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంటు దెబ్బతింది. షేర్లు గురువారం ఆరంభంలో 14.7 శాతం నష్టపోయాయి. పెరుగుతున్న నష్టాలు, ఇటీవలి కాలంలో మిడ్-ఎయిర్ సంఘటనల మధ్య సంజీవ్ రాజీనామా చేసినట్లు తెలిపింది. (SpiceJet: స్పైస్‌జెట్ విమానంలో సమస్య: మధ్యలోనే వెనక్కి) కాగా జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర నష్టం రూ. 789 కోట్లకు పెరిగిందని, ప్రధానంగా అధిక ఇంధన ధరలు, రూపాయి క్షీణత కారణంగా నష్టాలొచ్చాయని బడ్జెట్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. ఏడాది క్రితం కాలంలో రూ. 235.3 కోట్ల నికర నష్టాన్ని నివేదించింది. మార్చి 2022తో ముగిసిన త్రైమాసికంలో రూ. 458 కోట్ల నికర నష్టం వచ్చినట్టు వెల్లడించిది. అయితే సైబర్ సెక్యూరిటీ దాడి కారణంగా ఆలస్యమైందని కంపెనీ పేర్కొంది. అంతేకాదు నగదు సంక్షోభంలో చిక్కుకున్న సంస్థ అద్దెదారులకు సకాలంలో చెల్లింపులు చేయలేక ఇబ్బందులు పడుతోంది, కొంతమంది తమ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు వరుసగా రెండో నెలలో కూడా జీతాలు చెల్లింపు ఆలస్యమైందని ఉద్యోగులు ఆరోపిస్తుండగా, చెల్లింపులు "గ్రేడెడ్ ఫార్మాట్"లో జరుగుతున్నాయని స్సైస్‌జెట్ వివరణ ఇచ్చింది. -
రిపబ్లిక్ టీవీ సీఎఫ్ఓకు సమన్లు
ముంబై: ముంబైలో వెలుగు చూసిన టెలివిజన్ రేటింగ్ పాయింట్స్(టీఆర్పీ) స్కామ్‌కు సంబంధించి ‘రిపబ్లిక్ టీవీ’ సీఎఫ్ఓ సుందరానికి పోలీసులు శుక్రవారం సమన్లు జారీ చేశారు. అక్టోబర్ 10న విచారణకు హాజరు కావాలన్నారు. ఈ స్కామ్‌లో రిపబ్లిక్‌తో పాటు మరో 2 మరాఠీ చానళ్ల పాత్రపై దర్యాప్తు జరుపుతున్నట్లు ముంబై పోలీసులు తెలిపారు. వినియోగదారులతో ఒప్పందాలు ముంబైలో టీఆర్పీల నిర్వహణను హంస అనే ఎజెన్సీ చూస్తోంది. ఆ సంస్థ మాజీ ఉద్యోగుల సాయంతో, వినియోగదారులకు డబ్బులు ఇచ్చి, తమ చానళ్లనే చూడాలని, చూడకపోయినా తమ చానెళ్లనే ఆన్‌లో ఉంచాలని ఒప్పందం కుదుర్చుకుంటారు. అలా ఎంపిక చేసిన చానళ్లను నిర్ధిష్ట సమయంలో చూసినందుకు నెలవారీ కొంత డబ్బు ఇస్తామని చెప్పడం వల్ల ఒప్పుకున్నానని ఒక వినియోగదారుడు చెప్పారు. ఇందులో రిపబ్లిక్ చానల్‌తో పాటు రెండు మరాఠీ చానెళ్లు కూడా ఉన్నాయి స్టాండింగ్ కమిటీ ముందుకు! టీఆర్పీ స్కామ్ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం.. పార్లమెంటరీ కమిటీ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చీఫ్ శశి థరూర్‌కు లేఖ రాశారు. ఒక జాతీయ వార్తా చానల్ సహా 3 చానళ్లు ఈ స్కామ్‌లో ఉన్నట్లు పోలీసులు ఆరోపిస్తున్నారని, అందువల్ల తదుపరి కమిటీ మీటింగ్‌లో ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కార్తి చిదంబరం ఆ లేఖలో కోరారు. -
కాగ్నిజెంట్ క్యూ2 వీక్- కొత్త సీఎఫ్‌వో ఎంపిక
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020) రెండో త్రైమాసికంలో సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం కాగ్నిజెంట్ టెక్నాలజీస్ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. అంతేకాకుండా కోవిడ్-19 నేపథ్యంలో 2020 పూర్తి ఏడాదికి ఆదాయ అంచనాల(గైడెన్స్)ను సైతం కుదించింది. క్యూ2(ఏప్రిల్-జూన్)లో కంపెనీ నికర లాభం 29 శాతం క్షీణించి 36.1 కోట్ల డాలర్లకు పరిమితమైంది. వార్షిక ప్రాతిపదికన మొత్తం ఆదాయం మాత్రం 3.4 శాతం తక్కువగా 4 బిలియన్ డాలర్లకు చేరింది. కరోనా వైరస్‌తోపాటు ఇతర రాన్సమ్వేర్ సమస్యలతో క్యూ2 పనితీరు బలహీనపడినట్లు కంపెనీ పేర్కొంది. జాన్ సిగ్మండ్ సెప్టెంబర్ 1 నుంచి కంపెనీ సీఎఫ్‌వోగా జాన్ సిగ్మండ్ బాధ్యతలు స్వీకరించనున్నట్లు కాగ్నిజెంట్ టెక్నాలజీస్ తాజాగా వెల్లడించింది. ప్రస్తుత సీఎఫ్‌వో కరెన్ మెక్లాఫ్లిన్ ఆగస్ట్ చివరివరకూ పదవిలో కొనసాగుతారని, తదుపరి కంపెనీ సలహాదారుగా సేవలందిస్తారని తెలియజేసింది. 17ఏళ్లపాటు సేవలు అందించిన కరెన్ పదవీ విరమణ చేయనున్నట్లు తెలియజేసింది. సిగ్మండ్ ఇటీవల ఆటోమాటిక్ డేటా ప్రాసెసింగ్ కంపెనీకి సీఎఫ్‌వోగా వ్యవహరించారు. కాగా.. కాగ్నిజెంట్ ఇండియా కంట్రీ ఎండీగా వ్యవహరించిన రామ్‌కుమార్ రమణమూర్తి, గ్లోబల్ డెలివరీ హెడ్‌గా బాధ్యతలు నిర్వహించిన ప్రదీప్ షిలీజీ ఇటీవల కంపెనీ నుంచి వైదొలగిన విషయం విదితమే. 2-0.5 శాతం డౌన్ 2020 పూర్తి ఏడాదిలో కంపెనీ ఆదాయం 16.4-16.7 బిలియన్ డాలర్ల స్థాయిలో నమోదుకావచ్చని కాగ్నిజెంట్ తాజాగా అంచనా వేసింది. ఇది 2-0.5 శాతం క్షీణతకాగా.. కొన్ని కంటెంట్ సంబంధ సర్వీసుల నుంచి వైదొలగడం వల్ల 1.1 శాతంమేర మార్జిన్లపై ప్రతికూల ప్రభావం పడవచ్చని పేర్కొంది. విదేశీ మారక ప్రభావం సైతం 0.2 శాతంమేర ప్రతిఫలించవచ్చని అభిప్రాయపడింది. నిర్వహణ మార్జిన్లు 15.1 శాతం నుంచి 14.1 శాతానికి నీరసించాయి. డిజిటల్ జోరు మొత్తం ఆదాయంలో డిజిటల్ విభాగం వాటా పెరుగుతున్నట్లు కాగ్నిజెంట్ తెలియజేసింది. క్యూ2లో 14 శాతం వృద్ధి చూపగా.. మొత్తం ఆదాయంలో 42 శాతం వాటాను ఆక్రమించినట్లు వివరించింది. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో 50 శాతం అధికంగా బుకింగ్స్ సాధించినట్లు తెలియజేసింది. ఇందుకు డిజిటల్ ఇంజినీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) విభాగాలు ప్రధానంగా సహకరించినట్లు పేర్కొంది. -
చైర్మన్ కంటే మూడు రెట్లు అధిక వేతనం
న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద బ్యాంకు, ప్రభుత్వరంగంలోని ఎస్బీఐ నూతన సీఎఫ్‌వో నియామకానికి అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. మూడేళ్ల కాలానికి కాంట్రాక్టు విధానంపై నియమించుకోనుంది. రూ.కోటి వేతన ప్యాకేజీ ఇవ్వనున్నది. అన్ని రకాల వ్యయాలు కలసి (సీటీసీ) రూ.75 లక్షల నుంచి రూ.కోటి మధ్య ఉండనున్నాయి. అయితే, ఎస్బీఐ చైర్మన్‌కు 2018–19లో ఇచ్చిన పారితోషికం కేవలం రూ.29.5 లక్షలు కాగా, దాంతో పోలిస్తే సీఎఫ్‌వోకు మూడు రెట్లు అధికంగా ఆఫర్ ఇవ్వడం ఆసక్తికరం. ప్రస్తుతం ఎస్బీఐ సీఎఫ్‌వోగా చలసాని వెంకట్ నాగేశ్వర్ పనిచేస్తున్నారు.(చెక్ బౌన్స్ నేరం... ఇక క్రిమినల్ కాదు!!) -
ఫ్లిప్‌కార్ట్‌కు కీలక ఎగ్జిక్యూటివ్ గుడ్ బై
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌కు కీలక ఎగ్జిక్యూటివ్ గుడ్ బై చెప్పారు. దీంతో సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా శ్రీరామ్ వెంకటరమణను నియమించినట్లు వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్‌కార్ట్ మంగళవారం ప్రకటించింది. ఈ నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపింది. (లాక్డౌన్ 3.0 : ఈ కామర్స్ కంపెనీలకు ఊరట) సెప్టెంబర్ 2018 నుండి ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఎఫ్ఓగా ఉన్న ఎమిలీ మెక్నీల్ తన పదవికి రాజీనామా చేశారు. వాల్‌మార్ట్ గ్రూప్ వెలుపల మెరుగైన కెరీర్ అవకాశాల కోసం అమెరికాకు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో తాజా పరిణామం చోటుకుంది. ఫ్లిప్‌కార్ట్‌లో సీఎఫ్ఓ, సీవోవోగా పనిచేసిన వెంకట రమణ ఇప్పుడు వాల్‌మార్ట్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, సీఎఫ్ఓక్రిస్ నికోలస్‌కు రిపోర్టు చేయాల్సి వుంటుంది. ఫ్లిప్‌కార్ట్ కామర్స్ (ఫ్లిప్‌కార్ట్, మింత్రా) సీఎఫ్ఓ శ్రీరామ్ పన్ను, రిస్క్ మేనేజ్మెంట్, ట్రెజరీతో సహా ఫ్లిప్‌కార్ట్, మింత్రాకు సంబంధించి కీలకమైన ఫైనాన్స్ కార్యకలాపాలు బాధ్యతలను నిర్వహించనున్నారు. ఫ్లిప్‌కార్ట్‌లో కార్పొరేట్ అభివృద్ధికి కూడా ఆయన బాధ్యత వహిస్తారని, ప్రొక్యూర్మెంట్, ప్లానింగ్ అండ్ ఎనలిటిక్స్ అండ్ డెసిషన్ సైన్సెస్ హెడ్లు ఆయనకు రిపోర్ట్ చేస్తూనే ఉంటారని ఫ్లిప్‌కార్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. (పెట్రో ధరలకు వ్యాట్ షాక్ ) ఫ్లిప్‌కార్ట్‌లో అనేక కీలకమైన బాధ్యతలను విజయవంతంగా నిర్వహించిన శ్రీరామ్ ఫ్లిప్‌కార్ట్ కామర్స్ సీఎఫ్ఓగా బాధ్యతలు స్వీకరించడానికి బాగా సిద్ధంగా ఉన్నారని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. అలాగే చక్కని నాయకత్వం, మార్గదర్శకత్వంలో సమర్ధవంతమైన సేవలు అందించిన ఎమిలీ కు ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కల్యాణ్ కృష్ణమూర్తి కృతజ్ఞతలు తెలిపారు. హైపర్‌లోకల్ ఫ్రెష్ ఫుడ్ సామర్థ్యాలను పెంపొందించే కీలకమైన పెట్టుబడులను నడిపించడంలో మెక్నీల్ కీలకపాత్ర పోషించారని, సంస్థ ప్రయాణంలో బలమైన భాగస్వామిగా ఉన్నారని పేర్కొన్నారు. (లాక్డౌన్ సడలింపు : పసిడి వెలవెల) -
చనిపోయిన వారికీ పెన్షన్లు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ఆర్థికమంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. నిజమైన లబ్ధిదారులను గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో సరైన సాంకేతిక వ్యవస్థ, డేటా అందుబాటులో లేకపోవటమే దీనికి కారణమని చెప్పారు. గురువారమిక్కడ సీఐఐ తెలంగాణ ఆధ్వర్యంలో 2వ ఎడిషన్ ‘సీఎఫ్ఓ కాన్క్లేవ్’జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన హరీశ్ మాట్లాడుతూ.. ‘పోస్టల్లో లబ్ధిదారులు వేలిముద్ర వేస్తారు కనుక ఒకవేళ లబ్ధిదారులు మరణిస్తే వాళ్ల పెన్షన్‌ను డేటా నుంచి తొలగిస్తున్నారు. అదే బ్యాంకింగ్ విధానంలో ఇది జరగటం లేదు. లబ్ధిదారుడు మరణించినా బ్యాంక్ ఖాతాలో పెన్షన్ సొమ్ము జమవుతూనే ఉంటోంది. దీన్ని తన కుటుంబీకులో, ఇతరులో తీసుకుంటున్నారు. కొన్ని అలాగే ఖాతాలో ఉండిపోతున్నాయి’అని వివరించారు. పెన్షన్ లబ్ధిదారులు మరణించిన వివరాలు ప్రభుత్వ డేటాకు చేరడం లేదని అందుకే పెన్షన్‌లో డ్రాపవుట్స్ 1.5 శాతమే ఉంటున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం పింఛను లబ్ధిదారుల వివరాలను, కొత్త దరఖాస్తులను అన్నింటినీ బ్యాంకర్లు, తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టీఎస్‌ఐటీఈఎస్‌తో పరిశీలన జరిపిస్తున్నట్లు తెలిపారు. గుండె ఆగినంత పనైంది.. ఇటీవల టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం జరిగింది. ఏటా బడ్జెట్లో ఆర్టీసీకి రూ.1,000 కోట్లు కేటాయిస్తామని కేసీఆర్ ప్రకటించడంతో గుండె ఆగినంత పనైందని హరీశ్ వ్యాఖ్యానించారు. కంపెనీలకు అందాల్సిన రాయితీలపై ఆ శాఖ మంత్రి కేటీఆర్‌తో ఎప్పుడు కలిసినా గొడవ జరుగుతోందని నవ్వుతూ వ్యాఖ్యానించారు. -
పోలీసుల విచారణకు హాజరైన టీవీ9 సీఎఫ్‌వో మూర్తి
-
విచారణకు హాజరైన టీవీ9 సీఎఫ్‌వో మూర్తి
సాక్షి, హైదరాబాద్ : తప్పుడు పత్రాలు సృష్టించారనే ఆరోపణలతో నోటీసులు అందుకున్న టీవీ9 సీఎఫ్‌వో ఎంవీకేఎన్ మూర్తి శుక్రవారం సైబరాబాద్ పోలీస్ కార్యాలయానికి వచ్చారు. సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట ఆయన విచారణకు హాజరయ్యారు. నిధుల మళ్లింపు, ఫోర్జరీ అంశాలపై మూర్తిని పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది. ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు టీవీ9 కార్యాలయంలో 12 హార్డ్ డిస్క్‌లు, నాలుగు ల్యాప్‌టాప్‌లు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా రవిప్రకాశ్, నటుడు శివాజీ, మరికొందరు కలిసి సంతకాలు ఫోర్జరీ చేశారని, రవిప్రకాశ్, సీఎఫ్‌వో మూర్తి, ఇతరులు తప్పుడు పత్రాలు సృష్టించి నిధులు దారి మళ్లీంచారంటూ ఏబీసీఎల్‌ను టేకోవర్ చేసిన అలందా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ కౌశిక్‌రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగానే రవిప్రకాశ్, నటుడు శివాజీ, సీఎఫ్‌వో ఎంవీకేఎన్ మూర్తికి నోటీసులు జారీ చేశారు. అయితే రవి ప్రకాశ్, శివాజీ నేరుగా విచారణకు హాజరు అవుతారా? లేక వాళ్ల తరపున న్యాయవాది హాజరు అవుతారా అనే దానికి ఉత్కంఠ నెలకొంది.మరోవైపు ఈ కేసుకు సంబంధించి బంజారాహిల్స్ ఏసీపీ, సీఐలు ఇవాళ ఉదయం సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిశారు. -
ఎన్ఎస్ఈఎల్ స్కాంలో మాజీ సీఎఫ్‌వో అరెస్టు
నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈఎల్) కుంభకోణంలో 63మూన్ టెక్నాలజీస్(గతంలో ఫైనాన్షియల్ టెక్నాలజీస్) మాజీ సీఎఫ్‌వో శశిధర్ కొటైన్‌ను అధికారులు అరెస్ట్ చేశారు. 5600కోట్ల రూపాయల కుంభకోణం కేసులో శుక్రవారం ఆర్థిక నేరాల ప్రత్యేక వింగ్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన్ను జనవరి 28వరకు కస్టడీకి తరలించారు. 13వేలమందికి పైగా ఇన్వెస్టర్లను మోసం చేసిన వ్యవహారంలో 2013, జూలైలో కేసు నమోదైంది. అలాగే జిగ్నేష్ షా ఆధ్వర్యంలోని సంస్థను రెగ్యులేటరీ స్వాధీనంలోకి వెళ్లింది. అలాగే సంస్థ కీలక అధికారులకు, పలుడైరెక్టర్లను ఇప్పటికే అరెస్టు చేసిన ముంబై పోలీసులు 2018, డిసెంబరులో 27మంది సహా, దాదాపు 63 సంస్థలు, 36 కంపెనీలపై చార్జ్షీట్లను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. -
ఆమె అరెస్ట్‌తో... అతలాకుతలం!
ఒక వ్యక్తి అరెస్ట్... ప్రపంచ స్టాక్ మార్కెట్లన్నింటినీ గురువారం అల్లకల్లోలం చేసి పడేసింది. దీనికి తోడు డాలర్‌తో రూపాయి మారకం మళ్లీ 71 మార్క్‌కు దిగడంతో మన మార్కెట్ కూడా అదే దారిలో ప్రయాణించింది. అన్ని రంగాల షేర్లలో అదేపనిగా అమ్మకాలు జరిగాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్త పడి కొనుగోళ్ల కంటే అమ్మకాలకే అధిక ప్రాధాన్యమివ్వటంతో... బీఎస్ఈ సెన్సెక్స్ 572 పాయింట్లు పతనమై 35,312 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 182 పాయింట్లు క్షీణించి 10,601 పాయింట్ల వద్ద ముగిశాయి. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్ 1.59 శాతం, నిఫ్టీ 1.69 శాతం చొప్పున పతనమయ్యాయి. కిందటి వారమంతా లాభపడిన స్టాక్ సూచీలు... గడిచిన మూడు రోజులూ వరుసగా నష్టపోయాయి. మెటల్, ఆయిల్, గ్యాస్, ఫార్మా, ఆర్థిక, ఎఫ్ఎమ్సీజీ, ఐటీ... ఇలా అన్ని రంగాల షేర్లూ నష్టపోయాయి. ఇటీవల నికర కొనుగోలుదారులుగా నిలిచిన విదేశీ ఇన్వెస్టర్లు బుధవారం నికర అమ్మకాలు జరపడం, మన జీడీపీ అంచనాలను ఫిచ్ రేటింగ్స్ తగ్గించడం ప్రతికూల ప్రభావం చూపించాయి. ఇంట్రాడేలో 618 పాయింట్లు నష్టం స్టాక్ మార్కెట్‌పై దెబ్బ మీద దెబ్బ పడుతోందని సెంట్రమ్ బ్రోకింగ్ రీసెర్చ్ హెడ్ జగన్నాథం తునుగుంట్ల చెప్పారు. ఇటీవల కొంత కోలుకున్నట్లు కనిపించిన రూపాయి మళ్లీ పతనమైందన్నారు. ముడి చమురు ఉత్పత్తి కోత దిశగా ఒపెక్ సమావేశంలో నిర్ణయం వెలువడే అవకాశాలున్నాయని తెలియజేశారు. వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలకు రిహార్సల్స్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చే మంగళవారం (ఈ నెల 11న) వెలువడనుండటంతో ఇన్వెస్టర్లలో ఒకింత ఆదుర్దా నెలకొందని చెప్పారాయన. నష్టాల్లో ఆరంభమైన సెన్సెక్స్ రోజులో ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. రోజంతా నష్టాల్లోనే సాగింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 618 పాయింట్ల వరకూ నష్టపోగా, నిఫ్టీ 195 పాయింట్ల వరకూ పతనమైంది. మరిన్ని విశేషాలు.. ► 31 సెన్సెక్స్ షేర్లలో ఒక్క సన్ ఫార్మా మాత్రమే లాభపడింది. గత మూడు రోజులుగా నష్టపోతూ వస్తున్న సన్‌ఫార్మా షేర్.. సెన్సెక్స్‌లోని అన్ని షేర్లు నష్టపోయినా, గురువారం పెరగడం విశేషం. ► 50 షేర్ల నిఫ్టీలో మూడు షేర్లు మాత్రమే లాభపడ్డాయి. మిగిలిన 47 షేర్లు నష్టాల్లో ముగిశాయి. ► ధరలను పెంచనున్నామని ప్రకటించడంతో మారుతీ సుజుకీ షర్ 4.6 శాతం పతనమై రూ.7,208 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 5 శాతం నష్టంతో రూ.7,178ను తాకింది. సెన్సెక్స్ షేర్లలో బాగా నష్టపోయిన షేర్ ఇదే. మారుతీ సుజుకీతో పాటు టాటా మోటార్స్ 4%, బజాజ్ ఆటో 1.5%, హీరో మోటొకార్ప్1.2 శాతం చొప్పున పడిపోయాయి. ► లోహ షేర్లు భారీగా నష్టపోయాయి. వేదాంత, సెయిల్, ఎన్ఎమ్డీసీ, జిందాల్ స్టీల్ అండ్ పవర్ షేర్లు తాజా ఏడాది కనిష్ట స్థాయిలను తాకగా, టాటా స్టీల్, హిందుస్తాన్ జింక్ ఏడాది కనిష్ట స్థాయిలకు చేరువయ్యాయి. లోహ షేర్లే కాకుండా పలు షేర్లు తాజా ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. ► రిటైల్ రుణాల వడ్డీరేట్లను ఎమ్సీఎల్ఆర్తో కాకుండా ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్స్‌తో అనుసంధానించాలన్న ఆర్బీఐ తాజా నిర్ణయంతో బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ సూచీలోని 12 బ్యాంక్ షేర్లు నష్టాల్లోనే ముగిశాయి. 2.26 లక్షల కోట్ల సంపద ఆవిరి స్టాక్ మార్కె ట్ భారీగా నష్టపోవడంతో ఇన్వెస్టర్ల సంపద రూ. 2.28 లక్షల కోట్లకు పైగా ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,42,15,155 కోట్ల నుంచి రూ.2.26 లక్షల కోట్లు తగ్గి రూ.1,39,88,560 కోట్లకు పడిపోయింది. గత మూడు రోజుల్లో రూ.3.64 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. పతనానికి ప్రధాన కారణాలివీ... ► భారీ నష్టాల్లో ప్రపంచ మార్కెట్లు... చైనాకు చెందిన టెలికం దిగ్గజం హువావే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ), మెంగ్ వాంఝూను కెనడాలో అరెస్టు చేశారు. ఈమె ఈ కంపెనీ వ్యవస్థాపకుడి కుమార్తె. ఇరాన్‌పై అమెరికా విధించిన ఆంక్షలను హువావే కంపెనీ ఉల్లంఘించిందనేది ఆరోపణ. ఈ ఆరెస్ట్ను చైనా తీవ్రంగా నిరసించింది. ఇప్పటికే వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అంతంతమాత్రంగా ఉన్న అమెరికా–చైనా సంబంధాలు ఈ వివాదంతో మరింత క్షీణిస్తాయన్న భయాలు ప్రపంచ మార్కెట్లను పడగొట్టాయి. ఆసియా, యూరప్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. జపాన్ నికాయ్ 1.9 శాతం, హాంగ్‌కాంగ్ హాంగ్‌సెంగ్ 2.4 శాతం, చైనా షాంగై సూచీ 1.6 శాతం, కొరియా కోస్పి సూచీ 1.5 శాతం చొప్పున కుదేలయ్యాయి. ఇక యూరప్ స్టాక్ మార్కెట్లు 2–3 శాతం రేంజ్లో క్షీణించాయి. అమెరికా డోజోన్స్ 700 పాయింట్లు, నాస్డాక్ 100 పాయింట్ల నష్టాలతో ట్రేడవుతున్నాయి. ► 71 మార్క్ దిగువకు రూపాయి... ముడిచమురు ధరల భారీ పతనం కారణంగా కోలుకున్న రూపాయి ఇటీవల మళ్లీ నష్టాల బాట పట్టింది. డాలర్ బలపడుతుండటం, మన మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు తలెత్తడంతో రూపాయి మళ్లీ 71 మార్క్‌ను దాటింది. ► విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు నవంబర్‌లో పెట్టుబడులు పెట్టిన విదేశీ ఇన్వెస్టర్లు మళ్లీ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. బుధవారం విదేశీ ఇన్వెస్టర్లు రూ.358 కోట్ల నికర అమ్మకాలు జరిపారు. ► ఒపెక్ సమావేశంపై ఆందోళన ముడి చమురు ధరల పతనాన్ని అడ్డుకోవడానికి ఒపెక్ దేశాలు ఉత్పత్తి కోతకు సిద్ధం అవుతున్నాయి. ఉత్పత్తి కోత కారణంగా మళ్లీ ధరలు పెరుగుతాయని, ఇది మన రూపాయిపై, మన ఆర్థిక స్థితిగతులపై ప్రతికూల ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇన్వెస్టర్లలో నెలకొన్నది. ► ఎన్నికల ఫలితాలపై ఆదుర్దా వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలకు.. ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కీలకం. తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘర్, మిజోరమ్ ఎన్నికల పలితాలు ఈ నెల 11న వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లో అప్రమత్త వాతావరణం నెలకొన్నది. ► ఫిచ్ నివేదిక ప్రకంపనలు... అంతర్జాతీయ రేటింగ్ సంస్థ, ఫిచ్ ఈ ఏడాది భారత్ జీడీపీ అంచనాలను 7.8 శాతం నుంచి 7.2 శాతానికి తగ్గించింది. మరోవైపు వచ్చే ఏడాది చివరికల్లా డాలర్‌తో రూపాయి మారకం 75కు చేరుతుందని కూడా ఫిచ్ పేర్కొనడం కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై ప్రభావం చూపించింది. ► గణాంకాల నిరుత్సాహం ఇటీవల వెలువడ్డ జీడీపీ, పన్ను వసూళ్లు, వాహన విక్రయా లు తదితర గణాంకాలు అంచనాలకు అనుగుణంగా లేకపోవడంతో మార్కెట్లో ఉత్తేజకర వాతావరణం కొరవడింది. -
హువావేకు షాక్ : కీలక అధికారి అరెస్టు
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ ఉత్పత్తుల సంస్థ హువావే టెక్నాలజీస్ ముఖ్య ఆర్థిక అధికారి (సీఎఫ్‌వో)ను కెనడా అధికారులు అరెస్ట్ చేశారు. అమెరికా అభ్యర్ధన మేరకు కెనడియన్ అధికారులు హువావే డిప్యూటీ చైర్మన్‌ను అరెస్ట్ చేసిందన్న షాకింగ్ న్యూస్ పరిశ్రమ వర్గాలను విస్మయ పర్చింది. అంతేకాదు సీఎఫ్‌వోను త్వరగా అమెరికాకు రప్పించే చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా విధించే వాణిజ్యపరమైన నిబంధలను ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఈ అరెస్టు చోటు చేసుకుంది. హువావే బోర్డు డిప్యూటీ చైర్, కంపెనీ వ్యవస్థాపకుడు రెన్ జెంగ్ఫే కుమార్తె మెంగ్ వాంగ్జోను వాంకోవర్‌లో డిసెంబరు1, శనివారం అరెస్టు చేశామని అధికారులు బుధవారం ప్రకటించారు. ఆమె బెయిల్ పిటీషన్‌పై శుక్రవారం విచారణ జరగనుందని న్యాయశాఖ ప్రతినిధి ఇయాన్ మెక్లాయిడ్ వెల్లడించారు. ఇంతకుమించి తాము ఎటువంటి వివరాలను అందించలేమని పేర్కొన్నారు. మరోవైపు ఈ పరిణామాన్ని హువావే, చైనా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఇది మానవహక్కులకు తీవ్ర హానికరమైన చర్య అని పేర్కొంది. మెంగ్ ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదని, తక్షణమే ఆమెను విడుదల చేయాలని ఒట్టావాలోని చైనీస్ రాయబార కార్యాలయం డిమాండ్ చేసింది. తాము చట్టపరమైన అన్ని నిబంధనలను విధిగా పాటిస్తున్నామని హువావే ప్రకటించింది. ఈ మేరకు ట్విటర్లో ఒక ప్రకటన జారీ చేసింది. మరోవైపు ఇది అమెరికా చైనా మధ్య నెలకొన్న ట్రేడ్వార్కు సంబంధించి తీవ్రమైన పరిణామంగా వాల్‌స్ట్రీట్ జర్నల్ వ్యాఖ్యానించింది. pic.twitter.com/GRs75WRx6L — Huawei Technologies (@Huawei) December 6, 2018 -
ఇన్ఫీ మధ్యంతర సీఎఫ్‌వోగా జయేశ్ సంఘ్రజ్క
సాక్షి, ముంబై: దేశీయ రెండవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ తన లీడర్‌షిప్‌లో కీలక మార్పునుచేపట్టింది. సంస్థ మధ్యంతర ముఖ్య ఆర్థిక అధికారిగా (సీఎఫ్‌వో)గా జయేశ్ సంఘ్రజ్కాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జయేశ్ మధ్యంతర సీఎఫ్ఓ, అలాగే కీలక నిర్వాహక అధికారిగా ఉంటారని ఇన్ఫోసిస్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలియజేసింది. ఈ నియమాకం నవంబరు 17, 2018 నుంచి అమలులోకి వస్తుందని తెలిపింది. జయేశ్ ఇన్ఫోసిస్‌లో ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ , డిప్యూటీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా ఉన్నారు. కాగా ప్రస్తుత ఎండీ, సీఎఫ్‌వో రంగనాథ్ రేపు (నవంబర్ 16) కంపెనీని వీడినున్నారు. 18 సంవత్సరాలు ఇన్ఫీకి సేవలందించిన రంగనాథ్ (రంగ) ఈ ఏడాది ఆగస్టులో రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ఇన్ఫోసిస్ బోర్డు అంగీకరించింది. -
దిగజారిన సీఎఫ్‌వోల ఆశావాదం
ముంబై: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ) ఎదుర్కొంటున్న నిధుల లభ్యత సమస్య, వడ్డీ రేట్ల పెరుగుదల వంటి అంశాల కారణంగా దేశంలో కంపెనీల చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ల (సీఎఫ్‌వో) ఆశావాదం 19 త్రైమాసికాల కనిష్ట స్థాయికి దిగజారింది. దేశంలో అన్ని రంగాలకు చెందిన 300 మంది సీఎఫ్‌వోల నుంచి వారి కంపెనీల ఆరోగ్య స్థితి, వ్యాపార రిస్క్ పరిస్థితులు, స్థూల ఆర్థిక పరిస్థితులపై అభిప్రాయాలను డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ సంస్థ సర్వేలో భాగంగా తెలుసుకుంది. సీఎఫ్‌వోల ఆశావాద సూచీ సెప్టెంబర్ త్రైమాసికంలో 17 శాతం తగ్గి 90.2కు చేరింది. నిధుల లభ్యత తగ్గొచ్చని లేదా ప్రస్తుత స్థాయిలోనే ఉండొచ్చన్న అభిప్రాయాన్ని 72 శాతం మంది సీఎఫ్‌వోలు తెలియజేశారు. -
జీఎస్టీతో బిజినెస్‌కు జోష్!!
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలులోకి వచ్చి దాదాపు ఏడాది కావొస్తోంది. మొత్తంగా చూస్తే దేశంలోని వ్యాపార పరిస్థితులపై జీఎస్టీ సానుకూల ప్రభావం చూపించిందని చాలా మంది చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్లు (సీఎఫ్‌వో) అభిప్రాయపడ్డారు. ఈ అంశం డెలాయిట్ సర్వేలో వెల్లడయ్యింది. డెలాయిట్ ఇండియా వార్షిక సీఎఫ్‌వో సర్వే ప్రకారం.. ♦ దేశీ వ్యాపార పరిస్థితులపై జీఎస్టీ సానుకూల ప్రభావం చూపించిందని 77 శాతం మంది సీఎఫ్‌వోలు విశ్వసిస్తున్నారు. ♦ ఇటీవలి సంస్కరణలు వచ్చే రెండేళ్ల కాలంలో ఫలితాలనందిస్తాయనే అంచనాలతో 57 శాతం మంది సీఎఫ్‌వోలు వారి వ్యాపారంలో సవాళ్లను స్వీకరించడానికి కూడా సిద్ధమయ్యారు. ♦ జీఎస్టీ ప్రభావం ఆదాయం, సప్లై చైన్లపై బాగా ప్రతిబింబిస్తుంది. ♦ 58 శాతం మంది సీఎఫ్‌వోలు వ్యాపార నిర్వహణలో (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) మెరుగుదల కనిపించిందన్నారు. ♦ నాణేనికి మరోవైపు.. జీఎస్టీ అమలు తర్వాత వర్కింగ్ క్యాపిటల్‌పై ప్రతికూల ప్రభావం పడిందని 66% మంది సీఎఫ్‌వోలు, ఫైనాన్స్ వ్యయంపై ప్రతికూల ప్రభావం పడిందని 55% మంది సీఎఫ్‌వోలు అభిప్రాయపడ్డారు. ♦ వచ్చే 12 నెలల కాలంలో ఉద్యోగుల సంఖ్య పెరగొచ్చని 53 శాతం మంది సీఎఫ్‌వోలు అంచనా వేశారు. ♦ రెవెన్యూ వృద్ధి ఉంటుందని 83 శాతం మంది, ఆపరేటింగ్ మార్జిన్లు పెరగొచ్చని 45 శాతం మంది సీఎఫ్‌వోలు విశ్వాసం వ్యక్తంచేశారు. జూలై 1న జీఎస్టీ తొలి వార్షికోత్సవం! కేంద్రం జీఎస్టీ తొలి వార్షికోత్సవాన్ని ఘనంగా జరపడానికి కసరత్తు చేస్తోంది. ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ సహా పరిశ్రమ చాంబర్లు, వ్యాపారులు, పన్ను అధికారులు పాల్గొనేలా జూలై 1న ఒక పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ కూడా ఈ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. జూలై 1ని ‘జీఎస్టీ–డే’గా జరుపుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇందుకోసం దేశ రాజధానిలో కొత్తగా నిర్మించిన అంబేడ్కర్ భవన్లో ఒక మెగా ఈవెంట్‌ను నిర్వహించనుందని విశ్వసనీయ సమాచారం. స్వాతంత్య్రం తర్వాత అతిపెద్ద పన్ను సంస్కరణగా అభివర్ణిస్తున్న జీఎస్టీ 2017 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. -
దిగ్గజ కంపెనీ తొలి సీఎఫ్‌వోగా దివ్య రికార్డు
భారత సంతతికి చెందిన మహిళ ప్రపంచ ఆటో దిగ్గజ కంపెనీలో కీలక అధికారిగా ఎంపికయ్యారు. చెన్నైలో జన్మించిన దివ్య సూర్యదేవర (39) అతిపెద్ద వాహన సంస్థ జనరల్ మోటార్స్ కు సీఎఫ్‌వోగా నియమితులయ్యారు. చక్ స్టీవెన్స్ స్థానంలో దివ్య ఈ పదవికి ఎంపికయ్యారు. సెప్టెంబర్ నుంచి దివ్య సీఎఫ్‌వోగా పదవీ బాధ్యతలను స్వీకరించనున్నారని జనరల్స్ మోటార్స్ వెల్లడించింది. గత అనేక సంవత్సరాలుగా అనేక కీలక పాత్రల్లో దివ్య అనుభవం, నాయకత్వం కారణంగా ఆర్ధిక కార్యకలాపాల్లో అంతటా దృఢమైన వ్యాపారాన్ని నిర్మించుకున్నామని బార్రా ఒక ప్రకటనలో తెలిపారు. 2014 నుంచి జీఎంకు సీఈవోగా మేరీ బర్రా (59)కు దివ్య రిపోర్ట్ చేయనున్నారు. దీంతో ప్రపంచంలోనే ఆటో పరిశ్రమలో అత్యున్నత పదవులను స్వీకరించిన తొలి మహిళలుగా సీఎఫ్‌వో దివ్య , సీఈవో మేరీ రికార్డు సృష్టించారు. ఇంతవరకు ఏ ఆటో కంపెనీలో సీఈవో, సీఎఫ్‌వో పదవులను మహిళలు స్వీకరించలేదు. కాగా మద్రాసు యూనివర్శిటీ నుంచి కామర్స్‌లో మాస్టర్స్ పట్టా పొందిన దివ్య , అమెరికా హార్వర్డ్ యూనివర్శిటీ ద్వారా ఎంబీఏ సాధించారు. అనంతరం ఛార్టర్డ్ ఫైనాన్షియల్ ఎనలిస్ట్ (సీఎఫ్ఏ) ధృవీకరణ పొందారు. 2005లో జనరల్ మెటార్స్ కంపెనీలో జాయిన్ అయిన దివ్య జూలై , 2017 నుంచి కార్పొరేట్ ఫైనాన్స్‌కు వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. -
ఆర్బీఐ తొలి సీఎఫ్ఓగా సుధా బాలకృష్ణన్
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలక నియామకాన్ని చేపట్టింది. తన మొట్టమొదటి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(సీఎఫ్‌వో) సుధ బాలకృష్ణన్‌ను నియమించింది. మే 15 న సెంట్రల్ బ్యాంకులో చేరగా, ఆమె పదవీ మూడు సంవత్సరాలు ఉండనుందని ఎకనామిక్స్ టైమ్స్ నివేదించింది. కేంద్ర బ్యాంకులో అత్యంత కీలకమైన పదవికి నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్డీఎల్) మాజీ అధికారి సుధా బాలకృష్ణన్ ఆర్బీఐ తొలి సీఎఫ్‌వోగా ఎంపిక కావడం విశేషం. అకౌంటింగ్ విధానాలు, నిబంధనలకు లోబడి కేంద్ర బ్యాంకు బ్యాలెన్స్ షీట్ ఇన్ ఛార్జ్ గా సుధా బాలకృష్ణన్ వ్యవహరిస్తారు. ముఖ్యంగా బ్యాంక్ అకౌంటింగ్ విధానాన్ని రూపొందించడం, అంతర్గత ఖాతాలను నిర్వహించడం, ఆర్ధిక ఫలితాల గురించి నివేదించటం, వివిధ ఖాతాల ఖాతాల ద్వారా, బ్యాలెన్స్ షీట్ , లాభ, నష్టాల ఖాతాల పరిశీలన లాంటి కీలక బాధ్యతలను నిర్వహిస్తారు. రాబడి వసూళ్లు లాంటి ప్రభుత్వ లావాదేవీలతోపాటు విదేశాలలోనూ అత్యున్నత బ్యాంకు పెట్టుబడులను కూడా పర్యవేక్షించే బాధ్యత కూడా నిర్వహించనున్నారు. కాగా 2016, సెప్టెంబరులో ఆర్బీఐ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇది అతిపెద్ద సంస్థాగత మార్పుగా చెప్పవచ్చు. గతంలో ఆర్బీఐ గవర్నర్‌గా రఘురామ్ రాజన్ ఉన్న సమయంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (పీవోవో) పదవిని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు, కానీ ఆ ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించలేదని ఎకనామిక్స్ టైమ్స్ తన నివేదిక పేర్కొంది. మరోవైపు గత ఏడాది జులై ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎస్ఎస్ ముద్రా పదవీవిరమణతో ఈ స్థానాన్ని భర్తీ చేయడానికి డిప్యూటీ గవర్నర్ పదవికి అర్హులైన అభ్యర్థులనుంచి దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. -
‘గీతాంజలి’కి మరోఅధికారి గుడ్‌బై
సాక్షి, న్యూఢిల్లీ: పీఎన్బీ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న గీతాంజలి జెమ్స్ సంస్థనుంచి మరో టాప్ ఎగ్జిక్యూటివ్ తప్పుకున్నారు. రూ. 11,400కోట్ల భారీ కుంభకోణంలో ప్రధాన నిందితుడు డైమండ్ వ్యాపారి నీరవ్‌మోదీ మామ, మెహుల్ చోక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్ ముఖ్య ఆర్థిక అధికారి (సీఎఫ్‌వో) చంద్రకాంత్ తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల రీత్యా తాను పదవినుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు. కాగా ఇప్పటికే గీతాంజలినుంచి కంపెనీ సెక్రటరీ ఫంకూరి వారంగీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు నీరవ్ మోదీ ఇంటిపైనా, ఆఫీసులపై ఈడీ దాడులు సోమవారం కూడా కొనసాగుతున్నాయి. ముంబైలోని 5 ప్రాంతాల్లో, సూరత్‌లోని 3 ఏరియాల్లో, ఔరంగాబాద్, ఢిల్లీలో సోదాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. నీరవ్ కంపెనీకి చెందిన ఉద్యోగులను సీబీఐ ప్రశ్నిస్తోంది. ఈ మెగా స్కాంలో గీతాంజలి జెమ్స్ షేరు వరుసగా నాలుగో రోజు సోమవారం కూడా భారీగా పతనాన్ని నమోదు చేసింది. ఇన్వెస్టర్ల అమ్మకాలతో 10శాతానికి పైగా నష్టపోయింది. ఈ మొత్తం నాలుగు సెషన్లలో 50 శాతానికిపై కుప్పకూలి రికార్డ్ కనిష్టాన్ని తాకింది. ఫిబ్రవరి 14నుంచి ఇప్పటివరకూ రూ. 344 కోట్ల రూపాయల గీతాంజలి మార్కెట్ క్యాప్ తుడిచిపెట్టుకుపోయింది. అటు పంజాబ్ నేషనల్ బ్యాంకు షేరు కూడా 10శాతానికి పైగా నష్టపోయింది. -
విదేశాల్లోని భారతీయులకు పీఎఫ్ సౌకర్యం
న్యూఢిల్లీ: ఇక నుంచి విదేశాల్లో పనిచేసే భారతీయులు ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్)లో భాగస్తులు కావచ్చు. ఈ పథకంలో భాగంగా ఉద్యోగులు వారు పనిచేస్తున్న దేశంలో సోషల్ సెక్యూరిటీ పథకాన్ని వదులుకుని ఈపీఎఫ్ఓలో చేరే అవకాశాన్ని కల్పించినట్లు కేంద్ర ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ వీపీ జాయ్ చెప్పారు. ఇందుకోసం 18 దేశాలతో ఒప్పందం కుదుర్చుకున్నామని ఆయన వెల్లడించారు. విదేశాలకు వెళ్లే ఉద్యోగులు పీఎఫ్ కోసం సర్టిఫికెట్ ఆఫ్ కవరేజ్(సీవోసీ) పొందవచ్చని, విదేశాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఆన్లైన్ ద్వారా సీవోసీకి దరఖాస్తు చేయవచ్చని చెప్పారు. -
గతవారం బిజినెస్
నియామకాలు టాటా సన్స్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో)గా సౌరభ్ అగర్వాల్ నియమితులయ్యారు. గ్రూప్‌కు సంబంధించిన మూలధన కేటాయింపుల నిర్ణయాలు, ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ కార్యకలాపాలను ఇకపై సౌరభ్ చూసుకోనున్నారు. ఇక టాటా సన్స్ గ్రూప్ జనరల్ కౌన్సెల్‌గా శువ మండల్ ఎంపికయ్యారు. గూగుల్ ఇండియా వైస్‌ప్రెసిడెంట్‌గా ఉన్న రాజన్ ఆనందన్ తాజాగా ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) కొత్త చైర్మన్‌గా నియమితులయ్యారు. అలాగే ఐఏఎంఏఐ వైస్ చైర్మన్‌గా మేక్మైట్రిప్ చైర్మన్, సీఈవో దీప్ కల్రా ఎంపికయ్యారు. ఇక ఐఏఎంఏఐ ట్రెజరర్‌గా ఫేస్బుక్ మేనేజింగ్ డైరెక్టర్ (ఇండియా, దక్షిణాసియా) ఉమాంగ్ బేడి నియమితులయ్యారు. పేటీఎం బ్యాంక్ కార్యకలాపాలు షురూ డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం.. పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలు ప్రారంభించింది. డిపాజిట్లపై 4 శాతం వడ్డీ రేటు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ఉంటాయని ప్రకటించింది. అలాగే కనీస బ్యాలెన్స్ నిబంధనలు ఉండబోవని, ఆన్లైన్ లావాదేవీలకు (నెఫ్ట్, ఐఎంపీఎస్, ఆర్టీజీఎస్ మొదలైనవి) ఫీజులు ఉండవని పేర్కొంది. ఎయిర్టెల్, ఇండియా పోస్ట్ తర్వాత పేమెంట్స్ బ్యాంక్ ప్రారంభించిన సంస్థల్లో పేటీఎం మూడోది. ఇక బీమా ఐపీవోలు! దిగ్గజ బీమా కంపెనీలు ఈ ఏడాది వరుసగా పబ్లిక్ ఇష్యూకు రాబోతున్నాయి. జాబితాలో ముందు వరుసలో ఎస్బీఐ లైఫ్, న్యూ ఇండియా అష్యూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, యూటీఐ ఫండ్ నిలుస్తున్నాయి. ఆకర్షణీయ ధరలో హెచ్‌సీఎల్ టెక్ బైబ్యాక్ దేశంలో నాలుగో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ అయిన హెచ్‌సీఎల్ టెక్ షేర్ల బైబ్యాక్ ధరను ప్రకటించింది. మార్కెట్ ధర కంటే 17 శాతం ప్రీమియంతో ఒక్కో షేరును రూ.1,000 ధరకు బైబ్యాక్ చేయనున్నట్టు తెలియజేసింది. ప్రపోర్షనేట్ విధానంలో టెండర్ ఆఫర్ ద్వారా దీన్ని నిర్వహించనున్నట్టు స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు తెలిపింది. రూ.3,500 కోట్ల విలువైన షేర్లను కంపెనీ బైబ్యాక్ చేయనుంది. ఎఫ్‌డీఐల చిరునామా భారత్ ప్రపంచంలో అత్యధికంగా విదేశీ పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) ఆకర్షిస్తున్న దేశంగా భారత్ వరుసగా రెండో ఏడాదీ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. 2016వ సంవత్సరంలో 62.3 బిలియన్ డాలర్ల (రూ.3.99 లక్షల కోట్లు సుమారు) ఎఫ్‌డీఐలను ఆకర్షించింది. ఫైనాన్షియల్ టైమ్స్‌కు చెందిన ఎఫ్‌డీఐ ఇంటెలిజెన్స్ విభాగం ’ఎఫ్‌డీఐ 2017’ నివేదికను రూపొందించింది. ఈ నివేదిక ప్రకారం ఎఫ్డీలను రాబట్టడంలో చైనా, అమెరికాలు భారత్ వెనుకనే నిలిచాయి. ఈసారి ఆల్టో కాదు స్విఫ్ట్.. దిగ్గజ వాహన తయారీ కంపెనీ ’మారుతీ సుజుకీ’ ప్రముఖ హ్యాచ్‌బ్యాక్ ’స్విఫ్ట్’ తాజాగా అదే కంపెనీకి చెందిన ’ఆల్టో’ మోడల్‌ను వెనక్కు నెట్టింది. దేశీ మార్కెట్లో ఏప్రిల్ నెల వాహన విక్రయాల్లో ’స్విఫ్ట్’.. బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా అవతరించింది. కాగా మారుతీ ఎప్పటిలాగే ఇండియన్ ప్యాసెంజర్ వాహన మార్కెట్లో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. కంపెనీకి చెందిన ఏడు కార్లు ’టాప్10 బెస్ట్ సెల్లింగ్ మోడల్స్’ జాబితాలో స్థానం దక్కించుకున్నాయి. ఇక మిగిలిన మూడు స్థానాలను హ్యుందాయ్ మోటార్ ఇండియా ఆక్రమించింది. -
ఐసీసీ సీఎఫ్‌వోగా అంకుర్ ఖన్నా
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నూత న ముఖ్య ఆర్థిక వ్యవహారాల అధికారి (సీఎఫ్‌వో)గా భారత్‌కు చెందిన అంకుర్ ఖన్నా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఎయిర్ ఆసియా ఇండియా సీఎఫ్‌వోగా వ్యవహరిస్తుండగా ఈనెలాఖరులో కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు. మరోవైపు ఐసీసీ నూతన నియమావళిలో చేసిన పలు మార్పులు అనిశ్చితంగా, అస్పష్టంగా ఉన్నాయని బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఐసీసీ చీఫ్ ఆపరేటింగ్ అధికారి ఇయాన్ హిగ్గిన్స్‌కు ఆయన లేఖ రాశారు. -
టీసీఎస్ కొత్త సీఎఫ్‌వో.. రేపటినుంచే..
ముంబై: దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) చీఫ్ పైనాన్షియల్ ఆఫీసర్‌గా వి. రామకృష్ణన్ ఎంపికయ్యారు. సోమవారం జరిగిన టీసీఎస్ బోర్డు సమావేశంలోఈ మేరకు నిర్ణయం జరిగిందని టీసీఎస్ ఒక ప్రకనటలో తెలిపింది. ఈ నియామకం ఫిబ్రవరి 21 నుంచి అమల్లోకి వస్తుందని కంపెనీ బీఎస్సీ ఫైలింగ్ లో పేర్కొంది. కంపెనీలో రాంకీగా పేరొందిన రామకృష్ణన్, 1999 లో టిసిఎస్ ఫైనాన్స్ లో చేరారు. టిసిఎస్ ఆఫ్ నార్త్ అమెరికా ఫైనాన్సియల్ హెడ్‌గా 7 సంవత్సరాలు పనిచేశారు. 17 సంవత్సరాలుగా టిసిఎస్ ఫైనాన్స్ టీంలో రామకృష్ణన్ కీలక సభ్యుడుగా ఉన్నారనీ, తనతో గత 9 సంవత్సరాలుగా కలిసి పనిచేస్తున్నారని సీఈవో రాజేష్ గోపీనాథన్ చెప్పారు. ఆయన నాయకత్వంలో టిసిఎస్ ఫైనాన్స్ నాయకత్వం మరింత విస్తరిస్తుందనే నమ్మకం తనకుందని చెప్పారు మరోవైపు టీసీఎస్ ఎగ్జిక్యూటివ్‌గా, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న నటరాజన్ చంద్రశేఖరన్ టాటా సన్స్ ఛైర్మన్ గా నియమితులయ్యారు. , టాటా సన్స్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీకి ఉద్వాసన పలికిన తర్వాత, ఈ కీలకమైన బాధ్యతలను ఆయన మంగళవారం స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో టీసీఎస్ సీఈవోగా రాజేష్ గోపినాథ్‌ను టీసీఎస్ బోర్డు నియమించింది. కాగా ఒకవైపు అంతర్గత పోరులో, ముసలం తో దేశీయ అతిపెద్ద సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ కష్టాలు పడుతోంటే.. మరో దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) మాత్రం దూసుకుపోతోంది. తాజాగా షేర్ల బై బ్యాక్ ప్రకటనతో ఇతర ఐటీ కంపెనీలకు సవాల్ విసిరింది. ఆయా కంపెనీల దగ్గర భారీగా పేరకు పోయిన నగదు నిల్వలను ఇన్వెస్టర్లకు పంపిణీ చేయాలన్ని డిమాండ్ వినిపస్తోంది. ఈ క్రమంలో ఇన్ఫోసిస్ కూడా షేర్ల బై బ్యాక్ ప్రతిపాదనకు తాము వ్యతిరేకంగా కాదని, సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఇన్ఫోసిస్ షేర్లు బైబ్యాక్ చేయాలి
బెంగళూరు: సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ షేర్ల బైబ్యాక్‌ను చేపట్టాలని కంపెనీ మాజీ సీఎఫ్‌వో వి.బాలకృష్ణన్‌తోపాటు, కొంతమంది బడా ఇన్వెస్టర్ల గ్రూప్ డిమాండ్ చేసింది. తద్వారా కొత్త సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్న విశాల్ సిక్కాపై ఇన్వెస్టర్లకు గురి కుదురుతుందని వీరంతా పేర్కొన్నారు. షేరుకి రూ. 3,850 ధరలో షేర్ల బైబ్యాక్ చేసి ఇన్ఫోసిస్ ఇన్వెస్టర్లకు విలువను చేకూర్చాల్సి ఉందని డిమాండ్ చేశారు. కంపెనీ చరిత్రలో తొలిసారి సొంత షేర్లను కొనుగోలు చేయడం(బైబ్యాక్) ద్వారా కంపెనీ వాటాదారుల్లో విశ్వాసాన్ని నింపాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు. వ్యవస్థాపకుల్లో ఒక్కరు కూడాలేని ప్రస్తుత పరిస్థితుల్లో కంపెనీ వ్యవస్థాపకుడు కాని వ్యక్తి విశాల్ సిక్కా ఇన్ఫోసిస్‌కు నేతృత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పరిశ్రమ వృద్ధికంటే కంపెనీ వెనకబడింది. బైబ్యాక్ విషయమై రిటైల్ ఇన్వెస్టర్ల తరఫున జూలై 29న కంపెనీకి బాల లేఖ రాశారు. లేఖను బోర్డు సభ్యులతోపాటు, నారాయణ మూర్తికి, విశాల్ సిక్కాకుసైతం పంపినట్లు తెలిపారు. నిలకడైన, భారీ బైబ్యాక్‌కు తెరలేపాల్సిందిగా ఇన్ఫోసిస్ బోర్డును లేఖలో బాల కోరారు. సంస్థాగత ఇన్వెస్టర్లతో నిర్వహించిన చర్చల్లోనూ తమ ప్రతిపాదనకు మద్దతు లభించినట్లు తెలిపారు.1993 జూన్‌లో స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన ఇన్ఫోసిస్ ఇంతవరకూ బైబ్యాక్ చేపట్టలేదు.