International Labour Day
-
May Day Special Story: ఖరీదు కట్టే షరాబు లేడు
ప్రతి శ్రమకూ ఒక విలువ ఉంటుంది.పురుషుడు విలువ కలిగిన శ్రమే చేస్తాడు. అతడిది ఉద్యోగం.స్త్రీ విలువ కట్టని ఇంటి పని చేస్తుంది.ఆమెది చాకిరి.భారతదేశంలో స్త్రీ, పురుషుల్లో స్త్రీలుఅత్యధిక గంటలు ఏ ఖరీదూ లేనిఇంటి పనుల్లో మునిగి ఉంటున్నారనిసర్వేలు చెబుతున్నాయి.దేశ యంత్రాంగాలు అంతరాయంలేకుండా ముందుకు సాగడంలోఈ శ్రమ నిశ్శబ్ద ΄ాత్ర వహిస్తోంది.స్త్రీల శ్రమకు విలువ కట్టలేక΄ోతేకనీసం గౌరవం ఇవ్వడమైనా నేర్వాలి. ఇంతకు ముందు వివరించి చెప్పడం కొంత కష్టమయ్యేది. ఇప్పుడు అర్బన్ క్లాప్ వంటి సంస్థలు వచ్చాయి కనుక సులువు. అర్బన్ క్లాప్ వారికి బాత్రూమ్ల క్లీనింగ్ కోసం కాల్ చేస్తే వాళ్లు ఒక్కో బాత్రూమ్కు ఇంతని చార్జ్ చేస్తారు. ఇంట్లో రెండుంటే రెంటికీ చార్జ్ పడుతుంది. అదీ ఒకసారికి. అమ్మ వారంలో రెండు సార్లు, నెలలో ఏడెనిమిది సార్లు రెండు బాత్రూమ్లు కడుగుతుంది. ఆమెకు ఆ చార్జ్ మొత్తం ఇవ్వాలి లెక్క ప్రకారం. అలాగే కిచెన్ క్లీన్ చేయాలంటే కూడా ఒక చార్జ్ ఉంటుంది. అమ్మ రోజూ వంటిల్లు సర్దిసర్ది, ΄్లాట్‌ఫామ్ కడిగి, స్టవ్ రుద్ది క్లీన్ చేస్తుంది. ఆ చార్జ్ కూడా ఆమెకు ఇవ్వాలి. అమ్మ శ్రమకు కనీసం విలువ కట్టాలని కొన్ని సందర్భాలలో కోర్టులు కూడా అంటున్నాయి. కొన్ని సంస్థలు అమ్మ శ్రమను ఎలా విలువ కట్టవచ్చో కూడా చెబుతున్నాయి.1. ఆపర్చునిటీ కాస్ట్ మెథడ్: అంటే అమ్మ బయటకు వెళ్లి ఉద్యోగం చేస్తే నలభై వేలు వస్తాయనుకుంటే, ఆమె ఆ ఉద్యోగం మానుకుని ఇంట్లో ఉండి΄ోతే ఆమె శ్రమ విలువను నెలకు నలభై వేలుగా గుర్తించాలి. (అమ్మ ఉద్యోగం చేసి కూడా అంత శ్రమా చేస్తుంటే నలభైకి మరో నలభై కలిపి ఇంటికి ఇస్తున్నట్టు).2. రీప్లేస్మెంట్ కాస్ట్ మెథడ్: ఇల్లు చిమ్మడం, బట్టలుతకడం, ఆరిన బట్టల్ని మడత పెట్టడం, ఇస్త్రీ చేయడం, మొక్కలకు నీళ్లు పోయడం, కూరగాయలు, సరుకులు తెచ్చుకోవడం, బిల్లులు కట్టడం, వంట చేయడం, ఇంటిని కనిపెట్టుకుని ఉండటం... వీటన్నింటినీ బయట వ్యక్తులతో సర్వీసుగా తీసుకుంటే (అర్బన్ క్లాప్ మాదిరిగా) ఎంత అవుతుందో లెక్కగట్టి అది అమ్మ చేసే పని శ్రమగా గుర్తించడం.3. ఇన్పుట్/అవుట్‌పుట్ కాస్ట్ మెథడ్: అలా కాకుండా ఈ పనులన్నింటికీ ఒక యోగ్యమైన ఉద్యోగిని పెట్టుకుంటే మార్కెట్ అంచనాను బట్టి ఎంత జీతం ఇవ్వాల్సి వస్తుందో అంత జీతం ఇవ్వడం.అవన్నీ సరే. కంటికి కనిపించే పనులకు కట్టే విలువ. కాని పిల్లవాడు స్కూల్లో పడి దెబ్బ తగిలించుకుని ఇంటికి వస్తే అమ్మ దగ్గరకు తీసుకుని, మందు రాసి, ధైర్యం చెప్పి, వాడి పక్కన కూచుని కబుర్లు చెపుతుందే... ఆ ప్రేమకు విలువ కట్టే షరాబు ఉన్నాడా? మే డే రోజున ప్రపంచ కార్మికురాలా ఏకం కండి అనే నినాదాలు వినిపిస్తుంటాయి. కాని ఇంటి పని చేస్తూ, అది ఎక్కువైనా చేస్తూ, కుటుంబమంతా ఆ పనిలో భాగం కావాలన్న సంగతిని చెప్పడానికి కూడా తటపటాయిస్తూ, అది వద్దనుకుంటే ఆ ఆప్షన్ లేక, తప్పించుకోవడానికి వీల్లేని ఆ పనిని చేస్తూ కూడా విలువ లేని పని చేస్తున్నామన్న న్యూనతను అనుభవిస్తూ తమ హక్కులు ఏమిటో తమకే తెలియని తల్లి, భార్య, కుమార్తె, చెల్లెళ్లను కార్మికులుగా గుర్తించాలని ఎవరూ అనుకోరు.స్త్రీల ఇంటి శ్రమ దేశంలోని యంత్రాంగం సజావుగా పనిచేయడంలో కీలకమైనది. వారు... దేశం కోసం పని చేసి రిటైరైన వృద్ధుల సేవలో ఉంటారు. దేశానికి ఆదాయం తెచ్చిపెట్టే యువత సేవలో ఉంటారు. దేశానికి భవిష్యత్తులో అంది రావాల్సిన పిల్లల సేవలో ఉంటారు. ‘కుటుంబం’ అనే బంధంలోకి వచ్చి కూతురిగా, కోడలిగా, భార్యగా వీరు ‘ప్రేమ’తో, ‘బాధ్యత’తో, ‘బంధం’తో ఈ సేవ చేస్తారు. అంత మాత్రం చేత ఈ సేవను నిరాకరించడానికి వీల్లేదు. శ్రమగా చూడక్కర్లేదని భావించకూడదు. ఇంత చేస్తున్నా ‘ఇంట్లో కూచుని ఏం చేస్తుంటావ్?’ అనే మాటను వాళ్లు పడాలా?ఉద్యోగం చేసినా చేయక΄ోయినా ఒక గృహిణి రోజుకు సగటున మూడున్నర గంటలు ఇంటి పని చేస్తుంటే పురుషుడు కేవలం గంటన్నర ఇంటి పని చేస్తున్నాడు.స్త్రీలు తమ ఇంటి పనిని ఒక్కరోజు మానేసి సహాయనిరాకరణ చేస్తే దేశం స్తంభిస్తుంది. అందుకే స్త్రీల శ్రమను గౌరవించే మే డే రోజున వారికి కృతజ్ఞతలు తెలియచేయాలి. విలువైన శ్రమ చేస్తున్నందుకు సమాజం వారికి హర్షధ్వానాలు తెలియచేయాలి. -
23 దేశాల్లో జీతాలు రూ.లక్షకుపైనే.. మరి భారత్‌లో...?
ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగుల వేతనాలకు సంబంధించి ఆసక్తికర గణాంకాలు విడుదలయ్యాయి. ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అంతర్జాతీయ గణాంకాల సంస్థ వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ కార్మికుల నెలవారీ సగటు జీతాలను తెలియజేస్తూ ఓ జాబితా విడుదల చేసింది. ఇదీ చదవండి: కాగ్నిజెంట్ ఉద్యోగులకు తీపి కబురు.. ఆరు నెలల ముందే జీతాల పెంపు వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ విడుదల చేసిన జాబితా ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 23 దేశాల్లో కార్మికులు అందుకుంటున్న సగటు నెల జీతం రూ.లక్షపైనే ఉంది. స్విట్జర్ల్యాండ్లో అత్యధికంగా 6,096 డాలర్లు (రూ4,98,567) నెలవారీ వేతనం అందుకుంటున్నారు. కార్మికులు అత్యధిక జీతాలు అందుకుంటున్న మొదటి పది దేశాల్లో స్విట్జర్లాండ్ (రూ.4,98,567), లక్సంబర్గ్ (రూ.4,10,156), సింగపూర్ (రూ.4,08,030), యూఎస్ఏ (రూ.3,47,181), ఐస్లాండ్ (రూ.3,27,716), ఖతార్ (రూ.3,25,671), డెన్మార్క్ (రూ.2,89,358), యూఏఈ (రూ.2,86,087), నెదర్లాండ్స్ (రూ.2,85,756), ఆస్ట్రేలియా (రూ.2,77,332) ఉన్నాయి. 65వ స్థానంలో భారత్ వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ విడుదల చేసిన జాబితాలో భారత్ 65వ స్థానంలో నిలించింది. దేశంలో వివిధ రంగాల్లో కార్మికులు అందుకుంటున్న నెలవారీ సగటు వేతనం రూ.50వేల కంటే తక్కువే. దేశంలో కార్మికులు నెలకు సగటున 573 డాలర్లు అంటే రూ.46,861 అందుకుంటున్నట్లు వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ పేర్కొంది. ఇక టర్కీ, బ్రెజిల్, అర్జెంటీనా, ఇండోనేషియా, కొలంబియా, బంగ్లాదేశ్ , వెనుజులా, నైజీరియా, ఈజిప్ట్, పాకిస్తాన్ దేశాలు ఈ జాబితాలో భారత్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఇదీ చదవండి: ఫ్రెషర్లకు గుడ్ న్యూస్ చెప్పిన టీసీఎస్.. 44 వేల జాబ్ ఆఫర్లు.. అందరికీ ఉద్యోగాలు! Average monthly net salary: 1. Switzerland 🇨🇭: $6,096 2. Luxembourg 🇱🇺: $5,015 3. Singapore 🇸🇬: $4,989 4. USA 🇺🇸: $4,245 5. Iceland 🇮🇸: $4,007 6. Qatar 🇶🇦: $3,982 7. Denmark 🇩🇰: $3,538 8. UAE 🇦🇪: $3,498 9. Netherlands 🇳🇱: $3,494 10. Australia 🇦🇺: $3,391 . 11. Norway 🇳🇴: $3,289… — World of Statistics (@stats_feed) April 30, 2023 -
బుక్కెడు బువ్వ కోసం బతుకు పోరాటం..
కరీంనగర్: బుక్కెడు బువ్వ కోసం బతుకు పోరాటం.. కుటుంబపోషణకు ఆరాటం.. ఎండనకా.. వాననకా.. చలనకా.. రక్తాన్ని శ్వేదంగా చిందించి పొద్దంతా శ్రమిస్తే వచ్చే కూలి ఒక్కపూట తిండికి సరిపోని పరిస్థితి. ఉన్న ఊరిలో ఉపాధి కరువై.. బతుకు బరువై తెలియని ప్రాంతానికి వలసవెళితే అక్కడా తప్పని శ్రమదోపిడీ. వేకువజాము నుంచి సందెవేళ దాకా శ్రమించినా కష్టాల ఊబినుంచి కార్మికులు బయటకు రాలేకపోతున్నారు. పాలకులు మారినా.. శ్రామికుల తలరాతలు మారడం లేదు. శ్రమకు తగ్గ ప్రతిఫలం లేక అర్ధాకలితో అలమటించే వారు కోకొల్ల్లలు. ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల్లో కనీస వేతన చట్టం, పనివేళలు బుట్టదాఖలు. ఉమ్మడి కరీంనగర్జిల్లా నుంచి వేలాది మంది కార్మికులు గల్ఫ్ దేశాలకు వలస వెళ్తుండగా.. జిల్లాకు సైతం వివిధ పనుల కోసం ఇతర రాష్ట్రాల వాళ్లు వస్తున్నారు. స్థానికంగా వేలాదిమంది వివిధ రంగాల్లో పనిచేస్తుండగా.. వచ్చే వేతనం అంతంతే.. నేడు మేడే సందర్భంగా ఉమ్మడి జిల్లాలో కార్మికుల జీవన పరిస్థితి, అభిప్రాయాలతో ప్రత్యేక కథనం.. నేడు ఎగరనున్న ఎర్రజెండా.. చికాగోలో 8 గంటల పని దినాన్ని కల్పించాలని కోరుతూ కార్మికులు 1848లో పెద్దఎత్తున ఆందోళన చేశారు. ప్రభుత్వం వారిపై కాల్పులు జరపగా ఏడుగురు చనిపోయారు. ఏ మాత్రం వెనక్కు తగ్గని కార్మికులు రక్తంతో తడిసిన వారి చొక్కాలనే జెండాలుగా చేసి మే 1న భారీ ప్రదర్శన నిర్వహించారు. వారి పోరాట ఫలితంగా రోజుకు 8గంటలు మాత్రమే పని సమయం నిర్ణయించారు. ఆ పోరాటంలో వీరమరణం పొందిన వారికి చిహ్నంగా ఏటా మే 1వ తేదీని మేడేగా ప్రకటించారు. మేడే సందర్భంగా సోమవారం ఉమ్మడి జిల్లాలోని వివిధ కార్మిక సంఘాలు, వామపక్షపార్టీల ఆధ్వర్యంలో వారివారి కార్యాలయాల్లో, పనిస్థలాల్లో జెండా ఆవిష్కరణలు, సభలు, సమావేశాలు అట్టహాసంగా నిర్వహించుకునేందుకు సిద్ధమవుతున్నారు. సిరిసిల్లటౌన్: తెలంగాణాలోనే అతిచిన్న జిల్లాగా ఏర్పడిన రాజన్న సిరిసిల్ల శ్రామికుల ఉపాధికి అడ్డాగా మారింది. వ్యవసాయం, వస్త్రోత్పత్తి, హమాలీ తదితర రంగాల్లో మొత్తంగా 1.60లక్షల మంది రిజిష్టర్డ్ కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి 2లక్షలకు పైగా కార్మికులు పనిచేస్తున్నారు. 2000 ఏడాదికి అంతకుముందు సిరిసిల్ల డివిజన్ (ప్రస్తుతం జిల్లా)లో కరువు కాటకాలతో ముంబయి, దుబాయ్ వలసలు వెళ్లారు. ప్రస్తుతం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు రాష్ట్రసర్కారు ఆర్డర్లు, ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు, వివిధ కంపెనీల ఆర్డర్లు రావడంతో ఉపాధి పెరిగింది. ఫలితంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు వస్త్రోత్పత్తిలో పనులు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. జిల్లాలోని భవన నిర్మాణ రంగమూ విస్తరించడంతో కార్మికులకు డిమాండ్ పెరిగింది. భవననిర్మాణ రంగంలో స్థానికులు 42,000 మంది, వలస కార్మికులు 5వేల మంది పనిచేస్తున్నారు. చేనేతరంగంలో స్థానికులు 16వేల మంది, వలస కార్మికులు వెయ్యిమంది ఉన్నారు. హమాలీ రంగంలో స్థానికులు 6వేలు, 2వేల మంది వలస కార్మికులు ఉన్నారు. రోజువారీ కూలీలుగా.. సుల్తానాబాద్/జ్యోతినగర్: పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ రామగుండం పరిధిలో వందలాది మంది వలసకార్మికులు పనిచేస్తున్నారు. ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్, ఇతర పారిశ్రామిక ప్రాంతాల్లో రోజువారీ కూలీలుగా కొనసాగుతున్నారు. అత్యధికంగా రైస్‌మిల్లులు ఉన్న సుల్తానాబాద్, మంథని, కమాన్‌పూర్ ప్రాంతాల్లో బిహార్ కార్మికులు ఎక్కువగా పనిచేస్తున్నారు. జిల్లాలోని సుమారు 150 రైస్‌మిల్లుల్లో 7,500 మంది వరకు బిహారీలు ఉపాధి పొందుతున్నారు. రోజంతా కష్టపడితే వచ్చేది రూ.500 నుంచి రూ.వెయ్యి మాత్రమే. జిల్లాలోని ఇటుకబట్టీల్లో కార్మికుల పరిస్థితి అధ్వానం. 50కి పైగా ఇటుకబట్టీలు ఉండగా.. వందలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఒక్కోసారి వీరికి కనీసం తిండి పెట్టడంలేదని ఆందోళనకు దిగిన సందర్భాలు ఎన్నో. అధికారులు ఎన్నిచర్యలు తీసుకుంటున్నా.. యజమానులు ఇప్పటికీ వారిని బానిసల్లాగానే చూస్తుండడం ఆందోళనకరం. వేతన ఒప్పందం ఏదీ? గోదావరిఖని: 11వేజ్‌బోర్డు పూర్తిస్థాయి ఒప్పందం కోసం సింగరేణి కార్మికులు ఎదురు చూస్తున్నారు. జిల్లాలోని రామగుండం రీజియన్ ఆర్జీ–1,2,3 ఏరియాల్లో సుమారు 11,500మంది పనిచేస్తున్నారు. గత సమావేశంలో మూలవేతనంపై 19శాతం పెంచేందుకు యాజమాన్యం అంగీకరించింది. అయితే అలవెన్స్ పెంపుపై ఎలాంటి ఒప్పందం కుదరలేదు. ఏప్రిల్ 18న కోల్‌కత్తాలో జరిగిన జేబీసీసీఐ 11వ వేజ్‌బోర్డు 9వ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. పూర్తిస్థాయి వేతన ఓప్పందం కోసం తిరిగి సమావేశం కావాలని నిర్ణయించాయి. మారుపేర్ల మార్పు, విజిలెన్స్ కేసుల క్లియరెన్స్, అండర్‌గ్రౌండ్‌లో అన్‌ఫిట్ అయిన కార్మికులు సర్ఫేస్‌లో అదే ఉద్యోగం ఇస్తూ వేజ్ప్రొటక్షన్ తదితర డిమాండ్ల పరిష్కారంపై కార్మికులు ఎదురుచూస్తున్నారు. సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులు శ్రమదోపిడీకి గురవుతున్నారు. కోలిండియా మాదిరిగా సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కనీసవేతనాలు అందడం లేదు. జిల్లా పరిధిలోని సింగరేణిలో సుమారు నాలుగువేల మంది కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు. వలస కార్మికుల పరిస్థితి అగమ్యగోచరం కరీంనగర్ జిల్లాలో భవన నిర్మాణ, గ్రానైట్, తదితర రంగాల్లో 85వేల మందికిపైగా వలసకూలీలు ఉన్నారు. స్థానికులు 2లక్షలకు పైగానే ఉన్నారు. కార్మికశాఖ లెక్కల ప్రకారం ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలు ఆధార్, రేషన్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్ ఉంటేనే జిల్లాలో కార్మికుడిగా గుర్తింపు పొందే అవకాశం ఉంది. వలస వచ్చే కార్మికులకు అలాంటి అవకాశాలు లేకపోవడంతో అనధికారికంగా ఏజెంట్ల వద్ద పనిచేస్తూ సంవత్సరానికి కాంట్రాక్టు మాట్లాడుకుని పొట్ట పోసుకుంటున్నారు. జిల్లాలో ఇటుకబట్టీల్లో ఒడిశా కార్మికులు 3వేల మందికిపైగా ఉన్నారు. ప్లంబర్, పీవోపీ పనుల కోసం రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ కార్మికులు, లేబర్ పనుల కోసం ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రకు చెందినవారు 30వేల మందికిగాపైగా ఇక్కడ జీవనోపాధి పొందుతున్నారు. ఇంటి నిర్మాణ మేసీ్త్రలుగా ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు పదివేల కుటుంబాలకు చెందిన వారు ఉన్నట్లు సమాచారం. జిల్లాలో 550కిపైగా గ్రానైట్ క్వారీల్లో తమిళనాడు, మధ్యప్రదేశ్, మహారాష్ట్రకు చెందిన వారితో పాటు స్థానికులు కూడా పదివేల మందివరకు పనిచేస్తున్నారు. అరకొర వేతనాలతో ఒక పూట పస్తులుండి కాలం వెళ్లదీస్తున్న కుటుంబాలెన్నో. కార్మికులకు సౌకర్యాలు కల్పించాలని గ్రానైట్వర్కర్స్ యూనియన్ చేస్తున్న పోరాటం నిరంతరం కొనసాగుతూనే ఉంది. వలస కార్మికులు పనిచేసే చోట ప్రమాదవశాత్తు మరణిస్తే అధికారికంగా ఎలాంటి సాయం అందడం లేదు. అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు కథలాపూర్(వేములవాడ): ఉన్న ఊరిలో సరైన ఉపాధిలేక పలువురు జిల్లా వాసులు ఉపాధిని వెతుక్కుంటూ అప్పులు చేసి వీసాలు కొనుగోలు చేసి ఇప్పటికీ గల్ఫ్ బాటపడుతున్నారు. అక్కడ సరైన ఉపాధి దొరక్కపోవడంతో అప్పు తీర్చేందుకు అరకొరవేతనాలతో కొందరు నెట్టుకొస్తుండగా.. మరికొందరు కొన్నిరోజులకే ఇంటిబాట పడుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో పనులు లేక కూలీలు పనుల కోసం జగిత్యా ల జిల్లాకు వస్తున్నారు. జిల్లాకు వలస వస్తున్న కూలీలు ఎక్కువగా కొనుగోలు కేంద్రాల్లో హమాలీలుగా, వరినాట్లు వేసేందుకు వస్తున్నారు. భవన నిర్మాణాల కోసం కూలీలు, మేస్త్రీలుగా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి వస్తున్నారు. జిల్లానుంచి లక్ష మందికి పైగా గల్ఫ్‌దేశాలకు ఉపాధికోసం వెళ్తుండగా.. ఇతర రాష్ట్రాల వాళ్లు దాదాపు 2,500 మంది ఇక్కడి పనిచేస్తున్నారు. నేను రైతును.. గల్ఫ్‌బాట పట్టిన నాలుగు ఎకరాల భూమిలో సాగుచేసిన. బోర్లు వేస్తే చుక్కనీరు రాలే. ఏళ్లుగా చూసిన ఏ ప్రాజెక్టు నీళ్లు మా శివారులకు చేరలే. వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీరకపోవడంతో గల్ఫ్ బాట పట్టిన. దుబాయిలో వాహనాల తయారీ కంపెనీలో కార్మికుడిగా పనిలోచేరిన. పని కష్టమైనప్పటికి డబ్బుల కోసం కష్టాన్ని దిగమింగుకునే పరిస్థితి నెలకొంది. గది, భోజనాల ఖర్చులు పోను నెలకు రూ.12 వేలు మిగులుతున్నాయి. గల్ఫ్ వలసకార్మికులతోపాటు రైతులు, కార్మికుల సంక్షేమాల కోసం ప్రభుత్వాలు ఆలోచించాలి. – పిడుగు రమేశ్, తాండ్య్రాల, కథలాపూర్ పేర్లు నమోదు చేసుకోవాలి ఇతరరాష్ట్రాల నుంచి జిల్లాకు వస్తు న్న వలస కూలీలు ఆధార్, రేషన్‌కార్డు, బ్యాంక్ పాస్‌బుక్‌తో తాము పనిచేస్తున్న యాజమాని అనుమతి తో కార్మికశాఖ కార్యాలయంలో పేరు నమోదుచేసుకోవాలి. చాలా మంది వలస కూలీలు ఇతరత్రా పనుల కోసం వస్తూ ఏడాది కాంట్రాక్ట్ ముగియగానే వారి య జమా ని ఇచ్చిన డబ్బులు తీసుకుని వెళ్లిపోతుంటారు. కార్మికశాఖ కార్యాలయంలో గుర్తింపు పొందినకార్డులు తీసుకున్న వారే ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులు. – ఎస్.రమేశ్‌బాబు, ఉప కార్మిక కమిషనర్, కరీంనగర్ -
నెత్తుటి జెండాలు ఎగిసిన రోజు..
19వ శతాబ్దం.. పారిశ్రామిక విప్లవాల కాలం.. రోజుకి 14, 15 గంటల పని. దుర్భరం.. పొద్దున పనికెళ్లిన వాళ్లు ఎప్పుడు తిరిగొస్తారో, అసలు వస్తారో రారో తెలియదు.. వందలు, వేల మంది చచ్చి శవాలవుతున్నారు. దీనికి ముగింపెట్లా? ఎవరు, ఎలా, ఏమి చేయాలి? ఆ ఆలోచనే 1884 అక్టోబర్ 7న షికాగో సదస్సు. సంఘటిత వాణిజ్య వ్యాపార సంస్థల కార్మిక సంఘాల సమాఖ్య (ఆ తర్వాత ఇదే అమెరికా కార్మిక సమాఖ్య–ఏఎఫ్ఎల్) ఇందుకు నడుంకట్టింది. 8 గంటల పని దినమని నినదించింది. అమెరికా, కెనడా ప్రభుత్వాలకు రెండేళ్ల గడువిచ్చింది. 1886 మే 1 నుంచి అమలు చేయాలని అల్టిమేటం ఇచ్చింది. లేకుంటే సమ్మేనని హెచ్చరించింది. ప్రపంచ దేశాల్లోని సోదర కార్మిక సంఘాలకూ ఈ సందేశం పంపింది. అప్పటికే ఆస్ట్రేలియా కార్మికవర్గం 8 గంటల పని, 8 గంటల వినోదం, 8 గంటల విశ్రాంతి నినాదాన్ని అందుకుంది. లండన్, ప్యారిస్ వంటి యూరోపియన్ నగరాలు 8 గంటల పని దినం కోసం గొంతెత్తాయి. అనుకున్నట్టుగానే 1886 మే 1న ఉదయం 10 గంటలకు షికాగోలో సమ్మే మొదలై అమెరికా అంతటా అమలైంది. 13 వేల సంస్థల మూత.. 24 గంటల్లో సమ్మె చేస్తున్న కార్మికుల సంఖ్య 4 లక్షలకు చేరింది. ఒక్క షికాగాలోనే 40 వేల మంది కార్మికులు.. భార్యాబిడ్డలతో ర్యాలీ.. బ్యానర్లు, ఎర్రజెండాల రెపరెపలు.. మిన్నంటిన నినాదాలు.. హోరెత్తిన ప్రసంగాలు.. వీధులు మార్మోగాయి. మర్నాటికి ఉధృతి మరింత పెరిగింది. సమ్మె మూడో రోజున అంటే మే 3న హే మార్కెట్ నుంచి ప్రదర్శన మెక్ కార్మిక్ రీపర్ వర్క్స్ వద్దకు చేరింది. పోలీసులు కాల్పులు జరిపారు. ఆరుగురు కార్మికులు నేలకొరిగారు. వందలాది మంది నెత్తుటి మడుగుల్లో గిలగిల్లాడారు. (అధికారిక లెక్క మాత్రం ఒకరి మృతి..60 మంది క్షతగాత్రులు) ఈ ఘాతుకాన్ని సంఘం నిరసించింది. మర్నాడు ర్యాలీ జరపాలని నిర్ణయించింది. మే 4.. 1886. సాయంత్రం.. హే మార్కెట్, రాన్‌డాల్ఫ్ స్ట్రీట్ (175 ఎన్. డెస్ ప్లెయిన్స్ స్ట్రీట్) కిక్కిరిసింది. మీటింగ్ మొదలైంది. ఓ వ్యాగన్‌నే వేదిక చేసుకున్న కార్మిక నాయకులు ప్రసంగాలు చేశారు. చివరి వక్త ఆగస్ట్ స్పైస్ సభను ముగించబోతున్నారు. ఇంతలో ఖాకీలు కయ్యానికి కాలుదువ్వారు. లాఠీలతో కార్మికులను కుళ్లబొడిచారు. తుపాకులతో నెత్తురు కళ్ల జూశారు. సరిగ్గా ఆ సమయంలో జనంపై బాంబు.. ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరు విసిరారో తెలియదు. ఒక సార్జెంట్ మృతి.. కార్మికులు, పోలీసుల బాహాబాహీ. యుద్ధ రంగాన్ని మించిన బీభత్సం. ఏడుగురు పోలీసులు, 8 మంది కార్మికులు చచ్చిపోయారు. హే మార్కెట్ కార్మికుల రక్తంతో తడిసి ముద్దయింది. షికాగో స్తంభించింది. 15 మంది కార్మికనేతలపై కేసు నమోదైంది. 8 గంటల పనని అరవడమే నేరమైంది. వీళ్లలో 8 మందిపై అరాచక వాదులని ముద్ర వేశారు. అమ్ముడుపోయిన జ్యూరీ.. 1886 ఆగస్టులో విచారణ మొదలైంది. జ్యూరీ డబ్బున్న వాళ్లకు చుట్టమైంది. ఆ 15 మందిలో ఏడుగురికి ఉరిశిక్ష, మిగతా 8 మందికి 15 ఏళ్ల కఠిన కారాగారా శిక్ష. 1886 చివర్లో నలుగురు నాయకులు.. పార్సన్స్, స్పైస్, ఫిషర్, ఏంజిల్‌ను ఉరితీశారు. ఒక నాయకుడు జైల్లోనే నోట్లో పేలుడు పదార్థం పెట్టుకొని పేల్చేసుకున్నాడు. జ్యూరీ తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో మిగతా ముగ్గురికి క్షమాభిక్ష పెట్టారు. ఆరేళ్ల తర్వాత విడుదల చేశారు. ఈ ఉరితీతలు ప్రపంచాన్ని కుదిపేశాయి. మే డేను ప్రకటించిన రెండో ఇంటర్నేషనల్... కమ్యూనిస్టులు, సోషలిస్టులు, లేబర్ పార్టీలు, ఇతర ప్రగతిశీల శక్తులతో ఫస్ట్ ఇంటర్నేషనల్ ఏర్పాటైంది. అది 1876లో రద్దయింది. తిరిగి రెండో ఇంటర్నేషనల్ 1889లో మొదలైంది. ఈ సంస్థే మే 1ని అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా, మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది. హే మార్కెట్ అమరవీరుల త్యాగానికి తర్పణాలు పట్టింది. వారి త్యాగాన్ని కీర్తిస్తూ 1890 మే 1న ర్యాలీలు జరపాలని పిలుపిస్తే ఒక్క లండన్‌లోనే 3 లక్షల మందితో ప్రదర్శన జరిగింది. ఆ తర్వాతే కార్మికవర్గ చరిత్రలో ‘మే డే’ భాగమైంది. 66 దేశాలు అధికారికంగా, మరికొన్ని అనధికారిక సెలవునిస్తున్నాయి. కానీ, ఎక్కడైతే పోరు ప్రారంభమైందో ఆ దేశమైన అమెరికా మాత్రం ఇప్పటికీ మేడేని గుర్తించలేదు. సెప్టెంబర్‌లో వచ్చే తొలి శుక్రవారాన్ని అమెరికా లేబర్ డేగా ప్రకటించింది. మే 1ని న్యాయ దినోత్సవంగా ప్రకటించింది. 1923 నుంచీ.. మన దగ్గర 1923 దాకా మేడే జరగలేదు. 1923 మే 1న హిందూస్థాన్ లేబర్ కిసాన్ పార్టీ నాయకుడు సింగారవేల్ నాయకత్వంలో మద్రాస్‌లో తొలిసారి ప్రదర్శన జరిగింది. హై మార్కెట్ ఇప్పుడెలా ఉందంటే.. 2021 మార్చి 9.. మంగళవారం సాయంత్రం 6.40 గంటలు.. షికాగోలోని మేడే స్మారక స్థూపాన్ని చూడాలన్న కోర్కె నెరవేరిన రోజు. డౌన్ టౌన్‌లోని 175 ఎన్. డెస్ ప్లెయిన్స్ స్ట్రీట్. కార్మికుల రక్తంతో తడిసిన హే మార్కెట్ ప్రాంతమదే. ఆ స్థూపాన్ని చూడడంతోనే.. మేడే నేడే పాట చేవుల్లో మార్మోగింది. మైళ్ల పొడవునా ఆంధ్రాలో జరిగిన మేడే ర్యాలీలు మదిలో మెదిలాయి. పోరు జరిగిన ప్రాంతంలో స్థూపం ... నాడు.. కార్మిక నాయకులు వ్యాగన్ మీద నుంచి చేసిన ప్రసంగం స్ఫూర్తితోనే మేరీ బ్రొగ్గర్ అనే శిల్పి ఈ స్థూపాన్ని తయారు చేశారు. భావప్రకటనా స్వేచ్ఛ, సభలు జరుపుకునే హక్కు, కార్మికులు సంఘటితమయ్యే స్వేచ్ఛ, 8 గంటల పని దిన పోరు, చట్టం, న్యాయం.. ఇలా మానవ హక్కుల్లోని ప్రతి కోణాన్నీ ఈ స్థూపం ఆవిష్కరిస్తుంది. ఒక వీరుడు నెలకొరుగుతుంటే మరో వీరుడు ఆదుకునేలా, కార్మిక శక్తే పునాదిగా నిర్మించిన వేదికపై ముగ్గురు నాయకులు నినదిస్తున్నట్టుగా ఉంటుందీ చిత్రం. హే మార్కెట్ అమరవీరుల మాన్యుమెంట్.. 1893లో షికాగో శివార్లలోని ఫారెస్ట్ పార్క్ స్మశానంలో ఏర్పాటయింది. ఇదే తొలి స్థూపం. ‘మీరు ఈవేళ మా గొంతు నులిమారు సరే. కానీ మా మౌనం విస్పోటంలా వినిపించే రోజొకటి వస్తుంది’ అని ఆ స్థూపం శిలాఫలకంపై ఉంటుంది. కార్మికుల పోరాట శక్తి ఏమైంది? సోషలిస్టు దేశాల పతనం, ప్రపంచీకరణ, కెరియరిజం నేపథ్యంలో పని గంటల ఊసు ఆరివైపోయింది. చివరకు కార్మిక సంఘం ఏర్పాటు చేసుకునే హక్కుకూ కష్టకాలం వచ్చింది. ఇండియాలో 44 కార్మిక చట్టాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ప్రతిఘటించాల్సిన కార్మిక వర్గం ప్రేక్షకపాత్రకు పరిమితమైంది. కార్మిక, కర్షక, అణగారిన బడుగు, బలహీన వర్గాలు చేయి చేయి కలిసినడిచేది ఎన్నడో.. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ షికాగో అమరవీరులకు జోహార్లు. - ఏ.అమరయ్య -
కార్మికులకు వైఎస్ జగన్ మే డే శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లోని కార్మిక సోదరులకు, తెలుగు రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాలకు, ప్రపంచంలోని వివిధ దేశాలకు వెళ్లిన కార్మిక సోదరులకు వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మే డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. పారిశ్రామిక రథం కదులుతోందన్నా, ఆర్థిక వ్యవస్థ సవ్యంగా నడుస్తోందన్నా అది కార్మికులు స్వేదం, రక్తంతో పాటు వారి జీవితాలనే ధారపోయటం వల్ల సాధ్యమవుతోందని వైఎస్ జగన్ తన సందేశంలో పేర్కొన్నారు. కార్మికుల ప్రయోజనాల పరిరక్షణలో, ప్రభుత్వ రంగాన్ని పరిరక్షించడంలో కార్మిక సోదరుల సంక్షేమం కోసం పథకాలు రచించటంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన దేశంలోనే సువర్ణ అధ్యాయమని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కార్మికుల పక్షపాతిగా వైఎస్సార్ కాంగ్రెస్, వారి హక్కుల పరిరక్షణకు, కార్మికుల కుటుంబాలు మరింత సంతోషంగా ఉండేందుకు అన్ని విధాలా పాటుపడుతుందని వైఎస్ జగన్ తెలిపారు. జేఈఈ ర్యాంకర్లకు జగన్ శుభాకాంక్షలు జేఈఈలో ర్యాంక్ సాధించిన విద్యార్థులకు ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ట్వీట్ చేశారు. ‘జేఈఈ ర్యాంకర్లకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. తెలుగు విద్యార్థులు అగ్రశ్రేణి ర్యాంకులు సాధించడం గర్వకారణం. భవిష్యత్తులో మీ అందరికీ మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నాను’ అని పేర్కొన్నారు. -
కార్మికులకు వైఎస్ జగన్ మే డే శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘మే’ డే శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల ప్రయోజనాల పరిరక్షణలో ప్రభుత్వ రంగాన్ని పరిరక్షించడంలో శ్రామికుల సంక్షేమం కోసం పథకాలు రచించడంలో దివంగత మహానేత వైఎస్ఆర్ పాలన సువర్ణ అధ్యాయం అని ఆయన అన్నారు. అదేబాటలో వైఎస్సార్ సీపీ ఆవిర్భావం నుంచి అడుగులు వేస్తోందని, కార్మికుల పక్షపాతిగా, వారి హక్కుల పరిరక్షణకు, కార్మికుల కుటుంబాలు మరింత సంతోషంగా ఉండేందుకు వైఎస్సార్ సీపీ అన్ని విధాలుగా పాటుపడుతుందని వైఎస్ జగన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
మేడే రోజే కార్మికుడిపై దౌర్జన్యం
కామారెడ్డి, న్యూస్‌లైన్ : ప్రపంచ కార్మిక దినోత్సవం రోజునే ఓ కార్మికుడిపై అధికారి చేయిచేసుకున్న సంఘటన గురువారం ఉదయం కామారెడ్డిలో చోటుచేసుకుంది. కామారెడ్డి ఆర్టీసీ డిపోలో అద్దె బస్సును తనిఖీ చేస్తున్న సమయంలో డిపో మేనేజర్ జగదీశ్వర్ బస్సు అపరిశుభ్రంగా ఉందంటూ డ్రైవర్ ఎండీ మజీద్ చెంప చెళ్లుమనిపించారు. దీంతో విస్తుపోయిన డ్రైవర్ ఎందుకుసార్ ఇలా కొడతారని ప్రశ్నించగానే మరోసారి చెయ్యి చేసుకున్నారు. దీంతో డ్రైవర్ బస్సును డిపోలోనే నిలిపివేసి తోటి అద్దె బస్సు డ్రైవర్లు, యూనియన్ల నేతలకు సమాచారం అందించారు. అద్దె బస్సు డ్రైవర్లు వచ్చి కొంతసేపు ఆందోళన చేశారు. బాధితుడు కామారెడ్డి పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా ఈ సంఘటనపై కార్మికులు, డీఎం మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నాలు జరిగాయని సమాచారం. డిపో మేనేజర్ కార్మిక దినోత్సవం రోజునే కార్మికుడిపై దౌర్జన్యం చేసిన సంఘటన కార్మికుల్లో ఆగ్రహం తెప్పించింది. అద్దె బస్సు తనిఖీ సమయంలో బస్సులో లోపాలుంటే సంబంధిత వాహనం యాజమానికి నోటీసు ఇవ్వడమో, ఇంకా ఏదైనా ఫైన్ వేయడమో చేయాలని, ఇలా డ్రైవర్‌పై చేయి చేసుకోవడం ఏమిటని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. డీఎంను సస్పెండ్ చేయాలి మేడే రోజున కార్మికుడిపై అకారణంగా దాడి చేసిన డిపో మేనేజర్‌ను సస్పెండ్ చేయాలని పీడీఎస్‌యూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్ఎన్ ఆజాద్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన డీఎంపై చర్యలు తీసుకోవాలన్నారు. డ్రైవర్‌ను కొట్టాననేది అవాస్తవం -డీఎం జగదీశ్వర్, కామారెడ్డి బస్సు ఫిట్నెస్ను పరిశీలించగా ఎన్నో లోపాలు కనిపించాయి. లోపాలను ఎత్తిచూపి సదరు వాహనం డ్రైవర్‌ను మందలించాను. అయితే ఆ డ్రైవర్ లోపాలను కప్పిపుచ్చుకునేందుకే తప్పుడు ఆరోపణ చేశారు. మందలించిన పాపానికి చేయిచేసుకున్నానని దుష్ర్పచారం చేస్తున్నారు.