'నా ఫస్ట్, లాస్ట్ పార్టీ అదే' | My first and last party is BJP: Shatrughan Sinha | Sakshi
Sakshi News home page

'నా ఫస్ట్, లాస్ట్ పార్టీ అదే'

Published Thu, Feb 18 2016 6:02 PM | Last Updated on Sun, Sep 3 2017 5:54 PM

'నా ఫస్ట్, లాస్ట్ పార్టీ అదే'

'నా ఫస్ట్, లాస్ట్ పార్టీ అదే'

పాట్నా: చివరివరకు తాను బీజేపీలోనే ఉంటానని పాట్నా ఎంపీ శత్రుఘ్నసిన్హా స్పష్టంచారు. తన మొదటి, చివరి పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు. 'భారతీయ జనతా పార్టీ.. నాకు మొదటి, చివరి పార్టీ' అని ట్వీట్ చేశారు. ఎంపీ పదవికి, పార్టీ సభ్యత్వానికి శత్రుఘ్నసిన్హా రాజీనామా చేయాలని బిహార్ బీజేపీ అధ్యక్షుడు మంగల్ పాండే డిమాండ్ చేసిన నేపథ్యంలో ఆయనీవిధంగా స్పందించారు.

భారతీయుడిగా తానెంతో గర్విస్తున్నానని.. మాతృభూమి అంటే తనకెంతో గౌరవమని, రాజ్యాంగం పట్ల తనకు అమిత విశ్వాసం ఉందని చెప్పుకొచ్చారు. లాయర్ల దౌర్జన్యం, పోలీసుల నిష్ఫూచీ తనకు బాధ కలిగించిందని పేర్కొన్నారు. విద్యార్థులపై రాజద్రోహం కేసులు పెట్టడం సబబు కాదన్నారు. జాతివ్యతిరేక కార్యకలాపాలను తీవ్రంగా పరిణగనించాల్సిందేనని, అదే సమయంలో అమాయకులు బలికాకుండా చూడాలని అభిప్రాయపడ్డారు. ఎవరు దోషులో, కాదో కోర్టులు తేలుస్తాయని పేర్కొన్నారు. డాషింగ్, డైనమిక్, యాక్షన్ హీరోగా ప్రధాని నరేంద్ర మోదీని వర్ణించారు. ఆయనంటే తనకెంతో గౌరవమని చెప్పారు.

కాగా, ఢిల్లీ జేఎన్ యూ వివాదంలో విద్యార్థి నేత కన్హయ్య కుమార్ మద్దతు ప్రకటించినందుకు శత్రుఘ్నసిన్హాపై పాండే ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్హయ్యను అక్రమంగా అరెస్ట్ చేశారని శత్రుఘ్నసిన్హా అంతకుముందు వ్యాఖ్యానించారు. కన్హయ్య జాతివ్యతిరేక నినాదాలు చేయలేదని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement