న్యూఢిల్లీ: జీవిత బీమా దిగ్గజం ఎల్‌ఐసీ ఈ నెలలో అంతర్జాతీయంగా రోడ్‌షోలు నిర్వహించనుంది. హాంకాంగ్, బ్రిటన్ దేశాల్లో జూన్ 25 నుంచి 29 మధ్యలో వీటిని చేపట్టనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎల్‌ఐసీ గురించి ఇన్వెస్టర్లలో అవగాహన కల్పించేందుకు వీటిని ఉద్దేశించినట్లు వివరించాయి. ఈ సందర్భంగా ఎల్‌ఐసీ టాప్ మేనేజ్‌మెంట్.. అంతర్జాతీయ ఇన్వెస్టర్లతో సమావేశం కానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
(ఇదీ చదవండి: 2025లో జాగ్వార్ కొత్త ఎలక్ట్రిక్ మోడల్స్)
సంస్థ వృద్ధి అవకాశాలను వివరించి, షేర్లలో ఇన్వెస్ట్ చేసేందుకు ప్రయత్నించనున్నట్లు వివరించాయి. ఎల్‌ఐసీ షేర్లు లిస్ట్ అయ్యి ఏడాది పూర్తయ్యింది. ఐపీవో కింద ఎల్‌ఐసీలో 3.5 శాతం వాటాల విక్రయం ద్వా రా కేంద్రం గతేడాది రూ. 20,557 కోట్లు సమీకరించింది. ఇష్యూ ధర షేరు ఒక్కింటికి రూ. 949 కాగా మే 17న సుమారు 9 శాతం డిస్కౌంటుకు రూ. 867 వద్ద కంపెనీ షేర్లు లిస్టయ్యా యి. ఐపీవో ఇష్యూ ధరతో పోలిస్తే ప్రస్తుతం 40 శాతం తక్కువగా రూ. 602 వద్ద ట్రేడవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment