
ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగుల వేతనాలకు సంబంధించి ఆసక్తికర గణాంకాలు విడుదలయ్యాయి. ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అంతర్జాతీయ గణాంకాల సంస్థ వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ కార్మికుల నెలవారీ సగటు జీతాలను తెలియజేస్తూ ఓ జాబితా విడుదల చేసింది.
ఇదీ చదవండి: కాగ్నిజెంట్ ఉద్యోగులకు తీపి కబురు.. ఆరు నెలల ముందే జీతాల పెంపు
వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ విడుదల చేసిన జాబితా ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 23 దేశాల్లో కార్మికులు అందుకుంటున్న సగటు నెల జీతం రూ.లక్షపైనే ఉంది. స్విట్జర్‌ల్యాండ్‌లో అత్యధికంగా 6,096 డాలర్లు (రూ4,98,567) నెలవారీ వేతనం అందుకుంటున్నారు. కార్మికులు అత్యధిక జీతాలు అందుకుంటున్న మొదటి పది దేశాల్లో స్విట్జర్లాండ్ (రూ.4,98,567), లక్సంబర్గ్ (రూ.4,10,156), సింగపూర్ (రూ.4,08,030), యూఎస్‌ఏ (రూ.3,47,181), ఐస్‌లాండ్ (రూ.3,27,716), ఖతార్ (రూ.3,25,671), డెన్మార్క్ (రూ.2,89,358), యూఏఈ (రూ.2,86,087), నెదర్లాండ్స్ (రూ.2,85,756), ఆస్ట్రేలియా (రూ.2,77,332) ఉన్నాయి.
65వ స్థానంలో భారత్
వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ విడుదల చేసిన జాబితాలో భారత్ 65వ స్థానంలో నిలించింది. దేశంలో వివిధ రంగాల్లో కార్మికులు అందుకుంటున్న నెలవారీ సగటు వేతనం రూ.50వేల కంటే తక్కువే. దేశంలో కార్మికులు నెలకు సగటున 573 డాలర్లు అంటే రూ.46,861 అందుకుంటున్నట్లు వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ పేర్కొంది. ఇక టర్కీ, బ్రెజిల్, అర్జెంటీనా, ఇండోనేషియా, కొలంబియా, బంగ్లాదేశ్ , వెనుజులా, నైజీరియా, ఈజిప్ట్, పాకిస్తాన్ దేశాలు ఈ జాబితాలో భారత్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
ఇదీ చదవండి: ఫ్రెషర్లకు గుడ్ న్యూస్ చెప్పిన టీసీఎస్.. 44 వేల జాబ్ ఆఫర్లు.. అందరికీ ఉద్యోగాలు!
Average monthly net salary:
— World of Statistics (@stats_feed) April 30, 2023
1. Switzerland 🇨🇭: $6,096
2. Luxembourg 🇱🇺: $5,015
3. Singapore 🇸🇬: $4,989
4. USA 🇺🇸: $4,245
5. Iceland 🇮🇸: $4,007
6. Qatar 🇶🇦: $3,982
7. Denmark 🇩🇰: $3,538
8. UAE 🇦🇪: $3,498
9. Netherlands 🇳🇱: $3,494
10. Australia 🇦🇺: $3,391
.
11. Norway 🇳🇴: $3,289…
Comments
Please login to add a commentAdd a comment