![LIC whatsapp Services Step by Step guidance - Sakshi](/styles/webp/s3/article_images/2023/05/28/lic-whatsapp-services.jpg.webp?itok=DqPZWG2w)
LIC WhatsApp Service: ఆధునిక కాలంలో చాలా మందికి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) పాలసీలు ఉంటాయి. అయితే మనకు ఇందులో ఏదైనా సందేహం వచ్చినా, సమస్య వచ్చిన నేరుగా సంబంధిత కార్యాలయానికి వెళ్లి పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. అయితే సంస్థ ఇప్పుడు తమ పాలసీదారుల కోసం వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సర్వీసుని ఎలా ఉపయోగించుకోవాలి, ఈ సర్వీసుల గురించి తెలుసుకోవచ్చు అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఎల్ఐసి కంపెనీ ప్రవేశపెట్టిన వాట్సాప్ సర్వీసు ద్వారా లోన్ ఎలిజిబిలిటీ, రీపేమెంట్ ఎస్టిమేట్, ప్రీమియం డ్యూ డేట్స్ వంటి వాటితో పాటు బోనస్ ఇన్ఫర్మషన్, లోన్ ఎలిజిబిలిటీ కొటేషన్, ఎల్ఐసి సర్వీస్ లింక్స్, పాలసీ స్టేటస్ గురించి తెలుసుకోవచ్చు. ఇది చాలా సులభమైన ప్రక్రియ.
(ఇదీ చదవండి: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి మరో నాలుగు బైకులు - ప్రత్యర్థుల పని అయిపోయినట్టేనా?)
ఎల్ఐసి వాట్సాప్ సర్వీస్ ఉపయోగించుకోవడమెలా?
- మీ స్మార్ట్‌ఫోన్‌లో 8976862090 అనే నెంబర్‌కి 'హాయ్' అని మెసేజ్ చేయాలి.
- తరువాత మీకు 11 ఆప్షన్ కనిపిస్తాయి. అందులో మీరు దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో దానిని సెలక్ట్ చేసుకోవాలి.
- మీరు ఎంచుకునే ఆప్షన్‌ని బట్టి రిప్లై వస్తుంది.
- వాట్సాప్ చాట్‌లోనే మీకు అవసరమైన వివరాలను ఎల్ఐసి షేర్ చేస్తుంది
Comments
Please login to add a commentAdd a comment