రూ. 3,003 కోట్లు దాటిన నికర లాభం
క్యూ2 వృద్ధిపై –1నుంచి+1 శాతం అంచనాలు
260– 265 కోట్ల డాలర్ల మధ్య ఆదాయం
న్యూఢిల్లీ: సాఫ్ట్‌వేర్ సేవల దిగ్గజం విప్రో లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 4.6 శాతం వృద్ధితో రూ. 3,003 కోట్లను అధిగమించింది. అయితే మొత్తం ఆదాయం 3.8 శాతం క్షీణించి రూ. 21,694 కోట్లకు పరిమితమైంది.
రెండో త్రైమాసికం(జూలై–సెప్టెంబర్)లో ఐటీ సరీ్వసుల ఆదాయం 260–265.2 కోట్ల డాలర్ల మధ్య నమోదుకావచ్చని తాజాగా అంచనా వేసింది. వెరసి త్రైమాసికవారీగా కరెన్సీ నిలకడ ప్రాతిపదికన –1 శాతం నుంచి +1 శాతం మధ్య గైడెన్స్‌ను ప్రకటించింది. బిలియన్ డాలర్లకు మించిన భారీ డీల్స్ ద్వారా మరోసారి ఈ త్రైమాసికంలో కంపెనీ రికార్డు నెలకొలి్పనట్లు విప్రో సీఈవో, ఎండీ శ్రీని పాలియా పేర్కొన్నారు. శుక్రవారం మైక్రోసాఫ్ట్ సిస్టమ్స్‌లో ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన సాంకేతిక సమస్యలపై స్పందిస్తూ కంపెనీలో ఎలాంటి సవాళ్లు ఎదురుకాలేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఈ అంశంలో సవాళ్లు ఎదుర్కొన్న యూఎస్, యూరప్ క్లయింట్లకు సహాయం చేసినట్లు తెలియజేశారు.
12,000 మందికి చాన్స్
ఈ ఏడాది 10,000–12,000 మందికి ఉపాధి కలి్పంచనున్నట్లు విప్రో సీహెచ్‌ఆర్‌వో సౌరభ్ గోవిల్ వెల్లడించారు. గతేడాది క్యూ1తో పోలిస్తే నికరంగా 337 మంది ఉద్యోగులను జత చేసుకుంది. దీంతో జూన్ చివరికల్లా మొత్తం సిబ్బంది సంఖ్య 2,34,391కు చేరింది.
షేరు బీఎస్‌ఈలో 3% క్షీణించి రూ. 557 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment