న్యూఢిల్లీ: ఐటీ సరీ్వసుల దేశీ దిగ్గజం విప్రో లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేడెట్ ప్రాతిపదికన క్యూ2(జులై–సెపె్టంబర్)లో నికర లాభం 17 శాతం ఎగసి రూ. 2,931 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 2,484 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా 30 శాతం జంప్‌చేసి రూ. 19,667 కోట్లను అధిగమించింది. గత క్యూ2లో రూ. 15,115 ఆదాయం సాధించింది. వార్షిక ఆదాయ రన్‌రేటు 10 బిలియన్ డాలర్ల(రూ. 75,300 కోట్లు)ను అధిగమించినట్లు ఫలితాల విడుదల సందర్భంగా విప్రో వెల్లడించింది. దేశీయంగా వ్యాక్సినేషన్ పూర్తయిన సీనియర్ ఉద్యోగులను దశలవారీగా కార్యాలయాలకు వచ్చి పనిచేసేందుకు వీలు కలి్పంచనున్నట్లు తెలియజేసింది.
అంచనాలు ఇవీ
ఈ ఏడాది క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో ఐటీ సరీ్వసుల ఆదాయం రూ. 19,500–19,889 కోట్ల మధ్య నమోదుకాగలదని విప్రో తాజాగా అంచనా వేసింది. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో వార్షిక ఆర్డర్‌బుక్ 28 శాతం జంప్‌చేసింది. దీంతో మొత్తం ఆర్డర్‌బుక్ విలువ 19 శాతం బలపడి 27 బిలియన్ డాలర్ల(రూ. 2 లక్షల కోట్లు)ను తాకింది. దీనిలో క్లౌడ్ కంప్యూటింగ్ విభాగం వాటా 8 బిలియన్ డాలర్లు(రూ. 60,000 కోట్లు)గా విప్రో వెల్లడించింది. ఆదాయంలో అమెరికా, యూరప్‌ల వాటా అత్యధికంకాగా.. బీఎఫ్‌ఎస్‌ఐ విభాగం 35 శాతం పురోగమించింది.
ఇతర హైలైట్స్
► ఐటీ విభాగం ఆదాయం 29.5 శాతం జంప్‌చేసి రూ. 19,378 కోట్ల(258 కోట్ల డాలర్లు)ను తాకింది.
► క్యూ2లో 8,100 మంది ఫ్రెషర్స్‌ను ఉద్యోగాల్లోకితీసుకుంది.
► వచ్చే ఆర్థిక సంవత్సరం(2022–23)లో 25,000 మంది ఫ్రెషర్స్‌కు కొత్తగా ఉపాధి కల్పించనుంది.
► క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో త్రైమాసికవారీగా ఆదాయంలో 2–4 శాతం వృద్ధిని అంచనా వేస్తోంది.
► కరెన్సీ నిలకడ ప్రాతిపదికన వార్షికంగా చూస్తే ఇది 27–30 శాతం పురోగతికి సమానమని విప్రో పేర్కొంది.
క్యూ2 ఫలితాల విడుదల నేపథ్యంలో విప్రో షేరు ఎన్‌ఎస్‌ఈలో 2 శాతం బలపడి రూ. 672 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 656– 675 మధ్య ఊగిసలాడింది.
వ్యూహాలు పనిచేస్తున్నాయ్
మా బిజినెస్ వ్యూహాలు సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు క్యూ2 ఫలితాలు వెల్లడిస్తున్నాయి. త్రైమాసికవారీగా చూస్తే వరుసగా రెండో క్వార్టర్‌లో 4.5 శాతం సొంత వృద్ధిని సాధిం చాం. వార్షిక ప్రాతిపదికన తొలి అర్ధభాగంలో 28 శాతం పురోగతిని చూపాం. ఈ సందర్భంగా మా కస్టమర్లు, భాగస్వాములు, సహోద్యోగులకు కృతజ్ఞతలు.
– థియరీ డెలాపోర్ట్, సీఈవో, ఎండీ, విప్రో
విప్రో లాభం జూమ్
Published Thu, Oct 14 2021 3:58 AM | Last Updated on Thu, Oct 14 2021 4:11 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment