భారతీయ మహిళలకు బంగారానికి అవినాభావ సంబంధం ఉంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులోనూ శ్రావణమాసం వచ్చిందంటే చాలు బంగారం కొనేందుకు మరింత ఆసక్తి చూపిస్తుంటారు. అధిక మాసం ముగిసి నిజ శ్రావణ మాసంలోకి అడుగు పెట్టడంతో పెళ్లిళ్లు, గృహప్రవేశాలు..ఇలా ఒకటేమిటి వరుసగా శుభకార్యాలు జరగనున్నాయి.
ఈ క్రమంలో వ్రతాలు, పూజల నేపథ్యంలో షాపింగ్ చేసే వారి సంఖ్య పెరుగుతుంది. మరీ ముఖ్యంగా బంగారం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. మరి బంగారం వేసుకుంటే అందంతో పాటు ఆరోగ్యం కూడా పెరుగుతుందని మీకు తెలుసా? బంగారం వెనకున్న సైంటిఫిక్ రీజన్స్ ఏంటన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
తరాలు మారుతున్నా బంగారానికి ఉన్న ఆధరణ మాత్రం అస్సలు తగ్గడం లేదు. ట్రెండ్‌కి తగ్గట్లు కొత్తకొత్త డిజైన్లు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. సాదారణంగానే పెళ్లిళ్లు, ఫంక్షన్లకు బంగారం షాపుల వైపు చూసే మగువలు ఇక శ్రావణమాసం వచ్చిందంటే మరింత ఆసక్తి కనబరుస్తుంటారు. శ్రావణమాసంలో లక్ష్మీదేవి తమ ఇంట్లో కొలువై ఉంటుందని భావిస్తారు. దీంతో ఎంతో కొంత బంగారం కొనుగోలు చేయాలని అనుకుంటారు.
ఇక అప్పట్లో ఏడువారాల నగలు ఎక్కువగా ధరించేవారు. ఆ పేరులోనే నిండుదనం ఉంది. ఎంత బంగారం ఉన్నా ఏడువారాల నగలు అనగానే వచ్చే ఆ ఆనందమే వేరు. ఇంతకీ ఏడువారాల నగలలకున్న ప్రత్యేకత ఏంటంటే..
ఆదివారం- సూర్యుడు: కెంపులు పొదిగిన కమ్మలు, హారం
సోమవారం - చంద్రుడు: ముత్యాల హారాలు, గాజులు
మంగళవారం- కుజుడు: పగడాల దండలు, ఉంగరాలు
బుధవారం - బుధుడు: పచ్చల పతకాలు, గాజులు
గురువారం - బృహస్పతి: పుష్యరాగం కమ్మలు, ఉంగరాలు
శుక్రవారం - శుక్రుడు: వజ్రాల హారాలు, ముక్కుపుడక
శనివారము - శని: నీలమణి హారాలు.. ఇలా ఏడువారాల నగలను ఒక్కో రోజు ఒక్కో గ్రహం అనుగ్రహం కోసం వీటిని ధరించేవారు. దీనివల్ల ఆయువు, ఆరోగ్యాలు సిద్ధిస్తాయని నమ్మకం.
బంగారం అనేది అలంకార ప్రాయం అని మాత్రమే అనుకుంటారు..కానీ బంగారు ఆభరణాలు వేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటంటే..
►చర్మానికి వచ్చే ఎన్నో రకాల ఇన్‌ఫెక్షన్స్‌ను దరిచేరకుండా బంగారం కాపాడుతుందట.
► బంగారు ఆభరణాలు ధరించడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. శరీరంపై ఏదైనా గాయాలు తగిలినా త్వరగా నయం అయ్యేలా చేస్తుంది.
► బాడీ టెంపరేచర్‌ను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది.
► ఒత్తిడి ఆందోళన వంటి మానసిక సమస్యలు దూరమై మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.
► ఆర్థరైటిస్‌తో బాధపడేవాళ్లు బంగారు ఆభరణాలు ధరించడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుందట
►ఆయుర్వేద శాస్త్రం ప్రకారం.. బంగారం వేసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందట
► దీర్ఘాయువును పెంచడంలో కూడా బంగారం చాలా చక్కగా పనిచేస్తుంది.
► బంగారాన్ని ఏ రూపంగా ధరించినా ఎంతో కొంత శక్తి శరీరానికి సంక్రమిస్తుంది.
► బంగారు ఆభరణాలు ధరిస్తే శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్ ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది.
►ఈమధ్య వివిధ సౌందర్య చికిత్సల్లోనూ బంగారన్ని ఉపయోగిస్తున్నారు. దీనివల్ల ముఖం కాంతివంతంగా మారడమే కాకుండా చర్మం యవ్వనంగా మారుతుంది.
Comments
Please login to add a commentAdd a comment