Mangal Pandey
-
ప్రతి భారతీయుడిలో దేశభక్తిని రగిలించే సినిమాలు ఇవే
సినిమా అనేది వినోదాన్ని మాత్రమే కాదు పంచుతుందనుకుంటే పొరపాటే.. కొన్ని సనిమాలు యువకుల్లో దేశభక్తిని రగిలించింది. అందుకు తగినట్లుగానే కొందరు హీరోలు,దర్శకులు కథలను ఎంచుకుంటుంటారు. ఇలా వారు భారీ విజయాలను కూడా సొంతం చేసుకున్నారు. మన హీరోలు స్వాతంత్ర సమర యోధులుగా, దేశాన్ని రక్షించే వీరులుగా కనిపించి ఆకట్టుకున్నారు. అలాంటి సినిమాలపై 77వ స్వాతంత్య్రం సందర్భంగంగా కొన్నింటిపై ఫోకస్ చేయండి. గాంధీ (1982) 1982లో వచ్చిన గాంధీ సినిమా రిచర్డ్ అటెన్ బరో తీశారు. అస్కార్ అవార్డు పొందిన సినిమా ఇది. బెన్ కింగ్ స్లే గాంధీగా నటించారు. భారత స్వతంత్ర పోరాటాన్ని, గాంధీ జీవితాన్ని తెరకెక్కించిన మొదటి సినిమా ఇదే. గాంధీజీ పై చాలా సినిమాలు వచ్చాయి. కానీ 1982లో తెరకెక్కిన గాంధీ సినిమా మాత్రం ప్రత్యేకం. అయితే దానికి ప్రత్యేకమయిన కారణం కూడా ఉంది. ఈ సినిమాను రూపొందించింది ఇంగ్లాండ్‌లో పుట్టిపెరిగిన రిచర్డ్ అటెన్‌బరో అనే ఫిల్మ్ మేకర్. ఆ సినిమాకి ఆయనే ప్రొడ్యూసర్ కూడా. ఇక ఆ సినిమాలో గాంధీగా నటించింది కూడా బ్రిటిష్ యాక్టర్ అయిన బెన్ కింగ్స్లే. ఇలా ఏ దేశం పై అయితే గాంధీజీ తన పోరాటాన్ని సాగించారో వాళ్ళే మళ్ళీ ఆయనపై సినిమా తియ్యడం, దాన్ని ఇంగ్లాండ్‌లో కూడా రిలీజ్ చేస్తే అక్కడ అది ఘనవిజయం సాధించడం అనేది సామాన్యమయిన విషయం కాదు. పైగా ఆ సినిమాలో గాంధీజీ పాత్రను అద్బుతంగా పోషించిన బెన్ కింగ్స్లే కి అకాడెమీ అవార్డు కూడా వచ్చింది. అంటే గాంధీజీ జీవితంలో ఉన్న సారాంశం ఎంత గొప్పది అనేది ఆ సినిమాలో చూపించడం వల్ల, అది అందరి మనసులకు హత్తుకోవడం వల్ల ఆ విజయం సాధ్యమయింది. భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని 582 సినిమా థియేటర్లలో ఆగష్ట్రు 14వ తేదీ నుంచి 24 వరకు 'గాంధీ' చిత్రాన్ని విద్యార్థులకు ఉచితంగా ప్రదర్శించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ (2000) భీంరావ్ రాంజీ అంబేడ్కర్ పాత్రలో మమ్ముట్టి రోల్ ఔట్‌స్టాండింగ్ అనే చెప్పవచ్చు. 2000 సంవత్సరంలో వచ్చిన ఈ సినిమా జబ్బర్ పటేల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మొదట ఆంగ్లంలో నిర్మించబడింది. తరువాత ప్రాంతీయ భాషలలోకి డబ్ చేయబడింది. ఈ చిత్రంలో మమ్ముట్టి డాక్టర్ అంబేడ్కర్ పాత్రను పోషించారు. అతని నటనకు జాతీయ అవార్డును గెలుచుకున్నారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించేటప్పుడు అంబేద్కర్ యొక్క పోరాటాలను దృశ్యమానం చేసిన జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్రం, సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ, మహారాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్మించాలని పిలుపునిచ్చింది. నిర్మాణాన్ని ప్రభుత్వ యాజమాన్యంలోని నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించింది. డాక్టర్ అంబేద్కర్గా మమ్ముట్టి నటన మనసుకు హత్తుకునేలా ఉంటుంది. ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ (2002) హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ తోటి సభ్యులతో కలిసి భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన విప్లవకారుడు భగత్ సింగ్ గురించి 2002లో ఈ చిత్రం విడుదల అయింది. ఇందులో అజయ్ దేవగన్ టైటిల్ క్యారెక్టర్‌తో పాటు సుశాంత్ సింగ్ కూడా ఉన్నారు. ఈ సినిమాలో భారత స్వాతంత్రం కోసం పోరాడిన భగత్ సింగ్ జీవిత చరిత్రను పూర్తిగా చూపించారు. 1931 మార్చి 24న అధికారిక విచారణకు ముందు జలియన్ వాలాబాగ్ మారణకాండను చూపినప్పటి నుంచి భగత్ సింగ్ ని ఉరి తీసే వరకు ఈ సినిమాలో చూయించారు. కేవలం 23 ఏళ్ల వయసులోనే దేశం కోసం ఉరికంబానికి ఎలా ఎక్కాడో తెలిపే చిత్రమే ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. లగాన్ (2001) బ్రిటీషు పాలనలో భూమి పన్ను రద్దుకు వ్యతిరేకంగా ఓ గ్రామ ప్రజలు క్రికెట్ ఆడటానికి నిర్ణయించుకుంటారు. అప్పటివరకూ అలవాటు లేని ఆట అది. పన్ను భారం తగ్గాలంటే ఆడి గెలవాల్సిందే. ఆడారు.. గెలిచారు. ఆమిర్ ఖాన్ నటించిన ఈ ‘లగాన్’ చిత్రకథను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. 2001లో ఈ సినిమా విడుదలైంది. అప్పట్లో ఎందరిలోనే దేశభక్తిని రగిలించిన సినిమా ఇది. ఇప్పటికి ఈ సినిమా వచ్చి 20 ఏళ్లు దాటినా ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. నెట్‌ఫ్లిక్స్‌లో చూడొచ్చు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ (2004) నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితం ఆధారంగా వచ్చిన Netaji Subhas Chandra Bose: The Forgotten Hero హిందీ చిత్రం 2004లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇండియన్ ఎపిక్ బయోగ్రాఫికల్ వార్ని సినిమాగా తెరకెక్కించింది. ఇందులో నేతాజీగా సచిన్ ఖేడేకర్ కరెక్ట్‌గా సెట్ అయ్యారు. బ్రిటీష్ ఇండియాలో మహాత్మా గాంధీతో రాజకీయ విబేధాల తర్వాత, బోస్ అరెస్టు, విడుదలయ్యాక జరిగిన కథను వివరించారు. ఈ చిత్రానికి ఇండియన్ ఆడియెన్స్ నుంచి విశేష ఆదరణ దక్కింది. సినిమాకు నేషనల్ ఫిల్మ్ అవార్డు ఫర్ బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ అవార్డును కూడా దక్కింది. అలాగే 70వ భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సంయుక్తంగా సమర్పించిన ఇండిపెండెన్స్ డే ఫిల్మ్ ఫెస్టివల్లో ఆగష్టు 14, 2016న ఈ చిత్రాన్ని ప్రదర్శించడం విశేషం. ఈ సినిమాకు శ్యామ్ బెనెగల్ దర్శకత్వం వహించారు. ఏఆర్ రెహమాన్ దర్శకత్వం వహించారు. ఎమ్ ఎక్స్ ప్లేయర్,యూట్యూబ్‌లో ఈ సినిమా ఉంది. సర్దార్ (1993) 1993లో ఈ చిత్రం విడుదలైంది. భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాలను ఇండియన్ ఆఫ్ యూనియన్‌లో చేరేలా శ్రమించిన సర్దార్ వల్లభ్ భాయి పటేల్ జీవితం ఆధారంగా నిర్మించిందే ఈ చిత్రం. ఈ సినిమాలో పరేష్ రావల్ సర్దార్‌గా నటించారు. ఈ సినిమాలో క్విట్ ఇండియా ఉద్యమంలో జరిగిన అల్లర్లతో పాటు నెహ్రుతో సర్దార్కు ఉన్న విబేధాలను చూపుతుంది. సర్దార్ లాంటి వ్యక్తి లేకుండా ఉండి ఉంటే భారత్ ఇప్పటికి కూడా చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేదని చెప్పవచ్చు. యూట్యూబ్‌లో ఈ సినిమాను చూడొచ్చు కేసరి (2019) కేసరి 2019లో విడుదలైన బాలీవుడ్ సినిమా. 1897న భారత్‌లోకి సుమారు 10 వేలకు పైగా ఆఫ్ఘన్ దళాలు ఒక్కసారిగా చొచ్చుకొని వస్తారు. అప్పుడు వారందరినీ కేవలం 21 మంది సిక్కులు మాత్రమే ఎలా అడ్డుకున్నారు. అనేది ఈ సినిమాలో చూపిస్తారు .ఈ దళాల మధ్య 30 గంటల పాటు జరిగిన భీకర పోరాట సన్నివేశాలు మెప్పిస్తాయి. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, పరిణీతి చోప్రా, సుమీత్ సింగ్ బస్రా, రాకేష్ శర్మ, మీర్ సర్వర్, అశ్వథ్ భట్, రామ్ అవానా ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. మంగళ్ పాండే: ది రైజింగ్ (2005) మంగళ్ పాండే జీవితం ఆధారంగా 2005లో కేతన్ మెహతా దర్శకత్వంలో మంగళ్ పాండే: ది రైజింగ్ మూవీ వచ్చింది. ఇందులో ఆమీర్ ఖాన్ లీడ్ రోల్లో నటించారు. మంగళ్ పాండే ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలో జులై 19, 1827న జన్మించారు. పాండే బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన 34వ బెంగాల్ నేటివ్ ఇన్ఫాంట్రీలో రెజిమెంట్‌లో సిపాయిగా చేరారు. అప్పట్లో అతను తన అసాధారణమైన ప్రతిభ, తెగువతో సైనిక దళ నాయకుడిగా ఎదిగారు. అయితే ఆ కాలంలో బ్రిటిష్ వారు అందించిన తుపాకీ తూటాలను సిపాయిల వీసమెత్తు నచ్చలేదు. ఈ గుండ్లకు ఆవు కొవ్వు, పంది కొవ్వు పూసేవారు. వాటిని పేల్చాలంటే సిపాయిలు నోటితో కొరికి తొక్క తీయాల్సి ఉంటుంది. హిందువులు, ముస్లింల మత విశ్వాసాలకు ఇది విరుద్ధమని భావించిన సిపాయిలు వ్యతిరేకత వ్యక్తం చేశారు. బ్రిటీషర్లు మొదట జంతువుల కొవ్వును ఉపయోగించలేదని చెప్పారు. కానీ అది కోవ్వేనని పాండే, ఇతర సైనికుల్లో సందేహాలు మరింత బలపడ్డాయి. ఆ సందేహాలే చివరికి బ్రిటిష్ రాజ్యాధిపత్యంపై తిరుగుబాటుకు ఎలా దారితీసింది. పాండే ఉరి శిక్ష సమయంలో జరిగిన ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తీశారు.ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. మణికర్ణిక (2019) 2019లో వచ్చిన ఈ సినిమా ఝాన్సీ లక్ష్మీ భాయ్ జీవిత చరిత్ర ఆదారంగా బాలీవుడ్లో తెరకెక్కించారు. ఇందులో కంగనా రనౌత్ ఝాన్సీగా తన నటనతో భారతీయులను మెప్పించింది.1828లో వారణాసిలో తన పుట్టుకతో కథ మొదలౌతుంది. పరాక్రమానికి మారుపేరుగా లక్ష్మీ భాయ్ జీవిత చరిత్ర ఉంటుంది. ఝాన్సీ రాజు అయిన గంగాధర్ రావుతో ఆమెకు వివాహం అవుతుంది. రాజ్యం గంగాధర్ అన్న అయిన సధాశివ్ బ్రిటీష్ వారితో కలిసి కుట్ర పన్నుతాడు. అందులో భాగంగా గంగాధర్ రావును బ్రిటీష్ వారు చంపేస్తారు. తన భర్తకు ఇచ్చిన మాట కోసం ఝాన్సీ లక్ష్మీ భాయ్‌గా రాజ్యాధికారం అందుకుంటుంది. ఈ క్రమంలో తెల్లవారిపై ఆమె చేసిన దండయాత్ర ఎలా ఉంటుందో చెప్పేదే మణికర్ణిక చిత్రం. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. -
ఎత్తండ్రా తుపాకులు.. దించండ్రా తూటాలు
పాండే తిరగబడటానికి తక్షణ కారణం.. కొత్త ఎన్ఫీల్డ్ తుపాకులలో వాడేందుకు సిపాయిలకు బ్రిటిష్ ఆర్మీ పంపిణీ చేసిన తూటా గుళిక (క్యాట్రిడ్జ్) లేనని, సాఫీగా జారేందుకు వీలుగా ఆ గుళికలకు జంతువుల కొవ్వుతో తయారు చేసిన గ్రీజును అద్ది ఇవ్వడం వల్లనే పాండే మత మనోభావాలు తీవ్రంగా గాయపడి తన పైఅధికారులపై బహిరంగంగా ఆగ్రహావేశాలు వ్యక్తం చేశాడని బ్రిటిష్ చరిత్రకారులు రాశారు. నిజమేనా? అసలు ఆ రోజు ఏం జరిగింది? ఆ ఘటన జరిగినప్పుడు పాండేతో పాటు అక్కడ అవథ్ బ్రాహ్మణ సిపాయిలు కూడా ఉన్నారు. బ్రిటిష్ వారి అప్రాచ్య విధానాల వల్ల తమ కులం, మతం మంట కలిసిపోతాయని వారంతా భయపడ్డారు. పాండే తుపాకీ ఒక్కటే నిర్భయంగా పైకి లేచింది. దానిని గాలిలో ఊపుతూ.. ‘‘అంతా బయటికి వచ్చేయండి. ఈ తూటాల క్యాట్రిడ్జ్‌లను నోటితో తెరిచామంటే మనం మత విశ్వాస ఘాతకులం అయినట్లే. ఇంకా ఆలోచిస్తారేమిటి? యూరోపియన్ల పని పడదాం రండి’’ అని అరిచాడు. అంతేకాదు, ఆ సమయంలో అక్కడే ఉన్న ఇద్దరు బ్రిటిష్ అధికారులు.. సార్జెంట్ హ్యూసన్, లెఫ్ట్‌నెంట్ బాగ్‌లతో కూడా పాండే తలపడి తన కత్తితో, తుపాకీతో వారిని గాయపరిచాడు. ఆ గొడవకి ప్రెసిడెన్సీ విభాగం కమాండింగ్ ఆఫీసర్ జనరల్ హియర్సే అక్కడి రాగానే పాండే తనని తాను కాల్చుకున్నాడు. అయితే ఆ తూటా అతడిని చంపే విధంగా తగల్లేదు. ఈ ఘటనంతా కొన్ని చరిత్ర పుస్తకాలలో మరింత వివరంగా ఉంది. ఆవు కొవ్వు, పంది కొవ్వు ఉపయోగించి తయారు చేసిన క్యాట్రిడ్జ్‌లను కొరికి ప్రయోగించడానికి నిరాకరించిన మంగళ్ పాండే, ఆ కోపంలో తన పై అధికారిని హతమార్చాడు. షేక్ పల్టూ అనే సహ సిపాయి పాండేను వారించే ప్రయత్నం చేశాడు. ఈ కలకలం చెవిన పడి అక్కడికి చేరుకున్న జనరల్ హెర్పే.. పాండేను పట్టుకోమని జమాదార్ ఈశ్వరీ ప్రసాద్‌ను ఆదేశించారు. ప్రసాద్ కదల్లేదు. ఈలోపు పాండే తన తుపాకితో తనే కాల్చుకుని ఆత్మహత్యకు యత్నించి విఫలమయ్యాడు. బ్రిటిష్ సైనికులు వెంటనే అతడిని నిర్బంధించి హత్యానేరం మోపారు. సైనిక న్యాయస్థానం పాండేను ఏప్రిల్ 18 న ఉరి తీయాలని తీర్పు చెప్పింది. అయితే 10 రోజుల ముందుగానే అతడిని ఉరి తీశారు. అతడిని పట్టుకునేందుకు చొరవ చూపని ఈశ్వరీ ప్రసాద్‌ను కూడా రెండు వారాల తర్వాత ఏప్రిల్ 22న ఉరి తీశారు. పాండే తిరుగుబాటు చేస్తున్నప్పుడు చూస్తూ నిలబడిపోయారన్న ఆరోపణలపై తక్కిన సిపాయిల దుస్తులు విప్పించి పరేడ్ చేయించారు. మంగల్ పాండేను అడ్డుకుని, బ్రిటిష్ అధికారులను రక్షించేందుకు ప్రయత్నించిన షేక్ పల్టూకి పదోన్నతి లభించింది. కాలక్రమంలో పాండే భారత స్వాతంత్య్ర సంగ్రామానికి ప్రేరణ కలిగించిన తొలి తిరుగుబాటు సిపాయిగా చరిత్రలో నిలిచిపోయాడు. అతడు మరణించిన 148 ఏళ్ల తర్వాత 2005లో బరక్‌పూర్ (పశ్చిమ బెంగాల్) స్థానిక పాలన మండలి ఊరి నడిబొడ్డున పాండే విగ్రహాన్ని ప్రతిష్టించింది. ఆ ఊరిలోని ఆర్మీ బ్యారక్ల మధ్య ఏర్పాటు చేసిన ఆ విగ్రహం రూపంలో పాండే ఒంటరి యోధుడిలా కనిపిస్తాడు. ఛాతీ వరకు ఉన్న ఆ స్మారక విగ్రహం కింద ‘మంగళ్‌పాండే, సిపాయి నెం.1446, 34 వ రెజిమెంట్. 1858 మార్చి 29న పట్టపగలు బ్రిటిష్ అధికారులపై ఇతడు తుపాకీ పేల్చాడు’ అని రాసి ఉంటుంది. ‘‘ఈ విగ్రహాన్ని పెట్టేవరకు పాండే ఎలా ఉంటాడో మాకూ తెలీదు’’అని ఆ ప్రాంతాన్ని సందర్శించిన వారితో స్థానికులు చెబుతుంటారు. తిరుగుబాటు జరిగిన వారం లోపలే పాండేపై విచారణ జరిగింది. భంగు, నల్లమందు తీసుకోవడం వల్ల ఆ మత్తులో ఏం చేస్తున్నదీ తనకు తెలియలేదని పాండే చేత బలప్రయోగంతో చెప్పించి, అతడికి మరణశిక్ష విధించారు. ఏప్రిల్ 8న ఉరికొయ్యల దగ్గరికి వెళుతున్నప్పుడు కూడా అతడిలోని గాంభీర్యం సడల్లేదని కొందరు చరిత్రకారులు రాశారు. బరక్పూర్లోని ఒక మర్రిచెట్టుకి పాండేని ఉరి తీశారని చెబుతారు. ‘‘ఆ చెట్టు ఇప్పటికీ ఇక్కడి పోలీసు శిబిర ప్రాంగణంలో ఉంది. అయితే లోపలికి ఎవరినీ అనుమతించరు. దాని గురించి వినడం వరకే..’’ అంటారు బరక్‌పూర్ గ్రామస్థులు. కనిపించే విగ్రహం, కనిపించని ఉరికొయ్య.. ఈ రెండే అక్కడ మిగిలి ఉన్న మంగళ్ పాండే స్మృతి చిహ్నాలు. పదిహేడేళ్ల క్రితం 2005లో పాండే మాట మళ్లీ ఒకసారి దేశంలో ఉత్తేజాన్ని నింపింది. పాండేగా అమీర్‌ఖాన్ నటించిన ‘ది రైజింగ్ : బ్యాలెడ్ ఆఫ్ మంగళ్ పాండే’ చిత్రం ఆ ఏడాది విడుదలైంది. 1857 మే 10న జరిగిన సిపాయిల తిరుగుబాటుకు బీజాలు వేసింది మార్చి 29 నాటి పాండే ధైర్యసాహసాలేనా అనే విషయమై చరిత్రకారులు నేటికీ ఒక ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. ‘బ్రేవ్ మార్టిర్ ఆర్ యాక్సిడెంటల్ హీరో’ పుస్తక రచయిత రుద్రాంక్షు ముఖర్జీ.. పాండేను దేశభక్తుడిగా గుర్తించలేమని, భారత తొలి స్వాతంత్య్ర సమరారంభానికి, పాండే తిరుగుబాటుకు సంబంధమే లేదని రాశారు! ఎవరేం రాసినా, తిరుగుబాటు భావాలకు ప్రతీకశక్తి మాత్రం భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో పాండే ఒక్కడే. అయితే బయటి నుంచి చూసే వారి దృష్టి ప్రత్యేకంగా ఉంటుంది. దానినీ ఆహ్వానించాలి. చరిత్రలో ఏం జరిగిందన్న వాస్తవం యథాతథంగా ప్రజలకు కావాలి. అందుకోసం చిన్న చిన్న అంశాలను కూడా చరిత్ర పరిశోధకులు వెలుగులోకి తేవాలి. అప్పుడే సంపూర్ణ వాస్తవానికి మరింత సమీపంగా వెళ్లగలం. -
మేరా బాలీవుడ్ మహాన్
నీవొక సైనికురాలివి... నేనొక సైనికుడిని ప్రత్యక్షంగా దేశాన్ని ప్రేమించి గళమెత్తి యుద్ధం చేసే సైనికులం మనం చేతిలో గన్ను లేకపోవచ్చు.. ఖడ్గం ఉండకపోవచ్చు కానీ మన చప్పట్లతో వీర జవాన్ల గుండెల్లో ధైర్యం నింపే సైనికులం మనం కుర్చీ అంచున కూర్చుని దేశభక్తిని ధ్వనించే గుండె మనది. సినిమా థియేటర్లో వినిపించే హోరు మనది స్వాతంత్య్రం వచ్చింది. ‘క్విట్ ఇండియా’, ‘వందేమాతరం’, ‘ఇంక్విలాబ్ జిందాబాద్’, ‘జైహింద్’, ‘స్వరాజ్ మేరా జన్మ్ సి«ద్ అధికార్ హై’ వంటి నినాదాలతో నాయకులు ప్రజలను ఉర్రూతలూగించి, లెక్కలేనన్ని త్యాగాలతో స్ఫూర్తి నింపి భారతమాత దాస్యశృంఖలాలను పెళ్ళగించి అవతల పారేయగలిగారు. దేశం ఉత్సాహంగా అడుగు ముందుకేసింది. ‘ఆరామ్ హరామ్ హై’ అంటూ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ విరామమెరగక దేశ నిర్మాణంలో పడ్డారు. మరోవైపు అప్పటికే యవ్వనంలోకి అడుగుపెట్టిన హిందీ సినిమా ఆ స్ఫూర్తిని, ఆ తర్వాత అవసరమైన మార్గదర్శనాన్ని, ఆనాటి త్యాగాలను వీలువెంబడి వెండితెర మీద ప్రత్యక్షం చేస్తూ తాను నింప గల ఉత్సాహం తనూ నింపింది. ఎన్నో చిత్రాలు వచ్చాయి. కొన్ని మేలిమి ముత్యాలుగా నిలిచాయి. మదర్ ఇండియా... నయా దౌర్ భారతదేశం అంటే రైతు. భారతదేశం అంటే పంటచేను. భారతదేశం అంటే పల్లెసీమ. స్వాతంత్య్రం వచ్చాక భారతదేశ గ్రామీణ చిత్రం ఎలా ఉందో చూపుతూ, భారతీయ రైతు స్త్రీ విముక్తే అసలైన దాస్య విముక్తి అని ప్రతిపాదిస్తూ ‘మదర్ ఇండియా’ (1957) సినిమా వచ్చింది. నర్గిస్ నట జీవితంలో అత్యంత ముఖ్యమైన ఈ సినిమా సంఘ వ్యతిరేకం అయితే ఈ దేశం కోసం సొంత బిడ్డను కూడా బలి ఇవ్వడానికి భారత మాతృమూర్తి వెనుకాడదని చెప్పి తేజస్సుతో నిండిన సందేశాన్ని ఇచ్చింది. ఆ తర్వాత వచ్చిన ‘నయా దౌర్’ (1957) దేశంలో జరుగుతున్న యాంత్రికీకరణ, పారిశ్రామికీకరణ చర్చించింది. దేశీయ మూలాలను పదిలంగా ఉంచుతూ మార్పును స్వాగతించాలని సూచించింది. దిలీప్ కుమార్ నటించిన ఈ సినిమాలో ఓపి నయ్యర్ చేసిన ‘సాథీ హాత్ బఢానా’... అనే పాట కలిసి మెలిసి ముందుకు అడుగువేసేందుకు స్ఫూర్తినిచ్చే ఒక గొప్ప బృందగీతం. హకీకత్.. బోర్డర్... లక్ష్య యుద్ధక్షేత్రం ఎలా ఉంటుందో తెలియకపోతే అసలైన దేశభక్తి ఎలా ఉంటుందో అర్థం కాదు. దేశం కోసం లేశమాత్రంగా ప్రాణం త్యాగం చేయడం ఎలా ఉంటుందో అర్థం కాదు. అందుకే బాలీవుడ్ మన దేశం ఎదుర్కొన్న యుద్ధాలను తన కథలుగా చేసుకుంది. 1962 వార్‌ను కథాంశంగా ‘హకీకత్’ (1964) తీసింది. ఇందులోని ‘కర్ చలే హమ్ ఫిదా’... పాట ఇవాళ్టికీ పర్వ దినాలలో మొగుతూ నరనరాల ఉద్వేగం నింపుతూనే ఉంటుంది. ఆ తర్వాత 1971 భారత–పాకిస్తాన్ల యుద్ధ నేపథ్యంగా ‘బోర్డర్’ (1997) వచ్చింది. సన్నిడియోల్, అక్షయ్ ఖన్నా తదితరులు నటించిన ఈ సినిమాలో ‘సందేశే ఆతేహై’.. పాట కుటుంబాలకు దూరంగా ఉండే సైనికుల వేదనను అశ్రువుల్లో చుట్టి వినిపిస్తుంది. ఇక దేశం చూపిన అతి గొప్ప సాహసం ‘కార్గిల్’ యుద్ధం. మన సైనికుల వీరత్వాన్ని చూపే ఈ యుద్ధం నేపథ్యంలో ‘లక్ష్య’ (2004) సినిమా వచ్చింది. ఫర్హాన్ అఖ్తర్ ఇందులో హీరో. భగత్‌సింగ్... సుభాష్... మంగళ్‌పాండే దేశం దేశనాయకులను ఎలా మర్చిపోదో బాలీవుడ్ కూడా మర్చిపోదు. దేశం కోసం త్యాగం చేసిన ఆ అమరవీరులను బాలీవుడ్ తన శక్తిమేరకు చూపించే సగటు ప్రేక్షకుడికి వారిని మరింత చేరువ చేసింది. భగత్ సింగ్ జీవితం ఆధారంగా వచ్చిన ‘ది లెజెండ్ ఆఫ్ భగత్‌సింగ్’ (2002) అజయ్ దేవగణ్‌కు గొప్ప పేరు తెచ్చి పెట్టింది. సుభాస్ చంద్రబోస్ సమగ్ర జీవితాన్ని శ్యామ్ బెనగళ్ ‘బోస్: ది ఫర్గాటెన్ హీరో’ (2005)గా తీశాడు. ఇక ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామ హీరో అయిన మంగళ్‌పాండే జీవితాన్ని అదే పేరుతో 2005లో కేతన్ మెహతా ఆమిర్ ఖాన్ హీరోగా తెరకెక్కించాడు. సర్దార్ పటేల్ జీవితాన్ని పరేశ్ రావెల్ అభినయిస్తే దేశీయ భాషల్లో అంబేద్కర్ జీవితం వచ్చింది. హిందూస్తానీ... వెడ్నెస్ డే ఇక దేశంలోని అంతర్గత సమస్యలైన అవినీతి ఉగ్రవాదం వంటి సమస్యలను కూడా బాలీవుడ్ చర్చించింది. శంకర్ తీసిన ‘హిందూస్తానీ’ (1996), నసీరుద్దీన్ షా నటించిన ‘వెడ్నెస్ డే’ (2008) చాలా ప్రతిభావంతంగా ఆ సమస్యలను చర్చించి ప్రేక్షకులను ఆలోచింప చేశాయి బాలీవుడ్ ఇంతటితో ఆగలేదు. సర్జికల్ స్ట్రయిక్స్‌ను కూడా కథాంశంగా తీసుకుని ‘ఉడి’ (2019) వంటి సినిమాలను ప్రేక్షకుల ముందుకు తెచ్చింది. రాబోయే రోజులలో మరెన్నో బయోపిక్‌లో గత కాలపు దేశ ఘనతలు వెండితెరను అలంకరించనున్నాయి. వాటిని చూసిన ప్రతిసారీ మనం మేరా భారత్ మహాన్ అనుకోవాలి. ఇండియా జిందాబాద్ అని గట్టిగా నినాదం ఇవ్వగలగాలి. ఈ దేశం పట్ల ప్రేమ, గౌరవం ఎప్పుడూ కొనసాగుతూనే ఉండాలని కోరుకుందాం. ఉప్కార్... పూరబ్ ఔర్ పశ్చిమ్ ఆ తర్వాత నటుడు మనోజ్ కుమార్ వచ్చి రెండు మూడు ముఖ్యమైన సినిమాలు తీశాడు. దేశం సుభిక్షంగా ఉండాలంటే ఇటు కిసాన్, అటు జవాన్ ఇద్దరూ శక్తిమంతంగా ఉండాలనే లాల్‌బహదూర్ శాస్త్రి నినాదాన్ని ఊతంగా తీసుకొని ‘ఉప్కార్’ (1967) సినిమా తీశాడు. ‘ఏ దేశ్ కీ ధర్తీ’... పాట ఈ మట్టిలో మణులూ మాణిక్యాలు పండించడానికి స్వేదజలాన్ని చిందించే రైతుకు చేసిన శాల్యూట్ అని చెప్పవచ్చు. అదే సమయంలో మనోజ్ కుమార్ ‘పూరబ్ ఔర్ పశ్చిమ్’ (1970) సినిమా కూడా తీశాడు. స్వాతంత్య్రం వచ్చిందనే అత్యుత్సాహంలో ఇబ్బడి ముబ్బడిగా పాశ్చాత్య ప్రభావానికి లోనై మన సంస్కృతిని దెబ్బ తీయడానికి యువత ప్రభావితం కావద్దని చెబుతూ తీసిన ఈ సినిమా ప్రేక్షకులకు గొప్పగా నచ్చింది. చక్ దే ఇండియా.. భాగ్ మిల్కా భాగ్... దంగల్ మరో వైపు క్రీడల ద్వారా దేశభక్తిని నింపే ప్రయత్నం కూడా బాలీవుడ్లో జరిగింది. మహిళా హాకీ జట్టులో స్ఫూర్తి నింపే ‘చక్ దే ఇండియా’ (2007) సినిమా ఘన విజయం సాధించింది. షారుక్ ఖాన్ నటించడంతో ఈ సినిమా యువతను క్రికెట్ నుంచి ఆ ఆటవైపు చూసేలా చేసింది. ‘ఫ్లయింగ్ సిక్’గా పేరుగాంచిన మిల్కాసింగ్ జీవితం ‘భాగ్ మిల్కా భాగ్’ (2013)గా రావడం ఒక ముఖ్య సన్నివేశం. ఫర్హాన్ అక్తర్ ఈతరం ప్రేక్షకులకు తెలియని మిల్కాసింగ్‌ను గొప్పగా తెర మీద చూపించగలిగాడు. ఇక ఏ దేశంలో అయితే స్త్రీలను వంటింటి పరిమితం చేస్తారనే పేరు ఉందో ఏ దేశంలో అయితే స్త్రీలను అణిచి ఉంచుతారనే ప్రచారం ఉందో ఆ దేశంలో నుంచి బాక్సింగ్ చేసే అమ్మాయిని ‘మేరీ కోమ్’ (2014)లో, కుస్తీ ఆడే ఆడపిల్లను ‘దంగల్’ (2016)లో చూపి దేశ మహిళల ఘనతకు ఒక నివాళి అర్పించగలింది. దంగల్ -
'నా ఫస్ట్, లాస్ట్ పార్టీ అదే'
పాట్నా: చివరివరకు తాను బీజేపీలోనే ఉంటానని పాట్నా ఎంపీ శత్రుఘ్నసిన్హా స్పష్టంచారు. తన మొదటి, చివరి పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు. 'భారతీయ జనతా పార్టీ.. నాకు మొదటి, చివరి పార్టీ' అని ట్వీట్ చేశారు. ఎంపీ పదవికి, పార్టీ సభ్యత్వానికి శత్రుఘ్నసిన్హా రాజీనామా చేయాలని బిహార్ బీజేపీ అధ్యక్షుడు మంగల్ పాండే డిమాండ్ చేసిన నేపథ్యంలో ఆయనీవిధంగా స్పందించారు. భారతీయుడిగా తానెంతో గర్విస్తున్నానని.. మాతృభూమి అంటే తనకెంతో గౌరవమని, రాజ్యాంగం పట్ల తనకు అమిత విశ్వాసం ఉందని చెప్పుకొచ్చారు. లాయర్ల దౌర్జన్యం, పోలీసుల నిష్ఫూచీ తనకు బాధ కలిగించిందని పేర్కొన్నారు. విద్యార్థులపై రాజద్రోహం కేసులు పెట్టడం సబబు కాదన్నారు. జాతివ్యతిరేక కార్యకలాపాలను తీవ్రంగా పరిణగనించాల్సిందేనని, అదే సమయంలో అమాయకులు బలికాకుండా చూడాలని అభిప్రాయపడ్డారు. ఎవరు దోషులో, కాదో కోర్టులు తేలుస్తాయని పేర్కొన్నారు. డాషింగ్, డైనమిక్, యాక్షన్ హీరోగా ప్రధాని నరేంద్ర మోదీని వర్ణించారు. ఆయనంటే తనకెంతో గౌరవమని చెప్పారు. కాగా, ఢిల్లీ జేఎన్ యూ వివాదంలో విద్యార్థి నేత కన్హయ్య కుమార్ మద్దతు ప్రకటించినందుకు శత్రుఘ్నసిన్హాపై పాండే ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్హయ్యను అక్రమంగా అరెస్ట్ చేశారని శత్రుఘ్నసిన్హా అంతకుముందు వ్యాఖ్యానించారు. కన్హయ్య జాతివ్యతిరేక నినాదాలు చేయలేదని అన్నారు. <2/5>..have great regard for our dashing, dynamic, action hero Prime Minister. I also assure everyone that BJP is my first and last party... — Shatrughan Sinha (@ShatruganSinha) February 18, 2016 <1/5> I am proud of being an Indian, I love and deeply respect my motherland, l have tremendous faith in our Constitution and ...... — Shatrughan Sinha (@ShatruganSinha) February 18, 2016 -
బీజేపీలో చేరిన ఆదిత్య వర్మ
న్యూఢిల్లీ: గుర్తింపులేని బీహార్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఆదిత్య వర్మ గురువారం బీజేపీలో చేరారు. ఆయనను బీహార్ బీజేపీ అధ్యక్షుడు మంగల్ పాండే సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ పై కేసు వేసి ఆయన వార్తల్లో నిలిచారు. ఎన్. శ్రీనివాసన్- బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి దిగిపోవడానికి వర్మ కారణమయ్యారు. వర్మ పిటిషన్ వేయడంతో స్పాట్ ఫిక్సింగ్ పై దర్యాప్తుకు సుప్రీంకోర్టు జస్టిస్ ముగ్దల్ కమిటీ వేసింది. విచారణ పూర్తయ్యే వరకు బీసీసీఐ అధ్యక్ష పదవికి దూరంగా ఉండాలని శ్రీనివాసన్ ను కోర్టు ఆదేశించింది. శ్రీనివాసన్ ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తొలి చైర్మన్‌గా ఉన్నారు. -
వివరం: ప్రాణవాయువులలో పాండే ఆత్మ
ఆగస్టు 15, 1947. దేశం తలెత్తుకున్న రోజు! మార్చి 29, 1857. ఈ దేశ పౌరుడు తుపాకీ ఎత్తిన రోజు! ఒకటి స్వాతంత్య్ర దినం. ఇంకొకటి స్వాతంత్య్ర కాంక్షను రగిలించిన దినం. ఆగస్టు 15 అంటే మహాత్మాగాంధీ. మార్చి 29 అంటే మంగళ్ పాండే. కానీ మనకు మహాత్ముడొక్కరే గుర్తుండిపోయారు. మంగళ్ పాండే చరిత్రలోనే ఉండిపోయాడు. పాండేని ఇవాళ తలుచుకుంటే సినిమా వాళ్లు తలుచుకోవాలి. లేదంటే చరిత్రకారుల రిఫరెన్సుల్లోకి మనమే వెళ్లి పాండేని వెతుక్కోవాలి. అయితే ఈ ఏడాది ఎవరూ తలచుకోకుండానే, ఎవరూ వెతుక్కోకుండానే పాండే బయటపడ్డాడు. మార్చి 4న అమృత్‌సర్‌లోని ఒక బావిలోంచి బయట పడ్డాడు!! ఎలా? ఆత్మగానా? అవక్షేపంగానా? అంతరాత్మగానా? అంతరాత్మగానే. కానీ ఒక అంతరాత్మగా కాదు. 1857 నుంచి 2014 వరకు ఈ 157 ఏళ్లలో ఒక్కనాడూ పాండేకు భరతజాతి ఘనంగా నివాళులు అర్పించలేదని ఘోషిస్తున్న వందల అంతరాత్మలుగా! అమృత్సర్ దగ్గరి అజ్నాలా గ్రామంలో... ఒక సిక్కు ప్రార్థనాలయం ప్రాంగణంలో ఉన్న బావిలో నూటాయాభై ఏళ్లనాటి తిరుగుబాటు సిపాయిల అస్థికల్లోంచి, మట్టిలో కలిసిపోయిన వారి ప్రాణవాయువుల్లోంచి పాండే బయటపడ్డాడు. పడ్డాడూ అంటే... అస్థికల్లో అతడి అస్థికలూ ఉన్నాయని కాదు. అతడి స్ఫూర్తితో, ఆవహించిన అతడి ఆత్మతో బ్రిటిష్‌వాళ్లపై తిరగబడి, పోరాడి మరణించిన వీరుల శిథిలాలలో పాండే ఆవరించి ఉన్నాడని. గాంధీ అంటే గాంధీ ఒక్కరే. తనకు తానుగా ఒక మహాశక్తి. పాండే అంటే వందలు, వేలుగా ఎక్కుపెట్టిన సిపాయిలందరి తుపాకుల శక్తి. కంకాళాలు, కపాలాలు, విరిగిన కాళ్లూ చేతులు, పగిలిన పుర్రెలు... ఎప్పటికీ ఇవి మాత్రమేనా పాండే స్మారక చిహ్నాలు? జాతిపితలా మహాత్ముడిని గౌరవించినట్లు, తొలి తిరుగుబాటు వీరుడిగా పాండేని మనం గుర్తించలేమా? గాంధీజీ లేకుండా స్వాతంత్య్ర సంగ్రామం లేనట్లే... పాండే లేకుండా ఆ సంగ్రామానికి ఉప్పు, ఊపిరి రెండూ లేవన్న వాస్తవాన్ని గ్రహించలేమా? పాండే ఒక జ్వాల. ఉత్తర భారతదేశంలోని మీరట్, ఢిల్లీ, లక్నో, కల్పి, కాన్పూర్, బెనారస్, రాణీగంజ్, కలకత్తాల మీదుగా దేశంలోని తూర్పు, మధ్య ప్రాంతాలకు వ్యాపించిన తిరుగుబాటు జ్వాల. 1857-59 మధ్య... స్వేచ్ఛాకాంక్షగా రగిలి, దేశాన్ని యుద్ధభూమిగా మార్చిన జ్వాల. అప్పటికి వందేళ్ల క్రితం - సరుకులు అమ్ముకుంటూ వచ్చి భారత భూభాగంలో తక్కెడ పెట్టి కూర్చుంది ఈస్ట్ ఇండియా కంపెనీ. బ్రిటన్ నుంచి వచ్చి భారత్‌పై పట్టు బిగించింది. 1757లో బెంగాల్ నవాబు సిరాజ్ ఉద్దౌలాను ఓడించింది. మైసూరులో టిప్పు సుల్తాన్నీ, మరి కొందరు ప్రాంతీయ పాలకుల్ని గద్దె దించింది. 1857 నాటికి యావద్భారతాన్ని తన అధీనంలోకి తెచ్చుకుంది. ఆ కొసలో జరిగిందే సిపాయిల తిరుగుబాటు. అదే మన ప్రప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం. ఆ సంగ్రామానికి మీసాన్ని మెలితిప్పి వత్తిగా వెలిగించినవాడే మంగళ్ పాండే! పాండే ధిక్కారం తర్వాత తొలిసారి మీరట్ (ఉత్తర ప్రదేశ్)లో భారతీయ సిపాయిలు బ్రిటిష్ వారిపై విరుచుకుపడ్డారు. అక్కడ ఇద్దరు బ్రిటిష్ అధికారులను హతమార్చి, ఢిల్లీ వైపు కదిలారు. ఝాన్సీ (ఉ.ప్ర.) నుంచి లక్ష్మీబాయి, మరాఠా పీష్వా నానా సాహెబ్, మొఘల్ చక్రవర్తి బహదూర్ షా తిరుగుబాటు సంగ్రామంలో పాల్గొన్నారు. అంతిమంగా బ్రిటిష్ వాళ్లదే పైచేయి అయింది. ఝాన్సీ లక్ష్మీబాయి, తాంతియా తోపే ఆ పోరాటంలో మరణించారు. బహదూర్ షాను తీసుకెళ్లి బర్మా జైల్లో పడేసింది బ్రిటిష్ ఆర్మీ. హైదరాబాద్ నిజాం, గ్వాలియర్ సింధియాలు విదేశీ పాలకులకు అనుకూలంగా ఉండిపోయారు. అక్కడి తో పాండే వెలిగించిన మహాజ్వాల కొడిగట్టింది. సిపాయిల తిరుగుబాటు తర్వాత సంభవించిన కీలక పరిణామం... ఈస్టిండియా కంపెనీ శకం ముగియడం. దాని స్థానంలో ఇంగ్లండ్ ప్రభుత్వం వైశ్రాయ్లను, గవర్నర్ జనరల్స్నీ పెట్టి భారతదేశాన్ని పాలించింది. ఆ తర్వాత 1885 నుంచి 1947 వరకు బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా జరిగిందే... భారత జాతీయోద్యమం. మార్చి 29న బరక్‌పూర్ (ప.బెంగాల్) లో మంగళ్ పాండే తిరగబడ్డాడు. సైనిక న్యాయస్థానం అతడిని ఏప్రిల్ 8న ఉరితీసింది. మే 10న మీరట్‌లో అక్కడి సిపాయిలు తిరుగుబాటు చేశారు. అయితే స్వతంత్ర భారతదేశం మీరట్ తిరుగుబాటును మాత్రమే అధికారికంగా గుర్తించింది! మంగళ్ పాండే స్ఫూర్తిని పూర్తిగా విస్మరించింది, 1957 నాటి తొలిసిపాయిల తిరుగుబాటు శతాబ్ది వేడుకలలో... 1857 మే 10న బ్రిటిష్ పాలకులపై భారతీయ సిపాయిలు తిరగబడిన సందర్భాన్ని మాత్రమే అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ ‘కుల మతాలకు అతీతమైన సమైక్య పోరాటం’గా అభివ ర్ణించారు. అంతేకాదు, కలకత్తా విశ్వవిద్యాలయ చరిత్రకారుడు ఎస్.ఎన్.సేన్ తో తొలి స్వాతంత్య్ర సంగ్రామంపై రాయించిన అధికారిక గ్రంథాన్ని భారత ప్రభుత్వం ఆ ఉత్సవాల సందర్భంగా విడుదల చేసింది. ‘మత విశ్వాసాలను కాపాడుకునేందుకు మొదలైన పోరాటం... విజయవంతమైన స్వాతంత్య్ర సమరంగా సమాప్తమయింది’’ అని సేన్ తన పుస్తకాన్ని ముగించాడు! ఆ పుస్తకంలో ఎక్కడా పాండే ప్రస్తావన ప్రముఖంగా లేదు! పాలక పక్షాల ఒత్తిళ్ల మేరకే గ్రంథరచయిత పాండేను నామమాత్రంగా ఉంచేశాడని అంటారు. ఎందుకని పాండేని మనం తిరుగుబాటుకు తొలి వీరుడిగా గుర్తించలేకపోతున్నాం? 1857 మే 10న జరిగిన సిపాయిల తిరుగుబాటుకు బీజాలు వేసింది మార్చి 29 నాటి పాండే ధైర్యసాహసాలే అనే విషయమై ఎందుకని నేటికీ ఒక ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నాం. ఆట్చఠ్ఛి ఝ్చట్టడట ౌట అఛిఛిజీఛ్ఛ్ట్చీ ఏ్ఛటౌ గ్రంథకర్త రుద్రాంక్షు ముఖర్జీ పాండేను దేశభక్తునిగా గుర్తించలేమనీ, భారత తొలి స్వాతంత్య్ర సమరానికీ, పాండే తిరుగుబాటుకూ సంబంధమే లేదని రాశారు. ‘హిందూ మహాసభ’ సంస్థాపకులలో ఒకరైన వి.డి.సావర్కర్ తను రాసిన ‘ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్’ (1909) గ్రంథంలో తిరుగుబాటు గొప్పతనాన్నంతా మంగళ్పాండేకే ఇచ్చారని ఇప్పటికీ డాల్రింపుల్‌వంటి కొందరు బ్రిటిష్ చరిత్రకారులు విమర్శిస్తూనే ఉన్నారు! ఏది తొలి తిరుగుబాటు? ఈ విషయమై 157 ఏళ్లుగా అస్పష్టత కొనసాగుతూనే ఉంది. మార్చి 29 నాటి ఒక ఉక్కబోత మధ్యాహ్నపు వేళ బరక్పూర్లోని 34వ ‘నేటివ్ ఇన్ఫాంట్రీ’ దళ సభ్యుడు, 26 ఏళ్ల సిపాయి అయిన మంగళ్‌పాండే... పరేడ్ గ్రౌండ్లో బ్రిటిష్ అధికారులకు ఎదురు తిరగడమా లేక మే 10న మీరట్‌లో సిపాయిలంతా తిరగబడడమా... ఏది బీజం భారత స్వాతంత్య్ర సంగ్రామానికి? ఎలా చూసినా బరక్‌పూర్, మంగళ్ పాండే దగ్గరే మన సందిగ్ధతలు, సంశయాలన్నీ ముగుస్తున్నాయి. ఉత్తర భారతదేశం పొడవునా వ్యాపించిన మీరట్ దావానలం తాలూకు మసి జాడలను వెదుక్కూంటూ వెనక్కి వెనక్కి వెళ్లిన చరిత్రకారులు బరక్‌పూర్‌లో ఆగిపోతున్నారు! మొదట చిచ్చు పెట్టిన సిపాయిగా మంగళ్ పాండే మాత్రమే కనిపిస్తున్నాడు. మార్చి 29న అసలేం జరిగిందన్న విషయమై అప్పటి బ్రిటిష్ అధికారులు ఇచ్చిన లిఖితపూర్వక వివరాలు నేటికీ మనకు అందుబాటులో ఉన్నాయి. వాటి ఆధారంగా చూసినా పాండే నే మన తొలి కథానాయకుడు. అతడు తిరగబడిందే మన తొలి తిరుగుబాటు. పాండే తిరగబడిన తక్షణ కారణం... కొత్త ఎన్ఫీల్డ్ తుపాకులలో వాడేందుకు బ్రిటిష్ ఆర్మీ... సిపాయిలకు పంపిణీ చేసిన తూటాలేననీ, సులువుగా జారేందుకు వీలుగా ఆ తూటాలకు జంతువుల కొవ్వుతో తయారుచేసిన గ్రీసును అద్ది ఇవ్వడం వల్ల పాండే తీవ్ర మనస్తాపం చెంది బహిరంగంగా ఆగ్రహావేశాలు వ్యక్తం చేశాడనీ బ్రిటిష్ చరిత్రకారులు రాశారు. ఆ సంఘటన జరిగినప్పుడు పాండేతో పాటు అక్కడ అవధ్ బ్రాహ్మణ సిపాయిలు కూడా ఉన్నారు. బ్రిటిష్ వారి అప్రాచ్య విధానాల వల్ల తమ కులం, మతం మంటగలిసి పోతాయని వారంతా భయపడ్డారు. అంతే, పాండే తుపాకీ పైకి లేచింది. దానిని అతడు గాలిలో ఊపుతూ ‘‘అంతా బయటికి వచ్చేయండి, ఈ తూటాలను నోటితో తెరిచామంటే మనమంతా మత విశ్వాస ఘాతకులం అయినట్లే. ఇంకా ఆలోచిస్తారేమిటి? యూరోపియన్ల పని పడదాం రండి’’ అని అరిచాడు. అక్కడే ఉన్న ఇద్దరు బ్రిటిష్ అధికారులు సార్జెంట్ మేజర్ హ్యూసన్, లెఫ్ట్‌నెంట్ బాగ్‌లతో కలియబడి వారిని తన కత్తితో, తుపాకీతో గాయపరిచాడు. ఈ గొడవకి ప్రెసిడెన్సీ విభాగపు కమాండింగ్ ఆఫీసర్ జనరల్ హియర్సే రాగానే పాండే తనని తాను కాల్చుకున్నాడు. అయితే ఆ తూటా అతడిని చంపే విధంగా తగల్లేదు. ఇదే సంఘటన కొన్ని చరిత్ర పుస్తకాలలో మరింత వివరంగా ఉంది. ఆవుకొవ్వు, పంది కొవ్వు ఉపయోగించి తయారుచేసిన తూటాలను కొరికి ప్రయోగించడానికి నిరాకరించిన మంగళ్ పాండే ఆ కోపంలో తన పై అధికారిని హతమార్చాడు. షేక్ పల్టూ అనే సహ సిపాయి పాండేను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ విషయం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న జనరల్ జాన్‌హెర్పే... పాండేను పట్టుకోమని జమేదార్ ఈశ్వరీ ప్రసాద్‌ను అదేశించాడు. ప్రసాద్ కదల్లేదు. ఈలోపు పాండే తన తుపాకితో తనే కాల్చుకుని ఆంగ్లేయుల చేతిలో కాక, ఆత్మాభిమానంతో చచ్చిపోవాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. బ్రిటిష్ సైనికులు వెంటనే అతడిని నిర్బంధించి హత్యానేరం మోపారు. సైనిక న్యాయస్థానం పాండేను ఏప్రిల్ 18న ఉరి తియ్యాలని తీర్పు చెప్పింది. అయితే అతడిని పది రోజుల ముందుగానే ఉరితీశారు. అతడిని పట్టుకునేందుకు నిరాకరించిన ఈశ్వరీ ప్రసాద్‌ను కూడా రెండు వారాల తర్వాత ఏప్రిల్ 22న ఉరి తీశారు. పాండే తిరుగుబాటు చేస్తున్నప్పుడు చూస్తూ నిలబడిపోయారన్న ఆరోపణలపై తక్కిన సిపాయిల దుస్తులు విప్పించి పరేడ్ చేయించారు. చరిత్ర పుస్తకాలలో ఎన్ని రకాలుగా ఉన్నా భారతీయులలో అత్యధిక సంఖ్యాకులకు మాత్రం ఇప్పటికీ పాండేనే తొలి తిరుగుబాటు హీరో. కలకత్తాకి సమీపంలో బరక్‌పూర్‌లో 2005లో స్థానిక పాలక మండలి పాండే విగ్రహాన్ని ప్రతిష్టించింది. ఆ ఊరిలో ఆర్మీ బ్యారక్ల మధ్య పాండే ఒక్కడే ఒంటరి యోధుడిలా కనిపిస్తాడు. ఛాతీ వరకు ఉన్న ఆ స్మారక విగ్రహం కింద ‘మంగళ్‌పాండే, సిపాయి నెంబరు 1446, 34వ రెజిమెంట్. 1857 మార్చి 29న పట్టపగలు బ్రిటిష్ అధికారులపై ఇతడు తుపాకీ పేల్చాడు’ అని రాసి ఉంటుంది. ఎవరివీ అస్థికలు? అమృత్‌సర్‌లోని ‘కలియన్వాలా ఖు’ (నల్లవాళ్ల బావి)లో ప్రభుత్వ ప్రమేయం గానీ, సహకారం గానీ లేకుండా గురుద్వార యాజమాన్యం చొరవతో చరిత్ర పరిశోధకులు, స్థానికులు కలిసి కొంతకాలంగా తవ్వకాలు జరుపుతున్నప్పుడు మార్చి మొదటి వారంలో 282 మంది సిపాయిల అస్థికలు బయట పడ్డాయి. వాటితో పాటు 1830-1835 కాలం నాటి నాణేలు, క్వీన్ విక్టోరియా హయాంలోని రెండు బ్రిటిష్ పతకాలు, మూడు బంగారు గోళీలు, ఒక తాయెత్తు, అరవైకి పైగా ఈస్టిండియా కంపెనీ వారి రూపాయి కాసులు లభ్యమయ్యాయి. అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం ఈ అస్థికలన్నీ 26వ స్థానిక పదాతి దళానికి చెందిన భారతీయ సిపాయిలవి. 1857 జూలై 30న లాహోర్ సమీపంలోని మియాన్ మిర్ సైనిక పటాలంలో దాదాపు 500 మంది సిపాయిలు ప్రకాష్ పాండే అనే సిపాయి నాయకత్వంలో తిరుగుబాటు లేవదీసి, బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఢిల్లీ, మీరట్‌లలోని సిపాయిలతో చేయికలిపారు. వారిలో 282 మందిని బ్రిటిష్ అధికారులు అజ్నాలా తీసుకొచ్చి అప్పటి అమృత్సర్ డిప్యూటీ కమిషనర్ ఎఫ్.హెచ్.కూపర్ ఆదేశాలపై కాల్చి చంపారు. మృతదేహాలను ఓ ఎండిపోయిన బావిలో పడేశారు. ఆ బావికి బ్రిటిష్‌వాళ్లు పెట్టిన పేరే ‘కలియన్వాల ఖు’. తర్వాత గురుద్వార యాజమాన్యం ఆ పేరును ‘షహీదన్వాలా ఖు’ (అమరవీరుల బావి) గా మార్చింది. మిగతా 200 మంది సైనికులను కూడా బ్రిటిష్ అధికారులు వదిలిపెట్టలేదు. గాలిచొరబడని ఒక చిన్న గదిలో బంధించి, ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు. మంగళ్ పాండే ఎక్కడివాడు? తెలీదు! రెండు ప్రాంతాలున్నాయి. వాటిల్లో కచ్చితంగా ఏదో తెలీదు. చరిత్రకారులు తేల్చుకోలేకపోయారు. రెండిటినీ అవుననేందుకు, కాదనేందుకు కొన్ని కొన్ని ఆధారాలున్నాయి. మొదటిది: నగ్వా. ఉత్తరప్రదేశ్‌కు తూర్పున బల్లియా జిల్లాలో గంగానది ఒడ్డున ఉంది. ఊర్లో అక్కడక్కడా పాండే విగ్రహాలు కనిపిస్తుంటాయి! ‘‘అతడు మా ఊరి వాడు’’ అని గ్రామంలోని పెద్దలు అంటుంటారు. అంతకుమించి రుజువుల్లేవు. రెండోది: సురహర్పూర్. ఇదీ ఉత్తరప్రదేశ్లోనిదే. ఫజియాబాద్ జిల్లాలో అక్బర్పూర్ నియోజకవర్గంలో ఉంది. ఏడేళ్ల క్రితం సురహర్పూర్ అకస్మాత్తుగా మంగళ్‌పాండే జన్మస్థలం అయింది! సిపాయిల తిరుగుబాటుకు 150 ఏళ్లు అయిన సందర్భంగా 2007లో... అప్పటి కేంద్రమంత్రి మణిశంకర్ అయ్యర్ మీరట్ నుంచి పెద్ద ర్యాలీని ప్రారంభించినప్పుడు ఆ యువజన శాఖ వ్యవహారాల మంత్రిని చాలామంది అడిగారు - పాండే పుట్టిన సురహర్పూర్ను వదిలి ఇక్కడి నుంచి సెలబ్రేట్ చెయ్యడం ఏమిటని! ప్రభుత్వం లెక్కలు వేరు. మార్చి 29న తిరగబడిన వాడు పాండే ఒక్కడే. ఆ ఒక్కణ్నీ ఉరేశారు. ఆ తర్వాత మే 10న తిరగబడిన మీరట్ సిపాయిలు వందలు వేలు. అందుకే నూటాయాభై ఏళ్ల సన్నాహక ఉత్సవాలు ‘అధికారికం’గా మే 10న మొదలయ్యాయి. అదే రోజు మీడియా కొంతమంది ప్రతినిధులను సురహర్పూర్ పంపింది. ఆ ప్రతినిధులకు అక్కడ సీతారామ్ సింగ్ అనే స్వాతంత్య్ర సమరయోధుడు కనిపించాడు. అప్పటికి ఆయన వయసు తొంభై నాలుగు. సీతారామ్ చరిత్రకారుడు కూడా. ఐదారు పుస్తకాలు రాశారు. పాండే జనన విషయాలు ఆయన దగ్గర కొన్ని ఉన్నాయి. ‘‘పాండే తండ్రి దినకర్ పాండే. ఆయన మొదట్లో ఫైజాబాద్ జిల్లా ... దుగ్వాన్-రహీమ్‌పూర్‌లో ఉండేవారు. అక్కడి నుంచి సురహర్పూర్ వలస వచ్చాడు. మంగళ్‌పాండే తల్లి అభయ్‌రాణి సురహర్పూర్ అమ్మాయి. అభయ్రాణిని చేసుకున్నాక దినకర్ ఇక్కడే స్థిరపడిపోయాడు. ఇక్కడే పాండే కూడా పుట్టాడు’’ - తనదగ్గరున్న ఆధారాలేవో చూపించారు సీతారామ్. అలా సురహర్పూర్ పాండే జన్మస్థలం అనుకోడానికి ఒక నిదర్శనం లభించింది.