
న్యూఢిల్లీ: నైకా బ్రాండ్ కింద కార్యకలాపాలు సాగిస్తున్న ఎఫ్‌ఎస్‌ఎన్ ఈ–కామర్స్ వెంచర్స్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో) అరవింద్ అగర్వాల్ రాజీనామా చేశారు. డిజిటల్ ఎకానమీ, స్టార్టప్ విభాగంలో అవకాశాలపై దృష్టి పెట్టేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది.
కొత్త సీఎఫ్‌వో నియామకం ప్రక్రియపై కసరత్తు చేస్తున్నట్లు పేర్కొంది. 2020 జూలైలో అగర్వాల్ అమెజాన్ నుండి నైకాలో చేరారు. కంపెనీ ఐపీవోను పర్యవేక్షించిన కీలక సిబ్బందిలో (కేఎంపీ) ఆయన కూడా ఒకరు.
Comments
Please login to add a commentAdd a comment