న్యూఢిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో 14 శాతం తగ్గాయి. ఈ కాలంలో 26.9 బిలియన్ డాలర్ల (రూ.2.2 లక్షల కోట్లు) ఎఫ్‌డీఐ మన దేశంలోకి వచ్చినట్టు పారిశ్రామిక ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 31.15 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనించాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో సింగపూర్ నుంచి 10 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐ వచ్చింది.
ఆ తర్వాత మారిషస్ 3.32 బిలియన్ డాలర్లు, యూఏఈ 2.95 బిలియన్ డాలర్లు, యూఎస్‌ఏ 2.6 బిలియన్ డాలర్లు, నెదర్లాండ్స్ 1.76 బిలియన్ డాలర్లు, జపాన్ నుంచి 1.18 బిలియన్ డాలర్ల చొప్పున ఎఫ్‌డీఐ మన దేశంలోకి వచ్చింది. కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ రంగం అత్యధికంగా 6.3 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐని ఆకర్షించింది. ఆ తర్వాత సేవల రంగ కంపెనీల్లోకి 4.16 బిలియన్ డాలర్లు రాగా, ట్రేడింగ్ 3.28 బిలియన్ డాలర్లు, కెమికల్స్ 1.3 బిలియన్ డాలర్లు, ఆటోమొబైల్ పరిశ్రమ 932 మిలియన్ డాలర్లు, నిర్మాణ రంగం 990 మిలియన్ డాలర్ల చొప్పున ఎఫ్‌డీఐని రాబట్టాయి.
Comments
Please login to add a commentAdd a comment