ఐసీఆర్ఏ 20% లాభం.. ఎన్ టీపీసీ 11% నష్టం
ఐసీఆర్ఏ 20% లాభం.. ఎన్ టీపీసీ 11% నష్టం
Published Mon, Feb 24 2014 4:38 PM | Last Updated on Sat, Sep 2 2017 4:03 AM
భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఆరంభంలో నమోదు చేసుకున్న నష్టాల నుంచి తేరుకుని చివరకు లాభాలతో ముగిసాయి. క్రితం ముగింపుతో పోల్చుకుంటే ప్రధాన సూచీ సెన్సెక్స్ 110 లాభంతో 20811 పాయింట్ల వద్ద, నిఫ్టీ 30 పాయింట్ల వృద్ధితో 6186 పాయింట్ల వద్ద ముగిసాయి.
అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీ సానుకూల వ్యాఖ్యలు చేయడంతో ఐసీఆర్ఏ కంపెనీ షేరు 20 ఎగబాకడం నేటి మార్కెట్ లో విశేషం. టారిఫ్ రెగ్యులేషన్ కు సంబంధించిన వార్తను సెంట్రల్ ఎలక్ట్రిసిటి రెగ్యులేటరి కమిషన్ విడుదల చేయడంతో ఎన్ టీపీసీ 11 శాతం నష్టపోయింది.
సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో టాటా పవర్ అత్యధికంగా 5.14 శాతం, బెల్ 4 శాతం, యాక్సీస్ బ్యాంక్ 3.76, లార్సెన్ 2.80, రాన్ బాక్సీ 2.77 శాతం లాభపడ్డాయి.
ఎన్ టీపీసీ అత్యధికంగా 12 శాతం, భారతీ ఎయిర్ టెల్, టాటా స్టీల్, ఎన్ ఎమ్ డీసీ, టీసీఎస్ కంపెనీల షేర్లు స్వల్ప నష్టాల్ని నమోదు చేసుకున్నాయి.
Advertisement
Advertisement