
సాక్షి, న్యూఢిల్లీ : భారత ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ (ఎఫ్‌టీటీఐ) ఛైర్మన్ పదవికి జాతీయ అవార్డు గ్రహీత, సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ బుధవారం రాజీనామా చేశారు. బిజీ షెడ్యూల్ కారణంగానే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఎఫ్‌టీఐఐ ఛైర్మన్‌గా ఉండటం తనకు అత్యంత అరుదైన గౌరవంగా భావిస్తానని తనకున్న అంతర్జాతీయ అసైన్‌మెంట్ల కారణంగా సంస్థకు ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నానన్నారు.
తనకు ఈ పదవిని చేపట్టేందుకు ఇప్పటివరకూ సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానంటూ అనుపమ్ ఖేర్ ట్వీట్ చేశారు. సమాచార, ప్రసార మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాధోర్‌ను ఉద్దేశిస్తూ రాజీనామా లేఖను సైతం ట్విటర్‌లో ఆయన పోస్ట్ చేశారు.గత ఏడాది అక్టోబర్ 11న గజేంద్ర చౌహాన్ స్ధానంలో అనుపమ్ ఖేర్ ఎఫ్‌టీఐఐ ఛైర్మన్‌గా నియమతులైన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment