current financial year
-
ద్వితీయార్ధంలో ఎకానమీ జోరు
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వీతీయార్ధంలో ఆర్థిక వ్యవస్థ పుంజుకున్నట్టు ఆర్బీఐ బులెటిన్ (ఫిబ్రవరి నెల) వెల్లడించింది. వాహన విక్రయాలు, విమాన ప్రయాణికుల రద్దీ, స్టీల్ వినియోగం, జీఎస్టీ ఈ–వే బిల్లులు తదితర కీలక గణాంకాలు ఇదే విషయాన్ని తెలియజేస్తున్నట్టు పేర్కొంది. డాలర్ బలోపేతం కావడంతో వర్దమాన ఆర్థిక వ్యవస్థల నుంచి పెట్టుబడులు వెనక్కి పోవడం కరెన్సీ రిస్క్ లను పెంచుతున్నట్టు తెలిపింది. ‘‘ఆర్థిక కార్యకలాపాలు స్థిరంగా కొనసాగనున్నాయి. బలమైన గ్రామీణ వినియోగానికి, వ్యవసాయ రంగం పటిష్ట పనితీరు మద్దతునివ్వనుంది. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం, బడ్జెట్లో పన్ను రాయితీలు పెంపుతో పట్టణ వినియోగం సైతం కోలుకోనుంది’’అని బులెటిన్ వివరించింది. 27 రకాల కీలక సూచికల ఆధారంగా ఆర్థిక కార్యకలాపాల తీరును అంచనా వేస్తుండడం గమనార్హం. ద్రవ్యోల్బణం తగ్గుదల నిదానంగా ఉండడం, టారిఫ్‌ల రిస్క్ పట్ల ఫైనాన్షియల్ మార్కెట్లలో ఆందోళన నెలకొందని చెబుతూ.. వర్ధమాన మార్కెట్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐలు) అమ్మకాలకు తోడు డాలర్‌తో కరెన్సీలు బలహీనపడడాన్ని ఈ బులెటిన్ ప్రస్తావించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధిలోనే ఉన్నప్పటికీ, అది మోస్తరుగా ఉన్నట్టు తెలిపింది. ‘‘వృద్ధిని, ద్రవ్య స్థీకరణను యూనియన్ బడ్జెట్ చక్కగా సమతుల్యం చేసింది. మూలధన వ్యయాలలు, వినియోగానికి మద్దతుతోపాటు డెట్ స్థిరీకరణకు స్పష్టమైన కార్యాచరణను ప్రకటించింది. దీనికి అదనంగా రెపో రేటు తగ్గింపుతో దేశీ డిమాండ్ పుంజుకోనుంది’’అని ఆర్బీఐ బులెటిన్ వెల్లడించింది. 2025లో జీడీపీ 6.4 % మూడిస్ ఎనలిటిక్స్ అంచనా న్యూఢిల్లీ: భారత జీడీపీ 2025లో 6.4 శాతం మేర వృద్ధిని సాధించొచ్చని అంతర్జాతీయ సంస్థ మూడిస్ ఎనలిటిక్స్ తెలిపింది. యూఎస్ టారిఫ్‌లు, అంతర్జాతీయంగా డిమాండ్ బలహీనపడడం ఎగుమతులపై ప్రభావం చూపిస్తాయని పేర్కొంది. 2024లో జీడీపీ 6.6%గా ఉందని గుర్తు చేసింది. 2025లో ఆసియా పసిఫిక్ వ్యాప్తంగా వృద్ధి నిదానిస్తుందని మూడిస్ ఎనలిటిక్స్ తెలిపింది. వాణిజ్య ఉద్రిక్తతలు, విధానపరమైన మార్పులు ఈ ప్రాంతం వృద్ధిపై ప్రభావం చూపిస్తాయని పేర్కొంది. చైనా జీడీపీ 2024లో 5%గా ఉంటే.. 2025లో 4.2%కి, 2026లో 3.9 శాతానికి తగ్గుముఖం పడుతుందని వివరించింది. భారత వృద్ధి 2024లో ఉన్న 6.6% నుంచి వచ్చే రెండేళ్లు 6.4 శాతానికి తగ్గొచ్చని అంచనా . -
ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.16.90 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్ను నికర వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జనవరి 12వ తేదీ నాటికి (2024 ఏప్రిల్ 1 నుంచి) 16 శాతం పెరిగి రూ.16.90 లక్షల కోట్లకు ఎగశాయి. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్ (సీబీడీటీ) గణాంకాల ప్రకారం మొత్తం ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో వ్యక్తిగత పన్ను వసూళ్లు రూ.8.74 లక్షల కోట్లు. కార్పొరేట్ వసూళ్లు రూ. 7.68 లక్షల కోట్లు. సెక్యూరిటీ లావాదేవీల పన్ను వసూళ్లు రూ.44,538 కోట్లు. రిఫండ్స్ రూ.3.74 లక్షల కోట్లు స్థూలంగా చూస్తే, జనవరి 12 నాటికి స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు 20.64 లక్షల కోట్లు. ఇందులో రిఫండ్స్ రూ.3.74 లక్షల కోట్లు. (వార్షికంగా 42.49 శాతం పెరుగుదల). వెరసి నికర వసూళ్లు రూ. 16.90 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. లక్ష్యం రూ.22.07 లక్షల కోట్లు ప్రత్యక్ష పన్నుల ద్వారా మార్చితో ముగిసే ప్రస్తుత 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.22.07 లక్షల కోట్లు వసూలు చేయాలన్నది వార్షిక బడ్జెట్ లక్ష్యం. ఇందులో కార్పొరేట్ పన్ను వసూళ్ల వాటా రూ.10.20 లక్షల కోట్లు. వ్యక్తిగత ఆదాయ, ఇతర పన్నుల ద్వారా వసూళ్లు రూ.11.87 లక్షల కోట్లు. -
6.8 శాతం వరకూ భారత్ వృద్ధి
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024 ఏప్రిల్– 2025 మార్చి) 6.5 నుంచి 6.8 శాతం శ్రేణిలో వృద్ధి చెందుతుందని ఆర్థిక సేవల దిగ్గజం– డెలాయిట్ అంచనావేసింది. 2025–2026 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 6.7–7.3 శాతం శ్రేణిలో నమోదవుతుందని అంచనావేసింది. దేశీయ వినియోగం, డిమాండ్ ఎకానమీ పురోగతికి దోహదపడే ప్రధాన అంశాలని వివరించింది. ఈ నెల ప్రారంభంలో భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) 2024– 2025 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి అంచనాను 7.2 శాతం నుండి 6.6 శాతానికి తగ్గించిన నేపథ్యంలో తాజా డెలాయిట్ నివేదిక వెలువడింది. ఎకానమీ పటిష్టమే.. 2024–25 ఆర్థిక సంవత్సరపు మొదటి అర్ధభాగంలో వృద్ధి రేట్లు అంచనాలకు తగ్గట్టుగా లేవని డెలాయిట్ ఇండియా ఆర్థిక శాస్త్రవేత్త రుమ్కీ మజుందార్ పేర్కొన్నారు. (క్యూ1, క్యూ2ల్లో వరుసగా 6.7 శాతం, 5.4 శాతం వృద్ధి) ఎన్నికల అనిశ్చితి, భారీ వర్షపాతం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు డిమాండ్– ఎగుమతులపై ప్రభావం చూపినట్లు ఆయన విశ్లేషించారు. అయితే, వినియోగ ధోరణులు, సేవల వృద్ధి, ఎగుమతుల్లో తయారీ రంగం వాటా పెరగడం, పెట్టుబడులకు సంబంధించి మూలధన మార్కెట్ల స్థిరత్వం వంటి కొన్ని ముఖ్య అంశాల్లో భారత్ ఇప్పటికీ పటిష్టంగా ఉందని అన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటైజేషన్, విదేశీ సంస్థాగత పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ఆకర్షణపై నిరంతరం దృష్టి సారించడం వంటి ప్రభుత్వ చొరవలు వృద్ధిని మరింత పెంచే అంశాలుగా ఉంటాయని మజుందార్ చెప్పారు. తాయా ఆయా అంశాలపై పూర్తి ఆశావాదంతో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు.. → తయారీకి సంబంధించి ఎల్రక్టానిక్స్, సెమీ కండక్టర్లు, రసాయనాల వంటి రంగాల్లో ఎగుమతులు పెరుగుతున్నాయి. ప్రపంచ సరఫరాల చైన్‌లో భారత్ స్థానాన్ని పటిష్టపరిచే పరిణామిది. → గత రెండున్నర నెలలుగా విదేశీ పెట్టుబడిదారులు వెనక్కివెళ్లినప్పటికీ, రిటైల్ దేశీయ సంస్థల పెట్టుబడుల వల్ల మూలధన మార్కెట్లు స్థిరంగా ఉన్నాయి. → 2025 అంతటా డిమాండ్ బాగుంటుందని అంచనా. గ్రామీణ, పట్టణ డిమాండ్ రెండూ కీలక పాత్ర పోషించనున్నాయి. వ్యవసాయ ఆదాయాలు, సబ్సిడీల వినియోగం, సామాజిక సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ ఉపాధి ప్రోత్సాహాలు, డిజిటైజేషన్ అభివృద్ధి, సేవల రంగం వృద్ధి వంటి అంశాలు వినియోగాన్ని విస్తరించడంలో సహాయపడతాయి. → భారత ఆర్థిక వ్యవస్థ అంతర్జాతీయ సవాళ్లను అధిగమించి వృద్ధిని కొనసాగించాల్సి ఉంది. భౌగోళిక రాజకీయ ఉద్రికత్తలు, వాణిజ్య వివాదాలు, సరఫరా వయవస్థల్లో అంతరాయం, వాతావరణ మార్పుల ప్రభావం దీర్ఘకాల ఆర్థిక స్థిరత్వాన్ని ప్రభావితం చసే అవకాశం ఉంది. → భారత ఆర్థిక వ్యవస్థను అంతర్జాతీయ అనిశ్చితుల నుండి దూరంగా ఎలా ఉంచాలన్న అంశంపై దృష్టి సారించాలి. అధిక సంఖ్యలో ఉన్న యువ శక్తి వినియోగం, నైపుణ్యల మెరుగు, మౌలిక సదుపాయాలను బలపరచడం వంటి అంశాలు వృద్ధికి దోహదపడతాయి. → సవాళ్లను అధిగమిస్తూ, స్వయం సమృద్ధి కలిగిన తయారీ రంగం పటిష్టతపై దృష్టి సారించాలి. గ్లోబల్ వ్యాల్యూ చైన్ సెగ్మెంట్లను లక్ష్యంగా పెట్టుకోవడం ద్వారా భారత్ కొత్త అవకాశాలను సృష్టించుకునే అవకాశాలు ఉన్నాయి. → భవిష్యత్ పురోగతికి సంబంధించి వ్యూహాత్మక పెట్టుబడులు, విధాన చర్యలు ప్రకటించే అవకాశాలు ఉన్న రాబోయే బడ్జెట్‌పై (2025–26) ప్రస్తుతం అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. -
భారీగా బ్యాంకింగ్ మోసాలు..
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో బ్యాంకింగ్ మోసాల సంఖ్య గణనీయంగా పెరిగింది. దాదాపు రూ. 21,367 కోట్ల విలువ చేసే మొత్తానికి సంబంధించి 18,461 కేసులు నమోదయ్యాయి. విలువపరంగా చూస్తే మోసాల పరిమాణం ఏకంగా ఎనిమిది రెట్లు పెరిగింది. దేశీయంగా బ్యాంకింగ్ తీరుతెన్నుల గురించి రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఇందులో 2023–24 ఆర్థిక సంవత్సరం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రథమార్ధం వరకు ధోరణులను పొందుపర్చారు. దీని ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–సెపె్టంబర్ మధ్య కాలంలో రూ. 21,367 కోట్ల మొత్తానికి సంబంధించి 18,461 కేసులు నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో రూ. 2,623 కోట్లకు సంబంధించి 14,480 కేసులు వచ్చాయి. వ్యాపారాలకు రిసు్కలు మొదలుకుని కస్టమర్ల నమ్మకం దెబ్బతినడం వరకు ఈ మోసాల వల్ల వివిధ సవాళ్లు ఉంటున్నాయని నివేదిక పేర్కొంది. ఆర్థిక స్థిరత్వంపై వీటి ప్రభావం గణనీయంగా ఉంటుందని వివరించింది. నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు.. → దశాబ్దకాలంలోనే అత్యంత తక్కువగా 2023–24లో ఫ్రాడ్ కేసులు వచ్చాయి. సగటు విలువ 16 ఏళ్ల కనిష్ట స్థాయిలో నమోదైంది. ఇక ఇంటర్నెట్, కార్డ్ ఫ్రాడ్ల విషయానికొస్తే.. విలువపరంగా చూస్తే 44.7 శాతంగా ఉండగా, కేసులపరంగా చూసినప్పుడు 85.3 శాతంగా ఉంది. → 2023–24లో మొత్తం ఫ్రాడ్ కేసుల్లో ప్రైవేట్ రంగ బ్యాంకుల వాటా 67.1 శాతంగా ఉంది. అయితే, విలువపరంగా చూస్తే మాత్రం ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా అత్యధికంగా నమోదైంది. విదేశీ బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు మినహా అన్ని నియంత్రిత సంస్థలపై విధించిన పెనాల్టీలు రెట్టింపై రూ. 86.1 కోట్లకు చేరాయి. సహకార బ్యాంకులపై జరిమానాల పరిమాణం తగ్గింది. → బ్యాంకుల లాభదాయకత వరుసగా ఆరో ఏడాది 2023–24లోనూ మెరుగుపడింది. స్థూల మొండిబాకీలు 13 ఏళ్ల కనిష్టమైన 2.7 శాతానికి తగ్గాయి. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల నికర లాభం గత ఆర్థిక సంవత్సరం 32.8 శాతం పెరిగి రూ. 3,59,603 కోట్లకు చేరింది. ఏఐ వినియోగంపై ప్రత్యేక కమిటీ ఆర్థిక రంగంలో బాధ్యతాయుతంగా, నైతికంగా కృత్రిమ మేథను (ఏఐ) వినియోగించుకునేందుకు విధానాల రూపకల్పన కోసం రిజర్వ్ బ్యాంక్ ఎనిమిది సభ్యులతో ప్రత్యేక కమిటీని ప్రకటించింది. దీనికి ఐఐటీ బాంబే ప్రొఫెసర్ పుష్పక్ భట్టాచార్య సారథ్యం వహిస్తారు. తొలి సమావేశం అనంతరం ఆరు నెలల వ్యవధిలో కమిటీ తన నివేదికను సమరి్పస్తుందని ఆర్బీఐ పేర్కొంది. -
రూ.12.11 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ 20 వరకు ప్రత్యక్ష పన్ను వసూళ్లు మెరుగ్గా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 15.41 శాతం అధికంగా రూ.12.11 లక్షల కోట్ల నికర పన్ను ఆదాయం వచ్చింది. ఇందులో రూ.5.10 లక్షల కోట్లు కార్పొరేట్ పన్ను రూపంలో రాగా, రూ.6.62 లక్షల కోట్లు నాన్ కార్పొరేట్ రూపంలో సమకూరింది. ఇక స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఏప్రిల్ నుంచి నవంబర్ 10 వరకు రూ.15.02 లక్షల కోట్లుగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చితే 21 శాతం పెరిగింది. ఈ కాలంలో రూ.2.92 లక్షల కోట్ల రిఫండ్లను ఆదాయపన్ను శాఖ పూర్తి చేసింది. -
వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణాలు అందించండి
న్యూఢిల్లీ: వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను నిర్దేశించిన మేర రుణ వితరణ చేయాలంటూ బ్యాంక్‌లను కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. వ్యవసాయ అనుబంధ రంగాలైన పశువుల పెంపకం, డైరీ, ఫిషరీస్‌కు రుణ వితరణ పురోగతిపై కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఎం.నాగరాజు మంగళవారం ఢిల్లీలో అధికారులతో కలసి సమీక్షించారు. ప్రభుత్వరంగ బ్యాంక్‌లు (పీఎస్‌బీలు), నాబార్డ్, వ్యవ సాయ అనుబంధ రంగాలు, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీల తరఫున ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన రుణ వితరణ లక్ష్యాన్ని చేరుకునేందుకు బ్యాంక్‌లు చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో నాగ రాజు కోరారు. అలాగే ఈ దిశగా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయ అభివృద్ధి, ఉపాధి కల్పన పరంగా అనుబంధ రంగాలకు ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తు చేశారు. అన్ని ప్రాంతాల్లోనూ రుణ వితరణ సాఫీగా సాగేందుకు సమావేశాల నిర్వహణ/మదింపు చేపట్టాలని బ్యాంక్‌లను ఆదేశించారు. చేపల రైతులను గుర్తించి, వారికి కేసీసీ కింద ప్రయోజనం అందే దిశగా రాష్ట్రాలకు సహకారం అందించాలని నాబార్డ్‌ను సైతం కోరారు. -
దుస్తుల ఎగుమతుల్లో 9–11 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతీయ దుస్తుల ఎగుమతిదారులు 9–11 శాతం ఆదాయ వృద్ధి నమోదు చేస్తారని ఇక్రా రేటింగ్స్ అంచనా వేస్తోంది. ప్రధాన మార్కెట్లలో నిల్వలు తగ్గిపోవడం, వివిధ దేశాలు భారత్ నుంచి కొనుగోళ్లను పెంచడం ఇందుకు కారణమని తెలిపింది. ‘భారతీయ దుస్తుల ఎగుమతులకు దీర్ఘకాలిక అవకాశాలు అనుకూలంగా ఉన్నాయి. రిటైల్ మార్కెట్లలో భారతీయ ఉత్పత్తులకు అంగీకారం, అభివృద్ధి చెందుతున్న వినియోగదారుల పోకడలు, ఉత్పత్తి–సంబంధిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం, ఎగుమతి ప్రోత్సాహకాలు, యూకే, ఈయూతో ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం ఇందుకు కారణం. అధిక రిటైల్ ఇన్వెంటరీ, కీలక మార్కెట్ల నుండి మందగించిన డిమాండ్, ఎర్ర సముద్ర సంక్షోభం, పొరుగు దేశాల నుండి పెరిగిన పోటీతో సహా సరఫరా సమస్యల కారణంగా గత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు 2 శాతం క్షీణించాయి. మూలధన వ్యయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం, 2025–26లో టర్నోవర్‌లో 5–8 శాతం మధ్య ఉండే అవకాశం ఉంది. స్థూల ఆర్థిక వాతావరణం ఒత్తిడి, భౌగోళిక రాజకీయ సమస్యల మధ్య కొన్ని కీలక మార్కెట్లలో డిమాండ్ అనిశ్చితి చుట్టూ సవాళ్లు కొనసాగుతున్నాయి. అధికం అవుతున్న కార్మిక వ్యయాలు, సరుకు రవాణా ఖర్చులు, ఇతర నిర్వహణ ఖర్చుల పెరుగుదలతో పరిశ్రమ యొక్క నిర్వహణ మార్జిన్లు 2024–25లో 30–50 బేసిస్ పాయింట్లు తగ్గుతాయని అంచనా. బంగ్లాదేశ్‌లో ఇటీవలి భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతల కారణంగా భారత్‌సహా పలు దేశాల్లో సామర్థ్యం జోడించే అవకాశం ఉంది. పీఎల్ఐ పథకం కింద తాజా సామర్థ్య జోడింపుల నుండి పొందే ప్రయోజనాలతో పాటు, పీఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్, అపారల్ స్కీమ్ ద్వారా మానవ నిర్మిత ఫైబర్ ఉత్పత్తిలో దేశ ఉనికిని బలోపేతం చేయడంతో.. ప్రపంచ దుస్తుల వ్యాపారంలో భారత్ దూసుకెళ్తుందని పరిశ్రమ భావిస్తోంది’ అని నివేదిక వివరించింది. -
నష్టాల్లోకి ఇండిగో
న్యూఢిల్లీ: విమానయాన రంగ దిగ్గజం ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు వెల్లడించింది. ఏడు త్రైమాసికాల తదుపరి జులై–సెపె్టంబర్(క్యూ2)లో లాభాలను వీడింది. రూ. 986 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అధిక ఇంధన వ్యయాలు, ఇంజిన్ సమస్యలతో కొన్ని విమానాలు నిలిచిపోవడం లాభాలను దెబ్బతీశాయి. విదేశీ మారక ప్రభావాన్ని మినహాయిస్తే రూ. 746 కోట్ల నష్టాలు నమోదయ్యాయి. ఇండిగో బ్రాండుతో సరీ్వసులందిస్తున్న కంపెనీ గతేడాది(2023–24) ఇదే కాలంలో నికరంగా రూ. 189 కోట్ల లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 15 శాతం పుంజుకుని రూ. 17,800 కోట్లను తాకింది. ఇంధన వ్యయాలు 13 శాతం పెరిగి రూ. 6,605 కోట్లకు చేరాయి. కొత్త బిజినెస్ క్లాస్: ఢిల్లీ–ముంబై మార్గంలో కస్టమర్ల అవసరాలకు అనుగుణమైన బిజినెస్ క్లాస్‌ను ప్రవేశపెడుతున్నట్లు ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ పేర్కొన్నారు. తదుపరి దశలో 40కుపైగా విమానాలను 12 మెట్రో రూట్లలో ప్రవేశపెట్టనున్నట్లు తెలియజేశారు. మరిన్ని విదేశీ రూట్లకు సరీ్వసులను విస్తరించనున్నట్లు వెల్లడించారు. ఇండిగో ప్రస్తుతం 410 విమానాలను కలిగి ఉంది. వెరసి మొత్తం వ్యయాలు 22 శాతం పెరిగి రూ. 18,666 కోట్లను తాకాయి. 6%అధికంగా 2.78 కోట్ల ప్యాసింజర్లు ప్రయాణించగా.. టికెట్ల ఆదాయం 10 శాతం ఎగసి రూ. 14,359 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో ఇండిగో షేరు బీఎస్ఈలో 3.5 శాతం క్షీణించి రూ. 4,365 వద్ద ముగిసింది. -
ఎన్టీపీసీ రూ. 2.50 డివిడెండ్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ దిగ్గజం ఎన్టీపీసీ లాభం 14 శాతం ఎగిసి రూ. 5,380 కోట్లకు చేరింది. గత క్యూ2లో ఇది రూ. 4,726 కోట్లు. అయితే, ఆదాయం రూ. 45,385 కోట్ల నుంచి రూ. 45,198 కోట్లకు తగ్గింది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 10 ముఖ విలువ గల షేర్లపై రూ. 2.50 చొప్పున తొలి మధ్యంతర డివిడెండ్ ఇచ్చే ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపింది. డివిడెండ్ చెల్లింపు తేదీ నవంబర్ 18గా ఉంటుంది. లడఖ్‌లోని చుషుల్‌లో సోలార్ హైడ్రోజన్ ఆధారిత మైక్రోగ్రిడ్‌ను ఏర్పాటు చేసేందుకు భారతీయ ఆర్మీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సంస్థ తెలిపింది. రెండో త్రైమాసికంలో స్థూల విద్యుదుత్పత్తి 90.30 బిలియన్ యూనిట్ల నుంచి 88.46 యూనిట్లకు తగ్గింది. క్యాప్టివ్ బొగ్గు గనుల నుంచి ఉత్పత్తి 5.59 మిలియన్ టన్నుల నుంచి 9.03 ఎంఎంటీకి పెరిగింది. గ్రూప్ స్థాయిలో స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 73,824 మెగావాట్ల నుంచి 76,443 మెగావాట్లకు చేరింది. -
ఐటీసీ లాభం ఫ్లాట్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జూలై–సెపె్టంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం స్వల్పంగా 2 శాతం పెరిగి రూ. 5,054 కోట్లను అధిగమించింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 4,965 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా 16 శాతం ఎగసి రూ. 22,282 కోట్లను తాకింది. గత క్యూ2లో రూ. 19,270 కోట్ల టర్నోవర్ సాధించింది. హోటళ్ల బిజినెస్ ఏకీకృతం ప్రస్తుతం హోటళ్ల బిజినెస్‌ను ప్రత్యేక కంపెనీగా విడదీసే ప్రణాళికల్లో ఉన్న ఐటీసీ బోర్డు తాజాగా ప్రత్యర్థి సంస్థలలో గల వాటాలను ఏకీకృతం చేసే ప్రతిపాదనకు గ్రీన్‌సిగ్నల్ ఇచి్చంది. సొంత అనుబంధ సంస్థ రస్సెల్ క్రెడిట్(ఆర్సీఎల్) ద్వారా ఆతిథ్య రంగ దిగ్గజాలు ఒబెరాయ్, లీలా హోటళ్లలోగల వాటాలను కొనుగోలు చేయనుంది. ఈఐహెచ్(ఒబెరాయ్) లిమిటెడ్‌లో 1.52 కోట్ల ఈక్విటీ షేర్లను, హెచ్ఎల్వీ(లీలా)లో 34.6 లక్షల షేర్లను బుక్ విలువ ఆధారంగా కొనుగోలు చేయనుంది. దీంతో ఈఐహెచ్‌లో ఐటీసీకి 16.13 శాతం, హెచ్ఎల్వీలో 8.11 శాతం చొప్పున వాటా లభించనుంది. ప్రస్తుతం ఈఐహెచ్‌లో ఐటీసీకి 13.69 శాతం, ఆర్సీఎల్కు 2.44 శాతం చొప్పున వాటా ఉంది. ఇక హెచ్ఎల్వీలో ఐటీసీకి 7.58 శాతం వాటా ఉంది. ఫలితాల నేపథ్యంలో ఐటీసీ షేరు బీఎస్ఈలో 2 శాతం క్షీణించి రూ. 472 వద్ద ముగిసింది. -
