JNU issue
-
'నా ఫస్ట్, లాస్ట్ పార్టీ అదే'
పాట్నా: చివరివరకు తాను బీజేపీలోనే ఉంటానని పాట్నా ఎంపీ శత్రుఘ్నసిన్హా స్పష్టంచారు. తన మొదటి, చివరి పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు. 'భారతీయ జనతా పార్టీ.. నాకు మొదటి, చివరి పార్టీ' అని ట్వీట్ చేశారు. ఎంపీ పదవికి, పార్టీ సభ్యత్వానికి శత్రుఘ్నసిన్హా రాజీనామా చేయాలని బిహార్ బీజేపీ అధ్యక్షుడు మంగల్ పాండే డిమాండ్ చేసిన నేపథ్యంలో ఆయనీవిధంగా స్పందించారు. భారతీయుడిగా తానెంతో గర్విస్తున్నానని.. మాతృభూమి అంటే తనకెంతో గౌరవమని, రాజ్యాంగం పట్ల తనకు అమిత విశ్వాసం ఉందని చెప్పుకొచ్చారు. లాయర్ల దౌర్జన్యం, పోలీసుల నిష్ఫూచీ తనకు బాధ కలిగించిందని పేర్కొన్నారు. విద్యార్థులపై రాజద్రోహం కేసులు పెట్టడం సబబు కాదన్నారు. జాతివ్యతిరేక కార్యకలాపాలను తీవ్రంగా పరిణగనించాల్సిందేనని, అదే సమయంలో అమాయకులు బలికాకుండా చూడాలని అభిప్రాయపడ్డారు. ఎవరు దోషులో, కాదో కోర్టులు తేలుస్తాయని పేర్కొన్నారు. డాషింగ్, డైనమిక్, యాక్షన్ హీరోగా ప్రధాని నరేంద్ర మోదీని వర్ణించారు. ఆయనంటే తనకెంతో గౌరవమని చెప్పారు. కాగా, ఢిల్లీ జేఎన్ యూ వివాదంలో విద్యార్థి నేత కన్హయ్య కుమార్ మద్దతు ప్రకటించినందుకు శత్రుఘ్నసిన్హాపై పాండే ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్హయ్యను అక్రమంగా అరెస్ట్ చేశారని శత్రుఘ్నసిన్హా అంతకుముందు వ్యాఖ్యానించారు. కన్హయ్య జాతివ్యతిరేక నినాదాలు చేయలేదని అన్నారు. <2/5>..have great regard for our dashing, dynamic, action hero Prime Minister. I also assure everyone that BJP is my first and last party... — Shatrughan Sinha (@ShatruganSinha) February 18, 2016 <1/5> I am proud of being an Indian, I love and deeply respect my motherland, l have tremendous faith in our Constitution and ...... — Shatrughan Sinha (@ShatruganSinha) February 18, 2016 -
అక్కడ మనోళ్ల సంగతేంటో చూడండి!
ఎవరైనా పాకిస్థాన్‌కు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తే వాళ్లను వెంటనే కొట్టేస్తారా.. అసలు చట్టం పనిచేస్తోందా అంటూ ప్రశ్నించిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు బాలీవుడ్ నటుడు, బీజేపీ నేత అనుపమ్ ఖేర్ గట్టిగా సమాధానం ఇచ్చారు. భారతీయ క్రికెటర్ విరాట్ కోహ్లీకి వీరాభిమాని అయిన ఓ పాకిస్థానీ.. కోహ్లీకి మద్దతుగా భారత పతాకం ఊపినందుకు అతడిని అరెస్టుచేసి జైల్లో పెట్టారని గుర్తు చేశారు. అక్కడ మనోళ్ల పరిస్థితి ఇలా ఉందంటూ చెప్పారు. మొత్తమ్మీద జేఎన్‌యూ వ్యవహారం తర్వాత నాయకుల మధ్య వాద ప్రతిపాదనలు ట్విట్టర్ వేదికగా శరవేగంగా సాగుతున్నాయి. Sir! A Pak national who raised an Indian Flag for our Virat Kohli is behind bars there. https://t.co/ZOL9OPDQDk — Anupam Kher (@AnupamPkher) February 18, 2016 -
'నోరు మూసుకో లేకుంటే కాల్చిపారేస్తాం'
న్యూఢిల్లీ: తనను చంపుతామంటూ బెదిరింపులు వచ్చాయని ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మంత్రి కపిల్ మిశ్రా తెలిపారు. జేఎన్ యూ వివాదంపై మౌనం వహించకుంటే చంపుతామని ఫోన్ లో బెదిరించారని చెప్పారు. ఉదయం 8.48 గంటలకు తన ఫోన్ కు బెదిరింపు కాల్ వచ్చిందని తెలిపారు. పూజారి అని చెప్పిన వ్యక్తి తనను బెదిరించాడన్నారు. 'నోరు మూసుకో లేకుంటే కాల్చి చంపుతాం' అని హెచ్చరించాడని తెలిపారు. 'నీ దగ్గర ఎక్కువ బుల్లెట్లు ఉంటే తీవ్రవాదులను కాల్చిచంపాల'ని అతడికి సూచించానని చెప్పుకొచ్చారు. +442, +3844, +9100, +501 నంబర్ల నుంచి తన ఫోన్ కు మిస్డ్ కాల్స్ వచ్చాయన్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ దృష్టికి తీసుకెళ్లినట్టు వెల్లడించారు. బెదిరింపులకు భయపడబోనని, విచ్ఛిన్నకర శక్తులకు వ్యతిరేకంగా గళం విప్పుతూనే ఉంటానని కపిల్ మిశ్రా స్పష్టం చేశారు. -
ద్రోహులను సమర్ధించడం కూడా రాజద్రోహమే
న్యూఢిల్లీ: జేఎన్‌యూ వివాదం అంతకంతకూ ఉధృత రూపం దాలుస్తోంది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై దేశ ద్రోహం కేసు పెట్టడాన్ని ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా సమర్ధించారు. దేశద్రోహులను సమర్ధించడంకూడా రాజద్రోహం కిందికి వస్తుందని ఆయన గురువారమిక్కడ వ్యాఖ్యానించారు. దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారికి వత్తాసు పలకడం, వారితో స్నేహం చేయడాన్ని ఆయన తప్పు బట్టారు. అటు రాజ్యంగపరంగాగానీ, ఇటు ఆధ్యాత్మికపరంగా గానీ సమర్ధనీయం కాదంటూ రాందేవ్ బాబా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని నేరంగానే పరిగణించాలన్నారు. ఇప్పటికే ఈ వివాదంలో కన్హయ కుమార్, యూనివర్శిటీ మాజీ అధ్యాపకుడు గిలానీలపై రాజద్రోహం కేసులు నమోదయ్యాయి. అదే క్రమంలో జేఎన్‌యూ విద్యార్ధులకు మద్దతు పలికిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై కూడా రాజద్రోహం కేసు నమోదు చేయాలని కోరుతూ ఓ న్యాయవాది పిటిషన్ దాఖలు చేసారు. ఈ కేసుపై విచారించేందుకు అలహాబాద్ కోర్టు అంగీకరించింది. భారతీయ శిక్షా స్మృతి (200 సెక్షన్) ప్రకారం రాహుల్‌పై వేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించాలని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ సుశీల్ కుమార్ ఆదేశించడంతో మరింత అగ్గి రాజుకుంది. ఇదిఇలా ఉంటే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి దేశరాజధాని నగరంలో శాంతిభద్రతల పరిస్థితిపై చర్చించేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమవుతున్నారు. ఈ మధ్యాహ్నం రాహుల్ గాంధీ నేతృత్వంలో పలువురు సీనియర్ నేతలు రాష్ట్రపతిని కలవనున్నారు. -
'జేఎన్‌యూ సహా అన్ని అంశాలపై చర్చకు సిద్ధం'
ఢిల్లీ: పార్లమెంట్ సజావుగా జరిగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సూచించారు. జేఎన్‌యూ సహా అన్ని అంశాలపై చర్చకు తాము సిద్ధమని ఆయన అన్నారు. బుధవారం ఢిల్లీలో వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా విద్యార్థులను ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయని వెంకయ్య నాయుడు విమర్శించారు. రాజకీయాల కోసం పార్లమెంట్‌ను వేదికగా చేసుకోవద్దని హితవు పలికారు. జేఎన్‌యూలో ప్రభుత్వం ఎలాంటి దాడులు చేయలేదన్నారు. జాతీయ భావాలు ఉన్న వీసీలను ఆర్ఎస్ఎస్ లాబీయులుగా చిత్రీకరిస్తున్నారని చెప్పారు. ఇప్పటివరకు ఉన్న వామపక్ష వీసీలను ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు. దేశద్రోహులకు సానుభూతి చూపొద్దని సూచించారు. డీఎన్యూ విద్యార్థి సంఘం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అందరూ సంయమనం పాటించాలన్నారు. చట్టాని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దని కోరారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీ సీట్లు పెంచాలనే ప్రతిపాదన వస్తే పరిశీలిస్తామని వెంకయ్య తెలిపారు. అసెంబ్లీ సీట్ల పెంపు ప్రక్రియ 2019 కల్లా పూర్తవుతుందని వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. -
సొంతపార్టీపై బీజేపీ ఎంపీ శత్రుఘ్న మండిపాటు
న్యూఢిల్లీ: అఫ్జల్ గురు సంస్మరణ సభతో జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో తలెత్తిన వివాదం, అనంతర పరిణామాలపై తనదైన శైలిలో స్పందిస్తూ సొంత పార్టీ బీజేపీకి చురకలంటించారు బాలీవుడ్ వెటరన్, ఎంపీ శత్రుఘ్న సిన్హా. జేఎన్ యూ ఉదంతంలో దేశద్రోహం కేసు కింద అరెస్టయిన విద్యార్థి సంఘం నాయకుడు కన్నయా కుమార్ ను విడుదలచేయాలని డిమాండ్ చేశారు. 'ఆ కార్యక్రమంలో కన్నాయా కుమార్ స్పీచ్ ఆసాంతం విన్నాను. మా బిహార్ కు చెందిన ఆ యువనాయకుడు ఏక్కడ కూడా జాతివ్యతిరేక నినాదాలు చేసినట్లు నాకనిపించలేదు.ఈ విషయంలో మా పార్టీకి చెందిన కొంరు నాయకులు అతిగా స్పందించారు' అని ట్విట్టర్ లో పేర్కొన్నారు షాట్ గన్. ఈ వ్యవహారంలో బీజేపీ త్వరలోనే తన విధానాన్ని మార్చుకుంటుందని ఆశిస్తున్నానన్నారు. జేఎన్ యూ అంతర్జాతీయ ఖ్యాతి గడిచిన విద్యాసంస్థ అని, ఎందరో అత్యుత్తమ విద్యార్థులు, టీచర్లున్న ఆ సంస్థలో ఇక ముందు సంకటస్థితి నెలకొనకుండా బీజేపీ నేతలు వివాదాన్ని ఇంతటితో ముగించాలని శత్రుఘ్న హితవుపలికారు. 'వాళ్లు మన సొంత పిల్లలు. జీవితాలపై ప్రభావం చూపే కేసులు బనాయించడం ఎంతవరకు సబబు?'అని ప్రశ్నించారు. తరచూ పార్టీ వ్యతిరేక ప్రకటనలుచేసే శత్రుఘ్నా సిన్హా ఇటీవలే అరుణాచల్ ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించాలన్న కేంద్రం నిర్ణయాన్ని తప్పుపట్టిన సంగతి తెలిసిందే. -
ఇందిర హిట్లర్ కాదా?
- కాంగ్రెస్ డీఎన్ఏలోనే హిట్లరిజం ఉంది - రాహుల్ గాంధీ వేర్పాటువాదుల గొంతుకలా మారారు - జేఎన్ యూ వివాదంపై బీజేపీ చీఫ్ అమిత్ షా ఘాటు వ్యాఖ్యలు న్యూఢిల్లీ: ఉగ్రవాది అఫ్జల్ గురు సంస్మరణ సభ నిర్వహణతో జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో మొదలైన రగడ రోజురోజుకూ పెద్దదవుతోంది. కార్యక్రమాన్ని నిర్వహించినవారిని విడుదల చేయాలంటూ కొందరు చేస్తున్న నిరసనకు కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మద్దతు పలకడంపై బీజేపీ చీఫ్ అమిత్ షా ఘాటుగా స్పందించారు. జాతివ్యతిరేకతకు, జాతీయభావానికి మధ్య తేడాను రాహుల్ గుర్తించలేకపోయారని ఎద్దేవా చేశారు. ఆ మేరకు సోమవారం తన బ్లాగులో కామెంట్లను పోస్ట్ చేశారు అమిత్ షా. 'జేఎన్ యూలో విద్యార్థులు చేసింది ముమ్మాటికీ జాతివ్యతిరేక చర్యే. రాహుల్ గాంధీ, మరికొద్ది మంది నాయకులు ఆ చర్యను సమర్థించడం అవగాహనా రాహిత్యమే. రాహుల్ ముందు ఆ రెండు పదాలకు మధ్య తేడాను తెలుసుకోవాలి. జేఎన్ యూకు వెళ్లిన ఫక్తు వేర్పాటువాదుల అద్దెగొంతుకలా మాట్లాడారు. జాతివ్యతిరేకులకు వత్తాసుపలకడం ద్వారా ఆయన దేశాన్ని విభజించాలనుకుంటున్నాడేమో' అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు అమిత్ షా. మోదీ పాలన జర్మనీలో హిట్లర్ పాలనను తలపిస్తోందన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఖండిస్తూ .. ఎమర్జెన్సీ విధించడం ద్వారా ఇందిరా గాంధీయే హిట్లర్ లా వ్యవహరించారని, ఆమె హిట్లర్ అవునో కాదో కాంగ్రెస్ పార్టీ ఓ సారి పరిశీలించుకోవాలని, నిజానికి హిట్లర్ వాదం కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉందని షా పేర్కొన్నారు. అఫ్జల్ గురును సమర్థిస్తున్న రాహుల్ గాంధీది ఎలాంటి దేశభక్తో వెల్లడించాలన్నారు.