తప్పుడు పత్రాలు సృష్టించారనే ఆరోపణలతో నోటీసులు అందుకున్న టీవీ9 సీఎఫ్‌వో ఎంవీకేఎన్ మూర్తి శుక‍్రవారం సైబరాబాద్ పోలీస్ కార్యాలయానికి వచ్చారు. సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట ఆయన విచారణకు హాజరయ్యారు. నిధుల మళ్లింపు, ఫోర్జరీ అంశాలపై మూర్తిని పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది. ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు టీవీ9 కార్యాలయంలో 12 హార్డ్ డిస్క్‌లు, నాలుగు ల్యాప్‌టాప్‌లు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.