Nykaa
-
నైకాలో ఏం జరుగుతోంది? బోర్డుకు ఐదుగురు గుడ్‌బై!
న్యూఢిల్లీ: బ్యూటీ, వెల్నెస్ ప్రొడక్టుల కంపెనీ నైకా(ఎఫ్ఎస్ఎన్ ఈకామర్స్) బోర్డు నుంచి ఐదుగురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు తప్పుకున్నట్లు తెలుస్తోంది. వీరిలో సూపర్‌స్టోర్ సీఈవో వికాస్ గుప్తా, ఫ్యాషన్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ గోపాల్ ఆస్థాన, చీఫ్ కమర్షియల్ ఆపరేషన్స్ ఆఫీసర్ మనోజ్ గంధి, బిజినెస్ హెడ్ సుచీ పాండ్య, ఫైనాన్స్ హెడ్ లలిత్ ప్రుతి ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. తెలియజేశాయి. అయితే ఎగ్జిక్యూటివ్‌ల రాజీనామాలకు కారణాలు తెలియరాలేదు. (విషాదం: ఇంటెల్ కో-ఫౌండర్, ప్రముఖ వ్యాపారవేత్త కన్నుమూత) కాగా.. ఏడాది కాలంగా నైకాలో బాధ్యతలు నిర్వహిస్తున్న లలిత్ తాజాగా ఎడ్టెక్ సంస్థ యునివోలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా చేరినట్లు తెలుస్తోంది. రాజీనామాలు స్వచ్చందం(వొలంటరీ)గా, అప్రయత్నం(ఇన్వొలంటరీ)గా చేసినట్లు నైకా పేర్కొంది. 3,000 మందికిపైగా ఉద్యోగులతో వేగవంత వృద్ధిపై దృష్టి పెట్టి సాగుతున్న నైకా వంటి కంపెనీలలో వొలంటరీ, ఇన్వొలంటరీగా రాజీనామాలకు అవకాశమున్నట్లు వ్యాఖ్యానించింది. గత కొన్నేళ్లుగా దేశంలో అత్యున్నత నైపుణ్యాలకు కంపెనీ మద్దతిస్తూ వస్తున్నట్లు తెలియజేసింది. మధ్యస్థాయి పొజిషన్లలో రాజీనామాలు ప్రామాణిక వార్షిక ప్రోత్సాహాలు, మార్పులలో భాగమని, పనితీరు లేదా ఇతర అవకాశాలరీత్యా ఇవి జరుగుతుంటాయని వివరించింది. ప్రస్తుత, గతంలో పనిచేసిన ఉద్యోగుల సేవలకు నైకా ఎల్లప్పుడూ విలువ ఇస్తుందని ఒక ప్రకటనలో తెలియజేసింది. కంపెనీ నుంచి తప్పుకున్న వారంతా ఏడాది నుంచి మూడున్నరేళ్ల కాలం మధ్య పనిచేసిన వారేకావడం గమనార్హం! (బుజ్జి బంగారం: ఆనందంలో మునిగి తేలుతున్న మార్క్ జుకర్‌బర్గ్ ) -
నైకా ఫల్గుణి సంచలనం: తగ్గేదేలే అంటున్న బిజినెస్ విమెన్
సాక్షి, ముంబై: ఫోర్బ్స్ 2022 భారతదేశపు 100 మంది సంపన్నుల జాబితాలో ఈ ఏడాది అనేక మంది కొత్త బిలియనీర్లు చోటు సంపాదించడం విశేషం. రూపాయి విలువ క్షీణత, ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం ఆందోళనలున్నప్పటికీ దేశం లోని టాప్-100 కుబేరుల సంపద అసాధారణంగా పెరిగిందని ఫోర్బ్స్ డేటా ద్వారా తెలుస్తోంది. ఫల్గుణి నాయర్: ముఖ్యంగా ఇటీవల ఐపీవోతోపాటు పలు సంచనాలకు మారు పేరు నైకా ఫౌండర్ ఫల్గుణి నాయర్ టాప్-50లో చోటు సంపాదించు కున్నారు. రూ. 32,951.71 కోట్లతో దేశంలోని అత్యంత ధనవంతుల స్వీయ-నిర్మిత బిలియనీర్‌గా ప్రశంస లందుకున్నారు. ఫోర్బ్స్ డేటా ప్రకారం 4.8 బిలియన్ల డాలర్ల నికర విలువతో ఫల్గుణి నాయర్ జాబితాలో 44వ స్థానంలో నిలిచారు. ఐఐఎం అహ్మదాబాద్ గ్రాడ్యుయేట్ నాయర్ 2012లో "మల్టీ-బ్రాండ్ ఓమ్నిచానెల్ బ్యూటీ-ఫోకస్డ్ రిటైల్ వ్యాపారాన్ని నిర్మించాలనే లక్క్ష్యంతో నైకాను స్థాపించారు. సావిత్రి జిందాల్: ఫోర్బ్స్ ప్రకారం ఓపీ జిందాల్ గ్రూప్ చైర్పర్సన్, సావిత్రి జిందాల్ టాప్-10లో ఉన్న ఏకైక మహిళా బిలియనీర్. 17.4 బిలియన్ డాలర్ల నికర విలువతో 72 ఏళ్ల సావిత్రి జిందాల్ ఈ సంవత్సరం జాబితాలో మొదటి పది మంది ధనవంతుల జాబితాలో ఉన్నారు. ఆమె భర్త ఓం ప్రకాష్ జిందాల్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత, గ్రూప్ బాధ్యతలను చేపట్టారు. ఈ దంపతుల నలుగురు కుమారుల స్వతంత్రంగా కంపెనీలను నిర్వహిస్తున్నారు. రేఖా ఝున్‌ఝున్‌వాలా: దివంగత పెట్టుబడిదారుడు రాకేష్ ఝన్‌ఝున్‌వాలా భార్య రేఖాఈ లిస్ట్‌లో 30వ స్థానంలో నిలిచి తన భర్తన స్థానాన్ని భర్తీ చేశారు. ఆమె నికర సంపద 5.9 బిలియన్ డాలర్లు. (ఫోర్బ్స్ టాప్ -10 లిస్ట్: బిలియనీర్లు అదానీ, అంబానీ ఎక్కడ?) నెహాల్ వకీల్: ఏసియన్ పెయింట్స్‌కు చెందిన నెహాల్ వకీల్ 0.52 బిలియన్ డాలర్లతో 46వ స్థానంలో నిలిచారు. తొలిసారి 2022 ఫోర్బ్స్ జాబితాలో ఎంట్రీ ఇచ్చారు. 1942లో స్థాపించిన ఏషియన్ పెయింట్స్ కంపెనీని నడుపుతున్న కుటుంబంలోని థర్డ్ జెనరేషన్ ప్రతినిధి నెహాల్. అంతేకాదు బోర్డులో ఉన్న ముఖ్య కుటుంబ సభ్యులలో నేహా ఒకరు. కిరణ్ మజుందార్-షా: బయోకాన్ ఎండీ కిరణ్ మజుందార్-షా 2.7 బిలియన్ డాలర్ల నికర సంపదతో భారతదేశంలోని అత్యంత సంపన్న మహిళల్లో 76వ స్థానంలో నిలిచారు. 1978లో ఆదాయం ద్వారా భారతదేశంలో అతిపెద్ద లిస్టెడ్ బయోఫార్మాస్యూటికల్ సంస్థగా బయోకాన్ అవతరించింది. లీనా తివారీ: 3.7 బిలియన్ డాలర్ల నికర విలువతో, లీనా తివారీ ఈ సంవత్సరం అత్యంత సంపన్న భారతీయుల జాబితాలో 51వ ప్లేస్‌లో నిలిచారు. ఫార్మాస్యూటికల్ దిగ్గజం యూఎస్వీ ఇండియా ఛైర్‌పర్సన్‌గా, తివారీ 2018లో జర్మన్ జెనరిక్స్ సంస్థ జూటా ఫార్మాను కొనుగోలు చేశారు. అను అగా: 80 ఏళ్ల అను అగా తిరిగి మళ్లీ రిచెస్ట్ ఇండియన్స్ జాబితాలో చోటు సంపాదించారు. 1.9 బిలియన్ డాలర్ల నికర సంపదతో 88వ స్థానంలో నిలిచారు. థర్మాక్స్ అనే లిస్టెడ్ ఇంజనీరింగ్ సంస్థలో అగా మెజారిటీ వాటాను కలిగి ఉంది. అగా 1985లో తన జీవిత భాగస్వామి కంపెనీలో పని చేయడం ప్రారంభించారు. సుదీర్ఘం అనారోగ్యంతో భర్త మరణించడంతో 1996లో ఆమె కంపెనీ బాధ్యతలు చేపట్టారు. తరువాత కెమికల్ ఇంజనీర్ అయి అను కుమార్తె మెహెర్ బాధ్యతలు చేపట్టడంతో 2004లో అగా ఛైర్పర్సన్ పదవికి రాజీనామా చేసి సామాజిక కార్యకలాపాల్లో బిజీగా ఉన్నారు. అలాగే ఇండియన్ ఎత్నిక్ వేర్ తయారీదారు, మన్యవార్ బ్రాండ్‌కు ప్రసిద్ధి చెందిన వేదాంత్ ఫ్యాషన్స్ ఓనర్ రవి మోడీ 3.6 బిలియన్ డాలర్లతో ఫోర్బ్స్ లో చోటు సాధించారు. ఇంకా యూఎన్వో మిండా (గతంలో మిండా ఇండస్ట్రీస్) సీఎండీ నిర్మల్ మిండా మెట్రో బ్రాండ్లకు చెందిన రఫీక్ మాలిక్ జాబితాలో కొత్తగా ప్రవేశించిన వారిలో ఉన్నారు. -
నైకా సీఎఫ్‌వో అరవింద్ రాజీనామా
న్యూఢిల్లీ: నైకా బ్రాండ్ కింద కార్యకలాపాలు సాగిస్తున్న ఎఫ్ఎస్ఎన్ ఈ–కామర్స్ వెంచర్స్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో) అరవింద్ అగర్వాల్ రాజీనామా చేశారు. డిజిటల్ ఎకానమీ, స్టార్టప్ విభాగంలో అవకాశాలపై దృష్టి పెట్టేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. కొత్త సీఎఫ్‌వో నియామకం ప్రక్రియపై కసరత్తు చేస్తున్నట్లు పేర్కొంది. 2020 జూలైలో అగర్వాల్ అమెజాన్ నుండి నైకాలో చేరారు. కంపెనీ ఐపీవోను పర్యవేక్షించిన కీలక సిబ్బందిలో (కేఎంపీ) ఆయన కూడా ఒకరు. -
నైకాలో నాలుగు సంస్థల షేర్ల విక్రయం
న్యూఢిల్లీ: లాకిన్ వ్యవధి ముగిసిన నేపథ్యంలో బ్యూటీ ఈ–కామర్స్ ప్లాట్‌ఫాం నైకా మాతృసంస్థ ఎఫ్ఎస్ఎన్ ఈ–కామర్స్‌లో ఇన్వెస్ట్ చేసిన నాలుగు సంస్థలు ఓపెన్ మార్కెట్లో షేర్లను విక్రయించాయి. తద్వారా రూ. 693 కోట్లు సమీకరించాయి. లైట్‌హౌస్ ఇండియా ఫండ్ త్రీ, మాలా గోపాల్ గావ్కర్, నరోత్తమ్ షఖ్సారియా 2.84 కోట్ల షేర్లను రూ. 491.35 కోట్లకు విక్రయించారు. షేరు ఒక్కింటికి రూ. 171.75–173.70 రేటు చొప్పున విక్రయించగా సెగంటీ ఇండియా మారిషస్, నార్జెస్ బ్యాంక్, అబర్డీన్ స్టాండర్డ్ సంస్థలు కొనుగోలు చేశాయి. అటు టీపీజీ గ్రోత్ 4 ఎస్ఎఫ్ రెండు విడతల్లో రూ. 202 కోట్లకు మొత్తం 1.08 కోట్ల షేర్లను విక్రయించింది. షేరు ఒక్కింటికి రూ. 186.4 రేటుతో అమ్మగా సొసైటీ జనరల్, మోర్గాన్ స్టాన్లీ ఏషియా (సింగపూర్) కొనుగోలు చేశాయి. శుక్రవారం ఎఫ్ఎస్ఎన్ ఈ–కామర్స్ వెంచర్స్ షేరు 10 శాతం పెరిగి రూ. 208 వద్ద ముగిసింది. -
మార్కెట్లో న్యూఏజ్ టెక్ షేర్ల వెల్లువ.. జాబితాలో పేటీఎం, జొమాటో, నైకా
గత కొద్ది నెలలుగా పబ్లిక్ ఇష్యూలకు వచ్చి స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన పలు కొత్తతరం(న్యూఏజ్) టెక్ కంపెనీల షేర్లు కొద్ది రోజులుగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇందుకు ఐపీవోకు ముందు కంపెనీలో ఇన్వెస్ట్‌చేసిన సంస్థల షేర్లపై లాకిన్ గడువు తీరనుండటం కారణమవుతోంది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఐపీవోకు ముందు కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు లేదా 20 శాతానికి మించిన ప్రమోటర్ల వాటాకు లాకిన్ గడువును ఏడాది నుంచి ఆరు నెలలకు కుదించింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నిబంధనలు అమల్లోకి వచ్చాయి. వివరాలు చూద్దాం.. గతేడాది నవంబర్ మొదలు ఈ ఏడాది మే నెలవరకూ పబ్లిక్ ఇష్యూలకు వచ్చిన పలు న్యూఏజ్, ఫిన్‌టెక్ కంపెనీలు, స్టార్టప్‌ల షేర్లకు లాకిన్ గడువు ఈ నెలలో ముగియనుంది. 12 నెలల నుంచి 6 నెలల గడువు తీరనుండటమే దీనికి కారణం. నేటి నుంచి క్యాంపస్ యాక్టివ్‌వేర్ షేర్లు అందుబాటులోకి రానుండగా.. ఎఫ్ఎస్ఎన్ ఈకామర్స్, రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్ షేర్లకు రేపు(10న) లాకిన్ గడువు తీరనుంది. ఈ జాబితాలో ఫినో పేమెంట్స్ బ్యాంక్(12న), పీబీ ఫిన్‌టెక్(15న), పేటీఎమ్, శాఫైర్ ఫుడ్స్(18న), డెల్హివరీ(24న), టార్సన్ ప్రొడక్ట్స్(26న) పారదీప్ ఫాస్ఫేట్స్(27న), గో ఫ్యాషన్ ఇండియా(30న) తదితరాలున్నాయి. దీంతో ఈ షేర్లు స్టాక్ ఎక్సే్ఛంజీలను తాకనున్నాయి. వెరసి పలు కంపెనీల కౌంటర్లలో అందుబాటులోని ఈక్విటీ ఒక్కసారిగా పెరగనుంది. అయితే నైకా, రెయిన్బో చిల్డ్రన్స్, క్యాంపస్ యాక్టివ్‌వేర్, శాఫైర్ ఫుడ్స్, గోకలర్స్ తదితర కొన్ని కౌంటర్లు ఐపీవో ధరతో పోలిస్తే భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి. దీంతో లాభాల స్వీకరణకు అవకాశమున్నట్లు మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఐపీవోకు ముందు ఇన్వెస్ట్‌చేసిన సంస్థలు ఆయా షేర్లను విక్రయించేందుకు ఆసక్తి చూపేదీ లేనిదీ వేచి చూడవలసి ఉన్నట్లు మరికొందరు అభిప్రాయపడ్డారు. జొమాటో ఎఫెక్ట్ ఈ ఏడాది జులైలో లాకిన్ గడువు ముగిసిన వెంటనే జొమాటో షేర్లు జులైలో 22 శాతం పతనంకావడం గమనార్హం. ప్రీఐపీవో ఇన్వెస్టర్లు ఉబర్, టైగర్ గ్లోబల్ తదితరాలు షేర్లను విక్రయించడం ప్రభావం చూపింది. ఒక అంచనా ప్రకారం 14 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 1,15,000 కోట్లు) విలువైన షేర్లకు లాకిన్ గడువు తీరనుంది. వీటిలో నైకా 31.9 కోట్ల షేర్లు, పాలసీ బజార్ 2.8 కోట్ల షేర్లు అందుబాటులోకి రానున్నట్లు అంచనా. దీంతో పలు కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే పేటీఎమ్ షేరు ఐపీవో ధరతో పోలిస్తే 70 శాతం పతనంకాగా.. గత నెల రోజుల్లోనే డెల్హివరీ 35 శాతం, పీబీ ఫిన్‌టెక్ 26 శాతం, ఫినో పేమెంట్స్ బ్యాంక్ 21 శాతం చొప్పున డీలా పడ్డాయి. చదవండి: ‘వెనక ఇంత జరిగిందా’.. ఉద్యోగులకు ఊహించని షాకిచ్చిన ప్రముఖ ఐటీ కంపెనీ! -
నైకా దూకుడు కళ్లు చెదిరేలా లాభం, ఏకంగా 330 శాతం జూమ్
న్యూఢిల్లీ: బ్యూటీ, ఫ్యాషన్ సంస్థ ఎఫ్ఎస్ఎన్ ఈకామర్స్ వెంచర్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై-సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం భారీగా దూసుకెళ్లి రూ. 5.2 కోట్లను తాకింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 330శాతం ఎక్కువ కావడం విశేషం. నైకా బ్రాండు కంపెనీ గతేడాది(2021-22) ఇదే కాలంలో కేవలం రూ. 1.2 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 39 శాతం ఎగసి రూ. 1,231 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 885 కోట్ల టర్నోవర్ మాత్రమే సాధించింది. ఈ కాలంలో స్థూల వ్యాపార విలువ(జీఎంవీ) 45 శాతం జంప్‌చేసి రూ. 2,346 కోట్లను తాకింది. ఫలితాల నేపథ్యంలో నైకా షేరు ఎన్ఎస్ఈలో 2.4 శాతం బలపడి రూ. 1,180 వద్ద ముగిసింది. అయితే బుధవారం మాత్రం లాభాలను కోల్పోయి స్వల్ప నష్టాలతో కొనసాగుతోంది. -
ఆరంభ లాభాలు ఆవిరి: నైకా షేర్లు ఢమాల్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. ట్రేడర్ల లాభాల స్వీకరణతో ఆరంభ లాభాలను వెంటనే కోల్పోయిన సూచీలు వెంటనే నష్టాల్లోకి మళ్లాయి. దాదాపు అన్ని రంగాల షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. దీంతో ఒక దశలో 60వేలను దాటేసిన సెన్సెక్స్ చివరికి 288 పాయింట్లు నష్టపోయి 59543 వద్ద, నిఫ్టీ 74 పాయింట్ల నష్టంతో 17659 వద్ద స్థిరపడింది. అయితే ప్రభుత్వ రంగ బ్యాంకుల లాభాలతో భారీ నష్టాలనుంచి సేచీలు కోలుకున్నాయి. టెక్ మహీంద్ర, మారుతి సుజుకి, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎల్ అండ్ టీ , ఐషర్ మోటార్స్ లాభపడగా, నెస్లే, కోటక్ మహీంద్ర, హెచ్‌యూఎల్, బజాజ్‌ఫిన్‌సర్వ్, బ్రిటానియా నష్టపోయాయి. అలాగే నైకాషేర్లు 2శాతం పతనాన్ని నమోదు చేశాయి. భారీ అమ్మకాలతో ఇష్యూ ధర కంటే దిగువకు పడిపోయాయి. అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి కూడా ఆరంభం లాభాలను కోల్పోయింది. తీవ్ర ఒడి దుడుకుల మధ్య శుక్రవారం నాటి 82.68 ముగింపుతో పోలిస్తే స్వల్ప నష్టాలతో 82.73 వద్ద ముగిసింది. -
నటి ప్రియాంక బిజినెస్ ప్లాన్స్: నా బ్యూటీకి దేశీ ఉత్పత్తులనే వాడతా
ముంబై: బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా జోనాస్ తన హెయిర్‌కేర్ బ్రాండ్ అనోమలీని ఇండియాలో లాంచ్ చేసింది. ఇందుకోసం నైకా బ్రాండ్ కింద సౌందర్య, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులను విక్రయించే బ్యూటీ అండ్ వెల్నెస్ ఈ–కామర్స్ సంస్థ ఎఫ్ఎస్ఎన్తో డీల్ కుదుర్చుకుంది. అనామలీ పేరిట శిరోజాల సంరక్షణ ఉత్పత్తులకు సంబంధించిన సొంత బ్రాండ్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టారు. లాంచ్ సందర్భంగా, జోనాస్ మాట్లాడుతూ, తాను ఇప్పటికీ rouge, పెరుగు, తేనె లాంటి భారతీయ సాంప్రదాయ సౌందర్య సంరక్షణ పద్ధతులను ఉపయోగించడాన్ని ఇష్టపడతానని, ఈ నేపథ్యంలోనే కురుల సంరక్షణకు సంబంధించి భారతీయ సంప్రదాయ విధానాల స్ఫూర్తితో సహజసిద్ధమైన ప్రకృతి వనరుల నుంచి వీటిని ఉత్పత్తి చేస్తున్నట్లు ఆమె తెలిపారు. (ఫెస్టివ్ సీజన్: గుడ్‌న్యూస్ 75 వేల ఉద్యోగాలు) "అనోమలీ హెయిర్కేర్ను భారతదేశానికి తీసుకురావడం నాకు చాలా గర్వంగా ఉంది. ఇక్కడే పుట్టిన ఈ బ్రాండ్ ఇండియా లాంచ్ చాలా ప్రత్యేక మైందని ప్రియాకం చెప్పారు. ప్రకృతి, వృక్షాలతో భారతీయ సౌందర్యం ఇమిడిపోయిందని ఆమె అన్నారు.గత మూడు, నాలుగు సంవత్సరాలలో భారతీయ అందాల విభాగం బాగా వృద్దిచెందిందని నైకా సీఈఓ, ఈ-కామర్స్ బ్యూటీ, అంచిత్ నాయర్ వ్యాఖ్యానించారు.(jobmarket: ఉద్యోగాలపై ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్! తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?) View this post on Instagram A post shared by Team Priyanka Chopra Jonas (@team_pc_) View this post on Instagram A post shared by Team Priyanka Chopra Jonas (@team_pc_) -
భారత్‌లో అత్యంత సంపన్న మహిళ.. 'రోష్ని నాడార్' ఆస్తి ఎంతో తెలుసా?
ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం కొటక్ మహీంద్రా - హురున్ ఇండియా సంస్థలు సంయుక్తంగా భారత్‌లోనే అత్యంత సంపన్నులైన 100 మంది మహిళల జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో రోష్ని నాడార్, ఫల్గుణి నాయర్లు వరుస స్థానాల్ని దక్కించుకున్నారు. ♦ సంపన్నుల జాబితాలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చైర్ పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా నికర సంపద 54 శాతం పెరిగి రూ.84,330కోట్లతో తొలిస్థానాన్ని కైవసం చేసుకున్నారు. ♦ బ్యాంకింగ్ రంగం నుంచి అనూహ్యంగా నైకా పేరుతో కాస్మోటిక్స్ రంగంలో రాణిస్తున్న ఫల్గుణి నాయర్ రూ.57,520 కోట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఏడాదిలో ఆమె వెల్త్ 963 శాతం పెరిగినట్లు విడుదలైన నివేదిక పేర్కొంది. ♦ బయోకాన్ ఛైర్ పర్సన్ కిరణ్ మంజుదార్ షా వెల్త్ 21శాతం తగ్గి రూ.29,030 కోట్లతో మూడవ స్థానంలో నిలిచారు. హైదరాబాద్‌లో 12మంది మహిళలు మహిళా సంపన్నుల జాబితాలో అత్యధికంగా ఢిల్లీ నుంచి 25 మంది, ముంబై నుంచి 21మంది ,హైదరాబాద్ నుంచి 12 మంది ఉన్నారు. భారతదేశంలోని టాప్ - 100 మంది ధనవంతులైన మహిళలలో ఫార్మాస్యూటికల్స్ రంగం నుంచి 12 మంది, హెల్త్‌కేర్ నుంచి 11 మంది, కన్స్యూమర్ గూడ్స్ రంగం నుంచి 9 మంది మహిళలున్నారు. హైదరాబాద్‌లో దివీస్ లాబోరేటరీస్ డైరక్టర్ నీలిమా రూ.28,180కోట్లతో తొలిస్థానంలో నిలిచారు. ఆ తర్వాత రూ.5,530కోట్లతో బయోలాజికల్ ఇ.లిమిటెడ్ ఎండీ మహిమా దాట్ల, రూ.2,740కోట్లతో శోభన కామినేని తర్వాతి స్థానాల్లో ఉన్నారు. చివరిగా భోపాల్ జెట్‌సెట్‌గోకు చెందిన 33ఏళ్ల కనికా తెక్రివాల్ 50 శాతం సంపదతో రూ.420 కోట్లతో జాబితాలో అత్యంత పిన్న వయస్కురాలిగా నిలిచారు. సంస్థల్లో ఉన్నత స్థాయిలో.. సంపన్నుల జాబితాలో ఆయా సంస్థల్లో ఉన్నత స్థానాల్లో విధులు నిర్వహించిన మహిళలు సైతం ఉన్నారు. వారిలో మాజీ పెప్సికో సీఈవో ఇంద్రా నూయి రూ. 5,040 కోట్లు, హెచ్డీఎఫ్సీ మేనేజింగ్ డైరెక్టర్‌గా రేణు సుద్ కర్నాడ్ రూ. 870 కోట్లు, కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రెసిడెంట్ శాంతి ఏకాంబరం రూ.320 కోట్లతో వరుస స్థానాల్ని కైవసం చేసుకున్నారు. -
నైకా ఫాల్గుని నాయర్ ఖాతాలో మరో ఘనత
చిన్న వయసులోనే సెల్ఫ్‌మేడ్ బిలియనీర్‌గా రికార్డు సృష్టించిన నైకా ఫౌండర్ ఫాల్గుని నాయర్ ఖాతాలో మరో ఘనత వచ్చి చేరింది. ఎంటర్‌ప్యూనర్ ఆఫ్ ది ఇయర్ 2021 (ఈవై) అవార్డు గెలుచుకున్నారు. రెగ్యులర్ మార్కెట్లో మాత్రమే అమ్ముడయ్యే సౌందర్య ఉత్పత్తులను ‘నైకా’తో ఈ కామర్స్‌లోకి తీసుకెళ్లి ఘన విజయం సాధించారు ఫాల్గుని నాయర్. అంతేకాదు గతేడాది నైకా ఐపీవోకి బంపర్ హిట్ సాధించింది. రాత్రికి రాత్రే ఫాల్గుని నాయర్ బిలియనీర్‌గా మారింది. గత నాలుగు నెలలుగా మార్కెట్లో అస్థితర నెలకొన్నా నైకాకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. జూన్‌లో జరగబోయే వరల్డ్ ఎంటర్‌ప్యూనర్ ఆఫ్ ది ఇయర్ కార్యక్రమంలో ఆమె ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. ఎల్ అంట్ టీ చైర్మన్ ఎఎం నాయక్‌కి లైఫ్ టైం అచీవ్మెంట్ ప్రకటించింది ఈవీ సంస్థ. 1965లో ఎల్ అంట్ టీలో చేరిన నాయక్ అంచెలంచెలుగా ఎదుగుతూ 2003లో సీఎండీగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన హయంలో ఎల్ అండ్ టీ అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ప్రపంచ వ్యాప్తంగా చేపట్టింది. -
పేటీఎం విజయ్‌శేఖర్ శర్మని క్రాస్ చేసిన నైకా ఫాల్గుని నాయర్
బ్యాంకింగ్ సెక్టార్‌పై బ్యూటీ పైచేయి సాధించింది. ఆర్థిక రంగంలో సేవలు అందించే పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మని సౌందర్య ఉత్పత్తులు అందించే నైకా ఫౌండర్ ఫాల్గుని నాయర్ వెనక్కి నెట్టారు. తాజాగా హురూన్ గ్లోబల్ రిచ్‌లిస్ట్ 2022 ఫలితాల్లో ఇది చోటు చేసుకుంది. పేఈఎం, నైకా సంస్థలు గతేడాది నవంబరులో మార్కెట్లో ఐపీవోకి వచ్చాయి. స్థిరంగా ఫాల్గుని నాయర్ హురూన్ గ్లోబల్ రిచ్‌లిస్ట్ 2022 జాబితాలో నైకా ఫౌండర్ ఫాల్గుని నాయర్ సంపదన 4.9 బిలియన్ డాలర్లుగా తేలింది. ప్రపంచ సంపాదనపరుల లిస్టులో ఆమెకు 579వ స్థానం దక్కింది. సౌందర్య ఉత్పత్తులు అందించే కంపెనీగా నైకాను 2012లో ఫాల్గుని నాయర్ స్థాపించారు. నైకా యాప్ ద్వారా అమ్మకాలు ప్రారంభించారు. చాపకింద నీరులా ఈ కంపెనీ కస్టమర్ల మనసును గెలుచుకుంది. గతేడాది ఐపీవోలో నైకా బంపర్‌హిట్ అయ్యింది. దీంతో ఒక్క రోజులోనే ఫాల్గుని నాయర్ సెల్ఫ్‌మేడ్ బిలియనీర్‌గా మారింది. ఆది నుంచి ఇబ్బందులే ఐఐటీ విద్యార్థిగా విజయ్‌శేఖర్ శర్మ ఆన్లైన్ పేమెంట్ ప్లాట్‌ఫామ్‌గా పేటీఎంను ప్రారంభించారు. ఆరంభం నుంచి నిధుల సమన్యు ఎదుర్కొన్నా ఒక్కో ఇటుక పేర్చుకుంటూ పోయారు. 2016 పెద్ద నోట్ల రద్దుతో పేటీఎం దశాదిశా మారిపోయింది. దేశమంతటా విస్తరించింది. ఆ తర్వాత కొద్ది కాలానికే టెక్‌ఫిన్ రంగంలో అనేక కంపెనీలు వచ్చాయి. గతేడాది నవంబరులో ఐపీవోలో పేటీఎం షేరు రూ.2150 దగ్గర ట్రేడ్ అయ్యింది. దీంతో 2.35 బిలియన్ల మార్కెట్ క్యాప్‌తో పేటీఎం శేఖర్ శర్మ సైతం బిలియనీర్‌గా మారిపోయాడు. పోయిన బిలియనీర్ హోదా గడిచిన మూడు నెలల కాలంలో పేటీఎం షేర్లు వరుసగా కోతకు గురవుతూ వస్తున్నాయి. దాదాపు షేరు ధర 70 శాతానికి పైగా పడిపోయింది. దీంతో మూడు నెలలుగా ప్రతీ రోజు విజయ్‌శేఖర్‌శర్మ ఆదాయానికి రోజుకు 88 కోట్ల కోత పడుతూ వచ్చింది. బుధవారం ఏకంగా రూ.630కి పడిపోవడంతో విజయ్‌శేఖర్ శర్మ మార్కెట్ క్యాప్ 999 మిలియన్లను పడిపోయింది. ఆఖరికి ఆయన బిలియనీర్ హోదాను కూడా కోల్పోయారు. గురువారం షేరు ధర సుమారు 18 శాతం క్షీణించి రూ. 616 దగ్గర ట్రేడవుతోంది. కోత పడినా గత నవంబరు నుంచి మార్కెట్లో కరెక్షన్ నెలకొంది. అనేక కంపెనీల షేర్ల విలువకు కోత పడింది. కానీ నైకా షేర్లకు ఈ ఇబ్బంది తప్పకపోయినా పేటీఎంతో పోల్చితే మెరుగైన స్థితిలో ఉంది. ఐపీవో ఆరంభంలో నైకా షేరు రూ.2,205లు ఉండగా ప్రస్తుతం రూ.1522గా ఉంది. మొత్తంగా ఫాల్గుని నాయర్ సంపదకు కోత పడినా పేటీఎంతో పోల్చితే మెరుగైన స్థితిలో ఉంది. చదవండి: బెజోస్ మస్క్ అదానీ ముందు దిగదుడుపే! -
500 కోట్లకు దావా.. అదనంగా ఫోన్‌కాల్‌లో అసభ్య పదజాలం!
కొటక్ మహీంద్రా బ్యాంక్, ఫిన్‌టెక్ కంపెనీ ‘భారత్‌పే’ ఎండీ అష్నీర్ గ్రోవర్ మధ్య వివాదం మరింత ముదురుతోంది. నైకా ఐపీవో సంబంధిత షేర్ల కేటాయింపులో కొటక్ మహీంద్రా బ్యాంక్ విఫలమైందని అష్నీర్ గ్రోవర్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ వివాదం మరో మలుపు తిరిగింది. కొటక్ బ్యాంక్ నుంచి నష్టపరిహారం కోరుతూ 500 కోట్ల రూపాయలకు దావా కూడా వేశాడు అష్నీర్ గ్రోవర్. అయితే తాజాగా ఈ పరిణామంలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. అష్నీర్, ఆయన భార్య మాధురి ఫోన్‌కాల్‌లో తమ ప్రతినిధిని అసభ్యంగా దూషించారని ఆరోపిస్తూ న్యాయపరమైన చర్యలకు సిద్ధమైంది కొటక్ మహీంద్రా బ్యాంక్. ఈ మేరకు ఆదివారం ఆ జంటకు నోటీసులు సైతం పంపింది. అష్నీర్ గ్రోవర్-కొటక్ బ్యాంక్ మధ్య వివాదం మరింత ముదురుతోంది. అష్నీర్ జంట నుంచి అక్టోబర్ 30న లీగల్ నోటీసులు అందుకున్నట్లు ఒప్పుకున్న కొటక్ మహీంద్రా బ్యాంక్.. అది ఎందుకనో స్పష్టత ఇవ్వలేదు. కాకపోతే టైంకి మాత్రం బదులు ఇచ్చినట్లు వెల్లడించింది. అయితే గ్రోవర్ ఆడియో కాల్లో తమ ప్రతినిధిని ఉద్దేశించి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై మాత్రం న్యాయపరమైన చర్యలకు వెళ్తున్నట్లు కొటక్ మహీంద్రా బ్యాంక్ హెడ్ క్వార్టర్ ఒక మీడియా స్టేట్మెంట్లో వెల్లడించింది. నా గొంతు కాదు ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో గతవారం ఒక ఆడియో క్లిప్ విపరీతంగా వైరల్ అయ్యింది. ఒక బ్యాంక్ రిలేషన్షిప్ మేనేజర్‌తో దురుసుగా ఒక జంట మాట్లాడిన క్లిప్ అది. ఆ కాల్లో ఒక వ్యక్తి అసభ్య పదజాలం ఉపయోగిస్తుండగా.. అవతలి వ్యక్తి అతన్ని శాంతింపజేసే ప్రయత్నం చేస్తుంటాడు. అయితే ఆ క్లిప్‌లో గొంతు భారత్‌పే ఎండీ అష్నీర్ గ్రోవర్దే అంటూ కథనాలు వెలువడ్డాయి. కానీ, అష్నీర్ అది తన గొంతు కాదని ఖండించాడు కూడా. మరోవైపు లీగల్ నోటీసులు స్పందించేందుకు భారత్‌పే నిరాకరించింది. -
ఫాల్గుని నాయర్‌కి షాక్! నైకా షేర్లకి భారీ కుదుపు
ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)తో మార్కెట్లో సంచలనం సృష్టించిన నైకా కంపెనీ షేర్లు కుదుపులకి లోనవుతున్నాయి. దీంతో ఇటీవల సెల్ఫ్‌మేడ్ సంపన్న మహిళగా గుర్తింపు పొందిన ఫాల్గుని నాయర్ సంపదకి కోత పడుతోంది. ఇండియాలో ఈ కామర్స్ మార్కెట్లో ప్రీమియం బ్యూటీ ప్రొడక్టులు అందించే సంస్థగా నైకా విజయ ప్రస్థానం సాగించింది. ఆ తర్వాత కంపెనీ విస్తరణ కోసం ఇటీవల ఐపీవోకి వచ్చింది. రికార్డు స్థాయిలో కంపెనీ షేర్లు ఏకంగా రూ. 2,400 దగ్గర ట్రేడయ్యాయి. దీంతో వారం రోజులు పూర్తి కాకుండానే ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ విలువ లక్ష కోట్ల రూపాయలను దాటేసింది. ఇన్వెస్టర్లు నైకా షేర్ల కోసం ఎగబడ్డారు. బ్లూమ్‌బర్గ్ స్వయంప్రకాశిత సంపన్న మహిళ అంటూ నైనా వ్యవస్థాపకురాలు ఫాల్గుని నాయర్‌ని కీర్తించింది. సోమవారం జులై-సెప్టెంబరు త్రైమాసికానికి సంబంధించి ఫలితాలను నైకా వెల్లడించింది. నికర లాభంగా రూ.1.20 కోట్లను ప్రకటించింది. గతేడాది ఇదే కాలానికి నికర లాభం రూ.27 కోట్లుగా నైకా ప్రకటించింది. ఒక్కసారిగా లాభాలు భారీగా పడిపోవడంతో.. ఆ ప్రభావం కంపెనీ షేర్లపై కనిపించింది. దీంతో ఒక్కసారిగా కంపెనీ షేర్ల ధర 7 శాతం పడిపోయింది. క్యూ 2 ఫలితాలు ప్రకటించకముందు కంపెనీ షేరు రూ.2351 దగ్గర ట్రేడయ్యింది. ఫలితాలు వెలువడిన తర్వాత షేరు ధర కుదుపులకు లోనవుతోంది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో షేరు ధర రూ.2312 దగ్గర ట్రేడవుతోంది. ఒక్కో షేరు ధర 44 వరకు పడిపోయింది. క్యూ 2 ఆర్థిక ఫలితాలను నిశితంగా పరిశీలిస్తే ఇదే కాలానికి సంబంధించి ఇయర్ టూ ఇయర్ లాభాలు రూ.603 కోట్లు ఉండగా ఈ ఏడాది అది రూ. 885 కోట్లుగా నమోదు కావడం ఇన్వెస్టర్లు ఊరటనిస్తోంది. అయితే భవిష్యత్తులో నైకా మంచి ఫలితాలు కనబరిచే అవకాశం ఉందటున్నారు మార్కెట్ నిపుణులు. రెండేళ కాలానికి పెట్టుబడి పెట్టాలనే ఆలోచన ఉన్న వారు నైకా షేర్లను గమనిస్తూ ఉండటం మంచిదని చెబుతున్నారు. ధర ఏమైనా తగ్గి రూ.1900 దగ్గర ట్రేడ్ అయితే ఈ షేర్లు కొనుగోలు చేయడం ఉత్తమం అంటున్నారు. చదవండి:నైకా లిస్టింగ్ బంపర్ హిట్.. ఒక్కరోజులోనే లక్ష కోట్ల రూపాయల మార్కెట్ క్యాపిటల్ -
మహిళలు కలలు కనే ధైర్యం చేయాలి: ఫల్గుణి నాయర్
సౌందర్య, సంరక్షణ ఉత్పత్తుల ఈ- కామర్స్ కంపెనీ ‘నైకా’ లిస్టింగ్‌లో అదరగొట్టింది. బీఎస్ఈలో ఇష్యూ ధర రూ.1,125తో పోలిస్తే 80 శాతం ప్రీమియంతో రూ.2,018 వద్ద లిస్ట్ అయ్యింది. స్టాక్ మార్కెట్ అమ్మకాల ఒత్తిడిలో ట్రేడ్ అవుతున్నప్పటి.. ఈ షేరుకు ఏ మాత్రం డిమాండ్ తగ్గలేదు. ఓ దశలో ఏకంగా 100% శాతం దూసుకెళ్లి రూ.2,248 స్థాయిని అందుకుంది. చివర్లో అతి స్వల్ప లాభాల స్వీకరణ జరగడంతో 96 శాతం లాభంతో రూ.2,206 ట్రేడింగ్‌ను ముగిచింది. మార్కెట్ ముగిసే సరికి కంపెనీ మార్కెట్ విలువ లక్ష కోట్ల పైన రూ.1.04 లక్షల వద్ద స్థిరపడింది. ఫల్గుణి నాయర్ ప్రారంభించిన బ్యూటీ స్టార్టప్ ఆమెను ప్రపంచంలోని అత్యంత సంపన్నుల ర్యాంక్‌ల సరసన నిలిపింది. ఆమె స్థాపించిన ఈ కామర్స్ కంపెనీ నైకాలో సగం షేర్లు ఆమెవే. ఇప్పుడా ఆ షేర్లు 89% వరకు పెరగడంతో ఇప్పుడు 7 బిలియన్ డాలర్లతో అత్యంత సంపన్నురాలుగా మారారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఆమె భారతదేశపు అత్యంత సంపన్న స్వీయ-నిర్మిత మహిళా బిలియనీర్‌గా నిలిచారు. ఇప్పుడు ఆమె జీవితంలో స్వీయ నియంత్రణ సాధించడానికి ఎక్కువ మంది మహిళలను ప్రోత్సహిస్తోంది. స్వంత స్టార్ట్-అప్ ప్రారంభించాలని చూస్తున్న మహిళలకు ఫల్గుణి నాయర్ కొన్ని సలహాలు ఇచ్చింది. (చదవండి: తనను చెంప దెబ్బలు కొట్టడానికి మహిళను పనిలో పెట్టుకున్న ఓనర్!) "నాలాంటి మహిళలు తమ కోసం కలలు కనే ధైర్యం చేస్తారని నేను ఆశిస్తున్నాను" అని ఒక మీడియా ఇంటర్వ్యూలో తెలిపింది. "భవిష్యత్ ప్రతి ఒక్కరికీ అవకాశాలను ఇస్తుంది, వాటిని సద్వినియోగం చేసుకోవాలని" ఆమె సూచించింది. 2005లో ఒక బ్యాంక్‌కి మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలు చేపట్టి, 2012లో తన 50వ ఏట ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఇందుకు రెండు కారణాలు చెబుతారు ఫల్గుణీ నాయర్. ‘‘నాకు మేకప్ అంటే చాలా ఇష్టం. అలాగే ఆన్లైన్ మార్కెట్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకోవాలనే కోరిక బలంగా ఉంది. ఈ రెండు కారణాల వల్లే నేను ఉద్యోగానికి రాజీనామా చేశాను’’ అంటున్న ఫల్గుణీ నాయర్ తల్లిదండ్రులు గుజరాతీలు. కాని ముంబైలో పుట్టి పెరిగారు. ఆమె తండ్రి వ్యాపారవేత్త. ‘‘మా నాన్న గారి నుంచే నాకు చిన్నతనంలోనే వ్యాపారం చేయాలనే వచ్చింది. మా ఇంట్లో అందరూ స్టాక్ మార్కెట్, ట్రేడ్ గురించి మాట్లాడుకునే వాళ్లం. అలా నాకు వ్యాపారం మీద అవగాహన కలిగింది’’ అంటారు. అప్పట్లో, చాలా మంది భారతీయ మహిళలు తమ దగ్గరలో ఉన్న మామ్-అండ్-పాప్ దుకాణాలలో సౌందర్య, సంరక్షణ ఉత్పత్తులను కొనుగోలు చేసేవారు. అక్కడ వారికి తక్కువ ఆప్షన్లు ఉండేవి, ట్రయల్స్ చేసే అవకాశం లేదు. ట్యుటోరియల్స్ & టెస్టిమోనియల్స్ సహాయంతో సౌందర్య, సంరక్షణ ఉత్పత్తులను కస్టమర్లకు సులభమైన ఆన్లైన్ ద్వారా విక్రయించాలని భావించింది. బ్యూటీకి సంబంధించిన ఉత్పత్తులకు భారతదేశంలో మంచి మార్కెట్ ఉందనీ, ఆ వ్యాపారం ప్రారంభించటం వల్ల తన కల నెరవేరుతుందని భావించారు. అందుకే, 2012లో మాజీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ ఫల్గుని నాయర్ నైకాను మొదలుపెట్టారు. నైకా సౌందర్య ఉత్పత్తులను సేల్ చేస్తోంది. అంతేకాకుండా ఈ కంపెనీకి సొంతంగా రిటైల్ స్టోర్లు కూడా ఉన్నాయి. (చదవండి: ప్లాస్టిక్ నుంచి పెట్రోల్..అందుబాటులో ఎప్పుడంటే?) -
నైకా లిస్టింగ్ బంపర్ హిట్.. ఒక్కరోజులోనే లక్ష కోట్ల రూపాయల మార్కెట్ క్యాపిటల్
ముంబై: సౌందర్య, సంరక్షణ ఉత్పత్తుల ఈ–కామర్స్ వేదిక ‘నైకా’ లిస్టింగ్‌లో అదరగొట్టింది. బీఎస్ఈలో ఇష్యూ ధర రూ.1,125తో పోలిస్తే 80 శాతం ప్రీమియంతో రూ.2,018 వద్ద లిస్ట్ అయ్యింది. స్టాక్ మార్కెట్ అమ్మకాల ఒత్తిడిలో ట్రేడ్ అవుతున్నప్పటి.., ఈ షేరుకు ఏ మాత్రం డిమాండ్ తగ్గలేదు. ఓ దశలో ఏకంగా 100% శాతం దూసుకెళ్లి రూ.2,248 స్థాయిని అందుకుంది. చివర్లో అతి స్వల్ప లాభాల స్వీకరణ జరగడంతో 96 శాతం లాభంతో రూ.2,206 ట్రేడింగ్‌ను ముగిచింది. బీఎస్ఈ ఎక్సే్చంజీలో మొత్తం 3.43 కోట్ల షేర్లు చేతులు మారాయి. మార్కెట్ ముగిసే సరికి కంపెనీ మార్కెట్ విలువ లక్ష కోట్ల పైన రూ.1.04 లక్షల వద్ద స్థిరపడింది. తద్వారా దేశీయ ఎక్సే్చంజీల్లోని లిస్టెడ్ కంపెనీల్లో 55వ స్థానాన్ని దక్కించుకుంది. ఈ–కామర్స్ విభాగంలో ఈ స్థాయి లాభాలతో ఎక్సే్చంజీల్లో లిస్టయిన తొలి కంపెనీ ఇది. నైకా బంపర్ లిస్టింగ్ ఊతంతో కంపెనీ వ్యవస్థాపకురాలు ఫల్గుణీ నాయర్ కుటుంబ సంపద ఏకంగా 7.5 బిలియన్ డాలర్లకు ఎగిసింది. కంపెనీలో ప్రమోటర్ కుటుంబానికి 54.22% వాటాలు ఉన్నాయి. క్లోజింగ్ ధర ప్రకారం వీటి విలువ సుమారు 55,900 కోట్లు (7.5 బిలియన్ డాలర్లు). చదవండి: వాట్ ఏ టెర్రిఫిక్ స్టోరీ - మంత్రి కేటీఆర్ -
3 ఐపీవోలకు సెబీ గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పబ్లిక్ ఇష్యూలు చేపట్టేందుకు తాజాగా మూడు కంపెనీలను అనుమతించింది. జాబితాలో క్యాష్ మేనేజ్మెంట్ సంస్థ సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్, మహిళా దుస్తుల బ్రాండ్ గో కలర్స్ సంస్థ గో ఫ్యాషన్, మైనింగ్ ప్రొడక్టుల కంపెనీ టెగా ఇండస్ట్రీస్ చేరాయి. ఆగస్టులో ఈ కంపెనీలు సెబీకి ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి. కాగా.. డైవర్సిఫైడ్ సంస్థ పీకేహెచ్ వెంచర్స్ ఐపీవో ప్రయత్నాలు విరమించుకుంటూ ప్రాస్పెక్టస్‌ను వెనక్కి తీసుకుంది. వివరాలిలా.. ఐపీవో ద్వారా సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ రూ. 2,000 కోట్లను సమీకరించే ప్రణాళికల్లో ఉంది. ప్రమోటర్ సంస్థ సియాన్ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్ ఈక్విటీని విక్రయించనుంది. బేరింగ్ పీఈ ఏషియాకు చెందిన ఈ సంస్థ 2015లో సీఎంఎస్‌లో 100 శాతం వాటాను సొంతం చేసుకుంది. ఇక ఐపీవోలో భాగంగా గో ఫ్యాషన్ ఇండియా లిమిటెడ్ రూ. 125 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.28 కోట్ల షేర్లను సైతం విక్రయించనుంది. నిధులను 120 కొత్త ప్రత్యేకించిన బ్రాండ్ ఔట్లెట్ల ఏర్పాటుకు వినియోగించనుంది. టెగా ఇండస్ట్రీస్ పబ్లిక్ ఇష్యూ ద్వారా 1.36 కోట్లకుపైగా ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. క్యాపిటల్ స్మాల్ బ్యాంక్ కూడా.... షెడ్యూల్డ్ హోదా గల క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 450 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన సంస్థలు మరో 38.40 లక్షల షేర్లను విక్రయానికి ఉంచనున్నాయి. పీఐ వెంచర్స్ ఎల్ఎల్పీ 3.37 లక్షల షేర్లు, ఎమికస్ క్యాపిటల్ పీఈ1 ఎల్ఎల్పీ 6.04 లక్షల షేర్లు, ఒమన్ ఇండియా సంయుక్త ఇన్వెస్ట్మెంట్ ఫండ్2– 8.37 లక్షల షేర్లు చొప్పున ఆఫర్ చేయనున్నాయి. ఇతర వాటాదారులు సైతం 19.91 లక్షల షేర్లను విక్రయించనున్నారు. నైకా ఐపీవోకు భారీ డిమాండ్ 82 రెట్లు అధిక స్పందన ఎఫ్ఎస్ఎన్ ఈకామర్స్ కంపెనీ నైకా వెంచర్స్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి భారీ స్పందన లభించింది. ఇష్యూ చివరి రోజు సోమవారానికల్లా దాదాపు 82 రెట్లు అధికంగా సబ్స్క్రయిబ్ అయ్యింది. షేరుకి రూ. 1,085–1,125 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూలో భాగంగా దాదాపు 2.65 కోట్ల షేర్లను ఆఫర్ చేసింది. అయితే 216 కోట్లకుపైగా షేర్ల కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. తద్వారా కంపెనీ రూ. 5,352 కోట్లు సమకూర్చుకుంది. బ్యూటీ, వెల్నెస్ ప్రొడక్టుల కంపెనీ నైకా ఐపీవోకు అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లు(క్విబ్) 91.2 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలు చేయగా.. సంస్థాగతేతర ఇన్వెస్టర్లు 112 రెట్లు అధికంగా దరఖాస్తు చేశారు. ఇక రిటైల్ ఇన్వెస్టర్ల విభాగంలోనూ 12.25 రెట్లు అధికంగా స్పందన కనిపించింది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 630 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 4.19 కోట్లకుపైగా షేర్లను విక్రయించింది. ఐపీవోలో భాగంగా గత బుధవారం యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 2,396 కోట్లు సమీకరించిన విషయం విదితమే. -
రూ. 850 కోట్లను సొంతం చేసుకోనున్న నైకా టాప్ ఉద్యోగులు..!
Nykaa Top 6 Employees To Earn Over Rs 850 Crore Amid IPO:మగువలు మెచ్చిన ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ నైకా ఐపీవోను అక్టోబర్ 28న ప్రారంభించనుంది.నైకా మాతృ సంస్థ ఎఫ్ఎస్ఎన్ కామర్స్ వెంచర్స్ దాని ప్రారంభ పబ్లిక్ ఆఫర్ కోసం ఒక్కో షేరు ధరను రూ. 1,085 నుంచి రూ. 1,125కు నిర్ణయించింది. మూడు రోజుల పబ్లిక్ ఆఫర్ నవంబర్ 1న ముగియనుంది. దీంతో కంపెనీలోని పలు టాప్ ఉద్యోగులకు కాసుల వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నైకాలోని ఆరుగురు సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు తమ షేర్ హోల్డింగ్స్, వెస్టెడ్ ఆప్షన్ల ద్వారా మొత్తంగా రూ. 850 కోట్లను ఆర్జించనున్నారని ప్రముఖ బిజినెస్ మీడియా సంస్థ మింట్ పేర్కొంది. చదవండి: గెలుపు బాటలో మరో స్టార్టప్.. ఓఫోర్‌ఎస్‌లోకి పెట్టుబడుల వరద ఆరుగురు ఎగ్జిక్యూటివ్‌లు డిజిటల్ బ్యూటీ, వెల్నెస్ , ఫ్యాషన్ ఉత్పత్తుల సంస్థ నైకాలో వివిధ విభాగాలకు నాయకత్వం వహిస్తున్నారు. నైకా ప్రైవేట్ లేబుల్ విభాగం ఎఫ్ఎస్ఎన్ బ్రాండ్స్ సీఈవో రీనా ఛబ్రా కంపెనీలో 2.1 మిలియన్ షేర్లను, 0.12 మిలియన్ ఉద్యోగుల స్టాక్ ఆప్షన్లతో సుమారు రూ. 250 కోట్లు సంపాదించే అవకాశం ఉంది. రీనా ఛబ్రా మే 2016 నుంచి ఎఫ్ఎస్ఎన్ బ్రాండ్స్‌తో అనుబంధాన్ని కలిగి ఉన్నారు. అదేవిధంగా నైకా, మ్యాన్ బిజినెస్ సీఈవో నిహిర్ పారిఖ్ కంపెనీలో 2 మిలియన్లకు పైగా షేర్లను కలిగి ఉండగా..వీటితో రూ. 245 కోట్లను సంపాదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పారిఖ్ 2015 నుంచి నైకాలో పనిచేస్తున్నారు. ఈ ఏడాది గాను రూ. 2.83 కోట్ల జీతాన్ని అందుకుంటున్నారు. నైకా ఈ-రిటైల్ సీటీవో సంజయ్ సూరి కంపెనీలో సుమారు 1.8 మిలియన్ షేర్లను కల్గి ఉండగా...దీంతో రూ.220 కోట్లను ఐపీవో ద్వారా సంపాదించుకొనున్నారు. కంపెనీ ఈ-రిటైల్ చీఫ్ సప్లై చైన్ ఆఫీసర్ మనోజ్ జైస్వాల్ వద్ద రూ. 63 కోట్ల విలువైన షేర్లను కల్గి ఉన్నారు. కంపెనీ సీఎఫ్‌వో అరవింద్ అగర్వాల్ వద్ద రూ. 45 కోట్ల విలువైన షేర్లను, నైకా ఫ్యాషన్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ గోపాల్ అస్థానా రూ. 29 కోట్ల విలువైన షేర్లను కల్గి ఉన్నారు. చదవండి: తిరుగులేని టెస్లా.. రూ.75 లక్షల కోట్ల విలువైన కంపెనీగా రికార్డు