resign letter
-
కృష్ణదేవరాయలు తొందరపడ్డారా?
రాజకీయాలలో తొందరపాటు ఉండకూడదు. ఓర్పుతో వ్యవహరిస్తే ఫలితాలు ఎక్కువ సందర్భాలలో అనుకూలంగా ఉంటాయి. నరసరావుపేట వైఎస్సార్సీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు తన పదవికి, పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించడం తొందరపాటు చర్య అనిపిస్తుంది. ఎందుకంటే పార్టీ నాయకత్వంతో కానీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో కానీ ఆయనకు విబేధాలు ఏమీ లేవు. ఆయనకు పార్టీలో తగు గౌరవం లభించింది. ఎమ్మెల్యేల నుంచి సహకారం పొందగలిగారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. కాకపోతే ఈసారి గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేస్తే బాగుంటుందని కృష్ణదేవరాయలకు పార్టీ అధిష్టానం సూచించింది. దానికి కారణం ఈయన అభ్యర్ధిత్వం అక్కడ ఉపయోగపడుతుందనే కదా! కానీ రాయలకు ఇష్టం లేదు. నరసరావుపేట నుంచే పోటీచేస్తానని ఆయన పట్టుబడుతున్నారు. అంతవరకు తప్పు లేదు. దీనిపై ఒకటికి రెండు సార్లు పార్టీ నాయకత్వంతో చర్చించవచ్చు. సీఎం జగన్‌ను కలిసి తన వాదన వినిపించవచ్చు. అలా కాకుండా కృష్ణదేవరాయలు రాజీనామా ప్రకటన చేయడంలో ఆయన ఉద్దేశం ఏమిటో తెలియవలసి ఉంది. కానీ, ఇందుకు ఆయన చెప్పిన కారణాలు అంత సమర్ధనీయంగా లేవు. నరసరావుపేటలో బీసీ అభ్యర్ధిని పోటీలో దించాలని వైఎస్సార్సీపీ అధిష్టానం భావిస్తోందని, దాంతో రాజకీయంగా అనిశ్చితి ఏర్పడిందని ఆయన అంటున్నారు. క్యాడర్లో కన్ఫ్యూజన్ ఏర్పడిందని ఆయన చెప్పారు. అంటే కార్యకర్తలలో ఒక గందరగోళ పరిస్థితి ఉందని ఆయన అనుకుని ఉండవచ్చు. కానీ, దానికే రాజీనామా చేయవలసిన అవసరం ఏమిటో తెలియదు. ఆయన గందరగోళంలో ఉండి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారనిపిస్తుంది. పార్టీ నాయకత్వంపైన, ముఖ్యమంత్రిపైన, ప్రభుత్వంపైన ఎలాంటి విమర్శలు చేయకపోవడం కొంతలో కొంత బెటర్. నిజానికి పార్టీకి కట్టుబడి ఉండటం అన్నది ఒక విధానం. విద్యాధికుడై, పలు విద్యా సంస్ధలను నిర్వహించే కృష్ణదేవరాయలు అందుకు భిన్నంగా కేవలం ఒక పదవిని ఆశించి ఇలా వ్యవహరించడం ఆయనకు అంత ప్రతిష్టకాదని చెప్పక తప్పదు. ఆయన తండ్రి లావు రత్తయ్య 1996లో ఎన్.టీ.ఆర్.టీడీపీ తరపున బాపట్ల లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమి చెందారు. ఆ తర్వాత ఆయన రాజకీయాలలో రానించలేకపోయారు. విద్యాసంస్థల వ్యవస్థాపకుడిగా మంచిపేరు తెచ్చుకున్నా, రాజకీయాలలో ఆయనకు ఉన్న ఆసక్తిని నెరవేర్చుకోలేకపోయారు. కానీ, వైఎస్సార్సీపీను స్థాపించిన సీఎం జగన్.. ఆయన కుమారుడు కృష్ణదేవరాయలకు అవకాశం ఇచ్చి నరసరావుపేట నుంచి పోటీకిగాను టిక్కెట్ ఇచ్చారు. విజయం సాధించి ఎంపీగా పేరు తెచ్చుకున్నారు. అంతవరకు ఓకే. కానీ, ఇప్పుడు సడన్‌గా పదవికి, పార్టీకి రాజీనామా చేయడం మాత్రం తొందరపాటే అనిపిస్తుంది. కొన్ని రోజుల క్రితమే లావు కృష్ణదేవరాయలు టీడీపీలోకి వెళతారని టీడీపీ మీడియా ప్రచారం చేసింది. అయినా రాయలు వంటి విద్యాధికులు అలా చేస్తారా అని అనుకునేవారు. ఒక వేళ ఆయన నిజంగానే అలా టీడీపీలోకి వెళితే రాజకీయాలలో విలువలు పాటించని వ్యక్తులలో ఈయన కూడా ఒకరు అవుతారు. విశేషం ఏమిటంటే వైఎస్సార్సీపీ నుంచి అయితే నరసరావుపేట టిక్కెట్ కావాలట. టీడీపీ అయితే గుంటూరు నుంచి పోటీకి దిగుతారట. ఇది వాస్తవమో, కాదో తెలియదు. కానీ, ఇప్పుడు రాజీనామా చేయడంతో ఆ దిశగానే ఆయన అడుగులు వేస్తారేమోనన్న అనుమానం వస్తుంది. కృష్ణదేవరాయలు ఇలా ఓపెన్ అయిపోవడంతో బహుశా రాజీ చర్చలు కూడా ఏమీ ముందుకు వెళ్లకపోవచ్చు. నరసరావుపేట సీటును వైఎస్సార్సీపీ ఒక బీసీ అభ్యర్ధికి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. మరో ఎంపీ బాలశౌరిది మరో కధ. ఈయనకు పార్టీలో ఎనలేని గుర్తింపు ఉండేది. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి సమయంలో ఒకసారి తెనాలి నుంచి ఎంపీ అయ్యారు. ఆ తర్వాత సీఎం జగన్ ఆధ్వర్యంలో మరోసారి మచిలీపట్నం నుంచి ఎంపీ అయ్యారు. అయినా ఆ విశ్వాసాన్ని ఆయన నిలబెట్టుకోలేకపోయారు. మచిలీపట్నంలో కొత్త అభ్యర్దికి అవకాశం ఇస్తారన్న భావన ఆయనలో ఏర్పడి ఉండవచ్చు. దాంతో ఆయనకు అసంతృప్తి ఏర్పడినట్లు ఉంది. సామాజికవర్గం రీత్యా జనసేనకు వెళితే బెటర్ అని ఆయన అనుకున్నారు. ఆ వెంటనే పవన్ కళ్యాణ్‌ను కలిశారు. ఇప్పుడు టీడీపీ పొత్తులో ఆయనకు జనసేట టిక్కెట్ వస్తుందో, లేదో ఎవరూ చెప్పలేరు. అయినా ఆయన రాజకీయంగా తీసుకున్న నిర్ణయం గమనిస్తే పాలిటిక్స్‌లో విధేయతకు తక్కువ అవకాశం ఉంటుందని రుజువు చేసినట్లయింది. పార్టీలో కొంతమందితో విబేధాలు ఉంటే ఉండవచ్చు. అయినా పార్టీ నాయకత్వంతో సంబంధాలు బాగానే ఉన్నప్పుడు ఇలా నాయకులు నిర్ణయాలు తీసుకుంటే వారికే నష్టం కలిగే అవకాశం ఉంటుంది. బాలశౌరి భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి. ఇదే సమయంలో టీడీపీ ఎంపీ కేశినేని నాని వైఎస్సార్సీపీలోకి రాలేదా అన్న ప్రశ్న రావచ్చు. టీడీపీలో నాని అవమానాలకు గురవడం వల్ల పార్టీ మారక తప్పలేదు. సొంత తమ్ముడితోనే నానికి వ్యతిరేకంగా టీడీపీ నాయకత్వం కుంపటి పెట్టించింది. తిరువూరులో జరిగిన పార్టీ సభ ఏర్పాట్లకు రావద్దని ఎంపీగా ఉన్న నానికి చెప్పడం అంటే ఒకరకంగా అవమానించడమే. ఆ నేపథ్యంలో ఆయన వైఎస్సార్సీపీలోకి వచ్చి విజయవాడ నుంచి పోటీ చేయబోతున్నారు. ఇక, లావు కృష్ణదేవరాయలకు కానీ, బాలశౌరికి కానీ పార్టీలో అలాంటి అవమానాలేమీ లేవు. పైగా వారికి మంచి గౌరవమే లభించింది. అయినా టిక్కెట్ విషయంలో భిన్నాభిప్రాయాలు ఏర్పడడంతో పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు. అందువల్లే రాజకీయాలలో వీరు విలువలు పాటించలేదన్న అభిప్రాయానికి తావిచ్చారు. ఏది ఏమైనా ఇక్కడ ఒక విషయం చెప్పాలి. వైఎస్సార్సీపీ అధినేత, సీఎం జగన్ వీటిని ఏమీ పట్టించుకోకుండా, కేవలం జనాన్ని నమ్ముకుని రాజకీయాలను ముందుకు తీసుకువెళుతున్నారు. ఈ క్రమంలో అభ్యర్దులు ఎవరన్నదానికి కొంతమేరకే ప్రాముఖ్యత ఉంటుందనిపిస్తుంది. ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వ పనితీరుపైనే ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారనిపిస్తుంది. కాబట్టి సీఎం జగన్‌కు ఎవరూ ఎదురు చెప్పలేకపోతున్నారనిపిస్తుంది. ఒకవైపు తెలుగుదేశం, జనసేనల అధినేతలు చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్ ఇంతవరకు టిక్కెట్ల కేటాయింపు ఎలా చేయాలో తెలియక సతమతమవుతుంటే, ముఖ్యమంత్రి జగన్ మాత్రం తన పద్దతి ప్రకారం అభ్యర్ధులను ఖరారు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అదే సీఎం వైఎస్ జగన్ ప్రత్యేకత అని చెప్పాలి. -కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు -
ఈ సీఎఫ్‌వో రిజైన్ లెటర్ చూశారంటే అవాక్కవుతారు!
సీఎఫ్‌వో అంటే చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్. ఏ కంపెనీలో అయినా వీరిది ఉన్నత స్థాయి పోస్టు. సీఈవో తర్వత స్థాయిలో వీరి హోదా ఉంటుంది. ఇటీవల ఓ కంపెనీ సీఎఫ్‌వో రాజీనామా చేశారు. అయితే ఆ అధికారి రిజైన్ లెటర్‌ను చూసిన వారు అవాక్కవుతున్నారు. సాధారణంగా రాజీనామా లేఖను ఏ రూపంలోనైనా కంపెనీ యాజమాన్యానికి సమర్పించవచ్చు. అయితే మిత్షీ ఇండియా అనే కంపెనీ సీఎఫ్‌వో రింకు నికేత్ పటేల్ స్కూల్ నోట్‌బుక్ పేపర్‌పై రాజీనామా లేఖను రాసి సమర్పించారు. కంపెనీలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పదవికి రింకు నికేత్ పటేల్ చేసిన రాజీనామాను ఆమోదించినట్లు మిత్షీ ఇండియా డిసెంబర్ 21న ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. స్కూల్ నోట్‌బుక్ పేపర్‌పై రాసిన రాజీనామా లేఖను కంపెనీ తన అధికారిక ప్రకటనలో జత చేసింది. ఇదీ చదవండి: జనరేటివ్ ఏఐపై పోటాపోటీ! సీఈవోలు ఏం చెప్పారంటే.. వ్యక్తిగత కారణాల వల్ల రింకు నికేత్ పటేల్ రాజీనామా చేశారని, 2023 డిసెంబర్ 20 నుంచి ఇది అమల్లోకి వస్తుందని కంపెనీ తెలిపింది. "కంపెనీ కొత్త సీఎఫ్‌వోని నియమించే ప్రక్రియలో ఉందని, అది పూర్తయిన తర్వాత స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేస్తుంది" అని పేర్కొంది. మిత్షి ఇండియా లిమిటెడ్ 1976లో ఏర్పాటైంది. గతంలో దీన్ని డేరా పెయింట్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ అని పిలిచేవారు. 1992లో ఐపీవోకి వచ్చింది. కంపెనీ వెబ్సైట్ ప్రకారం ఇది 28 ఏళ్లుగా బీఎస్ఈలో లిస్ట్ అయి ఉంది. -
నామినేటెడ్‌పై ఆశలు.. జిల్లావ్యాప్తంగా తీవ్రమైన పోటీ!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పదేళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో మళ్లీ నామినేటెడ్ పదవుల జాతర కొనసాగనుంది. ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా పలువురు కాంగ్రెస్ ముఖ్యనేతలు ఎమ్మెల్సీ, కార్పొరేషన్ చైర్మన్ పదవులపై ఆశలు పెట్టుకున్నాయి. ఇటీవల రాష్ట్రంలోని 54 కార్పొరేషన్ చైర్మన్ల పదవులను ప్రభుత్వం రద్దు చేయడంతో నామినేటెడ్ పదవులను పొందేందుకు ఆశావహ నేతలు విస్త్రృతంగా ప్రయత్నాలను మొదలుపెట్టారు. ఇటీవల ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున టికెట్ దక్కని నేతలు, ఇతరుల కోసం ఎమ్మెల్యే టికెట్‌ను త్యాగం చేసిన ముఖ్యనేతలు ఆశావహుల్లో ముందు వరుసలో ఉన్నారు. రాష్ట్రస్థాయి కార్పొరేషన్పదవులపై ఆశలు.. గత ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నేతలకు కార్పొరేషన్ పదవులు దక్కాయి. వీరిలో స్టేట్ కో ఆపరేటివ్ కన్జ్యూమర్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్‌గా గట్టు తిమ్మప్ప, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా వేద సాయిచంద్ సతీమణి రజని, ముడా చైర్మన్‌గా గంజి వెంకన్న ముదిరాజ్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా మహమ్మద్ ఇంతియాజ్ ఇసాక్, మిషన్ భగీరథ చైర్మన్‌గా ఉప్పల వెంకటేశ్ గుప్తా, గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్‌గా రమావత్ వాల్యానాయక్, టూరిజం డెవలప్మెంట్ చైర్మన్‌గా గోలి శ్రీనివాస్‌రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ కార్పొరేషన్ చైర్మన్‌గా ఆంజనేయగౌడ్ పనిచేశారు. ఇటీవల ప్రభుత్వం వీరి పదవులను రద్దు చేసింది. ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్‌లోని ముఖ్య నేతలంతా ఎమ్మెల్సీ లేదా కార్పొరేషన్ చైర్మన్ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ఎమ్మెల్సీకి కసిరెడ్డి రాజీనామా.. మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి 2021లో ఎమ్మెల్సీగా గెలుపొందిన కసిరెడ్డి నారాయణరెడ్డి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీచేసి కల్వకుర్తి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఖాళీ ఏర్పడింది. గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరిన సీనియర్ నేతలు, పార్టీ టికెట్ ఆశించిన ముఖ్యులకు ఆ పార్టీ ఎమ్మెల్సీ పదవులను ఆఫర్ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ లేదా ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అనంతరం నామినేటెడ్ పదవులపై ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆశావహుల నుంచి తీవ్రమైన పోటీ నెలకొంది. ఇవి చదవండి: ప్రభుత్వాల మార్పుతో 'సెర్ప్' పే స్కేల్ అమలుపై అతలాకుతలం! -
నెల్లూరులో జనసేనకు భారీ షాక్
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): జనసేనకు తాను రాజీనామా చేస్తున్నానని ఆ పార్టీ నేత కేతంరెడ్డి వినోద్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జనసేన కోసం నగరంలో ఎంతో కృషి చేశానని, నెల్లూరు నగర నియోజకవర్గానికి అభ్యర్థిగా నారాయణను టీడీపీ మూడు నెలల క్రితం ప్రకటించిందని పేర్కొన్నారు. అప్పటికి జనసేనతో టీడీపీకి పొత్తు లేదని, అయినా తనను వచ్చే ఎన్నికల్లో సీటు ఆశించొద్దని.. నారాయణతో మనం కలిసి పని చేయాలని పార్టీ పెద్దలు పలువురు తనకు తెలిపారన్నారు. 2016లో సేవ్ నెల్లూరు అంటూ పోరాటం చేసిందే నారాయణ అక్రమాలపైనని, 2019 ఎన్నికల్లో ప్రత్యర్థిగా ఆయన అక్రమాలపై గళం వినిపించానని తెలిపారు. పార్టీలో తనకంటూ గౌరవం లేకుండా.. తాను భరోసా కల్పించిన ప్రజలకు నమ్మకం పోగొట్టేలా పార్టీలోని పలువురు వ్యవహరించారని.. ఇది సహించలేకే పార్టీకి రాజీనామా చేస్తున్నానని పేర్కొన్నారు. -
చేరికల చిచ్చు.. ఒక్క రోజుకే కాంగ్రెస్‌కు డీఎస్ రాజీనామా.. అసలేమైంది?
సాక్షి, హైదరాబాద్: మాజీ రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కుటుంబంలో చేరికల చిచ్చు చెలరేగింది. నిన్న (ఆదివారం)డీఎస్, ఆయన కుమారుడు సంజయ్ తిరిగి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. అయితే సొంతగూటికి చేరిన ఒక్కరోజుకే(సోమవారం) ఆ పార్టీకి రాజీనామా చేస్తునట్లు డీఎస్ ప్రకటించారు. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆయన లేఖ రాశారు. డీఎస్ లేఖ రాస్తున్న వీడియోను కూడా విడుదల చేశారు. రాజీనామా లేఖను ఆయన సతీమణి విజయలక్ష్మి మీడియాకు విడుదల చేశారు. డీఎస్ ఆరోగ్యం సహకరించట్లేదని, కాంగ్రెస్ వాళ్లు తమ ఇంటి వైపుకు రావొద్దని డీఎస్ భార్య విజ్ఞప్తి చేశారు. కాగా తొలుత కాంగ్రెస్ నేత అయిన డీఎస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పీసీసీ చీఫ్‌గా పనిచేశారు. రాష్ట్ర విభజన తరువాత టీఆర్ఎస్(ప్రస్తుత బీఆర్ఎస్) పార్టీలో చేరి రాజ్యసభ ఎంపీగా ప్రాతినిథ్యం వహించారు. కొంతకాలంగా బీఆర్ఎస్కు ఆయన దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం తన కొడుకు సంజయ్‌తో కలిసి గాంధీభవన్‌కు వచ్చిన డీఎస్.. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావ్ ఠాక్రే సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే మరుసటి రోజే కాంగ్రెస్‌కు రాజీనామా చేయడం సంచలనంగా మారింది. కాగా డీఎస్ మరో కొడుకు అర్వింద్ బీజేపీ ఎంపీగా కొనసాగుతున్నారు. కాగా ‘కొడుకు సంజయ్ కాంగ్రెస్‌లో చేరిన సందర్భంగా ఆశీస్సులు ఇవ్వడానే గాంధీభవన్‌కు వచ్చాను. కానీ తాను కూడా మళ్లీ పార్టీలో చేరినట్టుగా మీడియాలో ప్రచారం చేశారు. నేను ఎపన్పటికీ కాంగ్రెస్ వాదినే కానీ.. ప్రస్తుతం నా వయస్సు, ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా క్రీయాశీల రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నాను. పార్టీలో నా చేరికకూ, నా కుమారుడు సంజయ్ టికెట్‌కు ముడిపెట్టడం భావ్యం కాదు. నన్ను వివాదాల్లోకి లాగవద్దని విజ్ఞప్తి. కాంగ్రెస్ పార్టీలో నేను మళ్లీ చేరానని మీరు భావిస్తే ఈ లేఖను రాజీనామాగా భావించి ఆమోదించవలసిందిగా కోరుకుంటున్నాను’ అని లేఖలో పేర్కొన్నారు. -
మోదీ-అమిత్ షా వ్యూహాలకు చెక్.. బీఆర్ఎస్లోకి కీలక నేతలు!
దేశంలో రాజకీయాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఒక రాజకీయ పార్టీకి చెందిన నేత ఎప్పుడు ఏ పార్టీలో ఉన్నారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా ఒడిషాలో బీజేపీకి చెందిన మరో సీనియర్ నేత, ఆయన కుమారుడు షాకిచ్చారు. బీజేపీకి రాజీనామా చేస్తూ జేపీ నడ్డాకు లేఖ రాసి కాషాయ పార్టీని వీడారు. అయితే, వారిద్దరూ తెలంగాణ సీఎం కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్, ఆయన కుమారుడు శిశిర్.. బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు గిరిధర్ గమాంగ్ ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ బీజేపీలో తమకు జరుగుతున్న అవమానాలను తట్టుకోలేకనే పార్టీని వీడుతున్నట్టు తెలిపారు. కొందరు మమ్మల్ని ఉద్దేశ్యపూర్వకంగానే పార్టీల్లో పక్కనపెట్టారు. పార్టీ కార్యక్రమాల గురించి ఆలస్యంగా సమాచారం ఇస్తున్నారు. నాకు ఎంపీ టికెట్ ఇస్తానని చెప్పి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని శిశిర్ ఆరోపించారు. కానీ, గ్రౌండ్ లెవల్లో మాత్రం పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి ఎలాంటి సపోర్ట్ లభించలేదన్నారు. ఇదిలా ఉండగా.. గిరిధర్ గమాంగ్ 2015లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అయితే, గత కొద్ది సంవత్సరాలుగా ఒడిశా ప్రజలకు తాను తన రాజకీయ, సామాజిక, నైతిక బాధ్యతలను నిర్వర్తించలేకపోతున్నానని, అందుకే బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తన లేఖలో గమాంగ్ పేర్కొన్నారు. తక్షణమే తన రాజీనామా లేఖను ఆమోదించాలని ఆయన కోరారు. అయితే, ఈ క్రమంలోనే తాను జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరానని.. మళ్లీ ఇప్పుడు కూడా మరో నేషనల్ పార్టీలో చేరనున్నట్టు తెలిపారు. కాగా, ఇటీవలే వీరితో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. దీంతో, వీరిద్దరూ బీఆర్ఎస్లో చేరే అవకాశం ఉన్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
తల పట్టుకున్న పుతిన్.. రష్యాలో ఇలా జరిగిందేంటి.. వీడియో వైరల్
మాస్కో: ఉక్రెయిన్‌లో రష్యా దాడులు కొనసాగుతున్న సమయంలో పుతిన్‌కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. వార్ కారణంగా పుతిన్‌కు స్వదేశంలో మరోసారి నిరసన తగిలింది. రష్యాకు చెందిన TV Rain టీవీ చానల్ సిబ్బంది లైవ్‌లో మూకుమ్మడి రాజీనామాలు చేసి ఆశ్చర్యానికి గురి చేశారు. వివరాల ప్రకారం.. ఉక్రెయిన్‌పై రష్యా దాడులను వ్యతిరేకిస్తూ ఆ దేశానికి చెందిన టీవీ రెయిన్ చానల్ సిబ్బంది రాజీనామా చేశారు. ఓ వైపు లైవ్‌లో న్యూస్ రన్ అవుతుండగానే వారంతా రాజీనామా చేయడం సంచలనంగా మారింది. చానల్ సిబ్బంది చివరగా యుద్ధం వద్దు అనే ప్రకటనతో టీవీ ప్రసారాలు చేసి రాజీనామాలు అందించారు. వారి నిర్ణయాన్ని సంస్థ యాజమాన్యం సైతం మద్దతు ఇవ్వడం విశేషం. ఇదిలా ఉండగా అంతకు ముందు ‘టీవీ రెయిన్’ చానల్ ఉక్రెయిన్ యుద్ధాన్ని కవర్ చేసింది. దీంతో రష్యా ప్రభుత్వం యుద్ధాన్ని ప్రసారం చేసేందుకు అంగీకరించలేదు. ఈ క్రమంలో ఆ చానల్ ప్రసారాలను రష్యా ప్రభుత్వం నిలిపివేసింది. మరోవైపు.. ఛానెల్ ఫౌండర్స్‌లో ఒకరైన నటాలియా సిందెయెవా మాట్లాడుతూ.. యుద్ధం వద్దు అనే ప్రోగ్రాం తర్వాత ఉద్యోగులు రాజీనామాలు ఇచ్చి స్టూడియో నుంచి వెళ్లిపోయారని అన్నారు. అనంతరం తమ చానల్ ప్రసారాలను నిరవధికంగా నిలిపివేస్తున్నట్టు పేర్కొన్నారు. Meanwhile TVRain, the last independent media outlet operating in Russia, has shut down — here's the last few minutes of its broadcast, poorly Google Translated. It then cut to Swan Lake, which has particular relevance: https://t.co/XXtUHroZkt pic.twitter.com/Iq7HSal7FW — Timothy Burke (@bubbaprog) March 3, 2022 -
ఒక వైపు నామినేషన్లు.. మరోవైపు రాజీనామాలు
చండీగఢ్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న పంజాబ్ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఒక వైపు కాంగ్రెస్ అభ్యర్థులు ఆయా స్థానాల నుంచి నామినేషన్లు దాఖలు చేస్తున్న తరుణంలో.. మరోవైపు రాజీనామాల పర్వం తీవ్ర దుమారాన్ని రేకెత్తిస్తుంది. తాజాగా, ఖిల్లా రాయ్‌పూర్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే జస్బిర్ సింగ్ ఖాన్గుర కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బాయ్ చెప్పారు. ఈ మేరకు ఆయన ట్విటర్ వేదికగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి తన రాజీనామా సమర్పించారు. తన లేఖలో కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాను.. 20 ఏళ్లపాటు కాంగ్రెస్‌కు సేవచేసినట్లు తెలిపారు. అయితే, ఆయన ఏ పార్టీలో చేరతారో మాత్రం ప్రకటించలేదు. కాగా, జస్బిర్ సింగ్.. తండ్రి జగ్పాల్ కూడా కాంగ్రెస్‌కు చెందిన సీనియర్ నాయకుడు. ఇప్పటికే ఆయా పార్టీల నుంచి మంత్రుల నుంచి స్థానిక నాయకుల వరకు వలసలు ఊపందుకున్నాయి. ఇప్పటికే పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా, రాహుల్‌గాంధీ పంజాబ్టూర్లో సీఎం చన్నీ, నవజ్యోత్ సింగ్ సిద్ధూల మధ్య ఎలాంటి విభేదాలు లేవని తెలిపే ప్రయత్నం చేశారు. అదే వేదికలో చన్నీ, సిద్దూ.. ఇరువురు నాయకులు సీఎం అభ్యర్థిగా ఎవరిని ప్రకటించిన మరొకరు వారికి.. మద్దతు పలుకుతామని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో మరికొన్ని రోజుల్లో సీఎం అభ్యర్థి ఉత్కంఠకు తెరపడనున్నట్లు తెలుస్తోంది. పంజాబ్‌లో ఫిబ్రవరి 20 నుంచి అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. మార్చి 10 న ఓట్ల లెక్కింపు జరగనుంది. Jasbir Singh Khangura, former MLA from Qila Raipur in Punjab quits Congress party. pic.twitter.com/4x5VPi4zVB — ANI (@ANI) January 30, 2022 చదవండి: గత 2 నెలలుగా బాలికను వినోద్‌జైన్ లైంగికంగా వేధించాడు: ఏసీపీ -
పార్టీలో ఇంటి దొంగలను వదిలిపెట్టేది లేదు: రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కౌశిక్ రెడ్డిపై బహిష్కరణ వేటు వేసింది. ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా టీపీసీసీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, కౌశిక్ రెడ్డి రాజీనామాపై స్పందించారు. టీఆర్ఎస్తో కుమ్మక్కై కౌశిక్ రెడ్డి కోవర్ట్‌గా మారారని విమర్శించారు. కాంగ్రెస్‌లో ఇంటి దొంగలను విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు. నెలాఖరు వరకు కాంగ్రెస్ ఇంటి దొంగలకు డెడ్‌లైన్ విధించారు రేవంత్ రెడ్డి. ఇక కాంగ్రెస్ పార్టీ పెద్దలు తనకు సహకరించ లేదని.. పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా ఇతరులకు పదవులిస్తున్నారని కౌశిక్ రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. 50 కోట్ల రూపాయలు ఇచ్చి రేవంత్ రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్ అయ్యారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. సీనియర్లను కాదని రేవంత్ రెడ్డికి టీపీసీసీ బాధ్యతలు అప్పగించడం తనను బాధించిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మనుగడ కష్టం అని.. అందుకే పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
రూ.50కోట్లు ఇచ్చి రేవంత్‌రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ అయ్యాడు: కౌశిక్‌రెడ్డి
-
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి కౌశిక్ రెడ్డి రాజీనామా
-
కాంగ్రెస్ పార్టీకి కౌశిక్ రెడ్డి రాజీనామా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. హుజూరాబాద్ కాంగ్రెస్ నేత కౌశిక్‌రెడ్డి సోమవారం పార్టీకి రాజీనామా చేశారు. టీపీసీసీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసు అందుకున్న 24 గంటల్లోనే కౌశిక్ రెడ్డి రాజీనామా ప్రకటించడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతుంది. రాజీనామా ప్రకటన అనంతరం కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్ పార్టీ పెద్దలు నాకు సహకరించడం లేదు. పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా ఇతరులకు పదవులిస్తున్నారు. పార్టీ పదవుల విషయంలో నాకు ప్రాధాన్యత ఇవ్వలేదు. కొందరు సీనియర్ నేతలు పార్టీకి నష్టం కల్గిస్తున్నారు’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘50 కోట్ల రూపాయలు ఇచ్చి రేవంత్ రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్ అయ్యారు. సీనియర్లను కాదని రేవంత్ రెడ్డికి టీపీసీసీ బాధ్యతలు అప్పగించడం నన్ను బాధించింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మనుగడ కష్టం’’ అన్నారు కౌశిక్ రెడ్డి. కొంతకాలంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ, టీఆర్ఎస్ నాయకులతో సన్నిహితంగా ఉంటున్నట్లు ఫిర్యాదులు నేపథ్యంలో 24 గంటల్లో వివరణ ఇవ్వాలంటూ క్రమశిక్షణ సంఘం కౌశిక్‌రెడ్డికి ఇచ్చిన నోటీస్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే. దీని గురించి గతంలో కౌశిక్‌రెడ్డిని హెచ్చరించినా ఆయన తీరులో మార్పు రాలేదని క్రమశిక్షణ సంఘం తెలిపింది. ఈటల రాజీనామాతో ఉప ఎన్నిక తథ్యమైన హుజూరాబాద్‌లో.. టీఆర్ఎస్ తనకే టికెట్ ఇస్తుందని ఫోన్లో కౌశిక్ రెడ్డి స్థానిక నాయకులతో చెప్తున్నట్లు ఉన్న ఆడియో క్లిప్ వైరలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీపీసీసీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసు జారీ చేసింది. -
మంత్రి మన్మధ
-
రాసలీలల వీడియో: మంత్రి రాజీనామా
బెంగళూరు: కర్ణాటక జలవనరుల శాఖ మంత్రి రమేశ్ జార్కిహోలి ఓ యువతితో రాసలీలలు జరుపుతోన్న వీడియో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రమేష్ రాజీనామా చేయాలని.. అతడిపై చర్య తీసుకోవాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఇక వీడియోలు లీకైనప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన రమేష్ తాజాగా దీనిపై స్పందించారు. అది ఫేక్ వీడియో అన్నారు. కానీ నైతిక కారణాల దృష్ట్యా తాను రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. "నాపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. ఈ విషయంలో స్పష్టమైన దర్యాప్తు అవసరం. అది ఫేక్ వీడియో.. నేను నిర్దోషిగా బయటకు వస్తానని నాకు నమ్మకం ఉంది. నేను నైతిక కారణాల వల్ల రాజీనామా చేస్తున్నాను.. దీనిని ఆమోదించాల్సిందిగా కోరుతున్నాను" అని రమేశ్ తన రాజీనామ లేఖలో పేర్కొన్నారు. ఈ అంశంపై బీజేపీ కూడా స్పందించింది. ఈ విషయాన్ని పూర్తిగా దర్యాప్తు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. యువతి డాక్యుమెంటరీ విషయమై కొద్ది రోజుల కిందట మంత్రి రమేశ్ వద్దకు వచ్చింది. ఈ క్రమంలో మంత్రి ఆమెను లోబచర్చుకున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన వీడియో, ఆడియో సీడీలను పౌరహక్కుల పోరాట సమితి అధ్యక్షుడు దినేశ్ కల్లహళ్లి బెంగళూరు నగర పోలీసు కమిషనర్ కమల్‌పంత్‌కు అందజేసిన సంగతి తెలిసిందే. చదవండి: మంత్రి రాసలీలల వీడియోలు వైరల్ -
నేనే ఆర్టీసీ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నా
సాక్షి ప్రతినిధి, సూర్యాపేట: ‘ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మీ వైఖరితో తీవ్ర మానసిక వేదనకు గురయ్యా. ఆత్మాభిమానాన్ని చంపుకొని ఉద్యోగం చేయలేను. మమ్మల్ని డిపో వద్దకు కూడా రానివ్వడం లేదు. బస్టాండ్, డిపో చుట్టూ బారికేడ్లు పెట్టారు. లోపలికి వెళ్తే మాపై కేసులు పెడుతున్నారు. దీంతో ఆవేదన చెందా. మీరు ఉద్యోగం నుంచి తీయడం కాదు.. నేనే ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నా’ అని సోషల్ మీడియా వేదికగా సూర్యాపేట డిపోకు చెందిన కండక్టర్ లునావత్ కృష్ణానాయక్ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశాడు. కృష్ణానాయక్‌ది సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం సూర్యానాయక్ తండా. ఇతను సోషల్ మీడియాలో పోస్టు చేసిన లేఖ బుధవారం వైరల్ అయింది. కృష్ణానాయక్ 2009 నుంచి కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. రాజీనామా లేఖను సీఎం కేసీఆర్‌కు సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీనిపై కార్మికులు, రాజకీయ వర్గాల్లో చర్చసాగింది. ఆ లేఖలో.. ‘తెలంగాణలో గౌరవంతో ఉద్యోగం చేద్దామ నుకున్నా.. ఆత్మగౌరవంతో బతుకుదాం అనుకున్నా. కానీ మీలాంటి గొప్ప మనిషి ఉన్న ఈ రాష్ట్రంలో ఎందుకు పుట్టాను అనే మానసిక వేదనకు గురై ఈ నిర్ణయం తీసుకున్నా’ అని ప్రారంభించి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇతర ఇబ్బందులను అందులో ప్రస్తావించాడు. ‘కార్మికులు ఏం తప్పుచేశారని.. మహిళలని చూడకుండా లాఠీలతో కొట్టించడం, అరెస్టులు చేయడం ఏంటి’ అని ప్రశ్నించాడు. తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నానని, సంస్థ నుంచి రావాల్సిన బకాయిలు ఇప్పించాలని కోరాడు. పోస్టు నిజమే: కృష్ణానాయక్ మమ్మల్ని డిపో వద్దకు రానివ్వడం లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. సోషల్ మీడియాతో అందరికీ తెలవాలని సీఎంకు లేఖ రాశా. మేనేజర్ కలిస్తే రాజీనామా కచ్చితంగా ఇస్తా.. వెనక్కు పోను. -
‘అందుకే రాజీనామా చేస్తున్న’
పట్నా : జేడీ(యూ) అధినేత నితీష్‌కుమార్‌ను ఇబ్బంది పెట్టడం ఇష్టంలేకే తాను పార్టీ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ నేత అజయ్ అలోక్ తెలిపారు. రాష్ట్ర జేడీ(యూ) చీఫ్ వశిష్ట నారాయణ సింగ్‌కు సమర్పించిన తన రాజీనామా పత్రాన్ని ఆయన గురువారం రాత్రి తన ట్వీట్టర్లో ఉంచారు. ‘నేను పార్టీకి అనుకూలంగా పనిచేయలేకపోవడంతో నా పదవికి రాజీనామా చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పార్టీకి, మీకు నా ధన్యవాదాలు. దయచేసి నా రాజీనామాను ఆమోదించండి’ అని పేర్కొన్నారు. అయతే ఏ విషయంలో నితీశ్‌ను తాను ఇబ్బంది పెడుతున్నారో అలోక్ లేఖలో తెలియజేయలేదు. బెంగాల్‌లోని మమత బెనర్జీ ప్రభుత్వాన్ని ఎక్కువగా విమర్శస్తుండటం, అక్రమ వలసలపై అధికంగా మాట్లాడే విషయంలో పార్టీ అధినేతతో అలోక్‌కి విభేదాలు తలెత్తినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. బీజేపీతో కలవకుండా బీహార్‌తో పాటు మరో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన నితీశ్ నిర్ణయాన్ని మమత మెచ్చుకున్నారు. అయితే దీదీ ప్రశంసను అలోక్ తోసిబుచ్చారు. తృణమూల్ అధినేత్రి మమత బెనర్జీ బెంగాల్ రాష్ట్రాన్ని మిని పాకిస్తాన్‌గా మార్చారని అలోక్ ఆరోపించారు. బెంగాల్ నుంచి బీహారీలు బయటకు వెళ్లేలా చేస్తున్నారని కానీ ఇలా చేస్తోంది బెంగాలీలు కాదు రోహింగ్యాలు అని అలోక్ ఆరోపించారు. అలోక్ వ్యాఖ్యలపై ప్రతి పక్షాలు తీవ్రంగా మండి పడ్డాయి. అలోక్ సంఘ్‌పరివార్ భావజాలంతో మాట్లాడుతున్నారని, నితీశ్ కుమార్ సామాజిక న్యాయం, మత సమరస్య భావాలకు అలోక్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాజీనామా చేసి 24 గంటలు కాకముందే అక్రమ వలసల విషయంలో చర్యలు తీసుకోవాలని నరేంద్ర మోదీని అలోక్ ట్వీటర్ ద్వారా కోరారు. ‘మీరు అవినీతిని అంతమొందిస్తానని అన్నారు. కానీ బంగ్లాదేశ్, బర్మా సరిహద్దుల్లో ఉన్న బీఎస్ఎఫ్ అధికారుల ఆస్తులు అమాంతం పెరిగాయి. బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు అంత తేలికగా దేశంలోకి రాలేరు కదా? ఈ విషయాన్ని లోతుగా పరిశీలించండి’ అని అలోక్ ట్వీట్ చేశారు. మరోక ట్వీట్లో ‘మమతకి వ్యతిరేకంగా పోరాడితే ఏం ప్రయోజనం ఉండదు. మన వ్యవస్థను బలోపేతం చేసుకోవాలి. ప్రత్యేకంగా అమిత్‌షా హోం మంత్రిగా ఉన్నప్పుడు అక్రమ వలసలను అరికట్టడానికి గట్టి చర్యలు తీసుకోని వాటిని పూర్తిగా నియంత్రించాలి’ అని పేర్కొన్నారు. -
బెంగాల్లో 43 మంది వైద్యుల రాజీనామా
సాక్షి, కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో డాక్టర్ల నిరసన సెగలు ఇంకా చల్లారడం లేదు. జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మెకు మద్దతుగా శుక్రవారం బెంగాల్ ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేస్తున్న 43 మంది వైద్యులు రాజీనామా చేశారు. జూనియర్ వైద్యుడిపై దాడికి నిరసనగా జూనియర్ వైద్యులు నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. సమ్మె విరమించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెచ్చరించినప్పటికీ వాటిని వైద్యులు బేఖాతరు చేశారు. తమకు రక్షణ కల్పించాల్సిందేనంటూ పట్టుబట్టారు. అయితే ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో డాక్టర్లు సమ్మెను తీవ్రతరం చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆర్జీకర్ మెడికల్ కాలేజీకి చెందిన 16 మంది వైద్యులు తమ రాజీనామాను ప్రభుత్వ ఆరోగ్యశాఖకు అందించారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో మా భాధ్యతలను నిర్వర్తించలేమని’ డాక్టర్లు లేఖలో పేర్కొన్నారు. వారితో పాటు డార్జిలింగ్‌లోని నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజీకి చెందిన 27 మంది వైద్యులు శుక్రవారం రాజీనామాను సమర్పించారు. వైద్యుల నిరసనకు మద్దతుగా ప్రముఖ ఎన్ఆర్ఎస్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా. సాయిబాల్ ముఖర్జీ ,సూపరిండెంట్ కం. వైస్ ప్రిన్సిపాల్ సౌరభ్ ఛటోపద్యాయ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్( డీయంఈ) కి రాజీనామాను సమర్పించారు. అత్యవసర సేవలు మాత్రమే.. ఔట్ పేషెంట్ మరియు అత్యవసర విభాగాల్లో విధులు నిర్వహించాల్సిందిగా డీయంఈ ప్రొఫెసర్ డా. ప్రదీప్ కుమార్ డే అన్ని వైద్య కళాశాలల ప్రిన్సిపాల్, డైరెక్టర్లకు గురువారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. జూనియర్ డాక్టర్ల సమ్మెతో అన్ని ప్రభుత్వ రంగ వైద్య కళాశాలలు, ప్రైవేటు ఆసుపత్రులలోనూ అత్యవసర సేవలు మినహా సాధారణ సేవలు నిలిచిపోనున్నాయి. శుక్రవారం ఉదయం నిల్ రతన్ సర్కార్ (ఎన్ఆర్ఎస్) మెడికల్ కాలేజీ, హాస్పిటల్ సహా ఒకటి , రెండు ఆసుపత్రులలో అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. -
టీడీపీకో దండం.. ఎమ్మెల్యే బీకే ఓ ఉన్మాది
అనంతపురం సెంట్రల్: పెనుకొండ ఎమ్మెల్యే బీకే పార్థసారథి ఓ ఉన్మాది అని, తమపై కక్ష సాధించేందుకు రొద్దం మండల అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకున్నాడని ఆ మండల ఎంపీపీ పద్మావతి, పలువురు టీడీపీ నాయకులు ఆరోపించారు. సోమవారం ఎంపీపీ పద్మ తన పదవికి రాజీనామా చేశారు. తమ అనుచరులతో నేరుగా జిల్లా పరిషత్ కార్యాలయానికి చేరుకున్న ఆమె తన రాజీనామా లేఖను డిప్యూటీ సీఈఓ సూర్యనారాయణకు అందజేశారు. అనంతరం తన రాజీనామాకు గల కారణాలను మీడియాకు వెల్లడించారు. 2017 నుంచి (18 నెలలు) ఎంపీపీగా కొనసాగుతున్నట్లు వివరించారు. రొద్దం మండలంలో తమ రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక ఎమ్మెల్యే పార్థసారథి కక్షసాధింపు చర్యలతో వేధింపులకు పాల్పడుతూ వచ్చాడని ఆరోపించారు. పేరుకు మాత్రం తాము ఎంపీపీ హోదాలో ఉన్నా.. ఆశించిన స్థాయిలో ప్రజలకు సేవలు అందించలేకపోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కరుడుగట్టిన ఉన్మాదిలా మారిన ఎమ్మెల్యే... మండల అభివృద్ధితో పాటు సంక్షేమ ఫలాలను ప్రజలకు చేరనీయకుండా అడుగడుగునా అడ్డుకుంటూ వచ్చారన్నారు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు సైతం ఎమ్మెల్యే అనుమతి లేనిదే ఇవ్వడం లేదన్నారు. కార్యాలయానికి సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజలకు నీళ్లు కూడా ఇవ్వకుండా అడ్డుకున్నాడన్నారు. జిల్లా పరిషత్‌లో కూడా ఎమ్మెల్యేలు లేఖలు ఉంటేనే నిధులు ఇస్తున్నారని ఆరోపించారు. అధికార టీడీపీ కన్నా గత కాంగ్రెస్ హయామే మేలని అన్నారు. చివరకు ఎంపీ నిమ్మలకిష్టప్ప తమను చేరదీయడాన్ని జీర్ణించుకోలేక మరింత వేధింపులకు గురి చేస్తూ వచ్చాడన్నారు. తమకు అనుకూలంగా వైఎస్సార్సీపీ సిద్ధాంతాలు ఉండడంతో ఆ పార్టీలో త్వరలో చేరబోతున్నట్లు స్పష్టం చేశారు. తమతో కలిసి వచ్చే కార్యకర్తలు, నాయకులను కలుపుకుని జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో ఇకపై పనిచేస్తామం టూ పేర్కొన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన శంకరనారాయణ తమను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తారని నమ్ముతున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. పార్థసారథి సన్నిహితుడు సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ... ఎమ్మెల్యేది, తనది ఒకే ఊ రని, అయినా ఆయన వ్యవహారశైలి నచ్చక పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఇంత కాలం టీడీపీ కోసం ఎంతో కష్టపడ్డామని, పార్థసారథి వెన్నంటే ఉంటూ వచ్చామని వివరించారు. త్వరలో తమ అనుచరులతో కలిసి వైఎస్సార్సీపీలో చేరుతామని ప్రకటించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకుడు, ఎంపీపీ భర్త అక్కులప్ప, మాజీ సింగిల్‌విండో అధ్యక్షుడు అంజన్‌రెడ్డి, మాజీ సర్పంచ్ నాగరాజు, ఉపసర్పంచ్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. పార్థుడికి షాక్ రొద్దం: మండలంలో టీడీపీని బలోపే తం చేయడంతో పాటు స్థానిక ఎమ్మెల్యే బీకే పార్థసారథి విజయంలో కీలకంగా వ్యవహరించిన టీడీపీ నేత, ఎంపీపీ పద్మావతి సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. ఇదే సందర్భంగా ఆమె భర్త అక్కులప్పతో పాటు తాజా మాజీ సర్పంచ్ నాగరాజు, ఎం.కొత్తపల్లి ఎంపీటీసీ సభ్యుడు, ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు, మాజీ సర్పంచ్ సి.నారాయణరెడ్డి, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు జెట్టి అంజినరెడ్డి, సీనియర్ నాయకుడు కొత్తపల్లి కురుబ తిప్పన్న, పలువురు కార్యకర్తలు టీడీపీ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మా ట్లాడుతూ.. నమ్మిన వ్యక్తులను, పార్టీ అ భ్యున్నతికి కృషి చేసే వ్యక్తులను ఎమ్మెల్యే పార్థసారథి మోసం చేస్తున్నాడని మండిపడ్డారు. అక్కులప్ప మాట్లాడుతూ పార్థసారథిని నమ్మి ఆయన గెలుపు కోసం నిరంతరం పనిచేసినట్లు తెలిపారు. ఓ క్రమంలో పార్టీ కోసం జైలుకు సైతం వెళ్లినట్లు గుర్తు చేశారు. మండల అభివృద్ధిని అడ్డుకుంటు, ప్రజలకు సంక్షేమ ఫలాలు దక్కకుండా చేస్తున్న ఎమ్మెల్యే వైఖరితో విసుగు చెంది టీడీపీని వీడుతున్నట్లు తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నారని, ఆయన వ్యక్తిత్వానికి ఆకర్షితులై త్వరలో వైఎస్సార్ సీపీలో చేరబోతున్నట్లు తెలిపారు. -
ఎఫ్టీటీఐ చీఫ్‌గా తప్పుకున్న అనుపమ్ ఖేర్
సాక్షి, న్యూఢిల్లీ : భారత ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ (ఎఫ్టీటీఐ) ఛైర్మన్ పదవికి జాతీయ అవార్డు గ్రహీత, సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ బుధవారం రాజీనామా చేశారు. బిజీ షెడ్యూల్ కారణంగానే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఎఫ్టీఐఐ ఛైర్మన్‌గా ఉండటం తనకు అత్యంత అరుదైన గౌరవంగా భావిస్తానని తనకున్న అంతర్జాతీయ అసైన్మెంట్ల కారణంగా సంస్థకు ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నానన్నారు. తనకు ఈ పదవిని చేపట్టేందుకు ఇప్పటివరకూ సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానంటూ అనుపమ్ ఖేర్ ట్వీట్ చేశారు. సమాచార, ప్రసార మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాధోర్ను ఉద్దేశిస్తూ రాజీనామా లేఖను సైతం ట్విటర్లో ఆయన పోస్ట్ చేశారు.గత ఏడాది అక్టోబర్ 11న గజేంద్ర చౌహాన్ స్ధానంలో అనుపమ్ ఖేర్ ఎఫ్టీఐఐ ఛైర్మన్‌గా నియమతులైన సంగతి తెలిసిందే. -
రేవంత్ రాజీనామా ఎక్కడ ఆగింది: ఎ.జీవన్‌రెడ్డి
కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. ‘రేవంత్ రాజీనామా ఎక్కడ ఆగింది. ఎక్కడ తట్టుకుంది. స్పీకర్ అయితే.. రాలేదన్నారు. రేవంత్.. ఆట మొదలయింది అన్నడు. ఎక్కడ పోయాడు?’అని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సంపత్‌ను ప్రశ్నించారు. ప్రతిగా ఎమ్మెల్యే సంపత్.. ‘అసలు రేవంత్ రాజీనామా గురించి అడిగే దమ్ము టీఆర్ఎస్కు లేదు. అసలు టీఆర్ఎస్ దగ్గర ఆయుధాలు లేవు..’అంటూ స్పందించారు. -
గోషామహల్ ఎమ్మెల్యే రాజీనామా
-
నన్ను తప్పించండి: వెంగమ్మ
-
నన్ను తప్పించండి: వెంగమ్మ
తిరుపతి: తిరుపతి శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ డైరెక్టర్ పదవి నుంచి తొలగించాలంటూ డాక్టర్ భూమావెంగమ్మ రాష్ట్రప్రభుత్వానికి లేఖ రాశారు. హైదరాబాద్‌లో వైద్య, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యంకు ఆమె వినతి పత్రం అందజేశారు. కొన్ని నెలలుగా స్విమ్స్‌లో జరుగుతున్న పరిణామాలపై మనస్తాపం చెందినట్టు తెలిపారు. తమకు అనుకూలమైన వారిని డైరెక్టర్ పదవిలో ఉంచడానికి అధికార టీడీపీ ప్రజాప్రతినిధులు చక్రం తిప్పుతున్నట్టు ఆమె ఆవేదన చెందారు. డెరైక్టర్, వైస్ చాన్సలర్ పదవులకు డాక్టర్ భూమావెంగమ్మ రాజీనామా చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. 2009 నుంచి స్విమ్స్ డెరైక్టర్‌గా, వైస్‌చాన్సలర్‌గా వెంగమ్మ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈనేపథ్యంలో వ్యక్తిగత కారణాలు చూపుతూ స్విమ్స్ డెరైక్టర్ పదవులకు నెల ముందుగానే రాజీనామా చేస్తున్నానని, దీనిని ఆమోదించాలంటూ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీకి ఈనెల 20వ తేదీన రాజీనామా పత్రం అందించినట్టు తెలిసింది. అయితే ఆమె రాజీనామా విషయాన్ని అధికారులు ధ్రువీకరించలేదు.