హెచ్‌యూఎల్ లాభం డౌన్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం స్వల్పంగా 2 శాతంపైగా క్షీణించి రూ. 2,595 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 2,657 కోట్లు ఆర్జించింది. వాటాదారులకు షేరుకి రూ. 19 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. దీనికి జతగా మరో రూ. 10 ప్రత్యేక డివిడెండ్‌ను చెల్లించేందుకు బోర్డు అనుమతించింది. దీంతో మొత్తం రూ. 29 (రూ.6,814 కోట్లు) డివిడెండ్ చెల్లించనుంది.ఆదాయం ప్లస్...తాజా క్యూ2లో హెచ్‌యూఎల్ మొత్తం టర్నోవర్ 2%పైగా బలపడి రూ. 16,145 కోట్లను తాకింది. దీనిలో ప్రొడక్టుల విక్రయాలు 2 శాతం వృద్ధితో రూ. 15,703 కోట్లకు చేరాయి. పట్టణాల్లో డిమాండ్ తగ్గినా గ్రామీణ ప్రాంతాలలో క్రమంగా పుంజుకుంటున్నట్లు కంపెనీ సీఈవో, ఎండీ రోహిత్ జావా పేర్కొన్నారు.ఐస్‌క్రీమ్ బిజినెస్ విడదీత..: క్వాలిటీ వాల్స్, కార్నెటో, మ్యాగ్నమ్ బ్రాండ్లను కలిగిన ఐస్‌క్రీమ్ బిజినెస్‌ను విడదీయనున్నట్లు హెచ్‌యూఎల్ వెల్లడించింది. స్వతంత్ర కమిటీ సలహామేరకు ఐస్‌క్రీమ్ బిజినెస్‌ను ప్రత్యేక కంపెనీగా విడదీసేందుకు నిర్ణయించినట్లు హెచ్‌యూఎల్ సీఎఫ్‌వో రితేష్ తివారీ చెప్పారు.ఫలితాల నేపథ్యంలో హెచ్‌యూఎల్ షేరు బీఎస్ఈలో 1 శాతం నష్టంతో రూ. 2,658 వద్ద ముగిసింది. -
ఐటీలో వృద్ధి 6 శాతంలోపే
న్యూఢిల్లీ: భారత ఐటీ రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024–25) 4 నుంచి 6 % మద్య ఆదాయంలో వృద్ధిని నమోదు చేయవచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. స్థూల ఆర్థిక సవాళ్ల నేపథ్యంలో యూఎస్, యూరప్ లోని క్లయింట్లు టెక్నాలజీలపై వ్యయా లు తగ్గించుకోవడాన్ని కారణంగా పేర్కొంది. ఆదా యం పరంగా సవాళ్లు ఉన్నప్పటికీ నిర్వహణ మార్జిన్లు మెరుగ్గా 22% మేర ఉంటాయని తెలి పింది. అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలస) గణనీయంగా తగ్గి, సమీప కాలంలో స్థిరపడొ చ్చని అంచనా వేసింది. మెరుగైన నగదు ప్రవాహాలు, బలమైన బ్యాలన్స్ షీట్లను పరిగణనలోకి తీసుకుని ఐటీ పరిశ్రమకు స్థిరమైన అవుట్‌లుక్ ఇచి్చంది. అధిక ద్రవ్యోల్బణం, వడ్డీ వ్య యాలు కీలక రంగాల్లోని క్లయింట్లపై ఒత్తిళ్లకు దారితీశాయని, ఫలితంగా వ్యయాలని యంత్రణ, విచక్షణారహిత వ్యయాలను క్లయింట్లు వాయిదా వేసుకోవడాన్ని ప్రస్తావించింది. ఆర్డ ర్లు రాక తగ్గుముఖం పట్టినప్పటికీ.. ఐటీ కంపెనీలకు ఆర్డర్, డీల్స్ పైపులైన్ బలంగానే ఉ న్నట్టు ఇక్రా తెలిపింది. ఒక్కసారి ఆర్థిక పరిస్థితులు కుదుటపడితే మధ్యకాలానికి ఐటీ కంపెనీల్లో వృద్ధి మళ్లీ పుంజుకుంటుందని ఇక్రా కార్పొరేట్ రేటింగ్స్ హెడ్ దీపక్ జోత్వాని పేర్కొన్నారు. కీలక మార్కెట్లో రికవరీ కీలకం.. దేశ ఐటీ కంపెనీల ఆదాయం గడిచిన ఐదారు త్రైమాసికాలుగా పెద్ద వృద్ధిని చూడకపోవడం గమనార్హం. ఇక్రా ఎంపిక చేసిన 15 పెద్ద, మధ్యస్థాయి లిస్టెడ్ ఐటీ కంపెనీలు 2023–24లో డాలర్ పరంగా కేవలం 5.5 శాతం వృద్ధినే నమోదు చేశాయి. 2022–23లో ఇది 9.2 శాతంగా ఉంది. అయినప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీల నిర్వహణ మార్జిన్లు 22 శాతంగా ఉంటాయని ఇక్రా అంచనా వేస్తోంది. దేశ ఐటీ కంపెనీలకు సింహభాగం ఆదాయం యూఎస్ నుంచి వస్తుంటే, ఆ తర్వాత యూరప్, మిగిలిన ప్రపంచ మార్కెట్ల (ఆర్వోడబ్ల్యూ) నుంచి వస్తోంది. ఇక్రా ఎంపిక చేసిన ఐటీ కంపెనీల ఆదాయంలో 55–60 శాతం మేర ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలోయూఎస్ నుంచే వచ్చింది. యూరప్ నుంచి 22–25 శాతం సమకూరింది. స్థూల ఆర్థిక అనిశి్చతుల ప్రభావం పరిశ్రమపై ఇక మీదట ఉండొచ్చని, కీలక మార్కెట్లలో నియంత్రణపరమైన తీవ్ర మార్పులు చోటు చేసుకుంటే అది ప్రతికూల ప్రభావం కొనసాగేలా చేయొచ్చని పేర్కొంది. జెనరేషన్ ఏఐ మధ్య కాలంలో ఐటీ పరిశ్రమ వృద్ధికి కీలకమని.. ప్రముఖ ఐటీ కంపెనీలు తమ సిబ్బందికి ఇందులో శిక్షణ ఇప్పించి, సేవల పరంగా తమ సామర్థ్యాలను పెంచుకున్నట్టు ఇక్రా తన నివేదికలో వివరించింది. జెనరేషన్ ఏఐ పరంగా ఆర్డర్‌బుక్ లేదా ఆదాయం ఇప్పటి వరకు పరిమితంగా ఉండగా, మధ్య కాలానికి పుంజుకోవచ్చని అంచనా వేసింది. డిమాండ్ మోస్తరుగా ఉండడం, 2022–23లో అధికంగా చేరిన సిబ్బందితో ఇటీవలి కాలంలో ఐటీ కంపెనీల నియామకాలపై ప్రభావం పడినట్టు తెలిపింది. లిస్టెడ్ కంపెనీలకు సంబంధించి నికర సిబ్బంది తగ్గుదల చోటుచేసుకున్నట్టు పేర్కొంది. -
ఆతిథ్య పరిశ్రమలో సందడి వాతావరణం
ముంబై: ఆతిథ్య పరిశ్రమలో సందడి వాతావరణం నెలకొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో ఈ రంగంలోని కంపెనీలకు (హోటళ్లు) ఒక్కో గది వారీ ఆదాయం 4.8 శాతం మేర అధికంగా సమకూరింది. రోజువారీ సగటు రూమ్ ధరల పెరుగుదల ఇందుకు అనుకూలించినట్టు ‘జేఎల్ఎల్ హోటల్ మూమెంటమ్ ఇండియా (2024 క్యూ2)’ నివేదిక వెల్లడించింది. కానీ, ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంతో పోల్చి చూసినప్పుడు, జూన్ క్వార్టర్లో ఆక్యుపెన్సీ (గదుల భర్తీ రేటు) స్వల్పంగా తగ్గినట్టు తెలిపింది. కార్పొరేట్ ప్రయాణాలు తగ్గడాన్ని కారణంగా పేర్కొంది. హోటళ్ల రోజువారీ సగటు రేటు (ఏడీఆర్) గోవాలో స్వల్పంగా క్షీణించగా, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్ మార్కెట్లలో ఏడీఆర్‌లో చెప్పుకోతగ్గ వృద్ధి కనిపించినట్టు, ముఖ్యంగా హైదరాబాద్ ఈ విషయంలో ముందున్నట్టు జేఎల్ఎల్ నివేదిక వెల్లడించింది. హైదరాబాద్ మార్కెట్లో డిమాండ్ హైదరాబాద్ ఆతిథ్య పరిశ్రమలో గదుల సగటు ఆదాయం మిగిలిన నగరాలతో పోలి్చతే మెరుగ్గా నమోదైనట్టు జేఎల్ఎల్ నివేదిక తెలిపింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు ఈ ఏడాది ఏప్రిల్–జూన్‌లో 11.9 శాతం మేర ఆదాయం పెరిగింది. ఆ తర్వాత ఢిల్లీలో 11.8 శాతం, బెంగళూరులో 10.4 శాతం చొప్పున వృద్ధి నమోదైంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చితే ఆక్యుపెన్సీ (గదుల భర్తీ) రేటు స్థిరంగా ఉంది. రోజువారీ సగటు ధరల పెరుగుదలే రూమ్ వారీ సగటు ఆదాయంలో వృద్ధికి తోడ్పడింది. ఇక కార్పొరేట్ ప్రయాణాలు తిరిగి ప్రారంభం కావడం, ఇతర కార్పొరేట్, సామాజిక సమావేశాలు, సదస్సులు, ప్రదర్శనలతో రానున్న త్రైమాసికంలో (జూలై–సెపె్టంబర్)నూ ఆతిథ్య పరిశ్రమలో మెరుగైన డిమాండ్ ఉండొచ్చని జేఎల్ఎల్ అంచనా వేసింది. -
భారీ పెట్టుబడులకు ఎల్ఐసీ రెడీ
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024 –25) దేశీ స్టాక్ మార్కెట్లో బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్ఐసీ భారీగా ఇన్వెస్ట్ చేయనుంది. రూ. 1.3 లక్షల కోట్లను స్టాక్స్‌లో సరికొత్తగా ఇన్వెస్ట్ చేయనున్నట్లు సంస్థ ఎండీ, సీఈవో సిద్ధార్థ మొహంతీ వెల్లడించారు. ఇప్పటికే ఈ ఏడాది తొలి త్రైమాసికం(ఏప్రిల్–జూన్)లో రూ. 38,000 కోట్ల పెట్టుబడులు కుమ్మరించింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 23,300 కోట్ల విలువైన పెట్టుబడులు చేపట్టింది. కాగా.. ఈ క్యూ1లో ఎల్ఐసీ ఈక్విటీ మార్కెట్ పెట్టుబడులపై రూ. 15,500 కోట్ల లాభం ఆర్జించింది. ఇవి గతేడాది క్యూ4(జనవరి–మార్చి)తో పోలిస్తే 13.5 శాతం అధికంకావడం గమనార్హం. స్టాక్ మార్కెట్ కదలికలు, ధరల్లో మార్పులను నిశితంగా పరిశీలిస్తూ పెట్టుబడి అవకాశాలను వినియోగించుకుంటామని మొహంతీ తెలియజేశారు. కనీసం గతేడాది(రూ. 1.32 లక్షల కోట్లు) స్థాయిలో ఈ ఏడాది పెట్టుబడులను వెచి్చంచనున్నట్లు పేర్కొన్నారు. ఈ జూన్ చివరికల్లా స్టాక్స్‌లో ఎల్ఐసీ పెట్టుబడుల విలువ రూ. 15 లక్షల కోట్లకు చేరినట్లు వెల్లడించారు. బీమా దిగ్గజం మొత్తం 282 కంపెనీలలో ఇన్వెస్ట్ చేసింది. ఏఎంసీ జూమ్: జూన్‌కల్లా ఎల్ఐసీ నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) 16 శాతంపైగా ఎగసి రూ. 53,58,781 కోట్లను తాకాయి. గత క్యూ1కు ఇవి రూ. 46,11,067 కోట్లు. క్యూ1 తీరిలా: క్యూ1లో ఎల్ఐసీ లాభం 10% వృద్ధితో రూ. 10,461 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం రూ. 1,88,749 కోట్ల నుంచి రూ. 2,10,910 కోట్లకు పెరిగింది. -
వృద్ధి అంచనా 7.1 శాతం నుంచి 7.5 శాతానికి అప్
న్యూఢిల్లీ: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) వృద్ధికి సంబంధించి ప్రస్తుత 7.1 శాతం అంచనాలను 7.5 శాతానికి పెంచుతున్నట్లు ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ (ఇండ్–రా) తాజా నివేదికలో పేర్కొంది. వినియోగ డిమాండ్ క్రిత అంచనాలకన్నా మెరుగ్గా ఉండడం తాజా నిర్ణయానికి కారణమని వివరించింది. ప్రభుత్వ మూలధన పెట్టుబడులు, కార్పొరేట్లు, బ్యాంకుల చక్కటి బ్యాలెన్స్ షీట్లు, ప్రారంభమైన ప్రైవేట్ కార్పొరేట్ మూలధన పెట్టుబడుల ప్రక్రియ, వృద్ధి ఊపందుకోవడం వంటి అంశాలకు కేంద్ర ప్రభుత్వ తాజా బడ్జెట్ మరింత ఊపునిస్తున్నట్లు విశ్లేíÙంచింది. వ్యవసాయ, గ్రామీణ వ్యయాలను బడ్జెట్ పెంచుతుందని, సూక్ష్మ లఘు చిన్న మధ్య తరహా (ఎంఎస్ఎంఈ) రంగానికి రుణ మంజూరులను మెరుగుపరుస్తుందని ఆర్థిక వ్యవస్థలో ఉపాధి కల్పనను ప్రోత్సహిస్తుందని పేర్కొంది. ఆర్బీఐ, అర్థిక సర్వే అంచనాలకన్నా అధికం.. 2024–25 భారత్ జీడీపీ పురోగతిపై ఆర్బీఐ (7.2 శాతం), ఆర్థిక మంత్రిత్వశాఖ సర్వే (6.5 శాతం నుంచి 7 శాతం మధ్య) వృద్ధి అంచనాలకన్నా... ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ తాజా అంచనాలు అధికంగా (7.5 శాతం) ఉండడం గమనార్హం. సాధరణంకన్నా అధిక స్థాయిలో వర్షపాతం, తాజా బడ్జెట్లో ప్రోత్సాహకాలు వంటి అంశాలు ఇచ్చే ఫలితాలు జీడీపీ వృద్ధిని ఊహించినదానికన్నా పెంచుతాయని ఇండ్రా అభిప్రాయపడింది. ఆహార ద్రవ్యోల్బణం ప్రమాదంగా కొనసాగుతున్నప్పటికీ మొత్తంగా రిటైల్ ద్రవ్యోల్బణం 2023–24 కంటే, 2024–25లో తక్కువగా ఉంటుందని సంస్థ అంచనావేసింది. ఇది వాస్తవ వేతన వృద్ధికి తోడ్పడుతుందని పేర్కొంది. -
క్యూ1లో విప్రో ఓకే
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం విప్రో లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 4.6 శాతం వృద్ధితో రూ. 3,003 కోట్లను అధిగమించింది. అయితే మొత్తం ఆదాయం 3.8 శాతం క్షీణించి రూ. 21,694 కోట్లకు పరిమితమైంది. రెండో త్రైమాసికం(జూలై–సెప్టెంబర్)లో ఐటీ సరీ్వసుల ఆదాయం 260–265.2 కోట్ల డాలర్ల మధ్య నమోదుకావచ్చని తాజాగా అంచనా వేసింది. వెరసి త్రైమాసికవారీగా కరెన్సీ నిలకడ ప్రాతిపదికన –1 శాతం నుంచి +1 శాతం మధ్య గైడెన్స్‌ను ప్రకటించింది. బిలియన్ డాలర్లకు మించిన భారీ డీల్స్ ద్వారా మరోసారి ఈ త్రైమాసికంలో కంపెనీ రికార్డు నెలకొలి్పనట్లు విప్రో సీఈవో, ఎండీ శ్రీని పాలియా పేర్కొన్నారు. శుక్రవారం మైక్రోసాఫ్ట్ సిస్టమ్స్‌లో ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన సాంకేతిక సమస్యలపై స్పందిస్తూ కంపెనీలో ఎలాంటి సవాళ్లు ఎదురుకాలేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఈ అంశంలో సవాళ్లు ఎదుర్కొన్న యూఎస్, యూరప్ క్లయింట్లకు సహాయం చేసినట్లు తెలియజేశారు. 12,000 మందికి చాన్స్ ఈ ఏడాది 10,000–12,000 మందికి ఉపాధి కలి్పంచనున్నట్లు విప్రో సీహెచ్ఆర్వో సౌరభ్ గోవిల్ వెల్లడించారు. గతేడాది క్యూ1తో పోలిస్తే నికరంగా 337 మంది ఉద్యోగులను జత చేసుకుంది. దీంతో జూన్ చివరికల్లా మొత్తం సిబ్బంది సంఖ్య 2,34,391కు చేరింది. షేరు బీఎస్ఈలో 3% క్షీణించి రూ. 557 వద్ద ముగిసింది. -
పన్ను భారం తగ్గేదెలా..?
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి రిటర్నులు దాఖలు చేసే వారికి నూతన పన్ను విధానం డిఫాల్ట్‌గా ఎంపికై ఉంటుంది. పాత పన్ను వ్యవస్థతోనే కొనసాగాలనుకుంటే విధిగా దానిని ఎంపిక చేసుకోవాల్సిందే. లేదంటే కొత్త విధానం అమలవుతుంది. పాత వ్యవస్థతో పోలిస్తే కొత్త పన్ను విధానంలో పన్ను భారం తక్కువ. కానీ, పాత విధానంలో పన్ను మినహాయింపులు, తగ్గింపులు ఎక్కువ. వీటిని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే కనుక కొత్త విధానంతో పోలిస్తే గణనీయమైన పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు. దీంతో నికరంగా చెల్లించే పన్ను తగ్గిపోతుంది. మరి వీటిల్లో తమకు ఏది అనుకూలమో తేల్చుకోవాలంటే, ఈ వివరాలు తెలుసుకోవాల్సిందే. ఆదాయపన్ను భారాన్ని సాధ్యమైనంత తగ్గించుకోవాలని కోరుకునే వారికి.. పాత, కొత్త పన్ను విధానాల్లో ఎంపిక కీలకం అవుతుంది. చట్టప్రకారం మీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంటే, అప్పుడు విధిగా రిటర్నులు దాఖలు చేసి నిబంధనల ప్రకారం పన్ను చెల్లించాలి. పాత, కొత్త పన్ను రేట్లను ఒకసారి పరిశీలిద్దాం. ఈ రెండు వ్యవస్థల్లోనూ కొంత పన్ను రాయితీ ఉంది. పాత విధానంలో నికరంగా రూ.5 లక్షలు, నూతన విధానంలో నికరంగా రూ.7 లక్షలు మించకుండా పన్ను వర్తించే ఆదాయం ఉంటే సెక్షన్ 87ఏ కింద ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. స్టాండర్డ్ డిడక్షన్ రూ.50 వేల ప్రయోజనాన్ని కూడా కలిపి చూస్తే వేతన జీవులు పాత విధానంలో రూ.5.50,000 ఆదాయం, కొత్త విధానంలో రూ.7,50,000 మించని ఆదాయంపై రూపాయి పన్ను కట్టక్కర్లేదు. ఆదాయపన్ను చట్టంలోని వివిధ సెక్షన్ల కింద వేర్వేరు సాధనాల్లో ఇన్వెస్ట్ చేసి పన్ను ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసుకోలేని వారికి నూతన విధానమే అనుకూలం. పాత విధానంలో సెక్షన్ 80సీ, 80డీ, 24 ఇలా పలు సెక్షన్ల కింద పన్ను తగ్గింపులు, మినహాయింపులను వినియోగించుకుంటే, రూ.5 లక్షలకు పైన ఆదాయం ఉన్నవారు సైతం గణనీయమైన ప్రయోజనాన్ని పొందొచ్చు. ఇంతకుమించి ఆదాయం కలిగిన వారు ఈ రెండింటిలో ఏది లాభదాయకమో తేల్చుకోవాలంటే కొంత కసరత్తు అవసరం. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి దీని కింద పీపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్, సుకన్య సమృద్ధి యోజన, నేషనల్ సేవింగ్స్ సరి్టఫికెట్, పన్ను ఆదా ఫిక్స్డ్ డిపాజిట్లో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ మొత్తంపై పన్ను లేకుండా చూసుకోవచ్చు. జీవిత బీమా పాలసీకి చెల్లించే ప్రీమియం, పిల్లల ట్యూషన్ ఫీజులను కూడా ఈ సెక్షన్ కింద చూపించుకోవచ్చు. గృహ రుణం తీసుకుని, ఒక ఆర్థిక సంవత్సరంలో దీనికి చేల్లించే అసలును (ప్రతి ఈఎంఐలో అసలు, వడ్డీ భాగం ఉంటుంది) సెక్షన్ 80సీ కింద చూపించి, ఆ మొత్తంపై పన్ను లేకుండా చేసుకోవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంను సెక్షన్ 80డీ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. 60 ఏళ్లలోపు వయసున్న వారు రూ.25,000 వరకు, అంతకుమించిన వయసు వారికి రూ.50,000 వరకు పన్ను మినహాయింపు ప్రయోజనం లభిస్తుంది. ఇదే సెక్షన్ కింద హెల్త్ చెకప్‌లకు చేసే వ్యయం రూ.5,000 వరకు పన్ను మినహాయింపు ఉంది. విరాళాలు ఇస్తే.. అర్హత కలిగిన సంస్థలకు విరాళాలు ఇస్తే, ఆ మొత్తంపై సెక్షన్ 80జీ కింద పన్ను భారం ఉండదు. ఇక సెక్షన్ 80టీటీఏ కింద సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్లపై ఆర్జించే వడ్డీ రూ.10,000 మొత్తంపై పన్ను లేదు. అదే 60 ఏళ్లు నిండిన వారికి వడ్డీ ఆదాయం రూ.50,000పై పన్ను లేదు. ఇవన్నీ పాత పన్ను విధానంలో ఉన్న చక్కని పన్ను మినహాయింపు ప్రయోజనాలు. పన్ను ఆదా, పెట్టుబడులు పాత వ్యవస్థలో ఉన్న పన్ను ఆదా ప్రయోజనాలను ఉపయోగించుకుంటే, మరింతగా పన్ను ఆదా చేసుకోవచ్చని లాడర్7 ఫైనాన్షియల్ అడ్వైజర్స్ వ్యవస్థాపకుడు సురేష్ శడగోపన్ పేర్కొన్నారు. వివిధ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఒకవైపు పెట్టుబడులపై రాబడిని, మరోవైపు పన్ను ఆదా చేసుకోవడానికి వీలుంటుంది. కొత్త పన్ను విధానంలో పెట్టుబడులకు ఎలాంటి ప్రోత్సాహం లేదు. అంటే ఇది పెట్టుబడులను నిర్బంధం చేయదు. ఎన్పీఎస్ వేతన జీవులు, స్వయం ఉపాధిలోని వారు, ప్రభుత్వరంగ ఉద్యోగులకు ఎన్పీఎస్పై పన్ను ప్రయోజనాలు ఉన్నాయి. వేతన జీవులు అయితే తమ మూలవేతనం, డీఏలో 10 శాతం మేర ఎన్పీఎస్కు చందా జమ చేయడం ద్వారా ఆ మొత్తంపై పన్ను లేకుండా చేసుకోవచ్చు. స్వయం ఉపాధిలో ఉన్న వారు తమ మొత్తం ఆదాయంలో 20 శాతంపై ఈ ప్రయోజనాన్ని పొందొచ్చు. ఈ సెక్షన్ కింద ఈ రెండు వర్గాలకు గరిష్ట ప్రయోజనం రూ.1.5 లక్షలు. ఇక 80సీసీడీ (1బి) కింద వేతన జీవులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు రూ.50,000 జమలపై పన్ను మినహాయింపు పొందొచ్చు. పైన చెప్పుకున్న రూ.1.5 లక్షలకు ఇది అదనం. 80సీసీడీ(2) కింద వేతన జీవులకు అదనపు ప్రయోజనం ఉంది. ఉద్యోగి ఎన్పీఎస్ ఖాతాలో సంస్థ చేసే జమలు దీనికింద వస్తాయి. ప్రభుత్వరంగ ఉద్యోగులు అయితే తమ మూలవేతనం, డీఏలో 14 శాతం, ప్రైవేటు ఉద్యోగులు 10 శాతం మేర యాజమాన్యం జమలపై పన్ను మినహాయింపు పొందొచ్చు. ఇక్కడ గరిష్ట పరిమితి రూ.7.5 లక్షలు. ఈపీఎఫ్ జమలు కూడా ఈ పరిమితిలో భాగమే. హెచ్ఆర్ఏ అద్దె ఇంట్లో ఉంటూ, పనిచేసే సంస్థ నుంచి ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ) పొందుతుంటే అప్పుడు కూడా పన్ను ప్రయోజనాన్ని అందుకోవచ్చు. మెట్రోల్లో నివసించే వారు తమ మూల వేతనం, డీఏలో 50 శాతం మేర సెక్షన్ 10(13ఏ) కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. నాన్ మెట్రోల్లోని వారికి ఈ పరిమితి 40 శాతంగా ఉంది. అలాగే, హెచ్ఆర్ఏ రూపంలో ఒక ఆర్థిక సంవత్సరంలో అందుకున్న మొత్తం.. మూలవేతనం, డీఏలో 10 శాతాన్ని వాస్తవంగా చెల్లించిన అద్దె నుంచి తీసివేయగా వచ్చే మొత్తం.. ఈ మూడింటిలో ఏది తక్కువ అయితే ఆ మొత్తంపై పన్ను మినహాయింపు పొందొచ్చు. పనిచేసే ప్రాంతంలో సొంత ఇంట్లో నివాసం ఉండే వారికి హెచ్ఆర్ఏపై పన్ను మినహాయింపు రాదు. పనిచేసే చోట అద్దె ఇంట్లో ఉంటూ, వేరే ప్రాంతంలో సొంతిల్లును అద్దెకు ఇచి్చన వారు సైతం హెచ్ఆర్ఏపై పన్ను మినహాయింపును పొందొచ్చు. లీవ్ ట్రావెల్ అలవెన్స్ (ఎల్‌టీఏ) పన్ను పరిధిలోకి వస్తుంది. ప్రయాణాలకు చేసిన ఖర్చును చూపించి, పన్ను భారం తొలగించుకోవచ్చు. గృహ రుణం/విద్యా రుణం రుణంపై ఇంటిని కొనుగోలు చేసే ధోరణి పెరిగింది. ఉద్యోగంలో చేరిన తొలినాళ్లలోనే ఇప్పుడు యువత సొంతింటి కలను సాకారం చేసుకుంటున్నారు. ఇలాంటి వారు కొంత డౌన్ పేమెంట్ చెల్లించి, మిగిలిన మొత్తానికి రుణం తీసుకుంటున్నారు. ఈ రుణానికి చేసే అసలు చెల్లింపులు ఒక ఏడాదిలో రూ.1.5 లక్షలను సెక్షన్ 80సీ కింద, వడ్డీ చెల్లింపులు రూ.2 లక్షల మేర సెక్షన్ 24(బి) కింద చూపించుకుని ఆ మొత్తంపై పన్ను కట్టక్కర్లేదు. సొంతగా నివాసం ఉన్నా లేదా అద్దెకు ఇచ్చినా సరే ఈ ప్రయోజనానికి అర్హులే. విద్యా రుణానికి ఒక ఆర్థిక సంవత్సరంలో చేసే వడ్డీ చెల్లింపులు ఎంత ఉన్నా సరే ఆ మొత్తాన్ని రిటర్నుల్లో చూపించుకుని పన్ను లేకుండా మినహాయింపు పొందొచ్చు. మీకు ఏది అనుకూలం? పాత విధానంలో ఇక్కడ పేర్కొన్న మినహాయింపులను పూర్తిగా వినియోగించుకుంటే.. సెక్షన్ 80సీ కింద 1.50 లక్షలు, 80 సీసీడీ (1బి) కింద రూ.50,000 (ఎన్పీఎస్), స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000, గృహ రుణం వడ్డీ రూ.2 లక్షలు కలిపి మొత్తం రూ.9.5 లక్షలపై పన్ను లేనట్టే. అలాగే, ప్రైవేటు ఉద్యోగులు పనిచేసే సంస్థ ద్వారా ఎన్పీఎస్ ఖాతాకు గరిష్టంగా రూ.7.5 లక్షల మేర జమ చేయించుకుంటే అప్పుడు మొత్తం రూ.17 లక్షలపై పన్ను లేనట్టు అవుతుంది. కొత్త విధానంలో రూ.7 లక్షల మొత్తంపై సెక్షన్ 87ఏ కింద పన్ను రాయితీ కలి్పంచారు. దీనికి రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్ అదనం. అంటే రూ.7.5 లక్షలపై పన్ను లేదు. ఆదాయం రూ.7,50,001 ఉన్న వారికి 87ఏ రాయితీ వర్తించదు. వారు తమ ఆదాయంపై పూర్తి పన్ను చెల్లించాలి. మొదటి మూడు లక్షలపై పన్ను లేదు. 3–6 లక్షలపై 5 శాతం ప్రకారం రూ.15,000. రూ.6.–7.51 లక్షలపై 10 శాతం ప్రకారం రూ.15,000 కలిపి మొత్తం రూ.30,000, దీనికి సెస్ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. 7.51 లక్షల ఆదాయంపై పాత విధానంలో రిటర్నులు వేసుకునేట్టు అయితే.. 87ఏ రిబేటు, స్టాండర్డ్ డిడక్షన్‌తో కలిపి రూ.5.5 లక్షల వరకు పన్ను లేదు. 80సీ సాధనంలో 1.5 లక్షలు ఇన్వెస్ట్ చేసుకుని, దీనికి అదనంగా ఎన్‌పీఎస్‌లో రూ.50,000 ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా రూపాయి పన్ను లేకుండా చూసుకోవచ్చు. విధానాన్ని మార్చుకోవచ్చు.. పాత పన్ను నుంచి కొత్త పన్నుకు.. తిరిగి పాత పన్నుకు మారడంపై ఆంక్షలు ఉన్నాయి. వ్యాపారం లేదా వృత్తి రూపంలో ఆదాయం పొందని వారు ప్రతి ఆర్థిక సంవత్సరంలోనూ పాత, కొత్త పన్ను వ్యవస్థల్లో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవచ్చు. వృత్తి లేదా వ్యాపారం నుంచి ఆదాయం పొందుతున్న వారు సెక్షన్ 115బీఏసీ కింద నూతన పన్ను విధానం నుంచి వైదొలిగే ఆప్షన్‌ను వినియోగించుకోవచ్చు. అప్పుడు తిరిగి నూతన పన్ను విధానానికి ఒక్కసారి మాత్రమే మారే అవకాశం ఉంటుంది. ‘‘తక్కువ పన్ను శ్లాబుల పరిధిలో ఆదాయం కలిగిన వారికి నూతన పన్ను విధానమే మెరుగైనది. అధిక రేటు శ్లాబుల్లో ఉన్నవారు, అన్ని రకాల మినహాయింపులు వినియోగించుకుంటే వారికి పాత విధానం అనుకూలం’’అని రైట్ హారిజాన్స్ సీఈవో అనిల్ రెగో సూచించారు. -
ICRA: డిసెంబర్ త్రైమాసికంలో జీడీపీ 6 శాతం
న్యూఢిల్లీ: భారత్ జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో (2023 అక్టోబర్–డిసెంబర్) 6 శాతానికి తగ్గుతుందని రేటింగ్ సంస్థ ఇక్రా అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (2023జూలై–సెపె్టంబర్)లో 7.6 శాతంగా ఉన్నట్టు గుర్తు చేసింది. వ్యవసాయం, పరిశ్రమల పనితీరు స్తబ్దుగా ఉన్నట్టు తెలిపింది. పారిశ్రామిక రంగంలో వృద్ధి తగ్గుముఖం పట్టడానికి గతంలో బేస్ ప్రభావం అధికంగా ఉండడానికితోడు, అమ్మకాల పరిమాణం తగ్గడాన్ని ప్రస్తావించింది.. భారత ప్రభుత్వం, 25 రాష్ట్రాల వ్యయాలు అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో 0.2 శాతం మేర తగ్గడం జీవీఏ వృద్ధిని వెనక్కి లాగడానికి కారణాల్లో ఒకటిగా పేర్కొంది. ‘‘పారిశ్రామిక రంగంలో అమ్మకాల పరిమాణం తగ్గడం, పెట్టుబడులపైనా కొంత స్తబ్దత, ప్రభుత్వ వ్యయాలు తగ్గడం, రుతుపవనాలు అసాధారణం ఉండడం వంటివి జీడీపీ వృద్ధిని 2023–24లో మూడో త్రైమాసికంలో 6 శాతానికి తగ్గిస్తాయి’’అని వివరించింది. ఇక సేవల రంగానికి సంబంధించి జీవీఏ (స్థూల అదనపు విలువ) మాత్రం 2023–24లో రెండో త్రైమాసికంలో ఉన్న 5.8 శాతం నుంచి మూడో త్రైమాసికంలో 6.5 శాతానికి వృద్ధి చెందుతుందని ఇక్రా అంచనా వేసింది. హోటళ్లు, రవాణా, కమ్యూనికేషన్, ప్రసార సేవలు ఇందుకు మద్దతుగా నిలుస్తాయని పేర్కొంది. -
ఎల్ఐసీ లాభం జూమ్
న్యూఢిల్లీ: జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ మరోసారి పటిష్ట పనితీరు ప్రదర్శించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికానికి రూ.9,444 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.6,334 కోట్లతో పోలిస్తే 49 శాతం పెరిగింది. నికర ప్రీమియం ఆదాయం రూ.1,11,788 కోట్ల నుంచి రూ.1,17,017 కోట్లకు వృద్ధి చెందింది. ఎల్ఐసీ మొత్తం ఆదాయం రూ.1,96,891 కోట్ల నుంచి రూ.2,12,447 కోట్లకు చేరింది. ఒక్కో షేరుకు రూ.4 చొప్పున మధ్యంతర డివిడెండ్ పంపిణీ చేయాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇందుకు ఫిబ్రవరి 21 రికార్డు తేదీగా ప్రకటించింది. 30 రోజుల్లోపు డివిడెండ్ పంపిణీ చేస్తామని తెలిపింది. మొదటి ఏడాది ప్రీమియం ఆదాయం (కొత్త పాలసీల నుంచి)లో ఎల్ఐసీ ఇప్పటికీ జీవిత బీమా మార్కెట్లో 58.90 శాతం వాటాతో దిగ్గజ సంస్థగా కొనసాగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ వరకు తొమ్మిది నెలల్లో ఎల్ఐసీ నికర లాభం అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఉన్న రూ.22,969 కోట్ల నుంచి రూ.26,913 కోట్లకు వృద్ధి చెందింది. ఫలితాల నేపథ్యంలో ఎల్ఐసీ షేరు ధర 6.50% ఎగసి రూ.1,112 వద్ద ముగిసింది. -
6.3 శాతం నుంచి 6.7 శాతానికి అప్
న్యూఢిల్లీ: భారత్ మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.7 శాతం వృద్ధి సాధిస్తుందని ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) తాజా నివేదిక పేర్కొంది. ఈ మేరకు సెపె్టంబర్ నాటి అవుట్‌లుక్ 6.3 శాతం వృద్ధి అంచనాలను 40 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) పెంచింది. రెండవ త్రైమాసికం (జూలై–సెపె్టంబర్) త్రైమాసిక స్థూల దేశీయోత్పత్తి ఫలితాలు అంచనాలకు మించి 7.6 శాతంగా వెలువడ్డం తమ తాజా నిర్ణయానికి కారణమని ఆసియన్ డెవలప్మెంట్ అవుట్‌లుక్– డిసెంబర్ 2023లో వివరించింది. 2022–23లో భారత్ జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతం. 2023–24లో ఈ రేటు 6.5 శాతంగా ఉంటుందని ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) తొలుత అంచనావేసింది. క్యూ1లో 8 శాతం వృద్ధి అంచనాకు భిన్నంగా 7.8 శాతం ఫలితం వెలువడింది. క్యూ2లో 6.5 శాతం అంచనాలు వేయగా ఇందుకు 1.1 శాతం అధికంగా ఫలితం వెలువడింది. దీనితో ఆర్బీఐ కూడా ఇటీవలి పాలసీ సమీక్షలో తన జీడీపీ వృద్ధి అంచనాలను 7 శాతానికి పెంచింది. క్యూ3లో 6 శాతం, క్యూ4లో 5.7 శాతంగా ఆర్బీఐ అంచనా వేస్తోంది. 2024–25 మొదటి త్రైమాసికంలో వృద్ధిరేటు 6.6 శాతంగా ఉంటుందని భావిస్తోంది. ఏప్రిల్ నుంచి సెపె్టంబర్ వరకూ చూస్తే... రియల్ జీడీపీ విలువ రూ.76.22 లక్షల కోట్ల నుంచి రూ. 82.11 లక్షల కోట్లకు ఎగసింది. అంటే ఆరు నెలల్లో వృద్ధి రేటు 7.7 శాతంగా నమోదయ్యింది. క్యాలెండర్ ఇయర్ మూడు త్రైమాసికాల్లో వృద్ధి 7.1 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో ఏడీబీ తాజా అవుట్‌లుక్ అంశాలను పరిశీలిస్తే.. ► 2024–25లో ఎకానమీ 6.7 శాతం వృద్ధి సాధిస్తుందని భావిస్తున్నాం. ► తయారీ, మైనింగ్, నిర్మాణంసహా కీలక పారిశ్రామిక రంగం కూడా రెండంకెల వృద్ధిని సాధిస్తున్నట్లు ఆర్థిక గణాంకాలు సూచిస్తున్నాయి. ► వ్యవసాయ రంగం కొంత నెమ్మదించినా.. దీనిని పారిశ్రామిక రంగం భర్తీ చేసే అవకాశం ఉంది. ► ప్రైవేటు వినియోగ వ్యయాలు, ఎగుమతుల్లో కొంత బలహీనతలు ఉన్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యయాలు వ్యవస్థలో డిమాండ్ పెరుగుదలకు దోహదపడే అంశం. ► వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సగటును 5.5 శాతంగా కొనసాగవచ్చు. ఇది ఆర్బీఐ అంచనా 5.4 శాతం కంటే అధికం కావడం గమనార్హం. 2023, 2024 భారత్ ద్రవ్యోల్బణం లెక్కలు అంచనాల పరిధిలోనే ఉంటాయి. రెపో రేటు యథాతథ పరిస్థితి 2024 లో కూడా కొనసాగవచ్చు. ► పలు ఆగ్నేయాసియా ఆర్థిక వ్యవస్థలలో మహమ్మారి అనంతరం పరిస్థితులు మెరుగుపడినప్పటికీ, తిరిగి నిరాశాజనక పరిస్థితులు నెలకొంటున్నాయి. అధిక–ఆదాయ సాంకేతిక ఎగుమతిదారుల నుండి వస్తువుల ఎగుమతుల్లో స్థిరత్వమే తప్ప ప్రోత్సాహకరంగా లేవు. -
ఓఎన్జీసీ లాభం డౌన్
న్యూఢిల్లీ: ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జూలై–సెప్టెంబర్‌లో నికర లాభం 20 శాతం క్షీణించి రూ. 10,216 కోట్లకు పరిమితమైంది. గతేడాది (2022–23) ఇదే కాలంలో రూ. 12,826 కోట్ల నికర లాభం ఆర్జించింది. చమురు ఉత్పత్తితోపాటు ధరలు తగ్గడం ప్రభావం చూపింది. ఈ ఏడాది క్యూ1 (ఏప్రిల్–జూన్)లోనూ నికర లాభం 34 శాతం వెనకడుగు వేయడం గమనార్హం! కాగా.. ప్రతీ బ్యారల్ చమురుకు 84.84 డాలర్లు లభించగా.. గత క్యూ2లో 95.5 డాలర్లు సాధించింది. రష్యా–ఉక్రెయిన్ మధ్య తలెత్తిన యుద్ధం కారణంగా క్యూ1లో చమురు ధరలు పెరిగినప్పటికీ తిరిగి క్యూ2లో కొంతమేర నీరసించాయి. ఫలితాల నేపథ్యంలో ఓఎన్జీసీ షేరు 0.6% నీరసించి రూ. 196 వద్ద ముగిసింది. -
భారీ లాభాల్లో సెయిల్
న్యూఢిల్లీ: మెటల్ రంగ ప్రభుత్వ దిగ్గజం స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా(సెయిల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్‌లో నష్టాలను వీడి రూ. 1,306 కోట్ల నికర లాభం ఆర్జించింది. అమ్మకాలు పుంజుకోవడం ఇందుకు దోహదపడింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 329 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 26,642 కోట్ల నుంచి రూ. 29,858 కోట్లకు జంప్‌చేసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 27,201 కోట్ల నుంచి రూ. 27,769 కోట్లకు పెరిగాయి. కంపెనీ మొత్తం స్టీల్ ఉత్పాదక వార్షికం సామర్థ్యం 20 ఎంటీకాగా.. ఈ కాలంలో ముడిస్టీల్ ఉత్పత్తి 4.3 మిలియన్ టన్నుల నుంచి 4.8 ఎంటీకి బలపడింది. అమ్మకాలు 4.21 ఎంటీ నుంచి 4.77 ఎంటీకి ఎగశాయి. ఫలితాల నేపథ్యంలో సెయిల్ షేరు ఎన్ఎస్ఈలో 1 శాతం బలపడి రూ. 88 వద్ద ముగిసింది. -
భారత్ వృద్ధి అంచనాకు ఏడీబీ కోత
న్యూఢిల్లీ: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023 ఏప్రిల్–24మార్చి) జీడీపీ వృద్ధి రేటు తొలి అంచనాలను ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ స్వల్పంగా తగ్గించింది. 2023 ఏప్రిల్ అవుట్‌లుక్ 6.4 శాతం అంచనాలను తాజాగా 10 బేసిస్ పాయింట్లు తగ్గి స్తున్నట్లు తెలిపింది. దీనితో ఈ అంచనా 6.3 శాతానికి తగ్గినట్లయ్యింది. ఎగుమతుల్లో మందగమనం, తగిన వర్షపాతం లేక వ్యవసాయంపై ప్రభావం వంటి అంశాలు తమ అంచనాల కోతకు కారణ మని తన 2023 సెపె్టంబర్ అవుట్‌లుక్‌లో తెలిపింది. కాగా 2024–25 అంచనాలను 6.7 శాతంగా కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ప్రైవేటు పెట్టుబడులు, దేశీయ వినియోగం, ప్రభ్తువ మూలధన వ్యయాలు వృద్ధికి భరోసాను ఇస్తున్నట్లు తెలిపింది. 5.9 శాతం నుంచి 6.2 శాతానికి అప్: ఇండియా రేటింగ్స్ మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 5.9 శాతం వృద్ధి అంచనాలను 6.2 శాతానికి పెంచుతున్నట్లు ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ తన తాజా నివేదికలో పేర్కొంది. ప్రభుత్వ మూలధన పెట్టుబడులు పెరగడం, బ్యాంకులు, కార్పొరేట్ల మెరుగైన బ్యాలెన్స్ షీట్లు, గ్లోబల్ కమోడిటీ ధరలు తగ్గడం, ప్రైవేటు పెట్టుబడుల్లో ఉత్తేజం తన రేటింగ్ మెరుగుదలకు కారణమని ఈ మేరకు విడుదలైన ఒక నివేదికలో ఇండియా రేటింగ్స్ ప్రధాన ఎకనమిస్ట్ సునిల్ కుమార్ పేర్కొన్నారు. (రూ.400 కోట్లకు అలనాటి మేటి హీరో బంగ్లా అమ్మకం: దాని స్థానంలో భారీ టవర్?) మన ఎకానమీకి ఢోకా లేదు: అషీమా గోయెల్ ఇదిలావుండగా, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లోనూ భారత్ ఎకానమీ చక్కని పనితీరు ప్రదర్శిస్తోందని ఆర్బీఐ ద్రవ్య పరపతి విధన కమిటీ (ఎంపీసీ) సభ్యుల్లో ఒకరైన అషీమా గోయెల్ పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న పలు సంస్కరణాత్మక చర్చలు, ఆర్బీఐ విధానాలు దేశ ఎకానమీకి తగిన బాటన నడుపుతున్నట్లు వివరించారు. -
పేపర్ పరిశ్రమ ఆదాయంలో క్షీణత
న్యూఢిల్లీ: అమ్మకాలు పెరిగినప్పటికీ పేపర్ కంపెనీల ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023–24) 8–10 శాతం మేర క్షీణించొచ్చని ప్రమఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. తీవ్ర పోటీ కారణంగా నికర ప్రయోజనం తగ్గొచ్చని పేర్కొంది. క్రితం ఏడాది మాదిరే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం మీద అమ్మకాల పరిమాణం 5–7 శాతం మేర పెరుగుతుందని అంచనా వేసింది. నిర్వహణ మార్జిన్ ఆరోగ్యకరంగా 18–19 శాతం స్థాయిలో ఉండొచ్చని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం కంటే తక్కువే అయినా, కరోనా ముందున్న నాటి 17 శాతం కంటే ఎక్కువేనని వివరించింది. దీంతో స్థిరమైన నగదు ప్రవాహాలు ఉంటాయని తెలిపింది. 2022–23లో పేపర్ పరిశ్రమ రికార్డు స్థాయిలో 30 శాతం ఆదాయ వృద్ధిని చూడడం గమనార్హం. 87 పేపర్ కంపెనీలపై అధ్యయనం చేసి క్రిసిల్ ఈ నివేదికను విడుదల చేసింది. పేపర్ పరిశ్రమలో సగం ఆదాయం ఈ కంపెనీల చేతుల్లోనే ఉంది. ప్యాకేజింగ్ పేపర్ వాటా మొత్తం మార్కెట్లో 55 శాతంగా ఉంది. ఆ తర్వాత రైటింగ్, ప్రింటింగ్ (డబ్ల్యూపీ) పేపర్ వాటా 30 శాతంగా ఉంది. మిగిలినది న్యూస్ ప్రింట్, స్పెషాలిటీ పేపర్. ప్యాకేజింగ్ పేపర్‌ను ఫార్మాస్యూటికల్స్, ఈ కామర్స్ గూడ్స్, కన్జన్యూమర్ డ్యూరబుల్స్, ఎఫ్ఎంసీజీ, రెడీమేడ్ విభాగాలు ఉపయోగిస్తుంటాయి. విద్యా రంగం, కార్పొరేట్ రంగం డబ్ల్యూపీ పేపర్‌ను ఉపయోగిస్తుంటుంది. డిమాండ్ ఇలా.. ప్యాకేజింగ్ పేపర్ అమ్మకాల పరిమాణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6–8 శాతం మేర పెరగొచ్చని క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. ఫార్మా, ఎఫ్ఎంసీజీ పరిశ్రమ నుంచి డిమాండ్ ఇందుకు మద్దతుగా నిలుస్తుందని పేర్కొంది. డబ్ల్యూపీ పేపర్ అమ్మకాల పరిమాణం 3–5 శాతమేర పెరుగుతుందని అంచనా వేసింది. ప్రభుత్వం వ్యయాలకు తోడు, నూతన వి ద్యా విధానం ఇందుకు అనుకూలిస్తుందని తెలిపింది. అలాగే, 2024 సాధారణ ఎన్నికల ముందు డబ్ల్యూపీ పేపర్‌కు డిమాండ్ పెరుగుతుందని పేర్కొంది. -
పెరిగిన నియామకాలు
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకు నియామకాలు 23 శాతం పెరిగినట్టు క్వెస్‌కార్ప్ సంస్థ ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చనప్పుడు ఈ మేరకు వృద్ధి నమోదైనట్టు నియామక సేవలు అందించే ఈ సంస్థ తెలిపింది. రిటైల్, టెలికం రంగాలు నియామకాల్లో ముందున్నాయి. ఏప్రిల్–ఆగస్ట్ మధ్య మొత్తం 32,000 జాబ్లకు పోస్టింగ్‌లు పడినట్టు పేర్కొంది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ (బీఎఫ్ఎస్ఐ), రిటైల్, టెలికం రంగాలు జోరును చూపించాయి. ప్రొడక్షన్ ట్రైనీ, బ్రాంచ్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్, కలెక్షన్ ఆఫీసర్, బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్, బ్రాడ్‌బ్యాండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, వేర్‌హౌస్ అసోసియేట్, కస్టమర్ రిలేషన్ షిప్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎక్కువ నోటిఫికేషన్లు నమోదయ్యాయి. ‘‘పండుగల సీజన్‌కు వ్యాపార సంస్థలు సిద్ధమవుతున్నాయి. దీంతో హైరింగ్‌కు సానుకూల ధోరణి నెలకొంది. ద్రవ్యోల్బణం, లాభదాయకతపై ఒత్తిళ్లు నెలకొన్నప్పటికీ.. తయారీ, బీఎఫ్ఎస్ఐ, రిటైల్‌లో చెప్పుకోతగ్గ మేర నియామకాల్లో వృద్ధి నమోదైంది’’అని క్వెస్‌కార్ప్ ప్రెసిడెంట్ లోహిత్ భాటియా తెలిపారు. రిటైల్ పరిశ్రమలో తాత్కాలిక కారి్మకులకు డిమాండ్ 9 శాతం పెరిగినట్టు ఈ నివేదిక తెలిపింది. తన ప్లాట్‌ఫామ్‌పై నమోదైన జాబ్ పోస్టింగ్‌ల ఆధారంగా క్వెస్ కార్ప్ ఈ వివరాలు వెల్లడించింది. -
మారుతీ లాభం హైస్పీడ్
న్యూఢిల్లీ: కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా(ఎంఎస్ఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో కన్సాలిడేటెడ్ నికర లాభం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 2,525 కోట్లను తాకింది. పెద్ద కార్ల అమ్మకాలు ఊపందుకోవడం, మెరుగైన ధరలు, వ్యయ నియంత్రణలు, అధిక నిర్వహణేతర ఆదాయం ఇందుకు సహకరించాయి. గతేడాది(2022–23) ఇదే కాలంలో కేవలం రూ. 1,036 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 26,512 కోట్ల నుంచి రూ. 32,338 కోట్లకు జంప్‌చేసింది. కాగా.. మాతృ సంస్థ సుజుకీ మోటార్ కార్పొరేషన్(ఎస్ఎంసీ) నుంచి గుజరాత్‌లోని తయారీ ప్లాంటును సొంతం చేసుకోనున్నట్లు కంపెనీ వెల్లడించింది. తద్వారా క్లిష్టతను తగ్గిస్తూ ఒకే గొడుగుకిందకు తయారీ కార్యకలాపాలను తీసుకురానున్నట్లు తెలిపింది. కాంట్రాక్ట్ తయారీకి టాటా సుజుకీ మోటార్ గుజరాత్(ఎస్ఎంజీ)తో కాంట్రాక్ట్ తయారీ ఒప్పందం రద్దుకు బోర్డు అనుమతించినట్లు మారుతీ వెల్లడించింది. అంతేకాకుండా ఎస్ఎంసీ నుంచి ఎస్ఎంజీ షేర్లను సొంతం చేసుకోనున్నట్లు తెలిపింది. ఎస్ఎంసీకి పూర్తి అనుబంధ సంస్థ అయిన ఎస్ఎంజీ వార్షికంగా 7.5 లక్షల యూనిట్ల తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఉత్పత్తులను పూర్తిగా ఎంఎస్‌ఐకు సరఫరా చేస్తోంది. 2024 మార్చి31కల్లా లావాదేవీ పూర్తికాగలదని అంచనా వేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. 2030–31కల్లా 40 లక్షల వాహన తయారీ సామర్థ్యంవైపు కంపెనీ సాగుతున్నట్లు ఎంఎస్ఐ చైర్మన్ ఆర్సీ భార్గవ పేర్కొన్నారు. వచ్చే ఏడాది తొలి బ్యాటరీ వాహనాన్ని విడుదల చేయడంతో సహా.. వివిధ ప్రత్యామ్నాయ టెక్నాలజీలవైపు చూస్తున్నట్లు చెప్పారు. 6 శాతం అప్ క్యూ1లో మారుతీ అమ్మకాలు 6%పైగా పుంజుకుని 4,98,030 వాహనాలకు చేరాయి. వీటిలో దేశీయంగా 9 శాతం వృద్ధితో 4,34,812 యూనిట్లను తాకగా.. ఎగుమతులు మాత్రం 69,437 యూనిట్ల నుంచి తగ్గి 63,218 వాహనాలకు చేరాయి. ఫలితాల నేపథ్యంలో మారుతీ షేరు బీఎస్ఈలో 1.6 శాతం బలపడి రూ. 9,820 వద్ద ముగిసింది. -
ఆభరణాల మార్కెట్లో సంఘటిత రంగం పట్టు!
ముంబై: ఆభరణాల మార్కెట్లో సంఘటిత రంగం వాటా ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12–15 శాతం మేర పెరగొచ్చని పరిశ్రమ అంచనా వేస్తోంది. పెద్ద సంస్థలన్నీ విస్తరణ ప్రణాళికలతో ముందుకు వెళుతున్న విషయాన్ని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా గుర్తు చేసింది. దీంతో స్థూల ఆర్థిక సవాళ్లతో కూడిన వాతావరణంలోనూ సంఘటిత రంగం వాటా పెంచుకోగలదని ఇక్రా అంచనా వేస్తోంది. ఆభరణాల మార్కెట్ 2023–24లో విలువ పరంగా 8–10 శాతం వృద్ధిని నమోదు చేయవచ్చని తెలిపింది. బంగారం ధరల్లో అస్థిరతల నేపథ్యంలో పరిమాణాత్మకంగా మార్కెట్లో పెద్ద వృద్ధి నమోదు కాకపోవచ్చన్న అంచనాతో ఉంది. కాకపోతే బంగారానికి ఉన్న బలమైన సాంస్కృతిక అనుబంధం నేపథ్యంలో పండుగలు, వివాహాల సందర్భంగా బంగారం ఆభరణాలకు డిమాండ్ మద్దతుగా నిలుస్తుందని వివరించింది. ‘‘చాలా మంది జ్యుయలరీ రిటైలర్లు 2023 అక్షయ తృతీయ సందర్భంగా ఆదాయంలో 15 శాతానికి పైగా వృద్ధిని చూసినట్టు పేర్కొన్నారు. బంగారం ధరలు పెరగడం, ఎక్కువ సంస్థలు దూకుడుగా రిటైల్ స్టోర్లను పెంచడం ఆదాయ వృద్ధికి మద్దతునిస్తుంది’’అని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ కౌశిక్ దాస్ పేర్కొన్నారు. జ్యుయలర్ల ఆపరేటింగ్ మార్జిన్ సౌకర్య స్థాయిలో 7.5–8 శాతం మేర వచ్చే రెండేళ్లు ఉంటుందని ఇక్రా అంచనా వేసింది. -
ఎగుమతులు 900 బిలియన్ డాలర్ల పైనే..!
న్యూఢిల్లీ: భారత్ వస్తు, సేవల ఎగుమతులు ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023–24) 900 బిలియన్ డాలర్లను దాటే అవకాశం ఉందని ఎగుమతిదారులు అంచనావేస్తున్నారు. అమెరికాసహా కీలక ప్రపంచ మార్కెట్లలో దేశీయ వస్తువులకు పటిష్ట డిమాండ్, అలాగే వాణిజ్య ఒప్పందాల వల్ల కలిగే ప్రయోజనాలు ఇందుకు దోహదపడతాయన్నది వారి విశ్లేషణ. రష్యా వంటి ఇతర దేశాల్లో డిమాండ్ కూడా భారత్ ఎగుమతులకు దోహదపడే అంశమని వారు పేర్కొంటున్నారు. ఆయా దేశాలకు ముఖ్యంగా వ్యవసాయ, ఆహార ప్రాసెసింగ్ రంగాలలో భారీ ఎగుమతులకు అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. 2023–24లో 500 నుంచి 510 బిలియన్ డాలర్ల మేర వస్తు ఎగుమతులు జరిగే అవకాశం ఉందని భారత్ ఎగుమతి సంఘాల సమాఖ్య (ఎఫ్ఐఈఓ) పేర్కొంది. దీనితోపాటు సేవల ఎగుమతులు సైతం 2022–23తో పోల్చితే (322.72 బిలియన్ డాలర్లు) భారీగా 390 బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడింది. 2021–22లో భారత్ వస్తు ఎగుమతులు 422 బిలియన్ డాలర్లు ఉంటే, 2022–23లో 6 శాతం పెరిగి 447.5 బిలియన్ డాలర్లకు చేరిన సంగతి తెలిసిందే. అంచనాలు ఇలా... ► అంతర్జాతీయ వాణిజ్యంలో మన రూపాయికి కూడా తగిన స్థాయిని కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యం... ఎగుమతులకు సంబంధించి లావాదేవీల వ్యయాలను తగ్గిస్తుంది. ► పర్యాటకం, రవాణా, వైద్యం, ఆతిథ్యం సహా పలు రంగాలు గతేడాది వృద్ధికి దోహదం చేశాయి. ఐటీ, ఐటీ ఆధారిత సేవల ఎగుమతులు బలంగా సాగుతున్నాయి. యాత్రల రంగం త్వరలో వృద్ధి బాట పట్టనుంది. ► కరోనా అనంతర ఆర్థిక పునరుద్ధరణ విదేశీ మార్కెట్ల నుండి వస్తువులు, సేవలకు పెరుగు తున్న డిమాండ్‌ను సృష్టించింది. సరుకు రవాణా ఛార్జీల స్థిరీకరణ, సరఫరా వ్యవస్థ సాధారణీకరణ రవాణా రంగానికి సానుకూల పరిణామాలు. ► ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, లీగల్, అకౌంటింగ్ సేవలు, పరిశోధన, మేనేజ్మెంట్ కన్సల్టింగ్ వంటి వ్యాపార సేవలు ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా అందించిన అవకాశాలను సద్వినియో గం చేసుకోవడంలో ప్రయోజనం పొందుతాయి. ► ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో వృద్ధికి గణనీయమైన అవకాశం ఉంది. ఎగుమతి గమ్యస్థానాల వైవిధ్యం సంప్రదాయ మార్కెట్లపై ఆధారపడడాన్ని తగ్గించడానికి, ఎగుమతులకు కొత్త అవకాశాలను తెరవడానికి సాయపడుతుంది. ► ఎగుమతుల పురోగతే లక్ష్యంగా దేశం ఇటీవల ఆవిష్కరించిన విదేశీ వాణిజ్య పాలసీ (ఎఫ్టీపీ)ని భారత్‌ను ఈ రంగంలో వృద్ధి బాటన నడుపుతుంది. 2030 నాటికి దేశ ఎగుమతులను ఏకంగా 2 ట్రిలియన్ డాలర్లకు చేర్చడంతో పాటు రూపాయిని గ్లోబల్ కరెన్సీగా చేయాలని పాలసీ దోహదపడుతుందన్న విశ్వాసం ఉంది. ► వృద్ధి రేటును మరింత పెంచేందుకు కొన్ని ప్రో త్సాహకాలు అవసరం ఎంతైనా ఉంది. ప్రభు త్వం సరైన సహాయంతో గేమింగ్, ఎంటర్టైన్మెంట్లు చాలా బాగా పని చేస్తాయి. మిగిలిన రంగాలకూ తగిన సహాయ సహకారాలు అందాలి. ఎఫ్‌టీఏల దన్ను... వస్తు, సేవల ఎగుమతులు రెండూ కలిసి 2023–24లో విలువ 900 బిలియన్ డాలర్లుగా ఉండే వీలుంది. యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ), ఆస్ట్రేలియాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏ) ఆ మార్కెట్లలో ఎగుమతులను పెంచడానికి భారీ వేదికను అందిస్తాయి. ప్రొడక్షన్–లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కూడా భారత్ ఎగుమతులకు ప్రోత్సాహాన్ని అందిస్తుంది. ఎందుకంటే ప్రోత్సా హకాల కారణంగా దేశీయ ఉత్పత్తి పెరుగుతుంది. – అజయ్ సహాయ్, ఎఫ్ఐఈఓ డైరెక్టర్ జనరల్ ఆర్డర్ బుక్ పటిష్టం అమెరికా ఆర్థిక వృద్ధి పుంజుకుంటుందన్న సంకేతాలు ఉన్నాయి. భారత్ ఎగుమతుల్లో అమెరికా మార్కెట్ వాటా దాదాపు 18 శాతం. ఎగుమతులకు సంబంధించి ఆర్డర్ బుక్ బాగుంది. ఇదే ట్రెండ్ 2023–24 అంతా కొనసాగుతుందని భావిస్తున్నాం. దీనితో వస్తు ఎగుమతులు 500 బిలియన్ డాలర్లు దాటతాయని భావిస్తున్నాం. – ఎస్సి రాల్హాన్, హ్యాండ్ టూల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ యుద్ధ ప్రభావం తగ్గుతోంది 2022–23 కంటే 2023–24 ఆర్థిక సంవత్సరం ఎగుమతులుకు బాగుంటుందని భావిస్తున్నాం. మన పరిశ్రమపై రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం తగ్గిపోతోంది. ఎందుకంటే వాణిజ్యం–ఇంధన వనరులకు పరిశ్రమ ప్రత్యామ్నాయ మార్గాన్ని కనుగొన్నది. భారతదేశంలో మౌలిక సదుపాయాలలో గణనీయమైన మెరుగుదల ఉంది. అది ఎగుమతిదారులకు గట్టి మద్దతునిస్తుంది. – శారదా కుమార్ సరాఫ్, టెక్నోక్రాఫ్ట్ ఇండస్ట్రీస్ చైర్మన్ 2022–23కంటే బెటర్... గత ఆర్థిక సంవత్సరం కంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎగుమతులు పటిష్టంగా ఉంటాయని విశ్వసిస్తున్నాను. ముఖ్యంగా... కార్మికరంగం ఆవశ్యకత ఉన్న రంగాలు మంచి పనితనాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఇది ఎగుమతులకు దోహపదడే అంశాల్లో ఒకటి. – ఖలీద్ ఖాన్, జికో ట్రేడింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ -
గోద్రేజ్ క్యాపిటల్ రుణ వితరణ లక్ష్యం రెట్టింపు
ముంబై: గోద్రేజ్ గ్రూపులో భాగమైన ఆర్థిక సేవల సంస్థ గోద్రేజ్ క్యాపిటల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికి రుణ వితరణను రూ.12,000 కోట్లకు పెంచుకోవాలనే లక్ష్యంతో ఉన్నట్టు ప్రకటించింది. 2023 మార్చి నాటికి ఇది రూ.5,500 కోట్లుగా ఉండడం గమనార్హం. ఈ నాన్ బ్యాకింగ్ ఆర్థిక సేవల సంస్థ (ఎన్బీఎఫ్సీ) 2020 చివర్లో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీగా కార్యకలాపాలు ప్రారంభించింది. గోద్రేజ్ ప్రాపర్టీ కస్టమర్లకు రుణాలు సమకూర్చే లక్ష్యంతో మొదలు కాగా, తర్వాత ఎస్ఎంఈ, ఎంఎస్ఎంఈ రంగానికి కూడా రుణాలు ఇవ్వడం ఆరంభించింది. మార్చి చివరికి ఉన్న రూ.5,500 కోట్ల రుణాల్లో రూ.4,000 కోట్లు హోమ్ లోన్ విభాగానికి చెందినవి. ఇందులోనూ సగానికి పైగా (రూ.2వేల కోట్లకు పైన) గోద్రేజ్ ప్రాపర్టీస్ కస్టమర్లకు ఇచ్చినవే ఉన్నాయి. మిగిలిన చిన్న వ్యాపారస్థులకు ఇచ్చినవి కావడం గమనార్హం. తమ రెండు విభాగాల్లో (హౌసింగ్, ఎంఎస్ఎంఈ) నిరర్థక ఆస్తులు (ఎన్పీఏలు) సున్నాగా ఉన్నట్టు సంస్థ ఎండీ, సీఈవో మనీష్ షా తెలిపారు. మార్చి త్రైమాసికంలో ఎంఎస్ఎంఈ విభాగం కూడా లాభాల్లోకి అడుగు పెట్టినట్టు చెప్పారు. హోమ్‌లోన్ విభాగం గత ఆర్థిక సంవత్సరం మొత్తానికి లాభాల్లోనే ఉన్నట్టు తెలిపారు. ప్రమోటర్ల నుంచి రూ.1,200 కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రమోటర్లు రూ. 1,200 కోట్ల నిధులు సమకూర్చనున్నట్టు మనీష్ షా వెల్లడించారు. మొదటి విడత నిధులు ప్రస్తుత త్రైమాసికంలోనే రానున్నట్టు తెలిపారు. 2024 మార్చి చివరికి నిర్ధేశించుకున్న రూ.12వేల కోట్ల రుణ పుస్తకంలో రూ.7,000 కోట్లు ఎంఎస్ఈ/ఎంఎస్ఎంఈ నుంచి ఉంటాయని షా చెప్పారు. ఎంఎస్ఎంఈ కస్టమర్ల బేస్ ప్రస్తుతం 1,000గా ఉంటే, ఈ ఆర్థిక సంవత్సరం చివరికి పది రెట్లు పెంచుకోవాలన్న లక్ష్యంతో ఉన్నట్టు వెల్లడించారు. ‘‘యాజమాన్యం కార్యకలాపాలు ప్రారంభించిన మూడో ఏడాది రుణ పుస్తకం రూ.10,000 కోట్లను అధిగమించాలనే లక్ష్యాన్ని పెట్టింది. మేము దీన్ని చేరుకుంటామనే నమ్మకంతో ఉన్నాం. వచ్చే మూడేళ్లలో ఎంఎస్ఎంఈ/ఎస్ఎంఈ పుస్తకం రూ.30,000 కోట్లకు, 2028–29 చివరికి మొత్తం రుణ పుస్తకం రూ.50,000 కోట్లను అధిగమిస్తుంది’’అని చెప్పా రు. అప్పుడు కంపెనీని ప్రజల ముందుకు తీసుకెళ్లడాన్ని పరిశీలించొచ్చన్నారు. ఎంఎస్ఎంఈ/ఎస్ఎంఈలకు రుణ సేవల కోసం నిర్మన్ పేరుతో ప్రత్యేక డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను షా ప్రకటించారు. -
భారత్ వృద్ధి రేటు 5.9 శాతమే!
వాషింగ్టన్: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సంలో (2023–24) 5.9 శాతానికి పరిమితం అవుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) తాజాగా అంచనావేసింది. ఈ మేరకు క్రితం 6.1 శాతం అంచనాలకు 20 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గించింది. అయితే 5.9 శాతం వృద్ధి సాధించినప్పటికీ, ఇది ప్రపంచంలోనే వేగవంతమైన వృద్ధి రేటు కావడం గమనార్హం. సవాళ్లు ఉన్నప్పటికీ, భారత్ ఎకానమీ పటిష్ట పనితీరును కనబరుస్తుందని అభిప్రాయపడింది. కాగా, మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు అంచనాలను 6.8 శాతంగా ఐఎంఎఫ్ ప్రపంచ వార్షిక ఎకనమిక్ అవుట్‌లుక్ అంచనావేస్తోంది. 2024–25లో భారత్ వృద్ధి రేటు అంచనాలను సైతం క్రితం (జనవరిలో) 6.8 శాతం అంచనాల నుంచి అవుట్‌లుక్ 6.3 శాతానికి తగ్గించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అంచనాలకన్నా భారత్ వృద్ధికి సంబంధించి ఐఎంఎఫ్ అంచనాలు తక్కువగా ఉండడం గమనార్హం. 2022–23లో 7 శాతం, 2023–24లో 6.4 శాతం వృద్ధిని ఆర్బీఐ అంచనా వేస్తోంది. 2022–23 భారత్ జీడీపీ అధికారిక గణాంకాలు వెలువడాల్సి ఉంది. నివేదికలో మరికొన్ని అంశాలు చూస్తే... ► 2023లో చైనా వృద్ధి రేటు 5.2 శాతంగా ఉంటుంది. 2024లో ఈ రేటు 4.5 శాతానికి తగ్గుతుంది. అయితే 2022లో నమోదయిన 3 శాతం వృద్ధిరేటు కన్నా తాజా అంచనాలు అధికంగా ఉండడం గమనార్హం. ► మహమ్మారి, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం వల్ల ఎదురవుతున్న సవాళ్ల నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రికవరీ అవుతున్నట్లే కనబడుతోంది. చైనా పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. సరఫరాల సమస్యలు తొలుగుతున్నాయి. అయితే ఇప్పుడు ద్రవ్యోల్బణం కట్టడిలో భాగంగా సెంట్రల్ బ్యాంకులు అనుసరిస్తున్న కఠిన ద్రవ్య విధానమే వృద్ధికి ప్రతికూలతలు సృష్టించవచ్చు. ► ప్రపంచ ఆర్థిక వృద్ధి 2023లో 2.8 శాతంగా నమోదుకావచ్చు. 2024లో ఈ రేటు 3 శాతానికి పెరుగుతుందని అంచనావేస్తున్నాం. ► 2022లో 8.7 శాతంగా ఉన్న గ్లోబల్ ఇన్ఫ్లెషన్ (అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం) 2023లో 7 శాతానికి, 2024లో 4.9 శాతానికి తగ్గవచ్చు. ► యూరోజోన్, బ్రిటన్లు మందగమనం అంచన నిలబడ్డాయి. యూరోజోన్‌లో 2023లో కేవలం 0.8 శాతం వృద్ది నమోదయ్యే అవకాశం ఉంది. బ్రిటన్‌లో అసలు వృద్ధిలేకపోగా 0.3 శాతం క్షీణత నమోదుకావచ్చు. అయితే 2024లో ఈ రేట్లు వరుసగా 1.4 శాతం, 1 శాతం వృద్ధి బాటకు మళ్లవచ్చు. -
రెపో రేటు పెరగనుందా? .. నేటి నుంచి ఆర్బీఐ పాలసీ భేటీ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) తొలి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశం సోమవారం నుంచి ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు (3,5,6 తేదీల్లో... మహవీర్ జయంతి సందర్భంగా 4న సెలవు) జరగనున్న ఈ సమవేశాల్లో రెపో రేటును మరో పావుశాతం పెంపునకు నిర్ణయం తీసుకోవడం ఖాయమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇదే జరిగితే బ్యాంకులకు ఆర్బీఐ తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు 6.75 శాతానికి పెరగనుంది. పాలసీ సమీక్ష నిర్ణయాలు 6వ తేదీన వెలువడనున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడి, అంతర్జాతీయంగా క్రూడ్ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో దీర్ఘకాలంగా 4 శాతంగా ఉన్న రెపో రేటు, మే 4వ తేదీన మొదటిసారి 0.40 శాతం పెరిగింది. జూన్ 8, ఆగస్టు 5, సెప్టెంబర్ 30 తేదీల్లో అరశాతం చొప్పున పెరుగుతూ, 5.9 శాతానికి చేరింది. డిసెంబర్ 7న ఈ రేటు పెంపు 0.35 శాతం ఎగసి 6.25 శాతాన్ని తాకింది. ఫిబ్రవరి మొదట్లో జరిగిన ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపది విధానంలో వరుసగా ఆరవసారి (పావు శాతం) రేటు పెంపుతో మే నుంచి 2.5 శాతం రెపో రేటు పెరిగింది. ఈ రేటు 6.5 శాతానికి ఎగసింది. -
సూక్ష్మ రుణాల్లో 19 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: సూక్ష్మ రుణ సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) డిసెంబర్ త్రైమాసికంలో మంచి పనితీరు చూపించాయి. రుణ వితరణ 19 శాతం వృద్ధితో రూ.77,877 కోట్లుగా నమోదైంది. ఈ వివరాలను మైక్రో ఫైనాన్స్ ఇనిస్టిట్యూషన్స్ (ఎంఎఫ్ఐ) నెట్వర్క్ (ఎంఫిన్) విడుదల చేసిన మైక్రోమీటర్ నివేదిక తెలిపింది. సూక్ష్మ రుణ సంస్థల మొత్తం రుణ పోర్ట్‌ఫోలియో 2022 డిసెంబర్ చివరికి రూ.3.21 లక్షల కోట్లకు చేరుకుంది. 2021 డిసెంబర్ చివరికి ఉన్న రూ.2.56 లక్షల కోట్లతో పోలిస్తే 25 శాతం పెరిగింది. డిసెంబర్ త్రైమాసికంలో 189 లక్షల రుణాలను మంజూరు చేశాయి. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో 165 లక్షల రుణాలుగానే ఉంది. 2022 డిసెంబర్ నాటికి మొత్తం 6.4 కోట్ల ఖాతాదారులకు సంబంధించి 12.6 కోట్ల రుణ ఖాతాలకు సేవలు అందించాయి. 83 ఎన్బీఎఫ్సీ–ఎంఎఫ్ఐలు అత్యదికంగా 38.5 శాతం వాటాతో రూ.1,23,386 కోట్ల రుణ పోర్ట్‌ఫోలియో కలిగి ఉన్నాయి. డిసెంబర్ త్రైమాసికంలో ఎన్బీఎఫ్సీ–ఎంఫిన్‌లు రూ.15,951 కోట్ల నిధులు సమకూర్చుకున్నాయి. అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 22.5 శాతం ఎక్కువ. సూక్ష్మ రుణాల విషయంలో ఎన్బీఎఫ్సీ–ఎంఎఫ్ఐలకు అధిక వాటా ఉండగా, ఆ తర్వాత బ్యాంకులు సూక్ష్మ రుణాల పరంగా ఎక్కువ మార్కెట్‌ను కలిగి ఉన్నట్టు ఎంఎఫిన్ సీఈవో, డైరెక్టర్ అలోక్ మిశ్రా తెలిపారు. నియంత్రణల పరిధిలోని అన్ని సంస్థలు సూక్ష్మ రుణాల పరంగా మంచి వృద్ధిని నమోదు చేయడం ఆశావహమని ఎంఫిన్ నెట్వర్క్ తెలిపింది. బీహార్ అతిపెద్ద సూక్ష్మ రుణ మార్కెట్‌గా అవతరించింది. ఆ తర్వాత తమిళనాడు, పశ్చిమబెంగాల్ రెండు, మూడో స్థానాల్లో ఉన్నాయి. -
ఏడు శాతం కంటే తక్కువే.. మరింత తగ్గే అవకాశం
ముంబై: జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) తాజా అంచనా 7 శాతం కంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) వృద్ధి రేటు మరింత తగ్గే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్ తన తాజా అంచనాల్లో పేర్కొంది. చివరి త్రైమాసికంలో (జనవరి–మార్చి) వృద్ధి రేటు దాదాపు 4 శాతంగా ఉంటుందని కూడా పేర్కొంది. భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2022–23 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 13.2 శాతంగా నమోదుకాగా, రెండవ త్రైమాసికంలో 6.3 శాతంగా ఉంది. మూడవ తైమాసికంలో (అక్టోబర్-డిసెంబర్) ఈ రేటు అంచనాలకన్నా తగ్గి 4.4 శాతంగా నమోదయ్యింది. అయితే మొత్తం ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7 శాతం నమోదవుతుందని రెండవ ముందస్తు అంచనాల్లో ఎన్ఎస్ఓ పేర్కొంది. ఈ స్థాయి వృద్ధి రేటు నమోదుకావాలంటే నాల్గవ త్రైమాసికంలో కనీసం 4.1 శాతం వృద్ధి రేటు నమోదుకావాల్సి ఉంటుంది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కూడా 2022–23లో వృద్ధి రేటు 6.8 శాతంగానే అంచనావేస్తోంది. ఈ నేపథ్యంలో ఇండియా రేటింగ్స్ విశ్లేషకులు పరాస్ జస్రాయ్ చేసిన విశ్లేషణల్లో కొన్ని ముఖ్యాంశాలు.. ► వృద్ధి పురోగతికి పలు అవరోధాలు ఉన్నాయి. డిమాండ్ ఊపందుకోవడం లేదు. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో ఎగుమతుల్లో పురోగతి లేదు. రుణ వృద్ధి కఠిన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. ► ఇక ఉత్తరాదిలో వేసవి ఫిబ్రవరిలోనే తీవ్రంగా ఉంది. ఇది గోధుమ ఉత్పత్తిపై ఆందోళనలను సృష్టిస్తోంది. మార్చి– మే మధ్య వేసవి తీవ్రత మరింత ఉండే అవకాశం ఉందని వాతావారణ శాఖ హెచ్చరించడం కూడా ఇక్కడ పరిశీలనలోకి తీసుకోవాల్సిన అంశం. ► నాల్గవ త్రైమాసికంలో వ్యవసాయ రంగం వృద్ధి రేటు కనీసం 4.3 శాతం నమోదవుతుందన్న అంచనాలను వేసవి తీవ్రత విఘాతం కలిగించవచ్చు. ► ఇక ద్రవ్యోల్బణం తీవ్రత గ్రామీణ వినియోగ డిమాండ్‌పై ప్రభావితం చూపే వీలుంది. మహమ్మారి సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో పడిపోయిన డిమాండ్ ఇంకా నత్తనడకనే సాగుతోంది. ► మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) మిగుల్లో ఉంది. అయితే ఇప్పుడు మళ్లీ లిక్విడిటీ తగ్గుతుండడం మరో ఆందోళకరమైన అంశం. జనవరిలో బలమైన క్రెడిట్ డిమాండ్ కారణంగా బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ నాలుగు నెలల కనిష్టం 0.43 శాతానికి తగ్గింది. 2022 డిసెంబర్లో ఇది 0.53 శాతంగా ఉంది. -
క్యూ3లో మార్జిన్ల నేలచూపు
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో దేశీ కార్పొరేట్ల నిర్వహణ లాభ మార్జిన్లు మందగించనున్నట్లు రేటింగ్ దిగ్గజం ఇక్రా తాజాగా అంచనా వేసింది. ఇందుకు ద్రవ్యోల్బణం, ఇంధన వ్యయాలు కారణంకానున్నట్లు పేర్కొంది. వెరసి అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో వార్షిక ప్రాతిపదికన ఇబిటా మార్జిన్లు 2.37 శాతం క్షీణించి 16.3 శాతానికి పరిమితంకానున్నాయి. అయితే త్రైమాసికవారీగా అంటే జులై–సెప్టెంబర్(క్యూ2)తో పోల్చి చూస్తే 1.8 శాతం బలపడనున్నట్లు ఇక్రా రేటింగ్స్ అభిప్రాయపడింది. ఇందుకు ముడివ్యయాలు తగ్గడం, పలు కంపెనీలు ప్రొడక్టుల ధరలను పెంచడం దోహదపడనున్నట్లు తెలియజేసింది. త్రైమాసికవారీగా ముడివ్యయాలు నీరసించడంతోపాటు.. ఉత్పత్తుల విక్రయ ధరలు మెరుగుపడటంతో సమీప కాలంలో మార్జిన్లు బలపడనున్నట్లు వివరించింది. అయితే భౌగోళిక రాజకీయ ఆందోళనలు, ఆర్థిక మాంద్య భయాలు, ఫారెక్స్ హెచ్చుతగ్గుల కారణంగా రిస్కులు ఎదురుకావచ్చని పేర్కొంది. ఫైనాన్షియల్ మినహా.. ఫైనాన్షియల్ రంగ సంస్థలు మినహా ఇతర కంపెనీల ఆదాయం 17.2 శాతం పుంజుకోనున్నట్లు ఇక్రా అంచనా వేసింది. హోటళ్లు, చమురు గ్యాస్, ఆటో, ఎయిర్‌లైన్స్, విద్యుత్ రంగాలు ఆదాయ వృద్ధిలో ముందు నిలవనున్నట్లు తెలియజేసింది. త్రైమాసికవారీగా మాత్రం ఆదాయంలో 1.4 శాతమే వృద్ధి నమోదుకావచ్చని అభిప్రాయపడింది. ఇందుకు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, కన్జూమర్ సెంటిమెంట్లు ప్రభావం చూపనున్నట్లు తెలియజేసింది. ఇంధన వ్యయాల ద్రవ్యోల్బణం, అభివృద్ధి చెందిన దేశాలలో మాంద్య పరిస్థితులు, ఎగుమతి, దిగుమతి కంపెనీలపై విదేశీ మారక ఆటుపోట్లు వంటి అంశాలను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో దేశీ కార్పొరేట్ ఫలితాలు ఆధారపడి ఉంటాయని ఇక్రా నిపుణులు శ్రుతి థామస్ తెలియజేశారు. -
7 బిలియన్ డాలర్లకు ఆదాయం
బార్సిలోనా: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23)లో 7 బిలియన్ డాలర్ల ఆదాయం(రన్ రేటు)ను అందుకోగలమని ఐటీ సేవల దిగ్గజం టెక్ మహీంద్రా ఎండీ, సీఈవో సీపీ గుర్నానీ తాజాగా అభిప్రాయపడ్డారు. దీనిలో టెలికం విభాగం నుంచి 3 బిలియన్ డాలర్లు సమకూరగలదని అంచనా వేశారు. టెలికం కంపెనీలకు అందించే 5జీ సొల్యూషన్ల నుంచి ఇప్పటికే బిలియన్ డాలర్ల(రూ. 8,300 కోట్లు) రన్ రేటును సాధించినట్లు వెల్లడించారు. 6.6 బిలియన్ డాలర్ల రన్ రేటును అందుకున్న తాము త్వరలోనే 7 బిలియన్ డాలర్ల(సుమారురూ. 58,000 కోట్లు)కు చేరుకోగలమని తెలియజేశారు. ఇక్కడ జరుగుతున్న 2023 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ సందర్భంగా గుర్నానీ ఈ వివరాలు వెల్లడించారు. లాభం డౌన్ ఈ ఏడాది అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో టెక్ మహీంద్రా కన్సాలిడేటెడ్ నికర లాభం 5 శాతం నీరసించి రూ. 1,297 కోట్లకు పరిమితమైంది. అయితే ఆదాయం మాత్రం 20 శాతం ఎగసి రూ. 13,735 కోట్లకు చేరింది. అమెరికా ప్రాంతాల నుంచే ఆదాయంలో 50 శాతం లభిస్తున్నట్లు కంపెనీ సీఎంఈ బిజినెస్ ప్రెసిడెంట్, నెట్వర్క్ సర్వీసుల సీఈవో మనీష్ వ్యాస్ తెలియజేశారు. యూరప్ నుంచి 30 శాతం, మిగిలిన ప్రపంచ దేశాల నుంచి 20 శాతం చొప్పున టర్నోవర్ నమోదవుతున్నట్లు వివరించారు. ఆయా ప్రాంతాలలో పెట్టుబడులు చేపడుతున్న నేపథ్యంలో ఈ ట్రెండ్ కొనసాగనున్నట్లు అభిప్రాయపడ్డారు. ఫైబర్, ఫిక్స్డ్ వైర్లెస్.. తదితర టెలికం సంబంధ అన్ని విభాగాలలోనూ వృద్ధి నమోదుకానున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచ స్థూల ఆర్థిక పరిస్థితులు అనిశ్చితికి కారణమవుతున్నట్లు అభిప్రాయపడ్డారు. -
చమురు ధరలు తగ్గడం ఓఎంసీలకు అనుకూలం
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) మొత్తం మీద బలహీన ఆర్థిక ఫలితాలనే నమోదు చేస్తాయని మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గినప్పటికీ.. విక్రయ ధరలను చాలా కాలంగా నిలిపి ఉంచడం ఇందుకు కారణంగా పేర్కొంది. ఆర్థిక మందగమనం ఆందోళనలతో చమురు ధరలు అంతర్జాతీయంగా తగ్గడం వల్ల మూడు ప్రభుత్వరంగ సంస్థలైన ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో తిరిగి లాభాల బాట పడతాయని అంచనా వేసింది. ‘‘2022–23 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో నష్టాలు వచ్చినందున, పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఫలితాలు బలహీనంగానే ఉంటాయి. చమురు విక్రయ ధరలపై పరిమితి పెట్టినందున మొదటి ఆరు నెలల్లో, అంతర్జాతీయంగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అవి రేట్లను సవరించలేదు’’అని మూడీస్ పేర్కొంది. ఈ మూడు కంపెనీలు 2022 ఏప్రిల్ 6 నుంచి చమురు విక్రయ ధరలను సవరించకుండా, అవే ధరలను కొనసాగిస్తుండడం గమనార్హం. 2022 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా అవి ధరలను సవరించకపోవడం వల్ల, మొదటి ఆరు నెలలకు రూ.21,000 నష్టాలను ప్రకటించాయి. గోరుచుట్టుపై రోకటిపోటులా.. డాలర్ మారకంలో రూపాయి విలువ క్షీణించడం వీటి నష్టాలను మరింత పెంచిందని చెప్పుకోవాలి. ఇవి ముడి చమురును డాలర్ మారకంలోనే కొనుగోలు చేస్తుంటాయని మూడీస్ తెలిపింది. లాభాలు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలతో పోలిస్తే చమురు ధరలు తగ్గినందున, కొనుగోళ్ల వ్య యాలు తగ్గి లాభదాయక వచ్చే కొన్ని నెలల్లో మెరుగుపడుతుందని మూడీస్ అంచనా వేసింది. రష్యా నుంచి చౌకగా ముడి చమురు కొనుగోలు చేయడం ఈ మూడు ప్రభుత్వరంగ సంస్థలకు కలిసొస్తుందని పేర్కొంది. బ్రెంట్ క్రూడ్ కంటే రష్యా చమురు త క్కువ ధరకు వస్తుండడాన్ని ప్రస్తావించింది. అయినప్పటికీ వచ్చే 12నెలల్లో చమురు ధరలు అస్థిరతల మధ్యే చలించే అవకాశం ఉంటుందని అంచనా వేసింది. ఉక్రెయిన్‌పై యుద్ధం తీవ్రతరమైనా లేక చైనా ఆర్థిక వ్యవస్థ పుంజుకున్నా అది అంతర్జాతీయంగా ధరల పెరుగుదలకు దారితీస్తుందని, అదే జరిగితే ఆయిల్ కంపెనీల లాభాలు పరిమితం కావొచ్చని పేర్కొంది. రుణ పరిస్థితుల్లో మెరుగు.. ‘‘లాభాలు పెరిగితే రుణ భారం తగ్గుతుంది. మూ లధన అవసరాలకు నిధుల వెసులుబాటు లభిస్తుంది. 2022 మార్చి నుంచి సెప్టెంబర్ మధ్య నష్టాలను అదనపు రుణాలు తీసుకుని ఇవి సర్దుబాటు చేసుకున్నాయి. దీంతో వాటి రుణ భారం పెరిగింది’’అని మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ పే ర్కొంది. పెరిగే ధరలకు అనుగుణంగా మూలధన అవసరాలు కూడా పెరుగుతాయని, ఫలితంగా కంపెనీల రుణ కొలమానాలు బలహీనంగా ఉంటా యని పేర్కొంది. నియంత్రణపరమైన అనిశ్చితి కూ డా వాటి రుణ నాణ్యతను ప్రభావితం చేస్తుందని తెలిపింది. ‘‘భారత్‌లో చమురు ధరల పరంగా స్ప ష్టత లోపించింది. రిఫైనింగ్, మార్కెటింగ్ కంపెనీలకు ఇది క్రెడిట్ నెగెటివ్. చమురు ధరలపై నియంత్రణలతో కంపెనీల నష్టాలు కొనసాగుతా యి. వాటిని ప్రభుత్వం సకాలంలో సర్దుబాటు చే యకపోతే వాటి క్రెడిట్ నాణ్యత కూడా బలహీనపడుతుంది’’ ఈని మూడిస్ నివేదిక హెచ్చరించింది. కాకపోతే ప్రభుత్వం నుంచి మద్దతు దృష్ట్యా ఈ కంపెనీల తుది రేటింగ్‌ల్లో ఏ మాత్రం మార్పు ఉండదని స్పష్టం చేసింది. రేట్లపై స్వేచ్ఛ లభిస్తేనే.. చమురు రిఫైనింగ్, మార్కెటింగ్ కంపెనీలు అంతర్జాతీయ రేట్లకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ విక్రయ రేట్లను సవరించుకునే స్వేచ్ఛ కల్పించినప్పుడే వాటి మార్జిన్లు తిరిగి సాధారణ స్థాయికి చేరుకుంటాయని మూడీస్ తెలిపింది. అయితే ఇది 2024 సాధారణ ఎన్నికల తర్వాతే సాధ్యపడుతుందని అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలతో పోలిస్తే ఇటీవల అంతర్జాతీయంగా రేట్లు తగ్గడం కంపెనీలకు సానుకూలిస్తుందని పేర్కొంది. ఇప్పుడున్న స్థాయిలోనే కొనసాగతే వచ్చే కొన్ని నెలల్లో కంపెనీల లాభదాయకత పెరుగుతుందని మూడీస్ తెలిపింది. ‘‘2022–23లో సెప్టెంబర్ 30 నాటికి సగటున చమురు ధర బ్యారెల్ 105 డాలర్లుగా ఉంది. అక్కడి నుంచి డిసెంబర్ 31 నాటికి 16 శాతం తగ్గి బ్యారెల్ 89 డాలర్లకు దిగొచ్చింది’’ అని పేర్కొంది. -
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తగ్గుముఖం
న్యూఢిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో 14 శాతం తగ్గాయి. ఈ కాలంలో 26.9 బిలియన్ డాలర్ల (రూ.2.2 లక్షల కోట్లు) ఎఫ్‌డీఐ మన దేశంలోకి వచ్చినట్టు పారిశ్రామిక ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 31.15 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనించాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో సింగపూర్ నుంచి 10 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐ వచ్చింది. ఆ తర్వాత మారిషస్ 3.32 బిలియన్ డాలర్లు, యూఏఈ 2.95 బిలియన్ డాలర్లు, యూఎస్ఏ 2.6 బిలియన్ డాలర్లు, నెదర్లాండ్స్ 1.76 బిలియన్ డాలర్లు, జపాన్ నుంచి 1.18 బిలియన్ డాలర్ల చొప్పున ఎఫ్‌డీఐ మన దేశంలోకి వచ్చింది. కంప్యూటర్ సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ రంగం అత్యధికంగా 6.3 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐని ఆకర్షించింది. ఆ తర్వాత సేవల రంగ కంపెనీల్లోకి 4.16 బిలియన్ డాలర్లు రాగా, ట్రేడింగ్ 3.28 బిలియన్ డాలర్లు, కెమికల్స్ 1.3 బిలియన్ డాలర్లు, ఆటోమొబైల్ పరిశ్రమ 932 మిలియన్ డాలర్లు, నిర్మాణ రంగం 990 మిలియన్ డాలర్ల చొప్పున ఎఫ్‌డీఐని రాబట్టాయి. -
వేదాంతా లాభం అప్
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 5 శాతం పుంజుకుని రూ. 4,421 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 4,224 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా రూ. 29,151 కోట్ల నుంచి రూ. 39,355 కోట్లకు జంప్‌చేసింది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 21,751 కోట్ల నుంచి రూ. 32,095 కోట్లకు ఎగశాయి. ఫైనాన్స్ వ్యయాలు స్వల్పంగా 2 శాతం పెరిగి రూ. 1,206 కోట్లకు చేరగా.. రూ. 8,031 కోట్లమేర స్థూల రుణాలు జత కలిశాయి. దీంతో మొత్తం రుణ భారం రూ. 61,140 కోట్లను తాకింది. కాగా, భాగస్వామ్య నియంత్రణా సంస్థలను కూడా కలుపుకుంటే ప్రస్తుత సమీక్షా కాలంలో మొత్తం నికర లాభం 6 శాతం మెరుగుపడి రూ. 5,592 కోట్లుగా నమోదైంది. స్టెరిలైట్ యూనిట్‌కు బిడ్స్ తమిళనాడులోని తూత్తుకుడిలోని స్టెరిలైట్ కాపర్ యూనిట్ కొనుగోలుకి పలు సంస్థల నుంచి బిడ్స్ దాఖలైనట్లు వేదాంతా రీసోర్సెస్ తాజాగా వెల్లడించింది. తమిళనాడు రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు అభ్యంతరాల నేపథ్యంలో 2018 నుంచి మూతపడిన స్టెరిలైట్ కాపర్ స్మెల్టింగ్ ప్లాంటును వేదాంతా అమ్మకానికి పెట్టింది. ఫలితాల నేపథ్యంలో వేదాంతా షేరు బీఎస్ఈలో 1 శాతం బలపడి రూ. 245 వద్ద ముగిసింది. -
విప్రో లాభం జూమ్
న్యూఢిల్లీ: ఐటీ సరీ్వసుల దేశీ దిగ్గజం విప్రో లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేడెట్ ప్రాతిపదికన క్యూ2(జులై–సెపె్టంబర్)లో నికర లాభం 17 శాతం ఎగసి రూ. 2,931 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 2,484 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా 30 శాతం జంప్‌చేసి రూ. 19,667 కోట్లను అధిగమించింది. గత క్యూ2లో రూ. 15,115 ఆదాయం సాధించింది. వార్షిక ఆదాయ రన్‌రేటు 10 బిలియన్ డాలర్ల(రూ. 75,300 కోట్లు)ను అధిగమించినట్లు ఫలితాల విడుదల సందర్భంగా విప్రో వెల్లడించింది. దేశీయంగా వ్యాక్సినేషన్ పూర్తయిన సీనియర్ ఉద్యోగులను దశలవారీగా కార్యాలయాలకు వచ్చి పనిచేసేందుకు వీలు కలి్పంచనున్నట్లు తెలియజేసింది. అంచనాలు ఇవీ ఈ ఏడాది క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో ఐటీ సరీ్వసుల ఆదాయం రూ. 19,500–19,889 కోట్ల మధ్య నమోదుకాగలదని విప్రో తాజాగా అంచనా వేసింది. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో వార్షిక ఆర్డర్‌బుక్ 28 శాతం జంప్‌చేసింది. దీంతో మొత్తం ఆర్డర్‌బుక్ విలువ 19 శాతం బలపడి 27 బిలియన్ డాలర్ల(రూ. 2 లక్షల కోట్లు)ను తాకింది. దీనిలో క్లౌడ్ కంప్యూటింగ్ విభాగం వాటా 8 బిలియన్ డాలర్లు(రూ. 60,000 కోట్లు)గా విప్రో వెల్లడించింది. ఆదాయంలో అమెరికా, యూరప్‌ల వాటా అత్యధికంకాగా.. బీఎఫ్ఎస్ఐ విభాగం 35 శాతం పురోగమించింది. ఇతర హైలైట్స్ ► ఐటీ విభాగం ఆదాయం 29.5 శాతం జంప్‌చేసి రూ. 19,378 కోట్ల(258 కోట్ల డాలర్లు)ను తాకింది. ► క్యూ2లో 8,100 మంది ఫ్రెషర్స్‌ను ఉద్యోగాల్లోకితీసుకుంది. ► వచ్చే ఆర్థిక సంవత్సరం(2022–23)లో 25,000 మంది ఫ్రెషర్స్‌కు కొత్తగా ఉపాధి కల్పించనుంది. ► క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో త్రైమాసికవారీగా ఆదాయంలో 2–4 శాతం వృద్ధిని అంచనా వేస్తోంది. ► కరెన్సీ నిలకడ ప్రాతిపదికన వార్షికంగా చూస్తే ఇది 27–30 శాతం పురోగతికి సమానమని విప్రో పేర్కొంది. క్యూ2 ఫలితాల విడుదల నేపథ్యంలో విప్రో షేరు ఎన్ఎస్ఈలో 2 శాతం బలపడి రూ. 672 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 656– 675 మధ్య ఊగిసలాడింది. వ్యూహాలు పనిచేస్తున్నాయ్ మా బిజినెస్ వ్యూహాలు సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు క్యూ2 ఫలితాలు వెల్లడిస్తున్నాయి. త్రైమాసికవారీగా చూస్తే వరుసగా రెండో క్వార్టర్లో 4.5 శాతం సొంత వృద్ధిని సాధిం చాం. వార్షిక ప్రాతిపదికన తొలి అర్ధభాగంలో 28 శాతం పురోగతిని చూపాం. ఈ సందర్భంగా మా కస్టమర్లు, భాగస్వాములు, సహోద్యోగులకు కృతజ్ఞతలు. – థియరీ డెలాపోర్ట్, సీఈవో, ఎండీ, విప్రో -
కోల్ ఇండియా లాభం రూ. 3,170 కోట్లు
న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజం కోల్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 52 శాతం జంప్‌చేసి రూ. 3,170 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 2,080 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 18,487 కోట్ల నుంచి రూ. 25,282 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 16,471 కోట్ల నుంచి రూ. 21,626 కోట్లకు పెరిగాయి. క్యూ1లో బొగ్గు ఉత్పత్తి 121.04 మిలియన్ టన్నుల నుంచి దాదాపు 124 ఎంటీకి బలపడింది. ముడిబొగ్గు అమ్మకాలు 120.80 ఎంటీ నుంచి 160.44 ఎంటీకి పెరిగాయి. రానున్న మూడేళ్లలో రూ. 1.22 లక్షల కోట్ల పెట్టుబడులను వెచ్చించనుంది. బొగ్గు వెలికితీత, తరలింపు, ప్రాజెక్ట్ డెవలప్మెంట్, శుద్ధ ఇంధన సాంకేతికతలు తదితరాలకు ఈ నిధులను వెచ్చించనుంది. తద్వారా 2023–24కల్లా 100 కోట్ల టన్నుల కోల్ ఉత్పత్తిని సాధించాలని ప్రణాళికలు వేసింది. ఫలితాల నేపథ్యంలో కోల్ ఇండియా షేరు ఎన్ఎస్ఈలో 0.7 శాతం నీరసించి రూ. 142 వద్ద ముగిసింది. -
ముత్తూట్ ఫైనాన్స్ లాభం అప్
కొచ్చి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో ముత్తూట్ ఫైనాన్స్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 14 శాతం ఎగసి రూ. 979 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 858 కోట్లు మాత్రమే ఆర్జించింది. గోల్డ్‌లోన్ విభాగం నికర లాభం 16 శాతం వృద్ధితో రూ. 971 కోట్లను తాకింది. నిర్వహణలోని స్థూల రుణ ఆస్తులు(ఏయూఎం) 25 శాతం బలపడి రూ. 58,135 కోట్లకు చేరాయి. మొత్తం ఆదాయం సైతం 14 శాతం పుంజుకుని రూ. 2,963 కోట్లకు చేరింది.