సొంతపార్టీపై బీజేపీ ఎంపీ శత్రుఘ్న మండిపాటు | BJP MP Shatrughan Sinha demaded to Release JNUSU leader Kanhaiya kumar | Sakshi
Sakshi News home page

సొంతపార్టీపై బీజేపీ ఎంపీ శత్రుఘ్న మండిపాటు

Published Wed, Feb 17 2016 11:04 AM | Last Updated on Fri, Mar 29 2019 8:33 PM

సొంతపార్టీపై బీజేపీ ఎంపీ శత్రుఘ్న మండిపాటు - Sakshi

సొంతపార్టీపై బీజేపీ ఎంపీ శత్రుఘ్న మండిపాటు

న్యూఢిల్లీ: అఫ్జల్ గురు సంస్మరణ సభతో జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో తలెత్తిన వివాదం, అనంతర పరిణామాలపై తనదైన శైలిలో స్పందిస్తూ సొంత పార్టీ బీజేపీకి చురకలంటించారు బాలీవుడ్ వెటరన్, ఎంపీ శత్రుఘ్న సిన్హా. జేఎన్ యూ ఉదంతంలో దేశద్రోహం కేసు కింద అరెస్టయిన విద్యార్థి సంఘం నాయకుడు కన్నయా కుమార్ ను విడుదలచేయాలని డిమాండ్ చేశారు.

'ఆ కార్యక్రమంలో కన్నాయా కుమార్ స్పీచ్ ఆసాంతం విన్నాను. మా బిహార్ కు చెందిన ఆ యువనాయకుడు ఏక్కడ కూడా జాతివ్యతిరేక నినాదాలు చేసినట్లు నాకనిపించలేదు.ఈ విషయంలో మా పార్టీకి చెందిన కొంరు నాయకులు అతిగా స్పందించారు' అని ట్విట్టర్ లో పేర్కొన్నారు షాట్ గన్. ఈ వ్యవహారంలో బీజేపీ త్వరలోనే తన విధానాన్ని మార్చుకుంటుందని ఆశిస్తున్నానన్నారు.

జేఎన్ యూ అంతర్జాతీయ ఖ్యాతి గడిచిన విద్యాసంస్థ అని, ఎందరో అత్యుత్తమ విద్యార్థులు, టీచర్లున్న ఆ సంస్థలో ఇక ముందు సంకటస్థితి నెలకొనకుండా బీజేపీ నేతలు వివాదాన్ని ఇంతటితో ముగించాలని శత్రుఘ్న హితవుపలికారు. 'వాళ్లు మన సొంత పిల్లలు. జీవితాలపై ప్రభావం చూపే కేసులు బనాయించడం ఎంతవరకు సబబు?'అని ప్రశ్నించారు. తరచూ పార్టీ వ్యతిరేక ప్రకటనలుచేసే శత్రుఘ్నా సిన్హా ఇటీవలే అరుణాచల్ ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించాలన్న కేంద్రం నిర్ణయాన్ని తప్పుపట్టిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement