ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా విమాన ప్రయాణీకుల రద్దీ 40.7-41.8 కోట్లకు చేరుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. అదే సమయంలో విమాన సంస్థల ఆదాయాలు 15-17 శాతం పెరుగుతాయని చెప్పింది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) అధీనంలోని విమానాశ్రయాలతో పాటు దిల్లీ, హైదరాబాద్, కోచి అంతర్జాతీయ విమానాశ్రయాలను నమూనాగా తీసుకుని ఇక్రా ఈ నివేదిక విడుదల చేసింది.
ఇక్రా నివేదిక ప్రకారం..కరోనా కంటే ముందు నమోదైన విమాన ప్రయాణాలతో పోలిస్తే 10 శాతం అధికంగా ఫ్లైట్‌జర్నీ చేస్తున్నారు. మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 37.6 కోట్ల మంది విమానాల్లో ప్రయాణించారు. విమానాల రద్దీ ఏటా 8-11 శాతం పెరుగుతోంది. 2023 క్యాలెండర్ ఏడాదిలో అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీలో భారత్ వాటా 4.2 శాతంగా ఉంది. 2019లోని 3.8 శాతంతో పోలిస్తే అధికం. 2023లో గ్లోబల్గా ప్రయాణికుల రద్దీ 96 శాతం పుంజుకుంది. అదే భారత్‌లో మాత్రం 106 శాతం రికవరీ అయింది. దేశీయంగా కొత్త మార్గాలు, విమానాశ్రయాల సంఖ్య పెరగడంతో ఇది సాధ్యపడినట్లు ఇక్రా తెలిపింది.
ఇదీ చదవండి: పెరగనున్న వస్తు ఎగుమతులు.. ఎంతంటే..
ఇక్రా కార్పొరేట్ రేటింగ్స్ వైస్ ప్రెసిడెంట్ వినయ్ కుమార్ మాట్లాడుతూ..‘విరామం కోసం, వృత్తి వ్యాపార అవసరాల రీత్యా ప్రయాణాలు అధికంగా చేస్తున్నారు. కొత్త గమ్యస్థానాలకు విమాన సర్వీసులు ప్రారంభం కావడమూ కలిసొస్తోంది’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment