స్టాక్స్‌లో ఈ ఏడాది రూ. 1.3 లక్షల కోట్లు
జూన్‌కల్లా రూ. 15 లక్షల కోట్లకు పెట్టుబడులు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024 –25) దేశీ స్టాక్ మార్కెట్‌లో బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్‌ఐసీ భారీగా ఇన్వెస్ట్ చేయనుంది. రూ. 1.3 లక్షల కోట్లను స్టాక్స్‌లో సరికొత్తగా ఇన్వెస్ట్ చేయనున్నట్లు సంస్థ ఎండీ, సీఈవో సిద్ధార్థ మొహంతీ వెల్లడించారు. ఇప్పటికే ఈ ఏడాది తొలి త్రైమాసికం(ఏప్రిల్–జూన్)లో రూ. 38,000 కోట్ల పెట్టుబడులు కుమ్మరించింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 23,300 కోట్ల విలువైన పెట్టుబడులు చేపట్టింది.
కాగా.. ఈ క్యూ1లో ఎల్‌ఐసీ ఈక్విటీ మార్కెట్ పెట్టుబడులపై రూ. 15,500 కోట్ల లాభం ఆర్జించింది. ఇవి గతేడాది క్యూ4(జనవరి–మార్చి)తో పోలిస్తే 13.5 శాతం అధికంకావడం గమనార్హం. స్టాక్ మార్కెట్ కదలికలు, ధరల్లో మార్పులను నిశితంగా పరిశీలిస్తూ పెట్టుబడి అవకాశాలను వినియోగించుకుంటామని మొహంతీ తెలియజేశారు. కనీసం గతేడాది(రూ. 1.32 లక్షల కోట్లు) స్థాయిలో ఈ ఏడాది పెట్టుబడులను వెచి్చంచనున్నట్లు పేర్కొన్నారు. ఈ జూన్ చివరికల్లా స్టాక్స్‌లో ఎల్‌ఐసీ పెట్టుబడుల విలువ రూ. 15 లక్షల కోట్లకు చేరినట్లు వెల్లడించారు. బీమా దిగ్గజం మొత్తం 282 కంపెనీలలో ఇన్వెస్ట్ చేసింది.
ఏఎంసీ జూమ్: జూన్‌కల్లా ఎల్‌ఐసీ నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) 16 శాతంపైగా ఎగసి రూ. 53,58,781 కోట్లను తాకాయి. గత క్యూ1కు ఇవి రూ. 46,11,067 కోట్లు.
క్యూ1 తీరిలా: క్యూ1లో ఎల్‌ఐసీ లాభం 10% వృద్ధితో రూ. 10,461 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం రూ. 1,88,749 కోట్ల నుంచి రూ. 2,10,910 కోట్లకు పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment