నెల్లూరులో జనసేనకు భారీ షాక్‌ | Nellore Key Leader Kethamreddy Vinod Reddy Resigns From Janasena - Sakshi
Sakshi News home page

జనసేనకు కేతంరెడ్డి రాజీనామా

Published Fri, Oct 13 2023 8:02 AM | Last Updated on Fri, Oct 13 2023 9:20 AM

Ketam Reddy resigns from Janasena - Sakshi

నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): జనసేనకు తాను రాజీనామా చేస్తున్నానని ఆ పార్టీ నేత కేతంరెడ్డి వినోద్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జనసేన కోసం నగరంలో ఎంతో కృషి చేశానని, నెల్లూరు నగర నియోజకవర్గానికి అభ్యర్థిగా నారాయణను టీడీపీ మూడు నెలల క్రితం ప్రకటించిందని పేర్కొన్నారు. అప్పటికి జనసేనతో టీడీపీకి పొత్తు లేదని, అయినా తనను వచ్చే ఎన్నికల్లో సీటు ఆశించొద్దని.. నారాయణతో మనం కలిసి పని చేయాలని పార్టీ పెద్దలు పలువురు తనకు తెలిపారన్నారు. 

2016లో సేవ్‌ నెల్లూరు అంటూ పోరాటం చేసిందే నారాయణ అక్రమాలపైనని, 2019 ఎన్నికల్లో ప్రత్యర్థిగా ఆయన అక్రమాలపై గళం వినిపించానని తెలిపారు. పార్టీలో తనకంటూ గౌరవం లేకుండా.. తాను భరోసా  కల్పించిన ప్రజలకు నమ్మకం పోగొట్టేలా పార్టీలోని పలువురు వ్యవహరించారని.. ఇది సహించలేకే పార్టీకి రాజీనామా చేస్తున్నానని పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement