
న్యూఢిల్లీ: ఎనిమిది పారిశ్రామిక రంగాల కీలక గ్రూప్– ఆగస్టులో ఆశావహ పనితీరును ప్రదర్శించింది. 4.9 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఐదు నెలల్లో ఇంత స్థాయి వృద్ధి రేటు ఇదే తొలిసారి. గత ఏడాది ఆగస్టు నెలలో వృద్ధి రేటు 3.1 శాతం. జూలై (2017) లో 2.6 శాతం. వార్షిక ప్రాతిపదికన ఎనిమిది రంగాలనూ వేర్వేరుగా..
♦ బొగ్గు ఉత్పత్తి 15%, సహజవాయువు ఉత్పత్తి 4%, విద్యుత్ ఉత్పత్తి 10% వృద్ధిని నమోదుచేశాయి.
♦ క్రూడ్, ఎరువులు, సిమెంట్ రంగాల్లో మాత్రం అసలు వృద్ధిలేకపోగా క్షీణత నమోదయ్యింది.
♦ రిఫైనరీ ప్రోడక్టులు (2.5 శాతం నుంచి 2.4 శాతానికి), స్టీల్ రంగాల్లో (16.7 శాతం నుంచి 3 శాతానికి) వృద్ధి రేట్లు వార్షికంగా తగ్గాయి.
ఐదు నెలల్లో...: 5 నెలల్లో (ఏప్రిల్–ఆగస్టు) ఈ గ్రూప్ వృద్ధి రేటు 5.4% నుంచి 3 శాతానికి తగ్గింది.
ఐఐపీ బాగుండే అవకాశం: ఇక్రా
మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో ఈ 8 పరిశ్రమల వాటా 38%. దీంతో ఆగస్టులో ఈ రంగాల పనితీరు మొత్తం ఐఐపీపై కొంత సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అభిప్రాయపడింది. ఉత్పత్తి శాతాల్లో భారీగా తేడా కనిపించడానికి బేస్ ఎఫెక్ట్ ఒక ప్రధాన కారణంకాగా, పండుగ సీజన్‌లో ఉత్పత్తి నిల్వలను పెంచుకోవడం మరో కారణమని ఇక్రా విశ్లేషించింది.
Comments
Please login to add a commentAdd a comment