నిర్వహణ లాభం 22 శాతం
2024–25 సంవత్సరంపై ఇక్రా అంచనా
ఈ రంగానికి స్థిరమైన అవుట్‌లుక్
న్యూఢిల్లీ: భారత ఐటీ రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024–25) 4 నుంచి 6 % మద్య ఆదాయంలో వృద్ధిని నమోదు చేయవచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. స్థూల ఆర్థిక సవాళ్ల నేపథ్యంలో యూఎస్, యూరప్ లోని క్లయింట్లు టెక్నాలజీలపై వ్యయా లు తగ్గించుకోవడాన్ని కారణంగా పేర్కొంది. ఆదా యం పరంగా సవాళ్లు ఉన్నప్పటికీ నిర్వహణ మార్జిన్లు మెరుగ్గా 22% మేర ఉంటాయని తెలి పింది. అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలస) గణనీయంగా తగ్గి, సమీప కాలంలో స్థిరపడొ చ్చని అంచనా వేసింది.
మెరుగైన నగదు ప్రవాహాలు, బలమైన బ్యాలన్స్ షీట్లను పరిగణనలోకి తీసుకుని ఐటీ పరిశ్రమకు స్థిరమైన అవుట్‌లుక్ ఇచి్చంది. అధిక ద్రవ్యోల్బణం, వడ్డీ వ్య యాలు కీలక రంగాల్లోని క్లయింట్లపై ఒత్తిళ్లకు దారితీశాయని, ఫలితంగా వ్యయాలని యంత్రణ, విచక్షణారహిత వ్యయాలను క్లయింట్లు వాయిదా వేసుకోవడాన్ని ప్రస్తావించింది. ఆర్డ ర్లు రాక తగ్గుముఖం పట్టినప్పటికీ.. ఐటీ కంపెనీలకు ఆర్డర్, డీల్స్ పైపులైన్ బలంగానే ఉ న్నట్టు ఇక్రా తెలిపింది. ఒక్కసారి ఆర్థిక పరిస్థితులు కుదుటపడితే మధ్యకాలానికి ఐటీ కంపెనీల్లో వృద్ధి మళ్లీ పుంజుకుంటుందని ఇక్రా కార్పొరేట్ రేటింగ్స్ హెడ్ దీపక్ జోత్వాని పేర్కొన్నారు.
కీలక మార్కెట్లో రికవరీ కీలకం..
దేశ ఐటీ కంపెనీల ఆదాయం గడిచిన ఐదారు త్రైమాసికాలుగా పెద్ద వృద్ధిని చూడకపోవడం గమనార్హం. ఇక్రా ఎంపిక చేసిన 15 పెద్ద, మధ్యస్థాయి లిస్టెడ్ ఐటీ కంపెనీలు 2023–24లో డాలర్ పరంగా కేవలం 5.5 శాతం వృద్ధినే నమోదు చేశాయి. 2022–23లో ఇది 9.2 శాతంగా ఉంది. అయినప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీల నిర్వహణ మార్జిన్లు 22 శాతంగా ఉంటాయని ఇక్రా అంచనా వేస్తోంది.
దేశ ఐటీ కంపెనీలకు సింహభాగం ఆదాయం యూఎస్ నుంచి వస్తుంటే, ఆ తర్వాత యూరప్, మిగిలిన ప్రపంచ మార్కెట్ల (ఆర్‌వోడబ్ల్యూ) నుంచి వస్తోంది. ఇక్రా ఎంపిక చేసిన ఐటీ కంపెనీల ఆదాయంలో 55–60 శాతం మేర ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలోయూఎస్ నుంచే వచ్చింది. యూరప్ నుంచి 22–25 శాతం సమకూరింది. స్థూల ఆర్థిక అనిశి్చతుల ప్రభావం పరిశ్రమపై ఇక మీదట ఉండొచ్చని, కీలక మార్కెట్లలో నియంత్రణపరమైన తీవ్ర మార్పులు చోటు చేసుకుంటే అది ప్రతికూల ప్రభావం కొనసాగేలా చేయొచ్చని పేర్కొంది.
జెనరేషన్ ఏఐ మధ్య కాలంలో ఐటీ పరిశ్రమ వృద్ధికి కీలకమని.. ప్రముఖ ఐటీ కంపెనీలు తమ సిబ్బందికి ఇందులో శిక్షణ ఇప్పించి, సేవల పరంగా తమ సామర్థ్యాలను పెంచుకున్నట్టు ఇక్రా తన నివేదికలో వివరించింది. జెనరేషన్ ఏఐ పరంగా ఆర్డర్‌బుక్ లేదా ఆదాయం ఇప్పటి వరకు పరిమితంగా ఉండగా, మధ్య కాలానికి పుంజుకోవచ్చని అంచనా వేసింది. డిమాండ్ మోస్తరుగా ఉండడం, 2022–23లో అధికంగా చేరిన సిబ్బందితో ఇటీవలి కాలంలో ఐటీ కంపెనీల నియామకాలపై ప్రభావం పడినట్టు తెలిపింది. లిస్టెడ్ కంపెనీలకు సంబంధించి నికర సిబ్బంది తగ్గుదల చోటుచేసుకున్నట్టు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment