న్యూఢిల్లీ: బ్యూటీ, వెల్‌నెస్ ప్రొడక్టుల కంపెనీ నైకా(ఎఫ్‌ఎస్‌ఎన్ ఈకామర్స్) బోర్డు నుంచి ఐదుగురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు తప్పుకున్నట్లు తెలుస్తోంది. వీరిలో సూపర్‌స్టోర్ సీఈవో వికాస్ గుప్తా, ఫ్యాషన్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ గోపాల్ ఆస్థాన, చీఫ్ కమర్షియల్ ఆపరేషన్స్ ఆఫీసర్ మనోజ్ గంధి, బిజినెస్ హెడ్ సుచీ పాండ్య, ఫైనాన్స్ హెడ్ లలిత్ ప్రుతి ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. తెలియజేశాయి. అయితే ఎగ్జిక్యూటివ్‌ల రాజీనామాలకు కారణాలు తెలియరాలేదు. (విషాదం: ఇంటెల్ కో-ఫౌండర్, ప్రముఖ వ్యాపారవేత్త కన్నుమూత)
కాగా.. ఏడాది కాలంగా నైకాలో బాధ్యతలు నిర్వహిస్తున్న లలిత్ తాజాగా ఎడ్‌టెక్ సంస్థ యునివోలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా చేరినట్లు తెలుస్తోంది. రాజీనామాలు స్వచ్చందం(వొలంటరీ)గా, అప్రయత్నం(ఇన్‌వొలంటరీ)గా చేసినట్లు నైకా పేర్కొంది. 3,000 మందికిపైగా ఉద్యోగులతో వేగవంత వృద్ధిపై దృష్టి పెట్టి సాగుతున్న నైకా వంటి కంపెనీలలో వొలంటరీ, ఇన్‌వొలంటరీగా రాజీనామాలకు అవకాశమున్నట్లు వ్యాఖ్యానించింది.
గత కొన్నేళ్లుగా దేశంలో అత్యున్నత నైపుణ్యాలకు కంపెనీ మద్దతిస్తూ వస్తున్నట్లు తెలియజేసింది. మధ్యస్థాయి పొజిషన్లలో రాజీనామాలు ప్రామాణిక వార్షిక ప్రోత్సాహాలు, మార్పులలో భాగమని, పనితీరు లేదా ఇతర అవకాశాలరీత్యా ఇవి జరుగుతుంటాయని వివరించింది. ప్రస్తుత, గతంలో పనిచేసిన ఉద్యోగుల సేవలకు నైకా ఎల్లప్పుడూ విలువ ఇస్తుందని ఒక ప్రకటనలో తెలియజేసింది. కంపెనీ నుంచి తప్పుకున్న వారంతా ఏడాది నుంచి మూడున్నరేళ్ల కాలం మధ్య పనిచేసిన వారేకావడం గమనార్హం! (బుజ్జి బంగారం: ఆనందంలో మునిగి తేలుతున్న మార్క్ జుకర్‌బర్గ్ )
Comments
Please login to add a commentAdd a comment