Tesla appoints India-origin Vaibhav Taneja as its CFO - Sakshi

టెస్లాలో కీలక పదవికి భారత సంతతికి చెందిన వైభవ్‌ తనేజా, ఆసక్తికర విషయాలు

Published Mon, Aug 7 2023 9:20 PM | Last Updated on Tue, Aug 8 2023 10:41 AM

Tesla appoints Indian origin #VaibhavTaneja as its CFO - Sakshi

Tesla new Indian-origin CFO VaibhavTaneja ట్విటర్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ అధీనంలోని ఆటో మేజర్‌ టెస్లాకు సీఎఫ్‌వోగా భారత సంతతికి చెందిన వ్యక్తి  నియమితులయ్యారు. జాచరీ కిర్‌ఖోర్న్ స్థానంలో భారతీయ సంతతికి చెందిన అకౌంటింగ్ హెడ్ వైభవ్ తనేజాను నియమించినట్లు  సంస్థ ప్రకటించింది. తనేజా ఢిల్లీ యూనివర్సిటీ నుండి కామర్స్ గ్రాడ్యుయేట్. రెండు దశాబ్దాలకు పైగా అకౌంటింగ్ అనుభవం ఉంది.దీంతోపాటుటెక్నాలజీ ఫైనాన్స్, రిటైల్, టెలికమ్యూనికేషన్స్‌లో పలు బహుళజాతి కంపెనీలతో కలిసి పనిచేసిన అనుభవం వైభవ్‌ సొంతం. (నిన్న బియ్యం ఎగుమతులపై నిషేధం: నెక్ట్స్‌ ఏంటో తెలిస్తే..!)

అమెరికన్ ఆటోమొబైల్ మేజర్ టెస్లాలో ప్రస్తుతం చీఫ్ అకౌంటింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న వైభవ్ తనేజాకు అదనపు బాధ్యతగా సీఎఫ్‌వో బాధ్యతలు అప్పగించారు.అయితే ఈ మార్పునకు గల కారణాలను కంపెనీ అధికారికంగా ప్రకటించారు. కానీ సజావుగా పరివర్తనను నిర్ధారించేందుకుగాను సంవత్సరం చివరి వరకు అతని స్థానంలో ఉంటారని ఈ ఏడాది చివరి వరకు జాచరీ కిర్‌ఖోర్న్‌ఈ పదవిలో కొనసాగుతారని తెలుస్తోంది.  "మాస్టర్ ఆఫ్ కాయిన్"  గా పాపులర్‌ అయిన వైభవ  తనేజా  గురించి ఆసక్తికర విషయాలు:

ఎవరీ వైభవ్‌
♦ వైభవ్ తనేజా 2017లో టెస్లాలో చేరారు, 2016లో టెస్లా కొనుగోలు చేసిన సోలార్ ఎనర్జీ కంపెనీ అనుబంధ సంస్థ సోలార్‌సిటీలో వైస్ ప్రెసిడెంట్‌గా ,  తరువాత కార్పొరేట్ కంట్రోలర్‌గా పనిచేశారు.  2016లో దీన్ని టెస్లా టేకోవర్‌ చేసింది. ఈ విలీనంలోరెండు కంపెనీల అకౌంటింగ్ బృందాల విజయవంతమైన ఏకీకరణకు కూడా నాయకత్వం వహించారు. వైభవ్ మార్చి 2019 నుండి టెస్లా సీఏవోగా పనిచేస్తున్నారు. అలాగే మే 2018 నుండి కంపెనీ కార్పొరేట్ కంట్రోలర్‌గా కూడా పనిచేస్తున్నారు. (అయ్యయ్యో..దుబాయ్‌ అతిపెద్ద జెయింట్‌ వీల్‌ ఆగిపోయింది)
♦ 13 సంవత్సరాలు పాటు సంస్థకు సేవలందించిన జాచరీ కిర్‌ఖోర్న్‌ స్థానంలో వైభవ్‌ తనేజాకొత్త సీఎఫ్‌వోగా ఎంపికయ్యారు.  
♦ టెస్లా  త్రైమాసిక ఆదాయాలు , అమెరికా, అంతర్జాతీయ నియంత్రణపై తనేజా  మాజీ సీఎఫ్‌ఓలు దీపక్ అహుజా , జాచరీ కిర్‌ఖోర్న్‌లకు సన్నిహితుడు.
♦  తనేజా జనవరి 2021లో టెస్లా  ఇండియన్ ఆర్మ్, టెస్లా ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్‌కి డైరెక్టర్‌గా కూడా నియమితులయ్యారు.

కాగా భారత మార్కెట్‌లో ఎగుమతి రెండింటి కోసం టెస్లా ప్రస్తుత ఎంట్రీ మోడల్ కంటే దాదాపు 25శాతం తక్కువ ధరతో ఎలక్ట్రిక్ వెహికల్ (EV)ని ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీని భారతదేశంలో నిర్మించాలని టెస్లా భారీ ప్రయత్నాలే  చేస్తోంది. ఈ వార్తల మధ్య ఈ నియామకం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనికి తోడు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఇటీవల టెస్లా సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లతో సమావేశమైనట్టు తెలుస్తోంది. టెస్లా  సీనియర్ పబ్లిక్ పాలసీ , బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ రోహన్ పటేల్, సప్లై చైన్ వైస్ ప్రెసిడెంట్ రోషన్ థామస్‌తో  భేటీ అయ్యారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
 
Advertisement