హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ ఔషధ రంగంలో ఉన్న ప్రముఖ సంస్థల ఆదాయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6–8 శాతం మేర పెరిగే అవకాశం ఉందని రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. నివేదిక ప్రకారం, 2021–22లో ఈ కంపెనీలు 8–10 శాతం వృద్ధి చెందాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయాలు ఓ మోస్తరుగా ఉంటాయి.
దేశీయంగా 7–9 శాతం, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 12–14 శాతం, యూరప్ వ్యాపారం 7–9 శాతం వృద్ధి నమోదు కానుందని ఇక్రా పేర్కొంది. ధరల ఒత్తిడి కారణంగా అమెరికా మార్కెట్ వృద్ధి నిలకడగా ఉంటుంది. కంపెనీలు క్లిష్ట జనరిక్స్, ఫస్ట్ టు ఫైల్ అవకాశాలు, ప్రత్యేక ఉత్పత్తులపై దృష్టి సారిస్తుండటంతో పరిశోధన, అభివృద్ధి వ్యయాలు ఆదాయాల్లో 6.5–7.5 శాతం ప్రస్తుత స్థాయిలలో స్థిరీకరించబడతాయి.
ఇటువంటి ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) విభాగంలో స్థిర పెట్టుబడులు రానున్నాయి. ఇది మధ్య కాలంలో వృద్ధికి, లాభాల మెరుగుదలకు తోడ్పడతాయి.21 కంపెనీల పనితీరును ఆధారంగా చేసుకుని ఇక్రా ఈ విషయాలను వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment