icra
-
డిపాజిట్లపై బీమా పెంచితే బ్యాంకులపై ప్రభావం
ముంబై: డిపాజిట్లపై బీమా పరిమితిని రూ.5 లక్షలకు మించి పెంచితే అది బ్యాంకుల లాభదాయకతపై ప్రభావం చూపిస్తుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. దీనివల్ల సుమారు రూ.12,000 కోట్ల మేర లాభం తగ్గిపోవచ్చని అంచనా వేసింది. ప్రస్తుతం ఒక బ్యాంక్ పరిధిలో ఒక కస్టమర్ పేరిట రూ.5లక్షల బీమా సదుపాయాన్ని డీఐసీజీసీ అందిస్తోంది. ఇందుకు గాను బ్యాంక్‌లు డిపాజిట్ల మొత్తంపై డీఐసీజీసీకి ప్రీమియం చెల్లిస్తుంటాయి.రూ.5 లక్షలకు మించి పెంచే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్టు కేంద్ర ఆర్థిక సేవల కార్యదర్శి నాగరాజు ఇటీవలే ప్రకటించడం గమనార్హం. ప్రభుత్వం ఆమోదం తెలిపితే, నోటిఫై చేస్తామని చెప్పారు. ‘‘ఇటీవల ఓ కోపరేటివ్ బ్యాంక్ (న్యూ ఇండియా కోపరేటివ్ బ్యాంక్) వైఫల్యం నేపథ్యంలో డిపాజిట్ ఇన్సూరెన్స్ పరిమితి పెంపు చర్చకు వచ్చింది. ఇది బ్యాంక్‌లపై స్వల్ప స్థాయిలోనే అయినా, చెప్పుకోతగ్గ మేర లాభదాయకతపై ప్రభావం చూపించనుంది’’అని ఇక్రా ఫైనాన్షియల్ రంగం రేటింగ్స్ హెడ్ సచిన్ సచ్దేవ పేర్కొన్నారు. పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంక్ వైలఫ్యంతో చివరిగా 2020 ఫిబ్రవరిలో డిపాజిట్‌పై బీమాను రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచినట్టు గుర్తు చేశారు.97.8 శాతం డిపాజిట్లకు రక్షణ 2024 మార్చి నాటికి 97.8 శాతం బ్యాంక్ ఖాతాలు బీమా రక్షణ పరిధిలో ఉన్నట్టు ఇక్రా తెలిపింది. ఈ ఖాతాల్లోని డిపాజిట్ల మొత్తం రూ.5లక్షల్లోపే ఉన్నట్టు పేర్కొంది. ఇన్సూర్డ్ డిపాజిట్ రేషియో (ఐడీఆర్) 43.1 శాతంగా ఉన్నట్టు తెలిపింది. ఈ ఐడీఆర్‌ను 47 శాతం నుంచి 66.5 శాతానికి తీసుకెళితే, అప్పుడు బ్యాంకుల నికర లాభం రూ.1,800 కోట్ల నుంచి రూ.12,000 కోట్ల మేర ప్రభావితమవుతుందని వివరించింది. దీంతో బ్యాంకుల రిటర్న్ ఆన్ అసెట్స్ (ఆర్వోఏ) 0.01–0.04 శాతం మేర, రిటర్న్ ఆన్ ఈక్విటీ (ఆర్‌వోఈ) 0.07–0.4 శాతం మేర ప్రభావితం కావొచ్చని అంచనా వేసింది. -
రేట్ల కోత కాదు.. ఏం చేయాలో సూచించిన మిశ్రా
వృద్ధికి ఊతమివ్వాలని భావిస్తే ఆర్బీఐ(RBI) రేట్ల కోతకు బదులు ద్రవ్య లభ్యత పరిస్థితులను సులభతరం (లిక్విడిటీ) చేయడంపై దృష్టి పెట్టాలని యాక్సిస్ బ్యాంక్ ముఖ్య ఆర్థికవేత్త నీల్కాంత్ మిశ్రా సూచించారు. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలిలో మిశ్రా పార్ట్ టైమ్ సభ్యుడిగా ఉన్నారు. ఈ నెల మొదట్లో పావు శాతం మేర రెపో రేటును ఆర్బీఐ తగ్గించడం తెలిసిందే. అలాగే, తదుపరి పాలసీ సమీక్షల్లోనూ మరింత రేట్ల కోతతో రుణ వితరణ పెరగదని, ద్రవ్య కొరత రేట్ల కోత బదిలీకి అడ్డుపడుతుందని చెప్పారు.‘రేట్ల కోత ఉద్దేశ్యం మరిన్ని రుణాల జారీ అయితే.. కొత్త రుణాలు తక్కువ రేట్లపై జారీ చేయడం అసాధ్యం. ఎందుకంటే ద్రవ్య నియంత్రణ కట్టడి చర్యల ఫలితంగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ మనీ 18 నెలలుగా అధిక స్థాయిలో కొనసాగుతోంది. రేపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన తర్వాత కూడా ఏడాది కాల సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్ల రేటు 7.8 శాతం వద్దే కొనసాగుతోంది’ అని మిశ్రా వివరించారు. ఆర్బీఐ రెగ్యులర్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్‌ను చేపట్టడం ద్వారా తగినంత లిక్విడిటీ ఉండేలా చూడొచ్చన్నారు. లేదంటే నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ను తగ్గించడం మరింత ఫలితాన్నిస్తుందన్నారు. లిక్విడిటీ సాధారణ స్థాయికి చేరి, ప్రభుత్వం ద్రవ్య స్థిరీకరణకు కట్టుబడితే 2025–26 ద్వితీయ త్రైమాసికం నుంచి జీడీపీ వృద్ధి 7 శాతం రేటును చేరుకోవచ్చని అంచనా వేశారు. క్యూ3లో 6.4 శాతం వృద్ధి: ఇక్రాప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో జీడీపీ 6.4 శాతం వృద్ధిని నమోదు చేయొచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. ప్రభుత్వ వ్యయాలు పెరగడం ఇందుకు సాయపడుతుందని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో జీడీపీ 6.7 శాతం వృద్ధిని నమోదు చేయగా, జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో 5.4 శాతానికి పడిపోవడం గమనార్హం. గతేడాది సాధారణ ఎన్నికల ముందు ప్రభుత్వం అంచనాల మేరకు మూలధన వ్యయాలు చేయలేకపోవడం, డిమాండ్ బలహీనత ఇందుకు దారితీశాయి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు మూలధన, రెవెన్యూ వ్యయాలు పెంచడం, సేవల ఎగుమతుల్లో అధిక వృద్ధి, వస్తు ఎగుమతులు పుంజుకోవడం, ప్రధాన ఖరీఫ్ పంటల దిగుబడి మెరుగ్గా ఉండడం డిసెంబర్ త్రైమాసికంలో భారత ఆర్థిక పనితీరు బలపడేందుకు దోహదం చేస్తాయని ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్ వివరించారు.ఇదీ చదవండి: ట్రేడింగ్–డీమ్యాట్ ఖాతా లాగిన్ మరింత భద్రం!మొత్తం మీద క్యూ3లో జీడీపీ, జీవీఏ విస్తరణ కొనసాగుతుందన్నారు. పెట్టుబడులకు సంబంధించి సంకేతాల్లో వృద్ధి కనిపిస్తున్నట్టు ఇక్రా తన నివేదికలో పేర్కొంది. ప్రభుత్వాల మూలధన వ్యయాలు ఆరు త్రైమాసికాల గరిష్ట స్థాయి 47.7 శాతానికి క్యూ3లో పెరిగినట్టు, అంతకుముందు త్రైమాసికంలో ఇది 10.3 శాతంగా ఉన్నట్టు వెల్లడించింది. క్యూ3 జీడీపీ వృద్ధి అంచనాలు ఈ నెల 28న విడుదల కానున్నాయి. అలాగే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో ముందస్తు జీడీపీ అంచనాలను సైతం ఎన్ఎస్వో ప్రకటించనుంది. జనవరిలో విడుదల చేసిన తొలి అంచనాల ప్రకారం 2024–25లో వృద్ధి నాలుగేళ్ల కనిష్టం 6.4 శాతానికి తగ్గనుంది. కానీ, ఆర్బీఐ మాత్రం 6.6 శాతం వృద్ధిని అంచనా వేస్తోంది. -
హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ ఖాళీ
డిమాండ్‌కు మించి తాజా సరఫరా తోడవుతున్నందున 2026 మార్చి నాటికి హైదరాబాద్‌లోని మొత్తం కార్యాలయ స్థలంలో 24.5 శాతం ఖాళీగా ఉండవచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. వేకెన్సీ స్థాయి 2023 మార్చిలో 14.1 శాతం, 2025 సెప్టెంబర్‌లో 19.3 శాతంగా ఉందని తెలిపింది.‘హైదరాబాద్ మార్కెట్లో గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ ఆక్యుపెన్సీ 2026 మార్చి నాటికి 75.5–76 శాతానికి చేరవచ్చు. 2023 మార్చి నాటికి ఇది 86 శాతం నమోదైంది. నికర ఆక్యుపెన్సీతో పోలిస్తే సరఫరా ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్‌లో 2016–17 నుంచి 2023–24 మధ్య ఆఫీస్ స్పేస్ సరఫరా వార్షిక వృద్ధి రేటు ఏటా 14 శాతం దూసుకెళ్లింది. టాప్–6 ఆఫీస్ మార్కెట్లలో ఇది సుమారు 7 శాతం నమోదైంది. ఈ ఆరు మార్కెట్లలో 2024 మార్చి 31 నాటికి అందుబాటులో ఉన్న మొత్తం కార్యాలయ సరఫరాలో హైదరాబాద్ వాటా 15 శాతం. 2026 మార్చి నాటికి ఇది 17 శాతానికి చేరవచ్చు’ అని నివేదిక వివరించింది.ఇదీ చదవండి: బేర్.. ఎటాక్! మార్కెట్ నేల చూపులు ఎందుకంటే..అంచనాలు లేకుండా..అపరిమిత ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ) నియమాన్ని కలిగి ఉన్న ఏకైక ప్రముఖ భారతీయ నగరం హైదరాబాద్ అని ఇక్రా కార్పొరేట్ రేటింగ్స్ వైస్ ప్రెసిడెంట్, కో–గ్రూప్ హెడ్ అనుపమ రెడ్డి తెలిపారు. ‘ఈ నిబంధనలను సద్వినియోగం చేసుకుని కొంతమంది డెవలపర్లు సమీప కాలంలో లీజింగ్‌పై సరైన అంచనాలు లేకుండా భారీగా ఊహించుకుని నిర్మాణాలు చేపడుతున్నారు. ఫలితంగా డిమాండ్–సరఫరా మధ్య భారీగా అసమతుల్యత ఏర్పడింది’ అని అన్నారు. ‘2023–24 ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్‌లో 1.9 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ తోడైంది. ఇది హైదరాబాద్ చరిత్రలో అత్యధికం. అలాగే ఇతర టాప్ నగరాలతో పోలిస్తే ఇక్కడే ఎక్కువ. ఈ అధిక సరఫరా ధోరణి 2024–25, 2025–26 వరకు కొనసాగుతుంది. ఏటా 1.7–2 కోట్ల చదరపు అడుగుల కొత్త సరఫరా తోడు కానుంది. -
మరింత పెరగనున్న బంగారం కొనుగోళ్లు: సంచలన రిపోర్ట్
విలువ పరంగా దేశీయ బంగారు ఆభరణాల వినియోగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024–25) కూడా పటిష్టంగా ఉంటుందని రేటింగ్ ఏజెన్సీ- ఇక్రా పేర్కొంది. విలువ రూపంలో వినియోగం 14 శాతం నుంచి 18 శాతం వృద్ధి చెందుతుందని ఇక్రా నివేదిక తెలిపింది. 2023–24లో ఈ వృద్ధి రేటు 18 శాతంగా నివేదిక తెలిపింది.ఇక్రా నివేదిక ప్రకారం, బంగారం ధరలు అస్థిరంగా ఉన్నప్పటికీ వినియోగదారుల డిమాండ్ తగ్గలేదు. పండుగ నేపథ్యంలో.. ఇటీవలి నెలల్లో మరింత పెరిగిందని తెలిసింది. 2024 జూలైలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో 9% మేర (15 నుంచి 6 శాతానికి) దిగుమతుల సుంకం తగ్గడం, బంగారం ధరల్లో తాత్కాలిక ధరల కట్టడికి దారితీసిందని ఇది రెండవ త్రైమాసికంలో భారీ కొనుగోళ్లకు దారితీసిందని నివేదిక వివరించింది. ప్రత్యేకించి ఆభరణాలతోపాటు, నాణేలు, కడ్డీల కొనుగోళ్లూ పెరిగా యని వివరించింది. పండుగల సీజన్ కూడా పసిడి డిమాండ్‌కు కలిసి వచ్చిన అంశంగా పేర్కొంది. పెరుగుతున్న దిగుమతులు..భారత్ బంగారం దిగుమతులు సైతం భారీగా పెరుగుతుండడం గమనార్హం. భారత్ బంగారం దిగుమతులలో 40 శాతంతో స్విట్జర్లాండ్ అతిపెద్ద వాటా కలిగిఉంది. యూఏఈ వాటా 16% కాగా, దక్షిణాఫ్రికా వాటా 10%గా ఉంది. దేశంలోకి వచ్చీ – పోయే విదేశీ నిధులకు సంబంధించిన కరెంట్ అకౌంట్‌పై పసిడి కొనుగోళ్ల (దిగుమతుల) ప్రభావం కనబడుతోంది.2023–24లో భారత్ పసిడి దిగుమతుల విలువ 30% పెరిగి 45.54 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. యునైటెట్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ) నుంచి ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత 2024 - 25 ఆర్థిక సంవత్సరంలో భారత్ తయారీదారులు, వ్యాపారులు రాయితీ రేటుతో 160 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకోవడనికి ప్రభుత్వం నోటిఫై చేసింది. భారతదేశం - యూఏఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)లో భాగంగా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. గత ఏడాది 140 టన్నులు ఈ తరహాలో నోటిఫై అయ్యింది.ఎకానమీకి సవాలు: జీటీఆర్ఐదేశంలోకి భారీగా పసిడి దిగుమతులు వాణిజ్య సమతౌల్యకు, కరెంట్ అకౌంట్ లోటుకట్టు తప్పడానికి.. తద్వారా ఎకానమీ పురోగతిని దెబ్బతీయడానికి దారితీసే అంశమని ఆర్థిక విశ్లేషణా సంస్థ–జీటీఆర్ఏ ఒక నివేదికలో పేర్కొంది. పసిడి దిగుమతుల విలువ పెరగడం ఆందోళనకరమైన విషయమని జీటీఆర్ఐ ఫౌండర్ అజయ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. తాజాగా వెలువడిన గణాంకాల ప్రకారం నవంబర్‌లో పసిడి దిగుమతుల విలువ ఆల్‌టైమ్ హై 14.8 బిలియన్ డాలర్లుగా నమోదైంది. 2023 నవంబర్‌లో ఈ విలువ 3.5 బిలియన్ డాలర్లు. -
ఐటీ ఉద్యోగాలు.. ఇంకొన్నాళ్లు ఇంతే!
భారతీయ ఐటీ సేవల పరిశ్రమలో 2025–26 రెండవ అర్ధ భాగం నాటికి వృద్ధి ఊపందుకునేంత వరకు నియామకాలు సమీప కాలంలో తక్కువ స్థాయిలోనే ఉంటాయని రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. ఇక్రా నివేదిక ప్రకారం.. యుఎస్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడం వల్ల తక్షణ కాలంలో కొంత విధానపర అనిశ్చితి ఏర్పడవచ్చు.అనిశ్చిత స్థూల ఆర్థిక వాతావరణం మధ్య యూఎస్, యూరప్‌లోని కీలక మార్కెట్లలో కస్టమర్లు సాంకేతికతపై తక్కువ వ్యయం చేయడంతో 6–8 త్రైమాసికాల్లో భారతీయ ఐటీ సేవల కంపెనీలకు డిమాండ్ తగ్గింది. తక్కువ అట్రిషన్, ఉద్యోగుల వినియోగాన్ని పెంచడంపై దృష్టి పెట్టడం వంటి అంశాలు కూడా నియామకాల్లో మందగమనానికి కారణం అయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ2లో కొంత రికవరీ ఉన్నప్పటికీ.. 2025–26 అక్టోబర్–మార్చి నాటికి వృద్ధి ఊపందుకుంటున్నంత వరకు సమీప కాలంలో నియామకాలు తక్కువగానే ఉంటాయి. నైపుణ్యాన్ని పెంచుతున్నాయి.. 2021–22, 2022–23 కాలంలో జోడించిన ఉద్యోగుల వినియోగం పెరుగుదల 2023–24, 2024–25 క్యూ1లో ఐటీ సేవల కంపెనీల నియామకాలపై ఒత్తిడి తెచ్చింది. అట్రిషన్ స్థాయిల పెరుగుదలతో పాటు, ఇక్రా ఎంచుకున్న కంపెనీలకు 2024–25 క్యూ1 వరకు ఏడు త్రైమాసికాల్లో నికర ఉద్యోగుల చేరిక ప్రతికూలతకు దారితీసింది. ఈ జాబితాలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టెక్ మహీంద్రా, విప్రో లిమిటెడ్ ఉన్నాయి.జనరేటివ్ (జెన్) ఏఐ వేగంగా ప్రవేశిస్తున్నందున ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వ్యాపార అవకాశాలను అన్వేషించడం ద్వారా అన్ని ప్రముఖ ఐటీ సేవల కంపెనీలు తమ ఉద్యోగులకు నైపుణ్యాన్ని పెంచుతున్నాయి. కోవిడ్‌కు ముందు ఉన్న స్థాయిలతో పోలిస్తే ఇది తాజా నియామకంలో మొత్తం నియంత్రణకు దారితీసే అవకాశం ఉందని అంచనా. ఉద్యోగుల ఉత్పాదకతను మెరుగుపరచడం కోసం జనరేటివ్ ఏఐ విస్తృత స్వీకరణ ప్రభావం రాబోయే కొన్ని సంవత్సరాలలో కనిపిస్తుందని ఇక్రా నివేదిక తెలిపింది. డిమాండ్ నియంత్రణతో.. నివేదిక రూపకల్పనకు ఇక్రా ఎంచుకున్న కంపెనీల్లో ఒక్కో ఉద్యోగికి సగటు ఆదాయం 2019–20 నుంచి 2023–24లో దాదాపు 50,000 డాలర్ల వద్ద స్థిరంగా ఉంది. 12 నెలల అట్రిషన్ రేటు 2021–22 క్యూ4, 2022–23 క్యూ1 సమయంలో దాదాపు 23 శాతానికి చేరుకుంది. నియామకాలు పెద్ద ఎత్తున జరగడం, ఆ తరువాత డిమాండ్–సరఫరా అసమతుల్యత ఇందుకు కారణం.యూఎస్, యూరప్‌లోని కీలక మార్కెట్లలో డిమాండ్ నియంత్రణ కారణంగా ఐటీ సేవల కంపెనీల ద్వారా తక్కువ నియామకాలతో అట్రిషన్ క్రమంగా క్షీణించింది. ఇక్రా నమూనా కంపెనీల అట్రిషన్ రేటు 2023–24 క్యూ3 నుండి దాదాపు 13 శాతం వద్ద స్థిరీకరించడం ప్రారంభించింది. కోవిడ్ ముందస్తు 2019–20 క్యూ1లో ఇది 18 శాతం నమోదైంది అని ఇక్రా వివరించింది. -
ఫ్యాషన్ రిటైలర్స్ 15% ఆదాయ వృద్ధి
న్యూఢిల్లీ: ఫ్యాషన్ రిటైలర్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15 శాతం వరకు ఆదాయ వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉంది. నెట్వర్క్ విస్తరణ ఇందుకు కారణమని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా నివేదిక వెల్లడించింది. ‘ద్రవ్యోల్బణం ఎదురుగాలులు ఉన్నప్పటికీ ఫ్యాషన్ రిటైలర్ల నెట్వర్క్ విస్తరణ 2024–25లో రాబడి పెరుగుదలకు తోడ్పడుతుంది. సర్వేలో పాలుపంచుకున్న కంపెనీల నిర్వహణ లాభాల మార్జిన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 13–14 శాతం శ్రేణిలో ఉండే అవకాశం ఉంది. ఏప్రిల్–జూన్‌లో ఫ్యాషన్ రిటైలర్లు స్టోర్ నెట్వర్క్ విస్తరణ, కొత్త ఉత్పత్తుల శ్రేణిని ప్రవేశపెట్టడం ద్వారా 18 శాతం వృద్ధిని నమోదు చేశాయి. జూలై–సెపె్టంబర్ త్రైమాసికంలో ఈ రంగ కంపెనీలు మోస్తరు వృద్ధి నమోదు చేస్తాయి. పండుగ సీజన్లో ఆదాయ వృద్ధి పుంజుకునే అవకాశం ఉంది. దీని ఫలితంగా అంత క్రితంతో పోలిస్తే 2024–25లో ఆదాయం 14–15 శాతం పెరుగుతుందని అంచనా’ అని ఇక్రా తెలిపింది.పరిమితంగానే డిస్కౌంట్లు.. ‘చదరపు అడుగుకు సగటు అమ్మకాల్లో జూన్ త్రైమాసికంలో ప్రీమియం సెగ్మెంట్ 3 శాతం క్షీణించింది. అయినప్పటికీ వాల్యూ ఫ్యాషన్ విభాగాలు కొంత సానుకూల ప్రభావాన్ని చూపించాయి. ఈ విభాగం మహమ్మారి ముందస్తు స్థాయిని మొదటిసారి తాకింది. కొత్త స్టోర్స్ రాక, ప్రారంభించిన నూతన కేటగిరీల కోసం పెరిగిన ప్రకటనలు, ప్రమోషనల్ ఖర్చుల కారణంగా తగిన రాబడి కంటే తక్కువగా గతేడాదితో పోలిస్తే ఫ్యాషన్ రిటైలర్ల మార్జిన్లు స్థిరంగా ఉన్నాయి. 2023–24 రెండవ త్రైమాసికం నుండి డిస్కౌంట్లు పరిమితంగానే ఉన్నాయి. ఎందుకంటే కంపెనీలు తమ స్థూల మార్జిన్లను రక్షించుకోవడంపై దృష్టి సారిస్తున్నాయి. ముఖ్యంగా పండుగల సీజన్‌తో ప్రకటనలు, ప్రమోషన్లపై రిటైలర్లు దూకుడుగా ఖర్చు చేస్తూనే ఉన్నారు’ అని ఇక్రా నివేదిక వెల్లడించింది. -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం!.. ఎంతంటే?
గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. కొన్ని రోజులకు ముందు ఒక బ్యారెల్ చమురు ధర 80 డాలర్ల కంటే ఎక్కువగా ఉండేది. అయితే ఉప్పుడు ఈ ధర 70 డాలర్ల నుంచి 72 డాలర్ల మధ్య ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గడంతో మనదేశంలో లీటరు ధర రూ. 2 నుంచి రూ. 3 వరకు తగ్గే అవకాశం ఉంది.ఐసీఆర్ఏ కార్పొరేట్ రేటింగ్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ గ్రూప్ హెడ్ 'గిరీష్ కుమార్ కదమ్' ఇంధన ధరల గురించి మాట్లాడుతూ.. అంతర్జాతీయ ఉత్పత్తుల ధరలతో పోలిస్తే చమురు కంపెనీలు పెట్రోల్.. డీజిల్ ధరలపై లీటర్‌కు వరుసగా రూ.15, రూ.12 చొప్పున ఆర్జిస్తున్నాయని పేర్కొన్నారు.2024 మార్చి15న పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుపై రూ. 2 తగ్గింది. ఆ తరువాత ధరల్లో ఎలాంటి మార్పు లేకుండా ముందుకు సాగుతూనే ఉంది. అయితే ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరల తగ్గుదల భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరల తగ్గుదలకు కారణమవుతాయని తెలుస్తోంది. అయితే ధరలు ఎప్పుడు తగ్గుతాయనేది తెలియాల్సి ఉంది. -
నదుల అనుసంధానం.. భారీగా వ్యాపారావకాశాలు: ఐసీఆర్ఏ
గత కొన్నేళ్లుగా వాటర్ సెక్టార్ మీద కేంద్ర ప్రభుత్వ దృష్టి బాగా పెరిగింది. ఇందులో భాగంగానే నదుల అనుసంధానాలను వేగవంతం చేసింది. నదుల ప్రాజెక్టులను అనుసంధానం చేయడం వల్ల రూ. కోట్ల వ్యాపార అవకాశాలు లభిస్తాయని 'ఐసీఆర్ఏ' నివేదికలో పేర్కొంది. వచ్చే దశాబ్దంలో ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, నిర్మాణ (EPC) సంస్థలకు రూ. 2 లక్షల కోట్ల విలువైన వ్యాపార అవకాశాలు లభించవచ్చని అంచనా.నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (NWDA) 16 ద్వీపకల్ప నదులను, 14 హిమాలయ నదుల అనుసంధానాలతో కూడిన మొత్తం 30 ఇంటర్ లింకింగ్ రివర్ ప్రాజెక్టులను అనుసంధానించనుంది. కేంద్రం 2024-25 ఆర్ధిక సంవత్సరానికి గానూ జల్ జీవన్ మిషన్‌కు భారీ నిధులను కేటాయించింది.ప్రణాళికలో నాలుగు ప్రధాన లింక్‌లు ప్రారంభం మాత్రమే.. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రాజెక్టులు అనుసంధానానికి అనుమతులు లభిస్తాయని ఐసీఆర్ఏ కార్పొరేట్ రేటింగ్స్ వైస్ ప్రెసిడెంట్ అండ్ సెక్టార్ హెడ్ చింతన్ లఖానీ పేర్కొన్నారు. మంత్రిత్వ శాఖ బడ్జెట్లో ఈ ప్రాజెక్టుల ప్రస్తుత వాటా తక్కువగా ఉందని ఆయన వెల్లడించారు. ఇదీ చదవండి: పాల ప్యాకెట్లు అమ్ముకునే స్థాయి నుంచి వేలకోట్ల సామ్రాజ్యానికి అధిపతిగా..కెన్ - బెత్వా, కోసి - మెచి, పర్బతి - కలిసింద్ - చంబల్, గోదావరి - కావేరి మాత్రమే ప్రణాళికలో ఉన్న నాలుగు ప్రధాన లింక్‌లు. 2034 - 35 నాటికి మొత్తం రూ. 2.6 లక్షల కోట్లతో ఈ ప్రాధాన్యతా లింక్‌లు పూర్తవుతాయని ఐసీఆర్ఏ వెల్లడించింది. ఇందులో గోదావరి - కావేరి అనుసంధానం చాలా పెద్దది. కోసి - మెచి చాలా చిన్నది. ఇంటర్ లింకింగ్ రివర్ ప్రాజెక్టులు పూర్తయిన తరువాత వ్యవసాయ సంబంధిత వ్యాపారాలు పెరుగుతాయి. -
ఐటీలో వృద్ధి 6 శాతంలోపే
న్యూఢిల్లీ: భారత ఐటీ రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024–25) 4 నుంచి 6 % మద్య ఆదాయంలో వృద్ధిని నమోదు చేయవచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. స్థూల ఆర్థిక సవాళ్ల నేపథ్యంలో యూఎస్, యూరప్ లోని క్లయింట్లు టెక్నాలజీలపై వ్యయా లు తగ్గించుకోవడాన్ని కారణంగా పేర్కొంది. ఆదా యం పరంగా సవాళ్లు ఉన్నప్పటికీ నిర్వహణ మార్జిన్లు మెరుగ్గా 22% మేర ఉంటాయని తెలి పింది. అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలస) గణనీయంగా తగ్గి, సమీప కాలంలో స్థిరపడొ చ్చని అంచనా వేసింది. మెరుగైన నగదు ప్రవాహాలు, బలమైన బ్యాలన్స్ షీట్లను పరిగణనలోకి తీసుకుని ఐటీ పరిశ్రమకు స్థిరమైన అవుట్‌లుక్ ఇచి్చంది. అధిక ద్రవ్యోల్బణం, వడ్డీ వ్య యాలు కీలక రంగాల్లోని క్లయింట్లపై ఒత్తిళ్లకు దారితీశాయని, ఫలితంగా వ్యయాలని యంత్రణ, విచక్షణారహిత వ్యయాలను క్లయింట్లు వాయిదా వేసుకోవడాన్ని ప్రస్తావించింది. ఆర్డ ర్లు రాక తగ్గుముఖం పట్టినప్పటికీ.. ఐటీ కంపెనీలకు ఆర్డర్, డీల్స్ పైపులైన్ బలంగానే ఉ న్నట్టు ఇక్రా తెలిపింది. ఒక్కసారి ఆర్థిక పరిస్థితులు కుదుటపడితే మధ్యకాలానికి ఐటీ కంపెనీల్లో వృద్ధి మళ్లీ పుంజుకుంటుందని ఇక్రా కార్పొరేట్ రేటింగ్స్ హెడ్ దీపక్ జోత్వాని పేర్కొన్నారు. కీలక మార్కెట్లో రికవరీ కీలకం.. దేశ ఐటీ కంపెనీల ఆదాయం గడిచిన ఐదారు త్రైమాసికాలుగా పెద్ద వృద్ధిని చూడకపోవడం గమనార్హం. ఇక్రా ఎంపిక చేసిన 15 పెద్ద, మధ్యస్థాయి లిస్టెడ్ ఐటీ కంపెనీలు 2023–24లో డాలర్ పరంగా కేవలం 5.5 శాతం వృద్ధినే నమోదు చేశాయి. 2022–23లో ఇది 9.2 శాతంగా ఉంది. అయినప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీల నిర్వహణ మార్జిన్లు 22 శాతంగా ఉంటాయని ఇక్రా అంచనా వేస్తోంది. దేశ ఐటీ కంపెనీలకు సింహభాగం ఆదాయం యూఎస్ నుంచి వస్తుంటే, ఆ తర్వాత యూరప్, మిగిలిన ప్రపంచ మార్కెట్ల (ఆర్వోడబ్ల్యూ) నుంచి వస్తోంది. ఇక్రా ఎంపిక చేసిన ఐటీ కంపెనీల ఆదాయంలో 55–60 శాతం మేర ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలోయూఎస్ నుంచే వచ్చింది. యూరప్ నుంచి 22–25 శాతం సమకూరింది. స్థూల ఆర్థిక అనిశి్చతుల ప్రభావం పరిశ్రమపై ఇక మీదట ఉండొచ్చని, కీలక మార్కెట్లలో నియంత్రణపరమైన తీవ్ర మార్పులు చోటు చేసుకుంటే అది ప్రతికూల ప్రభావం కొనసాగేలా చేయొచ్చని పేర్కొంది. జెనరేషన్ ఏఐ మధ్య కాలంలో ఐటీ పరిశ్రమ వృద్ధికి కీలకమని.. ప్రముఖ ఐటీ కంపెనీలు తమ సిబ్బందికి ఇందులో శిక్షణ ఇప్పించి, సేవల పరంగా తమ సామర్థ్యాలను పెంచుకున్నట్టు ఇక్రా తన నివేదికలో వివరించింది. జెనరేషన్ ఏఐ పరంగా ఆర్డర్‌బుక్ లేదా ఆదాయం ఇప్పటి వరకు పరిమితంగా ఉండగా, మధ్య కాలానికి పుంజుకోవచ్చని అంచనా వేసింది. డిమాండ్ మోస్తరుగా ఉండడం, 2022–23లో అధికంగా చేరిన సిబ్బందితో ఇటీవలి కాలంలో ఐటీ కంపెనీల నియామకాలపై ప్రభావం పడినట్టు తెలిపింది. లిస్టెడ్ కంపెనీలకు సంబంధించి నికర సిబ్బంది తగ్గుదల చోటుచేసుకున్నట్టు పేర్కొంది. -
ఆకాశవీధిలో 41.8 కోట్లమంది.. ఇక్రా నివేదిక
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా విమాన ప్రయాణీకుల రద్దీ 40.7-41.8 కోట్లకు చేరుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. అదే సమయంలో విమాన సంస్థల ఆదాయాలు 15-17 శాతం పెరుగుతాయని చెప్పింది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) అధీనంలోని విమానాశ్రయాలతో పాటు దిల్లీ, హైదరాబాద్, కోచి అంతర్జాతీయ విమానాశ్రయాలను నమూనాగా తీసుకుని ఇక్రా ఈ నివేదిక విడుదల చేసింది.ఇక్రా నివేదిక ప్రకారం..కరోనా కంటే ముందు నమోదైన విమాన ప్రయాణాలతో పోలిస్తే 10 శాతం అధికంగా ఫ్లైట్‌జర్నీ చేస్తున్నారు. మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 37.6 కోట్ల మంది విమానాల్లో ప్రయాణించారు. విమానాల రద్దీ ఏటా 8-11 శాతం పెరుగుతోంది. 2023 క్యాలెండర్ ఏడాదిలో అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీలో భారత్ వాటా 4.2 శాతంగా ఉంది. 2019లోని 3.8 శాతంతో పోలిస్తే అధికం. 2023లో గ్లోబల్‌గా ప్రయాణికుల రద్దీ 96 శాతం పుంజుకుంది. అదే భారత్‌లో మాత్రం 106 శాతం రికవరీ అయింది. దేశీయంగా కొత్త మార్గాలు, విమానాశ్రయాల సంఖ్య పెరగడంతో ఇది సాధ్యపడినట్లు ఇక్రా తెలిపింది.ఇదీ చదవండి: పెరగనున్న వస్తు ఎగుమతులు.. ఎంతంటే..ఇక్రా కార్పొరేట్ రేటింగ్స్ వైస్ ప్రెసిడెంట్ వినయ్ కుమార్ మాట్లాడుతూ..‘విరామం కోసం, వృత్తి వ్యాపార అవసరాల రీత్యా ప్రయాణాలు అధికంగా చేస్తున్నారు. కొత్త గమ్యస్థానాలకు విమాన సర్వీసులు ప్రారంభం కావడమూ కలిసొస్తోంది’ అన్నారు. -
పేదింటి ఆరోగ్యమే రాష్ట్ర సౌభాగ్యం
ఒక ఇంటి ఆరోగ్యం వల్ల సమాజమే ఆరోగ్యవంతమవుతుంది. సమాజం బాగుంటే రాష్ట్రం సౌభాగ్యవంతమవుతుంది. మనిషి ఆరోగ్యంగా ఉంటే ఆలోచనలూ ఆరోగ్యవంతంగా ఉంటాయి. ఈ బృహత్తర ఆలోచనే సీఎం జగన్‌ను వైద్య రంగాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దేలా చేయించింది. పేదలు వైద్యం కోసం అప్పులపాలు కాకూడదన్న లక్ష్యంతో వైద్య రంగంలో సరికొత్త విప్లవానికి బాటలు వేశారు. కార్పొరేట్ స్థాయి వైద్య సౌకర్యాలను రూపాయి ఖర్చు లేకుండా ప్రజలకు అందిస్తున్నారు. రాష్ట్రంలో 10,032 డాక్టర్ వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ గ్రామీణ ఆరోగ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తున్నాయి. ఇదే బాటలో పట్టణ ప్రాంతాల్లో అర్బన్ హెల్త్ క్లినిక్స్ చాలినన్ని మందులు, వైద్య పరీక్షలు, సరిపడా వైద్య సిబ్బందితో ఆత్మీయంగా వైద్య సేవలు అందిస్తున్నాయి. ఇవన్నీ ఒకెత్తయితే.. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.25 లక్షల వరకు వైద్య సేవలను ఉచితంగా పొందే అద్భుత వరాన్ని సీఎం జగన్ మాత్రమే అందిస్తున్నారు. అందుకే ఇది పేదల పక్షపాత ప్రభుత్వం. సాక్షి, అమరావతి: దేశ వ్యాప్తంగా రోజు రోజుకూ వైద్య ఖర్చులు పెరుగుతున్నాయి. దేశంలో సగటున కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రుల్లో సగటున బెడ్ చార్జీ రూ.50 వేల పైమాటే. అంత సొమ్ము వెచ్చించి పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు వైద్యం పొందాలంటే సాధ్యమయ్యే పనేనా? కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఏకంగా రూ.25 లక్షల వరకు ప్రభుత్వం వైద్య ఖర్చు భరిస్తోంది. దేశంలో సగటున బెడ్ ఛార్జ్ రూ.50 వేలు అవుతుందనే అంశాన్ని ఇటీవల ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్, క్రెడిట్ ర్యాకింగ్ ఏజెన్సీ (ఐసీఆర్ఏ) ఓ అధ్యయనంలో వెల్లడించింది. తొమ్మిది ప్రముఖ చైన్ ఆస్పత్రుల్లో రెవెన్యూపై ఐసీఆర్ఏ అధ్యయనం చేపట్టింది. ఈ క్రమంలో నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల ప్రజలు జబ్బు చేసి ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించుకోవాలంటే అప్పులపాలవ్వక తప్పదు. అప్పులు పుట్టని పరిస్థితుల్లో దేవుడిపై భారం వేసి కాలం వెళ్లదీయాల్సిన దుస్థితి నెలకొంటోంది. ఏపీలో పేద, మధ్య తరగతి కుటుంబాలను సీఎం జగన్ ప్రభుత్వం కొండంత అండగా ఉంటోంది. ఈ వర్గాలు వైద్య పరంగా ఏ ఇబ్బంది ఎదుర్కోకుండా వారి ఆరోగ్యాలకు భరోసాగా ఉంటోంది. దురదృష్టవశాత్తు ఏదైనా జబ్బు చేసినా ఇటు ప్రభుత్వాస్పత్రుల్లో, అటు ప్రైవేట్‌లో పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందించి బడుగు బలహీనవర్గాలు ఆర్థికంగా చిన్నాభిన్నం కాకుండా కాపాడుతోంది. టెరిషరీ కేర్ అభివృద్ధితో రెట్టింపు భరోసా ఓ వైపు ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తి ఉచితంగా వైద్య భరోసా కల్పిస్తూనే.. మరోవైపు ప్రభుత్వ వైద్య రంగంలో వైద్య సదుపాయాలను బలోపేతం చేసే కార్యక్రమాన్నీ సీఎం జగన్ చేపట్టారు. వైద్య రంగంలో కీలకమైన టెరిషరీ కేర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. టెరిషరీ కేర్‌లో పేదలకు ఆధారమైన పెద్దాస్పత్రుల్లో మానవ వనరులను పూర్తి స్థాయిలో సమకూర్చడంతో పాటు, అధునాతన వైద్య పరికరాలను అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్రంలోని 26 జిల్లాలకు ప్రభుత్వ రంగంలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేస్తూ రూ.8 వేల కోట్లకు పైగా నిధులతో 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. వీటిలో 5 కాలేజీలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు నేపథ్యంలో అప్పటి వరకూ జిల్లా, ఏరియా ఆస్పత్రులు ఉన్న చోట నిపుణులైన వైద్యులతో బోధనాస్పత్రులు అందుబాటులోకి వస్తున్నాయి. ఒక్కో బోధనాస్పత్రిలో 600 వరకూ పడకలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే 10 చోట్ల కొత్తగా బోధనాస్పత్రులు కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. మిగిలిన ఏడు చోట్ల వచ్చే ఏడాది బోధనాస్పత్రులు అందుబాటులోకి రానున్నాయి. కిడ్నీ, గుండె, క్యాన్సర్ సహా ఇతర సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పేదలకు చేరువ అవుతున్నాయి. 95 శాతం కుటుంబాలకు ఆరోగ్యశ్రీ ‘రక్ష’ దేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టుగా ఏపీలో ఏకంగా 95 శాతం కుటుంబాలకు సీఎం జగన్ ప్రభుత్వం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలన్నింటినీ పథకం పరిధిలోకి తెచ్చారు. రాష్ట్రంలోని నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలన్నింటికి పథకం రక్షణగా నిలుస్తోంది. ఏకంగా రూ.25 లక్షల వరకూ విలువైన వైద్య సేవలను పూర్తి ఉచితంగా ప్రభుత్వం లబ్ధిదారులకు అందిస్తోంది. రాష్ట్రంతో పాటు, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లోని 2,331 నెట్వర్క్ ఆస్పత్రుల్లో 3,257 ప్రొసీజర్లలో లబ్దిదారులకు ఉచిత వైద్య సేవలు అందుతున్నాయి. అన్ని రకాల క్యాన్సర్లతో పాటు, గుండె మార్పిడి, కార్డియాలజీ, న్యూరో సంబంధిత ఖరీదైన చికిత్సలన్ని పథకం పరిధిలో ఉంటున్నాయి. 2019 నుంచి ఇప్పటి వరకూ 44,78,319 మందికి ఏకంగా రూ.13 వేల కోట్ల విలువైన వైద్యాన్ని పూర్తి ఉచితంగా ప్రభుత్వం అందించింది. ఇక్కడితో ఆగకుండా చికిత్స అనంతరం బాధితులకు అండగా నిలుస్తూ వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద విశ్రాంత సమయానికి భృతి రూపంలో ఆర్థికంగా చేయూతగా నిలుస్తున్నారు. ఇప్పటి వరకూ 23 లక్షల మంది రోగులకు ఏకంగా రూ.1366 కోట్ల మేర సాయాన్ని అందించారు. గతంలో ఎన్నడూ ఎక్కడా లేనంతగా లబ్ధి ప్రస్తుతం నిరుపేద, సామాన్య కుటుంబాలకు చెందిన ప్రజలు చేతి నుంచి డబ్బు పెట్టి వైద్యం చేయించుకోవాలంటే సాధ్యపడని పరిస్థితి. దురదృష్టవశాత్తూ క్యాన్సర్, గుండె సంబంధిత జబ్బుల బారిన పడితే ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.లక్షల్లో డబ్బు కట్టాల్సిందే. ఈ పరిస్థితుల్లో గతంలో ఎన్నడూ లేనట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవలు విస్తరించి ప్రజలకు భరోసాగా నిలవడం శుభపరిణామం. గతంలో కేవలం రేషన్ కార్డులు ఉన్న వాళ్లు మాత్రమే ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి పొందేవారు. రేషన్ కార్డు లేని మధ్యతరగతి కుటుంబాలు వైద్యానికి చేతి నుంచి డబ్బు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు మధ్యతరగతి ప్రజలకూ ఉచితంగా వైద్యం లభించడం గొప్ప మార్పు. – డాక్టర్ అంబటి నాగ రాధాకృష్ణ యాదవ్, విజయవాడ -
కమర్షియల్ వాహనాలకు ఎలక్షన్స్ దెబ్బ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ వాణిజ్య వాహనాల (సీవీ) అమ్మకాలు 2024–25లో 4–7 శాతం తగ్గుతాయని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. ‘సార్వత్రిక ఎన్నికలకు ముందు మోడల్ ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చినందున మౌలిక సదుపాయాల కార్యకలాపాలలో విరామం కారణంగా జనవరి–మార్చి త్రైమాసికంలో వాణిజ్య వాహనాల విక్రయాలు స్తబ్దుగా ఉంటాయని అంచనా. దేశీయ సీవీ పరిశ్రమ పరిమాణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2–5 శాతం వృద్ధిని నమోదు చేయవచ్చు. సీవీల కోసం దీర్ఘకాలిక డిమాండ్ చెక్కుచెదరకుండా ఉంటుంది. మౌలిక రంగ మూలధన వ్యయంపై నిరంతర దృష్టి, మౌలిక సదుపాయాలు, నిర్మాణం, రక్షణ, తయారీ కార్యకలాపాలలో ప్రైవేట్ భాగస్వామ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం వంటివి కమర్షియల్ వెహికిల్స్ పరిశ్రమకు దీర్ఘకాలికంగా సానుకూలంగా ఉంటుంది. సమీప కాలంలో సార్వత్రిక ఎన్నికల ప్రారంభంతో కొన్ని రంగాలలో ఆర్థిక కార్యకలాపాల్లో అస్థిర నియంత్రణల మధ్య పరిమాణం అధిక స్థాయిలో ఉండవచ్చు’ అని ఇక్రా తెలిపింది. -
గాడిన పడుతున్న ఎయిర్‌లైన్స్..
ముంబై: దేశీయ ఎయిర్‌లైన్స్ సంస్థలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నష్టాలు గణనీయంగా తగ్గిపోనున్నాయి. కరోనా కారణంగా ఎయిర్‌లైన్స్ కార్యకలాపాలు నెమ్మదించడం తెలిసిందే. దీని కారణంగా గత ఆర్థిక సంవత్సరంలో (2022–23) ఇవి రూ.17,500 కోట్ల వరకు నష్టాలను చవి చూశాయి. కానీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నష్టాలు రూ.3,000–3,500 కోట్లకు పరిమితం అవుతాయని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. వైరస్ సమసిపోయి, ఆంక్షలు పూర్తిగా తొలగిపోయిన తర్వాత దేశ, విదేశీ ప్రయాణాలు ఊపందుకోవడం తెలిసిందే. గతంలో నిలిచిన ప్రయాణాలు కూడా తోడు కావడంతో విమానయాన సర్వీసులకు డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతోపాటు, వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ విమాన ప్రయాణికుల రద్దీ 8–13 శాతం మధ్య పెరుగుతుందని ఇక్రా పేర్కొంది. ముఖ్యంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల సంఖ్య 15–15.5 కోట్లకు చేరుకుంటుందని.. కరోనా ముందు ఆర్థిక సంవత్సరం 2019–20లో ఉన్న 14.1 కోట్లను అధిగమిస్తుందని అంచనా వేసింది. ప్రయాణికుల రద్దీలో చక్కని వృద్ధికితోడు, రాబడులు మెరుగుపడడం, వ్యయాలు స్థిరంగా ఉన్నందున ఈ పరిశ్రమకు స్థిరమైన అవుట్‌లుక్‌ను ఇస్తున్నట్టు ఇక్రా ప్రకటించింది. వచ్చే సంవత్సరంలోనూ.. ఎయిర్‌లైన్స్ సంస్థలకు వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ నష్టాలు ఎదురవుతాయని ఇక్రా తెలిపింది. ‘‘ప్రస్తుత స్థాయి నుంచి రాబడులు మరింత పెరిగే అవకాశాలు పరిమితమే. కనుక ఈ రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మాదిరే 2024–25లోనూ 3,000–5,000 కోట్ల మధ్య నష్టాలను నమోదు చేయవచ్చు’’అని ఇక్రా కార్పొరేట్ రేటింగ్స్ వైస్ ప్రెసిడెంట్ సుప్రియో బెనర్జీ వివరించారు. విమానాశ్రయాల సదుపాయాల విస్తరణతో విమాన ప్రయాణాలకు డిమాండ్ పెరుగుతోందని, ప్రస్తుతం మాదిరే వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ ప్రయాణికుల వృద్ధి ఉంటుందని ఇక్రా తెలిపింది. ఎనిమిది నెలల్లో 10 కోట్లు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఎనిమిది నెలల్లో (2023 ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు) విమాన ప్రయాణికుల సంఖ్య 10.07 కోట్లుగా ఉంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలోని గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 17 శాతం వృద్ధి కనిపిస్తోంది. కరోనా ముందు ఆర్థిక సంవత్సరంలోని మొదటి 8 నెలల గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 5 శాతం వృద్ధి నమోదైంది. భారత ఎయిర్‌లైన్స్ సంస్థలకు అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీ 2022–23లో 2.39 కోట్లుగా ఉంది. కరోనా ముందు నాటి గణాంకాల కంటే ఇది ఎక్కువ. 2018–19లో 2.59 కోట్ల ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి నమోదు కావడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఎయిర్‌లైన్స్ సంస్థలకు అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య కొత్త గరిష్ట స్థాయిని చేరుకుంటుందని ఇక్రా అంచనా వేసింది. విమానయాన సంస్థలకు ధరలు నిర్ణయించే బలం చేకూరిందని, ఫలితమే రాబడులు మెరుగుపడడమని వివరించింది. విమానయాన సంస్థలకు 1500 విమానాలు డెలివరీ కావాల్సి ఉందని, సరఫరా వ్యవస్థలో సమస్యల వల్ల నిదానంగా అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. మధ్య కాలానికి డిమాండ్–సరఫరా మధ్య సమతుల్యత ఏర్పడుతుందని అంచనా వేసింది. అంతర్జాతీయ ప్రయాణికుల మార్కెట్లో భారత ఎయిర్‌లైన్స్ సంస్థల వాటా 42 శాతంగా ఉన్నట్టు తెలిపింది. ప్రయాణికుల రికవరీ ఆరోగ్యంగా ఉన్నప్పటికీ.. ఏటీఎఫ్ ధరలు పెరగడం, డాలర్‌తో రూపాయి క్షీణతను పరిశీలించాల్సి ఉంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. -
విమానయాన ప్రాప్తిరస్తు! ఈ ఏడాది ఎన్ని కోట్ల మంది ఎక్కుతున్నారంటే..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8–13 శాతం పెరిగే అవకాశం ఉందని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తాజాగా తెలిపింది. 2023–24లో 15–15.5 కోట్ల మంది రాకపోకలు సాగించే అవకాశం ఉందని అంచనా వేసింది. కోవిడ్ ముందస్తు 2019–20నాటి 14.12 కోట్ల ప్యాసింజర్లను దాటొచ్చని వివరించింది. విమానయాన పరిశ్రమ నష్టాలను మరింత తగ్గించుకోవచ్చని వెల్లడించింది. దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణికుల ట్రాఫిక్‌లో నిరంతర పునరుద్ధరణ, టికెట్ల ధరలు మెరుగైన నేపథ్యంలో భారతీయ విమానయాన రంగంపై స్థిరమైన అంచనాలు ఉన్నట్టు ఇక్రా ప్రకటించింది. ‘2023–24లో ఏప్రిల్–ఆగస్ట్ కాలంలో 6.32 కోట్ల మంది విమాన ప్రయాణం సాగించారు. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 20 శాతం వృద్ధి. 2019–20 ఏప్రిల్–ఆగస్ట్‌లో 5.89 కోట్ల మంది దేశీయంగా విమానాల్లో విహరించారు. భారత్ నుంచి విదేశాలకు, విదేశాల నుంచి భారత్‌కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2.5–2.7 కోట్ల మంది రాకపోకలు జరిపే అవకాశం ఉంది. 2022–23లో పరిశ్రమ రూ.17,000–17,500 కోట్ల నికర నష్టాలను మూటగట్టుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.3,000–5,000 కోట్లకు వచ్చి చేరనుంది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలలో 2023 ఏప్రిల్ నుండి తగ్గుదల (ఇటీవలి పెరుగుదల ఉన్నప్పటికీ), సాపేక్షంగా స్థిర విదేశీ మారకపు రేట్ల కారణంగా విమానయాన సంస్థల ధరల శక్తి కొనసాగుతుంది’ అని ఇక్రా వెల్లడించింది. -
టెలికం ఆదాయం అంతంతే.. 5జీ వచ్చినా లాభం లేదు!
న్యూఢిల్లీ: టెలికం రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మోస్తరు ఆదాయ వృద్ధిని నమోదు చేస్తుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. స్వల్ప కాలంలో టారిఫ్‌లు పెంచే అవకాశాలు కనిపించకపోవడంతో, యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయం (ఏఆర్పీయూ) విస్తరణకు అవకాశాల్లేవని అభిప్రాయం వ్యక్తం చేసింది. దీంతో 2023–24 సంవత్సరంలో ఆదాయంలో వృద్ధి 7–9 శాతం మధ్య ఉంటుందని పేర్కొంది. 5జీ టెక్నాలజీకి సంబంధించి మూలధన వ్యయాల్లో పరిశ్రమ ముందుందని, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.70,000 వరకు ఖర్చు చేయవచ్చని తెలిపింది. అలాగే, వచ్చే నాలుగైదేళ్లలో మొత్తం మీద టెలికం కంపెనీలు రూ.3 లక్షల కోట్ల వరకు వ్యయం చేస్తాయని అంచనా వేసింది. 5జీ సేవల ప్రారంభంతో నెట్వర్క్ సాంద్రత పెరుగుతుందని.. ఫలితంగా సమీప కాలం నుంచి మధ్య కాలానికి మూలధన వ్యయాల ఉధృతి పెరిగే అవకాశం ఉంటుందని ఇక్రా పేర్కొంది. దీంతో పరిశ్రమ రుణ భారం 2024 మార్చి నాటికి రూ.6.1–6.2 లక్షల కోట్లకు చేరుకుంటుందని తెలిపింది. 5జీ ఆదాయ వనరుగా మారలేదు.. మూడు టెలికం కంపెనీలు కలసి 75–80 శాతం కస్టమర్లను (80 కోట్లు) 4జీకి అప్ గ్రేడ్ చేసుకున్నాయని, ఇక ఇక్కడ నుంచి మరింత పెరగకపోవచ్చని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ అంకిత్ జైన్ పేర్కొన్నారు. ‘‘5జీ సేవలను ప్రారంభించినప్పటికీ దాన్ని కంపెనీలు ఇంకా ఆదాయ వనరుగా మార్చుకోలేదు. 5జీకి ఉద్దేశించిన ప్రత్యేక ప్లాన్లు లేవు. అదే ఉంటే ఏఆర్‌పీయూకి మరింత బలం వచ్చేది. ఈ అంశాలకుతోడు టారిఫ్‌లు పెంచకపోవడం వల్ల ఏఆర్పీయూ మోస్తరు స్థాయిలోనే ఉంది’’అని జైన్ వివరించారు. -
నష్టాలు తగ్గుతాయి! దేశీయ ఎయిర్‌లైన్స్‌కు ఊరట
ముంబై: దేశీయ ఎయిర్‌లైన్స్ సంస్థలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నష్టాలు మరింత తగ్గుతాయని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. నష్టాలు రూ.5,000–7,000 కోట్లకు పరిమితం అవుతాయని పేర్కొంది. ప్రయాణికుల రద్దీ పెరుగుదల సానుకూలంగా ఉండడం ఎయిర్‌లైన్స్ ఆదాయ వృద్ధికి సాయపడుతుందని తెలిపింది. ఏవియేషన్ టర్బయిన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలు పెరిగిపోవడంతోపాటు, డాలర్‌తో రూపాయి క్షీణించడం వల్ల క్రితం ఆర్థిక సంవత్సరం (2022–23)లో ఎయిర్‌లైన్స్ నష్టాలు రూ.11,000–13,000 కోట్లుగా ఉండడం గమనార్హం. ప్రయాణికుల రద్దీ మెరుగ్గా ఉన్నప్పటికీ ఏటీఎఫ్ ధరలు త్రైమాసికం వారీగా పెరగడం, రూపాయి విలువ క్షీణించడం అనే సవాళ్లను దేశీ ఎయిర్‌లైన్స్ పరిశ్రమ ఎదుర్కొన్నట్టు ఇక్రా నివేదిక తెలిపింది. ఈ ఏడాది జూలై నెలలో ప్రయాణికుల సంఖ్య 1.22 కోట్లుగా నమోదైందని, క్రితం ఏడాది ఇదే నెలతో పోలిస్తే 26 శాతం అధికంగా ఉన్నట్టు పేర్కొంది. ఏవియేషన్ రంగానికి స్టెబుల్ రేటింగ్ (స్థిరత్వం) ఇచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ రంగం వేగంగా రికవరీ కావడం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే ధోరణి కొనసాగుతుందన్న అంచనాతో స్థిరత్వం రేటింగ్‌ను ఇచ్చింది. గణనీయంగా తగ్గిన నష్టాలు ఎయిర్‌లైన్స్ పరిశ్రమ 2021–22లో రూ.23,500 కోట్లు నష్టపోవడం గమనార్హం. దీంతో పోలిస్తే 2022–23లో నష్టాలు గణనీయంగా తగ్గాయి. తొలుత రూ.17,000 కోట్ల వరకు రావచ్చని ఇక్రా అంచనా వేయగా, వాస్తవ నష్టాలు రూ.11,000–13,000 కోట్లకు పరిమితం అయ్యాయి. ఎయిర్‌లైన్స్ సంస్థలు కాస్ట్ ఆఫ్ అవైలబుల్ సీట్ కిలోమీటర్ను మెరుగుపరుచుకున్నాయి. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నష్టాలు క్రితం ఆర్థిక సంవత్సరంలో పోలిస్తే సగానికి తగ్గుతాయని అంచనా. పరిశ్రమలో టారిఫ్‌ల పరంగా క్రమశిక్షణ నెలకొనడంతో ఈ ధోరణి కొనసాగుతుందని ఇక్రా తెలిపింది. ఏటీఎఫ్ ధరలు కొంత తగ్గడం కలిసొస్తుందని పేర్కొంది. జూలైలో విమానయానం 25 శాతం అప్.. దేశీయంగా విమాన ప్రయాణీకుల సంఖ్య జూలైలో 25 శాతం ఎగిసింది. 1.21 కోట్లుగా నమోదైంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వీటి ప్రకారం గతేడాది జూలైలో విమాన ప్రయాణికుల సంఖ్య 97.05 లక్షలుగా నమోదైంది. తాజాగా గత నెల విమానయాన సంస్థ ఇండిగో 76.75 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడం ద్వారా 63.4 శాతం మార్కెట్ వాటా దక్కించుకుంది. టాటా గ్రూప్‌లో భాగమైన ఎయిరిండియా 11.98 లక్షల మంది ప్రయాణికులు 9.9 శాతం మార్కెట్ వాటాతో తర్వాత స్థానంలో ఉంది. ఇక టాటా సన్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ జాయింట్ వెంచర్ అయిన విస్తార 10.20 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చి 8.4 శాతం మార్కెట్ వాటా దక్కించుకుంది. ఎయిరిండియా అనుబంధ సంస్థ ఎయిర్ఏషియా ఇండియా (ఏఐఎక్స్ కనెక్ట్) 9.01 లక్షల ప్రయాణికులు (7.5 శాతం వాటా), ఆకాశ ఎయిర్ 6.24 లక్షల మంది ప్యాసింజర్లను (5.2 శాతం వాటా) గమ్యస్థానాలకు చేర్చాయి. సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న స్పైస్‌జెట్ 5.04 లక్షల మంది ప్రయాణికులు, 4.2 శాతం మార్కెట్ వాటా నమోదు చేసింది. సమయ పాలన విషయంలో ఇండిగో 86.8 శాతంతో అగ్ర స్థానంలో నిల్చింది. -
ఇన్సూరెన్స్ పాలసీలపై పెరిగిన అవగాహన.. రూ.3 లక్షల కోట్ల బీమా రంగ ఆదాయం
న్యూఢిల్లీ: బీమా పరిశ్రమ స్థూల ప్రీమియం ఆదాయం 2025 మార్చి నాటికి రూ.3 లక్షల కోట్లకు చేరుకుంటుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. 2023 మార్చి నాటికి ఇది రూ.2.4 లక్షల కోట్లుగా ఉంది. ప్రైవేటు బీమా సంస్థల కంబైన్డ్ రేషియో మెరుగుపడుతుందని, రిటర్న్ ఆన్ ఈక్విటీ (ఆర్‌వోఈ) 2023–24లో 11.2–12.8 శాతానికి, 2024–25లో 12.5–13.9 శాతానికి పెరుగుతుందని పేర్కొంది. ప్రభుత్వరంగ బీమా సంస్థలు కంబైన్డ్ రేషియో అధికంగా ఉంటుందని, దీంతో వాటి నష్టాలు కొనసాగుతాయని తెలిపింది. ప్రభుత్వరంగ సాధారణ బీమా సంస్థలు 2024 మార్చి నాటికి సాల్వెన్సీ రేషియో (1.5 రెట్లు) చేరుకునేందుకు వీలుగా వాటికి రూ.17,500 కోట్ల నిధుల అవసరం అవుతాయని అంచనా వేసింది. పరిశ్రమ స్థూల ప్రీమియం ఆదాయం 2022–23లో వార్షికంగా చూస్తే 17.2 శాతం వృద్ధితో రూ.2.4 లక్షల కోట్లకు చేరుకున్న విషయాన్ని ప్రస్తావించింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 2022–23లో నికరంగా రూ.35,000 కోట్ల మేర పెరిగినట్టు పేర్కొంది. హెల్త్ ఇన్సూరెన్స్ పట్ల అవగాహన పెరగడంతో ఈ విభాగం మెరుగైన వృద్ధిని చూసిందని, వృద్ధి చెందిన స్థూల ప్రీమియం ఆదాయంలో 50 శాతం వాటా హెల్త్ ఇన్సూరెన్స్ నుంచే వచ్చినట్టు వివరించింది. కరోనా సమయంలో లాక్డౌన్లతో దెబ్బతిన్న మోటారు బీమా విభాగం సైతం పుంజుకున్నట్టు ఇక్రా తెలిపింది. హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు సాధారణ స్థితికి చేరినట్టు పేర్కొంది. వేతన సవరణ, అందుకు సంబంధించిన బకాయిల చెల్లింపులతో ప్రభుత్వరంగ సాధారణ బీమా సంస్థలకు నష్టాలు పెరిగినట్టు వివరించింది. -
రైలెక్కట్లేదు.. విమానం దిగట్లేదు.. ప్రజల్లో వచ్చిన మార్పుకు కారణమిదే!
విమాన ప్రయాణికుల రద్దీపెరిగినంత వేగంగా రైలు ప్రయాణాల్లో రద్దీ పెరగటం లేదు. కోవిడ్–19 కారణంగా క్షీణించిన ప్రజా రవాణా నెమ్మదిగా పుంజుకుంటున్నా.. కోవిడ్ ముందు కాలంతో పోలిస్తే సామాన్య, మధ్య తరగతి ప్రజలు ప్రయాణాలకు దూరంగా ఉంటున్నారు. ఈ పరిస్థితికి ద్రవ్యోల్బణమే కారణమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. కోవిడ్ తర్వాత ప్రయాణాల రద్దీ పెరుగుదల ఆర్థిక వృద్ధికి ప్రత్యక్ష సూచికగా నిలుస్తుందని చెబుతున్నారు. కానీ.. కోవిడ్ ముందు సాగినన్ని ప్రయాణాలు ప్రస్తుతం కనిపించటం లేదని స్పష్టం చేస్తున్నారు. కనిపించని మునుపటి మార్క్.. కరోనాకు ముందు 2019–20 ఆర్థిక సంవత్సరంలో 7,674 మిలియన్ల మంది రైళ్లలో ప్రయాణించగా.. 2022–23 ఆర్థిక సంవత్సరంలో 5,858 మిలియన్ల మంది మాత్రమే ప్రయాణించారు. అంటే ప్రయాణికుల బుకింగ్ 1,816 మిలియన్లు కంటే ఎక్కువ తగ్గింది. 2022–23తో పోలిస్తే.. 2019–20 కంటే 24 శాతం తక్కువ రద్దీని సూచిస్తోంది. సబర్బన్ ప్రాంతాల్లో 20 శాతం తగ్గుదల ఉండగా.. నాన్–సబర్బన్ ప్రాంతాల్లో 29 శాతం తగ్గుదల నమోదైంది. నేషనల్ ట్రాన్స్పోర్ట్ నివేదిక ప్రకారం గత ఏడాదితో పోలిస్తే 2022–23 ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల విభాగంలో రైల్వే 73 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఏప్రిల్ నుంచి మార్చి (2022–23) వరకు రూ.54,733 కోట్ల రాబడి వస్తే.. గత ఆర్థిక ఏడాదిలో ఇది రూ.31,634 కోట్లుగా నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే రైలు ప్రయాణాల్లో వృద్ధి కనిపిస్తున్నా.. 2019–20 కాలం నాటి గణాంకాలతో పోలిస్తే మాత్రం తక్కువగానే ఉంది. ద్రవ్యోల్బణమే కారణం ద్రవ్యోల్బణం పెరిగిపోవడం వల్ల సామాన్య, మధ్య తరగతి ప్రజలపై మోయలేని భారం పడుతోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోవడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజల ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ పరిస్థితుల కారణంగా ఆయా వర్గాల ప్రజలు ప్రయాణాలకు దూరంగా ఉంటున్నట్టు విశ్లేషిస్తున్నారు. ఈ పరిస్థితి రైలు ప్రయాణాల్లో రద్దీ పెరగకపోవడానికి కారణమని స్పష్టం చేస్తున్నారు. ఎగువ, ఉన్నత ఆదాయ వర్గాల వారిపై ద్రవ్యోల్బణం పెద్దగా ప్రభావం చూపని కారణంగా.. ఆ వర్గాల వారు విమానాల్లో యథావిధిగా ప్రయాణించగలుగుతున్నారని చెబుతున్నారు. విమానాలు ఎక్కేస్తున్నారు మరోవైపు దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా వృద్ధి చెందుతూ కోవిడ్ ముందునాటి స్థితికి చేరింది. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ (ఐసీఆర్ఏ) నివేదిక ప్రకారం 2022–23 ఆర్థిక సంవత్సరంలో దేశీయ విమాన సంస్థలు 1,360 లక్షల మంది ప్రయాణికులను తరలించాయి. ఇది 2021–22లో ప్రయాణించిన 852 లక్షల మంది ప్రయాణికులతో పోలిస్తే 60 శాతం పెరుగుదలను సూచిస్తోంది. అయితే, ప్రస్తుతం దేశీయ ప్రయాణికుల రద్దీ 2020–21 ఆర్థిక సంవ్సతరంలో 1,415 లక్షల కంటే 4 శాతం తక్కువ. ఈ ఏడాది మార్చిలో 130 లక్షల మంది దేశీయంగా విమానాల్లో ప్రయాణించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ సంఖ్య 121 లక్షలు కాగా.. మార్చి నెలలో 8 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. 2022 మార్చిలో ఇది 106 లక్షలు ఉండగా.. ప్రస్తుతం 22 శాతం వృద్ధిలో నడుస్తోంది. అదే 2019 మార్చిలో 116 లక్షలు ఉంటే ఇప్పటి మార్చి ప్రీకోవిడ్లో చూస్తే 12 శాతం పెరుగుదల కనిపిస్తోంది. సరుకు రవాణా పెరుగుతోంది దేశంలో అత్యధికంగా ఒక ఆర్థిక సంవత్సరంలో సరుకు రవాణా చేసిన సంస్థగా రైల్వే రికార్డు సృష్టించింది. జాతీయ రవాణా సంస్థ అధికారిక ప్రకటన ప్రకారం.. 2022–23లో 1,512 మిలియన్ టన్నుల సరుకును రైల్వే రవాణా చేసింది. 2021–22లో 1,418 మిలియన్ టన్నులు తరలించింది. ఇక్కడ 2022–23లో రైల్వే మొత్తం ఆదాయం రూ.2.44 లక్షల కోట్లు కాగా.. 2021–22లో రూ.1.91 లక్షల కోట్లుగా నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే మొత్తం ఆదాయంలో ఏకంగా 27.75 శాతం వృద్ధిని సూచిస్తోంది. – సాక్షి, అమరావతి -
వచ్చే ఏడాది ఫార్మా రంగం కళకళ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ ఔషధ పరిశ్రమ వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6-8 శాతం ఆదాయ వృద్ధి నమోదు చేస్తుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. ‘విఘాతం కలిగించే అనేక సంఘటనలు ఉన్నప్పటికీ 2011-12 నుంచి 2021-22 మధ్య ఫార్మా రంగం 10.9 శాతం వార్షిక వృద్ధి నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 3-4 శాతానికి పరిమితం కానుంది. వృద్ధులు, జీవనశైలి/దీర్ఘకాలిక వ్యాధుల నిరంతర పెరుగుదల, జాతీయ జాబితాలోని అత్యవసర ఔషధాలకు (ఎన్ఎల్ఈఎం) టోకు ధరల ఆధారంగా ధరల పెంపు, కొత్త ఉత్పత్తుల విడుదల, ఎన్ఎల్ఈఎంయేతర ఔషధాలకు వార్షిక ధరల పెంపు వంటి నిర్మాణాత్మక అంశాలు పరిశ్రమ ఆదాయ వృద్ధికి తోడ్పడతాయి. 2017–18 నుండి ప్రతి ఆర్థిక సంవత్సరంలో పరిమాణ వృద్ధి 2-3 శాతం మధ్య ఉన్నప్పటికీ, ధరల పెరుగుదల, కొత్త ఉత్పత్తుల రాకతో ఔషధ రంగం జోరుకు మద్దతు లభించింది’ అని ఇక్రా తెలిపింది. (టాటా, మారుతి, హ్యుందాయ్: కారు ఏదైనా ఆఫర్మాత్రం భారీగానే!) కొత్త ఉత్పత్తులు, సిబ్బంది పెంపు.. ‘యాంటీ-ఇన్ఫెక్టివ్ల అధిక విక్రయాలు, ముడిసరుకు వ్యయాల ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు తీసుకున్న ధరల పెరుగుదలతో 2021-22లో మొత్తం ఫార్మా పరిశ్రమ వృద్ధి 14.6 శాతానికి చేరుకుంది. 2022-23 ఏప్రిల్-డిసెంబర్ కాలానికి పరిమాణం 1.2 శాతం తగ్గింది. కొత్త ఉత్పత్తుల పరిచయం, క్షేత్ర స్థాయిలో ఉద్యోగుల పెంపు దిశగా తీసుకుంటున్న చర్యలు ఫార్మా వృద్ధికి తోడ్పడతాయని కంపెనీలు భావిస్తున్నాయి. దేశీయ ఔషధ విపణిలో ఎన్ఎల్ఈఎం వాటా 17-18 శాతంగా ఉంది. కొన్ని కంపెనీలకు వీటి ద్వారా 30 శాతం వరకు ఆదాయం సమకూరుతోంది. పరిశ్రమలో అభివృద్ధి చెందుతున్న ధోరణులపరంగా ఈ-ఫార్మసీలు ఇటీవలి కాలంలో గణనీయమైన ఆకర్షణను పొందాయి. ప్రస్తుతం ఫార్మా రంగంలో వీటి వాటా 10-15 శాతం ఉంది’ అని ఇక్రా వివరించింది. (రూ. 32 వేల బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్ కేవలం రూ. 1,999కే) -
ఎన్బీఎఫ్సీ, హెచ్ఎఫ్సీలకు సానుకూలం
ముంబై: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు), గృహ రుణ సంస్థలు (హెచ్ఎఫ్సీలు) నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 9-11 శాతం మేర వృద్ధిని చూస్తాయని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీల ఏయూఎం వృద్ధి ప్రధానంగా చివరి త్రైమాసికం (2022 జనవరి-మార్చి)లో నమోదైనట్టుగా పేర్కొంది. హెచ్ఎఫ్సీల ఆస్తులు 10 శాతం పెరగ్గా, ఎన్‌బీఎఫ్‌సీల రిటైల్ ఆస్తులు 8.5 శాతం, హోల్‌సేల్ ఆస్తులు 12 శాతం చొప్పున వృద్ధి చెందాయని బుధవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీలు (ఇన్ఫ్రా ఫైనాన్సింగ్ కంపెనీలు కాకుండా) మొత్తం మీద 9–11 శాతం మేర వృద్ధిని నమోదు చేయగలవని అంచనా వేస్తున్నట్టు ఇక్రా వివరించింది. ఈ సంస్థలు ఇచ్చిన రుణాలనే ఆస్తులుగా పరిగణిస్తారు. నిధుల మార్గాలు ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీలు తమ నిధుల అవసరాల కోసం నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ (ఎన్సీడీలు) ఇష్యూలను చేపట్టడం అన్నది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఎన్నో త్రైమాసికాల కనిష్టానికి చేరినట్టు ఇక్రా నివేదిక తెలియ జేసింది. 2021-22 మొదటి త్రైమాసికంతో పోలిస్తే 28 శాతం తగ్గాయని, 2020-21 మొదటి త్రైమాసికంలోని ఇష్యూలతో పోల్చినా 65 శాతం తక్కువగా ఉన్నట్టు వివరించింది. ఆర్బీఐ ఈ ఏడాది మే, జూన్ నెలల్లో రెపో రేట్లు పెంచడం, ద్రవ్యోల్బణం పెరిగిన పరిస్థితుల్లో వీటి ఇష్యూలకు ఇన్వెస్టర్ల నుంచి స్పందన అంతగా లేదని తెలిపింది. కమర్షియల్ పేపర్ల రూపంలో నిధుల సమీకరణ గత కొన్ని నెలల్లో కొంత పుంజుకున్నట్టు పేర్కొంది. వడ్డీ రేట్లు పెరుగుతున్న క్రమం, పోటీ ఒత్తిళ్ల నేపథ్యంలో ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీలు మార్జిన్లను కాపాడుకు నేందుకు స్వల్పకాల నిధుల వాటాను పెంచుకోవచ్చని ఇక్రా అంచనా వేసింది. -
కోవిడ్ పూర్వ స్థాయికి అంతర్జాతీయ ప్రయాణికులు
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ నుంచి విదేశీ రూట్లలో రాకపోకలు సాగించే అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య ఇది కోవిడ్ పూర్వ స్థాయిలో 96–97 శాతం స్థాయికి చేరవచ్చని రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. 2022–23లో ఇది 32.9 కోట్లు – 33.2 కోట్ల స్థాయిలో ఉండవచ్చని పేర్కొంది. 2024 మార్చి ఆఖరు నాటికి అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీ .. కోవిడ్ ముందు స్థాయిని దాటేయొచ్చని వివరించింది. కోవిడ్–19పరమైన ఆంక్షల నేపథ్యంలో దాదాపు రెండేళ్ల తర్వాత ఈ ఏడాది మార్చి 27 నుంచి అంతర్జాతీయ రూట్లలో పూర్తి స్థాయి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇక్రా అంచనాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మూడు నెలలుగా అప్.. అంతర్జాతీయ విమాన ప్రయాణికుల సంఖ్య గత మూడు నెలలుగా క్రమంగా పెరుగుతోంది. జూన్ నెలలో కోవిడ్ పూర్వ స్థాయిలో 79 శాతానికి చేరింది. మొత్తం (దేశీ, అంతర్జాతీయ) విమాన ప్యాసింజర్ల సంఖ్య.. కోవిడ్ ముందు స్థాయిలో 88 శాతానికి పెరిగిందని ఇక్రా సీనియర్ అనలిస్ట్ అభిషేక్ లాహోటి తెలిపారు. పలు కీలక దేశాల్లో విమాన సేవలు తిరిగి ప్రారంభం కావడం, ప్రయాణాలపై ఆంక్షల తొలగింపు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు పూర్తి సామర్థ్యాలతో పనిచేస్తుండటం తదితర అంశాలు అంతర్జాతీయ ప్యాసింజర్ల ట్రాఫిక్ పెరగడానికి దోహదపడుతోందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, మే నెలతో పోలిస్తే జూన్‌లో దేశీయంగా విమాన ప్రయాణికుల రద్దీ కోవిడ్ పూర్వ స్థాయితో పోలిస్తే 98 శాతం నుంచి 91 శాతానికి తగ్గింది. వేసవి సెలవులు ముగియడం, పాఠశాలలు తెరుచుకోవడం, విహారయాత్రలు తగ్గడం వంటి అంశాలు ఇందుకు కారణమని లాహోటి వివరించారు. -
వేగంగా డిమాండ్.. గృహ అమ్మకాలు ఎలా ఉంటాయంటే..?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో ఏడు ప్రధాన నగరాల్లో గృహ అమ్మకాల్లో 3 శాతం వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. మెరుగైన డిమాండ్ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ అవుట్‌లుక్‌ను ప్రతికూల (నెగటివ్) నుండి స్థిరానికి (స్టేబుల్) సవరించినట్లు క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా శుక్రవారం తెలిపింది. ‘అధిక అమ్మకాలు, గృహ యాజమాన్యానికి ప్రాధాన్యత పెరగడం, మెరుగైన స్థోమత, ఎన్నడూ లేనంత తక్కువ గృహ రుణ వడ్డీ రేటు ఈ సవరణకు కారణం. కోవిడ్ తర్వాత డిమాండ్ వేగంగా పెరగడంతో పూర్తి అయిన ప్రాజెక్టుల ధరను సవరించడానికి ఆస్కారం ఏర్పడింది. నిర్మాణ వ్యయం పెరుగుదలను భర్తీ చేయడానికి ప్రాజెక్టులు పూర్తి చేసే సమయాన్నిబట్టి ధరలు అధికం అయ్యే అవకాశం ఉంది. పూర్తయిన ప్రాజెక్ట్‌లలో ఆరోగ్యకరమైన డిమాండ్ అవకాశాలు, ధరల సౌలభ్యం.. వెరశి నిర్మాణ సంస్థలకు లాభదాయకత కొనసాగించడంలో సహాయపడతాయి. గృహ రుణాలపై వడ్డీ రేటు ప్రస్తుత స్థాయి నుండి 50–75 బేసిస్ పాయింట్స్ పెరిగినప్పటికీ డిమాండ్ స్థిరంగా ఉంటుంది. అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య తగ్గడం, స్థిర డిమాండ్‌తో కొత్త ప్రాజెక్టులు గణనీయంగా ప్రారంభం అవుతాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 21 శాతం వృద్ధితో 2022–23లో 40 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త ప్రాజెక్టులు మొదలవుతాయి. మెరుగైన డెలివరీ ట్రాక్ రికార్డ్ ఉన్న పెద్ద, ప్రసిద్ధ బిల్డర్ల మార్కెట్ వాటా పెరుగుతూనే ఉంటుంది. అయితే బలహీనమైన రియల్టర్లు ఇంకా పూర్తిగా కోలుకోలేదు’ అని ఇక్రా వివరించింది. చదవండి: భారత్‌కు మధ్యంతర నిర్మాణాత్మక సమస్యల్లో అవి కూడా: ఐఎంఎఫ్ -
సిమెంటుకు పెరగనున్న డిమాండ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంట్ డిమాండ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7–8 శాతం పెరిగే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. ‘దేశవ్యాప్తంగా 2022–23లో సిమెంట్ అమ్మకాలు దాదాపు 382 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుకోవచ్చని అంచనా. గ్రామీణ గృహాలు, మౌలిక సదుపాయాల రంగాల నుండి బలమైన డిమాండ్ ఇందుకు కారణం. అధిక తయారీ ఖర్చులు, ద్రవ్యోల్బణ ఒత్తిడి కారణంగా పరిశ్రమకు నిర్వహణ లాభం 270–320 బేసిస్ పాయింట్స్ తగ్గి 16.8–17.3 శాతం నమోదు కావొచ్చు. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–ఫిబ్రవరి కాలంలో సిమెంట్ ఉత్పత్తి 323 మిలియన్ మెట్రిక్ టన్నులు. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 22 శాతం అధికం. తుఫాన్లు, అకాల వర్షాలతో 2021 నవంబర్‌లో సిమెంట్ డిమాండ్ పడిపోయింది. డిసెంబర్ నుంచి తిరిగి అమ్మకాలు పుంజుకున్నాయి. 2021–22లో ఉత్పత్తి 18–20 శాతం అధికమై కోవిడ్–19 ముందస్తు స్థాయి 355 మిలియన్ మెట్రిక్ టన్నులని అంచనా’ అని ఇక్రా వివరించింది. వ్యవసాయం, అందుబాటు ధర గృహాలు, మూలధన వ్యయం కోసం ఇటీవల బడ్జెట్లో రూ.9.2 లక్షల కోట్ల కేటాయింపులు జరగడం సిమెంట్ డిమాండ్‌కు ఊతమిస్తుందని ఇక్రా ఏవీపీ, సిమెంట్ విభాగం హెడ్ అనుపమ రెడ్డి తెలిపారు. సిమెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న ప్లాంట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 545 మిలియన్ మెట్రిక్ టన్నులు. సిమెంట్ తయారీలో చైనా తర్వాత ప్రపంచంలో భారత్ రెండవ స్థానంలో ఉంది. చదవండి: ఆల్‌టైమ్ గరిష్టానికి రియల్టీ సెంటిమెంట్ -
వెల్కమ్ చెబుతున్న హోటల్ ఇండస్ట్రీ
న్యూఢిల్లీ: డిమాండ్ మెరుగుపడుతున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే దేశీ హోటల్ పరిశ్రమ .. కోవిడ్ పూర్వ స్థాయికి కోలుకోగలదని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ఒక నివేదికలో పేర్కొంది. వ్యాపారపరమైన ప్రయాణాలు మొదలైనవి పుంజుకుంటున్నప్పటికీ .. దేశీయంగా విహార యాత్రలకు సమీప భవిష్యత్తులో డిమాండ్ పెరిగే అవకాశాలు ఉండటం ఇందుకు దోహదపడగలదని సంస్థ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ వినుత ఎస్ తెలిపారు. స్థిరంగా ఇక్రా నివేదిక ప్రకారం దాదాపు నాలుగు నెలల పాటు కోవిడ్ రెండు, మూడు వేవ్‌ల ప్రతికూల ప్రభావాలు ఉన్నప్పటికీ హోటల్ రంగం 2022 ఆర్థిక సంవత్సరంలో .. కోవిడ్ పూర్వ స్థాయితో పోలిస్తే దాదాపు 60 శాతం మేర ఆదాయాలు ఆర్జించే అవకాశం ఉంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న వ్యయ నియంత్రణ చర్యల తోడ్పాటుతో నిర్వహణ లాభాలు నమోదు చేయవచ్చని నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో దేశీ హోటల్ పరిశ్రమ అవుట్‌లుక్‌ను నెగటివ్ (ప్రతికూల) నుంచి స్టేబుల్ (స్థిర) స్థాయికి మారుస్తున్నట్లు వినుత వివరించారు. విహార యాత్రలకు సంబంధించిన లీజర్ మార్కెట్లలో 2022 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ఆక్యుపెన్సీ అత్యంత మెరుగ్గా ఉన్నట్లు ఇక్రా నివేదిక పేర్కొంది. గోవాలో ఆక్యుపెన్సీ కోవిడ్ పూర్వ స్థాయి కన్నా కోలుకుందని, ముంబై, ఎన్సీఆర్ (దేశ రాజధాని ప్రాంతం)లో కూడా పుంజుకుంటోందని వివరించింది. అక్కడ మాత్రం వ్యాపారపరమైన ప్రయాణాలు ఇంకా అంతగా లేనందున బెంగళూరు, పుణె నగరాల్లో ఆక్యుపెన్సీ ఇంకా మెరుగుపడాల్సి ఉందని నివేదిక పేర్కొంది. అయితే, సీక్వెన్షియల్‌గా చూస్తే వచ్చే కొద్ది నెలల్లో ఈ మార్కెట్లు పుంజుకోగలవని వివరించింది. ‘ఆంక్షల సడలింపు, టీకాల ప్రక్రియ వేగవంతం కావడం, పేరుకుపోయిన డిమాండ్ అంతా కలిసి 2022 ఆర్థిక సంవత్సరం రెండు, మూడో త్రైమాసికంలో విహార యాత్రల రికవరీకి దోహదపడ్డాయి. దేశీయంగా వ్యాపార అవసరాల రీత్యా ప్రయాణాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. నిర్దిష్ట రంగాల్లో ప్రాజెక్టు సైట్లు, తయారీ ప్లాంట్లకు పర్యటనలు పెరుగుతున్నాయి‘ అని ఇక్రా నివేదిక తెలిపింది. ఒమిక్రాన్ ప్రభావం ఉన్నప్పటికీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఆదాయాలు, మార్జిన్లు మెరుగ్గానే ఉండవచ్చని అంచనా వేస్తున్నట్లు వివరించింది. మూడో త్రైమాసికంలో 11 భారీ లిస్టెడ్ సంస్థలు నమోదు చేసిన ఆదాయాల ప్రాతిపదికన ఈ అంచనాలు రూపొందించినట్లు పేర్కొంది. -
ఫార్మా కంపెనీల ఆదాయంలో 6-8 శాతం వృద్ధి: ఇక్రా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ ఔషధ రంగంలో ఉన్న ప్రముఖ సంస్థల ఆదాయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6–8 శాతం మేర పెరిగే అవకాశం ఉందని రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. నివేదిక ప్రకారం, 2021–22లో ఈ కంపెనీలు 8–10 శాతం వృద్ధి చెందాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయాలు ఓ మోస్తరుగా ఉంటాయి. దేశీయంగా 7–9 శాతం, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 12–14 శాతం, యూరప్ వ్యాపారం 7–9 శాతం వృద్ధి నమోదు కానుందని ఇక్రా పేర్కొంది. ధరల ఒత్తిడి కారణంగా అమెరికా మార్కెట్ వృద్ధి నిలకడగా ఉంటుంది. కంపెనీలు క్లిష్ట జనరిక్స్, ఫస్ట్ టు ఫైల్ అవకాశాలు, ప్రత్యేక ఉత్పత్తులపై దృష్టి సారిస్తుండటంతో పరిశోధన, అభివృద్ధి వ్యయాలు ఆదాయాల్లో 6.5–7.5 శాతం ప్రస్తుత స్థాయిలలో స్థిరీకరించబడతాయి. ఇటువంటి ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) విభాగంలో స్థిర పెట్టుబడులు రానున్నాయి. ఇది మధ్య కాలంలో వృద్ధికి, లాభాల మెరుగుదలకు తోడ్పడతాయి.21 కంపెనీల పనితీరును ఆధారంగా చేసుకుని ఇక్రా ఈ విషయాలను వెల్లడించింది. -
ఉక్రెయిన్ - రష్యా యుద్ధం, భారత్ ఎకానమీపై భారీ ఎఫెక్ట్..ఎంతలా ఉందంటే!
ముంబై: భారత్ ఎకానమీపై యుద్ధం ప్రభావం తీవ్రంగా ఉందని దేశీయ రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా అంచనావేసింది. ఏప్రిల్ 1తో ప్రారంభమయ్యే 2022–23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి అంచనాలను 0.8 శాతం (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తగ్గించింది. దీనితో క్రితం 7.8 శాతం అంచనాలు 7.2 శాతానికి తగ్గాయి. ఈ మేరకు విడుదలైన ఒక నివేదికలో ముఖ్యాంశాలు... ►కమోడీటీ ధరల పెరుగుదల ప్రధాన సమస్య. యుద్ధం నేపథ్యంలో తాజా సరఫరాల సమస్యలు తలెత్తుతున్నాయి. ►2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అంచనాలు ప్రస్తు తం 7.8%గా ఉన్నాయి. ఏప్రిల్ మొదటి వారంలో జరగనున్న పాలసీ సమావేశాల్లో ఈ అంకెను తగ్గించే అవకాశం ఉంది. ►ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో వృద్ధి రేటు 5.4% కాగా, నాల్గవ త్రైమాసికంలో (జనవరి–మార్చి 2022) ఈ రేటు 3 నుంచి 4 % మేరకే నమోదయ్యే వీలుంది. ఆర్థిక సంవత్సరం మొత్తంలో వృద్ధి రేటు 8.5%గా ఉంటుందని భావిస్తున్నాం. ►ఊహించినట్లుగానే మహమ్మారి కరోనా మొదటి, రెండవ వేవ్‌లతో పోల్చితే మూడవ వేవ్‌లో ఆర్థిక, ప్రాణ నష్టాలు చాలా తక్కువగానే నమోదయ్యాయి. 2022 మార్చి ప్రారంభంలో ఆర్థిక డేటా మిశ్రమంగా ఉన్నప్పటికీ, రష్యా–ఉక్రెయిన్ వివాదం, వస్తువుల ధరలలో పెరుగుదల ఎకానమీలో అనిశ్చితిని పెంచిం ది. పలు కంపెనీల ఉత్పత్తులపై ఈ ప్రభావం తీవ్రంగా ఉంది. ►ఇంధనం, వంట నూనెల వంటి వస్తువుల అధిక ధరలు మధ్య, దిగువ స్థాయి ఆదాయ వర్గాల విచక్షణ రహిత వ్యయాలను తగ్గించే అవకాశం ఉంది. ఆయా పరిస్థితులు వచ్చే ఆర్థిక సంవత్సరం డిమాండ్ పునరుద్ధరణను అడ్డుకుంటుంది. ►సెప్టెంబరు 2022 వరకు ఉచిత ఆహారధాన్యాల పథకం పొడిగింపు హర్షణీయం. బలహీన ఆర్థిక కుటుంబాల ఆహార బడ్జెట్లకు ఇది కొంత ఉపశమనం కలిగిస్తుంది. ►భారత్ ఎగుమతుల విషయానికి వస్తే, మూడవ త్రైమాసికంతో పోల్చితే నాల్గవ త్రైమాసికంలో (జనవరి–మార్చి) సామర్థ్య వినియోగ స్థాయిలు 72% నుంచి 75%కి పెరిగింది. ►2022–23 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (ఏప్రిల్–సెప్టెంబర్) ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోడానికి కేంద్ర మూలధన వ్యయాలు కీలకంగా మారనున్నాయి. ►ఎకానమీలో వివిధ రంగాల్లో పలు స్థాయిల్లో (కే నమూనాలో) రికవరీ చోటుచేసుకునే అవకాశం ఉంది. సామాజిక, ఆర్థిక అసమానతలు కొనసాగుతాయి. వ్యవసాయంలో వృద్ధి 3 % లోపే... ఇక్రా నివేదిక ప్రకారం, 2022లో రిజర్వాయర్ స్థాయిలు బాగున్నాయి. దీనివల్ల సాధారణం కంటే తక్కువ వర్షపాతం పడినా, వ్యవసాయ రంగంపై అంతగా ప్రతికూల ప్రభావం చూపకపోవచ్చు. అయితే ఎరువుల కొరత వ్యవ సాయ రంగానికి ఆందోళన కలిగించే అంశం. అంతర్జాతీ య మార్కెట్లో పరిమిత లభ్యత, పెరిగిన ధరలు, తక్కువ దిగుమతులు వంటి అంశాలు వ్యవసాయ రం గంపై ప్రతికూలత చూపే అవకాశం ఉంది. అందువల్ల తగిన రిజర్వాయర్ స్థాయిలు, సాధారణ వర్షపాతం ఉన్నప్పటికీ, వ్యవసాయ ఉత్పత్తులు భారీగా పెరిగే అవకాశం లేదు. స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు 14 శాతం వాటా ఉన్న వ్యవసాయ రంగంలో 2022–23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 3%కన్నా తక్కువగా నమోదయ్యే వీలుంది. -
విమానాశ్రయాలకు మంచి రోజులు!
ముంబై: మహమ్మారి వల్ల గత రెండు సంవత్సరాల్లో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన విమానాశ్రయాలకు వచ్చే ఆర్థిక సంవత్సరం (2022–23) మంచి రోజులు రానున్నాయని రేటింగ్ దిగ్గజం ఇక్రా ఒక నివేదికలో పేర్కొంది. సాధారణ అంతర్జాతీయ విమాన సర్వీసుల పునరుద్ధరణ, దేశీయంగా విమానయాన చార్జీల పెంపు దీనికి ప్రధాన కారణమని పేర్కొంది. మహమ్మారి కారణంగా రెండేళ్ల నిషేధం తర్వాత ఆదివారం నుండి అంతర్జాతీయ వాణిజ్య కార్యకలాపాలను పునఃప్రారంభమయిన నేపథ్యంలో విడుదలైన నివేదికలోని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► విమాన ప్రయాణీకుల రద్దీ సంవత్సరం వారీగా 68 నుంచి 70 శాతం మేర వృద్ధి చెంది 2022– 2023 ఆర్థిక సంవత్సరంలో 31.7 కోట్ల నుంచి 32 కోట్ల శ్రేణికి చేరే వీలుంది. ► ఈ అంశాల కారణంగా 2022–23 ఆర్థిక సంవత్సరంలో విమానాశ్రయాల నిర్వహణ ఆదా యం 49–51 శాతం శ్రేణిలో పెరిగి రూ. 14,400–14,600 కోట్లకు చేరుకుంటుంది. ఆపరేటర్లకు 29–30 శాతం ఆపరేటింగ్ మార్జిన్ లభించే అవకాశం ఉంది. 2021–22లో ఈ రేటు 18 నుంచి 19 శాతం ఉంది. అయితే కరోనా ముందస్తు ఏడాది అంటే 2019–20 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈ ఆదాయాల వృద్ధి రేటు (అప్పట్లో 40 శాతం) ఇంకా వెనకబడి ఉండడం గమనార్హం. అయితే ఈ స్థాయి వృద్ధి రేటు తిరిగి 2023–24 ఆర్థిక సంవత్సరంలో నమోదయ్యే వీలుంది. ► అంతర్జాతీయ ట్రాఫిక్ 100–105 శాతం పటిష్ట వృద్ధిని సాధిస్తుంది. అయితే ఈ స్థాయిలో మంచి గణాంకాల సాధనకు నాల్గవవేవ్ సవాళ్లు తలెత్తకూడదు. ఒకవేళ ఈ సవాళ్లు వచ్చినా దాని ప్రభావం అతి తక్కువగా ఉండాల్సి ఉంటుంది. ► ఇక మార్చి 31తో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వస్తే, పాసింజర్ ట్రాఫిక్ 62 నుంచి 64 శాతం పెరిగి 18.7 కోట్ల నుంచి 18.9 కోట్ల శ్రేణిలో నమోదుకావచ్చు. ఒమిక్రాన్ సవాళ్లు ఎదురయినప్పటికీ, ఈ స్థాయి వృద్ధి రేటు నమోదుకు పటిష్ట వ్యాక్సినేషన్ కారణం. ► అంతర్జాతీయ విమానాల పునఃప్రారంభం కారణంగా ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్యం, ఐరోపా దేశాల నుంచి ట్రాఫిక్ గణనీయంగా మెరుగుపడుతుంది. పెట్టుబడులు ఇలా.. ఇదిలాఉండగా ఇక్రా నివేదిక ప్రకారం, విమానయాన రంగం వచ్చే ఐదేళ్లలో రూ.90,000 కోట్ల కొత్త పెట్టుబడులను పొందే వీలుంది. ఇందులో ప్రధాన ప్రైవేట్ విమానాశ్రయాల్లో కొనసాగుతున్న సామర్థ్య విస్తరణ, ఎయిర్పోర్ట్ అధారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నిర్వహించే విమానాశ్రయాల్లో ఆ సంస్థ రూ. 25,000 కోట్ల పెట్టుబడులు, 21 కొత్త గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటుకు రూ. 30,000 –34000 కోట్లు, ఏఏఐ నుంచి స్వాధీనం చేసుకున్న ఆరు విమానాశ్రయాలను అప్‌గ్రేడ్ చేయడానికి అదానీ గ్రూప్ పెడుతున్న దాదాపు రూ. 17,000 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. -
డబ్బే డబ్బు!!స్టాక్ మార్కెట్లోకి పెట్టుబడుల వరద!
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22)లో బ్రోకరేజీ పరిశ్రమ 30 శాతం వృద్ధిని సాధించనున్నట్లు రేటింగ్ దిగ్గజం ఇక్రా తాజాగా అభిప్రాయపడింది. దీంతో పరిశ్రమ టర్నోవర్ రూ.28,000 కోట్లకు చేరనున్నట్లు అంచనా వేసింది. అయితే వచ్చే ఏడాది(2022–23)లో వృద్ధి మందగించవచ్చని, ఔట్లుక్ మాత్రం నిలకడగానే ఉన్నట్లు తెలియజేసింది. కరోనా మహమ్మారి తొలి దశ నీరసించిన 2020 జూన్ నుంచి మార్కెట్లు జోరందుకున్నట్లు పేర్కొంది.దీంతో రికార్డులు నెలకొల్పుతూ మార్కెట్లు సాగుతున్నట్లు తెలియజేసింది.కోవిడ్–19 దెబ్బకు కుప్పకూలిన 2020 మార్చితో పోలిస్తే స్టాక్ ఇండెక్సులు రెట్టింపుకంటే అధికంగా పెరిగినట్లు వెల్లడించింది. ఈ బాటలో చరిత్రాత్మక గరిష్టాలను తాకినట్లు ప్రస్తావించింది.సగటున 38 శాతం ఆదాయ వృద్ధి సాధిస్తున్న 18 బ్రోకరేజీలను పరిగణించి నివేదిక రూపొందించినట్లు ఇక్రా వెల్లడించింది. నివేదిక ప్రకారం.. రిటైలర్ల ఖుషీ 2020 ఏప్రిల్ నుంచి స్టాక్ మార్కెట్లపట్ల కొత్త ఇన్వెస్టర్ల ఆసక్తి భారీగా పెరుగుతూ వచ్చింది. దీంతో డీమ్యాట్ ఖాతాల సంఖ్య మూడు రెట్లు ఎగసింది.2020 మార్చిలో 408 లక్షలుగా నమోదైన డీమ్యాట్ ఖాతాలు గత(2021) మార్చికల్లా 551 లక్షలకు చేరాయి.ఈ బాటలో డిసెంబర్‌కల్లా ఈ సంఖ్య 806 లక్షలను తాకింది. వెరసి ఈ ఆర్థిక సంవత్సరంలో నికరంగా నెలకు 28.33 లక్షల చొప్పున కొత్త ఖాతాలు జమయ్యాయి. గతేడాది(2020–21)లో ఈ సంఖ్య 11.91 లక్షలుకాగా..2019–20లో నెలకు కేవలం 4.1 లక్షలు చొప్పున కొత్త డీమ్యాట్ ఖాతాలు జత కలిశాయి.అంటే గతేడాదితో పోల్చి చూసినా కొత్త ఖాతాల సంఖ్య రెట్టింపు వేగాన్ని అందుకుంది. సరికొత్త రికార్డ్ ప్రధానంగా రిటైల్ ఇన్వెస్టర్లు పెరగడంతో బ్రోకింగ్ పరిశ్రమ ఈ ఏడాది సరికొత్త రికార్డును నెలకొల్పనుంది. ఇందుకు భారీ లిక్విడిటీ పరిస్థితులు సైతం దన్నునిస్తున్నాయి. ఫలితంగా పరిశ్రమ టర్నోవర్ రూ.27,000–28,000 కోట్లకు చేరనుంది. ఇది 28–33 శాతం మధ్య వృద్ధికి సమానం. ఈ ఏడాది లావాదేవీల పరిమాణం ఊపందుకోవడంతోపాటు..సగటు పెట్టుబడి సైతం పెరగడంతో అధిక ఆదాయానికి దారి ఏర్పడింది. లావాదేవీల పరిమాణం ఆధారంగా బ్రోకింగ్ ఫీజు లభించే సంగతి తెలిసిందే. దీంతో రిటైల్ ఆధారిత బ్రోకరేజీలకు ఒక్కో క్లయింటుపై సగటు ఆదాయం 25 శాతం పుంజుకుని రూ.12,788కు చేరింది. గతేడాదిలో ఇది రూ.10,238 మాత్రమే. 5–7 శాతమే వచ్చే ఏడాది బ్రోకరేజీ పరిశ్రమ నిలకడను చూపనుంది. ఆదాయం 5–7 శాతం బలపడే వీలుంది. దీంతో రూ.28,500–29,000 కోట్ల టర్నోవర్ నమోదుకావచ్చు. కాగా.. రిటైల్ ఇన్వెస్టర్ల జోరుతో ఈ ఏడాది తొలి 9 నెలల్లో ట్రేడింగ్ పరిమాణం సైతం 179 శాతం జంప్ చేసింది. రోజువారీ సగటు టర్నోవర్ 126 శాతం ఎగసి రూ. 63.07 లక్షల కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది(2019–20)లో ఇది 14.39 లక్షల కోట్లు మాత్రమే. -
తగ్గదేలే: పురుషులకు సమానంగా,రూ.100లో రూ.85 మహిళలే సంపాదిస్తున్నారు
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ (ఐఐఎం-ఏ) నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ అధ్యయనం ప్రకారం మనదేశంలోని మహిళా ఎగ్జిక్యూటివ్‌లు వారి పురుష సహచరులు సంపాదించే ప్రతి రూ.100కి సగటున రూ.85 సంపాదిస్తున్నట్లు తేలింది. ఇంటికే పరిమితం.. భర్త, పిల్లలు, కుటుంబ పోషణ మాత్రమే ఆమె విధి...అంటూ కొన్నేళ్ల క్రితం మహిళలకు సంబంధించి పరిచయ వాక్యాలు ఉండేవి. కానీ ఇప్పుడు..ఇంటా మేమే,బయటా మేమే అన్నట్లుగా అన్ని రంగాల్లోనూ మహిళలు ప్రతిభ కనబరుస్తున్నారు. శాస్త్ర, సాంకేతిక, ఉద్యోగ రంగాల్లోనే కాదు..వృత్తి, వ్యాపారాల్లోనూ మహిళలు సాధిస్తున్న విజయాలు అన్నీ ఇన్నీ కావు. అంతెందుకు ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో మనదేశంలో మహిళా ఎగ్జిక్యూటివ్‌లు వారి పురుష సహచరులు సంపాదించే ప్రతి రూ.100కి సగటున రూ.85 సంపాదిస్తున్నట్లు తేలింది. ►ఇక్రా చైర్పర్సన్ అరుణ్ దుగ్గల్ ఆధ్వర్యంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ (ఐఐఎం-ఏ) హెచ్ ఆర్ అసోసియేట్ప్రొఫెసర్ ప్రొమిలా అగర్వాల్ 'ది గ్లాస్ సీలింగ్- లీడర్షిప్ జెండర్ బ్యాలెన్స్ ఇన్ ఎన్ఎస్ఈ 200 కంపెనీస్ పేరిట సర్వే నిర్వహించారు. ►గతేడాది నేషనల్ స్టాక్ ఎక్ఛేంజ్‌లో నమోదు చేసుకున్న 200 కంపెనీల్లోని 109కంపెనీలకు చెందిన సుమారు 4వేల కంటే ఎక్కువ మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల అభిప్రాయం ఆధారంగా నివేదికను తయారు చేశారు. ఆ నివేదికలో దేశంలోని కంపెనీల టాప్, సీనియర్ మేనేజ్మెంట్లో మహిళల ప్రాతినిధ్యం డైరెక్టర్ల బోర్డులలో ఉండాల్సిన మహిళల శాతం కంటే గణనీయంగా తక్కువగా ఉందని తేలింది. ►సంస్థల సీనియర్ మేనేజ్మెంట్లో మహిళల ప్రాతినిధ్యం కేవలం 7 శాతం మాత్రమేనని, ఇది టాప్ మేనేజ్మెంట్ స్థాయిలో కేవలం 5 శాతానికి దిగజారింది. అయితే, సర్వే ప్రకారం.. నియంత్రణ అవసరాల కారణంగా ఎన్ఎస్ఈలో నమోదైన 500 కంపెనీల్లో ఉన్నత స్థాయిలో ఉన్న మహిళా డైరెక్టర్ల సంఖ్య 2014లో 4.5 శాతం నుండి 2022 నాటికి 16 శాతానికి పెరిగింది. ►200 సంస్థలలో 21 సంస్థల్లో టాప్ మేనేజ్మెంట్లో ఒక మహిళ మాత్రమే ఉండగా, 76 సంస్థల్లో టాప్ మేనేజ్మెంట్లో ఒక్క మహిళ కూడా లేరని కూడా ఇది హైలైట్ చేసింది. ►మహిళా సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల సంఖ్య అత్యధికంగా ఉన్న పరిశ్రమలు వినియోగదారుల సేవలు, వినియోగ వస్తువులు, ఆర్థిక సేవలు, ఔషధాలు, సమాచార సాంకేతికత విభాగాలు ఉన్నాయని సర్వేలో తేలింది. ►నివేదికలో మహిళా ఎగ్జిక్యూటివ్‌లకు తీసుకునే జీతాలు రూ.1.91 కోట్లుగా ఉండగా.. అదే స్థాయి హోదాలో ఉన్న వారి పురుష సహచరులు ఆర్జిస్తున్న జీతం రూ. 2.24 కోట్లుగా ఉంది. -
ప్రభావం చూపని ఒమిక్రాన్, వృద్ధి సాధించనున్న హౌసింగ్ ఫైనాన్స్
ముంబై: హౌసింగ్ ఫైనాన్స్ రుణ ఫోర్ట్‌ఫోలియో మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8 నుంచి 10 శాతం వృద్ధిని నమోదుచేసుకునే అవకాశం ఉందని ఇక్రా రేటింగ్స్ తన తాజా నివేదికలో పేర్కొంది. రానున్న ఏప్రిల్ నుంచి ప్రారంభం అయ్యే 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఈ వృద్ధి రేటు 9 నుంచి 11 శాతం ఉంటుందన్నదని ఇక్రా అంచనా. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► 2021–22 మొదటి త్రైమాసికంలో (2020 ఏప్రిల్–జూన్) నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు–హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల (ఎన్బీఎఫ్సీ–హెచ్ఎఫ్సీ) రుణ పంపిణీలపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం పడింది. అయితే రెండవ త్రైమాసికంలోనే (జూలై–సెప్టెంబర్) చక్కటి రికవరీ చోటుచేసుకుంది. 2021–22 మొదటి ఆరు నెలల (ఏప్రిల్–సెప్టెంబర్) కాలాన్ని పరిశీలిస్తే, వాటి ఆన్ బుక్ పోర్ట్‌ఫోలియో 9 శాతం పెరిగి రూ.11.6 లక్షల కోట్లుగా నమోదయ్యింది. ►ఇదే ధోరణి ఆర్థిక సంవత్సరం మొత్తంలో కనబడుతుందని భావిస్తున్నాం. దేశంలో వ్యాక్సినేషన్ విస్తృతి, ఎకానమీ క్రియాశీలత మెరుగ్గా ఉండడం, పరిశ్రమ డిమాండ్ మెరుగుపడ్డం, కోవిడ్–19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యవస్థలో అనుకున్నంత ఆందోళనలు సృష్టించకపోవడం వంటి అంశాలు దీనికి కారణం. ►ఈ విభాగంలో మొండిబకాయిలు సైతం మొదటి త్రైమాసికంతో పోల్చితే రెండవ త్రైమాసికం నుంచి గణనీయంగా మెరుగుపడ్డం ప్రారంభమైంది. వసూళ్ల సామర్థ్యం (సీఈ) బలపడింది. మొదటి త్రైమాసికంతో పోల్చితే రెండవ త్రైమాసికంలో స్థూల ఎన్పీఏలు 50 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) మెరుగుపడ్డాయి. ►హౌసింగ్ ఫైనాన్స్ రంగంలో రుణ పునర్వ్యవస్థీకరణల డిమాండ్ కూడా గణనీయంగా పెరిగింది. 2021 మార్చి 31వ తేదీ నాటికి పునర్వ్యవస్థీకరణ డిమాండ్ మొత్తం ఏయూఎం (అసెట్ అండర్ మేనేజ్మెంట్) 1.1 శాతం ఉంటే, 2021 సెప్టెంబర్ 30 నాటికి 2.3 శాతానికి పెరిగింది. అయితే 2022 మార్చి 31వ తేదీ నాటికి ఈ శాతం స్వల్పంగా 2 నుంచి 2.1 శాతం శ్రేణికి తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. రికవరీలు బాగుండడం, డిఫాల్ట్‌లు తగ్గడం వంటి అంశాలు దీనికి కారణం. ► ఇక హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల లాభదాయకత 2020–21 ఆర్థిక సంవత్సరం తరహాలోనే 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఎటువంటి భారీ పెరుగుదలా లేకుండా మామూలుగా కొనసాగే అవకాశం ఉంది. నిధుల సమీకరణ వ్యయాలు పెరగడం దీనికి కారణం. అయితే 2022–23లో లాభదాయకత కోవిడ్–19 ముందస్తు స్థాయికి వేరే అవకాశం ఉంది. -
ఈ సారి బడ్జెట్లో బ్యాంకులకు ఉత్తచేయి!
ముంబై: కేంద్రం 2022–23 వార్షిక బడ్జెట్లో బ్యాంకులకు ఎటువంటి మూలధన కేటాయింపులూ జరిపే అవకాశం లేదని రేటింగ్ ఏజెన్సీ– ఇక్రా అంచనా వేస్తోంది. దేశీయ బ్యాంకింగ్ సొంతంగా నిధులు సమీకరించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండడమే దీనికి కారణంగా తెలిపింది. గడచిన ఆరు సంవత్సరాల్లో కేంద్రం ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.3.36 లక్షల కోట్ల మూలధనం సమకూర్చినట్లు కూడా తన నివేదికలో పేర్కొంది. గత కొన్ని సంవత్సరాలుగా వార్షిక బడ్జెట్లు ప్రవేశపెట్టే సందర్భంగా బ్యాంకులకు మూలధనం కేటాయింపుల పరిమాణంపై పెద్ద చర్చ జరిగే సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్న నేపథ్యలో విడుదలైన ఇక్రా నివేదికలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. - బ్యాంకింగ్‌కు సొంతంగా నిధులు సమీకరించే అవకాశం ఉందని ఆర్థిక శాఖ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే ప్రాతిపదికన ఈ దఫా బడ్జెట్లో నిధుల కేటాయింపులు జరక్కపోతే, ప్రభుత్వ రంగ బ్యాంకులు అంతర్గత వనరులు, మార్కెట్ వర్గాల ద్వారా నిధులను సమీకరించుకునే వీలుంది. బడ్జెట్లో నిధులు కేటాయింపులు జరక్కపోతే గడచిన దశాబ్ద కాలంలో ఈ తరహా చర్య ఇదే తొలిసారి అవుతుంది. - పన్ను చెల్లింపుదారుల డబ్బు నుంచి బ్యాంకులకు గడచిన ఆరేళ్ల కాలంలో ప్రభుత్వం రూ. 3.36 లక్షల కోట్లకు పైగా నిధుల కేటాయింపులు జరిపిన నేపథ్యంలో, ప్రభుత్వ బ్యాంకుల నికర నిరర్థక ఆస్తుల (ఎన్పీఏ) పరిమాణం సెప్టెంబర్ 2021 నాటికి (రుణాల్లో) 2.8 శాతానికి తగ్గింది. మార్చి 2018లో ఈ పరిమాణం 8 శాతం కావడం గమనార్హం. - ఎంతోకాలంగా పేరుకుపోయిన నిరర్ధక ఆస్తులపై అధిక కేటాయింపులు, ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆదాయాలు మెరుగుపడినట్లు కనబడుతోంది. ఈ కారణంగానే పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు లాభదాయకతో ఉన్నాయని, అంతర్గతంగా నిధులు సమీకరణ సత్తాను సముపార్జించుకున్నాయని భావించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. - ఎన్ఏఆర్సీఎల్(నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లేదా బ్యాడ్ బ్యాంక్) కార్యకలాపాలు ప్రారంభిస్తున్నందున, దీర్ఘకాలంగా తెగని సమస్యగా ఉన్న ఎన్పీఏల నుంచి రికవరీలు చోటుచేసుకునే వీలుంది. ఇది బ్యాంకుల లాభాలను మున్ముందు సంవత్సరాల్లో మెరుగుపరచే అంశం. - 2021–22 ఆర్థిక సంవత్సరం కాల్ ఆప్షన్ కోసం చెల్లించాల్సిన తమ అదనపు టైర్ 1 బాండ్లను ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు రోల్ ఓవర్ చేయగలిగాయి. ఇది బ్యాంకుల ఇష్యూల కోసం పెట్టుబడిదారుల బలమైన కోరికను ప్రతిబింబిస్తుంది. బ్యాంకుల భవిష్యత్ ఇష్యూలకు కూడా ఇది శుభ సూచిక. ఇది వారి భవిష్యత్ జారీలకు మంచి సూచన అని పేర్కొంది. - బ్యాంకులు ఇటీవలి సంవత్సరాలలో చేసినట్లుగానే మున్ముందూ మార్కెట్ మార్గాల ద్వారా మూలధన సేకరణ జరిపే అవకాశం ఉంది. క్లీనర్ బ్యాలెన్స్ షీట్లు, మెరుగైన ఆదాయాలు ఇందుకు దోహదపడే అంశం. - ఆర్బీఐ నుండి శాశ్వత రీఫైనాన్స్ విండో కోసం బడ్జెట్లో కొంత కేటాయింపు ఉండే అవకాశం ఉంది. - నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు– ఎన్‌బీఎఫ్‌సీలకు (మౌలిక రంగం యేతర) సమీప కాల నిధుల లభ్యత కోసం కొన్ని ద్రవ్య పరమైన, హామీతో కూడిన పథకాలు బడ్జెట్లో చోటుచేసుకునే వీలుంది. ఈ రంగానికి మధ్య కాలానికి మద్దతు లభించే చర్యలను ప్రకటించే వీలుంది. ఇది పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచుతుంది, ఈ రంగం స్థిరమైన పునరుద్ధరణకు దోహదపడుతుంది. ఒమిక్రాన్ ఎఫెక్ట్ ఆర్థిక వ్యవస్థపై ఒమిక్రాన్ ప్రభావం తీవ్రంగా ఉన్న పక్షంలో బ్యాంకుల స్థూల మొండిబాకీలు (జీఎన్‌పీఏ) 2022 సెప్టెంబర్ నాటికి ఏకంగా 8.1–9.5 శాతానికి ఎగియవచ్చని ఆర్బీఐ ఆర్థిక స్థిరత్వ నివేదిక హెచ్చరిస్తోంది. 2021 సెప్టెంబర్‌లో ఇవి 6.9 శాతంగా ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో జీఎన్‌పీఏలు 8.8 శాతంగా ఉండగా 2022 సెప్టెంబర్ నాటికి ఇవి 10.5 శాతానికి ఎగియవచ్చని అంచనా. అలాగే ప్రైవేట్ బ్యాంకుల్లో 4.6 శాతం నుంచి 5.2 శాతానికి, విదేశీ బ్యాంకుల్లో 3.2 శాతం నుంచి 3.9 శాతానికి పెరగవచ్చని నివేదిక అంచనా వేసింది. విభాగాలవారీగా చూస్తే వ్యక్తిగత, హౌసింగ్, వాహన రుణాల్లో జీఎన్‌పీఏ పెరుగుతోంది. మరోవైపు, ఫుడ్ ప్రాసెసింగ్, రసాయనాలు వంటి కొన్ని ఉప–విభాగాలు మినహాయిస్తే పారిశ్రామిక రంగంలో జీఎన్‌పీఏల నిష్పత్తి తగ్గుతోంది. -
ఆటో విడిభాగాల పరిశ్రమ జోరు, పీవీ - ట్రాక్టర్లకు డిమాండ్
ముంబై: ఆటో విడిభాగాల పరిశ్రమ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22)లో మంచి వృద్ధిని చూస్తుందని.. కంపెనీల ఆదాయం 20–23 శాతం పెరగొచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. దేశీ ఆటోమొబైల్ రంగం కోలుకోవడానికి తోడు, ఎగుమతులు సైతం బలంగా ఉండడం వృద్ధికి మద్దతునిచ్చే అంశాలుగా పేర్కొంది. అయితే, కీలక ముడి సరుకుల ధరలు అధికంగా ఉండడం, సెమీ కండక్టర్ల కొరత పరిశ్రమను వేధిస్తున్న అంశాలుగా తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఆటో విడిభాగాల పరిశ్రమ మంచి రికవరీని చూసినట్టు వివరించింది. ప్రయాణికుల వాహనాలు (పీవీ), ట్రాక్టర్లకు డిమాండ్ బలంగా ఉందని.. కరోనా ముందస్తు నాటి డిమాండ్ స్థాయికి చేరుకున్నట్టు నివేదికలో పేర్కొంది. మధ్యతరహా, భారీ వాణిజ్య వాహనాల విభాగాలు సైతం కోలుకుంటున్న సంకేతాలను ఇస్తున్నాయని తెలిపింది. పెరిగిన ముడి పదార్థాల ధరలను బదలాయించినట్టయితే ఇది కూడా ఆదాయ వృద్ధికి తోడ్పడే అంశమేనని పేర్కొంది. పరిశ్రమ స్థూల మార్జిన్లు 2021–22 మొదటి మూడు నెలల్లో సీక్వెన్షియల్‌గా (మార్చి త్రైమాసికం నుంచి) మెరుగుపడినట్టు.. నివేదికలో వివరించింది. నివేదికలోని మరిన్ని అంశాలను పరిశీలిస్తే... చదవండి : ఫేస్బుక్ సమర్పించు....వరల్డ్రూమ్ ♦పరిశీలనలోకి తీసుకున్న 50 ఆటో పరికరాల విభాగాలను తీసుకుంటే, వార్షికంగా క్యూ1లో పటిష్ట స్థాయిలో 140 శాతం వృద్ధి నమోదయ్యింది. లో–బేస్ ఎఫెక్ట్ నామమాత్రంగా ఉంది. ♦సీక్వెన్షెయల్గా చూస్తే, (మార్చి త్రైమాసికంతో పోల్చి) సెకండ్ వేవ్ సవాళ్లు ఉన్నప్పటికీ, క్షీణత 19 శాతానికి పరిమితమైంది. అంచనాలు 30 నుంచి 35 శాతం క్షీణతకన్నా ఇది ఎంతో తక్కువ. ♦త్రైమాసికంగా 19 శాతం క్షీణతలోనూ టైర్లు, బ్యాటరీలు వంటి విడిభాగాల క్షీణత కేవలం 13కే పరిమితమైంది. ♦ కీలక ముడిపదార్థాలు, కమోడిటీ ధరలు తీవ్రంగా ఉండడం ప్రస్తుతం ఈ పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాలు. ♦గ్లోబల్ సెమీ కండక్టర్ డిమాండ్‌లో భారత్ ఆటోమోటివ్ ఇండస్ట్రీ వాటా 11 శాతం. అయితే ఇప్పుడు వీటి కొరత పరిశ్రమకు సవాలుగా మారింది. ఈ విభాగంలో ఊహించినదానికన్నా పటిష్ట రికవరీ, కొన్ని సెమీ–కండక్టర్ తయారీ సంస్థల్లో సరఫరాల సమస్యలు, అంతర్జాతీయంగా పెరిగిన చిప్ కొరత సవాళ్లు ఇక్కడ పరిశీలనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ♦పరిశ్రమలో సరఫరాల సవాళ్లు తొలగిపోలేదు. కొన్ని మోడళ్లు, వేరియెంట్లకు సంబంధించి సరఫరాలు నాలుగు నెలలకుపైగా ఆగిపోతున్న పరిస్థితి ఉంది. డిమాండ్ పటిష్టంగా ఉన్నప్పటికీ సరఫరాలు అందుకు తగిన విధంగా లేవు. 2021 క్యాలెండర్ ఇయర్ వరకూ ఈ పరిస్థితి కొనసాగుతునందని పరిశ్రమ ప్రతినిధులు అంచనావేస్తున్నారు. ♦పరిశ్రమ ఆదాయాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్న అంశమిది. ♦కోవిడ్–19 సెకండ్‌వేవ్ వల్ల ఆటో విడిభాగాల సరఫరాదారుల్లో మెజారిటీ భాగం ఆపరేటింగ్ మార్జిన్లు తగ్గాయి. -
రద్దీ పెరిగిపోతుంది, 49 లక్షలకు చేరిన విమాన ప్రయాణికులు
న్యూఢిల్లీ: దేశీయ విమాన ప్రయాణీకుల రద్దీ క్రమంగా పెరుగుతోంది. జూన్ నెలతో పోలిస్తే జులైలో ప్యాసింజర్ ట్రాఫిక్ 57 శాతం వృద్ధి చెంది 49 లక్షలకు చేరింది. గతేడాది జూన్‌లో రద్దీ 31.1 లక్షలుగా ఉందని.. ఏడాది కాలంతో పోలిస్తే 132 శాతం వృద్ధి రేటు నమోదయిందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. ఈ ఏడాది జులైలో సగటున ప్రతి విమానంలో 104 మంది ప్రయాణికులు ప్రయాణించారు. ఇదే జూన్ నెలలో ప్యాసింజర్ సంఖ్య 98గా ఉంది. ఇదే సమయంలో ఎయిర్‌లైన్స్ సామర్థ్యం కూడా పెరిగింది. గతేడాది జులైలో 24,770 విమానాలు డిపార్చర్ కాగా.. ఈ ఏడాది జులై నాటికి 90 శాతం పెరుగుదలతో 47,200 ఎయిర్‌లైన్స్ డిపార్చర్ అయ్యాయని పేర్కొంది. సగటు రోజు వారీ డిపార్చర్స్ చూస్తే.. గతేడాది జులైలో 800 విమానాలు కాగా.. ఈ ఏడాదికవి 1,500లకు పెరిగాయి. జూన్ నెలలో రోజుకు 1,100 ఎయిర్‌లైన్స్ డిపార్చర్ జరిగాయని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ అండ్ కో–గ్రూప్ హెడ్ కింజల్ షా వివరించారు. ప్రయాణికుల రద్దీ పెరుగుతున్నప్పటికీ విమానాశ్రయ సంస్థలపై ఒత్తిడి ఇంకా కొనసాగుతూనే ఉందని తెలిపారు. పలు రాష్ట్రాల్లో ప్రయాణ ఆంక్షల నేపథ్యంలో లీజర్, వ్యాపార ప్రయాణాలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయని.. కేవలం అత్యవసరమైన వాటికి మాత్రమే ప్రయాణాలు చేస్తున్నారని పేర్కొన్నారు -
మొండిబకాయిలు, బంగారం విషయాల్లో రిస్క్ తక్కువేనంట
ముంబై: కరోనా సెకండ్‌వేవ్ నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల(ఎన్బీఎఫ్సీ) రుణాలపైనా ప్రతికూల ప్రభావం చూపనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) ముగిసే మార్చి నాటికి ఎన్‌బీఎఫ్‌సీల మొండిబకాయిలు (ఎన్పీఏ) ఒక శాతం వరకూ పెరిగే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేస్తోంది. ఇదే జరిగితే ఒత్తిడిలో ఉన్న ఎన్‌బీఎఫ్‌సీల రుణ శాతం దాదాపు 8 శాతం వరకూ (దాదాపు రూ.2 లక్షల కోట్లు) పెరిగే అవకాశం ఉంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణ పునర్ వ్యవస్థీకరణసైతం రెట్టింపై 3.3 శాతానికి చేరవచ్చని అంచనావేసింది. 2020–21లో ఇది 1.6 శాతం మాత్రమే కావడం గమనార్హం. తగ్గిన వసూళ్ల సామర్థ్యం.. ఎన్బీఎఫ్సీలతోపాటు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల (హెచ్ఎఫ్సీ) వసూళ్ల సామర్థ్యం మహమ్మారి వల్ల తీవ్రంగా పడిపోయినట్లు ఇక్రా పేర్కొంది. మూడవవేవ్ సమస్యలు లేకుండా ఉంటే, ఈ రంగం కొంత మెరుగుపడే అవకాశం ఉందని విశ్లేషించింది. ఆయా అంశాల నేపథ్యంలో ఈ రంగానికి ‘‘నెగటివ్’’ అవుట్‌లుక్ ఇస్తున్నట్లు పేర్కొంది. నాన్ బ్యాంకింగ్ రూ.24 లక్షల కోట్ల రుణాల్లో 30 శాతం ‘‘హై రిస్క్ కేటగిరీ’’ (తీవ్ర ఇబ్బందికరమైన)లో ఉన్నాయని పేర్కొంది. ఆయా రంగాలను పరిశీలిస్తే, సూక్ష్మ, వ్యక్తిగత, లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఇచ్చిన రుణాలు ఇందులో ఉన్నాయని పేర్కొంది. రియల్టీ కూడా ఇదే కోవలోకి వస్తుందని తెలిపింది. అయితే బంగారం, హౌసింగ్ విషయాల్లో రిస్క్ కొంత తక్కువగా ఉందని వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ రంగానికి రూ.2 లక్షల కోట్ల అదనపు మూలధనం అవసరం అవుతుందని కూడా ఇక్రా అంచనావేస్తోంది. -
నాలుగేళ్లలో ఈ రంగంలో రూ.3.5 లక్షల కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: భారత్ పునరుత్పాదక ఇంధన (ఆర్ఈ) సామర్థ్యం వచ్చే ఏడాది మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021–22) మరో 11 గిగావాట్లు (జీడబ్ల్యూ) పెరిగే అవకాశం ఉందని క్రెడిట్ రేటింగ్ సంస్థ ఇక్రా తన తాజా నివేదికలో పేర్కొంది. మాడ్యూల్ ధరల పెరుగుదల వల్ల సోలార్ బిడ్ టారిఫ్‌లు పెరిగినప్పటికీ, ఈ రంగం పురోగమిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. ‘‘2019–20 ఆర్థిక సంవత్సరంలో పునరుత్పాదక ఇంధన రంగం అదనపు సామర్థ్యం 8.7 గిగావాట్లు పెరిగింది. అయితే కోవిడ్ మహమ్మారి ప్రేరిత సవాళ్ల పరిస్థితుల్లో 2020–21 ఆర్థిక సంవత్సరం ఈ వేగం మందగించి పురోగతి 7.4 జీడబ్ల్యూకు పడిపోయింది. కాగా, 2021–22లో తిరిగి ఈ విభాగం 10.5 నుంచి 11 జీడబ్ల్యూ వరకూ అదనపు సామర్థ్యాన్ని సాధించే అవకాశం ఉంది’’ అని ఇక్రా విడుదల చేసిన ఒక ప్రకటన తెలిపింది. ఈ రంగంలో 38 గిగావాట్ల పటిష్ట ప్రాజెక్ట్ పైప్‌లైన్ అమలు జరుగుతున్న విషయాన్నీ ఇక్రా గుర్తు చేసింది. అలాగే మరో 20 గిగావాట్ల ప్రాజెక్టులు వివిధ నోడెల్ ఏజెన్సీల నుంచి టెండరింగ్ దశలో ఉండడాన్ని ప్రస్తావించింది. ఆయా అంశాలన్నీ ఈ రంగాన్ని సమీప కాలంలో పటిష్టం చేస్తాయని విశ్లేషించింది. ఈ విభాగానికి సంబంధించి ఇక్రా నివేదిక తదితర అంశాలను పరిశీలిస్తే.. ► భారత్ ప్రస్తుత పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 136 గిగావాట్లు. 2022 నాటికి దాదాపు 180 గిగావాట్లకు పెంచాలన్నది కేంద్రం లక్ష్యం. 2030 నాటికి ఈ లక్ష్యం 450 గిగావాట్లగా ఉంది. దీన్ని సాధిస్తే మొత్తం విద్యుత్‌లో పునరుత్పాదక ఇంధన విద్యుత్ వాటా 54 శాతానికి చేరుకుంటుంది. ► వచ్చే నాలుగేళ్లలో ఈ రంగంలోకి రూ.3.5 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయన్నది అంచనా. ► భారత్ మొత్తం విద్యుత్ వ్యవస్థీకృత సామర్థ్యంలో పోల్చితే 2021 మార్చి నాటికి పునరుత్పాదక ఇంధన సామర్థ్య 25 శాతం అయితే 2025 మార్చి నాటికి ఇది 34 శాతానికి చేరుతుందని అంచనా. ► అయితే ఈ రంగంలో సవాళ్లు కూడా ఉన్నాయి. విద్యుత్ కొనుగోలు, అమ్మకం ఒప్పందాలపై (పీపీఏలు పీఎస్ఏలు) సంతకాల్లో ఆలస్యం అయిన సందర్భాలు గతంలో ఉన్నాయి. టారిఫ్‌లు తగ్గుతాయన్న అంచనాలతో బిడ్స్ రద్దయిన నేపథ్యమూ ఉంది. ఈ తరహా అంశాలు ఇకముందూ సవాలుగా కొనసాగే అవకాశం ఉంది. ► నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు భూ సేకరణ, మౌలిక సదుపాయాల పెంపు వంటి సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రత్యేకించి పవన విద్యుత్ విషయంలో ఈ తరహా ఇబ్బందులు కొనసాగే వీలుంది. ► డిస్కమ్‌ల నుంచి పునరుత్పాదక ఇంధన స్వతంత్ర విద్యుత్ ఉత్పత్తిదారులకు (ఐపీపీ) బకాయిల విలువ 2021 ఏప్రిల్ నాటికి రూ.11,840 కోట్లని పీఆర్ఏఏపీటీఐ పోర్టల్ పేర్కొంటోంది. ► ఈ రంగానికి ఇక్రా ‘సేబుల్’ అవుట్‌లుక్ కొనసాగుతుంది. ప్రభుత్వం నుంచి కొనసాగుతున్న విధానపరమైన మద్దతు, భారీ వృద్ధి అవకాశాలు, సెంట్రల్ నోడల్ ఏజెన్సీలకు సంబంధించి రుణ సామర్థ్యాలు, చార్జీల విషయంలో పోటీతత్వం వంటి అంశాలు దీనికి కారణం. సోలార్ పీవీ మాడ్యూల్స్ తయారీకి కూడా ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాన్ని వర్తింపచేయడం ఈ రంగానికి సానుకూల అంశం. ► దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించుకోవడం, దేశీయ తయారీకి ప్రాధాన్యత ఇవ్వడం ప్రధాన లక్ష్యాలుగా సోలార్ మాడ్యూల్స్, సెల్స్ విషయంలో కేంద్ర నూతన, పునరుత్పదక ఇంధన మంత్రిత్వశాఖ ఇటీవల కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. 2022 ఏప్రిల్ 1వ తేదీ నుంచీ సోలార్ మాడ్యూల్స్ దిగుమతులపై 40 శాతం బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని (బీసీడీ) విధించనున్నట్లు ప్రకటించింది. అలాగే సెల్స్ విషయంలో ఈ సుంకం 20 శాతంగా ఉండనుంది. 2022 మార్చి 31 వరకూ సోలార్ మాడ్యూల్స్ అలాగే సెల్స్‌పై ‘జీరో’ బీసీడీ అమలవుతుంది. విద్యుత్‌కు డిమాండ్ అనూహ్యం దేశంలో విద్యుత్‌కు డిమాండ్ అనూహ్యంగా పెరుగుతోంది. బుధవారం గరిష్ట డిమాండ్ (ఒక్క రోజులో అత్యధిక సరఫరా) 200.57 గిగావాట్ల మార్క్‌ను అధిగమించి జీవితకాల గరిష్టానికి చేరి నట్టు కేంద్ర విద్యుత్ శాఖ గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. వర్షాలు ఆలస్యం కావడం వల్ల దేశం లోని చాలా రాష్ట్రాల్లో వేడి, ఉక్కపోత వాతావరణం నెలకొనడంతోపాటు.. కరోనా వైరస్ నియంత్రణ కోసం విధించిన ఆంక్షలను సడలిస్తుండడంతో విద్యుత్‌కు డిమాండ్ పెరుగుతున్నట్టు నిపుణులు పేర్కొంటున్నారు. గడిచిన మంగళవారం విద్యుత్ డిమాండ్ 197.07 గిగావాట్లుగా నమోదైంది. గత నెలలో (జూన్ 30న) విద్యుత్‌కు రోజువారీ గరిష్ట డిమాండ్ 191.51 గిగావాట్లుగా నమోదు కావడం గమనార్హం. 2020 జూన్‌లో డిమాండ్ 164.98 గిగావాట్లుగా ఉంటే, 2019 జూన్ నెలలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 182.45 గిగావాట్లుగా నమోదు కావడం గమనార్హం. -
బ్యాంకింగ్ మొండి బకాయిలు : ఇక్రా నివేదిక
సాక్షి, ముంబై: బ్యాంకింగ్ మొండి బకాయిల (ఎన్పీఏ) తీవ్రత ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) తగ్గుతుందని దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా బుధవారం పేర్కొంది. 2021 మార్చితో ముగిసిన త్రైమాసికంలో స్థూలంగా మొండిబకాయిలు (జీఎస్‌పీఏ)లు మొత్తం రుణాల్లో 7.6 శాతం ఉంటే, ఈ రేటు 2021–22 మార్చి ముగిసే నాటికి 7.1 శాతానికి దిగివస్తాయని అంచనావేసింది. అధిక రికవరీలు, రుణ పునర్వ్యవస్థీకరణలు, వేగవంతమైన రుణ వృద్ధి ఇందుకు దోహదపడే ప్రధాన అంశాలని తన తాజా నివేదికలో పేర్కొంది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు చూస్తే.. ► స్థూల మొండిబకాయిలు 6.9 శాతం నుంచి 7.1 శాతం శ్రేణిలో ఉంటాయని భావిస్తున్నాం. నికరంగా ఈ శ్రేణి 1.9 శాతం 2 శాతం శ్రేణిలో ఉంటుందని అంచనా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జీఎన్‌పీఏల అంచనాలతో పోల్చితే (9.8 శాతం) తాజా ఇక్రా అంచనాలు తక్కువగా ఉండడం గమనార్హం. ► కేవలం కొత్త పద్దులకు సంబంధించి ఎన్పీఏలు 2019–20లో రూ.3.7 లక్షల కోట్లు. రుణాల్లో ఇది 4.2 శాతం. 2020–21లో ఈ పరిమాణం రూ.2.6 లక్షల కోట్లు. రుణాల్లో 2.7 శాతం. అయితే 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఈ తరహా ఎన్పీఏలు పెరిగే అవకాశం ఉంది. మారటోరియం వంటి రెగ్యులేటరీ వెసులుబాట్లు ఏమీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లేకపోవడం దీనికి కారణం. ► కోవిడ్–19 ప్రేరిత సవాళ్లను ఎదుర్కొంటున్న రుణగ్రహీతల ఆదాయం, ద్రవ్యలభ్యత సంబంధిత ఒత్తిడులు 2021–22 ఆర్థిక సంవత్సరం బ్యాంకింగ్ బ్యాలెన్స్ షీట్లలో ప్రతిబింబించవు. లిక్విడిటీ, నియంత్రణ, సరళీకరణ విధానాలు, అత్యవసర రుణ హామీ పథకం (ఈసీఎల్జీఎస్) వంటి కేంద్రం, ఆర్బీఐ తీసుకుంటున్న పలు చర్యలు దీనికి కారణం. ► రుణాలకు సంబంధించి కేటాయింపులు (క్రెడిట్ ప్రొవిజన్స్) 2019–20లో 3.7 శాతం. 2020–21లో ఈ రేటు 2.5 శాతానికి తగ్గింది. ► బ్యాంకింగ్ రంగంలో ప్రత్యేకించి ప్రభుత్వ రంగానికి సంబంధించి పరిస్థితి మెరుగుపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. వరుసగా ఐదు సంవత్సరాల తర్వాత 2020–21లో బ్యాంకులు లాభాలను చూశాయి. అలాగే నికర ఎన్పీఏలు గడచిన ఆరేళ్లలో అతి తక్కువ స్థాయిలో 3.1 శాతంగా నమోదయ్యాయి. మున్ముందు కూడా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ లాభాలతో కొనసాగే అవకాశాలే ఉన్నాయి. ► ఎన్పీఏల పరిస్థితి మెరుగుపడ్డంతోపాటు మూలధనం పెంపు చర్యలు కూడా సత్ఫలితాలను ఇస్తుండడం హర్షణీయం. బ్యాంకింగ్ రంగం వృద్ధి, పురోగతి, లాభదాయకతకు ఆయా అంశాలు మద్దతును ఇస్తున్నాయి. ► ఈ నేపథ్యంలో కరోనా సెకండ్ వేవ్ సవాళ్లను బ్యాంకింగ్ పటిష్టంగా ఎదుర్కొన్నట్లు ఇక్రా విశ్వసిస్తోంది. దీనితో బ్యాంకింగ్ రంగానికి ఇక్రా ‘స్టేబుల్’ అవుట్‌లుక్‌ను -
ఆటో విడిభాగాల లాభాలు వీక్!
న్యూఢిల్లీ: కోవిడ్–19 సెకండ్ వేవ్ కారణంగా ఆటో విడిభాగాల కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి క్వార్టర్లో ఆర్థిక సవాళ్లను ఎదుర్కోనున్నట్లు రేటింగ్ దిగ్గజం ఇక్రా తాజాగా అంచనా వేసింది. కరోనా కేసుల కట్టడికి ఆంక్షలు, లాక్డౌన్ల నేపథ్యంలో నిర్వహణ లాభాలపై తీవ్ర ప్రభావం పడనున్నట్లు పేర్కొంది. వెరసి క్యూ1(ఏప్రిల్–జూన్)లో ఆటో విడిభాగాల కంపెనీల నిర్వహణ లాభాల్లో 70 శాతం కోత పడేవీలున్నట్లు ఒక నివేదికలో అభిప్రాయపడింది. ఇందుకు మరోవైపు వేగంగా పెరిగిన కమోడిటీల ధరలు కారణంకానున్నట్లు తెలియజేసింది. అయితే వీటిని వాహన తయారీ(ఓఈఎం) సంస్థలకు బదిలీ చేసే వీలున్నప్పటికీ ఇందుకు 3–6 నెలల సమయం పడుతుందని వివరించింది. ఆంక్షల ఎఫెక్ట్ ఈ ఏడాది క్యూ1లో ఆటో విడిభాగాల కంపెనీల మొత్తం ఆదాయాలూ ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోనున్నట్లు ఇక్రా నివేదిక పేర్కొంది. త్రైమాసికవారీగా చూస్తే 30–40 శాతం స్థాయిలో టర్నోవర్ తగ్గవచ్చని అంచనా వేసింది. ఫలితంగా నిర్వహణ లాభం (ఇబిటా) గత ఆర్థిక సంవత్సరం(2020–21) చివరి త్రైమాసికంతో పోలిస్తే 70 శాతం స్థాయిలో క్షీణించవచ్చని అభిప్రాయపడింది. కాగా.. కరోనా ప్రతికూలతల నేపథ్యంలో లాక్డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ గత కొద్ది నెలలుగా ఆటో విడిభాగాల పరిశ్రమను ఎగుమతులు ఆదుకుంటున్నట్లు ఇక్రా నివేదిక పేర్కొంది. దీంతో దేశీ డిమాండుపైనే అధికంగా ఆధారపడే కంపెనీలపై తీవ్ర ప్రభావం పడనున్నట్లు తెలియజేసింది. నిల్వలు పెరుగుతున్నాయ్ స్వల్ప కాలంలో ఆటో విడిభాగాల పరిశ్రమ సవాళ్లను ఎదుర్కోనున్నప్పటికీ పూర్తి ఏడాదిలో పటిష్ట పనితీరు చూపే వీలున్నట్లు పేర్కొంది. ఆదాయంలో సగటున 20–23% పురోగతి నమోదుకాగలదని అంచనా వేసింది. ఆటోమొబైల్ రంగంలో పలు విభాగాలలోనూ రెండంకెల వృద్ధికి వీలుండటంతో ఆదాయాలు పుంజుకోగలవని వివరించింది. ఏప్రిల్‌లో ఉత్పత్తిలో నిలకడ కొనసాగినప్పటికీ గత రెండు నెలల్లో రిటైల్ విక్రయాలు పడిపోయినట్లు తెలియజేసింది. దీంతో ఆటో రంగ పరిశ్రమలో నిల్వలకు అవకాశం ఏర్పడినట్లు ప్రస్తావించింది. పలు ఓఈఎంలు జూన్ నెలలో ఒకే షిఫ్ట్‌కు పరిమితంకావడంతో ఉత్పత్తి పరిమాణం మందగించనున్నట్లు తెలియజేసింది. కమోడిటీ ధరలు సైతం ఒత్తిడిని పెంచనున్నట్లు ఇక్రా వివరించింది. ప్రస్తుత ఏడాది తొలి అర్ధభాగంలో ఈ ప్రభావం అధికంగా కనిపించనుందని, అక్టోబర్–మార్చి నుంచి ధరలు కొంతమేర బలహీనపడవచ్చని విశ్లేషించింది. ఎలక్ట్రానిక్ పరికరాల కొరత, సెమీకండక్టర్ ధరల పెరుగుదల సైతం ఆటో పరిశ్రమకు సమస్యలు సృష్టించనున్నట్లు ఇక్రా అభిప్రాయపడింది. చదవండి: అదిరిపోయిన బీఎండబ్ల్యూ ‘మినీ’ కార్లు..! హ్యుందాయ్ కెట్రాలో కొత్త మోడల్... తగ్గిన ధర -
లాభాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు.. కారణం అదేనా
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకులు 2020–21 ఆర్థిక సంవత్సరం సాధించిన నికర లాభాలకు వాటి బాండ్ పోర్ట్‌ఫోలియోల నుంచి భారీగా వచ్చిన ఆదాయాలు దన్నుగా నిలిచినట్లు రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా ఒక నివేదికలో తెలిపింది. ఐదు సంవత్సరాల వరుస నష్టాల అనంతరం 2020–21లో బ్యాంకులు నికర లాభాలు నమోదుచేశాయి. దీనికి వాటి బాండ్ పోర్ట్‌ఫోలియోల నుంచి గణనీయంగా లభించిన ఆదాయాలే కారణమని ఇక్రా విశ్లేషించింది. గత కొన్ని సంవత్సరాలుగా తమ మొండి బకాయిల (ఎన్పీఏ)కు అధిక కేటాయింపులు (ప్రొవిజన్స్) జరుపుతూ వచ్చిన బ్యాంకింగ్, 2020–21లో మాత్రం కొంత తక్కువ ప్రొవిజన్స్ జరిపిందని ఇక్రా పేర్కొంది. బ్యాంకింగ్ నికర లాభాలకు ఇదీ ఒక కారణమేనని నివేదిక తెలిపింది.చదవండి: అమ్మో.. 2025 నాటికి ఇంతమంది కుబేరులవుతారా?! ఆయా అంశాలకు సంబంధించి రేటింగ్ సంస్థ తాజా నివేదికలో ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. 2020 మార్చి–2020 మే మధ్య బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 115 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గించింది. అలాగే బ్యాంకులు తమ వద్ద ఉంచిన అదనపు నిధులకు ఇచ్చే వడ్డీరేటు– రివర్స్ రెపోను 155 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీనితో ఈ రేట్లు వరుసగా 4, 3.35 శాతాలకు దిగివచ్చాయి. ఈ పరిస్థితుల్లో బ్యాంకుల బాండ్ పోర్ట్‌ఫోలియోలు భారీగా పెరిగాయి. సంబంధిత ట్రేడింగ్ లావాదేవీల నుంచి బ్యాంకింగ్ భారీ ప్రయోజనాలు పొందింది. 2020–21లో ప్రభుత్వ రంగ బ్యాంకుల నికర లాభాలు రూ.32,848 కోట్లయితే, 2019–20లో నికర నష్టాలు రూ.38,907 కోట్లని ఇక్రా వైస్ ప్రెసిడెండ్ (ఫైనాన్షియల్ సెక్టార్ రేటింగ్స్) అనిల్ గుప్తా పేర్కొన్నారు. ఏజెన్సీ అంచనాల ప్రకారం 2020–21లో ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల లాభాలు (పీబీటీ– ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్) రూ.45,900 కోట్లు. ఇందులో బ్యాంకులు బాండ్ పోర్ట్‌ఫోలియోలో ఆదాయాల కారణంగా బుక్ చేసిన లా భాలే రూ.31,600 కోట్లు ఉండడం గమనార్హం. 2020–21 వార్షిక డిపాజిట్ల వృద్ధి రేటు 11.4 శాతం. అయితే రుణ వృద్ధి 5.5 శాతం మాత్రమే. ఈ పరిస్థితుల్లో బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) సైతం రూ 5 నుంచి 7 లక్షల కోట్ల వరకూ ఉంది. బ్యాంకింగ్‌లో పదేళ్ల బెంచ్‌మార్క్ ప్రభుత్వ సెక్యూరిటీల (బాండ్లు) రోజూవారీ సగటు 2019–20లో 6.42 శాతం. 2020–21 మొదటి త్రైమాసికంలో ఇది ఆరు శాతానికి తగ్గింది. రెండవ త్రైమాసికంలో 5.93 శాతానికి, మూడవ త్రైమాసికంలో 5.90 శాతానికి దిగివచ్చింది. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ (ఓఎంఓ) ద్వారా బాండ్ల కొనుగోలుతో వ్యవస్థలోకి ఆర్బీఐ భారీ నిధులు పంప్ చేయడం, రెపో రేటు కోతల నేపథ్యం ఇది. 2020–21 చివరి త్రైమాసికంలో మాత్రం పదేళ్ల బెంచ్‌మార్క్ ప్రభుత్వ సెక్యూరిటీల (బాండ్లు) రోజూవారీ సగటు 6.06 శాతానికి చేరింది. ఆయా పరిస్థితుల నేపథ్యంలో చోటుచేసుకున్న బాండ్ ఈల్డ్స్‌లో తీవ్ర ఒడిదుడుకులు కూడా బ్యాంకింగ్‌కు చక్కటి ట్రేడింగ్ అవకాశాలను కల్పించాయి. బాండ్ హోల్డింగ్స్‌పై భారీ ఆదాయాలను బ్యాంకింగ్ బుక్ చేయడం వల్ల బ్యాంకులు వాటి తాజా పెట్టుబడులు మార్కెట్ రేట్లకు దగ్గరగా ఉంటాయి. తద్వారా వాటి బాండ్ పోర్ట్‌ఫోలియోలపై ఈల్డ్స్‌ను తక్కువగా ఉన్న మార్కెట్ రేట్లకు అనుసంధానించగలుగుతుంది. ప్రభుత్వ బ్యాంకుల ఇన్వెస్ట్మెంట్ బుక్‌పై ఈల్డ్ 2019–20 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో (జనవరి–మార్చి) 6.79 శాతం ఉంటే, 2020–21 ఇదే కాలంలో 6.18 శాతానికి తగ్గిందని ఇక్రా వైస్ ప్రెసిడెండ్ (ఫైనాన్షియల్ సెక్టార్ రేటింగ్స్) అనిల్ గుప్తా పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)ని మినహాయిస్తే, ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకుల 2020–21 స్థూల లాభాలు ‘బాండ్ పోర్ట్‌ఫోలియో ట్రేడింగ్‌లో బుక్ చేసిన ఆదాయాల కన్నా’ తక్కువగా ఉండడం గమనార్హం. ఎస్బీఐని మినహాయిస్తే 11 ప్రభుత్వ రంగ బ్యాంకులు బాండ్ పోర్ట్‌ఫోలియో ట్రేడింగ్ లాభాలు రూ.25,500 కోట్లు. స్థూల లాభాలు రూ.18,400 కోట్లు. ప్రభుత్వ రంగ బ్యాంకుల తరహాలోనే ప్రైవేటు బ్యాంకులు కూడా తమ బాండ్ ట్రేడింగ్ లాభాలను 2020–21లో భారీగా రూ.14,700 కోట్ల నుంచి (2019–20) రూ.18,400 కోట్లకు మెరుగుపరచుకున్నాయి. వాటి మొత్తం స్థూల లాభాల్లో ఈ వాటా 21 శాతం. -
విమానాశ్రయ రంగానికి రూ.5,400 కోట్ల నష్టాలు
ముంబై: ఈ ఆర్ధిక సంవత్సరంలో దేశీయ విమానాశ్రయ రంగానికి రూ.5,400 కోట్ల మేర నికర నష్టాలు వాటిల్లుతాయని, అలాగే రూ.3,500 కోట్ల వరకు నగదు నష్టాలు తప్పవని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. కోవిడ్–19 వ్యాప్తి కారణంగా ప్రయాణ ఆంక్షల నేపథ్యంలో రద్దీ తగ్గడమే ఇందుకు ప్రధాన కారణమని, ఏడాది కాలంతో పోలిస్తే 66 శాతం మేర ప్యాసింజర్ ట్రాఫిక్ క్షీణించిందని పేర్కొంది. 2020–21 ఆర్ధిక సంవత్సరంలో దేశీయ ప్రయాణికుల రద్దీ 61 శాతం, అంతర్జాతీయ ప్యాసింజర్ ట్రాఫిక్ 85 శాతం మేర తగ్గవచ్చని తెలిపింది. 2021 ఆర్ధిక సంవత్సరంలో ఈ రంగం నిర్వహణ ఆదాయం 61 శాతం తగ్గి రూ.8,400 కోట్లకు, అదే సమయంలో నిర్వహణ నష్టం రూ.1,700 కోట్లు (–20 శాతం మార్జిన్), నికర నష్టం రూ.5,400 కోట్లకు చేరుకుంటాయని ఇక్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, గ్రూప్ హెడ్ శుభం జైన్ అన్నారు. అలాగే ఈ రంగానికి మొత్తం నగదు నష్టాలు రూ.3,500 కోట్లుగా ఉంటాయని పేర్కొన్నారు. విమానాశ్రయ నిర్వాహకుల ద్రవ్యత 2020 మార్చి 31 నాటికి రూ.8,100 కోట్ల నగదు బ్యాలెన్స్‌తో బలంగా ఉంది. ఇవి మూలధనం కోసం, కార్యాచరణ వ్యయాలు, రుణ బాధ్యతలు, ఈక్విటీ అవసరాలను తీర్చడంలో సహకరించాయని చెప్పారు. అయితే మార్చితో ముగియనున్న ఈ ఆర్ధిక సంవత్సరంలో నిర్వాహకుల వద్ద ఉన్న ద్రవ్యత రూ.5,700 కోట్లకు క్షీణించే సూచనలున్నాయని తెలిపారు. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో ట్రాఫిక్‌లో ఏడాదికి 130 శాతంతో భారీ రికవరీని సాధిస్తుందని, సామూహిక కోవిడ్ టీకాలు, వ్యాపార ప్రయాణాలు పునఃప్రారంభం కావటం, లీజర్ ట్రావెల్స్ వృద్ధి చెందటం, రియల్ ఎస్టేట్ ల్యాండ్ పార్సల్స్ వంటి నాన్–ఏరో విభాగాల ద్వారా సంపాదన వంటివి ఈ రంగాల ప్రధాన వృద్ధి చోదకాలుగా నిలుస్తాయని తెలిపారు. దేశీయ ట్రాఫిక్‌తో పోలిస్తే అంతర్జాతీయ ప్రయాణీకులతో ఎక్కువ ఆదాయం చేకూరుతుందని.. అయితే కరోనా మహమ్మారి కారణంగా అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఆంక్షలున్నాయని ఇదే 2021 ఫైనాన్షియల్ ఇయర్లో పరిశ్రమకు ప్రతికూలంగా మారుతుందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రధాన దేశాల్లో కోవిడ్–19 టీకా ప్రారంభమైనప్పటికీ.. దేశవ్యాప్తంగా ఇటీవల కోవిడ్–19 కేసులు పెరుగుతుండటంతో అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై పరిమితులు విధించారు. ఇది ట్రాఫిక్ వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలిపారు. 2022 ఆర్ధిక సంవత్సరంలో ప్రయాణీకుల రద్దీ ప్రీ–కోవిడ్ స్థాయిలో దాదాపు 80 శాతానికి చేరుకునే సూచనలున్నాయని రేటింగ్ ఏజెన్సీ అంచనా వేసింది. వినియోగదారులు సుంకం, నిర్వహణ ఖర్చు రికవరీని అనుమతిస్తుంది కాబట్టి రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్స్ నుంచి మెరుగైన రేటింగ్‌లు పొందేందుకు విమానాశ్రయ ఆపరేటర్లు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. -
2021–22లో సిమెంటుకు డిమాండ్
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరంలో సిమెంట్ అమ్మకాలు తిరిగి పుంజుకోనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2021–22లో పరిశ్రమలో 18–20 శాతం డిమాండ్ వృద్ధికి ఆస్కారం ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. 2018–19, 2019–20 స్థాయికి పరిశ్రమ చేరుతుందని తెలిపింది. ఇక్రా ప్రకారం.. గ్రామీణ ప్రాంతాల నుంచి డిమాండ్‌కుతోడు అందుబాటు గృహాలు, మౌలిక రంగం తిరిగి గాడిన పడనుండడం ఈ పెరుగుదలకు కారణం. ఖర్చుల వైపు ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఆపరేటింగ్ మార్జిన్స్ 20–21 శాతం స్థాయిలో ఉండొచ్చు. 20–22 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యం కొత్తగా తోడు కానుంది. 2020–21లో ఇది 15–17 మిలియన్ టన్నులు. తూర్పు ప్రాంతం నుంచే 15–17 మిలియన్ టన్నులు జతకూడే అవకాశం ఉంది. ప్లాంట్ల వినియోగం గతేడాది ఉన్న 56 శాతం నుంచి 2021–22లో 64 శాతానికి చేరనుంది. పెట్ కోక్ ధరలు కొన్ని నెలల క్రితం పెరిగాయి. డీజిల్ ధరలూ అధికమవుతున్నాయి. సకాలంలో రబీ నాట్లు పడడం, నీటి నిల్వలు పుష్కలంగా ఉండడంతో ఉత్పదకత మెరుగై.. సెంటిమెంటు సానుకూలం కావడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి సిమెంటుకు డిమాండ్ ఉంటుందని ఇక్రా ఏవీపీ అనుపమ రెడ్డి తెలిపారు. రియల్టీ, పీఎంఏవై–అర్బన్, ఇన్ఫ్రా రంగాలను లక్ష్యంగా చేసుకుని ఇటీవల ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ 3.0 ప్యాకేజ్ సిమెంట్ డిమాండ్‌ను నడిపిస్తుందని వివరించారు. చదవండి: హైదరాబాద్‌లో 39 వేల గృహాల ఇన్వెంటరీ -
కేంద్రానికి అదనంగా రూ.5 లక్షల కోట్లు కావాలి
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా ఆర్థిక ప్రతికూలతలను అధిగమించేందుకు ప్రజలు, వ్యాపార సంస్థలకు సాయం అందించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం జీడీపీలో 2–2.5 శాతం లేదా రూ.4–5 లక్షల కోట్ల మేర అదనంగా రుణాలు సమీకరించుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుభాష్‌చంద్ర గార్గ్ పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని మార్కెట్ నుంచి కాకుండా ఆర్బీఐ నుంచి నేరుగా రుణాల రూపంలో తీసుకోవాలని, ఇందుకోసం ద్రవ్య బాధ్యత, బడ్జెట్ నిర్వహణ చట్టం (ఎఫ్ఆర్బీఎం)ను సవరించాలని గార్గ్ సూచించారు. స్వయం ఉపాధి ఆధారిత వ్యాపారాలు, చిన్న వ్యాపారస్థులకు రూ.2 లక్షల కోట్ల మేర సాయం అందించాలని అభిప్రాయపడ్డారు. వృద్ధి 2 శాతమే: ఇక్రా కరోనా ప్రభావంలో 2020–21లో భారత్ స్థూల దేశీయోత్పత్తి వృద్ధిరేటు 2 శాతమే ఉంటుందని ఇక్రా రేటింగ్స్ అంచనావేసింది. ‘‘2019–20 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో (జనవరి–మార్చి) భారత్ జీడీపీలో వృద్ధిలేకపోగా 4.5 శాతం క్షీణత నమోదయ్యే వీలుంది. అయితే క్రమంగా కోలుకుని 2020–21లో 2 శాతం వృద్ధిని నమోదుచేసుకోవచ్చు’’ అని పేర్కొంది. -
ఐదు లక్షల మంది నిపుణులు అవసరం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిపుణులైన మానవ వనరుల అవసరం ఎక్కువగానే ఉన్నట్లు ఓ సర్వేలో తేలింది. ముఖ్యంగా రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో కలిపి ఏడాదికి లక్ష చొప్పున మానవ వనరుల అవసరాలు ఉన్నట్లు సర్వే స్పష్టం చేసింది. ఈ మేరకు యువతను ఆ అవసరాలకు అనుగుణంగా తీర్చేదిద్దే చర్యలు ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగా రాష్రంలోని ఆయా జిల్లాల్లో స్థానిక పరిశ్రమలు, వాటి అవసరాలను గుర్తించి ఆ మేరకు స్థానిక యువతకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే ఇక్రా (ఐసీఆర్ఎ) ద్వారా ఏడు జిల్లాల్లో వచ్చే ఐదేళ్లకు ఏ రంగాల్లో నైపుణ్యత గల మానవ వనరులు ఎంత మేర అవసరం ఉందనే విషయాన్ని అధ్యయనం చేశారు. రాష్ట్రంలో మిగతా జిల్లాల్లో కూడా స్థానిక పరిశ్రమలకు ఏ రంగాల్లో నైపుణ్యత గల మానవ వనరులు అవసరమో కూడా అధ్యయనం చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే పరిశ్రమలకు, కంపెనీలకు నైపుణ్యం గల మానవ వనరులు లభ్యత, వ్యత్యాసంపై ఇక్రా ద్వారా ప్రభుత్వం అధ్యయనం చేయించింది. శ్రీకాకుళం, విశాఖ, తూర్పుగోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో నైపుణ్యం గల మానవ వనరులు ఏడాదికి లక్ష చొప్పున అవసరమని అధ్యయనంలో వెల్లడైంది. ఏ జిల్లాలో ఏఏ రంగాల్లో నైపుణ్యం గల మానవ వనరులు అవసరమో కూడా అధ్యయనంలో గుర్తించారు. అందుకు అనుగుణంగా ఆయా జిల్లాల్లో పెద్ద ఎత్తున స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను రూపొందించి ముందుకు సాగుతోంది. తిరుపతిలో స్కిల్ డెవలప్మెంట్ యూనిర్సిటీని, విశాఖలో హై ఎండ్ స్కిల్ యూనివర్సిటీతో పాటు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒకటి చొప్పున 25 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వివిధ సాంకేతిక కోర్సులను నేర్చుకున్నవారికి మరింత నైపుణ్యాన్ని వీటిద్వారా కల్పిస్తారు. స్కిల్ యూనివర్సిటీలో నిర్మాణ రంగం, పరిశ్రమల ఎలక్ట్రికల్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్, పరిశ్రమల ప్లంబింగ్, ఆటోమోటివ్, మెటల్ కన్స్ట్రక్షన్, ఐటీ–నెట్వర్క్ తదితర రంగాల్లో నైపుణ్య శిక్షణ కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. -
ఇంధనాల రిటైలింగ్‌లో పోటీకి ఊతం
న్యూఢిల్లీ: పెట్రోల్ బంకుల ఏర్పాటు లైసెన్సుకు సంబంధించిన నిబంధనలను సడలించాలన్న నిపుణుల కమిటీ సిఫార్సులు అమలు చేస్తే ఇంధనాల రిటైలింగ్ రంగంలో పోటీకి తోడ్పాటు లభిస్తుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ఒక నివేదికలో పేర్కొంది. దీనివల్ల ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థల (ఓఎంసీ) గుత్తాధిపత్యానికి గండిపడుతుందని, అవి కూడా పోటీపడాల్సిన పరిస్థితి ఏర్పడగలదని తెలిపింది. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ మొదలైన ఇంధనాల రిటైల్ బంకులు ఏర్పాటు చేయాలనుకునే సంస్థలు హైడ్రోకార్బన్ ఉత్పత్తి, రిఫైనింగ్, పైప్‌లైన్స్, ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) టెర్మినల్స్‌పై రూ. 2,000 కోట్లు ఇన్వెస్ట్ చేయాల్సిందేనని నిబంధనలు ఉన్నాయి. అయితే, చమురు, గ్యాస్ రంగంలో అంత భారీగా ఇన్వెస్ట్ చేసే కంపెనీలకు ఇలాంటి రవాణా ఇంధనాల విక్రయ లైసెన్సులు పెద్ద ప్రోత్సాహకాలుగా అనిపించవని కేంద్ర ప్రభుత్వం అయిదుగురు సభ్యులతో నియమించిన నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. కాబట్టి రూ. 2,000 కోట్ల పెట్టుబడుల నిబంధనను ఎత్తివేస్తే వైవిధ్యంగా ఇంధన విక్రయ సేవలు అందించగలిగే సంస్థలకు అవకాశం లభించగలదని ఒక నివేదికలో సూచించింది. చాలా సున్నితమైన, నిత్యావసర ఉత్పత్తులైన ఇంధనాలను సురక్షితంగా విక్రయించేందుకు అనేక జాగ్రత్తలు అవసరమవుతాయి కాబట్టి దీని రిటైలింగ్ లైసెన్సులకు ప్రభుత్వ అనుమతులు తప్పనిసరిగా ఉండాల్సిందేనని పేర్కొంది. దరఖాస్తుదారు సామర్ధ్యం, పూర్వ చరిత్ర ప్రాతిపదికగా లైసెన్సుల జారీ ఉండాలని సూచించింది. సిఫార్సుల ప్రకారం కొత్త సంస్థలు.. ఏడేళ్ల కాలంలో కనీసం 100 రిటైల్ అవుట్‌లెట్స్ ఏర్పాటు చేయాలి. వీటిలో 5 శాతం బంకులు నిర్దేశిత మారుమూల ప్రాంతాల్లో ఉండాలి. ఇప్పటిదాకా 9 ప్రైవేట్ సంస్థలకే లైసెన్సులు.. 2002లో ఇంధనాల రిటైలింగ్ రంగంలోకి ప్రైవేట్ సంస్థలను కూడా అనుమతించిన తర్వాత నుంచి ఇప్పటిదాకా కేవలం తొమ్మిది సంస్థలకు మాత్రమే అనుమతులు లభించినట్లు ఇక్రా పేర్కొంది. పీఎస్యూయేతర ఓఎంసీల మార్కెట్ వాటా 2013 మార్చి ఆఖరు నాటికి 6 శాతంగా ఉండగా.. 2019 మార్చి 31 నాటికి 10 శాతానికి చేరింది. ప్రైవేట్ రంగంలో ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్, నయారా ఎనర్జీ (గతంలో ఎస్సార్ ఆయిల్), రాయల్ డచ్ షెల్ సంస్థలు మాత్రమే కార్యకలాపాలు సాగిస్తున్నాయి. రిలయన్స్‌కి సుమారు 1,400 అవుట్‌లెట్స్ ఉన్నాయి. నయారాకు 5,128 బంకులు, షెల్‌కు 145 బంకులు ఉన్నాయి. బ్రిటన్‌కు చెందిన బీపీ కొన్నాళ్ల క్రితమే 3,500 అవుట్‌లెట్స్ ఏర్పాటుకు లైసెన్సు దక్కించుకున్నా, ఇంకా కార్యకలాపాలు ప్రారంభించలేదు. అదానీ గ్రూప్‌తో కలిసి 1,500 పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయనున్నట్లు గతేడాది ఫ్రాన్స్ దిగ్గజం టోటల్ వెల్లడించింది. -
మూడో ఏడాదీ టెల్కోల ఆదాయానికి గండి: ఇక్రా
ముంబై: రిలయన్స్ జియో ప్రవేశంతో టెలికం రంగంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు కొనసాగుతాయని, వరుసగా మూడో ఏడాది టెలికం కంపెనీల ఆదాయం తగ్గనుందని ఇక్రా రేటింగ్స్ తెలిపింది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో స్వల్ప రికవరీకి అవకాశాలున్నాయని అంచనా వేసింది. ‘‘జియో సేవల ఆరంభం తర్వాత మొదలైన తీవ్ర పోటీ, ధరల ఒత్తిళ్లు కంపెనీల ఆర్థిక పనితీరును తీవ్రంగా కుంగదీసింది. దీంతో వాటి ఆదాయాలు, లాభాలు క్షీణించాయి’’ అని ఇక్రా పేర్కొంది. 2017–18లో టెలికం కంపెనీల ఆదాయం 11 శాతం క్షీణించి రూ.2.1 లక్షల కోట్లుగా ఉండగా, 2018–19లో 7% తగ్గుతాయని ఇక్రా అంచనా వేసింది. 2019–20లో మాత్రం 6% వృద్ధి ఉంటుందని పేర్కొంది. నిర్వహణ లాభం గత ఆర్థిక సంవత్సరంలో 21% క్షీణించగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 18% తగ్గుదలకే పరిమితం కావచ్చని తెలిపింది. పరిస్థితులు కొంత మెరుగుపడినప్పటికీ ఇది తక్కువ స్థాయిలోనే ఉండొచ్చంది. 2019–20లో టెల్కోలు రూ.90,000 కోట్ల నుంచి లక్ష కోట్ల వరకు రుణాలను తగ్గించుకోవచ్చని అంచనా వేసింది. మొత్తం మీద టెలికం రుణ భారం రూ.4.75 లక్షల కోట్ల నుంచి, వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.4.3 లక్షల కోట్లకు తగ్గొచ్చని పేర్కొంది. -
ఆర్థిక ఫలితాలు... అంతంతే!
ముంబై: భారత్‌లోని కంపెనీల ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంతంతమాత్రంగానే ఉన్నాయని దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా పేర్కొంది. మార్జిన్లు, ఆదాయ వృద్ధి విషయంలో ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికమే మేలని ఇక్రా తాజా నివేదిక వివరించింది. అయితే ఆదాయ వృద్ధి విషయంలో గత క్యూ3 విషయంలో ఈ క్యూ3 బావుందని పేర్కొంది. కంపెనీల క్యూ3 ఫలితాలపై ఈ నివేదిక ఇంకా ఏం చెప్పిందంటే.., ►ఈ క్యూ2లో 648 లిస్టెడ్ కంపెనీల ఆదాయ వృద్ధి 19.4 శాతంగా ఉంది. ఇది ఈ క్యూ3లో 17.3 శాతానికి తగ్గింది. గత క్యూ3లో ఇది 9.8 శాతంగానే ఉంది. ►ఈ క్యూ2లో నిర్వహణ మార్జిన్లు 16.6 శాతంగా ఉండగా, ఈ క్యూ3లో 16.4 శాతానికి తగ్గింది. గత క్యూ3లో 17.1 శాతంగా ఉంది. ►రూపాయి పతనం ప్రతికూల ప్రభావం, ఇంధన, ముడి పదార్ధాల ధరలు పెరగడం వల్ల మార్జిన్లు తగ్గాయి. ►ఇంధన ధరలు పెరగడం వల్ల విమానయాన, సిమెంట్, బిల్డింగ్ మెటీరియల్స్ కంపెనీల మార్జిన్లు తగ్గాయి. ►ముడి పదార్ధాల ధరలు పెరగడం వల్ల వాహన, కన్సూమర్ డ్యూరబుల్స్, పెయింట్స్, మీడియా కంపెనీల మార్జిన్లు పడిపోయాయి. ►వినియోగ కంపెనీల మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. వాహన విక్రయాలు తగ్గగా, కన్సూమర్ డ్యూరబుల్స్, ఫాస్ట్ మూవింగ్ కన్సూమర్ గూడ్స్ కంపెనీల అమ్మకాలు ఆరోగ్యకరంగా ఉన్నాయి. ►గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ నిలకడగా కొనసాగనున్నది. పట్టణ వృద్ధి కంటే కూడా గ్రామీణ వృద్ధిదే పైచేయి కానున్నది. ►కనీస మద్దతు ధర పెంపు, ఎన్నికల నేపథ్యంలో తాయిలాల కారణంగా గ్రామీణ వృద్ధి జోరు కొనసాగగలదు. ► ఐటీ రంగానికి కీలకమైన బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సేవల విభాగం జోరు, డిజిటల్ రంగంలో వృద్ధి కారణంగా ఐటీ కంపెనీల ఆదాయం 8.3 శాతం (డాలర్లపరంగా) పెరిగింది. అయితే రూపాయి పతనమైనప్పటికీ ఐటీ కంపెనీల మార్జిన్లు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఐటీ కంపెనీలు డిజిటల్ విభాగంపై అధికంగా పెట్టుబడులు పెడుతుండటమే దీనికి కారణం. ►నిర్మాణ కార్యకలాపాలు ఊపందుకోవడం, కొత్త ఆర్డర్ల జోరు కారణంగా స్టీల్, సిమెంట్ వినియోగం పెరిగింది. స్టీల్ కంపెనీలు 8 శాతం, సిమెంట్ కంపెనీలు 13 శాతం చొప్పున ఆదాయాల్లో వృద్ధిని నమోదు చేశాయి. -
టెల్కోలకు రూపాయి దెబ్బ
ముంబై: తీవ్ర పోటీతో సతమతమవుతున్న టెలికం రంగానికి తాజాగా రూపాయి పతనం, డీజిల్ రేట్లు తలనొప్పిగా మారాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూపాయి పతనం కారణంగా టెల్కోలపై రూ.4,000 కోట్ల మేర ప్రతికూల ప్రభావం పడనుంది. ఇక పెరిగే డీజిల్ రేట్ల మూలంగా నిర్వహణ వ్యయాలూ పెరిగి కంపెనీల లాభదాయకత మరో రూ.2,000 కోట్లు మేర తగ్గిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే రూ. 5 లక్షల కోట్ల పైగా రుణభారంతో అల్లాడుతున్న టెల్కోలకు ఇది మరింత భారంగా మారనుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి పతనం మూలంగా టెల్కోల ఎబిటా (పన్నుకు ముందు ఆదాయం) 7–8 శాతం మేర తగ్గవచ్చని రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా వైస్ ప్రెసిడెంట్ హర్‡్ష జగ్నాని తెలిపారు. ఇక డీజిల్ అంశం కూడా తోడైతే ఇది మొత్తం పది శాతం దాకా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రూపాయి క్షీణత మూలంగా విదేశీ మారకంలో తీసుకున్న రుణాల రీపేమెంట్ మరింత పెరుగుతుందని, ఇక నెట్వర్క్ విస్తరణ, టెక్నాలజీ అప్‌గ్రేడేషన్ వ్యయాలు కూడా పెరుగుతాయని ఆయన తెలియజేశారు. 2018 మార్చి 31 నాటికి పరిశ్రమ మొత్తం రుణ భారం రూ. 4.7 లక్షల కోట్లుగా ఉండగా... ఇందులో విదేశీ రుణం సుమారు రూ.1 లక్ష కోట్ల దాకా ఉంది. దీనిలో మళ్లీ 70 శాతం రుణాలు డాలర్ మారకంలోనే ఉన్నాయి. ఇదే టెల్కోలను కలవరపెడుతోంది. టవర్ కంపెనీలకు కూడా సెగ.. దేశీయంగా 4.7 లక్షల టెలికం టవర్లుండగా... వీటిలో సుమారు పావు శాతం టవర్లు మాత్రమే నామమాత్రపు డీజిల్ వాడకంతో నడుస్తున్నాయి. మిగతావన్నీ ప్రధానంగా డీజిల్‌పై ఆధారపడినవే. ప్రస్తుతం రేట్ల పెరుగుదల వల్ల టెలికం టవర్ సైట్ల ఇంధనాల వ్యయాలు పెరగనున్నాయి. సాధారణంగా టవర్ సైట్ల నిర్వహణకు సంబంధించి డీజిల్ వ్యయాలు పరిశ్రమకు సుమారు రూ.13,000 కోట్ల మేర ఉంటోంది. డీజిల్ రేట్లు సుమారు 15 శాతం పెరిగిన పక్షంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ ఎబిటాపై 3–4% ప్రభావం పడి... కంపెనీల ఎబిటా దాదాపు రూ. 2,000 కోట్ల మేర తగ్గనుంది. ఒకవైపు.. రిలయన్స్ జియో ప్రారంభించిన రేట్ల యుద్ధంతో భారతి ఎయిర్టెల్, ఐడియా సెల్యులార్, వొడాఫోన్ ఇండియాలు ఇప్పటికే నష్టాలు నమోదు చేస్తున్నాయి. ఇక దీనికి రూపాయి, డీజిల్ కూడా తోడైతే ప్రభావం మరింత తీవ్రంగా ఉండనుంది. డీజిల్ రేట్ల పెరుగుదల సెగ కేవలం టెలికం ఆపరేటర్లకే కాకుండా కొన్ని టవర్ కంపెనీలకు కూడా తగలనుంది. టవర్ సైటు ఇంధన వ్యయాలను కొన్ని సందర్భాల్లో టవర్ కంపెనీలు, టెల్కోలు కలిసి భరిస్తుండటమే ఇందుకు కారణం. సాధారణంగా టవర్ కంపెనీల నిర్వహణ వ్యయాల్లో విద్యుత్, ఇంధన వ్యయాల వాటా 30–40% ఉంటుంది. తమ ఒప్పందాలను బట్టి డీజిల్ రేట్ల పెరుగుదలలో కొంత భాగాన్నే టవర్ కంపెనీలు.. టెల్కోలకు బదలాయించగలుగుతాయి. అయితే, సౌర విద్యుత్, ఫ్యూయల్ సెల్స్ వంటి పునరుత్పాదక విద్యుత్ వనరులను వినియోగిస్తూ.. డీజిల్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకుంటున్నందున రేట్ల భారం మరీ భారీ స్థాయిలో ఉండకపోవచ్చని టవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్ అసోసియేషన్ వర్గాలు చెబుతున్నాయి. 2011–12 లో ఒక్కో టవర్ నిర్వహణకు ఒక్కో సంస్థ రోజుకు 7.34 లీటర్ల డీజిల్ ఖర్చు పెట్టేదని, ఇది 2015–16 నాటికి 4 లీటర్లకు తగ్గిపోయిందని వివరించాయి. రూపాయికి మరింత చిల్లు డాలర్‌తో 74.39కు పతనం చమురు ధరల తాజా పెరుగుదల ప్రభావం ముంబై: రూపాయి మరింత బలహీనపడింది. మంగళవారం ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో మరో 33 పైసలు కోల్పోయి నూతన జీవిత కాల కనిష్ట స్థాయి 74.39వద్ద ముగిసింది. అధిక చమురు ధరలు, విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్లడం రూపాయి బలహీనతకు కారణమయ్యాయి. ఉదయం ట్రేడింగ్‌లో బ్యాంకులు, ఎగుమతిదారులు చేసిన డాలర్ల అమ్మకాలతో రూపాయి 18పైసలు కోలుకుని 73.88 వరకు వెళ్లింది. అయితే, బ్రెంట్ క్రూడ్ మరోసారి 84 డాలర్ల మార్కుపైకి వెళ్లడం, అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలపడడంతో రూపాయి యూటర్న్ తీసుకుని నష్టాలవైపు ప్రయాణించింది. సోమవారం కూడా 30 పైసల నష్టంతో రూపాయి 74.06 వద్ద ముగిసిన విషయం తెలిసిందే. విదేశీ నిధులు భారీగా బయటకు వెళ్లిపోవడం రూపాయిపై ప్రభావం చూపించినట్టు ఫారెక్స్ ట్రేడర్ల అభిప్రాయం. దిగుమతిదారుల నుంచి డాలర్లకు బలమైన డిమాండ్, ద్రవ్యలోటు పెరుగుతుందన్న ఆందోళన, పెరిగే చమురు ధరలు కూడా ప్రభావం చూపించినట్టు చెప్పారు. ‘‘బ్యాలన్స్ ఆఫ్ పేమెంట్స్ ప్రతికూలంగా మారడంతో రూపాయి గడిచిన రెండు నెలల్లో వేగంగా బలహీనపడింది. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకు ఆసియాలో ఇతర కరెన్సీలతో పోలిస్తే రూపాయి డాలర్‌తో ఎక్కువగా నష్టపోయింది’’ అని నోమురా తన పరిశోధన నివేదికలో పేర్కొంది. ఆర్బీఐ నుంచి విధానపరమైన చర్యల్లేకపోవడం రూపాయిపై ఆందోళనలను పెంచినట్టు తెలిపింది. చమురు ధరల క్షీణత ఒక్కటే రూపాయి ఈ సమయంలో స్థిరపడేందుకు సాయపడుతుందని పేర్కొంది. ‘‘అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగిపోతున్నాయి. పదేళ్ల బాండ్ ఈల్డ్స్ 3.26 శాతానికి పెరిగింది. అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసేసుకుని అమెరికా ట్రెజరీల్లో ఇన్వెస్ట్ చేస్తారన్న భయాలు ఉన్నాయి. చమురు ధరలు కూడా ఒక శాతం పెరిగి 84.7 డాలర్లకు చేరాయి’’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ క్యాపిటల్ మార్కెట్స్ హెడ్ వీకే శర్మ తెలిపారు. -
తగ్గనున్న మొండి బకాయిల భారం
ముంబై: భారత్ బ్యాంకుల స్థూల మొండిబకాయిల (ఎన్పీఏ) భారం తగ్గనుందని క్రెడిట్ రేటింగ్ సంస్థ– ఇక్రా విశ్లేషించింది. 2019 మార్చి నాటికి మొత్తం రుణాల్లో 10 శాతంగా ఉంటుందని అంచనావేస్తోంది. 2018 జూన్ 30 నాటికి భారత్ బ్యాంకింగ్ మొండిబకాయిల భారం 11.52 శాతం. ఇక నికర ఎన్పీఏల భారం ఈ ఏడాది జూన్ ముగింపు నాటికి 5.92 శాతం ఉంటే 2019 మార్చి నాటికి ఈ రేటు 4.3 శాతానికి తగ్గుతుందని విశ్లేషించింది. బ్యాంకింగ్ మొండిబకాయిల్లో దాదాపు 60 శాతం పరిష్కార క్రమంలో ఉన్నాయని, తన సానుకూల అంచనాలకు ఇదే కారణమని తాజా నివేదికలో పేర్కొంది. అయితే ఒకవేళ మొండిబకాయిల పరిష్కార క్రమం విఫలమయితే మాత్రం 2019 మార్చి నాటికి స్థూల మొండి బకాయిలు 12.2 శాతంగా, నికర మొండిబకాయిలు 5.6 శాతంగా ఉంటాయన్నది తమ అంచనా అని ఇక్రా పేర్కొంది. -
ఆగస్టులో ‘మౌలికం’ ఆశలు...
న్యూఢిల్లీ: ఎనిమిది పారిశ్రామిక రంగాల కీలక గ్రూప్– ఆగస్టులో ఆశావహ పనితీరును ప్రదర్శించింది. 4.9 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఐదు నెలల్లో ఇంత స్థాయి వృద్ధి రేటు ఇదే తొలిసారి. గత ఏడాది ఆగస్టు నెలలో వృద్ధి రేటు 3.1 శాతం. జూలై (2017) లో 2.6 శాతం. వార్షిక ప్రాతిపదికన ఎనిమిది రంగాలనూ వేర్వేరుగా.. ♦ బొగ్గు ఉత్పత్తి 15%, సహజవాయువు ఉత్పత్తి 4%, విద్యుత్ ఉత్పత్తి 10% వృద్ధిని నమోదుచేశాయి. ♦ క్రూడ్, ఎరువులు, సిమెంట్ రంగాల్లో మాత్రం అసలు వృద్ధిలేకపోగా క్షీణత నమోదయ్యింది. ♦ రిఫైనరీ ప్రోడక్టులు (2.5 శాతం నుంచి 2.4 శాతానికి), స్టీల్ రంగాల్లో (16.7 శాతం నుంచి 3 శాతానికి) వృద్ధి రేట్లు వార్షికంగా తగ్గాయి. ఐదు నెలల్లో...: 5 నెలల్లో (ఏప్రిల్–ఆగస్టు) ఈ గ్రూప్ వృద్ధి రేటు 5.4% నుంచి 3 శాతానికి తగ్గింది. ఐఐపీ బాగుండే అవకాశం: ఇక్రా మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో ఈ 8 పరిశ్రమల వాటా 38%. దీంతో ఆగస్టులో ఈ రంగాల పనితీరు మొత్తం ఐఐపీపై కొంత సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అభిప్రాయపడింది. ఉత్పత్తి శాతాల్లో భారీగా తేడా కనిపించడానికి బేస్ ఎఫెక్ట్ ఒక ప్రధాన కారణంకాగా, పండుగ సీజన్లో ఉత్పత్తి నిల్వలను పెంచుకోవడం మరో కారణమని ఇక్రా విశ్లేషించింది. -
పెట్రోల్, డీజిల్ ధరలు 8 శాతం జంప్
సాక్షి, న్యూఢిల్లీ : రోజువారీ ధరల సమీక్ష ప్రారంభించినప్పటి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ ఇంధన ధరల ప్రభావంతో, దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పైకి ఎగుస్తున్నాయని, త్వరలోనే తగ్గుతాయంటూ ప్రకటనల మీద ప్రకటనలు ఇచ్చేస్తోంది. జూన్ మధ్య కాలం నుంచి అంటే రోజువారీ ధరల సమీక్ష ప్రారంభించినప్పటి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు 8 శాతం పైకి జంప్ చేసినట్టు రేటింగ్ ఏజెన్సీ ఐక్రా పేర్కొంది. ఈ ధరలు ఇలా భారీగా పెరగడం, డిమాండ్ వృద్ధిపై ప్రభావం చూపుతుందని, అంతేకాక ద్రవ్యోల్బణ ఒత్తిడికి దారితీస్తుందని ఐక్రా ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అంతర్జాతీయంగా డీజిల్, పెట్రోల్ ధరలు 14 శాతం పెరగడం వల్ల, దేశీయంగా ఇంధన రేట్లు పెరుగుతున్నాయని, అంతేకాక పెట్రోల్ పంపు డీలర్లకు ఇచ్చే కమిషన్ పెంచడం కూడా వీటిపై ప్రభావం చూపుతున్నాయని ఈ రేటింగ్ ఏజెన్సీ రిపోర్టు తెలిపింది. డీలర్లకు ఇచ్చే కమిషన్ 40 శాతం ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే. అంతకముందు రూ.2.55గా ఉన్న కమిషన్‌ను రూ.3.57కు పెంచింది. దీంతో వారి మార్కెటింగ్ మార్జిన్లు కూడా పెరుగుతున్నాయి. జూన్ 17 నుంచి ఢిల్లీలో పెట్రోల్ ధరలు 7.9 శాతం పెరిగి లీటరుకు రూ.70.41గా నమోదయ్యాయి. కొంతమంది డీలర్లు, వినియోగదారులు ధరల మార్పులను ముందుగానే అంచనావేసి, బల్క్ మొత్తంలో కొనుగోళ్లు చేపడుతున్నారని ఐక్రాకు చెందిన అధికారి కే. రవిచంద్రన్ పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల ఆయిల్ కంపెనీలు మార్జిన్లు కోల్పోతున్నాయని చెప్పారు. అదేవిధంగా తక్కువ రాజకీయ ప్రమేయం, ఎక్కువ స్వయం ప్రతిపత్తితో ఆయిల్ సంస్థలు తమ మార్కెటింగ్ మార్జిన్లను పెంచుకుంటున్నాయని కూడా తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వ జోక్యం చేసుకుంటే, ధరల సమీక్షలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల స్వతంత్ర తగ్గి, ధరల పెరుగుదలను అరికట్టవచ్చని చెప్పారు. -
జీఎస్టీ: కార్ల ధరలు పెరుగుతాయా? తగ్గుతాయా?
న్యూఢిల్లీ: జీఎస్టీ పన్నుల రేటుపై ఆటోమొబైల్ పరిశ్రమ పెద్దలు హర్షం వ్యక్తం చేశారు. జీఎస్టీ తాజా పన్ను రేటు 28శాతంగా నిర్ణయించడం పరిశ్రమకు లబ్ది చేకూర్చనుందని ఆటో మొబైల్ పరిశ్రమ పెద్దలు వ్యాఖ్యానించారు. ఆటోమొబైల్ పరిశ్రమకు సంబంధించి జీఎస్టీ రేట్లు ఊహించిన రీతిలో ఉన్నాయని సోసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) పేర్కొంది. జీఎస్టీ 28శాతం గా నిర్ణయించినప్పటికీ కమర్షియల్ వెహికల్స్ , టూవీలర్ ధరలు దాదాపుగా తటస్థంగా ఉండవచ్చని పేర్కొన్నారు అయితే పెద్ద సెడాన్లు, ఎస్యూవీ లాంటి లగ్జరీ వాహనాల రేట్లు దిగిరానున్నాయని ఇక్రా పేర్కొంది. జీఎస్టీ తరువాత చిన్నకార్ల ధరలు స్వల్పంగా పెరిగొచ్చని ఇక్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సుబ్రతా రాయ్ చెప్పారు. ప్యాసింజర్ వాహనాలపై 28 శాతం జిఎస్టిని ప్రకటించినప్పటికీ వైవిధ్యభరితమైన కార్లపై వేర్వేరు పన్నుల స్లాబ్లులపై ఇంకా స్పష్టత లేదని రీసెర్చ్ హెడ్ వైభవ్ అగర్వాల్ వ్యాఖ్యానించారు. . అయితే త్రీ వీలర్ ధరలు పెరగనున్నాయని చెప్పారు. చిన్నకార్ల ధరలు 2-3 శాతం పెరుగుతాయనీ, లగ్జరీ కార్ల ధరలు దిగి వచ్చే అవకాశం ఉందన్నారు. కాగా జీఎస్టీ కౌన్సిల్ 14 వ సమావేశంలో ఆటోమొబైల్స్తో సహా అన్ని వర్గాల వస్తువులపై జీఎస్టీ రేటును ఖరారు చేసింది. ముఖ్యంగా ఆటోమొబైల్ విభాగానికి ఆధార జీఎస్టీ ఆధార రేటు 28శాతంగా నిర్ణయించింది. బేస్ రేటుతో పాటుగా, పెట్రోలు మరియు డీజిల్ ఇంజిన్లతో కూడిన చిన్న కార్లపై 1శాతం, 3శాతం సెస్‌ను ప్రతిపాదించింది. ప్రస్తుతం ఉన్న మొత్తం పరోక్ష పన్ను రేట్లకు దాదాపు అనుగుణంగానే ఉంది. -
టూ వీలర్స్ అమ్మకాలపై ఇక్రా అంచనాలు
టూవీలర్ అమ్మకాలపై పెద్దనోట్ల రద్దు ప్రభావం బాగానే ఉందని తాజా నివేదికలు వెల్లడించాయి. అక్టోబర్ నెల వరకూ రెండంకెల స్థాయిలో పరుగుపెట్టిన టూవీలర్స్ రంగం పెద్ద నోట్ల రద్దుతో కాస్త నెమ్మదించిందని రేటింగ్ సంస్థ ఇక్రా వెల్లడించింది. అయితే ఈ ఏడాది ద్విచక్ర వాహన అమ్మకాలు 7-8 శాతం వృద్ధి కనబరచనున్నట్లు నివేదించింది. వెరసి వాహన అమ్మకాలు ఏడాది మొత్తంగా 7-8 శాతం ప్రగతిని సాధించగలవని నివేదిక అభిప్రాయపడింది. డీమానిటైజేషన్ కారణంగా ద్రవ్య సంక్షోభం కారణంగా అమ్మకాలు నవంబర్ ,జనవరి మధ్య 11.3 శాతం పడిపోయాయని తెలిపింది. ముఖ్యంగా ఏప్రిల్ నుంచి అమల్లోకి రానున్న బీఎస్-4 ప్రమాణాల మార్పిడి వంటి అంశాల కారణంగా నవంబర్ నుంచీ జనవరి వరకూ వాహన విక్రయాలు 11 శాతం చొప్పున మందగించినట్లు నివేదిక తెలియజేసింది. నోట్ బ్యాన్ సమయంలో మోపెడ్ల అమ్మకాలు డబుల్ డిజిట్ నమోదు చేశాయని, స్కూటర్ల అమ్మకాల వృద్ది 12.5 శాతంగా ఉన్నట్టు, సెప్టెంబర్ మాసం నాటి 24.7 శాతంతో పోలిస్తే చాలా తక్కువ అని అభిప్రాయపడింది. మొత్తంమీద, పరిశ్రమ వృద్ధి రేటు గత నాలుగు ఆర్థిక సంవత్సరాలలతో మెరుగ్గానే ఉండనున్నట్టు అంచనా వేసింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 10 నెలల(ఏప్రిల్-జనవరి)లో ద్విచక్ర వాహన అమ్మకాలు 8 శాతంపైగా వృద్ధి సాధించాయి. గత నాలుగేళ్ల అమ్మకాలతో పోలిస్తే ఇవి మెరుగైన ఫలితాలేనని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఫిబ్రవరి, మార్చిలలోనూ 7 శాతం స్థాయిలో అమ్మకాలు నమోదుకాగలవని, 2018 లో మంచి అమ్మకాలు నమోదు కానున్నాయని ఇక్రా అంచనా వేస్తోంది. ప్రధానంగా ఆఫ్రికా, దక్షిణ ఆసియా, లాటిన్ అమెరికాలో విదేశీ మార్కెట్లలో మంచి డిమాండ్ ఉందని తెలిపింది. తదుపరి రెండవ ఆర్థభాగంలో ప్రధానమైన మార్కెట్లు కోలుకుంటున్న సంకేతాల నేపథ్యంలో ఎగుమతులు క్రమంగా వచ్చే మూడేళ్లలో 8-10 శాతం వృద్ధి ఉండనుందని నివేదించింది. 2018లో తిరిగి 8-10 శాతం స్థాయిలో వృద్ధి నమోదుకావచ్చని ఐసిఆర్ఎ తన నివేదికలో పేర్కొంది. 2018లో స్కూటర్ల అమ్మకాలు మోటార్ సైకిళ్లను మించిపోగలవని ఇక్రా అభిప్రాయపడింది. -
జనవరి, ఫిబ్రవరిల్లో ‘టోకు’ ద్రవ్యోల్బణం పెరుగుతుంది
ఇక్రా అంచనా... న్యూఢిల్లీ: వృద్ధిని పెంచే సంస్కరణలు కావాలని ఫిక్కి ప్రెసిడెంట్ పంకజ్ పటేల్ కోరారు. వినియోగం జోరు పెంచే వృద్ధి ఆధారిత సంస్కరణలు, ఉద్యోగ కల్పన పెంచే పెట్టుబడులు అవసరమని పేర్కొన్నారు. మరోవైపు డిసెంబర్లో టోకు ధరల ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) 3.39 శాతానికి పెరగడంతో జనవరి, ఫిబ్రవరిల్లో కూడా టోకు ధరల ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలే ఉన్నాయని ప్రముఖ రేటింగ్ సంస్థ, ఇక్రా అంచనా వేస్తోంది. 2015, డిసెంబర్లో మైనస్ 1.06 శాతంగా ఉన్న టోకు ధరల ద్రవ్యోల్బణం గత ఏడాది నవంబర్‌లో 3.15 శాతంగా నమోదైంది. పారిశ్రామికోత్పత్తి మెరుగుపడిందని తాజా గణాంకాలు వెల్లడించాయని, బేస్ ఎఫెక్ట్ దీనికి కారణమని ఫిక్కి ప్రెసిడెంట్ పంకజ్ పటేల్ చెప్పారు. నిలకడైన వృద్ధి సాధించాలంటే సంస్కరణలపై దృష్టి పెట్టాలని సూచించారు. ముడి చమురు ధరలు పెరుగుతుండడం, డాలర్ బలపడుతుండడం వల్ల్ల గత నెలలో ఉత్పత్తి వ్యయాలు పెరిగాయని ఆసోచామ్ సెక్రటరీ జనరల్ డి.ఎస్. రావత్ చెప్పారు. ఇప్పటికే డిమాండ్ తగ్గి కుదేలై ఉన్న కంపెనీల లాభదాయకతపై ఉత్పత్తి వ్యయాలు పెరగడం ప్రతికూల ప్రభావం చూపుతోందని వివరించారు. ఆహార ద్రవ్యోల్బణం ఈ క్వార్టర్లో, టోకు ధరల ద్రవ్యోల్బణం జనవరి, ఫిబ్రవరిల్లో పెరిగే అవకాశాలున్నాయని ఇక్రా ప్రధాన ఆర్థిక వేత్త అదితి నాయర్ చెప్పారు. -
జీడీపీ అంచనాల్లో చాలా తప్పులున్నాయ్!
న్యూఢిల్లీ : భారత ప్రస్తుత ఆర్థికసంవత్సర వృద్ధి రేటు పడిపోతుందంటూ కేంద్ర గణాంకాల సంస్థ వెల్లడించిన అంచనాల్లో చాలా లోపాలున్నాయట. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఏర్పడిన పరిణామాలను డేటాలో ప్రభుత్వం కలుపకపోవడంతో ప్రధాన లోపంగా దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఐక్రా ఎత్తిచూపింది. 2016-17లో దేశ వృద్ధి రేటు 6.8 శాతానికి పడిపోతుందని ఈ ఏజెన్సీ శుక్రవారం అంచనావేసింది. 2016 నవంబర్ నెల మధ్య నుంచి పెద్ద నోట్ల రద్దు ప్రభావం ప్రారంభమైంది. కానీ వీటిని పరిగణనలోకి తీసుకోకుండా అక్టోబర్ వరకున్న డేటాతోనే ప్రభుత్వం వృద్ధి అంచనాలు ప్రవేశపెట్టింది. ముందటి సంవత్సరాలకంటే ప్రస్తుత అంచనాల్లో చాలా తప్పులున్నాయని, నగదుతో ముడిపడి ఉన్న కన్స్ట్రక్షన్ సెక్టార్ లాంటి వాటిలో తప్పులు దొర్లిన్నట్టు ఐక్రా ఓ ప్రకటనలో తెలిపింది. 2017లో వృద్ధిపై సీఎస్ఓ ప్రకటించిన ముందస్తు అంచనాల్లో ఎలాంటి ఆశ్చర్యకరమైన విషయం లేదని, వారు ఎక్కువగా అందుబాటులో ఉన్న ప్రథమార్థ డేటానే పరిగణలోకి తీసుకున్నట్టు ఐక్రా చెప్పింది. కానీ తయారీరంగం, వ్యవసాయం, విద్యుత్, నిర్మాణ వంటి సబ్-సెక్టార్లలో ప్రభుత్వం విడుదల చేసిన ముందస్తు అంచనాల కంటే ఇంకా ఎక్కువగానే వృద్ధి రేటు పడిపోతుందని ఐక్రా వివరించింది. ప్రస్తుత సంవత్సరానికి సంబంధించిన కార్పొరేట్ కంపెనీల మూడో క్వార్టర్ ఫలితాలు ఇంకా విడుదల కాకపోవడం, రబీ ఉత్పత్తిపై ముందస్తు అంచనాలు కూడా గణాంకాల కచ్చితత్వంపై ప్రశ్నార్థకంగా మారినట్టు ఐక్రా తన ప్రకటనలో తెలిపింది. -
ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది
• పెద్ద నోట్ల రద్దు తదనంతర పరిణామంపై ఇక్రా అభిప్రాయం • 2016–17లో జీవీఏ వృద్ధి అంచనాలు 6.6 శాతానికి తగ్గింపు ముంబై: కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో ఆర్థిక రంగ కార్యకలాపాలు తిరిగి గాడిన పడడానికి చాలా సమయం తీసుకుంటుందని రేటింగ్ సంస్థ ఇక్రా పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016–17)లో దేశ స్థూల విలువ ఆధారిత (జీవీఏ) వృద్ధి రేటు అంచనాలను 6.6 శాతానికి తగ్గించింది. ‘‘నోట్ల లభ్యత వచ్చే జనవరి చివరి నాటికి గణనీయంగా మెరుగుపడినా, ఆర్థిక కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఈ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని జీవీఏ అంచనాలను 2016–17 సంవత్సరానికి 6.6 శాతానికి తగ్గిస్తున్నాం’’ అని ఇక్రా తన నివేదికలో తెలిపింది. నాలుగో త్రైమాసికంలో ఆర్థికరంగ కార్యకలాపాల పునరుద్ధరణ తీరు నగదు సరఫరా పరిస్థితులు, డిజిటల్ లావాదేవీలకు ఓ సంకేతంగా భావించవచ్చని పేర్కొంది. నవంబర్ 10 నుంచి డిసెంబర్ 19 వరకు కొత్త నోట్లు రూ.5.9 లక్షల కోట్ల విలువ మేర వ్యవస్థలోకి సరఫరా చేసినట్టు ఆర్బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. బ్యాంకుల్లో జమ అయిన పెద్ద నోట్ల విలువలో ఇది 38 శాతం. నివేదికలోని అంశాలు..: ⇔ కొన్ని రంగాల్లో ఆదాయం నష్టపోవడం, వినియోగాన్ని వాయిదా వేయడం, 2016–17 ద్వితీయార్ధంలో సామర్థ్య వినియోగంపై ప్రభావం చూపుతుంది. ప్రైవేటు రంగంలో సామర్థ్య విస్తరణ ప్రణాళికలు కూడా ఆలస్యం అవుతాయి. ⇔ ప్రస్తుత తీరులోనే వివిధ విలువ గల కొత్త నోట్లను విడుదల చేస్తూ వెళితే 2017 జనవరి చివరి నాటికి ద్రవ్య లభ్యత మెరుగుపడుతుంది. ⇔ నోట్ల రద్దు, డిజిటల్ లావాదేవీలపై దృష్టి వల్ల మధ్య కాలానికి అవ్యవస్థీకృత రంగం పోటీ తత్వం తగ్గుతుంది. ⇔ జీఎస్టీ రాజ్యాంగ సవరణ బిల్లులోని నిబంధనల ప్రకారం 2017 సెప్టెంబర్ 16లోపు అమలు చేయాల్సి ఉంది. జీఎస్టీకి మళ్లాక వివిధ విభాగాల ఉత్పత్తులపై తుది పన్ను రేట్లు అనేవి ధరల కదలికలపై ప్రభావం చూపుతాయి. ఈ మార్పు సమయంలో కొనుగోళ్ల వాయిదా లేదా ముందుగానే కొనుగోళ్లు జరపడం చోటుచేసుకోవచ్చు. -
ఎ కేటగిరి ఆర్థికశక్తిగా తెలంగాణ
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రాన్ని ఎ కేటగిరి ఆర్థిక శక్తిగా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఆఫ్ ఇండియా(ఇక్రా) సంస్థ గుర్తించింది. ఇక్రా గుర్తింపుతో తెలంగాణ పరపతి విధానానికి గుర్తింపు వస్తుందని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దేశ తలసరి ఆదాయం కంటే రాష్ట్ర తలసరి ఆదాయం రూ.20 వేలకు పైగా ఎక్కువగా ఉండటం గమనార్హాం. దేశ తలసరి ఆదాయం 74, 380 రూపాయలుండగా, తెలంగాణ తలసరి 95,361 రూపాయలుగా ఉంది. పారిశ్రామిక రంగాలు పెట్టుబడులు పెట్టేందుకు ఇక్రా రేటింగ్‌ను పరిగణనలోకి తీసుకుంటాయని ప్రభుత్వ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
క్యూ2 వృద్ధి 5.3%: మూడీస్
న్యూఢిల్లీ: భారత ఆర్థికాభివృద్ధి రేటు ఈ ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో(2014-15, జూలై-సెప్టెంబర్) 5.3 శాతమని రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అంచనా వేస్తోంది. గత రెండేళ్లలో 5% దిగువకు పడిపోయిన వృద్ధి రేటు 2014-15 తొలి త్రైమాసికంలో 5.7 శాతంగా నమోదయ్యింది. శుక్రవారం ఈ గణాంకాలను కేంద్రం విడుదల చేస్తున్న నేపథ్యంలో మూడీస్ తాజా అంచనాలను వెలువరించింది. 2013-14 రెండవ త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 4.8 శాతం. తాజా సంస్కరణల అమలు తగిన వృద్ధి రూపంలో ప్రతిబింబించడానికి మరికొంత సమయం పడుతుందని కూడా మూడీస్ పేర్కొంది. -
పాసింజర్ వాహన అమ్మకాల్లో స్వల్ప వృద్ధే
ముంబై: దేశీయంగా ప్రయాణికుల వాహనాల అమ్మకాలు వచ్చే ఆర్థిక సంవత్సరంలో స్వల్పంగానే పెరుగుతాయని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేస్తోంది. చిన్న కార్లు, యుటిలిటీ వాహనాల సెగ్మెంట్లో డిమాండ్ బలహీనంగా ఉంటుందని పేర్కొంది. ఫలితంగా దేశీయ ప్రయాణికుల వాహనాల అమ్మకాలు 2-3 శాతం వృద్ధినే సాధిస్తాయని వివరించింది. ఈ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం..., ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ అమ్మకాలు 6-7 శాతం వరకూ క్షీణించవచ్చని అంచనాలున్నాయి. మొత్తం వాహన అమ్మకాల్లో చిన్న కార్ల అమ్మకాల వాటా 55-60 శాతం వరకూ ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 11 నెలల్లో 23 లక్షల ప్రయాణికుల వాహనాలు మాత్రమే అమ్ముడయ్యాయి. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే కాలం అమ్మకాలతో పోల్చితే 6 శాతం క్షీణత నమోదైంది. అయితే ఈ కేటగిరీ వాహన అమ్మకాలు 2012-13 ఆర్థిక సంవత్సరంలో 5 శాతం, 2011-12 ఆర్థిక సంవత్సరంలో 2.2 శాతం చొప్పున వృద్ధి సాధించాయి. అధిక ద్రవ్యోల్బణం, వడ్డీరేట్లు అధిక స్థాయిల్లో ఉండడం, ఇంధనం ధరలు పెరుగుతుండడం వంటి కారణాల వల్ల గత మూడేళ్లలో ప్రయాణికుల వాహనాలకు డిమాండ్ తగ్గుతూ వస్తోంది. వాహనాలపై ఎక్సైజ్ సుంకం తగ్గింపు కారణంగా రానున్న నెలల్లో డిమాండ్ స్వల్పంగా పుంజుకోవచ్చు. సుంకం తగ్గింపు జూన్ 30 వరకూ అమల్లో ఉంటుంది. కాబట్టి అమ్మకాలు కొంచెం పుంజుకోవచ్చు. -
ఐసీఆర్ఏ 20% లాభం.. ఎన్ టీపీసీ 11% నష్టం
భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఆరంభంలో నమోదు చేసుకున్న నష్టాల నుంచి తేరుకుని చివరకు లాభాలతో ముగిసాయి. క్రితం ముగింపుతో పోల్చుకుంటే ప్రధాన సూచీ సెన్సెక్స్ 110 లాభంతో 20811 పాయింట్ల వద్ద, నిఫ్టీ 30 పాయింట్ల వృద్ధితో 6186 పాయింట్ల వద్ద ముగిసాయి. అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీ సానుకూల వ్యాఖ్యలు చేయడంతో ఐసీఆర్ఏ కంపెనీ షేరు 20 ఎగబాకడం నేటి మార్కెట్ లో విశేషం. టారిఫ్ రెగ్యులేషన్ కు సంబంధించిన వార్తను సెంట్రల్ ఎలక్ట్రిసిటి రెగ్యులేటరి కమిషన్ విడుదల చేయడంతో ఎన్ టీపీసీ 11 శాతం నష్టపోయింది. సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో టాటా పవర్ అత్యధికంగా 5.14 శాతం, బెల్ 4 శాతం, యాక్సీస్ బ్యాంక్ 3.76, లార్సెన్ 2.80, రాన్ బాక్సీ 2.77 శాతం లాభపడ్డాయి. ఎన్ టీపీసీ అత్యధికంగా 12 శాతం, భారతీ ఎయిర్ టెల్, టాటా స్టీల్, ఎన్ ఎమ్ డీసీ, టీసీఎస్ కంపెనీల షేర్లు స్వల్ప నష్టాల్ని నమోదు చేసుకున్నాయి.