
ముంబై: సౌందర్య, సంరక్షణ ఉత్పత్తుల ఈ–కామర్స్ వేదిక ‘నైకా’ లిస్టింగ్‌లో అదరగొట్టింది. బీఎస్‌ఈలో ఇష్యూ ధర రూ.1,125తో పోలిస్తే 80 శాతం ప్రీమియంతో రూ.2,018 వద్ద లిస్ట్ అయ్యింది. స్టాక్ మార్కెట్ అమ్మకాల ఒత్తిడిలో ట్రేడ్ అవుతున్నప్పటి.., ఈ షేరుకు ఏ మాత్రం డిమాండ్ తగ్గలేదు. ఓ దశలో ఏకంగా 100% శాతం దూసుకెళ్లి రూ.2,248 స్థాయిని అందుకుంది. చివర్లో అతి స్వల్ప లాభాల స్వీకరణ జరగడంతో 96 శాతం లాభంతో రూ.2,206 ట్రేడింగ్‌ను ముగిచింది.
బీఎస్‌ఈ ఎక్సే్చంజీలో మొత్తం 3.43 కోట్ల షేర్లు చేతులు మారాయి. మార్కెట్ ముగిసే సరికి కంపెనీ మార్కెట్ విలువ లక్ష కోట్ల పైన రూ.1.04 లక్షల వద్ద స్థిరపడింది. తద్వారా దేశీయ ఎక్సే్చంజీల్లోని లిస్టెడ్ కంపెనీల్లో 55వ స్థానాన్ని దక్కించుకుంది. ఈ–కామర్స్ విభాగంలో ఈ స్థాయి లాభాలతో ఎక్సే్చంజీల్లో లిస్టయిన తొలి కంపెనీ ఇది. నైకా బంపర్ లిస్టింగ్ ఊతంతో కంపెనీ వ్యవస్థాపకురాలు ఫల్గుణీ నాయర్ కుటుంబ సంపద ఏకంగా 7.5 బిలియన్ డాలర్లకు ఎగిసింది. కంపెనీలో ప్రమోటర్ కుటుంబానికి 54.22% వాటాలు ఉన్నాయి. క్లోజింగ్ ధర ప్రకారం వీటి విలువ సుమారు 55,900 కోట్లు (7.5 బిలియన్ డాలర్లు).
Comments
Please login to add a commentAdd a comment