ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ కొత్త సీఎఫ్‌వోగా కొడవంటి కామేశ్వర రావును ఎంపిక చేసినట్లు తాజాగా పేర్కొంది. 1991 నుంచి బ్యాంకులో విధులు నిర్వహిస్తున్న కామేశ్వర రావు 2023 జూలై 1నుంచి సీఎఫ్‌వోగా బాధ్యతలు చేపట్టినట్లు తెలియజేసింది.
సీఎఫ్‌వోగా రాజీనామా చేసిన చరణ్‌జిత్ సురీందర్ సింగ్ అత్రా స్థానే కామేశ్వర రావును నియమించినట్లు వెల్లడించింది. చార్టెర్డ్ అకౌంటెంట్ అయిన కామేశ్వర రావు బ్యాంకింగ్, ఫారెక్స్, ఫైనాన్స్, అకౌంటింగ్ విభాగాలలో విధులు నిర్వర్తించినట్లు స్టాక్ ఎక్సే్ఛంజీలకు ఎస్‌బీఐ తెలియజేసింది.
మరోవైపు, చిన్న వ్యాపారాలు చేసుకునే కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా ఎస్‌బీఐ 34 ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్ హబ్‌లను ఏర్పాటు చేసింది. వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా 21 జిల్లా కేంద్రాల్లో వీటిని నెలకొల్పినట్లు ఎస్‌బీఐ తెలి పింది. ప్రీ–లాంచ్‌లో ఈ కేంద్రాల్లో రూ. 1,000 కోట్ల డిపాజిట్లు సేకరించినట్లు వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment