ఫాల్గుని నాయర్‌కి షాక్‌! నైకా షేర్లకి భారీ కుదుపు | Nykaa shares slump post Q2 results | Sakshi
Sakshi News home page

ఫాల్గుని నాయర్‌కి షాక్‌! నైకా షేర్లకి కుదుపు

Published Mon, Nov 15 2021 1:52 PM | Last Updated on Mon, Nov 15 2021 1:56 PM

Nykaa shares slump post Q2 results - Sakshi

ఇన్షియల్ పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీవో)తో మార్కెట్‌లో సంచలనం సృష్టించిన నైకా కంపెనీ షేర్లు కుదుపులకి లోనవుతున్నాయి. దీంతో ఇటీవల సెల్ఫ్‌మేడ్‌ సంపన్న మహిళగా గుర్తింపు పొందిన ఫాల్గుని నాయర్‌ సంపదకి కోత పడుతోంది.

ఇండియాలో ఈ కామర్స్‌ మార్కెట్‌లో ప్రీమియం బ్యూటీ ప్రొడక్టులు అందించే సంస్థగా నైకా విజయ ప్రస్థానం సాగించింది. ఆ తర్వాత కంపెనీ విస్తరణ కోసం ఇటీవల ఐపీవోకి వచ్చింది. రికార్డు స్థాయిలో కంపెనీ షేర్లు ఏకంగా రూ. 2,400 దగ్గర ట్రేడయ్యాయి. దీంతో వారం రోజులు పూర్తి కాకుండానే ఈ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ విలువ లక్ష కోట్ల రూపాయలను దాటేసింది. ఇన్వెస్టర్లు నైకా షేర్ల కోసం ఎగబడ్డారు. బ్లూమ్‌బర్గ్‌ స్వయంప్రకాశిత సంపన్న మహిళ అంటూ నైనా వ్యవస్థాపకురాలు ఫాల్గుని నాయర్‌ని కీర్తించింది.

సోమవారం జులై-సెప్టెంబరు త్రైమాసికానికి సంబంధించి ఫలితాలను నైకా వెల్లడించింది. నికర లాభంగా రూ.1.20 కోట్లను ప్రకటించింది. గతేడాది ఇదే కాలానికి నికర లాభం రూ.27 కోట్లుగా నైకా ప్రకటించింది. ఒక్కసారిగా లాభాలు భారీగా పడిపోవడంతో.. ఆ ప్రభావం కంపెనీ షేర్లపై కనిపించింది. దీంతో ఒక్కసారిగా కంపెనీ షేర్ల ధర 7 శాతం పడిపోయింది. క్యూ 2 ఫలితాలు ప్రకటించకముందు కంపెనీ షేరు రూ.2351 దగ్గర ట్రేడయ్యింది. ఫలితాలు వెలువడిన తర్వాత షేరు ధర కుదుపులకు లోనవుతోంది. మధ్యా‍హ్నం 2 గంటల సమయంలో షేరు ధర రూ.2312 దగ్గర ట్రేడవుతోంది. ఒక్కో షేరు ధర 44 వరకు పడిపోయింది.  

క్యూ 2 ఆర్థిక ఫలితాలను నిశితంగా పరిశీలిస్తే ఇదే కాలానికి సంబంధించి ఇయర్‌ టూ ఇయర్‌ లాభాలు రూ.603 కోట్లు ఉండగా ఈ ఏడాది అది రూ. 885 కోట్లుగా నమోదు కావడం ఇన్వెస్టర్లు ఊరటనిస్తోంది. అయితే భవిష్యత్తులో నైకా మంచి ఫలితాలు కనబరిచే అవకాశం ఉందటున్నారు మార్కెట్‌ నిపుణులు. రెండేళ​ కాలానికి పెట్టుబడి పెట్టాలనే ఆలోచన ఉన్న వారు నైకా షేర్లను గమనిస్తూ ఉండటం మంచిదని చెబుతున్నారు. ధర ఏమైనా తగ్గి రూ.1900 దగ్గర ట్రేడ్‌ అయితే ఈ షేర్లు కొనుగోలు చేయడం ఉత్తమం అంటున్నారు. 

చదవండి:నైకా లిస్టింగ్‌ బంపర్‌ హిట్‌.. ఒక్కరోజులోనే లక్ష కోట్ల రూపాయల మార్కెట్‌ క్యాపిటల్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement