
న్యూఢిల్లీ: ఇక నుంచి విదేశాల్లో పనిచేసే భారతీయులు ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్)లో భాగస్తులు కావచ్చు. ఈ పథకంలో భాగంగా ఉద్యోగులు వారు పనిచేస్తున్న దేశంలో సోషల్ సెక్యూరిటీ పథకాన్ని వదులుకుని ఈపీఎఫ్‌ఓలో చేరే అవకాశాన్ని కల్పించినట్లు కేంద్ర ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ వీపీ జాయ్ చెప్పారు. ఇందుకోసం 18 దేశాలతో ఒప్పందం కుదుర్చుకున్నామని ఆయన వెల్లడించారు. విదేశాలకు వెళ్లే ఉద్యోగులు పీఎఫ్ కోసం సర్టిఫికెట్ ఆఫ్ కవరేజ్(సీవోసీ) పొందవచ్చని, విదేశాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఆన్‌లైన్ ద్వారా సీవోసీకి దరఖాస్తు చేయవచ్చని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment