సాక్షి, హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ‘మే’ డే శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల ప్రయోజనాల పరిరక్షణలో ప్రభుత్వ రంగాన్ని పరిరక్షించడంలో శ్రామికుల సంక్షేమం కోసం పథకాలు రచించడంలో దివంగత మహానేత వైఎస్‌ఆర్ పాలన సువర్ణ అధ్యాయం అని ఆయన అన్నారు. అదేబాటలో వైఎస్సార్ సీపీ ఆవిర్భావం నుంచి అడుగులు వేస్తోందని, కార్మికుల పక్షపాతిగా, వారి హక్కుల పరిరక్షణకు, కార్మికుల కుటుంబాలు మరింత సంతోషంగా ఉండేందుకు వైఎస్సార్ సీపీ అన్ని విధాలుగా పాటుపడుతుందని వైఎస్ జగన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment