Satpal Bhanu to take charge as Managing Director of LIC; Details - Sakshi
Sakshi News home page

ఎల్‌ఐసీ ఎండీగా సత్పాల్‌ భాను

Published Thu, Jul 20 2023 7:15 AM | Last Updated on Thu, Jul 20 2023 8:51 AM

Satpal Bhanu MD of LIC details - Sakshi

న్యూఢిల్లీ: లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) మేనేజింగ్‌ డైరెక్టర్లలో ఒకరిగా సత్పాల్‌ భానూను ప్రభుత్వం నియమించింది. ఏప్రిల్‌లో ఎల్‌ఐసీ చైర్మన్‌గా నియమితులైన సిద్ధార్థ మొహంతి స్థానంలో సత్పాల్‌ భాను నియమితులయ్యారు. ఆయన బాధ్యతలను చేపట్టిన నాటి నుంచీ ఈ నియామకం వర్తిస్తుంది.

2025 డిసెంబర్‌ 31న పదవీ విరమణ వరకూ లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు (ఏది ముందైతే అది) భాను బాధ్యతల్లో కొనసాగుతారని ఎల్‌ఐసీ ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement