Average
-
ఐటీలో వృద్ధి 6 శాతంలోపే
న్యూఢిల్లీ: భారత ఐటీ రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024–25) 4 నుంచి 6 % మద్య ఆదాయంలో వృద్ధిని నమోదు చేయవచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. స్థూల ఆర్థిక సవాళ్ల నేపథ్యంలో యూఎస్, యూరప్ లోని క్లయింట్లు టెక్నాలజీలపై వ్యయా లు తగ్గించుకోవడాన్ని కారణంగా పేర్కొంది. ఆదా యం పరంగా సవాళ్లు ఉన్నప్పటికీ నిర్వహణ మార్జిన్లు మెరుగ్గా 22% మేర ఉంటాయని తెలి పింది. అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలస) గణనీయంగా తగ్గి, సమీప కాలంలో స్థిరపడొ చ్చని అంచనా వేసింది. మెరుగైన నగదు ప్రవాహాలు, బలమైన బ్యాలన్స్ షీట్లను పరిగణనలోకి తీసుకుని ఐటీ పరిశ్రమకు స్థిరమైన అవుట్‌లుక్ ఇచి్చంది. అధిక ద్రవ్యోల్బణం, వడ్డీ వ్య యాలు కీలక రంగాల్లోని క్లయింట్లపై ఒత్తిళ్లకు దారితీశాయని, ఫలితంగా వ్యయాలని యంత్రణ, విచక్షణారహిత వ్యయాలను క్లయింట్లు వాయిదా వేసుకోవడాన్ని ప్రస్తావించింది. ఆర్డ ర్లు రాక తగ్గుముఖం పట్టినప్పటికీ.. ఐటీ కంపెనీలకు ఆర్డర్, డీల్స్ పైపులైన్ బలంగానే ఉ న్నట్టు ఇక్రా తెలిపింది. ఒక్కసారి ఆర్థిక పరిస్థితులు కుదుటపడితే మధ్యకాలానికి ఐటీ కంపెనీల్లో వృద్ధి మళ్లీ పుంజుకుంటుందని ఇక్రా కార్పొరేట్ రేటింగ్స్ హెడ్ దీపక్ జోత్వాని పేర్కొన్నారు. కీలక మార్కెట్లో రికవరీ కీలకం.. దేశ ఐటీ కంపెనీల ఆదాయం గడిచిన ఐదారు త్రైమాసికాలుగా పెద్ద వృద్ధిని చూడకపోవడం గమనార్హం. ఇక్రా ఎంపిక చేసిన 15 పెద్ద, మధ్యస్థాయి లిస్టెడ్ ఐటీ కంపెనీలు 2023–24లో డాలర్ పరంగా కేవలం 5.5 శాతం వృద్ధినే నమోదు చేశాయి. 2022–23లో ఇది 9.2 శాతంగా ఉంది. అయినప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీల నిర్వహణ మార్జిన్లు 22 శాతంగా ఉంటాయని ఇక్రా అంచనా వేస్తోంది. దేశ ఐటీ కంపెనీలకు సింహభాగం ఆదాయం యూఎస్ నుంచి వస్తుంటే, ఆ తర్వాత యూరప్, మిగిలిన ప్రపంచ మార్కెట్ల (ఆర్వోడబ్ల్యూ) నుంచి వస్తోంది. ఇక్రా ఎంపిక చేసిన ఐటీ కంపెనీల ఆదాయంలో 55–60 శాతం మేర ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలోయూఎస్ నుంచే వచ్చింది. యూరప్ నుంచి 22–25 శాతం సమకూరింది. స్థూల ఆర్థిక అనిశి్చతుల ప్రభావం పరిశ్రమపై ఇక మీదట ఉండొచ్చని, కీలక మార్కెట్లలో నియంత్రణపరమైన తీవ్ర మార్పులు చోటు చేసుకుంటే అది ప్రతికూల ప్రభావం కొనసాగేలా చేయొచ్చని పేర్కొంది. జెనరేషన్ ఏఐ మధ్య కాలంలో ఐటీ పరిశ్రమ వృద్ధికి కీలకమని.. ప్రముఖ ఐటీ కంపెనీలు తమ సిబ్బందికి ఇందులో శిక్షణ ఇప్పించి, సేవల పరంగా తమ సామర్థ్యాలను పెంచుకున్నట్టు ఇక్రా తన నివేదికలో వివరించింది. జెనరేషన్ ఏఐ పరంగా ఆర్డర్‌బుక్ లేదా ఆదాయం ఇప్పటి వరకు పరిమితంగా ఉండగా, మధ్య కాలానికి పుంజుకోవచ్చని అంచనా వేసింది. డిమాండ్ మోస్తరుగా ఉండడం, 2022–23లో అధికంగా చేరిన సిబ్బందితో ఇటీవలి కాలంలో ఐటీ కంపెనీల నియామకాలపై ప్రభావం పడినట్టు తెలిపింది. లిస్టెడ్ కంపెనీలకు సంబంధించి నికర సిబ్బంది తగ్గుదల చోటుచేసుకున్నట్టు పేర్కొంది. -
పెరిగిన తలసరి ఆదాయం
సాక్షి, అమరావతి: గత మూడేళ్లుగా రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం పెరుగుతోంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర తలసరి ఆదాయం జాతీయ సగటు తలసరి ఆదాయాన్ని మించి పెరిగింది. 2022–23లో జాతీయ తలసరి ఆదాయం కన్నా రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 47,518 ఎక్కువగా నమోదైంది. 2022–23లో జాతీయ సగటు తలసరి ఆదాయం రూ. 1,72,000 ఉండగా రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 2,19,518లకు చేరింది. అలాగే గత మూడేళ్లుగా ఆదాయపు పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో గత మూడు సంవత్సరాల్లో ఆదాయపు పన్ను చెల్లించే వారి సంఖ్య 1.65 లక్షలకు పెరిగినట్లు ఇటీవల లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. 2020–21లో ఆదాయపు పన్ను చెల్లించిన వారి సంఖ్య 19.79 లక్షల ఉండగా 2022–23లో ఆదాయపు పన్ను చెల్లించిన వారి సంఖ్య 21.65 లక్షలకు పెరిగినట్లు పంకజ్ చౌదరి తెలిపారు. పన్ను లేకపోయినా ఐటీ రిటర్న్ దాఖలు చేస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. పైసా కూడా ఆదాయపు పన్ను చెల్లించని వారు 2020–21లో 12.55 లక్షల మంది ఐటీ రిటర్న్ దాఖలు చేస్తే, వారి సంఖ్య 2022–23లో 13.04 లక్షలకు పెరిగినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. భారీగా పెరిగిన ఐటీ రిటర్న్‌లు దేశంలో ఆదాయపు పన్ను చెల్లించే వారి సంఖ్య గత మూడు సంవత్సరాల్లో భారీగా పెరిగినట్లు కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. దేశం మొత్తం మీద 2020–21లో 6.72 కోట్ల మంది ఆదాయపు పన్ను చెల్లించగా 2022–23లో ఆ సంఖ్య 7.40 కోట్లకు పెరిగినట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఆదాయపు పన్ను చెల్లించని వారు కూడా ఐటీ రిటర్న్ దాఖలు చేయడం దేశవ్యాప్తంగా పెరుగుతోందని ఆయన తెలిపారు. 2020–21లో ఆదాయపు పన్ను చెల్లించని వారు 4.84 కోట్ల మంది ఐటీ రిటర్న్ దాఖలు చేస్తే 2022–23లో ఆ సంఖ్య 6.16 కోట్లకు పెరిగినట్లు కేంద్ర మంత్రి వివరించారు. దేశ సగటును మించి.. జాతీయ సగటు తలసరి ఆదాయాన్ని మించి రాష్ట్ర తలసరి ఆదాయంలో పెరుగుదల నమోదైంది. 2022–23లో జాతీయ సగటు తలసరి ఆదాయంలో పెరుగుదల రూ. 23,476 ఉండగా.. అదే ఏపీలో రూ. 26,931లకు పెరిగింది. దీంతో దేశ, రాష్ట్ర తలసరి ఆదాయం మధ్య వ్యత్యాసం 2022–23లో రూ. 47,518గా నమోదైంది. కోవిడ్ సమయంలో కూడా రాష్ట్ర తలసరి ఆదాయం పెరగడానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలే అని నిపుణులు చెబుతున్నారు. ప్రజలకు డబ్బులిస్తేనే ఆర్థిక రంగానికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల ద్వారా లబి్ధదారులకు నేరుగా నగదు బదిలీ చేసింది. టీడీపీ హయాంలో 2018–19లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 1,54,031తో దేశంలో 17వ స్థానంలో ఉన్న రాష్ట్రం.. 2022–23 నాటికి రూ. 2,19,518తో 9వ స్థానంలో నిలిచింది. -
Telangana: నిలబెట్టిన సం‘క్షేమం’!
ఉచిత విద్యుత్, పంటల సాగుకు పెట్టుబడి సాయం, ఇంకా గొర్రెలు, చేపపిల్లల పంపిణీ, రేషన్ పెంపు, ఆసరా పింఛన్లు, మెరుగైన ప్రభుత్వ వైద్య సేవలు వంటివి తెలంగాణ ఆర్థిక, సామాజిక చిత్రాన్ని మార్చుతున్నాయి. పౌష్టికాహారం, అక్షరాస్యత, లింగ సమానత్వం, ఉపాధి హామీ తదితర అంశాల్లో పురోగతితోపాటు పేదరికం తగ్గిపోతోంది. ఈ మేరకు తాజాగా నీతి ఆయోగ్ విడుదల చేసిన ‘బహుముఖ పేదరిక సూచిక 2019–21’లో తెలంగాణ జాతీయ సగటును మించి సత్ఫలితాలు సాధించినట్టు తెలిపింది. పేదలకు పౌష్టికాహారం మొదలుకుని బ్యాంకు ఖాతాల వరకు మొత్తం పన్నెండు అంశాలను పరిశీలించిన నీతి ఆయోగ్.. తెలంగాణలో నిరుపేదల సంఖ్య 5.88శాతానికి తగ్గినట్టు తేల్చింది. -సాక్షి ప్రత్యేక ప్రతినిధి సంక్షేమ పథకాలే ఔషధంగా.. ఉచితాలు అనుచితం అభివృద్ధి నిరోధమంటూ సంక్షేమ పథకాలపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. సంక్షేమ పథకాలే ప్రజలు పేదరికం నుంచి బయటపడటానికి తోడ్పడుతున్నాయని జాతీయ కుటుంబ సర్వే ఆధారంగా నీతి ఆయోగ్ వెలువరించిన పేదరిక సూచిక తేల్చింది. సంక్షేమ పథకాలు అమలవుతున్న రాష్ట్రాల్లో దారిద్య్ర రేఖను అధిగమిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు గుర్తించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో 2015–2016లో 13.18శాతంగా ఉన్న నిరుపేదల సంఖ్య.. మూడేళ్లలోనే 5.88 శాతానికి తగ్గింది. అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ 2015–16లో 11.77శాతంగా ఉన్న పేదరికం 6.06 శాతానికి తగ్గింది. పట్టణాల కంటే గ్రామాల్లో పేదల సంఖ్య వేగంగా తగ్గుతోందని నివేదిక తేల్చింది. తెలంగాణలో ప్రçÜ్తుతం గ్రామాల్లో 7.51 శాతం, పట్టణాలు–నగరాల్లో 2.73శాతం పేదలు ఉన్నట్టు పేర్కొంది. పోషకాహారమే సమస్య దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ పోషకాహారమే పెద్ద సమస్యగా ఉందని నీతి ఆయోగ్ నివేదిక తెలిపింది. దీనివల్ల రక్తహీనత, తక్కువ బరువుతో పిల్లలు పుట్టడం వంటివి కొనసాగుతున్నాయని వెల్లడించింది. తెలంగాణలో 2015–16లో 9.78 శాతం మంది పోషకాహార లోపంతో బాధపడగా.. 2019–21 నాటికి ఇది 4.91 శాతానికి తగ్గింది. ఇళ్లులేని వారిశాతం 2015–16లో 8.07 శాతంగా ఉండగా.. 2019–21 నాటికి 3.17 శాతానికి తగ్గింది. కుమురంభీం, గద్వాలలో ఎక్కువ పేదరికం రాష్ట్రంలో జాతీయ సగటును మించి కుమురం భీం ఆసిఫాబాద్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో పేదరిక శాతం ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతాలు ఎన్నో ఏళ్లుగా ఇదే పరిస్థితిలో ఉన్నాయని.. అత్యంత వెనుకబడిన ఈ జిల్లాల్లో పేదరిక నిర్మూలన సాధించేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాల్సి ఉందని సామాజిక పరిశీలకులు అంటున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రణాళికాబద్ధంగా చేపట్టాల ని.. పలు ప్రత్యేక పథకాల అమలు తక్షణ అవసరమని సామాజిక విశ్లేషకుడు ప్రొఫెసర్ వి.సత్తిరెడ్డి అభిప్రాయపడ్డారు. సంక్షేమం.. ఉత్పాదక శక్తికి ఊతం తెలంగాణలో సంక్షేమ పథకాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మంచినీరు, విద్యుత్, పక్కా గృహాల విషయంలో చాలా మార్పు వచ్చింది. సంక్షేమ పథకాలు ఉత్పాదక శక్తికి ఊతం ఇస్తున్నాయి. నిరుపేదలు తమ కాళ్లపై తాము నిలబడే వరకు సంక్షేమ పథకాలు అమలు చేయటం, వాటిని అదే స్థాయిలో సద్వినియోగం చేసుకుంటే సామాజిక మార్పు సాధ్యం. – డాక్టర్ రేవతి, సెస్ సంస్థ డైరెక్టర్ సామాజిక మార్పునకు కారణమవే.. అనేక వైరుధ్యాలున్న తెలంగాణ సమాజంలో ఇప్పుడు అమలవు తున్న సంక్షేమ పథకాలతో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. సంపద వివిధ రూపంలో ప్రజలకు చేరుతోంది. దాంతో నిరుపేదలు సైతం సంపద సృష్టించే స్థాయికి చేరుతుండటం శుభ పరిణామం. – డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు, మాజీ ప్రధాన సమాచార కమిషనర్ -
భోజనానికి సగటున 96 నిమిషాలు!
ఆధునిక యుగంలో మనిషి జీవితం యాంత్రికంగా మారిపోతోంది. పొద్దున నిద్ర నుంచి లేచింది మొదలు రాత్రి మళ్లీ పడకపైకి చేరేదాకా అంతా రొటీన్‌గా సాగిపోతోంది. పల్లె జీవితానికి, నగర జీవితానికి కొంత వ్యత్యాసం ఉంటోంది. పల్లె అయినా, నగరమైనా తినడం, పని చేయడం, నిద్రపోవడం.. ఇదే చక్రం పునరావృతం అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా మనుషుల సగటు జీవితం ఎలా సాగుతోందన్న దానిపై కెనడాలోని మెక్‌గిల్ యూనివర్సిటీ పరిశోధకులు ఆసక్తికరమైన అధ్యయనం నిర్వహించారు. ప్రజల రోజువారీ జీవితం ఎలా ఉంటోంది? ఏ పనికి ఎంత సమయం కేటాయిస్తున్నారు? అనేది నిశితంగా పరిశీలించారు. ఇందుకోసం 58 దేశాల్లో వివిధ జాతీయ సర్వేల గణాంకాలను క్రోడీకరించారు. ప్రపంచ జనాభాలో 60 శాతం ఈ అధ్యయనం పరిధిలోకి వచ్చారు. అధ్యయనంలో ఏం తేలిందంటే.. ► ఉద్యోగం, ఉపాధి కోసం మనుషులు వారానికి సగటున 41 గంటలు వెచి్చస్తున్నారు. ► ఇంట్లో పరిశుభ్రతకు 2.5 గంటలు, తోట పనులు, ఇతర వ్యక్తిగత పనులకు 3.4 గంటలు వెచి్చస్తున్నారు. ► స్నేహితులతో బయట ఆనందంగా గడపడానికి, టీవీ వీక్షించడానికి, ఆటలు ఆడడానికి సగటున 6.5 గంటలు వెచి్చస్తున్నట్లు తమ అధ్యయనంలో వెల్లడయ్యిందని పరిశోధకుడు ఎరిక్ గాల్బ్రెయిత్ చెప్పారు. ► గిన్నెలు కడుక్కోవడం, వంట చేసుకోవడం, టేబుళ్లు శుభ్రం చేసుకోవడానికి జనం 55 నిమిషాలు ఖర్చు చేస్తున్నారు. ► భోజనం చేయడానికి 96 నిమిషాలు(1.6 గంటలు) వెచ్చిస్తున్నారు. ► చేపలు పట్టడం, పంటల సాగు, ఇతర వ్యవసాయ సంబంధిత పనులకు 52 నిమిషాల (0.9 గంటలు) సమయం ఖర్చవుతోంది. ► స్నానం, ఆరోగ్య సంరక్షణ వంటి పనుల్లో 2.5 గంటలు గడుపుతున్నారు. ► సర్వేలో చిన్న పిల్లలను కూడా చేర్చడంతో కొన్ని పనులకు పట్టే సమయం అధికంగా ఉన్నట్లు కనిపిస్తుందని అధ్యయనకర్తలు వెల్లడించారు. ► నిద్ర కోసం వెచి్చస్తున్న సమయం 9 గంటలు కాగా, ఇందులో పిల్లల నిద్ర 11 గంటలు, పెద్దల నిద్ర 7.5 గంటలుగా ఉంది. ► కొన్ని విషయాల్లో దేశాల మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. మతపరమైన ప్రార్థనలు, పూజలకు నిత్యం 12 నిమిషాలు వెచి్చస్తుండగా, కొన్ని దేశాల్లో ఈ సమయం మరింత ఎక్కువగా ఉంటోంది. ► వివిధ దేశాల నడుమ ఆదాయంలో తేడాలు, సాంస్కృతిక వ్యత్యాసాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. అలాగే ఆయా దేశాల్లో వివిధ పనులకు ప్రజలు వెచి్చంచే సమయాల్లోనూ తేడాలు ఉంటాయని పరిశోధకులు వెల్లడించారు. ► ఉదాహరణకు సంపన్న దేశాలతో పోలిస్తే పేద దేశాల్లో వ్యవసాయం కోసం వెచ్చించే సమయం అధికం. ► ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణించే సమయం విషయంలో దేశాల మధ్య పెద్దగా తేడాలు లేవని గుర్తించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
23 దేశాల్లో జీతాలు రూ.లక్షకుపైనే.. మరి భారత్‌లో...?
ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగుల వేతనాలకు సంబంధించి ఆసక్తికర గణాంకాలు విడుదలయ్యాయి. ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అంతర్జాతీయ గణాంకాల సంస్థ వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ కార్మికుల నెలవారీ సగటు జీతాలను తెలియజేస్తూ ఓ జాబితా విడుదల చేసింది. ఇదీ చదవండి: కాగ్నిజెంట్ ఉద్యోగులకు తీపి కబురు.. ఆరు నెలల ముందే జీతాల పెంపు వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ విడుదల చేసిన జాబితా ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 23 దేశాల్లో కార్మికులు అందుకుంటున్న సగటు నెల జీతం రూ.లక్షపైనే ఉంది. స్విట్జర్ల్యాండ్లో అత్యధికంగా 6,096 డాలర్లు (రూ4,98,567) నెలవారీ వేతనం అందుకుంటున్నారు. కార్మికులు అత్యధిక జీతాలు అందుకుంటున్న మొదటి పది దేశాల్లో స్విట్జర్లాండ్ (రూ.4,98,567), లక్సంబర్గ్ (రూ.4,10,156), సింగపూర్ (రూ.4,08,030), యూఎస్ఏ (రూ.3,47,181), ఐస్లాండ్ (రూ.3,27,716), ఖతార్ (రూ.3,25,671), డెన్మార్క్ (రూ.2,89,358), యూఏఈ (రూ.2,86,087), నెదర్లాండ్స్ (రూ.2,85,756), ఆస్ట్రేలియా (రూ.2,77,332) ఉన్నాయి. 65వ స్థానంలో భారత్ వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ విడుదల చేసిన జాబితాలో భారత్ 65వ స్థానంలో నిలించింది. దేశంలో వివిధ రంగాల్లో కార్మికులు అందుకుంటున్న నెలవారీ సగటు వేతనం రూ.50వేల కంటే తక్కువే. దేశంలో కార్మికులు నెలకు సగటున 573 డాలర్లు అంటే రూ.46,861 అందుకుంటున్నట్లు వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ పేర్కొంది. ఇక టర్కీ, బ్రెజిల్, అర్జెంటీనా, ఇండోనేషియా, కొలంబియా, బంగ్లాదేశ్ , వెనుజులా, నైజీరియా, ఈజిప్ట్, పాకిస్తాన్ దేశాలు ఈ జాబితాలో భారత్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఇదీ చదవండి: ఫ్రెషర్లకు గుడ్ న్యూస్ చెప్పిన టీసీఎస్.. 44 వేల జాబ్ ఆఫర్లు.. అందరికీ ఉద్యోగాలు! Average monthly net salary: 1. Switzerland 🇨🇭: $6,096 2. Luxembourg 🇱🇺: $5,015 3. Singapore 🇸🇬: $4,989 4. USA 🇺🇸: $4,245 5. Iceland 🇮🇸: $4,007 6. Qatar 🇶🇦: $3,982 7. Denmark 🇩🇰: $3,538 8. UAE 🇦🇪: $3,498 9. Netherlands 🇳🇱: $3,494 10. Australia 🇦🇺: $3,391 . 11. Norway 🇳🇴: $3,289… — World of Statistics (@stats_feed) April 30, 2023 -
వందేభారత్ రైళ్లు: గంటకు 180 కి.మీ. గరిష్ట వేగం.. యావరేజి స్పీడ్ 83 కి.మీ.
న్యూఢిల్లీ: దేశంలో వందేభారత్ రైళ్లు సరాసరిన గంటకు 83 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నాయని అధికారులు తెలిపారు. గంటకు 180 కి.మీ. గరిష్ట వేగంతో నడిచేలా తయారైన ఈ రైళ్లను 130 కి.మీ. వేగంతో నడపవచ్చు. రైలు మార్గాల్లో నాణ్యత లేమి వల్ల తక్కువ వేగంతోనే నడుపుతున్నట్లు సమాచార హక్కు చట్టం కింద అందిన దరఖాస్తుకు రైల్వే శాఖ బదులిచ్చింది. ‘‘అత్యల్పంగా గంటకు 64 కి.మీ. సరాసరి వేగంతో ముంబై–షిర్డీ వందేభారత్ రైలు, గరిష్టంగా 95 కి.మీ. వేగంతో న్యూఢిల్లీ–వారణాసి రైలు నడుస్తోందని చెప్పారు. ఆగ్రా కంటోన్మెంట్– తుగ్లకాబాద్ రైలు మాత్రం గంటకు 160 కి.మీ. వేగంతో ప్రయాణిస్తోంది’’ అని పేర్కొంది. -
నేను యావరేజ్.. అయితే ఏంటి?
‘‘నువ్వు చాలా యావరేజ్‌గా ఉంటావ్? నిన్ను హీరోయిన్ను చేసింది ఎవరు?’’.. ఇదిగో ఇలాగే కొంచెం రూడ్‌గా ఓ నెటిజన్ హీరోయిన్ తాప్సీని క్వొశ్చన్ చేశాడు. తాప్సీ సైలెంట్‌గా ఉండలేదు. తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు. ‘‘నాలో ఉన్న చిన్ని చిన్ని యాక్టింగ్ స్కిల్సే నన్ను హీరోయిన్ అయ్యేలా చేశాయి. అయినా యావరేజ్‌గా కనిపించడం అంత ప్రాబ్లమ్ ఏమీ కాదు. ప్రపంచంలో మీరు చెప్పిన నాలాంటి వాళ్లే ఎక్కువమంది ఉన్నారు’’ అని పేర్కొన్నారు తాప్సీ. అయితే.. తాప్సీ రెస్పాండ్ అయిన కొంతసేపటి తర్వాత ఆ ట్వీట్‌ను ఆ నెటిజన్ తొలగించడం విశేషం. ఈ సంగతి ఇలా ఉంచితే.. ఈ ఏడాది మరో సినిమా షూటింగ్‌ను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశారు తాప్సీ. అనురాగ్ కశ్యప్ దర్వకత్వంలో అభిషేక్ బచ్చన్, విక్కీ కుశాల్, తాప్సీ ముఖ్య తారలుగా నటించిన ‘మన్మర్జియాన్’ షూటింగ్ జమ్ము కశ్మీర్లో కంప్లీట్ అయ్యింది. ఫైనల్ డే షూట్లో తాప్పీ, అభిషేక్ బచ్చన్ పాల్గొన్నారు. ఈ సినిమాతో తాప్సీ ఈ ఏడాది కంప్లీట్ చేసిన సినిమాల సంఖ్య నాలుగుకు చేరింది. తడ్కా, సూర్మ, ముల్క్ సినిమాల షూటింగ్‌ను తాప్సీ ఇటీవలే కంప్లీట్ చేశారు. హిందీ సినిమాల్లో నటించడంతో పాటు ఓ తెలుగు సినిమా కూడా చేస్తున్నారు తాప్సీ. హరి దర్శకత్వంలో ఆది పినిశెట్టి, రితాకా సింగ్, తాప్సీ ముఖ్య తారలుగా తెలుగులో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
జిల్లాలో 2.1 మి.మీ వర్షపాతం నమోదు
ఏలూరు (మెట్రో) : జిల్లాలో గడచిన 24 గంటల్లో సగటున 2.1 మి.మీ వర్షపాతం నమోదైందని సీపీవో బాలకృష్ణ ఒక ప్రకటనలో చెప్పారు. అత్యధికంగా తాడేపల్లిగూడెం మండలంలో 12.2 మి.మీ, ఉంగుటూరు మండలంలో 3.2 మి.మీ, భీమడోలు మండలంలో 6.2 మి.మీ, పెదవేగి 2.4 మి.మీ, పెదపాడు 10.4 మి.మీ, ఏలూరు 1.2 మి.మీ, దెందులూరు, నిడమర్రు 3.2 మి.మీ, పెంటపాడు 4.8 మి.మీ, తణుకు 4.6, ఉండ్రాజవరం 2.2, పెరవలి 3.8, ఇరగవరం 1.6, అత్తిలి 2.4, ఉండి 5.2, ఆకివీడు 4.4, కొయ్యలగూడెం 4, కాళ్ల 3.2, భీమవరం 2.2, పాలకోడేరు 4.2, పెనుమంట్ర 3.8, పెనుగొండ 1.6, పోడూరు 9.4 మి.మీ వర్షపాతం నమోదైంది. గడిచిన 24 గంటల్లో మొత్తం 102 మి.మీ వర్షపాతం నమోదైనట్టు సీపీవో చెప్పారు. -
ఇంటర్నెట్ స్పీడ్ పెరిగింది!
ఆసియా ఫసిఫిక్ ప్రాంతంలోనే భారత్ ఇంటర్నెట్ స్పీడ్ అతి తక్కువగా ఉన్నట్లు గుర్తించడంతో దాన్ని సగటున 3.5 ఎంబిపీఎస్ ఉండేట్లుగా పెంచారు. దీంతో గత త్రైమాసికంతో పోలిస్తే 24 శాతం పెరిగినట్లు అకమాయ్ నివేదికలు నిర్థారించాయి. అయినప్పటికీ ప్రపంచ ర్యాంకుతో పోలిస్తే 114వ స్థానంలోనే నిలిచినట్లు నివేదికలు చెప్తున్నాయి. దేశంలో ఇంటర్నెట్ వాడకం వేగంగా పెరుగుతున్నప్పటికీ కేవలం 138 శాతం మాత్రమే వృద్ధి కనిపిస్తోంది. భారతదేశంలో రోజురోజుకూ ఇంటర్నెట్ వినియోగంలో పెరుగుతున్న వృద్ధి చూస్తే నిజంగా గర్వ పడాలి. కానీ వేగంలో మాత్రం ఇప్పటికీ ప్రపంచంలోని మిగిలిన దేశాలతో పోలిస్తే అత్యంత వెనుకబడి ఉండటం విస్మయాన్ని కలిగిస్తుంది. అకమాయ్ అందించిన కొత్త నివేదికల ప్రకారం ఇండియాలో అతితక్కువ వేగంతో ఉన్న ఇంటర్నెట్ స్పీడ్ ను 3.5 ఎంబిపీఎస్ లకు పెంచాలని అమెరికాకు చెందిన కంటెంట్ డెలివరీ, క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ సూచించింది. ప్రపంచంలోని ఇంటర్నెట్ స్థితిగతుల్లో కనిపించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను అకమాయ్ బయటపెట్టింది. టాప్ లో ఉన్న దక్షిణ కొరియా సగటు ఇంటర్నెట్ వేగం 29 ఎంబిపిఎస్ నుంచి గరిష్ఠంగా 103.6 ఎంబీపీఎస్ వరకూ ఉంది. మొత్తం ప్రపంచ సగటు వేగం 6.4 ఎంబీపీఎస్ ఉండగా.. భారతదేశం గరిష్ఠ వేగం కేవలం 25.5 ఎంబీపీఎస్ మాత్రమే ఉన్నట్లుగా అంచనా వేసింది. భారత సర్వీస్ ప్రొవైడర్లు 25 ఎంబీపీస్ నుంచే ప్రణాళికలను అందించడం ప్రారంభిస్తున్నాయని, యు బ్రాడ్ బ్యాండ్, యాక్ట్ బ్రాడ్ బ్యాండ్ 100 ఎంబీపీఎస్ వరకూ ఆఫర్లు ఇస్తున్నట్లు అకమాయ్ నివేదికలను బట్టి తెలుస్తోంది. అయితే ఇది భారతదేశంలో ఇంటర్నెట్ వినియోగంతో పోలిస్తే చాలా తక్కువగా భావించింది. ఇండియాలో 15 ఎంబీపీఎస్ స్పీడ్ దాటిన కనెక్షన్లు కేవలం 2 శాతమే ఉన్నప్పటికీ వినియోగంలో 210 శాతం అభివృద్ధి కనిపిస్తున్నట్లు నివేదిక్లోల తెలిపింది. దీన్ని బట్టి రాబోయే కాలంలో హైస్పీడ్ కనెక్షన్ల వినియోగదారులు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇంటర్నెట్ వ్యాప్తి స్థాయిని గమనిస్తే.. భారతదేశ జనాభాలో మూడవ వంతు ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే నవంబర్ 2015 నాటి ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) లెక్కల ప్రకారం దేశంలో 25 శాతం వ్యాప్తి ఉన్నట్లు నిర్థారించింది. అది ఈపాటికి గణనీయంగా పెరిగేందుకు ఎంతో అవకాశం ఉన్నట్లు ఐఏఎంఏఐ చెప్తోంది. ప్రస్తుత కొత్త ప్రాజెక్టులు, డిజిటల్ ఇండియా వంటి వాటితో ఇంటర్నెట్ వినియోగం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు చెప్తోంది. గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలు అందించేందుకు గూగుల్ సైతం ప్రయత్నాలు చేయడం, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి ప్రభుత్వాలు ప్రజలకు ఇంటర్నెట్ సేవలను చవుకగా అందించే పథకాలను ప్రవేశ పెట్టడం కూడ ఇంటర్నెట్ వినియోగం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ప్రపంచంలోనే ఇంటర్నెట్ వినియోగంలో భారత్ రెండో స్థానంలో ఉన్నట్లు ఇటీవల మేరీ మీకర్ తన నివేదికల్లో వెల్లడించింది. అంతేకాక దేశంలో పెరుగుతున్న స్మార్ట్ ఫోన్ల అమ్మకాలతోపాటు, పలు కంపెనీలు తక్కువ ధరలకే స్మార్ట్ ఫోన్లను ఎగుమతి చేస్తుండటం కూడ భారత్ రెండో స్థానంలో ఉందన్న వాస్తవాన్ని ప్రతిబింబిస్తోంది. -
చూడడానికి... నేను యావరేజ్!
‘నేను అందంగా ఉండను’ అని దాదాపు ఎవరూ అనుకోరు. ఏదో యాంగిల్లో మనమూ బాగుంటామనే ఫీలింగ్‌తోనే ఉంటారు. ఈ కేటగిరీని పక్కన పెడితే... అందంగా ఉండి కూడా లేమనుకునేవాళ్లూ ఉంటారు. ఇలియానా ఈ కోవకే చెందుతారు. చిన్నప్పుడు బొద్దుగా ఉండేదాన్ననీ, అందరూ ఏడిపించేవారనీ ఆమె పలు సందర్భాల్లో చెప్పారు. అలాగే, సినిమా హీరోయిన్ అవుతానని కూడా అనుకోలేదని అన్నారు. ఇటీవల ఓ సందర్భంలో తన అందం గురించి ఇలియానా మాట్లాడుతూ - ‘‘నేను ఆకర్షణీయంగా ఉంటానని అనను. అలాగని ఆకర్షణీయంగా లేనని కూడా అనను. యావరేజ్‌గా ఉంటాను. తొలి చూపులోనే ఇతరుల దృష్టిని ఆకట్టుకునేంత అందంగా ఉండనని నా ఫీలింగ్. ఉదాహరణ చెప్పాలంటే.. కుర్చీలను, టేబుల్ ల్యాంప్‌ను చూసి, మనం ఆకర్షితులం కాదు కదా! నేను కూడా వాటిలానే! ఎవర్నీ ఎట్రాక్ట్ చేయలేను’’ అన్నారు. ఈ మాటలను ఇలియానా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అది చదివిన ఆమె ఫాలోయర్స్ ‘నువ్వు యావరేజ్ కాదు.. సూపర్’, ‘నువ్వు చాలా చాలా ఎట్రాక్టివ్‌గా ఉంటావు’, ‘మొదటిసారి నిన్ను చూడగానే ఆకట్టుకో గలుగుతావ్’. ‘నీ అందం ఎవరినైనా అమాంతం పడేస్తుంది’ అని కామెంట్స్ పెట్టారు. ఇవి చదువుకుని ఇలియానా ఆనందపడి ఉంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.