Indian IT sector
-
ఐటీలో వృద్ధి 6 శాతంలోపే
న్యూఢిల్లీ: భారత ఐటీ రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024–25) 4 నుంచి 6 % మద్య ఆదాయంలో వృద్ధిని నమోదు చేయవచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. స్థూల ఆర్థిక సవాళ్ల నేపథ్యంలో యూఎస్, యూరప్ లోని క్లయింట్లు టెక్నాలజీలపై వ్యయా లు తగ్గించుకోవడాన్ని కారణంగా పేర్కొంది. ఆదా యం పరంగా సవాళ్లు ఉన్నప్పటికీ నిర్వహణ మార్జిన్లు మెరుగ్గా 22% మేర ఉంటాయని తెలి పింది. అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలస) గణనీయంగా తగ్గి, సమీప కాలంలో స్థిరపడొ చ్చని అంచనా వేసింది. మెరుగైన నగదు ప్రవాహాలు, బలమైన బ్యాలన్స్ షీట్లను పరిగణనలోకి తీసుకుని ఐటీ పరిశ్రమకు స్థిరమైన అవుట్‌లుక్ ఇచి్చంది. అధిక ద్రవ్యోల్బణం, వడ్డీ వ్య యాలు కీలక రంగాల్లోని క్లయింట్లపై ఒత్తిళ్లకు దారితీశాయని, ఫలితంగా వ్యయాలని యంత్రణ, విచక్షణారహిత వ్యయాలను క్లయింట్లు వాయిదా వేసుకోవడాన్ని ప్రస్తావించింది. ఆర్డ ర్లు రాక తగ్గుముఖం పట్టినప్పటికీ.. ఐటీ కంపెనీలకు ఆర్డర్, డీల్స్ పైపులైన్ బలంగానే ఉ న్నట్టు ఇక్రా తెలిపింది. ఒక్కసారి ఆర్థిక పరిస్థితులు కుదుటపడితే మధ్యకాలానికి ఐటీ కంపెనీల్లో వృద్ధి మళ్లీ పుంజుకుంటుందని ఇక్రా కార్పొరేట్ రేటింగ్స్ హెడ్ దీపక్ జోత్వాని పేర్కొన్నారు. కీలక మార్కెట్లో రికవరీ కీలకం.. దేశ ఐటీ కంపెనీల ఆదాయం గడిచిన ఐదారు త్రైమాసికాలుగా పెద్ద వృద్ధిని చూడకపోవడం గమనార్హం. ఇక్రా ఎంపిక చేసిన 15 పెద్ద, మధ్యస్థాయి లిస్టెడ్ ఐటీ కంపెనీలు 2023–24లో డాలర్ పరంగా కేవలం 5.5 శాతం వృద్ధినే నమోదు చేశాయి. 2022–23లో ఇది 9.2 శాతంగా ఉంది. అయినప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీల నిర్వహణ మార్జిన్లు 22 శాతంగా ఉంటాయని ఇక్రా అంచనా వేస్తోంది. దేశ ఐటీ కంపెనీలకు సింహభాగం ఆదాయం యూఎస్ నుంచి వస్తుంటే, ఆ తర్వాత యూరప్, మిగిలిన ప్రపంచ మార్కెట్ల (ఆర్వోడబ్ల్యూ) నుంచి వస్తోంది. ఇక్రా ఎంపిక చేసిన ఐటీ కంపెనీల ఆదాయంలో 55–60 శాతం మేర ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలోయూఎస్ నుంచే వచ్చింది. యూరప్ నుంచి 22–25 శాతం సమకూరింది. స్థూల ఆర్థిక అనిశి్చతుల ప్రభావం పరిశ్రమపై ఇక మీదట ఉండొచ్చని, కీలక మార్కెట్లలో నియంత్రణపరమైన తీవ్ర మార్పులు చోటు చేసుకుంటే అది ప్రతికూల ప్రభావం కొనసాగేలా చేయొచ్చని పేర్కొంది. జెనరేషన్ ఏఐ మధ్య కాలంలో ఐటీ పరిశ్రమ వృద్ధికి కీలకమని.. ప్రముఖ ఐటీ కంపెనీలు తమ సిబ్బందికి ఇందులో శిక్షణ ఇప్పించి, సేవల పరంగా తమ సామర్థ్యాలను పెంచుకున్నట్టు ఇక్రా తన నివేదికలో వివరించింది. జెనరేషన్ ఏఐ పరంగా ఆర్డర్‌బుక్ లేదా ఆదాయం ఇప్పటి వరకు పరిమితంగా ఉండగా, మధ్య కాలానికి పుంజుకోవచ్చని అంచనా వేసింది. డిమాండ్ మోస్తరుగా ఉండడం, 2022–23లో అధికంగా చేరిన సిబ్బందితో ఇటీవలి కాలంలో ఐటీ కంపెనీల నియామకాలపై ప్రభావం పడినట్టు తెలిపింది. లిస్టెడ్ కంపెనీలకు సంబంధించి నికర సిబ్బంది తగ్గుదల చోటుచేసుకున్నట్టు పేర్కొంది. -
సైలెంట్ లేఆఫ్‌లు.. 20 వేల మంది టెకీలు ఇంటికి..
ప్రపంచవ్యాప్తంగా ఐటీ పరిశ్రమ గత కొంత కాలంగా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. లేఆఫ్‌ల పేరుతో లక్షలాది మంది ఉద్యోగులను కంపెనీలు అధికారికంగా తొలిగించాయి. అప్రకటింతగానూ వేలాదిగా ఐటీ ఉద్యోగులు జాబ్స్ కోల్పోయారు. దేశంలోని ఐటీ పరిశ్రమలో 2023 క్యాలెండర్ సంవత్సరంలో దాదాపు 20 వేల మంది ‘సైలెంట్’గా ఉద్యోగాలు కోల్పోయారు.ఆలిండియా ఐటీ అండ్ ఐటీఈఎస్ ఎంప్లాయీస్ యూనియన్ (ఏఐఐటీఈయూ) వెల్లడించిన వివరాల ప్రకారం 2023 క్యాలెండర్ ఇయర్లో దేశ ఐటీ రంగం దాదాపు 20,000 మంది టెకీలను ‘సైలెంట్ లేఆఫ్’ విధానంలో తొలగించింది. మనీకంట్రోల్ నివేదిక ప్రకారం.. ఈ తొలగింపులు చిన్నా పెద్ద అన్ని ఐటీ కంపెనీలలో జరిగాయని, వాస్తవ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని ఏఐటీఈయూ భావిస్తోంది.ఇలా అత్యధికంగా ఉద్యోగులను తొలగించిన ఐటీ కంపెనీల్లో ప్రముఖంగా టీసీఎస్, ఇన్ఫోసిస్, ఎల్టీఐ-మైండ్ ట్రీ, టెక్ మహీంద్రా, విప్రో వంటి దిగ్గజ కంపెనీలు ఉన్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం ఒక్క హెచ్‌సీఎల్ టెక్‌లో మాత్రమే ఉద్యోగుల సంఖ్య పెరిగింది. అప్రకటిత పద్ధతిలో ఉద్యోగులను తొలగించే పరిస్థితిని "సైలెంట్ లేఆఫ్" సూచిస్తుంది. అంటే కాంట్రాక్టులను పునరుద్ధరించకపోవడం, పని గంటలను తగ్గించడం, ముందస్తు పదవీ విరమణకు పురిగొల్పడం, ఖాళీలను భర్తీ చేయకపోవడం వంటివి. -
దేశ ఐటీ రంగంలో టాప్.. అత్యధిక వేతనం ఈయనదే..
దేశ ఐటీ రంగంలో అత్యధిక వేతనం అందుకున్న సీఈవోగా కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ సింగిశెట్టి నిలిచారు. ‘మింట్’ నివేదిక ప్రకారం.. కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ గత సంవత్సరం వేతన పరిహారంగా 22.56 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 186 కోట్లు) అందుకున్నారు. కంపెనీ ఫైలింగ్ ప్రకారం, రవి కుమార్ సింగిశెట్టి గత సంవత్సరం మొత్తంగా 22.56 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 186 కోట్లు) అందుకోగా ఇందులో 20.25 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.169.1 కోట్లు) విలువైన షేర్లను అందుకున్నారు. గత ఏడాది కాగ్నిజెంట్ ఆదాయం రూ.19.35 బిలియన్ డాలర్లు ఉండగా ఇందులో సీఈవో రవి కుమార్ వేతన పరిహారం 0.11 శాతంగా ఉంది. ఇతర ఐటీ సీఈవోల వేతనాలు ఇలా.. విప్రో మాజీ సీఈవో థియరీ డెలాపోర్టే రూ. 10.1 మిలియన్ డాలర్లు (రూ. 83 కోట్లు) హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సీఈవో విజయకుమార్ 10.65 మిలియన్ డాలర్లు (రూ. 88 కోట్లు) అసెంచర్ సీఈవో జూలీ స్వీట్ 31.55 మిలియన్ డాలర్లు (రూ.263 కోట్లు) ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ 6.8 మిలియన్లు ( రూ. 56.4 కోట్లు) టీసీఎస్ మాజీ సీఈవో రాజేష్ గోపీనాథన్ 3.5 మిలియన్ ( రూ. 29.16 కోట్లు) -
ఐటీ క్వీన్.. రోష్ని!
న్యూఢిల్లీ: భారత ఐటీ రంగంలో కొత్త క్వీన్ అరంగేట్రం చేసింది. పురుషాధిక్యత అధికంగా ఉన్న ఐటీ రంగంలో తొలిసారిగా ఒక ఐటీ కంపెనీ పగ్గాలు ఒక మహిళ చేతికి వచ్చాయి. దిగ్గజ ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌కు చైర్‌పర్సన్‌గా రోష్ని నాడార్ మల్హోత్ర నియమితులయ్యారు. హెచ్‌సీఎల్ టెక్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ స్థానంలో ఆయ న ఏకైక సంతానం, రోష్ని నాడార్ చైర్పర్సన్ బాధ్యతలను శుక్రవారమే స్వీకరించారు. కాగా కంపెనీ ఎమ్డీ(చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్)గా శివ్ నాడార్ కొనసాగుతారు. దేశంలోనే అత్యధిక సంపద ఉన్న మహిళగా రికార్డులకు ఎక్కిన ఈమె. స్టాక్మార్కెట్లో లిస్టైన ఐటీ కంపెనీ చైర్‌పర్సన్‌గా పగ్గాలు చేపట్టిన తొలి మహిళ అనే ఘనతను కూడా సాధించారు. శాస్త్రీయ సంగీతంలో శిక్షణ: శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందిన రోష్ని నాడార్ 2013లోనే హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వైస్ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. హెచ్‌సీఎల్ గ్రూప్ హోల్డింగ్ కంపెనీగా వ్యవహరిస్తున్న హెచ్‌సీఎల్ కార్పొరేషన్ సీఈఓగా ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 27 ఏళ్ల వయస్సుకే సీఈఓ వసంత్ వ్యాలీ స్కూల్లో పాఠశాల విద్య అభ్యసించిన రోష్ని నాడార్ ఢిల్లీలో కమ్యూనికేషన్స్ విభాగంలో డిగ్రీ చదివారు. కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ఎమ్బీఏ పట్టా పొందారు. 2009లో హెచ్‌సీఎల్ కార్ప్‌లో చేరారు. ఏడాదిలోనే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఎదిగారు. 27 ఏళ్ల వయస్సుకే సీఈఓ అయ్యారు. మహిళా కుబేరుల్లో టాప్ రోష్ని నాడార్ 2010లో హెచ్‌సీఎల్ హెల్త్‌కేర్ వైస్ చైర్మన్ శిఖర్ మల్హోత్రను వివాహమాడారు. వారికి ఆర్మాన్, జాహాన్... ఇద్దరు కుమారులు. హురున్ సంస్థ తాజా కుబేరుల జాబితాలో రూ.36,800 కోట్ల సంపదతో రోష్ని నాడార్ భారత్‌లోనే అత్యధిక సంపద గల మహిళగా అగ్రస్థానంలో నిలిచారు. -
భారతీయ ఐటీకి భారీ షాక్
- హెచ్1బీ వీసా నిబంధనలను కఠినతరం చేసిన అగ్రరాజ్యం - తాజా ఈవోపై సంతకం చేసిన డొనాల్డ్ ట్రంప్ - అమెరికన్లకే ఇక పెద్దపీట.. వృత్తినిపుణుల ఆశలపై నీళ్లు వాషింగ్టన్: అమెరికన్లకే పెద్దపీట అనే నినాదంతో అధ్యక్ష పదవిని చేపట్టిన డొనాల్డ్ ట్రంప్...భారతీయ ఐటీ రంగంతోపాటు వృత్తినిపుణులకు షాక్ ఇచ్చారు. హెచ్1బీ నిబంధనలను కఠినతరం చేసేందుకు ఉద్దేశించిన తాజా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్(ఈవో)పై సంతకం చేశారు. ‘బై అమెరికన్, హైర్ అమెరికన్’ అనే నినాదంతో ఈ వీసా విధానంలో సమూల మార్పులకు ఉద్దేశించిన తాజా ఈవోపై విస్కాన్సిన్లోని కెనోషా నగరంలోగల స్నాప్ ఆన్ ఇన్కార్పొరేషన్ కార్యాలయంలో మంగళవారం సంతకం చేశారు. అంతకముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘ప్రస్తుతం ఇమ్మిగ్రేషన్ విధానం తీవ్రస్థాయిలో దుర్వినియోగమవుతోంది. అమెరికన్లకు దక్కాల్సిన ఉద్యోగాల్లో విదేశీయుల ను నియమిస్తున్నారు. తక్కువ వేతనం చెల్లిస్తున్నారు. తాజా ఈవోతో ఈ దుర్వినియోగానికి అడ్డుకట్ట పడుతుంది’ అని అన్నారు. దీంతో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సంస్కరణల అమలులోకి వస్తాయని, వీసా దుర్వినియోగానికి తెరపడుతుందని చెప్పా రు. లాటరీ విధానంలో ఈ వీసాలను ప్రసు ్తతం జారీ చేస్తున్నారని, అది తప్పని అన్నా రు. ఇందుకు బదులు వాటిని అత్యంత ప్రతి భావంతులకు, భారీవేతనాలు తీసుకుంటున్నవారికి మాత్రమే విధిగా కేటాయించాలన్నారు. అమెరికన్లను తప్పించడం కోసం వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ వీటిని వినియోగించకూడదన్నారు. మా ఉద్యోగాలు మాకే తమ దేశంలోని ఉద్యోగాలు తమవారికి మాత్రమే దక్కేలా చేయాలనే లక్ష్యంతోనే ‘హైర్ అమెరికన్’ నిబంధనలను అమల్లోకి తీసుకురాబోతున్నామని ట్రంప్ చెప్పారు. ‘ఉద్యోగ నియామకాల్లో అమెరికన్లకే ప్రాధాన్యమివ్వాలని, అదే సమంజసమని అన్నారు. కాగా ట్రంప్ సంతకం చేసిన ఈవో ప్రకారం అమెరికా ప్రాజెక్టులను దేశీ య ఉత్పత్తులతోనే నిర్మించాల్సి ఉంటుం ది. ‘మా దేశంలోని కార్మికులు, ఉత్పత్తిదారులను మోసగించేందుకు విదేశాలు చేసే కుటిలయత్నాలను అంగీకరించబోం. ‘బై అమెరికన్’ విధానం కచ్చితంగా అమలయ్యేలా చూస్తాం. ఇందుకు భిన్నంగా కుది రే ఒప్పందాలపై నిఘా పెడతాం’ అంటూ ట్రంప్ హెచ్చరించారు. ట్రంప్ సంతకం చేసిన తాజా ఈవో ప్రకారం హెచ్1బీ వీసాలు అత్యంత ప్రతిభావంతులు, వృత్తినిపుణులకు మాత్రమే దక్కేలా చేసేందుకు అవసరమైన సంస్కరణలను సెక్రటరీ ఆఫ్ స్టేట్, అటార్నీ జనరల్, కార్మిక విభాగం సెక్రటరీ, హోంలాండ్ సెక్యూరిటీ సెక్రటరీలు సూచించాల్సి ఉంటుంది. అమెరికా అధికారులతో మాట్లాడతా న్యూఢిల్లీ: అమెరికా పర్యటన సందర్భంగా హెచ్1బీ వీసా అంశాన్ని అక్కడి యంత్రాంగం దృష్టికి తీసుకెళతానని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ బుధవారం సూచనప్రాయంగా తెలియజేశారు. ‘ఐటీ రంగానికి సంబంధించిన అంశాలపై సంబంధిత అధికారులతో చర్చించాల్సి ఉంటుంది. వారితో చర్చల అనంతరం ఏమిజరిగిందనేది మీకు తెలియజేస్తా. ’అని అన్నారు. ఇదిలాఉంచితే హెచ్1బీ వీసా మంజూరు విషయంలో నిబంధనలను కఠినతరం చేయడంపై భారతీయ ఐటీరంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. -
టీసీఎస్ దెబ్బ...ఐటీ పరిశ్రమను తాకనుందా?
ముంబై : అతిపెద్ద సాప్ట్ వేర్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసుపై యూఎస్ కోర్టు వేసిన 6 వేల కోట్ల జరిమానా వివాదం దేశంలోని మిగతా ఐటీ పరిశ్రమలపై ప్రభావం చూపనుందా అంటే మార్కెట్ విశ్లేషకులు అవుననే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. దీని ప్రభావంతో హెల్త్ కేర్ బిజినెస్ లో ఎక్కువ కీర్తి ప్రతిష్టలు కలిగన టీసీఎస్ పై భారత్ లో నమ్మకం కోల్పోయే ప్రమాదముందని అభిప్రాయాలు వస్తున్నాయి. ప్రస్తుత క్లిష్టమైన రాజకీయ వాతావరణంలో, భారత కంపెనీలు తేలికైన పద్ధతులు ఎంచుకుని ఇబ్బందులు పడుతున్నాయన్నారు. వివిధ ప్రాంతాల్లో భారత ఐటీ రంగం లీగల్ గా చాలా సమస్యలకు గురవుతుందని సాప్ట్ వేర్ నేషనల్ అసోసియేషన్ తెలిపింది. రహస్య వాణిజ్య దావా కేసులో కోర్టు టీసీఎస్ పై భారీ జరిమానా విధించింది. ఈ నేపథ్యంలో సోమవారం నాటి మార్కెట్లో టీసీఎస్ షేర్లు మార్కెట్లో కుప్పకూలుతున్నాయి. హెల్త్ రంగానికి సాప్ట్ వేర్ ను అందించడంలో ఎపిక్ సిస్టమ్స్ కీలక పాత్ర పోషిస్తోంది. టీసీఎస్ ఆదాయంలో ఎక్కువ శాతం లైఫ్ సైన్స్, హెల్త్ కేర్ నుంచే వస్తుంది. ఈ క్రమంలో టీసీఎస్ పై ఇలాంటి తీర్పు వెలువడటం కంపెనీ కీర్తి ప్రతిష్టలకు భంగంతో పాటు, పోటీదారులు మరింత అనుమానాలు రేకెత్తించే ప్రమాదముందని బెండర్ సాముల్ తెలిపారు. ఆస్పత్రులకు, క్లినిక్ లకు ఐటీ సర్వీసులను అందించడంలో మార్కెట్లో ఎక్కువ అభివృద్ధి ఉందని, ఈ పోటీల్లో టీసీఎస్ ముందంజలో నిలబడేందుకు చాలా ప్రయత్నాలు చేసిందని మార్కెట్ విశ్లేషకులు చెప్పారు. వివిధ ప్రాంతాల్లో భారత ఐటీ రంగం లీగల్ గా చాలా సమస్యలకు గురవుతుందని సాప్ట్ వేర్ నేషనల్ అసోసియేషన్ తెలిపింది. కానీ ముందుకంటే ఇవి ఎక్కువేమీ కాదని పేర్కొంది. మరోవైపు ఈ వివాదాన్ని టీసీఎస్ తేలిగ్గా తీసుకుంది. యూఎస్ హెల్త్ కేర్ సంస్థ ఎపిక్ సిస్టమ్స్ మేథో సంపత్తి హక్కుల ఉల్లంఘనను టీసీఎస్ ఖండించింది. యూఎస్ జ్యురీ ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు వెళ్తామని ప్రకటించింది. టాటా గ్రూప్ లోని ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అమెరికా అనుబంధ సంస్థ టాటా అమెరికా ఇంటర్నేషనల్ కార్ప్ పై 'ఎపిక్ సిస్టమ్స్' దాఖలు చేసిన ట్రేడ్ సీక్రెట్ దొంగిలింపు కేసులో విస్కాన్సిస్ లోని యూఎస్ ఫెడరల్ కోర్టు 940 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 6 వేల కోట్లు) భారీ జరిమానా విధించిన సంగతి తెలిసిందే.