'ధోనీకి తండ్రిగా నటిస్తున్నాను' | I play Dhoni's father Paan Singh, says Anupam Kher | Sakshi
Sakshi News home page

'ధోనీ తండ్రిగా నటిస్తున్నాను'

Oct 27 2015 6:37 PM | Updated on Apr 3 2019 6:23 PM

భారత క్రికెట్ వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి తండ్రిగా నటించనున్నట్లు బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ తెలిపాడు.

ముంబై: భారత క్రికెట్ వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి తండ్రిగా నటించనున్నట్లు బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ తెలిపాడు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. దేశానికి రెండు ప్రపంచ కప్లు అందించిన ధోనీ జీవిత అంశాలపై దర్శకుడు నీరజ్ పాండే ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ కోసం ప్రస్తుతం అనుపమ్ ఖేర్ ఖరగ్పూర్లో ఉన్నాడు. అభిమానులతో జరిపిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో భాగంగా ఖేర్ మరిన్ని విషయాలను వెల్లడించాడు.

'ఎమ్ఎస్ ధోనీ: ద అన్టోల్డ్ స్టోరీ' మూవీలో ధోనీ తండ్రి పాన్ సింగ్ పాత్రలో తాను, ధోనీ క్యారెక్టర్లో సుశాంత్ సింగ్ రాజ్పుత్ నటిస్తున్నట్లు వివరించాడు. ధోనీ భార్య సాక్షి సింగ్ పాత్రలో కిరణ్ అద్వానీ కనిపించనుంది. గతంలో వచ్చిన 'ఏ వెన్స్డే', స్పెషల్ 26, 'బేబి' మూవీలలో వీరిద్దరూ కలిసి పనిచేశారు. ఆ కారణంతోనే తాను ఈ మూవీకి సంతకం చేసినట్లు అనుపమ్ ఖేర్ వెల్లడించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement