Profit receipt
-
నైకా లిస్టింగ్ బంపర్ హిట్.. ఒక్కరోజులోనే లక్ష కోట్ల రూపాయల మార్కెట్ క్యాపిటల్
ముంబై: సౌందర్య, సంరక్షణ ఉత్పత్తుల ఈ–కామర్స్ వేదిక ‘నైకా’ లిస్టింగ్‌లో అదరగొట్టింది. బీఎస్ఈలో ఇష్యూ ధర రూ.1,125తో పోలిస్తే 80 శాతం ప్రీమియంతో రూ.2,018 వద్ద లిస్ట్ అయ్యింది. స్టాక్ మార్కెట్ అమ్మకాల ఒత్తిడిలో ట్రేడ్ అవుతున్నప్పటి.., ఈ షేరుకు ఏ మాత్రం డిమాండ్ తగ్గలేదు. ఓ దశలో ఏకంగా 100% శాతం దూసుకెళ్లి రూ.2,248 స్థాయిని అందుకుంది. చివర్లో అతి స్వల్ప లాభాల స్వీకరణ జరగడంతో 96 శాతం లాభంతో రూ.2,206 ట్రేడింగ్‌ను ముగిచింది. బీఎస్ఈ ఎక్సే్చంజీలో మొత్తం 3.43 కోట్ల షేర్లు చేతులు మారాయి. మార్కెట్ ముగిసే సరికి కంపెనీ మార్కెట్ విలువ లక్ష కోట్ల పైన రూ.1.04 లక్షల వద్ద స్థిరపడింది. తద్వారా దేశీయ ఎక్సే్చంజీల్లోని లిస్టెడ్ కంపెనీల్లో 55వ స్థానాన్ని దక్కించుకుంది. ఈ–కామర్స్ విభాగంలో ఈ స్థాయి లాభాలతో ఎక్సే్చంజీల్లో లిస్టయిన తొలి కంపెనీ ఇది. నైకా బంపర్ లిస్టింగ్ ఊతంతో కంపెనీ వ్యవస్థాపకురాలు ఫల్గుణీ నాయర్ కుటుంబ సంపద ఏకంగా 7.5 బిలియన్ డాలర్లకు ఎగిసింది. కంపెనీలో ప్రమోటర్ కుటుంబానికి 54.22% వాటాలు ఉన్నాయి. క్లోజింగ్ ధర ప్రకారం వీటి విలువ సుమారు 55,900 కోట్లు (7.5 బిలియన్ డాలర్లు). చదవండి: వాట్ ఏ టెర్రిఫిక్ స్టోరీ - మంత్రి కేటీఆర్ -
సెన్సెక్స్ తక్షణ నిరోధశ్రేణి 39,120–39,270
వెల్లువలా వచ్చిపడుతున్న విదేశీ ఇన్వెస్టర్ల నిధుల కారణంగా వారం రోజుల క్రితమే సెన్సెక్స్ కొత్త రికార్డును నెలకొల్పగా, గతవారం నిఫ్టీ కూడా అదే ఫీట్‌ను సాధించింది. కేవలం నెలరోజుల్లో భారత్ సూచీలు 10 శాతం ర్యాలీ జరపడం విశేషం. ఈ ట్రెండ్ భారత్‌కే పరిమితం కాలేదు. దాదాపు ఇదేస్థాయిలో అమెరికా, జర్మనీ సూచీలు సైతం పెరిగాయి. ఆసియాలో హాంకాంగ్, చైనా ఇండెక్స్‌లు కూడా 5 శాతంపైగానే జంప్‌చేశాయి. అమెరికా కేంద్రబ్యాంక్ ఫెడరల్ రిజర్వ్...వడ్డీ రేట్లపెంపునకు, బాండ్ల కొనుగోళ్ల కార్యక్రమానికి స్వస్తిచెప్పడం... ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీల ర్యాలీకి కారణం కావొచ్చు. కానీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ త్వరలో ప్రారంభం కానుండడం, కార్పొరేట్ క్యూ4 ఫలితాలు వెల్లడి కానుండడం వంటి అంశాల నేపథ్యంలో భారత మార్కెట్ మరింత ముందుకు వెళ్లగలుగుతుందా లేదా అన్న సంశయం ప్రస్తుతం విశ్లేషకుల్లో నెలకొని ఉంది. ఇక మన సూచీల సాంకేతిక అంశాల విషయానికొస్తే... సెన్సెక్స్ సాంకేతికాలు... ఏప్రిల్ 5తో ముగిసిన వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 39,270 పాయింట్ల వద్ద మరో కొత్త రికార్డుస్థాయిని నమోదుచేసిన అనంతరం చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 190 పాయింట్లు పెరిగి 38,862 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం మార్కెట్ పెరిగితే తొలుత 39,120–39,270 పాయింట్ల శ్రేణి నిరోధించవచ్చు. అటుపైన ముగిస్తే వేగంగా 39,500 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఈ స్థాయిని సైతం అధిగమిస్తే క్రమేపీ 39,850 పాయింట్ల వరకూ ర్యాలీ కొనసాగే ఛాన్స్ వుంది. ఈ వారం తొలి నిరోధశ్రేణిని దాటలేకపోతే 38,700 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ స్థాయిని కోల్పోతే వేగంగా 38,580 పాయింట్ల వద్దకు క్షీణించవచ్చు. ఈ స్థాయిని సైతం వదులుకుంటే 38,150 పాయింట్ల వరకు తగ్గొచ్చు. నిఫ్టీ అవరోధశ్రేణి 11,730–11,760 ఎన్ఎస్ఈ నిఫ్టీ 11,761 పాయింట్ల వద్ద కొత్త రికార్డును నెలకొల్పినప్పటికీ, ఆ స్థాయి వద్ద జరిగిన భారీ లాభాల స్వీకరణ కారణంగా 11,559 పాయింట్ల స్థాయికి తగ్గింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 43 పాయింట్ల లాభంతో 11,666 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం మార్కెట్ అప్‌ట్రెండ్ కొనసాగితే తొలుత 11,730–760 పాయింట్ల శ్రేణి నిరోధించవచ్చు. డబుల్టాప్గా పరిణమించిన ఈ శ్రేణిని దాటితేనే తదుపరి అప్‌ట్రెండ్ సాధ్యపడుతుంది. ఆ సందర్బంలో వేగంగా 11,810 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఈ స్థాయిని కూడా ఛేదిస్తే క్రమేపీ 11,890 పాయింట్ల వరకూ ర్యాలీ కొనసాగవచ్చు. ఈ వారం తొలి అవరోధశ్రేణిని దాటలేకపోతే 11,610 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభించవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే 11,560 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈ స్థాయిని ముగింపులో వదులుకుంటే 11,450 పాయింట్ల వరకు క్షీణించొచ్చు. -
బంగారం... లాభాల స్వీకరణ
న్యూఢిల్లీ: గడచిన 45 రోజుల్లో దాదాపు 80 డాలర్లు పెరిగిన పసిడి, 21వ తేదీతో ముగిసిన వారంలో కొంచెం లాభాల స్వీకరణ దిశగా కదులుతున్నట్లు కనిపించింది. వారం ప్రారంభంలో ఔన్స్ (31.1 గ్రా.) ధర అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్ నైమెక్స్‌లో 1,294 డాలర్లకు చేరింది. అయితే వారం చివరకు 1,285 డాలర్ల వద్ద ముగిసింది. వారం వారీగా ఇది నాలుగు డాలర్లు తక్కువ. సిరియా, ఉత్తరకొరియాలకు సంబంధించి యుద్ధ వాతావరణం కొంత శాంతించడం పసిడి నుంచి కొంత లాభాల స్వీకరణకు కారణంగా కనబడుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆర్థిక విధానాలకు సంబంధించి నెలకొన్న అస్పష్టత, డాలర్ బలహీనత వంటి అంశాలు పసిడి మున్ముందు కదలికలకు దోహదపడతాయని నిపుణులు పేర్కొంటున్నారు. వారం వారీగా డాలర్ ఇండెక్స్ 100.51 నుంచి 99.75 కు తగ్గింది. డాలర్ బలహీనపడే విధానాలకే ట్రంప్ ప్రభుత్వం మొగ్గుచూపుతున్న సంగతి తెలిసిందే. దేశీయంగా పెరుగుదల... అంతర్జాతీయ ప్రభావం దేశీ ఫ్యూచర్స్ మార్కెట్‌పైనా పడింది. మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్ (ఎంసీఎక్స్)లో బంగారం ధర 10 గ్రాములకు 21వ తేదీతో ముగిసిన వారంలో స్వల్పంగా రూ.9 పెరిగి రూ.29,418కి చేరింది. ఇక దేశీయంగా ప్రధాన ముంబై స్పాట్ మార్కెట్లో వారం వారీగా పసిడి ధర 99.9 స్వచ్ఛత 10 గ్రాములకు రూ.200 పెరిగి రూ.29,495కి చేరింది. 99.5 స్వచ్ఛత ధర కూడా ఇదే స్థాయిలో పెరిగి రూ.29,345కి చేరింది. దేశీయంగా నెలకొన్న డిమాండ్ దీనికి కారణం. మరోవైపు నాలుగు వారాల్లో దాదాపు రూ.2,000 పెరిగిన పసిడి, గడచిన వారంలో రూ.1,070 నష్టపోయి, రూ.42,025 వద్ద ముగిసింది.