జిల్లాలో 2.1 మి.మీ వర్షపాతం నమోదు
జిల్లాలో 2.1 మి.మీ వర్షపాతం నమోదు
Published Sat, Jul 22 2017 1:01 AM | Last Updated on Tue, Sep 5 2017 4:34 PM
ఏలూరు (మెట్రో) : జిల్లాలో గడచిన 24 గంటల్లో సగటున 2.1 మి.మీ వర్షపాతం నమోదైందని సీపీవో బాలకృష్ణ ఒక ప్రకటనలో చెప్పారు. అత్యధికంగా తాడేపల్లిగూడెం మండలంలో 12.2 మి.మీ, ఉంగుటూరు మండలంలో 3.2 మి.మీ, భీమడోలు మండలంలో 6.2 మి.మీ, పెదవేగి 2.4 మి.మీ, పెదపాడు 10.4 మి.మీ, ఏలూరు 1.2 మి.మీ, దెందులూరు, నిడమర్రు 3.2 మి.మీ, పెంటపాడు 4.8 మి.మీ, తణుకు 4.6, ఉండ్రాజవరం 2.2, పెరవలి 3.8, ఇరగవరం 1.6, అత్తిలి 2.4, ఉండి 5.2, ఆకివీడు 4.4, కొయ్యలగూడెం 4, కాళ్ల 3.2, భీమవరం 2.2, పాలకోడేరు 4.2, పెనుమంట్ర 3.8, పెనుగొండ 1.6, పోడూరు 9.4 మి.మీ వర్షపాతం నమోదైంది. గడిచిన 24 గంటల్లో మొత్తం 102 మి.మీ వర్షపాతం నమోదైనట్టు సీపీవో చెప్పారు.
Advertisement
Advertisement