అక్కడ మనోళ్ల సంగతేంటో చూడండి!
ఎవరైనా పాకిస్థాన్‌కు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తే వాళ్లను వెంటనే కొట్టేస్తారా.. అసలు చట్టం పనిచేస్తోందా అంటూ ప్రశ్నించిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు బాలీవుడ్ నటుడు, బీజేపీ నేత అనుపమ్ ఖేర్ గట్టిగా సమాధానం ఇచ్చారు.
భారతీయ క్రికెటర్ విరాట్ కోహ్లీకి వీరాభిమాని అయిన ఓ పాకిస్థానీ.. కోహ్లీకి మద్దతుగా భారత పతాకం ఊపినందుకు అతడిని అరెస్టుచేసి జైల్లో పెట్టారని గుర్తు చేశారు. అక్కడ మనోళ్ల పరిస్థితి ఇలా ఉందంటూ చెప్పారు. మొత్తమ్మీద జేఎన్‌యూ వ్యవహారం తర్వాత నాయకుల మధ్య వాద ప్రతిపాదనలు ట్విట్టర్ వేదికగా శరవేగంగా సాగుతున్నాయి.
Sir! A Pak national who raised an Indian Flag for our Virat Kohli is behind bars there. https://t.co/ZOL9OPDQDk
— Anupam Kher (@AnupamPkher) February 18, 2016