సీఎఫ్‌వో అంటే చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్. ఏ కంపెనీలో అయినా వీరిది ఉన్నత స్థాయి పోస్టు. సీఈవో తర్వత స్థాయిలో వీరి హోదా ఉంటుంది. ఇటీవల ఓ కంపెనీ సీఎఫ్‌వో రాజీనామా చేశారు. అయితే ఆ అధికారి రిజైన్ లెటర్‌ను చూసిన వారు అవాక్కవుతున్నారు.
సాధారణంగా రాజీనామా లేఖను ఏ రూపంలోనైనా కంపెనీ యాజమాన్యానికి సమర్పించవచ్చు. అయితే మిత్షీ ఇండియా అనే కంపెనీ సీఎఫ్‌వో రింకు నికేత్ పటేల్ స్కూల్ నోట్‌బుక్ పేపర్‌పై రాజీనామా లేఖను రాసి సమర్పించారు. కంపెనీలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పదవికి రింకు నికేత్ పటేల్ చేసిన రాజీనామాను ఆమోదించినట్లు మిత్షీ ఇండియా డిసెంబర్ 21న ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. స్కూల్ నోట్‌బుక్ పేపర్‌పై రాసిన రాజీనామా లేఖను కంపెనీ తన అధికారిక ప్రకటనలో జత చేసింది.
ఇదీ చదవండి: జనరేటివ్ ఏఐపై పోటాపోటీ! సీఈవోలు ఏం చెప్పారంటే..
వ్యక్తిగత కారణాల వల్ల రింకు నికేత్ పటేల్ రాజీనామా చేశారని, 2023 డిసెంబర్ 20 నుంచి ఇది అమల్లోకి వస్తుందని కంపెనీ తెలిపింది. "కంపెనీ కొత్త సీఎఫ్‌వోని నియమించే ప్రక్రియలో ఉందని, అది పూర్తయిన తర్వాత స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేస్తుంది" అని పేర్కొంది. మిత్షి ఇండియా లిమిటెడ్ 1976లో ఏర్పాటైంది. గతంలో దీన్ని డేరా పెయింట్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ అని పిలిచేవారు. 1992లో ఐపీవోకి వచ్చింది. కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం ఇది 28 ఏళ్లుగా బీఎస్‌ఈలో లిస్ట్ అయి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment