విలువ పరంగా దేశీయ బంగారు ఆభరణాల వినియోగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024–25) కూడా పటిష్టంగా ఉంటుందని రేటింగ్ ఏజెన్సీ- ఇక్రా పేర్కొంది. విలువ రూపంలో వినియోగం 14 శాతం నుంచి 18 శాతం వృద్ధి చెందుతుందని ఇక్రా నివేదిక తెలిపింది. 2023–24లో ఈ వృద్ధి రేటు 18 శాతంగా నివేదిక తెలిపింది.
ఇక్రా నివేదిక ప్రకారం, బంగారం ధరలు అస్థిరంగా ఉన్నప్పటికీ వినియోగదారుల డిమాండ్ తగ్గలేదు. పండుగ నేపథ్యంలో.. ఇటీవలి నెలల్లో మరింత పెరిగిందని తెలిసింది. 2024 జూలైలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో 9% మేర (15 నుంచి 6 శాతానికి) దిగుమతుల సుంకం తగ్గడం, బంగారం ధరల్లో తాత్కాలిక ధరల కట్టడికి దారితీసిందని ఇది రెండవ త్రైమాసికంలో భారీ కొనుగోళ్లకు దారితీసిందని నివేదిక వివరించింది. ప్రత్యేకించి ఆభరణాలతోపాటు, నాణేలు, కడ్డీల కొనుగోళ్లూ పెరిగా యని వివరించింది. పండుగల సీజన్ కూడా పసిడి డిమాండ్‌కు కలిసి వచ్చిన అంశంగా పేర్కొంది.
పెరుగుతున్న దిగుమతులు..
భారత్ బంగారం దిగుమతులు సైతం భారీగా పెరుగుతుండడం గమనార్హం. భారత్ బంగారం దిగుమతులలో 40 శాతంతో స్విట్జర్లాండ్ అతిపెద్ద వాటా కలిగిఉంది. యూఏఈ వాటా 16% కాగా, దక్షిణాఫ్రికా వాటా 10%గా ఉంది. దేశంలోకి వచ్చీ – పోయే విదేశీ నిధులకు సంబంధించిన కరెంట్ అకౌంట్‌పై పసిడి కొనుగోళ్ల (దిగుమతుల) ప్రభావం కనబడుతోంది.
2023–24లో భారత్ పసిడి దిగుమతుల విలువ 30% పెరిగి 45.54 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. యునైటెట్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ) నుంచి ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత 2024 - 25 ఆర్థిక సంవత్సరంలో భారత్ తయారీదారులు, వ్యాపారులు రాయితీ రేటుతో 160 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకోవడనికి ప్రభుత్వం నోటిఫై చేసింది. భారతదేశం - యూఏఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)లో భాగంగా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. గత ఏడాది 140 టన్నులు ఈ తరహాలో నోటిఫై అయ్యింది.
ఎకానమీకి సవాలు: జీటీఆర్ఐ
దేశంలోకి భారీగా పసిడి దిగుమతులు వాణిజ్య సమతౌల్యకు, కరెంట్ అకౌంట్ లోటుకట్టు తప్పడానికి.. తద్వారా ఎకానమీ పురోగతిని దెబ్బతీయడానికి దారితీసే అంశమని ఆర్థిక విశ్లేషణా సంస్థ–జీటీఆర్‌ఏ ఒక నివేదికలో పేర్కొంది. పసిడి దిగుమతుల విలువ పెరగడం ఆందోళనకరమైన విషయమని జీటీఆర్‌ఐ ఫౌండర్ అజయ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. తాజాగా వెలువడిన గణాంకాల ప్రకారం నవంబర్‌లో పసిడి దిగుమతుల విలువ ఆల్‌టైమ్ హై 14.8 బిలియన్ డాలర్లుగా నమోదైంది. 2023 నవంబర్‌లో ఈ విలువ 3.5 బిలియన్ డాలర్లు.
Comments
Please login to add a commentAdd a comment